Wednesday 22 January 2014

సర్వదేవాతత్మకం ఓంకారం


గణపతి ఓంకారస్వరూపం. ఓంకారం ప్రణవం. 'ఓం'కారం సృష్టికి మూలం. ఈ సృష్టిలోని ప్రతి అణువు నుంచి ఉద్భవించే శబ్దం ఓంకారం. ఓం అనేదే పరమాత్మ నామం. అసలు ఓం కారమే పరబ్రహ్మం. అందుకే గీతలో శ్రీకృష్ణుడు 'ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ' అంటారు.

అకార, ఉకార, మకారలా సమూహంతో ఏర్పడిన ఏకాక్షరం ఓం. ఒక్క ఓం అన్న అక్షరంలోనే అనేకమంది దేవతల పేర్లు ఉన్నాయి.

అ కారం విరాట్, అగ్ని, విశ్వ మొదలైన భగవత్ తత్వాలకు
ఉ కారం హిరణ్యగర్భ, వాయు, తేజస్ తత్వాలకు,
మ కారం ఈశ్వర, ఆదిత్య, ప్రజ్ఞా తత్వాలకు ప్రతీక. అవేకాక, వేదంలో చెప్పబడ్డ భగవన్నామాలకు, దైవతత్వాలకు ఓంకారం మూలం. ఓంకారమే పరమార్ధం.

2 comments:

  1. చాలా బాగుంది

    ReplyDelete
  2. జైశ్రీరామ్. ధన్యవాదాలండి చాలా మంచి సమాచారం ఇచ్చారు.ప్రతి హిందువూ తప్పక తెలుసుకోవాలి.

    ReplyDelete