Wednesday, 8 November 2017

శివయోగసాధన- తీర్థయాత్ర ప్రయోజనాలు- స్వామి శివానందఓర్టెల్ యొక్క వైద్యగ్రంథంలో మీకు కొన్ని వివరణలు కనిపిస్తాయి. కొన్ని హృదయ సంబంధ వ్యాధులకు, రోగిని మెల్లిగా కొండలు ఎక్కమంటారు. కాబట్టి కైలాస యాత్ర, ఆధ్యాత్మిక ప్రయోజనాలను పక్కన పెట్టి, అనేకమైన చిన్న చిన్న హృదయ వ్యాధులను తొలగిస్తుంది. గుండె ఉత్తేజితమై బలం పొందుతుంది. మొత్త గుండె, నాడి, శ్వాసకోశ, ఆహార సంబంధిత, శరీరావరణకు సంబంధించిన వ్యవస్థలన్నీ పూర్తిగా బాగుచేయుబడతాయి మరియు శుద్ధవుతాయి. ఆవిరి స్నానం చేయాల్సిన అవసరంలేదు. నడక వలన మీరు బాగా చెమటోడ్చుతారు. శరీరం మొత్తం శుభ్రము, ఆక్సిజనీకరణమైన రక్తంతో నిండుతుంది. అంతటా నిండిన ఎత్తైన దేవదారు వృక్షముల నుంచి వచ్చే చిరుగాలి, దేవదారు నూనెతో నిండి, ఊపిరితిత్తుల్లో రోగరహితం చేస్తుంది, మరియు లోనికి తీసుకుంటే క్షయరోగము నయమవుతుంది. అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది. లావాటి వ్యక్తులకు కైలాస యాత్ర అనేది స్థూలకాయ నివారణకు గొప్ప చికిత్స. ఎన్నో రకాల ఉదర సంబంధ వ్యాధులు, ఊరిక్ యాసిడ్ సమస్యలు మరియు అనేక రకాల చర్మరోగాలు నివారణమవుతాయి. మీకు 12 సంవత్సరాల వరకు ఏ రోగం రాదు ఎందుకంటే మీరు నూతన ఋణవిద్యుత్కణాలు, నూతన అణువులు, నూతన కణాలు, నూతన త్రసరేణువులు, నూతన (పరమాణు)కేంద్రకాలతో జీవరసము మఱల బలం పొంది మీరు శక్తిని పొందుతారు. ఇది అర్థవాదం (గొప్పతనం చెప్పటం) కాదు. మీకు ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడతాయి. కైలాసయాత్ర మీకు చక్కని ఆరోగ్యాన్ని మరియు ఆధ్యాత్మిక ఆశీస్సులను తీసుకువస్తుంది. జయము! శంభునకు, కైలాసంలో తన శక్తి అయిన పార్వతితో ఉండే శివునకు జయము! తన భక్తులకు ముక్తినిచ్చే వానికి జయము. హర, సదాశివ, మహాదేవ, నటరాజ, శంకర మొదలైన నామాలు గలవాడికి జయము.
ఈ జీవితం యొక్క లక్ష్యం భగవత్ సాక్షాత్కారం, కేవలం అది మాత్రమే మనల్ని సంసారదుఃఖాల నుంచి, జననమరణ చక్రం నుంచి విముక్తిని కలిగిస్తుంది. నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, యాత్రలు మొదలనవి నిష్కామంగా చేయటం చేత పుణ్య సముపార్జన జరుగుతుంది. ఇది పాపరాశి దగ్ధమవటానికి కారణమై, మనస్శుద్ధిని ఇస్తుంది.  మనోశుద్ధి సంసారం యొక్క నిజతత్త్వాన్ని తెలుసుకొనటానికి, దాని అసత్యము మరియు విలువలేని గుణాన్ని తెలుసుకొనుటకు దారి తీస్తుంది. దీన్నుంచి వైరాగ్యం జనియించి, మోక్షకాంక్ష కలుగుతుంది. దీని నుంచి ఆ దిశగా వెళ్ళే మార్గాన్వేషణ తీవ్రమవుతుంది. దీన్నుంచి అన్ని కర్మలను త్యజించడం వస్తుంది. తద్వారా యోగాభ్యాసం అలవాటై, మనస్సు ఆత్మలో లేదా బ్రహ్మంలో లీనమవటం అలవాటుగా మారుతుంది. ఇది అవిద్యను తొలగించే 'తత్త్వమసి' మొదలైన శృతి వ్యాక్యాలు అర్ధం చేసుకోవటానికి కారణమై, తన ఆత్మలో స్థిరంగా నిలువటానికి తోడ్పడుతుంది. అందుకే మీరు గమనిస్తే, కైలాసయాత్ర అనేది భగవత్ సాక్షాత్కారానికి పరంపరమైన సాధన అవుతుంది, ఎందుకంటే అది చిత్తశుద్ధిని మరియు నిధిధ్యాసను కలిగిస్తుంది. ధ్యానం అనేది సూటియైన సాధన. ప్రాపంచిక విషయాల్లో, బరువుబాధ్యతల్లో ఇరుక్కుపోయిన గృహస్థులకు ఈ యాత్రలో గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఈ యాత్ర తర్వాత మనస్సు ఎంతో ఉపశమిస్తుంది. అంతేగాక, యాత్ర సమయంలో వారు అనేక సాధువులను, సన్యాసులను దర్శిస్తారు. చక్కని సత్సంగం దొరుకుతుంది. వారు వారి సందేహాలను తీర్చుకోవచ్చు. ఆధ్యాత్మికసాధనలో వారికి అనేక రకాలుగా సాయం అందుతుంది. ఇది యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం.


మీ స్ఫురణకు మరొక్కసారి తీసుకువస్తాను, వేదాల చివరి మాటలు, ఉపనిషత్తులు చెప్పింది- తత్త్వమసి, నా ప్రియమైన పాఠకులార. ఓం తత్ సత్, ఓం శాంతి, సకల జీవులకు శాంతి కలుగుగాక.

- స్వామి శివానంద 

No comments:

Post a Comment