Showing posts with label ధర్మసందేహం. Show all posts
Showing posts with label ధర్మసందేహం. Show all posts

Friday, 6 May 2016

భవ రోగానికి మందు - స్వామి చిన్మయానంద బోధ



భవరోగాన్ని (జన్మలపరంపరను) ఎలా నయం చేయాలి?

స్వామి చిన్మయానంద
అనేకత్వ దృష్టినే భవరోగం అంటారు. ఇది 'అహం' అనే శక్తివంతమైన క్రిమి వలన వస్తుంది. ఇది మనసు, బుద్ధుల వలన వృద్ధి చెందుతుంది. నువ్వు ఈ క్రింది మిశ్రమాన్ని తీసుకుంటే, రోగనివారణ తధ్యం.

నిష్కాపట్యం - 11 గ్రాములు
ప్రేమ - 10 ఔన్సులు
క్రమబద్ధత - 10 గ్రా
ధ్యానం - 9 ఔ
నిజాయతీ - 8 గ్రా
ధైర్యం - 9 గ్రా
లక్ష్యం - 7 గ్రా
అందరికి సేవ చేయడం - 6 గ్రా
స్వఛ్ఛత - 3 గ్రా

ఉపయోగించే ముందు సీసాను (బుద్ధి) కదిలించాలి. అటు తర్వాత మనోనియంత్రణ అనే మూత పెట్టాలి.
1. దోపిడిని ఎన్నడూ రుచి చూడకు. అవసరమైతే పుష్కలంగా ఓంకార జపాన్ని సేవించు.
2. అధికంగా భౌతిక, ఇంద్రియ విషయాల్లో తిరగకు.
3. ధ్యానంలో విశ్రాంతి పొందు. 

Wednesday, 4 May 2016

ఈశ్వరుడు - సృష్టి- స్వామి చిన్మయానంద బోధ



ఈశ్వర్ సత్య్ హై - భగవంతుడే సత్యము. మరి ఆయన సృష్టి వాస్తవం కాకుండా ఉంటుందా?

స్వామి చిన్మయానంద బోధ - అవును. కానీ భగవంతుడు సృష్టించిన వస్తువులను మనం 'ఆయనవి'గా పిలుస్తున్నామా? లేదు. 'మనవి' అంటున్నాము. ఎప్పుడైతే 'నేను', 'నాది', 'నీవు', 'నీదు'లను ఆయన సృష్టిలోకి తీసుకువస్తామో, అప్పుడా ప్రపంచాన్ని సంసారం అంటాం. (సంసారం - నశ్వరం, అసత్యం). ఆయన్నే సత్యంగా భావించి, ఈ ప్రపంచాన్ని (నీతో పాటు) ఆయనదిగా చూస్తే అంతా సత్యమే. ఆ మాటకువస్తే, అన్నీ ఆయనవిగా, లేక ఆయనగా చూసినప్పుడు అన్నీ సత్యమే. అసత్ (మిధ్య) అంటూ ఏదైతే ఉందో, అది కేవలం విడిచిపెట్టవలసినవి మన భావాలు మాత్రమే.  

వేదాంత వ్యాక్యాలను గురువు, గ్రంధం లేదో ఎవరో చెప్పినవిగా పరిగణించినప్పుడు, జ్ఞానం అస్పష్టంగానే ఉంటుంది. అలా కాక వాటిని నీలోకి జీర్ణించుకుని, సాధన చేసినప్పుడు, అవి స్పష్టము, అర్ధవంతము అవుతాయి. భగవంతుడే సత్యమని అనుభవంలో తెలుసుకో, అప్పుడు ఆయన చేసిన సృష్టిని కూడా సత్యంగా చూడవచ్చు.        

Tuesday, 3 May 2016

సంసారం - స్వామి చిన్మయానంద బోధ



సంసారజీవితంలో ఆత్మసాక్షాత్కారం అసాధ్యం. మరి హిందూధర్మం ఆజన్మబ్రహ్మచర్యం గురించి గట్టిగా ఎందుకు చెప్పలేదు?

స్వామి చిన్మయానంద - హిందూ ధర్మంలో సంసారం అని ఉపయోగించిన పదం పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కనడాన్ని సూచించదు. సంసారం అంటే ప్రాపంచిక జీవితంతో బంధం. తాను భౌతిక దేహం అనుకోవడమే అన్ని సమస్యలకు మూలం. అటువంటి భావనతో ఆత్మసాక్షాత్కారం అసాధ్యం. బ్రహ్మచారులందరూ సంసార బంధాల నుంచి విముక్తులు కాలేదు. సత్యజ్ఞాన సముపార్జన ముఖ్యం. కేవలం బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్లనే అది సాధ్యం కాదు. సరైన (ధార్మికమైన, వేదాంతపరమైన) ఆలోచనా విధానం కూడా అవసరం.

Thursday, 13 November 2014

శివాలయ దర్శనం - ప్రదక్షిణ విధానం : వివిధ ఆశ్రమాలవారు అనుసరించవలసిన పద్ధతులు

శివాలయ దర్శనం - ప్రదక్షిణ విధానం : వివిధ ఆశ్రమాలవారు అనుసరించవలసిన పద్ధతులు

బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు ప్రవచనం


Sunday, 19 October 2014

అష్టసిద్ధులు

సందేహం - అష్టసిద్ధులు అని అంటారు కదా, వాటి గురించి వివరించండి ?

సమాధానం - సనాతనధర్మం ప్రకారం మానవజన్మ యొక్క ముఖ్య ఉద్ద్యేశం ఆత్మవిచారణ చేసి, ఆత్మానుభూతిని పొందిముక్తి పొందడం. ముక్తి పొందిన ఆత్మకు చావుపుట్టుకలు ఉండవు. ఆత్మ అనగానే అది ఏదో ఒక కొత్త శక్తి అని భావించకూడదు. నా శరీరంలో ఉండే నేను ఆత్మ. నేను ఈ శరీరాన్ని ధరించాను. శరీరం వస్త్రాన్ని ధరించినట్టుగానే, ఆత్మ శరీరాన్ని ధరించింది. వస్త్రం చినిగోతే ఎలా పడేస్తామో, అలాగే ప్రారబ్దం తిరిపోగానే ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. తిరిగి వేరే దేహాన్ని కర్మాణుసారంగా వెతుక్కుంటుంది. ఇంత చేస్తున్న ఆత్మ ఎవరో కాదు మీరే. మనల్ని మనం శరీరంతో గుర్తించుకుంటున్నాం, కానీ మనం శరీరం కాదు. మనల్ని మనం తెలుసుకోవడమే, అన్నిటికి అతీతమైన ఆత్మ స్థితిని పొందే ప్రయత్నమే ఆత్మవిచారణ. అటువంటి ఆత్మానుభూతిని పొందే సులువైన పద్దతిని పరమశివుడు యోగం (యోగా) ద్వారా అందించారు. దాన్ని పతంజలి మహర్షి తిరిగి మానవాళికి అందించారు. ఆత్మ విచారణ చేసే క్రమంలో, సాధకునికి కొన్ని శక్తులు లభిస్తాయి. వాటితో ఆత్మవిచారణకు సంబంధం లేకపోయినా, వాటి మీద అధికమోహం అసలు గమ్యాన్ని మర్చిపోయేలా చేస్తుంది. సిద్ధులు 8 కనుక వాటిని అష్టసిద్ధులు అన్నారు. అవి

1. అణిమా - ఈ సిద్ధితో యోగి తన శరీరాన్ని చీమ కంటే, అణువుకంటే చిన్నగా మార్చుకోగలడు, పూర్తిగా అదృశ్యమవగలడు.

2. మహిమా - దీన్ని పొందడం ద్వారా యోగి తన రూపాన్ని చాలా పెద్దదిగా చేయగలడు, మేఘాలను చీల్చ్కుని, సూర్యుని తాకుతున్నాడా అన్నట్టుగా కనిపిస్తాడు.

3. లఘిమా - దీని ద్వారా దేహాన్ని చాలా తేలికాగా చేస్తారు, ఎండిన ఆకు, పక్షి ఈక కంటే తేలికగా యోగి దేహం మారిపోయే శక్తిని పొందుతుంది, ఈ సిద్ధితో గాలిలో తేలగలడు, నీటిపై నడువుగలడు.

4. గరిమా - భారీకాయంతో పర్వతాన్ని తపలిస్తూ యోగి మొత్తం గాలిని పీల్చేయగలడు.

5. ప్రాప్తి - ఈ సిద్ధితో యోగి, ఏ వస్తువునైనా తనకు నచ్చిన విధంగా రూపం మార్చగలడు, దాని స్థితిని మార్చగలడు. భవిష్యత్తును దర్శించగలడు, ఫోనులు మొదలైనవి అవసరం లేకుండా ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారితోనైనా సంభాషిచగలడు, వ్యక్తిని చూసి మనసులో ఏముందో చెప్పగలడు, ఎవడు ఎలాంటివాడో, పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పగలడు, ప్రపంచంలోని అన్ని బాషలను అర్దం చేసుకుంటాడు, ఏ భాషలోనైనా మాట్లాడుతారు, జంతువులు, మృగాలు, పక్షులు, చెట్లతో కూడా మాట్లాడగలడు, వాటి భాషను అర్దం చేసుకోగలరు.

6. ప్రాకామ్య - ఏ ఇతర శరీరాల్లోకైనా ప్రవేశించగలరు, ఇదే పరకాయప్రవేశ విద్య.

7. వశిత్వం - అందరిని వశం చేసుకుంటారు. కౄర మృగాలను సైతం తన దగ్గర పెంపుడు జంతువులను చేసుకోగలరు, తన సంకల్పబలం చేత దుష్టులను కూడా అదుపు చేయగలరు, పంచభూతాలను సైతం తన అదుపులో ఉంచుకుంటారు.

8. ఈశిత్వం - యోగి దైవశక్తిని పొందుతారు, ఈశ్వరతత్వాన్ని పొందుతారు, ఈ ప్రపంచానికి అధిపతి అవుతాడు, మరణించిన వారిని కూడా బ్రతించగలరు.

ఇవి అష్టసిద్ధులు.

ఇవి పతంజలి మహర్షి తన యోగశాస్త్రంలో వివరించిన అష్టసిద్ధులు. మంత్రజపం చేత కూడా కలుగుతాయని గురువుల వచనం. కానీ ఇతరులకు అపకారం చేయడానికి వాడుకుంటే మాత్రం సిద్ధులు నశిస్తాయి.