Wednesday 4 May 2016

ఈశ్వరుడు - సృష్టి- స్వామి చిన్మయానంద బోధ



ఈశ్వర్ సత్య్ హై - భగవంతుడే సత్యము. మరి ఆయన సృష్టి వాస్తవం కాకుండా ఉంటుందా?

స్వామి చిన్మయానంద బోధ - అవును. కానీ భగవంతుడు సృష్టించిన వస్తువులను మనం 'ఆయనవి'గా పిలుస్తున్నామా? లేదు. 'మనవి' అంటున్నాము. ఎప్పుడైతే 'నేను', 'నాది', 'నీవు', 'నీదు'లను ఆయన సృష్టిలోకి తీసుకువస్తామో, అప్పుడా ప్రపంచాన్ని సంసారం అంటాం. (సంసారం - నశ్వరం, అసత్యం). ఆయన్నే సత్యంగా భావించి, ఈ ప్రపంచాన్ని (నీతో పాటు) ఆయనదిగా చూస్తే అంతా సత్యమే. ఆ మాటకువస్తే, అన్నీ ఆయనవిగా, లేక ఆయనగా చూసినప్పుడు అన్నీ సత్యమే. అసత్ (మిధ్య) అంటూ ఏదైతే ఉందో, అది కేవలం విడిచిపెట్టవలసినవి మన భావాలు మాత్రమే.  

వేదాంత వ్యాక్యాలను గురువు, గ్రంధం లేదో ఎవరో చెప్పినవిగా పరిగణించినప్పుడు, జ్ఞానం అస్పష్టంగానే ఉంటుంది. అలా కాక వాటిని నీలోకి జీర్ణించుకుని, సాధన చేసినప్పుడు, అవి స్పష్టము, అర్ధవంతము అవుతాయి. భగవంతుడే సత్యమని అనుభవంలో తెలుసుకో, అప్పుడు ఆయన చేసిన సృష్టిని కూడా సత్యంగా చూడవచ్చు.        

No comments:

Post a Comment