Sunday, 30 December 2012

మన దేవాలయాలు-5

ఓం గం గణపతయే నమః
ఆదివారం-ప్రత్యేకం 
మన దేవాలయాలు-5
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

గుడి అనగానే మనకు గుర్తుకువచ్చేది ముందుగా గోపురమే.గోపురం విశిష్టత ఏమిటి?


ఆగమ శాస్త్రానుసారం ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్లు శయనరీతిలో నిర్మిస్తారు.గర్భగుడి భగవంతుని శిరసు,ఆలయ మంటపం భగవంతుని కడుపు,ఆలయ గోపురం దేవుడి పాదాలు.దైవ దర్శనం అంటే గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి,స్వామిని చూసి గంటకొట్టి నమస్కరిస్తాం.కాని ముసలివాళ్ళూ,రోగులు,నిత్య జీవితంలోని అనేక కార్యక్రమాల వల్ల గుడికి వెళ్ళలేనివారు(వెళ్ళే అవకాశం లేనివారు),తామున్న ప్రాంతం నుంచే దూరంగా,ఎత్తుగా కనిపిస్తున్న గోపురానికి నమస్కరిస్తే ఆలయంలో ఉన్న స్వామిపాదాలకు నమస్కరినట్టేనని శాస్త్రం తెలియజేస్తోంది. 

పూర్వాకాలంలో ఈరోజు ఉన్నట్టుగా హోటల్ సౌకర్యాలు లేవు.ఇతర దేశాలు,రాజ్యాలు,ప్రదేశాల నుండి వచ్చిన బాటసారులకు దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి గోపురాలు ఎత్తుగా కట్టారు.అంతేకాదు,ఆ కాలంలో దేవాలయాల్లో నిత్యం అన్నదానం జరిగేది.వైద్య సదుపాయాలు కూడా దేవాలయంలో ఉండేవి.అందువల్ల క్రొత్తగా వచ్చిన వారు ఆకలితో ఆహారం కోసం వెత్తుక్కునే పరిస్థితి నేరుగా దేవలయాలకే వెళ్ళి,అక్కడ ప్రసాదం స్వీకరించేవారు,సేద తీరేవారు.వారికి మార్గ నిర్దేశకాలు గోపురాలే కదా.

దేవుడు సర్వోన్నతుడు(అందరికంటే ఉన్నతమైన వాడు/గొప్పవాడు).ఈ విషయాన్ని మరిచిపోయిన మనిషి తానే గొప్పవాడినని,అంతా తనవల్లే జరుగుతోందని,తాన కంటే గొప్పవారేవరూ లేరని అహంకారంతో విర్రవీగుతాడు.అది భ్రమ మాత్రమే,అందరికంటే భగవంతుడే సర్వోన్నతుడు అన్న భావం అందరిలో కలగడానికి,మనసుకి భోధపడటానికి దేవాలయ గోపురాన్ని ఎత్తుగా నిర్మిస్తారు.

గోపురం అంటే పిరమిడ్ ఆకారం(గత భాగాల్లో పిరమిడ్ ఆకారాల గొప్పతనం,వాటి అతీతమైన శక్తిని గురించి చెప్పుకున్నాం).పిరమిడ్ ఆకారాలు మాత్రమే కొన్ని వందల,వేల సంవత్సరాలు స్థిరంగా ఉంటాయి కనుక వాటిని పిరమిడ్ ఆకారంలో నిర్మిస్తారు.అంతేకాదు గోపురం ఈ బ్రహ్మాండంలో ఉన్న అనంతమైన విశ్వశక్తిని ఆకర్షిస్తుంది.కొన్ని వందల,వేల సంవత్సరాల వరకు గోపురాలు శక్తిని గ్రహించి,నిలువ ఉంచుకునే శక్తి కేంద్రాలు.అంతేకాదు మొత్తం దేవాలయానికి అది దివ్యశక్తులను నిత్య అందిస్తూ ఉంటుంది.కనీసంలో కనీసం 500 సంవత్సారాల పాటు ఒక గోపురం అనేక దివ్యశక్తులను దేవాలయానికి అందిస్తుంది.అంటే గోపురం కూడా ఒక అమోఘ శక్తి కేంద్రం.అందుకే దేవాలయానికి వెళ్ళవలసిన రీతిలో వెళ్తే కనుక,ఆలయగోపురం క్రింది నుంచి వెళ్తున్న సమయంలో మనలో తెలియని ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది.

ఒక గోపురం ఎత్తు ఆ ఆలయమూలవిరాట్టు(ఆలయ ప్రధాన దైవ విగ్రహం) ఎత్తుని బట్టి నిర్ణయిస్తారు.గాలి గోపురాలు ఉన్న ఆలయాలకు విశేషమైన కీర్తి ప్రతిష్టలు ఉంటాయని ధార్మిక గ్రంధాలు తెలియజేస్తున్నాయి.

ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడిన సమయంలో అక్కడున్న నిర్మాణాలకు,ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకూండా,పడుగు పాటును గ్రహించి,ఆ విద్యుత్ శక్తిని భూమిలోనికి పంపించేస్తాయి గోపురాలు.అంతేకాదు అవి గ్రహించిన దివ్యశక్తులను ఆలయంలో ఉన్న మూలమూర్తికి నిత్యం అందిస్తుంటాయి గోపురాలు.


చారిత్రికంగా చెప్పుకోవలసి వస్తే అలనాటి శిల్పకళ చాతుర్యానికి,వైభవానికి ప్రతీకలు మన ఆలయ గోపురాలు.కాని ఈ రోజు అనేక గోపురాలు కూలిపోతున్నాయి,శిధిలమవుతున్నాయి,పాడుతున్నాయి,పిచ్చిమొక్కలు మొలిచి వాటికి అందాన్ని కోల్పోతున్నాయి.ఏన్నో వందల సంవత్సరాల మన చారిత్రిక వారసత్వ సంపద గోపురాలు.మనం ఈ రోజు ఏదినా ఒక నిర్మాణం చేస్తే అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది?ఏన్నో సంవత్సరాల క్రితం,సిమెంట్ లేనికాలంలో రాయిమీద రాయిని పెట్టి,కొన్ని వందల సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా పదిలంగా ఉండేలా నిర్మాణం చేశారు మన పూర్వీకులు.మనమేలాగో అంత గొప్ప నిర్మాణాలు చేయలేము.కనీసం ఉన్నవాటినైన కాపాడుకుందాం.

ఎక్కడైన గోపురం కూలిందంటే అక్కడ కూలింది గోపురం మాత్రమే కాదు.మన వారసత్వ సంపద,మన పూర్వీకుల శ్రమ.ఇకనైన మన గోపురాలను,దేవాలయాలను కాపాడుకుందాం.  
   
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ఓం శాంతిః శాంతిః శాంతిః
to be continued.............
      
       

Saturday, 29 December 2012

సంకష్టహర చవితి

ఓం గం గణపతయే నమః
జనవరి 1 2013-మంగళవారం,సంకష్టహర చవితి,అంగారక చతుర్థి.

మంగళవారం సంకష్టహర చవితి వస్తే అది చాలా విశేషమైనది.దానిని అంగారక చతుర్థి అని పిలుస్తారు.గణపతి ఆరాధనకు విశేషమైన రోజు అది.

సంకష్టహర చతుర్థి:
దీన్నే సంకట చతుర్థి,సంకట చవితి అని కూడా అంటారు.నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది.

ప్రదోషకాలంలో(సూర్యాస్తమయ సమయంలో)చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి.రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు.ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.

సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ,పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది.ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.

ఈ వ్రతాన్ని 3,5,11 లేద 21 నెలలు ఆచరిస్తారు.ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి.ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని,సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు(గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి.ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు,2 వక్కలు,దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి.దానిని స్వామి ముందు ఉంచి ధూపం(అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.


ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి.వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి.ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు.పూజలో ఉన్న గణపతిని తీయకూడదు.శారీరికంగానూ,మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం.అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం,ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి."సూర్యాస్తమయం వరకు ఉడికించిన  పదార్ధంగాని,ఉప్పు తగిలిన(కలిసిన)/వేయబడిన  పదార్ధాలు తినకూడదు".పాలు,పళ్ళూ,పచ్చి కూరగాయలు తినవచ్చు.అనుకున్న సమయం(3,5,11 లేదా 21 'చవితి 'లు)పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి.చంద్రదర్శనం లేద నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప,దీప,నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయవచ్చు.నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి. ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి.

courtesy-sri saila prabha
ఓం గం గణపతయే నమః

ఓం శాంతిః శాంతిః శాంతిః

Friday, 28 December 2012

మన తెలుగు




ఒక ప్రాంతానికి,అక్కడి సంస్కృతి సంప్రదాయాలకు,ఆచార వ్యవహారాలకు,భాషకు ఎనలేని సంబంధం ఉంటుంది.కాళేశ్వరం,శ్రీ కాళహస్తి,దక్షరామ క్షేత్రాల మధ్య ఉన్న భూమిని త్రిలింగ దేశమన్నారు.ఆ పవిత్ర త్రిలింగ దేశమే మన తెలుగు నేల.మనమంతా తెలుగు వెలుగులం.మన మాతృ భాష తెలుగు.ప్రతి పదం కూడా అచ్చుతోనే ముగిస్తుంది మన తెలుగు భాషలో.అందుకే దీనిని "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" గా పిలుస్తారు.3000 ఏళ్ళ చరిత్ర ఘన చరిత్ర,ఎంతో సాహిత్యం కలిగిన మహోన్నతమైన తెలుగు నాగరికత మనది.ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి.అక్కడివరకు బాగానే ఉంది.ఎందరో తెలుగు వాళ్ళు హాజరవుతున్నారు.ఎందుకో తెలియదు కాని మనం తెలుగులో మాట్లాడడానికి సిగ్గు పడుతున్నాం.

ఒక మనిషి తల్లిగర్భంలో ఉన్న సమయంలోనే తల్లి మాట్లాడే మాటలను ఆ శిశువు వింటుంది.గమనిస్తుంది.గ్రహిస్తుంది.అంటే మనం పుట్టకముందే మంకు మన భాషకు బంధం ఏర్పడింది.అంతేకాదు,ఒక మనిషి తాను ఏదైనా ఇతర భాషలను విన్నప్పుడు,అది అతని మెదడుకు చేరి,మాతృ భాషలోకి అనువదింపబడుతుంది.ఇది చాలా వేగంగా జరిగే ప్రక్రియ.అప్పుడే అతనికి అర్ధం అవుతుంది.ఆంగ్లం విషయంలో కూడా ఇంతే.మనం విన్న ప్రతి ఆంగ్ల పదాన్ని మన మెడదు మనకు తెలియకుండానే తెలుగులోనికి అనువదించి మనకు అర్ధమయ్యేలా చేస్తుంది.అటువంటిది ఈవేళ మనం తెలుగు నేర్చుకోవడం అనవసరమని భావిస్తున్నాం.తెలుగు నేర్చుకొనకపోతే మనకు మానసిక వికాసం కలుగదు,అభివృద్ధి చెందలేము.అందుకే తెలుగు నేర్చుకోవాలి.అమ్మ భాషలో ఉన్న కమ్మదనం వేరే భాషలో ఎక్కడిది.అందుకని తెలుగులోనే మాట్లాడాలి.

మనకు విలువలు నేర్పే అనేక రచనలు తెలుగులో ఉన్నాయి.
"తల్లి దండ్రి మీద దయ లేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవ గిట్టవ
విశ్వదాభిరామ!వినురవేమ!"
అమ్మనాన్నలన మీద దయం,ప్రేమ లేనివాదు,వాళ్ళని చూసుకోని వాడైన కొడుకు పుడితే ఎంత?చస్తే ఎంత?పుట్టలోన చెదలు పుడుతుంటాయి,చస్తుంటాయి,వాడికి చెదలపురుగులకు తేడా ఏంటి?అని అర్ధం.
ఇటువంటివి మనం గొప్పగా నేర్చుకునే భాషలో కనిపించవు.మనకు మంచి,భోధించడానికి అనేక పద్యాలు,కధలను వ్రాసి పెట్టారు మహానుభావులు.మనం తెలుగును మరిస్తే విలువలను భావితరాలకు నేర్పేదేవరు?

ఒకప్పుడు మోకాలే ఆంగ్లేయులు మన దేశాన్ని ఆక్రమించాలి అంటే ఈ దేశస్థులకు సంస్కృతాన్ని దూరం చేయాలని బ్రిటిష్ చట్టసభలో ప్రకటించి,ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి,మన చరిత్రను చేరిపేసి,కట్టుకధలను భారతీయ చరిత్రగా పుస్తకాల్లో ప్రవేశపెట్టాడు.సంస్కృత భాషలోనే మన సంస్కృతి ఉంది.అంతేనా!మన గ్రంధాలు సన్స్కృతంలోనే ఉన్నాయి.వాటిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి మనం దూరమయ్యాం.అందుకే ఈ రోజు మనం విదేశీయులకు బానిసలుగా మారిపోయాం.మన దగ్గర ఉన్న విషయాలను,వారు క్రొత్తగా కనుకున్నామని చెబుతుంటే అదంతా వారి గొప్పతనమూ,మనకేం లేదంటూ వారిని కీర్తిస్తున్నాం.ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కు సంస్కృతం వచ్చని మీకు తెలుసా?ప్రపంచ మేధావులు అందరూ ఒకానొక కాలంలో సంస్కృతం నేర్చుకున్నారు.కాని మనం మాత్రం అదంతా పాతచింతకాయ పచ్చడని మన మీద మనమే విమర్శలు చేసుకుంటున్నాం.

ఇక తెలుగు విషయానికి వద్దాం.2030 నాటికి ప్రపంచంలో అంతరించిపోయే భాషల జాబితాలో తెలుగు కూడా ఉంది, జాగ్రత్త పడండని ఐక్య రాజ్య సమితి హెచ్చరించింది.తెలుగు అంతరించిపోతే తెలుగు సంస్కృతి,తెలుగు చరిత్ర, తెలుగు వాజ్ఞ్మయం,తెలుగుదనం అన్నీ అంతరించిపోతాయి.ఇక తెలుగు వారసులు తమ చరిత్ర ఏంటో, తామెక్కడి వారమో తెలియక దిక్కుమొక్కులేక, ఆవేశంతో, ఆక్రోషంతో మనలని నిందిస్తారు,ఆత్మ గౌరవాన్ని కోల్పోతారు, దిక్కులేని వారిగా మిగిలిపోతారు.ఇప్పటికైన మేల్కొందాం.తెలుగును కాపాడుకుందాం.

మీరందరూ ఆంగ్లాన్ని వదిలేయండి అని నేను చెప్పటంలేదు.అన్ని భాషలు నేర్చుకున్న మన భాషను మన కాపాడుకోవాలి.తెలుగులోనే మాట్లాడుదాం.మన భాషను,సంస్కృతిని కాపాడుకుందాం.

జై తెలుగు!జై జై తెలుగు!                                         


Thursday, 27 December 2012

దత్తజయంతి


ఓం శ్రీ దత్తశరణం మమ

ఒకసారి నారదుడు సరస్వతి,లక్ష్మీ,పార్వతులు కలిసి ఉండగావచ్చి మీకంటే గొప్ప పతివ్రత ఉంది ఈ లోకంలో, ఆమె అత్రి మహర్షి భార్య అనసూయ దేవి అన్నాడు. వారు ఆమె పాతివ్రత్యాన్ని లోకానికి తెలియపరచాలనుకున్నారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శివుడు ఆమెను పరిక్షించడానికి, ఆమె పతిభక్తిని లోకాలకు తెలియజేయడానికి సన్యాసుల రూపంలో ఆమె ఇంటికి బిక్షకు వెళ్తారు. అప్పుడు అత్రి మహార్షి ఆశ్రమంలో ఉండరు. అనసూయదేవి వారిని లోపలికి ఆహ్వానించి భోజనానికి ఏర్పాట్లు చేస్తుంది. వడ్డించే సమయానికి వారు ఆమెను వివస్త్రగా ఆహారం పెట్టమని కోరుతారు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి, చేతిలో నీరు తీసుకుని, తన భర్తను స్మరించి, మంత్రం జపించి వారి మీద చల్లుతుంది. వేంటనే త్రిమూర్తులు పసిపిల్లలుగా మారిపోతారు. వారు కోరినట్టుగానే అనసూయదేవి త్రిమూర్తులకు పాలు ఇస్తుంది. అత్రిమహర్షి ఆశ్రమానికి తిరిగివచ్చాకా ఆ ముగ్గురు పసిపిల్లలను తన హృదయానికి హత్తుకుని 3 తలలు, 6 చేతులు ఉన్న ఒక పిల్లవానిగా మార్చివేస్తారు. తమ భర్తలు ఎంతసేపటికి రాకపోవడంతో సరస్వతి, లక్ష్మీ, పార్వతులు అత్రి-అనసూయ దంపతులతో తమ భర్తలకు నిజరూపాలు ఇవ్వమని వేడుకుంటారు. అందుకు అనసూయ దేవి అంగీకరించి వారి మీద తిరిగి మంత్రించిన జలం చల్లుతుంది. వారి వారి సాధారణ రూపాలను పొందిన త్రిమూర్తులు అత్రి-అనసూయలకు తమ అంశయైన దత్తాత్రేయ స్వామిని కూమారునిగా ప్రసాదిస్తారు. దత్తాత్రేయ స్వామి అవతారం మార్గశిర పౌర్ణమి నాడు జరిగింది.

ఈయనను పూజిస్తే భూతప్రేతపిశాచాల బాధించవు, గురు గ్రహ దోషాలు తొలగిపోతాయి. విద్యార్ధులకు దత్తాత్రేయ స్వామి విద్యాప్రదాత. మేడి చెట్టు (ఔదుంబర వృక్షం) కింద ఉంటాడు. ఈయన వద్ద నాలుగు కుక్కలు ఉంటాయి. అవి నాలుగు వేదాలకు ప్రతీకలు.

ఓం దత్తాత్రేయాయ నమః
ఓం శ్రీ దత్త శరణం మమ
ఓం శాంతిః శాంతిః శాంతిః  

Wednesday, 26 December 2012

ధ్యానం

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస

పిరమిడ్ అద్భుత శక్తి-
ప్రపంచంలో ఏడు వింతలలో ఒకటైన పిరమిడ్ విశ్వశక్తి(cosmic energy)ని విస్తారముగా తీసుకోగిలిగిన కట్టడం.పిరమిడ్ నండు కూర్చుని ధ్యానం చేయడం ద్వారా 3రెట్ల అధికమైన విశ్వశక్తి(cosmic energy)ని తీసుకొనవచ్చు.పిరమిడ్ లో ధ్యానం చేసినవారు పూర్తి ఆరోగ్యం పొందగలుగుతారు.ప్రతి రోజు ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం పొంది ఆరోగ్యంగా,ఆనందంగా జీవించగలము.

ధ్యానం చేసే పద్ధతి-
హాయిగా సుఖాసనంలో కూర్చుని చేతులు రెండు కలిపి,వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని,కళ్ళు మూసుకుని సహజంగా జరిగే ఉచ్చ్వాస,నిశ్వాసలను గమనిస్తూ ఉండాలి.ఏ మంత్రం జపించనవసరం లేదు.ఏ దైవస్వరూపాన్ని ఊహించనవసరం లేదు.మధ్యమధ్యలో వచ్చే ఆలోచనలను విడిచిపెట్టి మళ్ళీమళ్ళీ శ్వాసనే గమనిస్తూ ఉంటే నెమ్మదిగా ఆలోచనలు కలుగని స్థితికి చేరుకుంటాము.ఇదే ధ్యానం!ఈ ధ్యానం పిరమిడ్ క్రింద చేస్తే మూడింతల శక్తి అధికంగా పొందవచ్చు.ఈ ధ్యానం ఏ వయస్సువారైనా,ఎప్పుడైనా,ఎక్కడైనా చేయవచ్చు.  

మన ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉన్న కడ్తాల్ గ్రామంలో ఆసియలోనే అతిపెద్ద పిరమిడ్ నిర్మాణం జరిగింది.ఇక్కడ డిసెంబరు 21 నుండి 31 వరకు ప్రపంచ ధ్యాన మహా సభలు జరుగుతున్నాయి.వీలు ఉంటే సందర్శించండి.మీరు ప్రతి రోజు ధ్యానం చేయండి.

ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస
http://pssmovement.org/English/index.php

Thursday, 20 December 2012

not the end of the world


Hindu scriptures are very confidently saying  21-12-2012 is not the end of the world. According  to our scriptures, we are now in kaliyuga. The time period of kaliyuga is 420,000 years and it consists of 4 paadas , each of 105,000 years. kaliyuga started 5113 years ago, after the end of dwaparayuga.Now we are in 5114 th year of kaliyuga and it is1st paada. So there no end of this universe till the time period of 420,000 completes. So there is no dooms day but REMEMBER WE PEOPLE ARE DESTROYING NATURE,SO THERE MAY BE NATURAL CALAMITIES.LETUS STOP DESTROYING IT. 

And our scriptures  and Ancient Monks, Sages say, You people are said to be Hindus only if you pray for WORLD PEACE. And they also say pray not only for the peace of fellow Hindus, but also for Muslims, Christians, Zorastrians, Buddhists, Jains and  for followers of all religions and also for ATHEISTS.  So let us pray for World Peace. Let us hope that the bad in the world ends and peace is sustained. Don’t fear. Nothing is going to happen.
Om shantih shantih shantihi ( means praying to lord,let there be peace individually, collectively and universally)

21-12-2012 యుగాంతం జరగదు.

21-12-2012 యుగాంతం జరగదు.
"కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే" అంటూ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది హిందువులు పూజకు ముందు సంకల్పంలో చెప్తారు.మన ధార్మికగ్రంధాల ప్రకారం కలియుగం 4,20,000 సంవత్సరాల కాలం.దానికి 4 పాదాలు.ఒక్కో పాదం 1,05,000 సంవత్సరాలు.ప్రస్తుతం కలియుగంలో 5114 సంవత్సరంలో ఉన్నాం మనం.ఇప్పుడు కలియుగ ప్రధమపాదం జరుగుతోంది.ప్రధమపాదం కూడా పూర్తవ్వనే లేదు.ఇక యుగాంతం ఎక్కడ?

ఇక జ్యోతిష్యం ప్రకారం గ్రహ గమనాలను చూసినా 21-12-2012 నాడుప్రళయానికి దారితీసే పరిస్థితులేమి లేవు.భయపడవలసిన అవసరమే లేదు.కాని మన రాష్ట్రానికి చెందిన ఒక సిద్ధాంతి మాత్రం 22-12-2012 నాడు గ్రహగమానాలను పరిశీలిస్తే ఆరోజు పశ్చిమదేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని ఒక మాసపత్రికలో వ్రాశారు.అది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి.

ఏది ఏం జరిగినా భారతదేశానికి,భారతీయులకు ఏమి జరగదు గాక జరుగదు.ఈ దేశం దేవనిర్మితం,సిద్ధపురుషుల తపశ్శక్తిచేత రక్షింపబడుతున్న పుణ్యభూమి.భగవంతునకు ఈ దేశం అంటే ప్రీతి కనుకనే ఇక్కడ అనేక మార్లు అవతరించాడు.

అటువంటి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైద్రాబాదులో ప్రపంచ ఆద్యాత్మిక సదస్సు ముగుస్తోంది.సదస్సు ముగుంపులో 21-12-2012 భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక గురువులు,1 million ప్రజలు విశ్వశాంతి కోసం ధ్యానం చేస్తున్నారు.ఈ ధ్యానంతో అనంతవిశ్వశక్తిని ప్రపంచానికి అందించి,మానవులలో ఉన్న చెడును,రాక్షలక్షణాలను అంతం కోసం వారు చేస్తున్న ప్రయత్నానికి మన వంతు సహకారం అందిద్దాం.ఒక గంట పాటు ధ్యానం చేద్దాం.విశ్వశాంతిని ఆకాంక్షిద్దాం.

అలాగే రేపటి నుంచి విశ్వశాంతి కోసం మహబూబ్ నగర్ జిల్లా,ఆమన్ గల్లు మండలం,కడ్తాల్ లో ప్రపంచ ధ్యాన మహాసభలు 11 రోజుల పాటు జరగనున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల నుండి ఇక్కడ పాల్గొనడానికి అనేకమంది విచ్చేస్తున్నారు.వీలుంటే మీరు సందర్శించండి.మనశ్శాంతిని పొందండి.