Thursday 20 December 2012

21-12-2012 యుగాంతం జరగదు.

21-12-2012 యుగాంతం జరగదు.
"కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే" అంటూ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది హిందువులు పూజకు ముందు సంకల్పంలో చెప్తారు.మన ధార్మికగ్రంధాల ప్రకారం కలియుగం 4,20,000 సంవత్సరాల కాలం.దానికి 4 పాదాలు.ఒక్కో పాదం 1,05,000 సంవత్సరాలు.ప్రస్తుతం కలియుగంలో 5114 సంవత్సరంలో ఉన్నాం మనం.ఇప్పుడు కలియుగ ప్రధమపాదం జరుగుతోంది.ప్రధమపాదం కూడా పూర్తవ్వనే లేదు.ఇక యుగాంతం ఎక్కడ?

ఇక జ్యోతిష్యం ప్రకారం గ్రహ గమనాలను చూసినా 21-12-2012 నాడుప్రళయానికి దారితీసే పరిస్థితులేమి లేవు.భయపడవలసిన అవసరమే లేదు.కాని మన రాష్ట్రానికి చెందిన ఒక సిద్ధాంతి మాత్రం 22-12-2012 నాడు గ్రహగమానాలను పరిశీలిస్తే ఆరోజు పశ్చిమదేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని ఒక మాసపత్రికలో వ్రాశారు.అది ఎంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి.

ఏది ఏం జరిగినా భారతదేశానికి,భారతీయులకు ఏమి జరగదు గాక జరుగదు.ఈ దేశం దేవనిర్మితం,సిద్ధపురుషుల తపశ్శక్తిచేత రక్షింపబడుతున్న పుణ్యభూమి.భగవంతునకు ఈ దేశం అంటే ప్రీతి కనుకనే ఇక్కడ అనేక మార్లు అవతరించాడు.

అటువంటి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైద్రాబాదులో ప్రపంచ ఆద్యాత్మిక సదస్సు ముగుస్తోంది.సదస్సు ముగుంపులో 21-12-2012 భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక గురువులు,1 million ప్రజలు విశ్వశాంతి కోసం ధ్యానం చేస్తున్నారు.ఈ ధ్యానంతో అనంతవిశ్వశక్తిని ప్రపంచానికి అందించి,మానవులలో ఉన్న చెడును,రాక్షలక్షణాలను అంతం కోసం వారు చేస్తున్న ప్రయత్నానికి మన వంతు సహకారం అందిద్దాం.ఒక గంట పాటు ధ్యానం చేద్దాం.విశ్వశాంతిని ఆకాంక్షిద్దాం.

అలాగే రేపటి నుంచి విశ్వశాంతి కోసం మహబూబ్ నగర్ జిల్లా,ఆమన్ గల్లు మండలం,కడ్తాల్ లో ప్రపంచ ధ్యాన మహాసభలు 11 రోజుల పాటు జరగనున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల నుండి ఇక్కడ పాల్గొనడానికి అనేకమంది విచ్చేస్తున్నారు.వీలుంటే మీరు సందర్శించండి.మనశ్శాంతిని పొందండి.       

No comments:

Post a Comment