Friday 28 December 2012

మన తెలుగు




ఒక ప్రాంతానికి,అక్కడి సంస్కృతి సంప్రదాయాలకు,ఆచార వ్యవహారాలకు,భాషకు ఎనలేని సంబంధం ఉంటుంది.కాళేశ్వరం,శ్రీ కాళహస్తి,దక్షరామ క్షేత్రాల మధ్య ఉన్న భూమిని త్రిలింగ దేశమన్నారు.ఆ పవిత్ర త్రిలింగ దేశమే మన తెలుగు నేల.మనమంతా తెలుగు వెలుగులం.మన మాతృ భాష తెలుగు.ప్రతి పదం కూడా అచ్చుతోనే ముగిస్తుంది మన తెలుగు భాషలో.అందుకే దీనిని "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" గా పిలుస్తారు.3000 ఏళ్ళ చరిత్ర ఘన చరిత్ర,ఎంతో సాహిత్యం కలిగిన మహోన్నతమైన తెలుగు నాగరికత మనది.ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి.అక్కడివరకు బాగానే ఉంది.ఎందరో తెలుగు వాళ్ళు హాజరవుతున్నారు.ఎందుకో తెలియదు కాని మనం తెలుగులో మాట్లాడడానికి సిగ్గు పడుతున్నాం.

ఒక మనిషి తల్లిగర్భంలో ఉన్న సమయంలోనే తల్లి మాట్లాడే మాటలను ఆ శిశువు వింటుంది.గమనిస్తుంది.గ్రహిస్తుంది.అంటే మనం పుట్టకముందే మంకు మన భాషకు బంధం ఏర్పడింది.అంతేకాదు,ఒక మనిషి తాను ఏదైనా ఇతర భాషలను విన్నప్పుడు,అది అతని మెదడుకు చేరి,మాతృ భాషలోకి అనువదింపబడుతుంది.ఇది చాలా వేగంగా జరిగే ప్రక్రియ.అప్పుడే అతనికి అర్ధం అవుతుంది.ఆంగ్లం విషయంలో కూడా ఇంతే.మనం విన్న ప్రతి ఆంగ్ల పదాన్ని మన మెడదు మనకు తెలియకుండానే తెలుగులోనికి అనువదించి మనకు అర్ధమయ్యేలా చేస్తుంది.అటువంటిది ఈవేళ మనం తెలుగు నేర్చుకోవడం అనవసరమని భావిస్తున్నాం.తెలుగు నేర్చుకొనకపోతే మనకు మానసిక వికాసం కలుగదు,అభివృద్ధి చెందలేము.అందుకే తెలుగు నేర్చుకోవాలి.అమ్మ భాషలో ఉన్న కమ్మదనం వేరే భాషలో ఎక్కడిది.అందుకని తెలుగులోనే మాట్లాడాలి.

మనకు విలువలు నేర్పే అనేక రచనలు తెలుగులో ఉన్నాయి.
"తల్లి దండ్రి మీద దయ లేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవ గిట్టవ
విశ్వదాభిరామ!వినురవేమ!"
అమ్మనాన్నలన మీద దయం,ప్రేమ లేనివాదు,వాళ్ళని చూసుకోని వాడైన కొడుకు పుడితే ఎంత?చస్తే ఎంత?పుట్టలోన చెదలు పుడుతుంటాయి,చస్తుంటాయి,వాడికి చెదలపురుగులకు తేడా ఏంటి?అని అర్ధం.
ఇటువంటివి మనం గొప్పగా నేర్చుకునే భాషలో కనిపించవు.మనకు మంచి,భోధించడానికి అనేక పద్యాలు,కధలను వ్రాసి పెట్టారు మహానుభావులు.మనం తెలుగును మరిస్తే విలువలను భావితరాలకు నేర్పేదేవరు?

ఒకప్పుడు మోకాలే ఆంగ్లేయులు మన దేశాన్ని ఆక్రమించాలి అంటే ఈ దేశస్థులకు సంస్కృతాన్ని దూరం చేయాలని బ్రిటిష్ చట్టసభలో ప్రకటించి,ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి,మన చరిత్రను చేరిపేసి,కట్టుకధలను భారతీయ చరిత్రగా పుస్తకాల్లో ప్రవేశపెట్టాడు.సంస్కృత భాషలోనే మన సంస్కృతి ఉంది.అంతేనా!మన గ్రంధాలు సన్స్కృతంలోనే ఉన్నాయి.వాటిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి మనం దూరమయ్యాం.అందుకే ఈ రోజు మనం విదేశీయులకు బానిసలుగా మారిపోయాం.మన దగ్గర ఉన్న విషయాలను,వారు క్రొత్తగా కనుకున్నామని చెబుతుంటే అదంతా వారి గొప్పతనమూ,మనకేం లేదంటూ వారిని కీర్తిస్తున్నాం.ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కు సంస్కృతం వచ్చని మీకు తెలుసా?ప్రపంచ మేధావులు అందరూ ఒకానొక కాలంలో సంస్కృతం నేర్చుకున్నారు.కాని మనం మాత్రం అదంతా పాతచింతకాయ పచ్చడని మన మీద మనమే విమర్శలు చేసుకుంటున్నాం.

ఇక తెలుగు విషయానికి వద్దాం.2030 నాటికి ప్రపంచంలో అంతరించిపోయే భాషల జాబితాలో తెలుగు కూడా ఉంది, జాగ్రత్త పడండని ఐక్య రాజ్య సమితి హెచ్చరించింది.తెలుగు అంతరించిపోతే తెలుగు సంస్కృతి,తెలుగు చరిత్ర, తెలుగు వాజ్ఞ్మయం,తెలుగుదనం అన్నీ అంతరించిపోతాయి.ఇక తెలుగు వారసులు తమ చరిత్ర ఏంటో, తామెక్కడి వారమో తెలియక దిక్కుమొక్కులేక, ఆవేశంతో, ఆక్రోషంతో మనలని నిందిస్తారు,ఆత్మ గౌరవాన్ని కోల్పోతారు, దిక్కులేని వారిగా మిగిలిపోతారు.ఇప్పటికైన మేల్కొందాం.తెలుగును కాపాడుకుందాం.

మీరందరూ ఆంగ్లాన్ని వదిలేయండి అని నేను చెప్పటంలేదు.అన్ని భాషలు నేర్చుకున్న మన భాషను మన కాపాడుకోవాలి.తెలుగులోనే మాట్లాడుదాం.మన భాషను,సంస్కృతిని కాపాడుకుందాం.

జై తెలుగు!జై జై తెలుగు!                                         


No comments:

Post a Comment