Friday, 31 August 2012


part-11

~ బయట మట్టి విగ్రహాలను అమ్మేవారు,వాటిని అచ్చుగుద్ది ఇచ్చెస్తారు.వారు వాటిని విక్రయవస్తువులుగానే చూస్తారు.వాటిని అచ్చుగుద్ది ఇవ్వడానికి స్వామి మీద మనసు నిలబడనవసరం లేదు.మాట్లాడుతూ కూడా చెయ్యచు కదా."యద్భావం తద్భవతి".మరి మనసులొ గణపతిని ధ్యానించనప్పుడు ఙ్ఞానం ఏలా కలుగుతుంది.

~ మనం చేసిన విగ్రహాలను మనమే పూజించడం వల్ల మనకు అమొఘమైన ఙ్ఞానం లభిస్తుందట.ఏలా?

~ మనం,ముఖ్యంగా పిల్లలు విగ్రహాలను చేశాక దాన్ని వారు కేవలం బొమ్మగా చూడరు.ప్రతిమలొని ప్రతి భాగాన్ని చేస్తూ వారి ఎంతో ఆనందం పొందుతారు.ప్రతిమ పూర్తి అయ్యాక వారు అది నిజంగా వినాయకుడే అని భావన చేస్తారు.భావనమాత్రంగానే తమ ఆత్మశక్తి ద్వారా ఆ ప్రతిమకు ప్రాణం పోస్తారు.

~ ఎటువంటి మంత్రాలు,యంత్రాలు లేకుండా కేవలం భావన చేత ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ట వారికి తెలియకుండానే చేసేస్తారు.దానిని మాటిమాటికి చూసుకొని తల్లి బిడ్డను చూసి మురిసిపొయిన విధంగా మురిసిపోతారు.ఆ ప్రతిమ చూస్తుందని,వింటుందని నమ్ముతారు.వారి భావనకు,కల్మషం లేని మనసుకు భగవంతుడు లొంగి నిజంగానే స్వామి దానిలొకి ఆవహింపబడతాడు.వారి నమ్మకానికి కట్టబడతాడు.

~ మనం అదే విగ్రహంలోకి సమంత్రకంగా దైవాన్ని ఆవాహన చేస్తాం.ప్రతిమ అంతరిక్షంలోని తరంగాలను ఆకర్షిస్తుంది.అప్పటికే పిల్లల భావన చేత దానికి అనంతమైన శక్తి వచ్చింది.దానికి పూజల ద్వారా మరింత శక్తి వస్తుంది.పూజానంతరం మనం ఏమి అంటాం?"యదాస్థానం ప్రవేశయామి",యాదస్థానం ఉద్వాసయామి" అంటాం.అంటే ఎక్కడినుండి వచ్చావొ అక్కడికే వెళ్ళవయ్యా అని.అంతరిక్షం నుండి వచ్చిన శక్తి అంతరిక్షంలొకె వెళ్ళిపొతుంది.మంత్రపూర్వకంగా వచ్చిన దైవశక్తి తిరిగి ఆ పరబ్రహ్మలొనే కలిసిపోతుంది.చెరువునుండి తీసిన మట్టి చెరువులొ కలుస్తోంది.అలాగే పిల్లలు తమకు తెలియకుండానే ఆయనకు తమ ఆత్మశక్తి ద్వారా ప్రాణశక్తిని ఇచ్చారు కదా.అది వారి మనసులొ పుట్టింది.కనుక ఆ విగ్రహం యొక్క శక్తి మీ పూజల ద్వారా మరింత శక్తివంతమై తిరిగి పిల్లల లేద మన మనసులొనే కలిసిపోతుంది.

~ ఆ శక్తిని గ్రహించే ఆనాటి భారతీయులు అనేకనేక ఆవిష్కారాలు చేశారు.చరకసంహిత,వేదగణితం,సౌరశక్తి ద్వారా నడిచే యుద్దవిమానలు కాని,రాడర్లకందని వేగంతో వాయుశక్తితో నడిచే యుద్దవిమానలు వంటివి కొన్ని ఉదాహరణలే.

~ ఇంత గొప్పగా,ఊహకందని విధంగా ఆలోచించారు మన మహర్షులు.మనకు బద్దకమొ లేక తెలియకనొ కానీ ఈ విషయాన్ని విస్మరించాం.ఏమి తెలియని ఆఙ్ఞానులుగా తయారయ్యి విదేశాల వారి పరిఙ్ఞానం మీద ఆధారపడి వారి ఆవిష్కరణలను కుప్పలుగా డబ్బు పోసి కొనుక్కునే దుఃస్థితికొచ్చాం.

  మన ఊహకందని పరిఙ్ఞానం మనలొనే దాగి ఉంది.అది మట్టి విగ్రహాల ద్వార మాత్రమే బయటపడుతుంది.      

~ ఆధునిక భారతదేశంలో ఈ విగ్రహాల తాయరి మీద జరిపిన  కొన్ని పరిశొధనలు ఏమి చెప్తున్నాయి?

to be continued........


part-10

~ వినాయక చవితికి పూజించే విగ్రహాలను మనమే చేసుకోవాలా?
~ నిజానికి భారతదేశంలో పూర్వాకాలంలొ అసలు పేదరికం లేదు.కాబట్టి ఎవరికి మట్టి విగ్రహాలు విక్రయించే అవకాశం లేదు.మట్టిని,విద్యను,ఆహారాన్ని పంచుకోవడమే తప్ప సోమ్ము చేసుకొవడం అనే సంస్కృతి ఆనాటి కాలంలొ లేదు.ఇది చరిత్ర చెప్తూన్న సత్యం.ఆంగ్లేయుడైన మొకాలె బ్రిటన్ పార్లమెంట్ లొ 2-2-1835 రోజున చేసిన ప్రకటన ద్వారా మనకు స్పష్టం అవుతోంది.

"నేను భారతదేశం అన్ని దిశలు మొత్తం పర్యటించినా నాకు ఒక్క బిక్షగాడు గాని,ఒక్క దొంగ కాని కనపడలేదు.ఎంతో సంపద,మహొన్నతమైన సామాజిక విలువలు,అపారమైన శక్తి కలిగిన ప్రజల్ను చుశాక నాకు అనిపిస్తోంది మనము ఈ దేశాన్ని ఆక్రమించడం జరగని పని అని.అలా ఆక్రమించాలి అంటే భారతదేశం యొక్క వెన్నుముక్క అయిన ఆ దేశపు సంప్రదాయాలను,ఆధ్యాత్మిక సంపదను విరగొట్టాలి.అందుకోసం మనం వారి యొక్క అధ్యాత్మిక,పూరతనమైన విద్యవిధానాన్ని,సంస్కృతిని మార్చాలి.ప్రతి భారతీయుడు తమ సంస్కృతికంటే పాశ్చాత్య సంస్కృతి గొప్పది,శాస్తియమైనది అని భావించాలి.అలా వారు వారి ఆత్మగౌరవాన్ని,భారతీయ సంస్కృతిని,విలువలను కోల్పోయీ మనము కోరుకుంటున్న బానిస దేశంగా మారుతారు.అందుకొసమ మనం ఆ దేశంలొ ఇంగ్లీషు విద్యను ప్రవెశపెట్టాలి".ఇది ఆయన చేసిన ప్రకటన.

~ మనమే,ముఖ్యంగా పిల్లలు విగ్రహాలను తయారుచేయడం చేత సృజనాత్మకత (క్రియెటివిటి)పెరుగుతంది.ఇది శాస్త్రీయ కారణం.

~ ఒక బొమ్మను చేయాలి అంటే మనసుతో దాన్ని బాగా గమనించి చేస్తాం కదా.మనము మన చేతిలొ ఏది పట్టుకుంటే మన చెయ్యి ఆ వాసనే వస్తుంది.కర్పూరం పట్టుకుంటే చెయ్యి కర్పూరం వాసన వస్తుంది.అలాగే మనసు కూడా.మన మనసులొ ఉన్న ఆలోచనలే మన మాటలు,చేతల ద్వారా ప్రకటనం అవుతాయి.మరి ఈ విగ్రహం చేస్తున్నప్పుడు మనం మనసు నిండా వినాయకుడిని నింపుకుంటాం.గణపతి ఎక్కడ ఉంటే అక్కడ ఙ్ఞానం  ఉంటుంది.అలా మానసిక ధ్యానం ద్వారా మనస్సుకు వినాయకుని స్పర్శ తగిలి అనంతమైన ఙ్ఞానం,ఆనందం కలుగుతుంది.మన ప్రతి మాటలొ అవి ప్రస్పుటమవుతాయి.

~ మరి మీకొ అనుమానం రావచ్చు.ఇప్పుడు బయట ఎంతో మంది విగ్రహాలను చేసి అమ్ముతున్నారు కదా.వారికి అంత ఙ్ఞానం ఎందుకు లేదు అని?
~ అలాగే విగ్రహాలను మనమే స్వయంగా చేసుకొవడం వెనుక ఉన్న అనేకానేక కారణాలు ఏంటి?
  వంటి ప్రశ్నలకు సమాధానం రాబొయే పొస్ట్ లొ చెప్పుకుందాం.            
 
to be continued.....

Thursday, 30 August 2012


september-4-sankatahara ganesha chaviti special:

సెప్టెంబర్ 4 మంగళవారం,బహుళ చవితి వచ్చింది.సాధారణంగా పౌర్ణమి తరువాత చంద్రోదయ సమయానికి చవితి తిధి ఉంటే సంకటహర చవితి అంటారు.ఇది మంగళవారం వస్తే అంగారక చతుర్థీ అని పిలుస్తారు.వినాయకుని పూజతొ ఏలాంటి కష్టాల నుంచి అయిన గట్టు ఎక్కవచ్చని,మంగళవారం వచ్చిన రోజున ఈ వ్రతం ఆచరిస్తే కుజగ్రహ దోషం తొలగుతుందని ప్రతీతి.సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇది మంగళవారం వస్తుంది.

సంకష్టహర చతుర్థి:
దీన్నే సంకట చతుర్థి,సంకట చవితి అని కూడా అంటారు.నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకటవ్రతం అంటారు.

ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత 3,4 రోజుల్లో చవితి వస్తుంది.

ప్రదోషకాలంలో(సూర్యాస్తమయ సమయంలో)చవితి ఎప్పుడు వుంటుందొ ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలొకి తీసుకోవాలి.రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు.ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి.

సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ,పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది.ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు.

ఈ వ్రతాన్ని 3,5,11 లేద 21 నెలలు ఆచరిస్తారు.ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి.ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి,తరువాత ఎరుపు లేద తెలుపు జాకెట్ పీస్ గాని,సుమారు అరమీటరు చదరం గల ఎరుపు లేద తెలుపు రంగుగల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో వున్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు(గుప్పిళ్ళు) బియ్యాన్ని అందులో పొయ్యాలి.ఆ తరువాత 2 ఎండు ఖర్జురాలు,2 వక్కలు,దక్షిణ ఉంచి తమలపాకులను అందులో వుంచాలి. మనసులొని కోరికను మరోసారి తలచుకొని మూటకట్టాలి.దానిని స్వామి ముందు ఉంచి ధూపం(అగరుబత్తి) వెలిగించి టెంకాయ లేద పళ్ళు నివేదన చేయాలి.

ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టు 3,11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి.వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి.ఆలయానికి వెళ్ళటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒకచొట గణపతిని వుంచి ప్రదక్షిణ చేయవచ్చు.పూజలో ఉన్న గణపతిని తీయకూడదు.శారీరికంగానూ,మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం.అంతేకానీ ఎన్ని టెంకాయలు సమర్పించాం,ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు.

సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి."సూర్యాస్తమయం వరకు ఉడికించిన  పదార్ధంగాని,ఉప్పు తగిలిన(కలిసిన)/వేయబడిన  పదార్ధాలు తినకూడదు".పాలు,పళ్ళూ,పచ్చి కూరగాయలు తినవచ్చు.అనుకున్న సమయం(3,5,11 లేదా 21 'చవితి 'లు)పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి.చంద్రదర్శనం లేద నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప,దీప,నైవేద్యాలను సమర్పించి మాములుగా భోజనం చేయవచ్చు.నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి.

ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్దిస్తుందని ప్రతీతి.

courtesy-sri saila prabha

"వివిధ కారణాల" వల్ల ఈ వ్రతం ఆచరించలేని వాళ్ళు "సంకటనాశన గణేశ స్తొత్రం" 4 సార్లు చదివినా చాలు ఫలితం లభిస్తుంది.

అందరూ తప్పక గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి.

Wednesday, 29 August 2012


part-9
~ గరిక యొక్క విశిష్టత ఏమిటి?

~ గరిక మీద 1982-83 ప్రాంతంలొ భారతదేశంలొ సూర్య గ్రహణం రోజున పరిశొధన జరిగింది.గరిక గడ్డి జాతికి చెందినది.అది నిటారుగా పైకి నిలబడి,సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తనలొ దాచి ఉంచుకుంటుంది.అతినీలలొహిత కిరణాలను,గ్రహణ సమయంలొ భూమికి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితొ అడ్డుకుంటుందని ఆ పరిశొధన ఫలితాలను అన్ని ప్రధాన దిన పత్రికల్లొ ప్రచురించడం జరిగింది.

~ గరిక ఆయుర్వేదంలొ నత్తికి,శ్వాస,చర్మ సంబంధిత రోగాలకు వాడతారు.గరిక పచ్చడి కూడా కొన్ని ప్రాంతాల్లొ తినే ఆచారం ఉంది.

~కొన్ని వందల వ్రేళ్ళతొ,అతి తొందరగా పెరిగె గరిక గొప్పతనం చెప్పడం కష్టతరమని,దానిలొ దేవతలు ఉంటారని,దాని స్పర్శ పాపాలను హరిస్తుందని,దుస్స్వప్నాలను నాశనం చేస్తుందని ఈ శ్లొకం.

సహస్రపరమా దేవి శతమూల శతాంకుర
సర్వగుం హరతుమె పాపం దూర్వా దుస్స్వప్ననాశిని.

~ పీడకల వస్తే తరువాతి రోజు ఉదయం తలార స్నానం చేసి ఒక్క గరిక పొచను వినాయకునికి సమర్పించి పై శ్లొకం చెప్తూ గరికను తలమీద పెట్టుకుంటే పీడకల ఫలించకుండా ఉంటుంది.

~ ఈ గరికను వినాయకునికి సమర్పించడం చేత జాతకంలొ ఉన్న బుధగ్రహ దోషాలు తొలగిపొతాయి.

~ 5,14,23 తేదిల్లొ పుట్టిన వారి అధిపతి బుధుడు.అలాగే గణిత,అకౌంట్స్ రంగాల్లొ ఉద్యొగం చెస్తున్నవారికి బుధ గ్రహానుగ్రహం తప్పనిసరి.

~ విద్యార్థులు అందరూ రోజు గణపతిని గరికతొ పూజించడం చేత ఙ్ఞాపక శక్తి పెరుగుతుంది.

  గరిక పార్వతి దేవి రూపం.పార్వతి దేవి యొక్క సాకార రూపం ప్రకృతి.ప్రకృతి రక్షణే గణపతి దీక్ష.పర్యవరణ హితంగా గణపతి ఉత్సవాలను జరుపుకుందాం.

వినాయక విగ్రహాలను మనమె తయారు చెసి,పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

to be continued.........                  

Tuesday, 28 August 2012


part-8
~ వినాయకునికి పత్రి పూజలొ అత్యంత ఇష్టమైనది గరిక.ఒక్క గరిక పొచతొ స్వామిని ప్రసన్నం చేసుకొవచ్చు.

~ దానికి సంబంధించి ఒక కధ ప్రాచుర్యంలొ ఉంది.యమధర్మరాజుకు అనలాసురుడు అనే ఒక కొడుకు ఉన్నాడు.అతను అగ్ని వలె మండే శరీరం కలవాడు.దేవతల మీద యుద్ధం ప్రకటించాడు.ఇంద్రుడు భయపడి వినాయకుని వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకున్నాడట.వినాయకుడు కొపంతొ  అనలాసురిడిని మింగేశాడు.వాడు స్వామి బొజ్జలొ వేడి పుట్టించి ఇబ్బంది పెట్టడంతొ దేవతలు వినాయకుడిని చల్లపరచడానికి రకరకాల పత్రాలు వేశారట.అయినా చల్లబడలేదు స్వామి.శివుని ఆఙ్ఞ మేరకు గరికతొ అర్చించడం వల్ల గణపతి చల్లబడ్డాడని,అప్పటి నుండి  తనను గరికతొ అర్చించాలని గణాధిపతి ఆదేశించాడని ఆ కధ సారాంశం.

~ గరిక యొక్క విశిష్టత ఏమిటి?పరిశొధనలు ఏమి చెప్తున్నాయి? గరిక పూజ వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి?గరిక పూజ వల్ల గ్రహదోషాలు తొలగుతాయా?తరువాతి భాగల్లొ వివరణ తెలుసుకుందాం.

to be continued..........        

Monday, 27 August 2012



part-7
continuation
~ అలా పత్రి కొసేటప్పుడు వాటికి పురుగు చీడలాంటివి ఉంటే వాటికి తగిన వైద్యం కూడా చేసేవారట.మీకు అనిపిస్తుంది ఇదంతా అవసరమా?ఏదొ నాలుగు ఆకులు కోసమని ఇంతా చేయాలా అని.అది ఒక మూడాచారం కాదు.దాని ద్వారా పిల్లలకు చిన్న వయసులొనే  నేర్పేవారు.ఈ సమాజంలొ ప్రత్యక్షంగానో,పరొక్షంగానో అందరం ఒకరి మీద ఒకరం ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఒకరికి ఒకరం సహాయపడాలి.అప్పనంగా ఒకరి కష్టాన్ని,సంపదను దొపిడి చేయకుడదని,అలాగే కేవలం ఒకరి దగ్గరినుండి తీసుకొవడమే కాకుండా ఇవ్వడం కూడా చేయాలని చెప్తూ ఇచ్చిపుచ్చుకోవడం,కలిసి జీవించడం అనే అలొచనలను చిన్న పిల్లలొ బలంగా పాతుకునేల చేయడం దీని వెనుక ఉన్న అర్దం.

~ పూజ సమయంలొ పత్రి పేరు పెద్దలు చెప్తూంటే,ఒక్కొ పత్రిని స్వామికి సమర్పించెవారు పిల్లలు.అలా సమర్పిస్తూ అది ఏఏ వైద్యానికి వాడతారొ కూడా స్వామికి పిల్లల్తొ చెప్పించేవారట పెద్దలు.మళ్ళీ ఇదెంటి అనుకుంటున్నారా?

~ మనం ఈ పని మొదలు పెట్టిన వినాయకుడి ఆ ఆరాధానతొనే.అలాగే పిల్లలకు నేర్చుకున్న ఆయుర్వేదం కూడా మొదట ఆయన ముందు ప్రదర్శించడం అవుతుంది.

~ ఇంకొ అర్దం.నేర్చుకున్న విద్యను స్వామి పాదాలకు సమర్పించడం.ఒక్కసారి సమర్పించాక అది మనది కాదు కద.మనది కాని దాని నుండి మనం ఫలితాలను ఎలా ఆశిస్తాం.అవును.భవిష్యత్తులొ ఒకవేళ వైద్యం చేయవలసి వస్తే,ఎటువంటి డబ్బు కానీ,ఇతర ప్రయొజనాలు కానీ ఎలా ఆశిస్తారు చెప్పండి,వారు ఇంతక మునుపే ఇది నీది స్వామి అని సమర్పించాక.అందుకే పవిత్ర భావనతొ ఆ కాలంలొ భారతీయ వైద్యులు చికిత్స చేసేవారు.అందుకే ఆ కాలంలొ వైద్యం అందక చనిపొయిన వారు లేరు.పైగా తమకు తెలిసిన విద్యను ఎటువంటి స్వార్ధం లేకుండా అందరికి నేర్పేవారు.

~ ఇంత ఆలొచన ఉంది పత్రి పూజ వెనుక.ఇంత గొప్ప సంస్కృతి సనాతన హిందూసంస్కృతి.ఇది ఈ తరం వాళ్ళకు తెలియపరచాల్సిన అవసరం మన అందరి మీద ఉంది.

~ఆయుర్వేదం పాతకాలం ఆలొచన.దాని గురంచి పిల్లలకు చెప్పడానికి ఏమి ఉంది అంటారేమొ?కాస్త ఇది తెలుసుకొండి.మనం ఎంతొ అభివృద్ధి సాధించిందని చెప్పుకుంటున్న అమెరికా,మన ఆయుర్వేద గ్రంధాలను కొందరికి డబ్బు ఇచ్చి సంస్కృతంలొ ఉన్న వాటి ఔషధా గుణాల గురించి తెలుసుకొని,భారతీయ ఋషులు ఏనాడొ చెప్పిన వాటి ప్రయొజనాలను తామె ప్రపంచానికి చాటి చెప్పమని చెప్తూ  30000 భారతీయ అయుర్వేద మూలికల మీద "పెటెంట్ హక్కులు" పొందిందెందుకు?కొత్తిమీర,పసుపు లాంటివి వంటల్లొ వాదితే ఆరొగ్యం అని వాడు మనకు చెప్పాలా?చైనా వేప చెట్టు మీద"పెటెంట్ హక్కులు" పొంది వేప మూలాలు తమవే అని వాదిస్తొంది ఎందుకు?వేప గురించి వాళ్ళకంటే మనకే బాగా తెలుసుకదా.

    ఆయుర్వేదం మన మహాద్భుత ఆవిష్కారం.మన ఆయుర్వేదాన్ని మనమే కాపాడుకొవాలి.పర్యావరణాన్ని కాపాడుదాం.పర్యవరణ హితమైన వినయక చవితి జరుపుకుందాం.                    
     
to be continued..........

Sunday, 26 August 2012


part-6
very rarely available information exclusively given by us

**** అందరు తప్పక చదవి,మన చరిత్ర,ఆ నాటి జీవన ప్రమాణాలను అందరికి తెలియపరచాల్సిన అతి ముఖ్యమైన ధర్మ సూక్ష్మం ఇది.

 
~ వినాయక చవితి పిల్లల పండుగన్నారు.నిజమే ఇది చదువుల పండుగ.బొధించేవాడు వినాయకుడు,ఆయనే గురువు.నేర్చుకునే వాళ్ళు పిల్లలు.ఏమి నేర్చుకుంటారు?

~ పిల్లలే పూజకు పత్రి కోయాలట.పెద్దలు దగ్గర ఉండి కోయించాలట.ఆ రోజుల్లో ఉన్నవన్ని పెద్ద కుటుంబాలే కనుక ఎంతొ మంది పిల్లలు ఉండేవారు.పండగ ముందుగానే పెద్దలు పిల్లలకు పత్రిలొ ఉన్న ఔషధీయా గుణాల గురించి,వాటి వాడకం గురించి చెప్పాలి.వారికి అంతా వివరించాక పత్రి వెతకడానికి పెద్దలు,పిల్లలు వెళ్ళాలి.పెద్దలు దగ్గర ఉండి ప్రతి ఔషధ మూలికలను చూపిస్తూ దాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న కీటకాల గురించి అవగాహన కల్పించాలి.వానకాలం కదా మొక్కలు బాగా ఎదిగి గుబురుగా ఉంటుంది.వాటిలొ పాములు కూడా ఉంటాయి.వాటిని చూపించి అవి ఇలాంటి ప్రదేశాల్లొ ఉంటాయి,భవిష్యత్తులొ ప్రమాదసమయంలొ వైద్యానికి మూలికల కోసం మీరుగాని రావల్సి వస్తే పాములు ఏఏ ప్రదేశాల్లొ ఉంటాయొ గుర్తుపెట్టుకొండి,జాగ్రత్త వహించండి అని చెప్పేవారు.

~ మొక్కల దగ్గరకు వెళ్ళి కావల్సినవి తెంపుకొని రమ్మని చెప్పలేదు.ఆయుర్వేదం చెప్పింది మొక్కలు,చెట్ల నుండి ఏదైన తెంపవలసిన అవసరం వస్తే ముందుగా ఆ మొక్కలకు నీరు పోయండి.వాటిని పసుపుకుంకుమలు చల్లి పూజించండి.అమ్మా!నాకు ఆరొగ్యం చేకురడానికి నీ యొక్క శరీరభాగాలను వాడుతున్నా.నన్ను క్షమించమ్మా అని పలకాలట.వాటికి కూడా మనస్సు ఉందని ఇప్పుడు కాదు ఆ కాలంలొనే గుర్తించారు.అందుకే ఈ ప్రక్రియ.మీరు నమ్మకపోతే పండిత ఏల్చురి గారి ఆయుర్వేద కార్యక్రమం చూడండి.మీకే తెలుస్తుంది.

~ పసుపు చల్లడంలొ ఇంకొ రహస్యం ఉంది.పసుపు పాములకు పడదు.పసుపు ఉన్నచోటికి పాములు రావు.ఈ ఔషధమూలికల కోసమని ఎవరైన వచ్చి పాము కాటుకు గురికాకుండా ఉంటారని.

~ పిల్లలతొ ఈ ప్రక్రియా చేయిస్తూ చిగుళ్ళను కోయించేవారు.అన్ని చెట్లు ఒకేలా ఉంటాయ?జిల్లేడు లాంటివి పాలు కారుస్తాయి.ఇదిగొ ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయి,వాటి నుండి వెలువడే రసాలు హాని చేసెవిగా ఉంటాయి జాగ్రత్త అని పెద్దలు చెప్తూ పిల్లల చేత పత్రి కొయించాలని మన మహా మునులు చెప్పారు.
ఇంకా వివరణ పూర్తికాలేదు.

to be continued.....................