Tuesday 28 August 2012


part-8
~ వినాయకునికి పత్రి పూజలొ అత్యంత ఇష్టమైనది గరిక.ఒక్క గరిక పొచతొ స్వామిని ప్రసన్నం చేసుకొవచ్చు.

~ దానికి సంబంధించి ఒక కధ ప్రాచుర్యంలొ ఉంది.యమధర్మరాజుకు అనలాసురుడు అనే ఒక కొడుకు ఉన్నాడు.అతను అగ్ని వలె మండే శరీరం కలవాడు.దేవతల మీద యుద్ధం ప్రకటించాడు.ఇంద్రుడు భయపడి వినాయకుని వద్దకు వెళ్ళి రక్షించమని వేడుకున్నాడట.వినాయకుడు కొపంతొ  అనలాసురిడిని మింగేశాడు.వాడు స్వామి బొజ్జలొ వేడి పుట్టించి ఇబ్బంది పెట్టడంతొ దేవతలు వినాయకుడిని చల్లపరచడానికి రకరకాల పత్రాలు వేశారట.అయినా చల్లబడలేదు స్వామి.శివుని ఆఙ్ఞ మేరకు గరికతొ అర్చించడం వల్ల గణపతి చల్లబడ్డాడని,అప్పటి నుండి  తనను గరికతొ అర్చించాలని గణాధిపతి ఆదేశించాడని ఆ కధ సారాంశం.

~ గరిక యొక్క విశిష్టత ఏమిటి?పరిశొధనలు ఏమి చెప్తున్నాయి? గరిక పూజ వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి?గరిక పూజ వల్ల గ్రహదోషాలు తొలగుతాయా?తరువాతి భాగల్లొ వివరణ తెలుసుకుందాం.

to be continued..........        

No comments:

Post a Comment