Sunday 26 August 2012


part-6
very rarely available information exclusively given by us

**** అందరు తప్పక చదవి,మన చరిత్ర,ఆ నాటి జీవన ప్రమాణాలను అందరికి తెలియపరచాల్సిన అతి ముఖ్యమైన ధర్మ సూక్ష్మం ఇది.

 
~ వినాయక చవితి పిల్లల పండుగన్నారు.నిజమే ఇది చదువుల పండుగ.బొధించేవాడు వినాయకుడు,ఆయనే గురువు.నేర్చుకునే వాళ్ళు పిల్లలు.ఏమి నేర్చుకుంటారు?

~ పిల్లలే పూజకు పత్రి కోయాలట.పెద్దలు దగ్గర ఉండి కోయించాలట.ఆ రోజుల్లో ఉన్నవన్ని పెద్ద కుటుంబాలే కనుక ఎంతొ మంది పిల్లలు ఉండేవారు.పండగ ముందుగానే పెద్దలు పిల్లలకు పత్రిలొ ఉన్న ఔషధీయా గుణాల గురించి,వాటి వాడకం గురించి చెప్పాలి.వారికి అంతా వివరించాక పత్రి వెతకడానికి పెద్దలు,పిల్లలు వెళ్ళాలి.పెద్దలు దగ్గర ఉండి ప్రతి ఔషధ మూలికలను చూపిస్తూ దాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్న కీటకాల గురించి అవగాహన కల్పించాలి.వానకాలం కదా మొక్కలు బాగా ఎదిగి గుబురుగా ఉంటుంది.వాటిలొ పాములు కూడా ఉంటాయి.వాటిని చూపించి అవి ఇలాంటి ప్రదేశాల్లొ ఉంటాయి,భవిష్యత్తులొ ప్రమాదసమయంలొ వైద్యానికి మూలికల కోసం మీరుగాని రావల్సి వస్తే పాములు ఏఏ ప్రదేశాల్లొ ఉంటాయొ గుర్తుపెట్టుకొండి,జాగ్రత్త వహించండి అని చెప్పేవారు.

~ మొక్కల దగ్గరకు వెళ్ళి కావల్సినవి తెంపుకొని రమ్మని చెప్పలేదు.ఆయుర్వేదం చెప్పింది మొక్కలు,చెట్ల నుండి ఏదైన తెంపవలసిన అవసరం వస్తే ముందుగా ఆ మొక్కలకు నీరు పోయండి.వాటిని పసుపుకుంకుమలు చల్లి పూజించండి.అమ్మా!నాకు ఆరొగ్యం చేకురడానికి నీ యొక్క శరీరభాగాలను వాడుతున్నా.నన్ను క్షమించమ్మా అని పలకాలట.వాటికి కూడా మనస్సు ఉందని ఇప్పుడు కాదు ఆ కాలంలొనే గుర్తించారు.అందుకే ఈ ప్రక్రియ.మీరు నమ్మకపోతే పండిత ఏల్చురి గారి ఆయుర్వేద కార్యక్రమం చూడండి.మీకే తెలుస్తుంది.

~ పసుపు చల్లడంలొ ఇంకొ రహస్యం ఉంది.పసుపు పాములకు పడదు.పసుపు ఉన్నచోటికి పాములు రావు.ఈ ఔషధమూలికల కోసమని ఎవరైన వచ్చి పాము కాటుకు గురికాకుండా ఉంటారని.

~ పిల్లలతొ ఈ ప్రక్రియా చేయిస్తూ చిగుళ్ళను కోయించేవారు.అన్ని చెట్లు ఒకేలా ఉంటాయ?జిల్లేడు లాంటివి పాలు కారుస్తాయి.ఇదిగొ ఇలాంటి మొక్కలు కూడా ఉంటాయి,వాటి నుండి వెలువడే రసాలు హాని చేసెవిగా ఉంటాయి జాగ్రత్త అని పెద్దలు చెప్తూ పిల్లల చేత పత్రి కొయించాలని మన మహా మునులు చెప్పారు.
ఇంకా వివరణ పూర్తికాలేదు.

to be continued.....................

No comments:

Post a Comment