Monday 27 August 2012



part-7
continuation
~ అలా పత్రి కొసేటప్పుడు వాటికి పురుగు చీడలాంటివి ఉంటే వాటికి తగిన వైద్యం కూడా చేసేవారట.మీకు అనిపిస్తుంది ఇదంతా అవసరమా?ఏదొ నాలుగు ఆకులు కోసమని ఇంతా చేయాలా అని.అది ఒక మూడాచారం కాదు.దాని ద్వారా పిల్లలకు చిన్న వయసులొనే  నేర్పేవారు.ఈ సమాజంలొ ప్రత్యక్షంగానో,పరొక్షంగానో అందరం ఒకరి మీద ఒకరం ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఒకరికి ఒకరం సహాయపడాలి.అప్పనంగా ఒకరి కష్టాన్ని,సంపదను దొపిడి చేయకుడదని,అలాగే కేవలం ఒకరి దగ్గరినుండి తీసుకొవడమే కాకుండా ఇవ్వడం కూడా చేయాలని చెప్తూ ఇచ్చిపుచ్చుకోవడం,కలిసి జీవించడం అనే అలొచనలను చిన్న పిల్లలొ బలంగా పాతుకునేల చేయడం దీని వెనుక ఉన్న అర్దం.

~ పూజ సమయంలొ పత్రి పేరు పెద్దలు చెప్తూంటే,ఒక్కొ పత్రిని స్వామికి సమర్పించెవారు పిల్లలు.అలా సమర్పిస్తూ అది ఏఏ వైద్యానికి వాడతారొ కూడా స్వామికి పిల్లల్తొ చెప్పించేవారట పెద్దలు.మళ్ళీ ఇదెంటి అనుకుంటున్నారా?

~ మనం ఈ పని మొదలు పెట్టిన వినాయకుడి ఆ ఆరాధానతొనే.అలాగే పిల్లలకు నేర్చుకున్న ఆయుర్వేదం కూడా మొదట ఆయన ముందు ప్రదర్శించడం అవుతుంది.

~ ఇంకొ అర్దం.నేర్చుకున్న విద్యను స్వామి పాదాలకు సమర్పించడం.ఒక్కసారి సమర్పించాక అది మనది కాదు కద.మనది కాని దాని నుండి మనం ఫలితాలను ఎలా ఆశిస్తాం.అవును.భవిష్యత్తులొ ఒకవేళ వైద్యం చేయవలసి వస్తే,ఎటువంటి డబ్బు కానీ,ఇతర ప్రయొజనాలు కానీ ఎలా ఆశిస్తారు చెప్పండి,వారు ఇంతక మునుపే ఇది నీది స్వామి అని సమర్పించాక.అందుకే పవిత్ర భావనతొ ఆ కాలంలొ భారతీయ వైద్యులు చికిత్స చేసేవారు.అందుకే ఆ కాలంలొ వైద్యం అందక చనిపొయిన వారు లేరు.పైగా తమకు తెలిసిన విద్యను ఎటువంటి స్వార్ధం లేకుండా అందరికి నేర్పేవారు.

~ ఇంత ఆలొచన ఉంది పత్రి పూజ వెనుక.ఇంత గొప్ప సంస్కృతి సనాతన హిందూసంస్కృతి.ఇది ఈ తరం వాళ్ళకు తెలియపరచాల్సిన అవసరం మన అందరి మీద ఉంది.

~ఆయుర్వేదం పాతకాలం ఆలొచన.దాని గురంచి పిల్లలకు చెప్పడానికి ఏమి ఉంది అంటారేమొ?కాస్త ఇది తెలుసుకొండి.మనం ఎంతొ అభివృద్ధి సాధించిందని చెప్పుకుంటున్న అమెరికా,మన ఆయుర్వేద గ్రంధాలను కొందరికి డబ్బు ఇచ్చి సంస్కృతంలొ ఉన్న వాటి ఔషధా గుణాల గురించి తెలుసుకొని,భారతీయ ఋషులు ఏనాడొ చెప్పిన వాటి ప్రయొజనాలను తామె ప్రపంచానికి చాటి చెప్పమని చెప్తూ  30000 భారతీయ అయుర్వేద మూలికల మీద "పెటెంట్ హక్కులు" పొందిందెందుకు?కొత్తిమీర,పసుపు లాంటివి వంటల్లొ వాదితే ఆరొగ్యం అని వాడు మనకు చెప్పాలా?చైనా వేప చెట్టు మీద"పెటెంట్ హక్కులు" పొంది వేప మూలాలు తమవే అని వాదిస్తొంది ఎందుకు?వేప గురించి వాళ్ళకంటే మనకే బాగా తెలుసుకదా.

    ఆయుర్వేదం మన మహాద్భుత ఆవిష్కారం.మన ఆయుర్వేదాన్ని మనమే కాపాడుకొవాలి.పర్యావరణాన్ని కాపాడుదాం.పర్యవరణ హితమైన వినయక చవితి జరుపుకుందాం.                    
     
to be continued..........

No comments:

Post a Comment