Wednesday 29 August 2012


part-9
~ గరిక యొక్క విశిష్టత ఏమిటి?

~ గరిక మీద 1982-83 ప్రాంతంలొ భారతదేశంలొ సూర్య గ్రహణం రోజున పరిశొధన జరిగింది.గరిక గడ్డి జాతికి చెందినది.అది నిటారుగా పైకి నిలబడి,సూర్యరశ్మి ద్వారా మొత్తం సూర్యశక్తిని గ్రహించి తనలొ దాచి ఉంచుకుంటుంది.అతినీలలొహిత కిరణాలను,గ్రహణ సమయంలొ భూమికి వచ్చే హానికరమైన కిరణాలను తన శక్తితొ అడ్డుకుంటుందని ఆ పరిశొధన ఫలితాలను అన్ని ప్రధాన దిన పత్రికల్లొ ప్రచురించడం జరిగింది.

~ గరిక ఆయుర్వేదంలొ నత్తికి,శ్వాస,చర్మ సంబంధిత రోగాలకు వాడతారు.గరిక పచ్చడి కూడా కొన్ని ప్రాంతాల్లొ తినే ఆచారం ఉంది.

~కొన్ని వందల వ్రేళ్ళతొ,అతి తొందరగా పెరిగె గరిక గొప్పతనం చెప్పడం కష్టతరమని,దానిలొ దేవతలు ఉంటారని,దాని స్పర్శ పాపాలను హరిస్తుందని,దుస్స్వప్నాలను నాశనం చేస్తుందని ఈ శ్లొకం.

సహస్రపరమా దేవి శతమూల శతాంకుర
సర్వగుం హరతుమె పాపం దూర్వా దుస్స్వప్ననాశిని.

~ పీడకల వస్తే తరువాతి రోజు ఉదయం తలార స్నానం చేసి ఒక్క గరిక పొచను వినాయకునికి సమర్పించి పై శ్లొకం చెప్తూ గరికను తలమీద పెట్టుకుంటే పీడకల ఫలించకుండా ఉంటుంది.

~ ఈ గరికను వినాయకునికి సమర్పించడం చేత జాతకంలొ ఉన్న బుధగ్రహ దోషాలు తొలగిపొతాయి.

~ 5,14,23 తేదిల్లొ పుట్టిన వారి అధిపతి బుధుడు.అలాగే గణిత,అకౌంట్స్ రంగాల్లొ ఉద్యొగం చెస్తున్నవారికి బుధ గ్రహానుగ్రహం తప్పనిసరి.

~ విద్యార్థులు అందరూ రోజు గణపతిని గరికతొ పూజించడం చేత ఙ్ఞాపక శక్తి పెరుగుతుంది.

  గరిక పార్వతి దేవి రూపం.పార్వతి దేవి యొక్క సాకార రూపం ప్రకృతి.ప్రకృతి రక్షణే గణపతి దీక్ష.పర్యవరణ హితంగా గణపతి ఉత్సవాలను జరుపుకుందాం.

వినాయక విగ్రహాలను మనమె తయారు చెసి,పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?

to be continued.........                  

No comments:

Post a Comment