Wednesday 10 June 2015

కందుకూరి శివానందమూర్తి గారు

నిన్న అర్ధరాత్రి  1-55 గంటలకు శివైక్యం చెందారు సద్గురువులు , శైవమహాపీఠం అధిపతి, శ్రీ కందుకూరి శివానందమూర్తి గారు. వీరు తెలుగు వారు, రాజమండ్రిలో జన్మించారు. ఆధునికకాలంలో భారతదేశం చూసిన ఆధ్యాత్మిక గురువులలో శ్రేష్టులు గురువుగారు. పురాణకాలంలోని దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, వేదవ్యాసుడు, మైత్రేయి, కృష్ణభగవానుడు మొదలు ఆదిశంకరులు, భగవాన్ రమణమహర్షి వంటి గురువుల సంప్రదాయానికి చెందినవ్యక్తి గురువుగారు. భారతదేశానికి ఋషులే సంపద, చరిత్ర, జీవం, శక్తి, అన్నీ. అటువంటి ఋషుల గురించి వివిధ పురాణాల్లో ఉన్న అనేక విషయాలను సేకరించి 'మహర్షుల చరిత్రలు' అనే పేరుతో రెండు సంపుటాలుగా గ్రంధాలను అందించారు గురువుగారు. భారతదేశంతో పాటు అనేక దేశాల్లో ఇప్పటికి ఎంతో మంది రోజు రుద్రాభిషేకాలు చేస్తూ, ధర్మాన్ని పాటిసున్నారంటే అదంతా వీరి అనుగ్రహమే. వీరికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది శిష్యులు ఉన్నారు.

సనాతనధర్మాన్ని రక్షించడంలో ఎప్పుడు ముందు ఉండేవారు. ఆయన జీవితం మొత్తం సనాతనధర్మాన్ని ఉద్ధరించడానికి అనేక బోధనలు చేశారు. కాలం మారినా, నూతన పరిజ్ఞానం వచ్చినా, ధర్మాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడువకండి అన్ని యువతకు పిలుపునిచ్చారు. 14 లోకాల గురించి అవగాహనే కాక, అవి ఎక్కడ ఉన్నాయి, భూమండలానికి ఎంత దూరంలో ఉన్నాయి వంటి అనేక విషయాలను ఆధునిక శాస్త్రవేత్తలకు సైతం అర్దమయ్యేలా వివరించిన ఘనత గురువుగారిది. అన్ని లోకాల్లో ఏం ఏం ఉంటాయో కూడా గురువులకు తెలుసు. భగవాన్ రమణమహర్షి, సద్గురు త్రైలింగస్వామి మొదలైనవారి బోధనలు స్వామి వారి జీవితంపై ప్రభావం చూపాయి. ఇప్పుడున్న కాలంలో జీవన్ముక్తుడిగా తిరిగిన మహాపురుషులు గురువుగారు.

భారతదేశంలో జరుగుతున్న అకృత్యలు, అవినీతి, అక్రమాలు, సనాతనధర్మంపై జరుగుతున్న దాడులను చూసి తట్టుకోలేకపోయారు. అనేకమంది గురువులు, సిద్ధులవలే వీరు కూడా దేశంలో హిందూ ప్రభుత్వం రావాలని తపించారు. అందుకోసం కొన్నాళ్ళు మౌనవ్రతం చేసి, తీవ్రమైన తపస్సు చేశారు. ఇటువంటి గురువుల తపఃఫలితమే ఈ రోజు మనకున్న హిందూ కేంద్రప్రభుత్వం. కొన్ని వందల ఏళ్ళ తర్వాత హిందువులు తిరిగి ఈ దేశాన్ని పూర్తి మెజారటితో పాలిస్తున్నారంటే ఇటువంటి గురువుల అనుగ్రహం ఉండడమే కారణం.

వీరికి ఈ మధ్య ఆరోగ్యం చెడిపోయినప్పుడు ప్రధాని నరేంద్రమోదీ గారు ఫోన్ చేసి పరమార్శించారు. పూర్తి వైద్యసదుపాయాలు కలిగిస్తామని హామీ ఇచ్చారు. బిజేపీ నుంచి రాంమాధవ్ కూడా వీరిని చూడటానికి దిల్లీ నుంచి వచ్చారు.

సనాతనధర్మన్ని రక్షించడానికి, ఆర్తులను, ధీనులను ఉద్ధరించడానికి వచ్చిన ఈ మహాపురుషుని అనుగ్రహం మనపై సదా ఉండుగాకా.

సద్గురువే నమః

1 comment: