Sunday 21 June 2015

హిందూ ధర్మం - 163 (వేదంలో స్త్రీలు)

ఆడపిల్లకు చదువువెందుకండీ, ఆమె ఎలాగూ అత్తవారింటికి వెళుతుంది కదా అంటారు కొందరు. వేదం భగవంతుని ఆదేశం, వేదం ఏమందో చూడండి.



విద్యాభ్యాసం తర్వాతే వివాహం

బ్రహ్మచర్యం ద్వారా యువతులు శాస్త్రపండితులు, యవ్వనవతులయ్యేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలి, ఆ తర్వాతే వివాహం చేసుకోవాలి- అధర్వణవేదం 1 అధ్యాయం 8 వ పేజీ (క్షేమేంద్ర దాస్ త్రివేది గారు రాసిన అధర్వణవేద భాష్యం)

ఆడపిల్లలు బాహ్యవస్తువులను పట్టించుకోకుండా జ్ఞానం యొక్క శక్తి ద్వారా దూరదృష్టిని, శక్తివంతమైన శీలాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడామే భూమ్యాకాశాల యందు వ్యాపించి ఉన్న సంపదను అందరికి పంచిపెట్టగలుగుతుంది. అప్పుడు మాత్రమే ఆమె వివాహానికి అర్హురాలు- అధర్వణవేదం 1 వ అధ్యాయం (క్షేమేంద్ర దాస్ త్రివేది గారు రాసిన అధర్వణవేద భాష్యం)

తల్లిదండ్రులు కూతురికి జ్ఞానాన్ని, తెలివిని, పాండిత్యాన్ని బహుమతిగా ఇవ్వాలి. భర్త ఇంటికి వెళుతుంటే ఇవ్వవలసిన సంపద (స్త్రీ ధనం) కూడే ఇదే - అధర్వణవేదం 14.1.6

పిల్లలను రక్షించేదానవు, నిశ్చితమైన జ్ఞానం కలదానవు, వేల ప్రార్ధనలకు సమానమైన దానవు, అన్ని దిక్కులను ఆకట్టుకునేదానవు, అందరికి ఆదర్శమైనదానవు. ఓ స్త్రీ, నీవు సంపద గడించు. నీకు అరుహడైన భర్తను పొందు, అతనికి సంపద పెంచే మార్గాలను చూపించు- అధర్వణవేదం 1 అధ్యాయం (క్షేమేంద్ర దాస్ త్రివేది గారు రాసిన అధర్వణవేద భాష్యం)

వధువు, విలువలు, జ్ఞానం ద్వారా భర్త ఇంటివాళ్ళను మెప్పించు - అధర్వణవేదం 1 వ అధ్యాయం

ఓ స్త్రీ! నీకు అన్నీ తెలుసు. దయతో మాకు సంపదను, సౌఖ్యాన్ని, బలాన్ని ప్రసాదించు- అధర్వణవేదం 7.42.2

వేదవిద్య గురించి

ఒకటి, రెండు లేక నాలుగు వేదాలు, ఆయుర్వేదం, ధనుర్వేదం, గంధర్వవేదం, అర్థశాస్త్రం, వాటితో పాటు ఇతర విద్యలు, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిష్యము, చంధస్సు మొదలైన 6 వేదాంగాలను చదివి, శుద్ధమైన మనసు కలదైన స్త్రీ, వైవిధ్య భరితమైన ఈ జ్ఞానాన్ని అందరికి పంచాలి - అధర్వణవేదం 7.47.2

స్త్రీలను సనాతనధర్మం బానిసలు చేసింది. వారికి స్వాతంత్రం ఇవ్వలేదు. భర్తకు లోబడి బ్రతకమంది, స్వేచ్చను హరించింది అంటున్నారు. ఋగ్వేదం 10.159, 1 వ అధ్యాయంలో ఉన్న మంత్రార్ధం చూడండి.

సూర్యుడు ఆకాశానంటాడు. నా సౌభాగ్యం, సంతోషం కూడా అధికమయ్యాయి. నిశ్చయంగా నేను నా ప్రత్యర్ధులపై విజయం సాధించి, నా భర్త ప్రేమ తిరిగి పొందాను. నేను తలమానికమైన దానను, అత్యున్నతమైన దానను, నేను నాయకురాలను, ఇప్పుడు శాసిస్తాను. నా భర్త నా ఇష్టానికి అనుగుణంగా ఉండాలి. నాకు ఇప్పుడు ప్రతర్ధులెవరు లేరు. నా కూమరులు శత్రువినాశకులు, నా కుమార్తె సామ్రాజ్ఞి, నేను విజయవంతురాలను. నా మరియు నా భర్త యొక్క ప్రేమకు విస్తృత కీర్తి ఉంది. ఓ జ్ఞాని! జ్ఞానమును కలిగించువాడా! అత్యంత ప్రసిద్ధము, ప్రఖ్యాతమైన హవిస్సును నేను నీకు అర్పించాను. నా ప్రత్యర్ధుల కత్తుల నుంచి విముక్తి పొందాను. నేను ప్రత్యర్ధులను జయించాను. నేనిప్పుడు శత్రువినాశినిని, విజయను, దిగ్విజయను. ఇతరులకు అనర్హమైన కీర్తిని గడించాను. నేను వీరుడైన ప్రత్యర్ధిని జయించడమే కాక, అతని ప్రజలపై పట్టు సాధించాను. (ఇది వీరురాలైన స్త్రీ చెప్పిన మాటలు.)

To be continued ........................

ఆర్యసమాజం వారి సౌజన్యంతో 

No comments:

Post a Comment