Monday 8 June 2015

ఆదిశంకర సూక్తి


వ్యాఖ్య : విషయాసక్తి అంటే ప్రపంచంలో ఉండే వస్తువులు, విషయాల మీద వ్యామోహం లేక ఇష్టం, వాటిని పొందాలనే కుతూహలం. దేహాభిమానం అంటే శరీరం మీద వ్యామోహం, శరీరం సుఖాల కోసం తపించడం, నేనే శరీరాన్నని భావించడం, ఈ శరీరం ఎప్పటికి ఉంటుందని భావించడం. ఆత్మ అంటే నువ్వే. నిన్ను నువ్వు శరీరం అనుకోవడం వల్ల దాని కోసం తపించి, ఆత్మను ఎరుగక ఇన్ని జన్మలు ఎత్తవలసి వస్తోంది. విషయవాంఛలు/కోరికల వలన సంస్కారాలు, వాసనలు బలపడి మోక్షానికి దూరమవుతున్నావు. ఆత్మను తెలుసుకోవాలనుకుంటే వీటి మీద ఆసక్తి వదులు అంటున్నారు ఆదిశంకరులు. అదేం కుదరదు! నేనేమీ వదలను అంటావా - మొసలని దుంగ (చెట్టు కొమ్మలాంటిది) గా భావించి, దాని మీద కూర్చుని నదిని దాటడానికి ప్రయత్నించడం లాంటిది అంటున్నారు. అనగా నీకు తెలియదు, కానీ ఎప్పుడో తప్పకుండా ఆ మొసలి నిన్ను మింగేస్తుంది. మొదటికే ప్రమాదం వస్తుంది. కాబట్టి ఆత్మను తెలుసుకోవాలనుకున్నప్పుడు కోరికలను తగ్గించుకో. నేను శరీరం కాదు అనే స్థిరమైన భావనలో ఉండు.

No comments:

Post a Comment