Wednesday 16 March 2016

దేశం మేలు కోరే ప్రతి భారతీయుడు చదవాల్సిన పుస్తకం

యూరోపులో 16 వ శతాబ్దంలో మొదలైన భారతదేశ అధ్యయనం 19 వ శతాబ్దం నాటికి తన విషపడగ విప్పడం మొదలు పెట్టింది, భారతదేశాన్ని అస్థిరపరచడం, అసలు భారతదేశమే లేదని చెప్పడం, సనాతనధర్మాన్ని నశింపజేయడం, ధర్మంలోని అంశాలను క్రైస్తవీకరించడం, ప్రత్యేక అస్థిత్వవాదాలను ప్రోత్సహించడం, విఛ్ఛినకర సాహిత్యాన్ని అందించడం వంటి అనేక ప్రయత్నాలు జరిగాయి. స్వాతంత్రం వచ్చే వరకు బ్రిటన్ కేంద్రంగా సాగిన ఈ కుట్ర, స్వాతంత్రానంతరం అమెరికా కేంద్రంగా ప్రారంభమైంది. భారతదేశాన్ని అస్థిరపరచడంలో తమ వంతు ప్రణాలికలను పక్కగా అమలు చేసి చాలా వరకు విజయం సాధించాయి విఛ్ఛినకర శక్తులు. ఈ శక్తుల చేతిలో భారతీయులే పావులై దేశాన్ని విఛ్ఛినం చేయాలని కంకణం కట్టుకున్నారు. అటువంటి అనేక కుట్రలను బట్టబయలు చేసిందీ పుస్తకం. విఛ్ఛినకర శక్తులు ఏవీ? వాటికి ఎక్కడి నుంచి సహాయం అందుతుంది? అవి ఎలా పని చేస్తాయి? మనం వాటిని ఎలా అనుసరిస్తూ, మనకు తెలియకుండానే దేశానికి విఘాతం కలిగితున్నామో ఈ పుస్తకం చదివితే అర్దమవుతుంది. ఈ అంశంపై రాజీవ్ మల్హోత్రా గారు 5 ఏళ్ళు పరిశోధించి, వారి జీవితాన్ని పణంగా పెట్టి, అరవిందన్ నీలకందన్‌తో కలిసి కొద్ది సంవత్సరాల క్రితం Breaking India పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు.. ఇప్పటికే పలు భాషల్లో ఇది అందుబాటులోకి వచ్చింది.. ఈ పుస్తకం తెలుగులో ‘భారత దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు’ పేరుతో ఎమెస్కో వారు ప్రచురించారు.. ఇది ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం.. ప్రధాన పుస్తకాలయాలన్నింటిలోనూ ఇది అందుబాటులో ఉంది..

ఇప్పుడు భారతీయ యువత చదువుకున్నారు, వారు విఛ్ఛినకర శక్తులకు పావులుగా మారరు, వారు చాలా తెలివైనవారని లేదా భారతదేశాన్ని ఎవడు ఏమీ చేయలేడు, ఎవరెన్ని చేసినా ఈ దేశానికి ఏమీ కాదు లాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. సమస్యను తెలుసుకోకుండా, దానికి తగిన విధంగా స్పందించకుండా, ఎవరికి తోచిన విధంగా వారు విమర్శలు చేయడాన్ని వెర్రితనం అంటారు. శరీరంలో జబ్బు ఉంది, అయినా అది లేదని, నాకేం కాదని దాటవేస్తూ కూర్చుంటే ఎప్పుడో పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఇది కూడా అంతే.

ఈ పుస్తకమేదో సంచలనం కోసమో, రెచ్చగొట్టడం కోసమో రాసింది కాదు. విఛ్ఛినకర శక్తులు సమాజంలో ఉన్నాయి. ఈ పుస్తకం చదివిన తర్వతా వారెవరో అర్దమవుతుంది. చదవకుండానే ఇదంతా ట్రాష్ అని తీర్పులివ్వకండి. కొంచం ఓప్పిగ్గా ఈ పుస్తకం చదవండి.

ఇది అందరూ చదవాల్సిన పుస్తకం. ముఖ్యంగా విద్యార్ధులు, తల్లులు. స్కూల్లు, కాలేజీలకు వెళ్ళిన మీ పిల్లలు విఛ్ఛినకర శక్తుల మాయమాటలు నమ్మి రోహిత్, కన్నయ్య కూమార్ లాగా బలి కాకుండా ఉండాలంటే ప్రతి తల్లి ఈ పుస్తకం చదివి, తన పిల్లలను జాగృతం చేయాలి.

No comments:

Post a Comment