Sunday, 3 September 2017

ఇది చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవిలో ఉన్న గణపతిని 56 ముక్కలు చేశారు

చుట్టూ దట్టమైన అడవి. అందులో ఒక ఎత్తైన శిఖరం. దాని మీద పెద్ద గణనాథుడి విగ్రహం. ఇది ఫోటొషాప్ మహిమ కాదు....

ఈ గణపతిని దర్శించాలంటే చత్తీస్‌ఘర్ రష్ట్రంలో దంతేవాడ జిల్లాలోని దోల్‌కల్ కొండ మీదకు వెళ్ళాల్సిందే. అక్కడి నుంచి 14 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళాలి. రోడ్డు మార్గం లేదు. 1100 సంవత్సరాల పూర్వం నాటిదైన ఈ స్వామి మూర్తిని స్థానిక జర్నలిస్ట్ 2012 లో కనుగొన్నారు. ఈ విగ్రహం ఒక్క చిన్న స్థంభం లాంటి కొండ మీద, దాదాపు 13,000 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడికి మాములు మానవుడు నడిచి వెళ్ళడం కూడా అసాధ్యం..... అలాంటిది ఎంతో బరువున్న ఈ విగ్రాహాన్ని అంత ఎత్తున ఎవరు పర్తిష్టించారు, ఎలా ప్రతిష్టించారు అనేది ఇప్పటికీ ఆశ్చర్యకరంగానే ఉంది. పరిశోధనల ప్రకారం నాగవంశీయులు కాలంలో ఈ విగ్రహం ఏర్పాటు అయినట్లు తెలుస్తోంది. దీనికి దగ్గర్లోనే ఎన్నో రాతి ఆయుధాలు దొరికాయి. ఇవి ఇక్కడ నివసించిన ఆదిమానవుడు జీవిత విశేషాలకు నిదర్శనాలని భారత పురావస్తు శాఖ వారు భావిస్తున్నారు.
ఇంత పురాతామైన, వైవిధ్యమైన ఈ స్వామిని భక్తులంతా దర్శించుకోవాలని, తద్వారా ఆ ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధి చెంది, స్థానికులకు ఉపాధి లభిస్తుందని కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం భావించి, ఇక్కడ అభివృద్ధి కోసం 2 కోట్లకు పైగా కేటాయించింది. అయితే ఇది మావోయిష్టుల కీలకప్రాంతం కావడంతో వారికి ఈ అభివృద్ధి గిట్టలేదు. కనీసం హిందువుల మనోభావలు పట్టలేదు. అందుకే ఈ ఏడాది (2017) జనవరి చివరలో, ఈ స్వామి విగ్రహాన్ని ఆ కొండ మీది నుంచి క్రిందకు పడేశారు. దాదాపు 13,000 అడుగుల ఎత్తు నుంచి పడిన ఆ దివ్యశిలా విగ్రహం 56 ముక్కలైంది. ఇది కూడా అక్కడికి వెళ్ళిన ఓ జర్నలిష్టు పరిశీలించినప్పుడు వెళ్ళడైంది. పోలిసు దర్యాప్తు లో ఈ చర్యను సంఘవిద్రోహ శక్తులు చేశాని తేల్చారు. అది మావోయిష్టులో, లేదా అక్కడ పాగా వేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న క్రైస్తవ మిషనరీలో!? .... పురావస్తు శాఖ వారు తెలిపినదాని ప్రకారం, అది 13,000 పై నుంచి క్రిందకు పడినా, విరగకపోతే, తమ ప్రయత్నం వృధా అవుతుందని భావించిన ఆ దుష్టులు, ముందు విగ్రహాన్ని కొన్ని ముక్కలు చేసి, క్రిందకు తోశారట..... చివరకు పురావస్తు శాఖ వారు, స్థానిక గిరిజనులు ఆ ప్రాంతమంతా గాలించి, కళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా ఆ అడవిలో వెతికి, అన్ని ముక్కలను తీసుకువచ్చి, తిరిగి అతికించే ప్రయత్నం చేశారు.

ఎంతో గొప్పదైన ఈ స్వామి మూర్తి అక్కడ ఉండటం ఒక అద్భుతం అనుకుంటే, దాన్ని దుష్టులు భిన్నం చేయడం హృదయ విదారకమైన విషయం.... 

ఇది చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవిలో ఉన్న గణపతి కథ...

No comments:

Post a Comment