Tuesday 5 September 2017

గం బీజంలో గణపతి - బ్రహ్మశ్రీ యణమండ్ర వేణుగోపాలశాస్త్రి గారి వివరణ



గం బీజంలో గణపతి స్వరూపం ఇమిడి ఉంది. విత్తులో చెట్టు బీజరూపంగా ఉన్నప్పుడు చూడలేకపోవచ్చు కానీ బీజములోని దేవతాస్వరూపమును దర్శింపవచ్చును. 
గకారః పూర్వరూపం| అకారో మధ్యమ రూపం|| అనుస్వారశ్చాంత్య రూపం| బిందురుత్తర రూపం| నాదస్సందానం| సమ్హితా సంధిః| సైషా గాణేశి విద్యా|| .... - గణపతి అథర్వశీర్షం.

దేవతా స్వరూపాలన్నీ దేవనాగర స్వరూపములు. అవి చరిత్రకారులు భావించినట్లు మానవులు నిర్మించినవి కావు (అనగా ఊహించినవి, కల్పించినవి కావు). అవి స్వయంభూతములు. దానికి నిదర్శనమే ఇది.

దేవనాగరీలిపిలో 'గ'కారములో వంకర తిరిగిన భాగము తొండము. నిలుపగా ఉన్నది దంతము. ఇది పూర్వరూపము. (గకారః పూర్వరూపం|)
'అ'కారాన్ని అడూగా వ్రాయగా ఉదరం ఏర్పడుతుంది. అనుస్వారను అధోముఖంగా వ్రాయగా కటి నుండి పాదాల అంతము వరకు కల రూపము ఏర్పడుతుంది.
బిందువును సగము చేసి, సగము పూర్వరూపానికి అనుసధానం చేయగా కళ్ళు, చెవులు ఏర్పడతాయి. మిగిలిన సగభాగాన్ని దానికి అధోముఖంగా కలుపగా కపాలముతో కూడిన శిరస్సు ఏర్పడుతుంది. ఇది ఇత్తర ఉత్తరరూపము. మొత్తం కలిపినదే నాదము. విడివడిన స్వరూపము సంహిత. ఇదీ గణపతి విద్యా స్వరూపము. ఈ విధంగా 'గం' బీజంలో దేవాతా స్వరూపం ఇమిడి ఉన్నట్లు రూఢి అవుతున్నది. - (బ్రహ్మశ్రీ యణమండ్ర వేణుగోపాలశాస్త్రి గారి వివరణ నుంచి సేకరణ)

ఇది శాస్త్రీయమైన గణపతి స్వరూపము. గం బీజం ఉచ్ఛరించినప్పుడు, మనకు తెలియకుండానే గణపతి రూపం ప్రకృతిలో ఏర్పడుతోంది. దీన్ని గణక ఋషి దర్శించి లోకానికి అందించారు. 

No comments:

Post a Comment