Sunday 14 January 2018

హిందూ ధర్మం - 257 (Forbidden Archaeology - 3)



ఇంకా మైకిల్ క్రీమో ఇలా చెబుతున్నారు- "'కనుగొనకూడనివి' కనుగొనడం చేత శాస్తవేత్తలు కొన్నిసార్లు వృత్తిపరంగా కష్టాలపాలవుతారు. ఈ కోవకు చెందినవారిలో వ్యక్తిగతంగా నాకు తెలిసిన వ్యక్తుల్లో అమెరికన్ భూగర్భ శాస్త్రవేత్త అయిన  Dr. Virginia Steen-McIntyre ఒకరు. 

1970 పూర్వభాగంలో, కొందరు అమెరికన్ పురాతత్త్వ శాస్త్రజ్ఞులు మెక్సికోలోని Hueyatlaco అనే స్థలంలో, కొన్ని రాతి పనిముట్లు మరియు ఆయుధాలు కనుగొన్నారు. అందులో బాణపు అలుగులు, ఈటెలు ఉన్నాయి. పురావస్తుశాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం, అలాంటి ఆయుధాలను మనలాంటి మానవులు ఉపయోగించారే కానీ ఆదిమానవులు కాదు. Hueyatlaco లో, శిలాకృతులు కందకాల అడుగు పొరల్లో ఉన్నాయి. అవి ఎంత పురాతనమైనవో తెలుసుకోవాలని పురావస్తుశాస్త్రజ్ఞులకు అనిపించింది. పురావస్తుశాస్త్రజ్ఞులకు ఎప్పుడైనా ఏదైనా వస్తువు యొక్క వయస్సు తెలుసుకోవాలనుకున్నప్పుడు, అది చెప్పడానికి సమర్ధన కలిగిన భూగర్భ శాస్త్రవేత్తలను పిలుస్తారు. ఎందుకంటే ఇవి ఉన్న రాయి పొర వయస్సు ఇంత ఉండచ్చు అని వారు మాత్రమే చెప్పగలరు. అలా అక్కడకు వచ్చిన భూగర్భశాస్త్రావేత్తల్లో Dr. Virginia Steen-McIntyre ఒకరు. యూనైటేడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే కు చెందిన ఆ శాస్త్రవేత్తల బృందంఅత్యాధునిక భూగర్భ డేటింగ్ పద్ధతుల ద్వారా పరీక్షలు జరిపి, వాటి వయస్సు 3 లక్షల సంవత్సరాలని తేల్చింది. ఇది చీఫ్ పురావస్తుశాస్త్రజ్ఞునికి అందించగా, ఆయన ఇది అసాధ్యం అన్నారు. 'ప్రామాణిక(?) లెక్కల' ప్రకారం, 3,00,000 ఏళ్ళకు ముందు ఉత్తర అమెరికాలోనే కాదు, అసలు ప్రపంచంలోనే మానవులు లేరు. ప్రస్తుతమున్న 'మతము (Doctrine) (కొందరు సైంటిష్టుల అభిప్రాయము)' ప్రకారం, మానవులు 3 లక్షల ఏళ్ళకు ముందు అమెరికాలోనికి ప్రవేశించనేలేదు. మరైతే ఏం జరిగింది? 3,00,000 ఏళ్ళని ప్రచురించడానికి పురావస్తుశాస్త్రజ్ఞులు అంగీకరించలేదు, అందుకు బదులుగా 20,000 ఏళ్ళని ప్రచురించారు. మరి వాళ్ళకు ఆ కాలప్రమాణం ఎక్కడి నుంచి దొరికినట్లు? ఆ ప్రదేశానికి 5 కిలోమీటర్ల దూరంలో దొరికిన ఒక గుల్ల/ చిప్ప ముక్కను కార్బన్-14 డేట్ చేయడం ద్వారా వచ్చింది.

ఆ ప్రదేశం యొక్క వాస్తవ కాలాన్ని ప్రచారం చేయడానికి Dr. Virginia Steen-McIntyre ఎంతగానో ప్రయత్నించింది. కానీ అందువల్ల ఆమెకు వృత్తిలో చెడ్డపేరు వచ్చింది, విశ్వవిద్యాలయంలో అధ్యాపక స్థానం కోల్పోయింది, యూనైటేడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే ఆమెను నిషేధించింది. (ఎందుకు? సైన్సు పేరుతో ముందే ఏర్పరుచుకున్న కొన్ని నమ్మకాలకు అనుగుణమైన విషయాలను కాక, వాస్తవాలను ప్రచారం చేయబూనినందుకు). చివరకు ఆమె విసిగిపోయి, Colorado లోని రాతి పర్వతాల్లోని (Rocky Mountains) చిన్న పట్టణంలో ఉంటూ,  Forbidden Archeology పుస్తకం కోసం నేను ఆమెను సంప్రదించి, ఆమె పట్ల తగు శ్రద్ధ చూపేవారకు, 10 ఏళ్ళు మౌనంగా జీవించింది. ఇప్పుడు Hueyatlaco  ప్రదేశాన్ని ఎంతో Open-minded పురావస్తుశాస్త్రజ్ఞులు పరిశీలిస్తున్నారంటే అందుకు ఇది కూడా ఒక కారణం. అతిత్వరలోనే ఆమె వెల్లడించిన వాస్తవాలు తిరిగి ఋజువవుతాయని ఆశతో ఉన్నాము.

అంటే Knowledge filters అనే ప్రక్రియ ద్వారా వాస్తవలను ఎలా మరుగున పరుస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. కాబట్టి లక్షల ఏళ్ళ క్రితాం రాముడున్నాడా? మునులు, ఋషులు నివసించారా? పురాణాలను మేము నమ్మాలా? అనే ప్రశ్నలకు సమాధానాలు ఎవరో చెప్పక్కర్లేదని అర్దం చేసుకోవచ్చు.

To be continued...........

No comments:

Post a Comment