Sunday 28 January 2018

హిందూ ధర్మం - 258 (Forbidden Archaeology - 4)



ఎంతో పురాతనమైన రాతి పొరల్లో ఆధునికంగా కనిపించే అస్థిపంజరాల గురించి డార్విన్ శాస్త్రవేత్తలు వింటే, వాళ్ళు ఇలా అంటారు: "ఇందులో రహస్యమేమీ లేదు. కొన్ని వేల ఏళ్ళ క్రితం ఎవరో ఆ ఉపరితలం మీద మరణించి ఉంటారు మరియు అతని మిత్రులు అతడిని, బాగా లోతైన గొయ్యి తీసి పాతిపెట్టి ఉంటారు. దాన్నే మీరు చూసి, ఎంతో పురాతన రాతి పొరల్లో దొరికిన అస్థిపంజరం అంటున్నారు." 

వీటిని సాంకేతికముగా intrusive burial అంటారు. అది జరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఈ అంశంలో, Ragazzoni, నిపుణుడైన భూగర్భశాస్త్రవేత్త,  intrusive burial గురించి బాగా తెలిసి ఉన్నాడు. ఒకవేళ నిజంగా అలాగే పాతిపెట్టి ఉంటే, దానిపైన ఉన్న పొరలు కూడా కదలిపోయేవి. కానీ తవ్వకాల సమయంలో అతను చాలా జాగ్రత్తగా పరిశీలించాడు. మిగితా పై పొరలు, ఏ మాత్రం కదలకుండా, చెక్కుచెదరని విధంగా ఉన్నాయి. అంటే ఆ రాతి పొరలు ఎంత పురాతనమైనవో, ఆ అస్థిపంజరాలు కూడా అంతే పాతవి. అంటే ఈ సంఘటనలో 50 లక్షల సంవత్సరాలన్నమాట.

20 వ శతాబ్దం మొదటి భాగంలో, బెలిజియన్ భూగర్భశాస్త్రజ్ఞుడు A. Rutot, తన దేశంలో కొన్ని ఆసక్తికర పరిశోధనలు చేశాడు. 3 కోట్ల వయస్సు కలిగిన రాతిపొరల్లో ఆయన కొన్ని రాతి పనిముట్లు మరియు ఆయుధాలు కనుగొన్నాడు. కాలిఫోర్నియా బంగారు గనుల విషయంలో నేను చెప్పాను కదా. కొన్నిసార్లు పురాతన వస్తువులను వీక్షించే అవకాశం ఇవ్వరని. కానీ ఇక్కడ మేము పురాతన అవశేషాలు చూడగలిగాము. ఒకసారి నేను కొన్ని పత్రికల ఇంటర్‌వ్యూల కోసం బ్రుస్సెల్స్‌లో ఉన్నప్పుడు, Royal Museum of Natural Sciences కు తీసుకెళ్ళమని నా మిత్రునకు చెప్పాను. ఎందుకంటే అక్కడ Rutot’s collection ఉంటుందేమోనని. అక్కడి మ్యూజియం అధికారులతో మాట్లాడినప్పుడు, ముందు వారికి తెలియదని సమాధానం చెప్పినా, ఆ వస్తువుల గురించి తెలిసిన ఒక పురావస్తుశాస్త్రజ్ఞుని పట్టుకోగలిగాము. కానీ అక్కడి వస్తువులను జనాలకు ప్రదర్శించరు. అతను మమ్మల్ని ఆ మ్యూజియంలోని స్టొర్ రూంకు తీసుకెళ్ళగా, అక్కడే బెల్జియంలో దొరికిన 3 కోట్ల ఏళ్ళ పూర్వం నాటి పనిముట్లు మరియు ఆయుధాలను ఫోటో తీసుకున్నాను. ఇప్పటివరకు professional scientists గురించి చెప్పుకున్నాము. కానీ భూమి పొరల్లో ఉన్న పురాతన మానవ అవశేషాల మీద పరిశోధన చేసిన ఇతర వ్యక్తులకు ఏదైనా ఋజువు దొరికితే, అవి సైంటిఫిక్ జర్నల్స్ లో ప్రచురించబడవు కానీ సాధారణ సాహిత్యంలో కనిపిస్తాయి.

Morrisonville అనే పట్టణంలో 1892 లో, Morrisonville Times పత్రికలో ప్రచురించబడిన అలాంటి ఆసక్తికర విషయం ఒకటి చెప్తాను. బొగ్గుపొయ్యిలో వేయడానికి ఒకావిడ పెద్ద బొగ్గు ముక్కను రెండుగా విరచగా, అందులో ఆవిడకు పది ఇంచుల పొడువైన అందమైన బంగారు గొలుసు కనిపించింది. ఆ గొలుసు బొగ్గులో గట్టిగా నిక్షిప్తమై ఉందనడానికి గుర్తుగా బొగ్గు యొక్క రెండు ముక్కలు ఇంకా అతుక్కునే ఉన్నాయి. ఆ వార్తపత్రిక నివేదిక ఆధారంగా ఆ బొగ్గు ఏ గని నుంచి వచ్చిందో తెలుసుకోగలిగాము. Geological Survey of the State of Illinois, ప్రకారం, ఆ గని నుంచి వచ్చిన బొగ్గు వయసు 30 కోట్ల సంవత్సరాలు. అంటే అదే రాష్ట్రంలో దొరికిన మానవ అస్థిపంజరం వయస్సుతో సమానం అన్నమాట.

సైంటిఫిక్ సమాచారం వద్దకు వెళదాము. 1862 లో, The Geologist (volume 5, p 470) అనే  చెప్పిందేమనగా  Macoupin County, Illinois ఉపరితలానికి 90 అడుగుల లోతులో ఒక మానవ అస్థిపంజరం దొరికింది. ఆ నివేదిక ప్రకారం, ఆ అస్థిపంజరం మీద రెండు అడుగుల డట్టమైన, విరగని/చెదరని బలపపుఱాయి ఉంది. Illinois, రాష్ట్రపు ప్రభుత్వ భూగర్భ శాస్త్రజ్ఞుని ప్రకారం నేను తెలుసుకున్నదేమిటంటే, ఆ అస్థిపంజరం కూడా, ఆ బంగారపు గొలుసులాగానే 30 కోట్ల ఏళ్ళ నాటిది. అది కూడా అదే రాష్ట్రంలో దొరికింది.

ఇంకా ఉంది....

No comments:

Post a Comment