Wednesday 11 October 2023

శ్రీదత్త పురాణము (283)

 


వజ్రకవచ భావము


ఓం దత్తాత్రేయుడు సహప్రారకమలంలో ఉండే శిరస్సును రక్షించుగాక. అనసూయ తనయుడు చంద్రమండలమధ్యభాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. (1) మనోమయుడు హం క్షం అనే ద్విదళపద్మభవుడై గడ్డాన్ని రక్షించుగాక. జ్యోతిరూపుడు నా రెండు కన్నులను రక్షించుగాక. శబ్దస్వరూపుడు నా రెండు చెవులనూ కాపాడుగాక (2)


గంధస్వరూపుడు నా నాసికను రక్షించుగాక. రసస్వరూపుడు నా ముఖాన్ని (నోటిని) కాపాడుగాక. వేదస్వరూపుడు నా నాలుకను కాపాడుగాక. ధర్మస్వరూపుడు నా దంతాలనూ రెండు పెదవులనూ కాపాడు గాక. (3) అత్రిభవుడు నా రెండు చెక్కిళ్లనూ రక్షించుగాక. ఆ తత్త్వవేత్త నా ముఖాన్ని అంతటినీ కాపాడుగాక. సర్వస్వరూపుడు, నా ఆత్మ స్వరూపుడు షోడశార (పదహారు రేకుల) కమలంలో ఉండి నా కంఠాన్ని రక్షించుగాక. (4) చంద్రానుజుడు నా భుజశిరస్సులను రక్షించుగాక. కృతాదిభవుడు నా భుజాలను రెండింటినీ కాపాడుగాక. శత్రుజిత్తు కొంకులు రెంటినీ రక్షించుగాక. హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. (5) కకారం మొదలు రకారం వరకూ కల ద్వాదశారకమలంలో ఉన్న మరుత్ (వాయు) స్వరూపుడు యోగీశ్వరేశ్వరుడు హృదయంలో ఉండి హృదయాన్ని రక్షించుగాక. (6) పార్శ స్థితుడనబడిన హరి పార్శ్యాలలో ఉంటూ పార్శ్వాలను, హఠయోగాది యోగజ్ఞుడు, కృపానిధి కుక్షినీ రక్షించుగాక. (7) నాభిస్థలంలోని డకారాది ఫకారాంతం కల దశారకమలంలో ఉండే అగ్ని స్వరూపుడు నాభిని కాపాడుగాక. (8) వహ్నితత్త్వమయుడయిన యోగి మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలో ఉన్న బ్రహ్మాండ వాసుదేవస్వరూపుడు నా కటిని కాపాడుగాక. (9) వకారాది అకారాంతమైన పట్పత్రకమలాన్ని వికసింపజేసే జలతత్త్వమయుడైన యోగి నా స్వాధిష్టానచక్రాన్ని రక్షించుగాక. (10) సిద్ధాసనంతో కూర్చున్న సిద్దేశ్వరుడు నా రెండు ఊరువులనూ కాపాడు గాక. వకారాది సకారాంతమైన నాలుగు రేకులకమలాన్ని వికసింపజేసే (11) మహీ (= భామి) రూపుడయిని వీర్యనిగ్రహశాలి, మోకాళ్ళపై హస్తపద్మాలు పెట్టుకొనిన వాడు నా మూలాధార చక్రాన్నీ, అన్ని వైపుల నుంచి పృష్టాన్నీ రక్షించుగాక. (12) అవధూతేంద్రుడు నా రెండు పిక్కలనూ కాపాడుగాక. తీర్ధపావనుడు నా రెండు పాదాలనూ రక్షించుగాకు సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక. కేశవుడు నా రోమాలను రక్షించుగాక. (13) చర్మాంబరుడు నా చర్మాన్ని కాపాడుగాక, భక్తిప్రియుడు నా రక్తాన్ని రక్షించుగాక. మాంసకరుడు నా మాంసాన్ని కాపాడుగాక.


మజ్జాస్వరూపుడు నా మజ్జను రక్షించుగాక. (14) స్థిరధీ (= స్థిరబుద్ధికలవాడు) నా అస్థులను కాపాడుగాక. వేధ నా మేధను పాలించుగాక, సుఖకరుడు నా శుక్రాన్ని రక్షించుగాక, దృడాకృతి నా చిత్తాన్ని కాపాడుగాక, (15) హృషీకేశాత్మకుడు నా మనస్సుమా బుద్ధినీ అహంకారాన్నీ పాలించుగాక. ఈశుడు నా కర్మేద్రియాలను రక్షించుగాక. అజుడు నా జ్ఞానేంద్రియాలను కాపాడుగాక, (16) 


No comments:

Post a Comment