Thursday 19 October 2023

శ్రీదత్త పురాణము (291)

 


కుండలినీ జాగరణము


ఇది మనలోనున్న ప్రాణశక్తి, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియములను, మనోబుద్ధులను, శరీరమందలి ప్రతి అణువును సజీవముగ నుంచునదీశక్తియె.


పెదిమలు కదుపకుండ ఓంకారనాదమును మూలాధారమునుండి వెన్ను పూసల మధ్యగా వ్యాపించియున్న సుషుమ్నానాడి ద్వారా శిరస్సు వరకు ప్రసరింపజేయుము. 10 సారులు చేయుసరికి ప్రాణశక్తి ఇంద్రియములను విడిచి సుషుమ్నా మార్గమును చేరును. శ్వాసక్రియ హృదయ స్పందనము అతి నెమ్మదిగా జరుగును. కుండలినీ శక్తిని ఈ విధముగా ధ్యానించవలెను.


"ఉత్తిష్ఠ హే జగన్మాతా ! సర్వమంగళ దేవతే 

భక్తహృన్మందిరోపేతే ! సర్వసిద్ధి ప్రదాన్వితే ! 

ఐం నమః ! శ్రీమహాకాళ్వై ! మహాశకై నమోనమః 

మూలధారస్థితాయై శ్రీ కుండలీశ క్తయేనమః 

ఆరోహయ మహాకాళీ మమ మాతర్మహేశ్వరీ 

మూలాధారస్థితే చక్రే ఉపవిశ్య సుఖాసనే 

మయా దత్తమిమాం పూజాం గృహాణ పరమేశ్వరీ 

దుర్వాసన సమూహాంశ్చ భస్మీకురు కృపామతే! 

సుషుమ్నానాడి మధ్యస్తే స్వాధిష్ఠానాఖ్య వారిజే

ఆసీనాభవ మే మాతా సర్వాలంకార శోభితే 

త్వత్పాదాంభోరుహ ద్వంద్వే మేస్తు భక్తిరహైతుకం

దేహిమే దృఢవైరాగ్యం ఆద్వైతావలోకనం! 

శనైశ్శనై రుపరిమేగత్వా మణిపూరక వారిజే 

నాభిస్థాన పురం సంస్థం సుందరం సువిరాజితం 

తత్ర స్థిత్వా సుప్రసన్నా వరదాభవ శాంకరీ 

దూరీకురు ప్రమాదంచ శోక మోహభయానిచ 

అనాహతాజ్ఞ నిలయే యత్తిష్ఠిత్వా హరప్రియే   

ఛిందిసర్వాంశ్చ హృద్గ్రాంధిం కర్మబీజాని దాహయన్ 

క్షమస్వమాతర్హి మహాపచారాన్ కృతాన్ వాక్కరణైః సమస్తాన్ 

కృపాకటాక్షాణి ప్రసారయత్వా రక్షస్వమాంత్వచ్చరణం ప్రసన్నం

కంఠదేశ విరజత్స్వా విశుద్ధాహ్వయ పంకజం 

ఉపగమ్యపరాదేవి దేహివుత్రాయ సన్నిధిమ్

ప్రదర్శయ స్వతేజోమే స్వప్రకాశ స్వరూపిణీమ్ 

ప్రతిష్ఠాపయ మేవాచీతవనామ నిరంతరం 

ఆజ్ఞాపత్రే వివరేకమలే ఆరూఢయ జగదంబమదంబా 

ముక్తికవాటం దర్శయ పాలయమాం తవపుత్రమజస్రం 

శుద్ధ సత్వాత్మికే దేవి బ్రహ్మవిద్యాస్వరూపిణి 

ప్రవేశయ కృపాపూర్ణే సమ్యక్ భిక్ ఊర్ధ్వకుండలీం

సుషుమ్నాంత సహస్రారం నిరావరణసంజ్ఞికం  

కోటిసూర్య ప్రకాశంచ సహస్రదళ సంయుతం 

దహరాగ్రే పుండరికే సుఖాసీనా భవేశ్వరి 

ఐక్యమిచ్చామితే మాతా భవత్పాదారవిందయోః 

సాయుజ్యం దేహి పుత్రాయ సారూప్యాతిష్టి తాయచ 

యస్మాత్కరుణయా దేవీ యావన్మే దేహిసంస్థితాః

అహం బ్రహ్మేతి విజ్ఞానమేస్తు నిర్వాణరూపిణి 

జ్ఞ్యాత్వా తమేవాసి జ్ఞానం త్వమేవా 

ద్రష్టాత్వమే వాసి దృశ్యం త్వమేవా 

కర్తానుమంతాచ భోక్తాత్వమేవా 

త్వమేవ నిర్గుణబ్రహ్మ త్వమేవ సగుణేశ్వరీ 

త్వమేవ విశ్వం భువనం త్వమేవాహ నసంశయః 

నాస్తి దేహోన సంసారీ న జీవో నాస్తికర్మణః 

న కర్తాహం న భోక్తాహం నగతి ర్బంధ మోక్షయః 

అహమేవ పరంబ్రహ్మ అహమేవాస్మి జగత్రయం 

అద్వితీయోహ్యనంతోహం పచ్చిదానంద మస్మ్యహం

మంగళం శ్రీమహాకాళీ మహావాణీచ మంగళం

మంగళం శ్రీమహాలక్ష్మీ మంగళం శ్రీశివాత్మికే


పై విధముగా కుండలినీశక్తి సహస్రారకమలమును భావనాపటిమతో చేర్చి అచ్చట స్రవించు చల్లని అమృతధారలతో తృప్తినొందినట్లు భావించి మరల తన స్వస్థానమగు మూలాధారచక్రమునకు నిదానముగా క్రిందికి దిగుచు మార్గములోనున్న చక్రములను, చక్రదేవతలను అచ్చటి ధాతువులను అమృతమయముగా జేసినట్లు భావించి అనుభూతమగు పరమశాంతితో కొద్దికాలము విశ్రమించవలెను.

No comments:

Post a Comment