Friday 20 October 2023

శ్రీదత్త పురాణము (292)

 


తరువాత దత్తాత్రేయుని ధ్యానించి :


శ్లో॥ దత్తాత్రేయం త్రిమూర్తిం హృదయమయ మహాపద్మ యంత్రాధిరూడం 

శంఖం చక్రం త్రిశూలం డమరుక కలశావక్షమాలా త్త ముద్రాం 

షడ్భిర్డోద దానం స్ఫటికమణినిభం షట్జటాబంధమౌళిం 

సర్వాలంకారయుక్తం భజిత మధుమతే మోక్షలక్ష్మీసమేతం  


ధ్యానము తరువాత దత్తగాయత్రిని కనీసము 10 సారులు జపించవలెను.


దత్తగాయత్రి: దత్తాత్రేయాయ విద్మహే గాయత్రీశాయ ధీమహి ! 

తన్నో గురుః ప్రచోదయాత్ ||


దత్త గాయత్రిని జపించిన తరువాత "హంస" స్వరూపునిగ దత్తదేవుని ధ్యానించవలెను.


దత్తాత్రేయ సుప్రభాతము


1. నీవు సర్వేశ్వరుడవు నీవు సిద్ధ 

పురుషుడవు, నీవు త్రిజగతి పోషకుడవు 

జ్ఞానదీప్తుల మోహంబు సడలజేయు 

యోగనిద్రను విడుపుము జగము బ్రోవ


2. యోగి పుంగవులకు నిద్ర యుండ దేవుడు 

యోగవిదుడవు యోగీశ్వరేశ్వరుడవు 

జ్ఞానదీప్తుల మోహంబు సడల జేయు 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ,


3. నిద్రగాదది చిన్మయముద్రగాని 

లయము విక్షేపమును మనో గ్లాని పరమ 

యోగసిద్ధుండవయిన నీ కుండునయ్య 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


4. ధర్మమార్గము చెడకుండ తత్ జ్ఞాలకును 

బాధ లేకుండ, దౌష్ట్యమే పారకుండ 

మూడులోకాల నీవు కాపాడవలదె 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ,


5. తుంబురుడు కళావతి నారదుండు మహతి 

వాణి కచ్చపి బృహతి విశ్వాసనుండు 

పట్టుకొని గీతి విన్పింప వచ్చినారు

యోగనిద్రను విడుపుము జగము బ్రోవ.


6. నలుమొగంబుల స్వామికి తొలిచదువులు 

విస్మృతిపథాన పడెనట విన్నవించు 

కొనగ నరుగుదెంచి యరుగుపై గూరుచుండె 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


7. పరులు తమ్మంటకుండెడు కొఱకు నాల్గు 

వేదములు శ్వాసరూపముల్ వెలుగుచుండ 

మోరలెత్తి నీ నలెసల్ చేరియుండె 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


8. ఫలములను పత్రముల, నవ పల్లవముల 

సుమముల సమిత్కుశాది వస్తువుల గొంచు 

నందనవన దేవత వచ్చినది మహాత్మ 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


9. హోమకృత్యంబు నీవు చేయుదు పటంచు 

వలయు పరికరముల తోడవహ్ని వచ్చి 

వేచియున్నాడు స్వామి నివేళ్ళమందు 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


10. వరుణదేవు, కుదకపాత్ర పట్టె రత్న 

పాదుకాయుగమును స్వర్గపతి ధరించె 

తెరువుసూప కుబేరు డేతెంచియుండె 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


11. ప్రాగ్దిశాంగన కాషాయవస్త్ర మొండు 

శ్వేతచీనాంశుకం బొండు చేత బట్టి 

వలసినది నీ కొసంగగా నిలచియుండె 

యోగనిద్రము విడువుము జగము బ్రోవ.


12. వసుమతీజములన్ వనస్పతులు మిన్న 

అందు నౌదుంబరమ్ము నీ కభిమతంబు 

దానికడ వేచియుండెను తాపసాళి 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


13. ఓ మహాత్మ! వేదాంత! ఓ స్వామి దత్త 

అనుపమ శ్రీదయాంతరంగ 

అత్రివాచం యమీంద్ర భాగ్యముల పంట 

యోగనిద్రను విడువుము జగము బ్రోవ.


14. యోగిరాజ మహాదేవ ప్రత్యూష స్సంప్రవర్తతే 

ఉత్తిష్ఠ యోగ యోగీశ భక్తానామభయం కురు.


15. ఉత్తిష్టోత్తిష్ఠ దత్తేశ ఉత్తిష్ఠ కరుణాకర 

ఉత్తిష్ఠ గురుదత్తాత్మన్ త్రైలోక్యం మంగళం కురు.


16. ఉత్తిష్ఠ సిద్ధి సమలంకృతపాదపద్మ 

ఉత్తిష్ఠ భక్తహృదయాంబుజ రాజహంస 

ఉత్తిష్ఠ బ్రహ్మవివాదా ప్రతిభా ప్రమోద 

ఏహ్యేహి దత్తహృదయే కురు సుప్రభాతమ్ ॥


¬17. మహ్యం ప్రదేహి తపసా పరచిత్తశుద్ధిం 

మహ్యం ప్రదేహి మనసా పరయోగసిద్ధిం 

మహ్యం ప్రదేహి త్రిపురాపరభావశుద్ధం 

ఏహ్యేహి దత్త హృదయే కురు సుప్రభాతం॥


No comments:

Post a Comment