Showing posts with label శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం. Show all posts
Showing posts with label శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం. Show all posts

Friday, 27 December 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - వేంకటాచలంలో శ్రీనివాసుడు

అలా అగస్త్యుని ఆశ్రమంలో ఉన్న శ్రీనివాసునికి నారాయణపురం నుంచి ఆకాశరాజుకు ఆరోగ్యం క్షీణించిందని, మరణానికి చేరువలో ఉన్నాడని కబురు వస్తుంది. వెంటనే పద్మావతీదేవితో శ్రీనివాసుడు నారాయణపురం బయలుదేరతాడు. తన తమ్ముడు తొండమానుడిని, కొడుకు వసుదను కాపాడమని కోరిన ఆకాశరాజు, శ్రీన్వాసునికి చివరిసారిగా నమస్కరించి పరమపదానికి చేరుకుంటాడు. ఆయన మరణం తరువాత యధావిధిగా దహనసంస్కారాలు పూర్తి చేశాక, పెట్టిన శ్రాద్ధభోజనానికి భోక్తలుగా వశిష్ఠుడు, అగస్త్యుడు మొదలైన మహర్షులు కూర్చుంటారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తరువాత, శ్రీనివాసుడు, పద్మావతీదేవి, వకుళమాత, అగస్త్యుడు తిరిగి ఆశ్రమానికి చేరుకుంటారు.

ఆకాశరాజు మరణంతో రాజ్యం ఎవరికి చెందాలన్న వివాదం వస్తుంది. రాజుకు తమ్ముడిని కనుక తనకే చెందాలని తొండమానుడు అంటే, కాదు కాదు, మా నాన్న శౌర్యపరాక్రమాలతో జయించిన రాజ్యం కొడుకునైన నాకే చెందాలని వసుద వాదిస్తాడు. ఇద్దరి మధ్య వివాదం పెరిగి, యిద్ధానికి సిద్ధపడతారు. యిద్ధంలో గెలిచినవారిదే రాజ్యం అన్న ఒప్పందానికి వచ్చారు. ఇద్దరూ తమతమ సైన్యాలను సిద్ధం చేసుకున్నారు. నారాయణపురానికి దక్షిణంలో యుద్ధం.

ఇద్దరూ శ్రీనివాసుని వద్ద సాయాం కొరడానికి వస్తారు. నేను ఒక్కడినే, ఇద్దరికి ఎలా సహాయపడగలను అనె సందిగ్ధంలో పడి, పద్మావతీదేవిని అడుగుతారు. నేను ఒక్కడినే ఉన్నాను, ఇద్దరూ నాకు కావలసినవారే కదా, ఎవరికి సాయపడమంటావ్? చెప్పు అంటూ పద్మావతీదేవిని అడుగగా, నా తమ్ముడు చిన్నవాడు, ఒంటరివాడు, తండ్రి లేనివాడు, నా పినతండ్రి ఒకరి సహాయపడే శక్తి ఉన్నవాడు, తనని తాను రక్షించుకోగలడు, కనుక వసుదకు సహాయపడడమే ఉచితం అంటుంది. పద్మావతీదేవి చెప్పినదే ఉచితం అని తలచిన స్వామి వసుదకు సాయం చేద్దాం అని నిశ్చయించుకుంటాడు. కానీ భక్తుడిని కాపాడడం భగవంతుని బాధ్యత. అందుకే భక్తుడైన తొండమానుడి రక్షణ కోసం తన శంఖుచక్రాలను తొండమానుడికి ఇచ్చేస్తాడు.

అందరూ యుద్ధభూమికి చేరుకుంటారు. శ్రీనివాసుడు వదిలి బాణాలకు తొండమానుడి రధమూ, గుర్రాలు నాశనమవుతాయి. తన సైన్యం కూడా నశించిపోతుంది. ఇది చూడలేని తొండమానుడు, శ్రీనివాసుడిచ్చిన సుదర్శన చక్రాన్ని వసుదపైకి విసరగా, వసుదను రక్షించడానికి అడ్డం వెళతాడు శ్రీనివాసుదు. చక్రం వచ్చి శ్రీనివాసుడి భుజానికి తగిలి గాయం అవుతుంది. వెంటనే శ్రీనివాసుడు మూర్చిల్లుతాడు (కళ్ళు తిరిగి కిందపడిపోతాడు). ఈ యుద్ధానికి అంతరిక్షం నుంచి చూస్తున్న దేవతలు, భగవంతుడు మూర్చిల్లడం చూసి ఆశ్చర్యపోతాడు.



దీంతో ఇరుపక్షాలు యుద్ధం ఆపేసి శ్రీనివాసుడికి పరిచర్యలు చేయడంలో కాసేపు మునిగిపోతారు. ఈ విషయం చారుల ద్వారా తెలుసుకున్న పద్మావతీదేవి పరుగుపరుగున అగస్త్యమునితో కలిసి యుద్ధభూమికి వస్తుంది. శ్రీనివాసుని ముఖంపై నీరు చల్లి స్పృహ వచ్చేలా చేస్తుంది. స్ఫృహ వచ్చిన శ్రినివాసుడు 'నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీకీ యుద్ధభూమిలో పనేంటీ?' అని పద్మావతీదేవ్ని కోపగించుకుంటాడు. అహస్త్యుడు కలుగజేసుకుని ఇరు వర్గాలకు సంధి చేయడానికి పద్మావతీదేవి వచ్చిందని చెప్పి సమాధానమిస్తాడు. 'స్వామి మీ భక్తులను మీరే కాపాడండి. ఈ యుద్ధం వల్ల ఒరిగేదేంటి? తొండమానుడు, వసుద, ఇద్దరూ రాజ్యం ఏలడానికి వచ్చారు. ఇద్దరికి రాజ్యం పంచిపెడితే సరిపోతుంది కదా స్వామి' అని పలుకుతుంది. దానికి శ్రీనివాసుడు ఒప్పుకోడు. 'యుద్ధం చేయడం క్షాత్రధర్మం. యుద్ధంలో తొండమానుడిని, అతడి కొడుకును చంపి రాజ్యం వసుదకు వచ్చేట్లు చేస్తాను. లేకుంటే నేను ప్రాణం విడువటానికి సిద్ధపడతాను' అంటాడు పట్టుదలతో. పద్మావతీదేవి ఖిన్నురాలై అగస్త్యుని 'మీరే సర్ధిచెప్పండి నా శ్రీనివాసునికి' అని చెప్తుంది. అగస్త్యుడి ప్రార్ధనతో శాంతపడిన శ్రీనివాసుడు ఇద్దరిని పిలిచి వారి అభిప్రాయం అడుగుతారు. ఇద్దరూ భగవత్భక్తులు కనుక శ్రీనివాసుడు ఎలా చెప్తే అలా చేస్తామంటారు.

తరువాత శ్రీనివాసుడు ధనాగారాన్నీ, సైన్యాన్ని రెండు భాగాలుగా విభజించి తొండనమాడు రాజధానిగా తొండమానుడిని, నారాయణపురం రాజధానిగా వసుదానునికి పట్టాభిషేకం చేస్తాడు. వారి వద్ద కొన్ని రోజులు గడిపి తిరిగి ఆశ్రమానికి చేరుకుంటారు. వసుదానుడు తన అక్కకు అరణంగా తన రాజ్యంలో 16వ వంతు ఇచ్చాడని, అలా పద్మావతీదేవికి 32 గ్రామాలు వచ్చాయని పురాణం చెప్తున్నది.

మరో పురాణం ప్రకారం శ్రీనివాసుడే ఇద్దరితో "నేను మీ కోసం నా ప్రాణాలను సైతం లెక్కచేయక యుద్ధం చేశాను. సంధి కూడా కురిచాను. కనుక మీరిద్దరు నా మీ రాజ్యంలో భాగాలు ఇవ్వాలి" అని అనగా, ఇద్దరూ 16 గ్రామాల చొప్పున 32 గ్రామాలు ఇచ్చారని కనిపిస్తుంది.

 తొండమానుడు మహాభక్తుడు. మొదట శ్రీనివాసుడు తన చుట్టమనీ, మానవమాత్రుడనీ తలచినా, తరువాత జరిగిన సంఘటనలు ఆయనలో శ్రీనివాసుడే మహావిష్ణువు అన్న ఆలోచనలు కలిగించాయి. శ్రీనివాసుని పెళ్ళికి బ్రహ్మ, రుద్రుడు మొదలైన వాళ్ళు రావడం, లక్ష్మీదేవియే వివాహం జరిపించడం, విశ్వకర్మ భవనం నిర్మించడం, శుకుడు, అగస్త్యుడు, వశిస్ఠుడు లాంటి మహామునులు రావడం, శ్రీనివాసుడు తనకు శంఖుచక్రాలు ఇవ్వడం, సుదరశనచక్రానికి అడ్డుపడి వసుదను కాపాడడం, ఇవన్నీ తన బుర్రల్లో గిర్రున తిరిగాయి. అంతే స్వామి మానవుడు కాదు, మానవరూపంలో భూమికి దిగివచ్చిన శ్రీ మహావిష్ణువు అని తెలుసుకున్నాడు. వెంటనే అగస్త్యుని ఆశ్రమం వద్దకు వెళ్ళి ప్రార్ధన చేస్తాడు. 'మహాప్రభో! దేవదేవ! శ్రీనివాసా! నిన్ను ఇనాళ్ళు మానవమాత్రుడు అనుకున్నాను. సృష్టి, స్థితి, లయలను నడిపే పరబ్రహ్మవని గుర్తించలేకపోయాను. ఈ జీవితం నీటిపై బుడగలాంటిది. అటువంటి ఈ జీవితంలో నిన్ను సేవించడమే పరమలక్ష్యం. దేవతాసార్వభౌముడవైన నిన్ను మోక్షం అడగడం మరచి, యుద్ధంలో సాయం కోరాను. కానీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఇలా నువ్వే విష్ణువనీ గుర్తించగలిగాను. నన్ను అనుగ్రహించు స్వామి' అని వేడుకున్నాడు.

తన పాదాలపై పడిన తొండమానుడిని పైకి ఎత్తిన శ్రీనివాసుడు, 'నీ భక్తికి మెచ్చాను, నాకు సేవ చేసుకునే భాగ్యం నీకు కలిగిస్తాను. నీ అన్న పద్మావతీదేవితో వివాహం చేసి, నన్ను గృహస్థుడిని చేశాడు. 6 నెలలు కొండ ఎక్కకూడదన్న నా వ్రతం పూర్తి కావస్తోంది. వేంకటాచలం మీద నాకు ఒక ఇల్లు లేదు. కనుక నాకు ఒక ఆలయం కట్టించే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఈ ఘనకార్యం చేసి చరితార్ధుడవి అవ్వు' అని పలికాడు.

రాజా! నాకు తూర్పు దిక్కు ముఖద్వారముతో, రెండు గోపురములతో, మూడు ప్రాకారములతో, ఏడు ద్వారములతో ఉండేట్లుగా ఆలయం నిర్మించు. అందులో ఆస్థాన మండపం, స్వపన మండపం, యాగమండపం, వస్త్రాలగది, బలిపీఠం, ధ్వజస్థంభమూ, సకల సదుపాయాలతో నిర్మించు అని ఆలయ నిర్మాణ పధకం మొత్తం తొండమానుడికి చెప్తాడు వేంకటేశ్వరుడు. నిర్మాణం చేసే సమయంలో ఆలయం ప్రదేశంలో ఉన్న రెండు చింతచెట్లను కాపాడు అంటూ రెండు చింతచెట్లను చూపిస్తాడు. ఎందుకంటే ఈ చింతచెట్లు నాకు రక్షణ కలిగించాయి. కనుక వాటిని ముట్టుకోవద్దు. అలాగే లక్ష్మీదేవికి సంపెగ చెట్టు అంటే ఇష్టం. కనుక దానిని కూడా ముట్టుకోవద్దు. మందిరం నిర్మాణంలో వీటికి హాని కలుగకుండా చూడు. ఆగ్నేయదిశలో పాకశాల నిర్ముంచు.

అట్లాగే దానికి ఎదురుగా భూతీర్ధం ఉన్నది. అది శిధిలావస్థలో పాడబడి ఉన్నది. దానిని కూడా బాగు చేయించి, మంచి రాతికట్టడంతో నిర్మించు. ఈ భూతీర్ధం పూర్వజన్మలో నీవు నిర్మించినదే అని చెప్తాడు.  'నేను నిర్మించినదా? స్వామీ నా పూర్వజన్మ వృతాంతమేమిటి?' అని అడుగుతాడు తొండమానుడు. 'ఈ బావిని నేనెందుకు తవ్వించాను? ఎవరి కోసం చేశాను?' అని అడుగగా, స్వామి ఈ విధంగా చెప్తున్నాడు.

పూర్వం చోళదేశంలో హరిద్రానదీ తీరంలో కృష్ణక్షేత్రంలో వైఖానసుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గోపాలకృష్ణుని భక్తుడు. భగవంతుని ఎప్పుడు ఏ కోరిక కోరకుండా, కేవలం భగవంతుంది ప్రీతి కొరకు మాత్రమే కార్యక్రమాలు చేస్తుండేవాడు. అతడు తనకు మోక్షం కావాలని మాత్రమే వేడుకునేవాడు. ఎంతో తపస్సు చేసి గోపాలకృష్ణుడిని మెప్పించగా, స్వామీ ప్రత్యక్షమై 'వేంకటాద్రి మీద స్వయంవ్యక్తంగా వెలసిన శ్రీనివాసుడే నీకు మోక్షం ప్రసాదించగల దైవం. ఆయన స్వయంగా నారాయణుడు. కలియుగంలో ఈ విధంగా వెలిశాడు. అతడిని సేవించి మోక్షం పొందు' అంటాడు గోపాలకృష్ణుడు.

ఆ శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం పుష్కరిణికి దక్షిణ దిక్కున చింతచెట్టు కింద మోకాలు లోతున పుట్టలో కప్పబడి ఉంది. కృతయుగాంతంలో శంఖరాజుకు ఈ పుష్కరిణి దగ్గరే శ్రీనివాసుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చి, తాను ఎలా కనిపించాడో, అచ్చం అలానే తన విగరహం చెక్కించి, ఆలయం నిర్మించమంటాడు శ్రీనివాసుడు. ఆ శంఖరాజు స్వామీ చెప్పినట్టుగానే చేస్తాడు. అలా కృతయుగంలో కాలక్రమంలో శిధిలమైంది. శ్రీనివాసుని విగ్రగం పుట్టలోకి చేరింది. నువ్వు వేంకాటచలం వెళ్ళి, ఆ విగ్రహాన్ని పుట్టలోంచి తీసి, ప్రతిష్టించి, పూజించి, తరించి మోక్షాన్ని పొందు అని చెప్తాడు గోపాలకృష్ణుడు.

నీవ్వు వేంకాటాచలం వెళ్తున్న సమయంలో, దారిలో నోకి రంగదాసు అనే శూద్రబాలుడు పాండ్యదేశం నుంచి వస్తూ తారసపడతాడు. అతడు కూడా నాకు మహాభక్తుడు. మీరు ఇరువురు కలిసి ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజించాలి. అది మీ వల్లనే కరగాలి. అప్పుడే మీ కోరికలు నెరవేరుతాయి. ఇప్పటి నుంచి నీవు గోపినాధుడనే పేరుతో ప్రసిద్ధుడవు అవుతావు అని చెప్పి గోపాలకృష్ణమూర్తి అదృశ్యమవుతాడు.

కృష్ణుడు చెప్పిన విధంగానే గోపినాధుడు వేంకటాచలానికి పయనమవుతాడు. దారి మధ్యలో సువర్ణముఖినదీ తీరంలో రంగదాసు తారసపడతాడు. ఇద్దరూ సువర్ణముఖి నదీతీరంలో స్నానం చేసి, శుకపురం (తిరుచానూరు) చేరుకుని, బలరామకృష్ణులను ఆలయాన్ని దర్శించి, వారిని సేవించుకుని, తిరుమల కొండకు చేరుతారు.

పూర్వం చోళదేశంలో హరిద్రానదీ తీరంలో కృష్ణక్షేత్రంలో వైఖానసుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గోపాలకృష్ణుని భక్తుడు. భగవంతుని ఎప్పుడు ఏ కోరిక కోరకుండా, కేవలం భగవంతుంది ప్రీతి కొరకు మాత్రమే కార్యక్రమాలు చేస్తుండేవాడు. అతడు తనకు మోక్షం కావాలని మాత్రమే వేడుకునేవాడు. ఎంతో తపస్సు చేసి గోపాలకృష్ణుడిని మెప్పించగా, స్వామీ ప్రత్యక్షమై 'వేంకటాద్రి మీద స్వయంవ్యక్తంగా వెలసిన శ్రీనివాసుడే నీకు మోక్షం ప్రసాదించగల దైవం. ఆయన స్వయంగా నారాయణుడు. కలియుగంలో ఈ విధంగా వెలిశాడు. అతడిని సేవించి మోక్షం పొందు' అంటాడు గోపాలకృష్ణుడు.

ఆ శ్రీనివాసుని దివ్యమంగళ విగ్రహం పుష్కరిణికి దక్షిణ దిక్కున చింతచెట్టు కింద మోకాలు లోతున పుట్టలో కప్పబడి ఉంది. కృతయుగాంతంలో శంఖరాజుకు ఈ పుష్కరిణి దగ్గరే శ్రీనివాసుడు ప్రత్యక్షమై దర్శనమిచ్చి, తాను ఎలా కనిపించాడో, అచ్చం అలానే తన విగరహం చెక్కించి, ఆలయం నిర్మించమంటాడు శ్రీనివాసుడు. ఆ శంఖరాజు స్వామీ చెప్పినట్టుగానే చేస్తాడు. అలా కృతయుగంలో కాలక్రమంలో శిధిలమైంది. శ్రీనివాసుని విగ్రగం పుట్టలోకి చేరింది. నువ్వు వేంకాటచలం వెళ్ళి, ఆ విగ్రహాన్ని పుట్టలోంచి తీసి, ప్రతిష్టించి, పూజించి, తరించి మోక్షాన్ని పొందు అని చెప్తాడు గోపాలకృష్ణుడు.

నీవ్వు వేంకాటాచలం వెళ్తున్న సమయంలో, దారిలో నోకి రంగదాసు అనే శూద్రబాలుడు పాండ్యదేశం నుంచి వస్తూ తారసపడతాడు. అతడు కూడా నాకు మహాభక్తుడు. మీరు ఇరువురు కలిసి ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి, పూజించాలి. అది మీ వల్లనే కరగాలి. అప్పుడే మీ కోరికలు నెరవేరుతాయి. ఇప్పటి నుంచి నీవు గోపినాధుడనే పేరుతో ప్రసిద్ధుడవు అవుతావు అని చెప్పి గోపాలకృష్ణమూర్తి అదృశ్యమవుతాడు.

కృష్ణుడు చెప్పిన విధంగానే గోపినాధుడు వేంకటాచలానికి పయనమవుతాడు. దారి మధ్యలో సువర్ణముఖినదీ తీరంలో రంగదాసు తారసపడతాడు. ఇద్దరూ సువర్ణముఖి నదీతీరంలో స్నానం చేసి, శుకపురం (తిరుచానూరు) చేరుకుని, బలరామకృష్ణులను ఆలయాన్ని దర్శించి, వారిని సేవించుకుని, తిరుమల కొండకు చేరుతారు.

 నీ మనసు కామంతో కలత చెందింది. అది నా మాయ వల్లనే జరిగింది. నిలకడలేని మనసుతో సాధన పురోగతి చెందదు. నీ ఈ చేష్టవలన నీ దేహం కూడా కలుషితమైంది. నా పుష్కరిణి దగ్గరే నీ దేహం విడిచిపెట్టు. ఇటువంటి పవిత్రమైన ప్రదేశంలో మరణించడం చేత, నీ పుణ్య కర్మ చేత, గొప్ప రాజ వంశంలో జన్మిస్తావు. అనేకమంది భార్యలతో, చాలా డబ్బుతో భోగం అనుభవిస్తావు. చిన్న వయసు నుంచే నాకు భక్తుడవు అవుతావు. నాకు ఆలయం నిర్మించి చరితార్ధుడవు అవుతావు. నీ శరీరాన్ని ఆత్మహత్యతో వదిలిపెట్టకు. మరణ సమయంలో మాత్రమే, స్వామి పుష్కరిణికి చేరుకుని, తుదిశ్వాస విడువు. అంతరవరకు యధావిధిగా, ఇంతకు పూర్వంలాగే నా సేవలో తరించు అని ఆకాశవాణి పలుకుతుంది.

రంగదాసు సుమారు 100 సంవత్సరములు స్వామి కైంకర్యంలో గడిపి, కాలధర్మం ప్రకారం మరణిస్తాడు, తరువాత చంద్ర వంశంలో సుధర్మునికీ, నాగకన్యకూ జన్మిస్తాడు. అతడే తొండమానుడు. ఆకాశరాజు తమ్ముడు. పూర్వ జన్మల వాసనల వల్ల 5 ఏళ్ళ వయసుకే మంచి విష్ణు భక్తుడై, గొప్ప సాధకుడయ్యాడు.

అని చెప్పిన శ్రీనివాసుడు, గత జన్మలో నీవు తవ్వించిన బావే ఈ భూతీర్ధం అని చెప్తాడు. శ్రీనివాసుని ఆదేశం ప్రకారం బావిని శుభ్రం చేయించి, మంచి కట్టడం కట్టించి, తూర్పు ముఖంగా ఆలయం కట్టించి, మంచి శిల్పకళానైపుణ్యం ఉట్టిపడేలా శిల్పాలతో, విమాన వేంకటేశ్వరునితో, బంగారు కలశములతో, విమానంతో ఆలయం కట్టించి, సలక్షణ రీతిలో ఆలయ నిర్మాణం చేయించాడు తొండమానుడు.

శ్రీనివాసుడు ఒక శుభముహూర్తాన, పద్మావతీదేవితో మంగళస్నానం చేసి, ఈ ఆలయంలోకి గృహప్రవేశం చేశాడు. వసుదానుని కుటుంబ సమక్షంలో, ఇతర భక్తులు, మహర్షుల సమక్షంలో, బృహస్పతి, వశిష్టాదుల ఆధ్వర్యంలో ఈ శుభకార్యం జరిగింది. అందరికి ఆనందాన్ని పంచే ఈ గోపురానికి, ఆనందనిలయం అని పేరు వచ్చింది.

వచ్చే యాత్రికుల కోసం ఒక యోజన దూరంలో మెట్లు కట్టించి, కొండ ఎక్కడ సులభం చేశాడు. ఎక్కడిక్కడ విశ్రాంత మండపాలు, చలివేంద్రాలు బావులు నిర్మించాడని పురాణం చెప్తుంది.  

మొదట శ్రీనివాసుడు అందరికి కనిపించే రూపంతో తిరుమల ఆలయంలో ఉండేవారు. అయితే ఒకసారి తొండమానుడి మీద కోపం వస్తుంది. అప్పుడు స్వామీ 'నేను మీకు సులభంగా కనిపించి, దర్శనమిస్తున్నానని, అన్ని చూసుకుంటాననీ ధీమాగా ఉన్నావు. వ్యక్తుడిగా ఉన్న నేను, ఇప్పటి నుంచి అవ్యక్త రూపంతో ఉంటాను' అని సంకల్పించి, విగ్రహరూపంగా మారిపోయారు. తానూ అన్ని గమనిస్తూ ఉంటాననీ, భక్తుల కోరికలు తీరుస్తాననీ, తన దర్శన మాత్రం చేతనే భక్తుల పాపం పరిహారం చేస్తాననీ, కానీ గతంలోలాగా తాను అందరికి కనిపించననీ, శిలా రూపంగా అవతరిస్తాడు. అంటే స్వామి ఇచ్ఛారూపం అది. ఒకరు చెక్కినది కాదు, దేవతలు చేసినది కాదు. ఈ ఆనందనిలయంలో బ్రహ్మదేవుడు రెండు అఖండ జ్యోతులను వెలిగించాడు. అవి కలియుగాంతం వరకు వెలుగుతూనే ఉంటాయి. కలియుగాంతంలో కొండెక్కుతాయి. అప్పుడు కలియుగ దైవం వేంకటేశ్వరుడు తిరుమల నుంచి వైకుంఠానికి తరలిపోతాడు. ఆనందనిలయం అనే విమానం అప్పుడు కూలిపోతుందని, ఆ తర్వాత కృతయుగం ప్రారంభవుతుందని బ్రహ్మదేవుడి సంకల్పం.

ఏడుకొండలవాడా! వేంకటరమణా! గోవిందా గోవిందా!!  

గత కొద్ది రోజులుగా ప్రచురిస్తున్న ఈ కధను విశ్రాంత ఐ.ఏ.ఏస్., పి.వి.ఆర్.కే. ప్రసాదుగారు రాసిన తిరుమల లీలామృతం అనే పుస్తకంలోనిది. ఈ పుస్తకాన్ని ఎమెస్కో వారు ప్రచురించారు. అందులో ఇంకా అనేక విషయాలు ప్రస్తావించారు. ఇన్నాళ్ళు మీ దగ్గరి నుండి ఈ కధ విషయంలో అందుకున్న ప్రశంసలన్నీ వారికే అంకితం.

ఓం నమో వేంకటేశాయ 

Monday, 2 December 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - శ్రీనివాసుని వివాహ వేడుక

ఓం నమో వేంకటేశాయ

మాకు వార్షికం ఇస్తే వస్తాం అంటారు దేవతలు. అంటే పారితోషికం, ఇంగ్లీష్‌లో బోనస్ అన్నమాట. దేవతలకు డబ్బు వార్షికం కాదు, పుణ్యం, జ్ఞానం మొదలైనవి వార్షికం. ప్రతి ఏటా వీటిని బ్రహ్మదేవుడు దేవతలకు ప్రసాదిస్తాడని చెప్తారు. కలికాలంలో మానవులతో ఏదైనా కార్యం చేయలాంటే, వారికి ఎంతో కొంత మూటజెప్పాల్సి ఉంటుంది. అధికశాతం మంది ఏ పని చేస్తున్నా, 'అయితే నాకేంటీ? ఇందులో నాకు లాభమేమిటి?' అన్న ధోరణితోనే చేస్తారు. దానికి సంకేతంగానే ఈ సన్నివేశం.

బ్రహ్మ ఆదేశాల మీద ముక్కోటిదేవతలు కదిలి వస్తారు. గరుడుని వార్తతో యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మునులు, ఋషులు అంతా బయలుదేరతారు. పురాణం ఆ సన్నివేశాన్ని అద్భుతంగా వివరిస్తుంది. బ్రహ్మ పరివారమంతా కలిసి 10 లక్షల మంది ఉంటారు. 3 యోజనాల దూరం ఉంటుంది ఆ గుంపు. వీరు ఒక్కో లోకాన్ని దాటుతున్న సమయంలో, ఆయా లోకాలవారు కూడా వీరిని కలుస్తారు. అందరూ దివ్యతేజో మూర్తులు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలన్నీ ఒక చోట చేరితే ఎలా ఉంటుందో, గుంపుగా వస్తుంటే ఎలా ఉంటుందో, అలా ఉంది సన్నివేశం. ఈ పరివారం మధ్యలో గంధర్వులు గానంచేస్తున్నారు, నాట్యం చేసేవారు నాట్యం చేస్తున్నారు. అందరి ముఖాలలో ఆనందం తాండవిస్తోంది.

వీళ్ళందరి సంగతి అటుంచితే, ఇక్కడ శ్రీనివాసుడికి ఆతృత పెరిగిపోతోంది. ఏంటో, వీళ్ళు ఇంకా రాలేదు, ఎప్పటికి వస్తారో, అసలు బయలుదేరారో లేదో, సమయానికి చేరుకుంటారా? ..... ఇలా ఆయనలో అనేక ఆలోచనలు కలుగుతున్నాయి. బయటకు, లోపలికి తిరుగుతున్నారు. ఇంతలో గరుత్మంతులవారు, ఆదిశేషులవారు బ్రహ్మాది దేవతల ప్రయాణ వివరాలు చెప్తుంటారు. మీరేం కంగారు పడకందీ స్వామి, దేవతలు ఇప్పుడే హిమాలయాలు దాటారనీ, కాసేపాగి, గంగా దాటారనీ, గోదావరీ నదిని దాటి కృష్ణానదిని సమీపించారని చెప్తుంటారు. అంటే ఎప్పటకప్పుడు 'లైవ్ అప్‌డేట్స్' ఇస్తుంటారనమాట.

దేవతలందరితో కలిసి బ్రహ్మ తుంబుర తీర్దం చేరి అక్కడ స్నానం చేసి, అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసుడు ఇక ఆగలేక, ఎదురువెళ్ళి బ్రహ్మదేవుని ఆలింగనం చేసుకుంటాడు. శివుడి తలపై నిమురుతాడు. కొందరికి కరచాలనం చేస్తాడు, కొందరికి చేయి ఊపి, ఇంకొందరిని మందహాసంతో, కొందరికి కనుసైగలతో పలకరిస్తాడు. వాయుదేవుడిని ఆలింగనం చేసుకుంటాడు.

ఇలా ఇంద్రుడు, అగ్ని, యముడు మొదలైన దేవతలందరినీ ఆదరంతో ఆహ్వానిస్తున్న శ్రీనివాసుడు దృష్టి విశ్వకర్మపై పడుతుంది. "ఇంత మంది నా దగ్గరకు వచ్చినా, నువ్వు మాత్రం గర్వంతో దూరంగా ఉన్నావు" అని పలికి, "ఇతనిని విశ్వకర్మ పదివి నుంచి తొలగించి, నా యందు భక్తిప్రపత్తులు కలిగిన వానిని నియమించు" అని ఇంద్రునితో పలుకుతాడు. వర్ధకి అని పేరుగల ఈ విశ్వకర్మ క్షమించమని స్వామి పాదాలపై పడతాడు. మొత్తం వేంకటాచలం అంతా అతిధులతో నిండిపోయింది. ఎక్కడ చూసిన పండుగ వాతావరణం, కోలాహలం, సందడి, ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటున్నారు, దీవెనలు తీసుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. పెళ్ళి కళ వచ్చేసింది వేంకటాచలంలో. ఇంతమంది అతిధులు రావడం ఒక ఎత్తైతే, ఇంతమందికి వసతి భోజన ఏర్పాట్లు చేయడం మరొక ఎత్తు కదా.

అందుకే శ్రీనివాసుడు ఇంద్రునితో "ఇంత మంది దేవతలు, ఋషులు, బ్రాహ్మణులు వచ్చినపుడు వారికి తగిన సదుపాయాలు చేయాలి కదా, అందుకని 50 యోజనాల పొడవు, 30 యోజనాల వెడల్పు గల ఒక మనోహరమైన సభాభవనం ఏర్పాటు చేయమంటాడు. విశ్వకర్మతో క్షణాల్లో అలాంటి భవనం నిర్మాణం చేయిస్తాడు ఇంద్రుడు. ఇంత మంది అతిధులతో మనం నారాయణ వనం వెళితే, అక్కడ విడిది ఏర్పాటు చేయడంలో ఆకాశరాజు గారికి ఇబ్బంది కలగవచ్చు. అక్కడ కూడా విడిది భవనాలు, సభాభవనాలు ఏర్పరచాలి. ఆకాశరాజు వద్దకు విశ్వకర్మను పంపించి, మాట్లాడి తగిన విధంగా నిర్మాణం చేయించి అని ఇంద్రునితో అంటాడు శ్రీనివాసుడు. అలా నారయణవనం సమీపంలో ఒక మహానగర నిర్మాణమే జరుగుతుంది.

బాధ్యత అంతా ఒక్కడే మోయడం కష్టం కనుక, ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పజెప్పాడు శ్రీనివాసుడు. ఋషులకు, మునులకు సదుపాయాలు కల్పించడం శివుడికి, మర్యాదలు, పిలుపుల బాధ్యత షణ్ముకుడికి, వంటావార్పు అగ్నిహోత్రునికీ, నీటి సదుపాయం వరుణునికి, ఆకులుదొన్నెలు తయారీ నవగ్రహాలకు, పాత్రల శుద్ధి (ఒకరకంగా క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ అనుకోండి) వసువులకు, పౌరోహిత్యం వశిష్టునికి, బ్రాహ్మణులకు దానాలిచ్చే బాధ్యత కుబేరునికి, వెలుగుకి (లైటింగ్ అర్రెంజ్మెంట్) చంద్రునికి  అప్పగించారు. బయటకు ఇంతమంది దేవతలు పెళ్ళి పనుల్లో మునిగిపొయినట్టు కనిపించినా, అంత ఒకటే తత్వం. వీళ్ళంతా పరబ్రహ్మం యొక్క ప్రతిరూపాలే. ఒకే భగవంతుడు, అనేక రూపాల్లో, అనేక కార్యాలు చేస్తున్న అద్భుత సన్నివేశం ఇది.

వచ్చిన అతిధులందరికీ స్వాగతం పలికిన స్వామి ఒక్కసారిగా డీలాపడిపోతాడు. ఎందుకో ఎవరికి తెలియదు. కారణం అడిగిన బ్రహ్మతో ' ఎంతమంది వస్తే ఏంటి? నా మహాలక్ష్మీ రానంతవరకు ఎవరూ రానట్లే ' అంటాడు. ఇంకా శ్రీనివాసుడు 'ఆమెను ఎవరు పిలుస్తారు? పిలిస్తే వస్తుందా? అంటారేమో, సూర్యుడిని పంపుదాం, సూర్యుడంటే ఆమెకు చాలా అభిమానం, ప్రీతి అని నాకు తెలుసు' అని అంటాడు.

ఈ విషయం విన్న సూర్యుడు భయంతో ఒణికిపోతాడు. పెద్దల వ్యవహారం, అందునా భార్యాభర్తల మధ్య తగాదా, ఏమంటే ఏమవుతుందో, అసలేం జరుగుతుందో అని తన భయాన్ని వ్యక్తం చేస్తాడు. తన మాట విని విష్ణుమూర్తితో ప్రణయకలహం ఆడిన లక్ష్మీదేవి తిరిగి వస్తుందన్న నమ్మకం సూర్యునికి ఏ మాత్రం లేదు. సూర్యుడి మాట విన్న శ్రీనివాసుడు 'నువ్వెళ్ళి పిలిస్తే తప్పక వస్తుంది' అంటాడు. వెళ్ళడం తప్పదు అనుకున్న సూర్య్డు ఏం చెప్పాలని నసుగుతాడు.

నాకు అనారోగ్యం చేసిందని చెప్పు. ఒక చేయి బ్రహ్మపైన, మరొక చేయి శివుడి పైన వేసి, ఎంతో కష్టపడితే కానీ, నడవలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పు అంటాడు శ్రీనివాసుడు. స్వామి దోషరహితుడు, సర్వమంగళకారుడు, నిరామయుడు, ఎటువంటి వికారానికి లోను కానివాడు. అందరి రోగాలను నయం చేసేవాడు, ధన్వంతరీ కూడా ఆయనే, అటువంటి స్వామికి జబ్బు చేయడం అసాధ్యం. లక్ష్మీదేవికి ఈ విషయం తెలుసు. సూర్యుడికి కూడా ఈ అనుమానం వచ్చి 'ఆమె నమ్ముతుందా?' అంటాడు. నా మాయతో ఆమె కూడా మొహితురాలవుతుంది. నువ్వు వెళ్ళిరా అంటాడు శ్రీనివాసుడు.

శ్రీనివాసుడు మాట విన్న సూర్యుడు లక్ష్మీదేవిని తీసుకురావడానికి కరివీరపురం (కొల్హాపూర్) వెళతడు. మొదట ప్రణయకలహ గుర్తుకొచ్చి రానన్న, తరువాత స్వామికి అనారోగ్యం చేసిందనేసరికి పరుగుపరుగున బయలుదేరుతుంది. ఆమెకు నిజం తెలియదా అంటే ............ ఆమె సర్వజ్ఞురాలు, అంతటా వ్యాపించి ఉన్న శక్తి తత్వం, పైగా విష్ణుమూర్తి హృదయంలోనే ఉంటుంది, నిజానికి వారిద్దరికి బేధం కూడా లేదనే చెప్పాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి స్వరూపం. కానీ కలియుగంలో భక్తజనాన్ని అనుగ్రహించడం కోసం, తాము ఆడుతున్న లీలానాటకాన్ని రక్తి కట్టించడం కోసం అమ్మ ఏమి తెలియనట్లు, అబద్ధం నమ్మినట్లు నటించింది.

మొత్తానికి లక్ష్మీదేవి కూడా వేంకటాచలం చేరుకుంది. దాంతో పెళ్ళిపెత్తనమంతా లక్ష్మీదేవిది, వకుళాదేవిది అయ్యింది. పెళ్ళిపనులు చకచకా చేయడం మొదలుపెట్టింది. శ్రీవారి మంగళస్నానానికి ఏర్పాట్లు చేసింది. చక్కగా ముత్తైదువలంతా కలిసి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో, శ్రీనివాసుడి ఒంటికి నూనె పట్టించి, నలుగు పెట్టి హారతి ఇచ్చారు. తరువాత అభ్యంగనస్నానం చేయించి, మళ్ళీ హారతులిచ్చారు. మరీ చల్లటి నీరు పోస్తే జలుబు చేస్తుందేమొ అని భయంతో, 'గోరు వెచ్చటి నీరు మాత్రమే పోయొండమ్మా మా ఆయనకు' అంటూ లక్ష్మీదేవి తన స్వామి పట్ల విశేష శ్రద్ధ తీసుకుంది. అసలే జగన్మోహనాకారుడు, పెళ్ళి కళతో మరింత మెరిసిపోతున్నాడు, దానికితోడు ఈ క్రతువుతో శ్రీనివాసుడు ఎంత అందంగా, సమ్మోహనంగా కనిపిస్తున్నాడో మాటల్లో చెప్పలేం. అందరి కళ్ళు ఆయన మీదే. వైభవంగా మంగళస్నాన ఘట్టం ముగిసింది.

తరువాతి కార్యక్రమం పుణ్యావచహనం, అటు తరువాత కులదేవత స్థాపనం, కులదేవతను పూజించడం. దేవతా సార్వభౌముడైన స్వామికి కులదేవత ఎవరుంటారు? ఇదే పెద్ద సందేహం. దానికి సమాధానం స్వామియే చెప్తారు. 'శమీవృక్షమే మా కులదైవం' అని చెప్పిన స్వామి, కూమారధారలో ఉన్న శమీవృక్షానికి కులదేవత పూజ చేస్తారు. మరి ప్రతిష్ట ఎక్కడ చేయాలని అడుగుగా, వరాహస్వామి వారి నివాస ప్రాంగణంలో చేద్దాం అంటారు. అప్పుడు స్వామికి తాను మర్చిపోయిన ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుకువస్తుంది.

అంతా చేశాం, అంతా పిలిచాం కానీ వరాహస్వామికి ఆహ్వానపత్రిక ఇవ్వడం మరిచాం, పత్రిక సంగతి తరువాత, కనీసం కబురు కూడా చేయలేదన్న సంగతి శ్రీనివాసుడికి గుర్తుకువస్తుంది. స్వయంగా తానే వెళ్ళి వరాహస్వామిని ఆహ్వానిస్తాడు. వరాహస్వామి మాత్రం తాను పని ఒత్తిడి వల్ల పెళ్ళికి హాజరు కాలేనని, తన పంటలపై తరుచూ రాక్షసులు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని, పంటలను కాపాడడం కోసం ఇక్కడే ఉండాలసిన అవసరం ఉంది అని వరాహస్వామి అంటారు. అలాగే తాను ముసలివాడినయ్యానని, ఓపిక లేదని చెప్పి, తన తరుఫున వకుళమాత వస్తుందని చెప్తారు. "మీరు అందరూ వెళ్ళి శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని రండి, నా ఆశీర్వాదం మీ వెంట ఎప్పుడు ఉంటుంది" అంటారు. తరువాత కులదేవత స్థాపన, పూజ ముగుస్తాయి.

ఇక అందరం పెళ్ళికి బయలుదేరుదాం అంటాడు స్వామి. ఇంతలో బ్రహ్మదేవుడు కలుగజేసుకుని ఆక్షేపిస్తాడు. "కులదేవతను ఆహ్వానించి పూజించిన తరువాత అన్నసంతర్పణ చేయకుండా ఎలా వెళతాం? బంధువులు, ఋషులు, బ్రాహ్మణులు, పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు. ప్రయానం చేసి అలసిపోయారు. అందరికి కడుపునిండా తృప్తిగా భోజనాలు పెట్టకా, అప్పుడు బయలుదేరితే బాగుంటుంది" అంటారు.

సమంజసమే కానీ, ఇంతమందికి విందు ఏర్పాటు చేయడానికి నా దగ్గర డబ్బేది? అంటాడు శ్రీనివాసుడు. డబ్బు లేదని చెప్పి పదిమంది ముందు పరువు పోగొట్టుకోమంటామా? డబ్బు లేకపోతే అప్పోసొప్పో చేసైనా శుభకార్యం జరిపంచాలి" అంటాడు శివుడు. తనకు అప్పు ఎవరిస్తారన్నది శ్రీనివాసుడు సందేహం. అలకాపురీ అధిపతి అయిన కుబేరుని పిలిపించండి అంటారు బ్రహ్మ. అలాగే కుబేరుని పిలిపిస్తారు. కుబేరుడు కొంత ఆలస్యంగా రావడంతో శ్రీనివాసుడు మందలిస్తాడు.

అందరి ముందు అప్పు తీసుకుంటే ఏం బాగుంటుందని శ్రీనివాసుడు, కుబేరుడు, బ్రహ్మ, శివుడు కలిసి తిరుమల పుష్కరిణికి పడమర దిక్కున గల అశ్వత్థవృక్షం (రావి చెట్టు) వద్దకు వెళతారు. అక్కడికి వెళ్ళాకా, నాకు కొంచం డబ్బు కావాలి అని అడుగుతారు. "స్వామి, మీరిలా నన్ను అడగడమేమిటి? ఇదంతా మీ ఐశ్వర్యమే. మీ తరుపునే నేనీ ధనాన్ని సంరక్షిస్తున్నాను. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి" అంటాడు కుబేరుడు. యుగధర్మాన్ని అనుసరించి ఇవ్వమంటాడు శ్రీనివాసుడు. కలియుగంలో అప్పుకు పత్రం రాసి, చక్రవడ్డీ కట్టాలనీ, ఇదే కలియుగంలో కనిపిస్తుందని, కనుక ఆ ప్రకారమే పత్రం రాయమని చెప్తాడు కుబేరుడు.

అప్పు ఇస్తాను సరే, నీవు తిరిగి ఇస్తావన్న నమ్మకం ఏంటి? ఇది కలియుగం, కలియుగ ప్రజలు మాట మీద నిల్చునే రకం కాదు. కనుక నీవు నా దగ్గర అప్పు తీసుకున్నట్టుగా సాక్షులు కావాలి అంటాడు కుబేరుడు శ్రీనివాసుడితో. పక్కనే ఉన్న బ్రహ్మ సాక్షి సంతకం పెడతానంటాడు.

బ్రహ్మ విష్ణుమూర్తి కుమారుడు కనుక, పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉన్నదని, అప్పు చెల్లించకుండా మాట మార్చే సమయంలో శ్రీనివాసుడికి సాయం చేయవచ్చునని అనుమానపడి, ఈయన ఒక్కడితోనే కుదరదు అంటాడు కుబేరుడు.

శివుడు సంతకం పెడతానంటాడు. నీవు ఎప్పుడు కైలాసపర్వతం మీద ధ్యానంలో కూర్చుంటావు. నీకు కోపం ఎక్కువంటారు. కోపం తో మూడవకన్ను తెరిచి అంతా బూడిద చేస్తావు. అమ్మో! నీ దగ్గరకు రావాలంటేనే నాకు భయం, కనుక మరొక సాక్షి కావాలి అంటాడు కుబేరుడు.

అప్పుడు తమ పక్కనే ఉన్న ఆ రావి చెట్టు పేరు చెప్తారు. సరే అయితే, నేమి సాక్షి సంతకం పెడతా అంటుంది ఆ రావి చెట్టు. ముగ్గురు సాక్షులు వచ్చారు కనుక, అప్పు పత్రం రాసుకుందాం అంటారు. అప్పు పత్రం ఈ విధంగా రాస్తారు.
అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు. అప్పు ఇచ్చినవాడు కుబేరుడు. అతని వివాహం కొరకు కలియుగంలో, వైశాఖమాస శుక్లపక్ష సప్తమినాడు పదునాలుగు లక్షల రామముద్ర గల సువర్ణ నాణేములు వడ్డీనిచ్చు షరతుతో ఇవ్వబడినవి. వడ్డితో కలిపి మూలము చెల్లించుటకు శ్రీనివాసునిచే అంగీకరించబడినది. వివాహమైన సంవత్సరము నుంచి వెయ్యి సంవత్సరముల తరువాత ఈ మొత్తం ఇవ్వబడును. ఇది కుబేరునికి శ్రీనివాసుడు రాసిచ్చిన అప్పు పత్రం. దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు. రెండవ సాక్షి రుద్రుడు (శివుడు). మూడవ సాక్షి అశ్వత్థరాజము.

అప్పు ఎలా తీరుస్తాడో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్తాడు. 'భవిషత్తులో నా భక్తులు మంచిదో, పాపిష్టిదో, చాలా కానుకలు నా హుండీలో వేస్తారు. ఆ డబ్బుతో నీ అప్పు తీరుస్తాను' అంటాడు. అందరికి అన్నీ ప్రసాదించగలవాడు, కుబేరునికి ధనాధిపత్యం ఇచ్చినవాడు కుబేరుడి దగ్గర అప్పు అడగడం ఒక దివ్యలీల. డబ్బి మీ దగ్గరే ఉంచి, ఖర్చు చెయ్యి అని కుబేరునితో శ్రీనివాసుడు పలుకుతాడు.

ఇదంతా మనకు ఒక సందేశం ఇవ్వడానికి స్వామి ఆడిన దివ్యలీల. ఇంటికి వచ్చిన అతిధులకు సంతృప్తిగా భోజనం పెట్టాలి, పెద్దపెద పూజలు, వ్రతాలు, నోములు చేసినప్పుడు, కులదేవత ఆరాధన చేసినప్పుడు వచ్చిన అతిధులకు తప్పక భోజనం పెట్టి పంపించాలి, తీసుకున్న అప్పు సకాలంలో తీర్చాలి వంటివి అనేకం కనిపిస్తాయి. కుబేరుడు కూడా 'ఇదంతా నీదే స్వామి. ఇదంతా నీవు ప్రసాదించిందే అంటాడు.' ఎవరి దగ్గర ఏ ఐశ్వర్యం ఉన్నా, అది డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, తెలివితేటలు, కళలు, ఇలా ఏవైనా కావచ్చు, ఇవన్నీ ఆయన అనుగ్రహించినవే. అన్నీ ఆయన ఇచ్చినవే కనుక, అహకారం లేకుండా, ఉన్న ధనాన్ని మంచి పనులకు వాడడం వలన దానికి సార్ధకత లభిస్తుంది. ఇదే కుబేరుడి మాటలలోని అంతరార్ధం.

అప్పు అయితే తీసుకున్నాం కానీ, ఇంకా చేయాల్సిన పెళ్ళి పనులు అనేకం ఉన్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తారన్నది శ్రీనివాసుడికి వచ్చిన ఇంకో సందేహం. ఇంతలో శివుడు కలుగజేసుకుని 'ఓ తాతాయ్య! ఆపవయ్యా నీ లీల. ఇక్కడ ఉన్నవారంతా నీ సేవకులే కదా. నీవు ఆజ్ఞ చేయి, అందరూ నీవు చెప్పినట్టుగాన్ చేస్తారు' అంటాడు. విష్ణువు నుంచి బ్రహ్మ ఉద్భవిస్తే, ఆయ్న నుంచి రుద్రులు పుట్టడం వలన, రుద్రుడికి విష్ణువు తాతయ్య అవుతాడు. మరొక రకంగా చూస్తే, శివకేశవులు బావ, బావామరిదులు. కానీ నిజానికి శివుడు అనాది, ఆయన ఎప్పుడు ఉండేవాడు, ఎప్పటికి ఉండేవాడు. శివుకేశవులు ఇద్దరూ ఒక్కటే తత్వం. కాని సృష్టి నడవడం కోసం, వేర్వేరు పాత్రలు పోషిస్తూ, వేర్వేరు రూపాల్లో లీల చూపిస్తున్నారు. అంతే.    

అందరు దేవతలకు వారివారి శక్తినిబట్టి, యోగ్యతను అనుసరించి పని అప్పహించబడింది. వంటపని అంతా అగ్నిదేవునికి, మర్యాదలు, పిలుపులు ఆరుముఖాల షణ్ముఖుడికి (కుమారస్వామికి), వచ్చినవారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం విశ్వకర్మకు, వీటన్నిటికి డబ్బులు సర్దడం కుబేరుని బాధ్యత. పిల్లగాలులు వీస్తూ వచ్చినవారికి ఆహ్లాదం కలిగించడం వాయుదేవుని పని. ఎవరి పనులు వారి చేస్తుంటారు. ఇంతలో అగ్నిదేవుడు, వంట చేయడానికి పాత్రలు లేవంటాడు. నిజమే మీ ఇంట్లో శుభకార్యానికి అయితే అన్నీ ఉంటాయి. నా పెళ్ళికి మాత్రం ఏమీ ఉండవు. అయినా పాత్రలెందుకు, వేంకటాచలం మీదనున్న తీర్ధాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు.

నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వందల్లో వస్తే పెద్దపెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండం అంతా దిగివస్తుంది. కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి. పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్ధాలు తిరుమలలో కొలువై ఉన్నాయి.

ఒక్కో తీర్ధంలో / సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు. స్వామి పుష్కరిణిలో అన్నం, పాపనాశనంలో పప్పు, ఆకాశగంగలో బెల్లం వేసి చేసిన పరమాన్నం, కూరలకు,, నెయ్యి కాచడానికి దేవతీర్ధం, తుబురతీర్ధంలో పులిహోర, కుమార తీర్ధంలో వివధ రకాలైన భక్ష్యాలు (బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు వంటివి), పాండుతీర్ధంలో పులుసు, ఇతర తీర్ధాల్లో లేహ్యాలు మొదలైని తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపిస్తాడు.  

దేవతలందరూ చక్కగా ఆటపాటలతో, కబుర్లతో, భజనలతో, భక్తిపారవశ్యతంతో, తమ ఇఛ్ఛాశక్తి చేత పంచభక్ష్యపరమాన్నాలతో భోజనం సిద్ధమైంది. వంటకాలు గుమగుమలు బ్రహ్మండమంతా వ్యాపిస్తున్నాయి. ఎప్పుడు రుచి చూడాలో అన్న కోరిక పెంచే విధంగా ఉన్నాయి. అంతా సిద్ధం అయిన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు.

"నైవేద్యం పెట్టిన తరువాతే అథిదలందరీకి వడ్డన. నువ్వే భగవంతుండివి, యజ్ఞభోక్తవి, కనుక ముందు నువ్వు భోజనం చేయి" అని శ్రీనివాసునితో బ్రహ్మదేవుడంటాడు. "నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు" అంటాడు స్వామి. మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి. మరి నివేదన చేయని పదార్ధాలను అతిధులెవ్వరూ ముట్టుకోరు, మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మ.  

నేను ఇంకో రూపంలో ఇదే కొండ (శేషాచలం) మీద, అహోబలంలో (ఈనాడు అహోబిలం) నరసింహునిగా వెలసి ఉన్నాను. ఆ అహోబిల నరసింహస్వామికి నివేదన చేసి అందరీకి నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు. సాక్షాత్తు బ్రహ్మ అహోబల నరసింహస్వామికి నివేదన చేస్తారు.

(తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిప్సితాయి. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లావరకు వ్యాపించి ఉన్నాయి. ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడి, నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోకభాగాన శ్రీశైలంలో మల్లిఖార్జునుడు భ్రమరాంభ సమేతంగా వెలసి ఉన్నారు. కర్నూల్ జిల్లా నంద్యాలకు దగ్గరలో ఉన్న అహోబిల క్షేత్రంలోనే హిరణ్యకశిపుడుని నరసింహస్వామి సంహరించారట. ఆ సమయంలో మహోగ్రంగా ఉన్నారు స్వామి. ఆయన బలం చూసిన దేవతలు 'అహో బలం, అహో బలం' అంటూ ఆయన శక్తిని కీర్తించారు. అదే అహోబల క్షేత్రంగా విరాజిల్లింది. అక్కడే నృసింహుడు వెలిశారు. కాలక్రమంలో అది అహోబిలంగా మారింది.)                

నివేదన చేశాక వైశ్వదేవం చేశారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఇది అగ్నిదేవుడి ఆరాధన. అగ్నిహోత్రం పెట్టి చేసేది. వైశ్వదేవం మిగిశాకా అందరూ భోజనాలకు సిద్ధమయ్యారు.

చక్కగా శివుడు అతిధులందరినీ కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు. పాండు తీర్ధం (గోగర్భం డ్యాము నుంచి దక్షిణగా కొద్ది రూరంలో ఉంది. ఇప్పటికి చూడవచ్చు) నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళను (ఆకులను) పరిచి, వారివారి పెద్దతనానాన్ని అనుసరించి ఆశీసులు చేశాక అందరికి ఒకేసారి వడ్డించారు.
వడ్డించడంలో కూడా శాస్త్రం కొన్ని నియమాలను విధించింది. ఆకులో ఏది ఎక్కడ వడ్డించాలి, ఏలా వడ్డించాలన్నది చెప్పింది. ఇవన్నీ ఎంతో శాస్త్రీయమైనవి. వాటి ముందు ఈనాటి పాశ్చ్యాత ఆహారనియమాలు, భుజించే విధానం ఎంత మూర్ఖమైనవో   అర్ధం అవుతుంది. భవిషోత్తర పురాణం కూడా ఎలా వడ్డించాలి, గృహస్తు మర్యాదలు ఏ విధంగా చేయాలన్న విషయాన్ని విపులంగా వివరిస్తుంది.

దాన్ని అనుసరించి వేంకాటాచలంలో కూడా వడ్డన జరిగింది. ముందు విస్తళ్ళపై నీరు చల్లి, ఉడిచి, పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్ధాలు వడ్డించారు. వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయ్యిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా, అందరూ కలిసి ముక్తకంఠంతో విష్ణువును స్మరించారు.

అంతటా వ్యాపించిన ఒకే తత్వము, చిన్న దేహములు కలిగిన అనేక జీవులయందూ కూడా ఉండి, మూడులోకములు వ్యాపించి సమస్త విశ్వాన్నే భుజించగల సామర్ధ్యం కలిగి, చిన్నచిన్న జీవుల దేహమందూ వాసము చేస్తూ వారూ తిన్న ఆహారమను స్వీకరిస్తున్నది, ఆని ప్రార్దించి

భోజన ప్రారంభకాలే భగవన్నామస్మరణ గోవిందా అని శ్రీనివాసుడనగా గోవిందా ఆని అందరూ పలికి ఆహారం తీసుకోవడం ప్రారంభించారు. భోజన ప్రారంభానికి ముందు  శ్రీనివాసుడు ఒక పాత్ర నిండుగా నీరు తీసుకుని, అతిధులందరికి నమస్కరించి, మీ వంటి జ్ఞానపూర్ణులైనవారికి ఈ కొద్దిపాటి అన్నమూ, నీరుచే ఏ మాత్రము తృప్తి కలుగదు. అయినా తపోధనులారా! మీరు కరుణ కలిగినవరు కనుక నీ పెట్టిన ఈ కాస్త ఆహారమునూ, అధికంగా, ఎన్నో రకాలుగా భావించి నన్ను కృతార్ధుడిని చేయండి అన్నాడు. చివరగా సర్వం శ్రీ కృష్ణార్పణమస్తూ అంటూ ముగించాడు.

నువ్వు పెట్టిన అన్నము ముక్తిని సాధించే అమృతము అను చెప్పి అతిధులు భుజిస్తారు. భోజన మధ్యకాలంలోనూ, ఆఖరునా గోవింద నామం మళ్ళీ చెప్తారు. మనం తినే ఆహారంలో ఆరవవంతు మనసుగా మారుతుంది. మనం ఆహారం తినే సమయంలో ఏం చూస్తామో, ఏమి ఆలోచిస్తామో, ఏది మాట్లాడుతామో, అది మన మనసులో తీవ్రప్రభావం చూప్సితుంది. అదే భోజన సమయంలో భగవన్నామం చెబితే, మన మనసులో భగవన్నామం మంచి ఆలోచనలకు ప్రేరకం అవుతుంది.

అందరి భోజనాలు ముగిశాకా, అందరికి దక్షిణతామ్మూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణం. అది కూడా వారివారి పాండిత్యాన్ని, యోగ్యతను అనుసరించే. శ్రేష్టులైన ద్విజులకు ఒక రామటెంక (నాణెము), వేదాంతులకు అందులో సగము, బ్రహ్మచారులకు వేదాంతుల దక్షిణలో సగమూ, ........ ఇలా ఇచ్చడు స్వామి.

అందరి భోజనాలు మిగిశాకా శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, లోకపాలురు, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భొజనాలు మిగిసేసరికి సూర్యాస్తమయం అయిందని పురాణంలో కనిపిస్తుంది.

అలా అందరి భోజనాలు పూర్తయ్యాక, ఆ రాత్రికి అక్కడే గడిపేసి, తెల్లవారుఝామునే మంగళవాయిద్యాల నడుమ మగపెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. మంగళవాయిద్యాలు, కబురులు, సబరాల నడుమ సరదాగా నడిచిపోతున్న బృందం పద్మసరోవరం చేరుకుంది. ఇక్కడే శ్రీ శుకాచార్యులవారి ఆశ్రమం ఉంది. పద్మసరోవరం సమీపిస్తున్న సమయంలో శుకుడు శ్రీనివాసుని చేరి, తన ఆశ్రమానికి విచ్చేసి, ఆతిధ్యం స్వీకరించవలసిందిగా కోరుతాడు.    

"కోట్లాదిమందితో ఉన్నాను, నేను ఒక్కడినే రాలేను, ఇంతమందిని తీసుకువస్తే నీకు ఇబ్బంది. అందరం ఆకాశరాజు ఆతిధ్యం స్వీకరించాలనుకుంటున్నాం" అంటాడు శ్రీనివాసుడు. "నువ్వు ఒక్కడివి తింటే చాలు, అందరు తిన్నటే" అని శుకుడు శ్రీనివాసుడిని బ్రతిమాలుతాడు. "నాన్నా! నీ పెళ్ళికి శుకబ్రహ్మ చాలా సహాయం చేశాడు. కనుక ఆయన చేసిన సాయానికి గుర్తుగా, ఆయన ఆతిధ్యం అంగీకరించి, భోజనం చేయి" అంటుంది వకుళమాత. అమ్మ మాట కాదనలేని స్వామి సరేనంటాడు.

శుకుడు కుటీరంలోనికి ప్రవేశిస్తాడు. చింతతొక్కుల పచ్చడి, పులుసులతో స్వయంగా శుకుడే శ్రీనివాసుడికి భోజనం వడ్డించడని భవిష్యోత్తర పురాణం చెప్తున్నది. ఇంతవరకు బాగానే ఉంది, భక్తుని కోరిక మన్నించిన భగవంతుడు, భక్తుడి ఇంట భోజనం చేయడం. కానీ లోకులు అలా ఆలోచించరు కదా. బయట ఉన్నవారు శుకమహర్షి గురించి నానారకాలుగా అనుకొవడం మొదలుపెట్టారు. ఇంతమంది ఉండగా, ఒక్క శ్రీనివాసుడికే భోజనం పెట్టడమేంటి? ఇదేం వింత? శుకుడికి బాగా గర్వం పెరిగిపోయింది, మదంతో ఈ చర్యకు పూనుకున్నాడు. అందరూ ఉన్నప్పుడు ఒక్కడినే పిలిచి భోజనం పెట్టడం భావ్యమా? అందరిని అవమానిస్తున్నాడు .......... ఇలా రకరకాల మాటలు మొదలుపెట్టారు. శుకుడికి కీడు చేయాలని తలచారు. 

లోపల భోజనం చేస్తున్న స్వామికి ఈ విషయం తెలిసింది. భక్తుడి రక్షణ భగవంతుని బాధ్యత. అందుకే భోజనం చివరిలో సంతృప్తిగా శ్రీనివాసుడు త్రేనుస్తాడు. అంతే! బయటనున్న అందరికి ఆకలి ఒక్కమాటున తీరిపోతుంది, కడుపు నిండిపోతుంది. అందరికి శుకుడి భోజనం తిన్న భావన కలుగుతుంది. సర్వజీవలయందూ ఆకలిరూపంలో ఉంటూ ఆహారం జీర్ణం చేసే పరమాత్మ, అందరి ఆకలిని తీర్చడం వింత ఏమీ కాదు. ఇది జరిగింది వైశాఖ శుక్ల పక్ష అష్టమి నాడు. ఆ రాత్రికి అక్కడే గడపాలని నిశ్చయించుకుంటారు.

నవమినాడు శ్రీనివాసుడితో సహా అందరూ నారాయణపురం చేరుకుంటారు. శ్రీనివాసుని స్వాగతించడానికీ ఎదురువచ్చిన ఆకశరాజుతో స్వామి, అతిధులందరూ ఆకలితో ఉన్నారు, భోజనాలకు ఏర్పాట్లు చేయండని ప్రత్యేకంగా చెప్పినట్టు పురాణంలో కనిపిస్తుంది.      

దశమినాటి ఉదయమే శ్రీనివాసుడు మంగళస్నానం చేశాడు. పురోహితుడైన వశిష్ఠునితో లోకరీతిని తెలుపుతూ "ఈనాటి రాత్రియే వివాహమూహుర్తం కనుక మనం ఐధుగురం, నేను, లక్ష్మీదేవి, వకుళాదేవి, బ్రహ్మ, మీరు (వశిష్ఠుడు) భోజనం చేయకూడదు. అలాగే ఆకాశరాజు, ధరణీదేవి, తొండమానుడు, పద్మావతీదేవి (పెండ్లికూతురు), వారి పురోహితుడు భోజనం చేయకూడదు" అని చెప్పి, కుబేరునితో "కుబేరా! బ్రాహ్మణభోజనానికి ఆకాశరాజును తగిన ఏర్పాట్లు చేయమని చెప్పు, ముహూర్తం రాత్రి 13నాడులకు, ఆ తరువాత బ్రాహ్మణులు భోజనం చేయడం నిషేధం" అని చెప్తాడు.

శ్రీనివాసుని విడిది ఇంటి నుంచి వివాహవేదికకు ఆకాశరాజు ఎంతో ఘనమైన ఏర్పాట్ల మధ్య తీసుకువెళ్ళాడని పురాణం చెప్తోంది. విశ్వకర్మ నిర్మించిన సభలో మునిశ్రేష్టులతో శాస్త్రచర్చ చేస్తున్న శ్రీనివాసుని రాజగృహానికి తీసుకువెళ్ళడం కోసం ఇంద్రుడి ఐరావతం తీసుకువస్తాడు ఆకాశరాజు. ధరణీదేవి కూడా ఆకాశరాజు వెంట వస్తారు. ఐరాతవతంపై శ్రీనివాసుని కూర్చొబెట్టి, లక్ష్మీదేవి, బ్రహ్మ, రుద్రుడు, కుబేరుడు, యముడు, ఇంద్రుడు, ఇలా అందరి సమేతంగా తీసుకివెళతాడు ఆకాశరాజు.

శ్రీనివాసుడు రాజగృహానికి చేరుకోగానే తొండమానుడి భార్య కుంకుమ కలిపిన ఎర్రని నీటితో కుంభహారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించిందట. శ్రీనివాసుడి పాదాలు కడగటానికి స్వామి పుష్కరిణి జలాలు తెప్పించాడు ఆకాశరాజు. బ్రహ్మ కడిగిన పాదాలకు ఆకాశరాజూ, ధరణీదేవి కడిగే అదృష్టం పొందారు. ఏ స్వామి పాదాల దర్శనం కనిపిస్తే చాలు ధన్యమనీ, ఎందరో తపస్సులు చేస్తున్నారో, ఏవరి పాదదూళి సోకితే పరమదరిద్రుడు కూడా అత్యంత ధనవంతుడవుతాడో, ఏ పాదాలను నిత్యం లక్ష్మీదేవి, బ్రహ్మ, ఇతర దేవతలు కొలుస్తూ ఉంటారో అటువంటి స్వామి పాదోదకం (కాళ్ళు కడిగిన నీటిని) రాజ్యమంత ప్రోక్షణ చేయించాడు (చల్లించాడు). ముహూర్తం సమీపించగా, కోటి సువర్ణనాణేములు కానుకగా ఇచ్చాడు ఆఖశరాజు. నాకీ డబ్బు ఎందుకు, నవరత్నఖచితమైన ఆభరణాలు ఇవ్వండి అంటాడు శ్రీనివాసుడు.

అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసుడికిచ్చిన ఆభరాణాల గురించి భవిష్యోత్తర పురాణం ప్రస్తావించింది. 100 తులాల బంగారు కీరీటం, అంతే బరువుగల నడుముపట్టీ, భుజకీర్తులు, నూపురములు, 2 నాగ భుజ భూషణములు, భుజాల వరకు వేళాడే ముత్యాలతో చేయబడిన కర్ణభూషణములు (చెవికి పెట్టుకునే ఆభరాణాలు), 32 తులాల బరువుగలిగిన నవరత్నఖచిత కంకణాలు, నాగభూషణాలు రెండు, 111 తులాల బరువు కలిగిన, వజ్రాలు పొదిగిన బంగారు కటిసూత్రము, పాదుకలు, 64 తులాల బంగారు భోజనపాత్ర, చెంబు, పంచపాత్రలు, పంచపాత్రలు, 64 పట్టువస్త్రాలు, ఇలా శ్రీనివాసుడికి శరీరమంతా ఆభరణాలు సమర్పించాడు ఆకాశరాజు.

వధూవరుల ప్రవరలు చెప్పించి, బృహస్పతి, వశిష్ఠులు కన్యాదానం చేయించారు. ' అత్రిగోత్రమున జన్మించిన సువీరుని మునిమనుమరాలు, సుధర్ముని మనుమరాలు, ఆకాశరాకు పుత్రిక అయినా పద్మావతీదేవిని యయాతి మునిమనుమడు, శూరశేనుని మనుమడు, వసుదేవుని కుమారుడు, వశిష్ఠ గోత్రములో పుట్టిన వేంకటేశ్వరునకిచ్చి వివాహాం చేయదలిచారానీ చెప్తూ, కన్యాదానం పూర్తి చేశారు.

కంకణధారణ చేయించడం దగ్గరి నుంచి మొత్తం వివాహవేడుకను అధ్భుతంగా వర్ణిస్తుంది పురాణం. మంగళసూత్రధారణ చేసిన తరువాత నవరత్నాలను అక్షింతలుగా వేసి, ఆశీర్వదించారు మునీశ్వరులు. అటు తరువాత వచ్చిన అతిధులందరికీ దక్షిణతాంబులాలు ఇచ్చాడు ఆకాశరాజు. కోటిసహస్ర గోవులను బ్రాహ్ముణలకు దానం ఇచ్చాడు ఆకాశరాజు.

అంతా ముగిశాకా కొత్త దంపతులతో కలిసి అందరూ భూరిభోజనాలు చేశారు.

మొత్తం 5 రోజుల పెళ్ళి జరిగిందని పురాణం చెప్తోంది. ఐదవరోజు అప్పగింతలు జరిగాయట. అపగింతల్లో నాభికి పాలు అద్ది, ఆకాశరాజు, ధరణీదేవి పద్మావతీదేవిని శ్రీనివాసునికి అప్పగించారు. పద్మావతీదేవి శ్రీనివాసునితీ అత్తారింటికి వెళ్ళిపోతోందన్న బాధతో భోరున ఏడ్చారు ఆకాశరాజు దంపతులు, పద్మావతీదేవి సోదరుడు వసుద, ఆమె పినతండ్రి తొండమానుడు. అప్పటివరకు ఉస్తాహంతో, కోలాహలంతో నిండిన పెళ్ళిమండపం ఒక్కసారిగా దుఃఖంలో మునుగిపోయింది. ఇదంతా చూస్తున్న మునులు కూడా దారుణంగా ఏడ్చారట. తన విడిచికి పద్మావతీదేవిని తీసుకువెళ్ళి శ్రీనివాసుడు గృహప్రవేశం చేశాడు. అటు తరువాత గరుత్మంతునిపై కూర్చోబెట్టుకుని తన నివాసానికి తీసుకువెళతాడు శ్రీనివాసుడు.

ఇలా అమ్మవారిని పంపుతూ, ఆకాశరాజు పద్మావతీదేవికి మూదువందల పుట్ల పెసలు, ఎంతో బరువున్న బెల్లం, అధికంగా చింతపండు, వెయికడవల పాలు, నూరుకుండ పెరుగు, పదిహేనువందల చర్మపాత్రల నిండ నెయ్యి, ఆవాలు, మెంతులు, ఇంగువ, ఉప్పు, పాత్రల నిండ నూనె, రెండువందల కుండల నిండా పంచదార, దోసపండ్లు, మామిడిపండ్లు, అరటిగెలలు, గుమ్మడికాయలు, కందమూలాలు, మిరియాలు, ఉసిరికాయలు, రెండువందల కుండల నిండుగా తేనె, లెక్కలేనన్నని అరటికాయలు ఇచ్చారాని, వాటిని 10,000 గుర్రాలు, 1,000 ఏనుగులు, 5,000 ఆవులు, 100 మేకలు, 200 మంది దాసీజనం, 300 దాసజనం, రకరకాల వస్త్రాలు, రత్నాలు పొదిగి తయారు చేసిన మంచం, పరుపులు, దిండ్లను సారెగా ఇచ్చాడు. శ్రీనివాసుడు ఆకాశరాజు భక్తికి మెచ్చి సాయుజ్యమోక్షాన్ని ఇచ్చాడని పురాణం.

స్వామి వివాహం జరిగిన నారాయణపురం తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. పద్మావతీదేవి కల్యాణానికి వడ్లు విసిరిన పెద్ద తిరగలి కూడా ఇక్కడ మనం ఈరోజుకి చూడచ్చు.

వివాహం జరిగిన తరువాత 6 నెలల వరకు కొండ ఎక్కనని దీక్ష తిసుకున్నానని, అందువల్ల, అగస్త్యుని ఆశ్రమంలో 6 నెలలు ఉండడానికి నిశ్చయించుకున్నానని చెప్పిన శ్రీనివాసుడు, తన పెళ్ళికి హాజరైన దేవతలకు, ఋషిమునులకు వస్త్రాలు, కానుకలు వారీవారీ యోగ్యతను అనుసరించి ఇచ్చి పంపుతాడు. ఇది జరిగాక మహాలక్ష్మీ కరివీరపురం (కొల్హాపూర్) వెళ్ళిపోయిందట. ఈ అగస్త్యాశ్రమం తొండవాడ, శ్రీనివాసమంగాపురానికి దగ్గరలో ఉండిందని భావిస్తున్నారు. ఇక్కడే అగస్త్యుడు ప్రతిష్టించి పూజించిన శివలింగం మనం ఇప్పటికి దర్శించవచ్చు. స్వామి నివసించిన చోటనే శ్రీనివాసమంగాపురంలో ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న స్వామి కల్యాణ వేంకటేశ్వరుడు. ఈయన్ను దర్శించి, ఇక్కడ పద్మావతీ శ్రీనివాసుల వివాహం జరిపిస్తే తొందరగా వివాహం అవుతుంది.

ఈ విధంగా శ్రీనివాసుని కల్యాణ కధను జనకమహారాజుకు శతానందుడు చెప్పాడని, శౌనకాది మునులకు సూతమహాముని చెప్పాడు.  శ్రీ వేంకటేశ్వర కల్యాణగాధకు ఫలస్తుతి కూడా చెప్తూ పురాణం కోటి కన్యాదానలు చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో, భూమి మొత్తాన్ని దానం చేయడం వలన ఎంత ఫలం లభిస్తుందో, ఈ కధ చదివినా, విన్నా అంతే ఫలితం కలుగుతుంది. ఎవరు శ్రీనివాసుని కల్యాణం చేయిస్తారో, వారి ఇంట్లో కూడా త్వరలోనే అటువంటి ఉత్సవం జరుగుతుంది. నీ కోసం ఈ శ్రీనివాస మహాత్యాన్ని చెప్పాను. ఎవరు శ్రీనివాసుని వివాహ చరితాన్ని, మహాత్యంతో కలిపి చెప్తారో, ఎవరు వింటారో, ఎవరు పారాయణ చేస్తారో, వారికున్న అన్ని కోరికలు నెరవేరుతాయి. విన్నమాత్రం చేతనే సుఖం కలుగుతుంది. ఇది ఎప్పుడు మంగళప్రదము అని శతానందుడు జనకమహారాజుతో చెప్పాడు.  

Thursday, 21 November 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - వేంకటేశ్వరునికి పెళ్ళి సంబంధం మాట్లాడుట

ఓం నమో వేంకటేశాయ

పెళ్ళి సంబంధం మాట్లాడడానికి బయలుదేరుతున్న వకుళమాతతో శ్రీనివాసుడు " అమ్మా! నువ్వు వెళ్తున్న దారిలో వచ్చే కపిల తీర్ధంలో స్నానం చేసి, కపిలేశ్వరుని దర్శనం చేసుకుని, ఆయనకు నమస్కారం చేసి, అటుపై పద్మతీర్ధంలో శ్రీ శుకాచార్యులు ప్రతిష్టించిన బలరామకృష్ణులను దర్శించుకునిం వారి అనుగ్రహం పొంది, అగస్త్యముని ఆశ్రమంలో అగస్త్యునిచే పర్తిష్టిమపడి, పూజింపబడిన అగస్తేశ్వరుడిని (శివుడు) అనుగ్రహం పొంది, దారిలో కనిపించే ఋషులకుం, మునులకు నమస్కారం చేసి, ఆశీర్వాదం పోందుతూ ముందుకు వెళ్తే కార్య సిద్ధిస్తుంది " అని పలుకుతాడు. ఒక గుర్రాన్ని సృష్టించి, దానిపై వెళ్ళమంటాడు.

కార్యం సిద్ధించడమేమిటి, స్వామి ఉండగా విఫలమవుతుందా? మరి ఎందుకు నమస్కరించమన్నాడు? ...... మన కోసం, మనకు సందేశం ఇవ్వడం కోసం. మనం కూడా అనేక పనుల మీద నిత్యం బయటకు వెళుతుంటాం. దారిలో ఎన్నో దేవాలయాలు కనిపిస్తూ ఉంటాయి. మనం మన పని తొందరలో ఉండి, వటిని పట్టించుకోము. మనం ఎప్పుడు దైవానికి నమస్కరించినా, దైవం నుంచి వచ్చే శక్తి తరంగాల వలన మన బుద్ధి మంచి మార్గంలో నడవడానికి ప్రేరణ పొందుతుంది, మనం వెళుతున్న కార్యంలో విజయం పొందేందుకు దోహద పడుతుంది. పెద్దవాళ్ళు, జ్ఞానులు, బ్రాహ్మణులు, వేదపండితులు కనిపించినప్పుడు వారికి
కూడా నమస్కరించాలి. పెద్దల ఆశీర్వాదం ఉంటే పెద్ద పెద్ద గండాల నుంచి సులువుగా గట్టెక్కవచ్చు. మార్కండేయుడు పెద్దల ఆశీర్వాదం పొందడం వల్లనే, మృత్యువు జయించడానికి, శివపూజ చేయాలన్న సలహా లభించింది. పూజించాడు, శివుడిని మెప్పించి, దీర్గాయుషును పొందాడు. అందువల్ల ఎప్పుడైనా, మనం వెళ్ళె మార్గంలో దేవాలయాలు, జ్ఞానులు, సన్యాసులు కనిపిస్తే, తప్పక నమస్కారం చేయాలి. ఒకవేళ మనమే వాహనం నడుపుతుంటే, అప్పుడు మనసులో నమస్కారం చేయాలి ఎందుకంటే ఎప్పుడు ఒక్కో చేతితో నమస్కారం చేయకూడదు, అది ధర్మం అంగీకరించదు, తప్పు కూడా.

శ్రీ నివాసుడు చెప్పినట్టుగానే, వకుళమాత అగస్తేశ్వర ఆయలం చేరుకుని పూజ, అభిషేకం చేయిస్తుంటుంది. . ఇంతలో అక్కడికి ఆకాశరాజు పరివారం, పద్మావతిదేవి చెలికత్తెలు వస్తారు. (అగస్తేశ్వర ఆలయం తిరుపతికి దగ్గరలో, శ్రీనివాసమంగాపురం దగ్గర ఇప్పటికి ఉంది. అక్కడ స్వర్ణముఖి నదిలో విష్ణుపాదం కూడా ఉన్నది).

పద్మావతీదేవి చెలికత్తెలు, ఆమె పరివారం అగస్త్యేశ్వరునికి పూజలు చేయిస్తుండగా, వకుళమాత చూస్తారు. విషయమేమిటని అడుగగా, 'మా రాకుమార్తె పద్మావతీదేవీ ఉయానవనంలో ఒక యువకుడిని చూసి, జడుసుకుని, భయంతో జ్వరం పట్టింది. కారణం తెలియని తండ్రి ఆకాశరాజు తన గురువైన బృహస్పతిని సంప్రదించగా, అగస్త్యేశ్వర ఆలయంలో ఈశ్వరునకు అభిషేకం చేయిస్తే, ఆమె మనసులో ఉన్న సంకర్షణ తొలిగి కుడుటపడుతుందని సలహా ఇచ్చారు. ఆమె తరుపున మేమీ ఆలయానికి వచ్చి, పూఝ చేయిస్తున్నాము్" అంటూ వారు సమాధానం ఇస్తారు.

వారు వకుళమాతను మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటూ వివరాలు కనుక్కునే ప్రయత్నం చేయగా, తన పేరు వకుళ అని, వరాహస్వామి ద్వారా శ్రీ నివాసుడికి సేవ చేసే భాగ్యం కలిగిందని, వేంకటాచలం దగ్గర ఉంటున్నామని చెప్తుంది.

తాను ఎలాగూ ఆకాశరాజు ఇంటికి వెళుతోంది. భగవత్సంకల్పం వల్ల ఎదురుపడిన ఆకాశరాజు పరివారంతో తాను కూడా, నారాయణపురం వెళ్ళి, ఆకాశరాజును ధరణీదేవిని కలుసి మాట్లాడవలసిన పని ఒకటి ఉందని చెప్పి, వారితో తీసుకువెళ్ళమంటుంది.

వకుళమాత నారాయణపురం వెళ్ళెలోపు, తాను ముందే అక్కడికి వెళ్ళి, రంగం సిద్ధం చేస్తే, కార్యం త్వరగా పూర్తవుతుందని భావించిన శ్రీ నివాసుడు, ఎరుకలసాని వేషం ధరించి, సోది చెప్పడానికి బయలుదేరతాడు.

ఒక ముసలి ఎరుకలసాని వేషంలో, చిరిగిన చీర, గురిగింజలు మాలలు ధరించి, బ్రహ్మాండాన్నే వెదురుబుట్టగా తలపై పెట్టుకుని, బ్రహ్మదేవిడిని చిన్న శిశువుగా తన చీరకొంగులో వ్రేలాడదీసుకుని, రుద్రుని చేతికర్రగా పట్టుకుని నారాయణపురం వీధులలో ప్రవేశిస్తాడు.    

సోది చెబుతానమ్మ సోది చెబుతాను. ఉన్నది ఉన్నట్లు చెబుతాను, లేనిది లేనట్లు చెబుతాను, జరిగింది చెబుతాను, జర్గేది చెబుతాను, జరగబోయేది చెబుతాను అని గట్టిగా అరుచుకుంటూ శ్రీనివాసుడు ఎరుకలసాని రూపంలో నారయణపురం వీధుల్లో తిరుతున్నాడు. ఈ ఎరుకలసాని విషయం ఆకాశరాజు భార్య ధరణీదేవి పరిచారికలు చూసి, ఆమెకు చెప్తారు. పద్మావతీదేవికి బాలేదు, విషయం అడిగితే ఏదైన పరిష్కారం చూపెడుతుందేమొనని ఆమెను పిలుచుకు రమ్మంటుంది. ఎరుకలసానిని రాజమహలుకు తీసుకురావడానికి దాసీజనం వెళ్ళగా, రానని మొండికేస్తుంది. "నన్ను అవహేళణ చేయడానికి పిలుస్తున్నారా? లేక నిజంగా చెప్పినుకోవాలనుకుంటున్నారా? నన్ను గౌరవిస్తారా?" అంటూ ప్రశ్నలు అదిగి, గౌరవంగా చూస్తామన్న హామీ ఇచ్చాకా రాణి అంతఃపురానికి వస్తుంది.

ముంది ధరణిదేవిని శుచిగా స్నానం చేసి రమ్మంటుంది. తరువాత ఒక పెళ్ళెంలో బియ్యం తీసుకురమ్మంటుంది. బియ్యం తెచ్చి ముందు పెట్టిన తరువాత 'కంచి కామాక్షమ్మ పలుకు, మధుర మీనాక్షమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, కాశీ విశాలాక్షి పలుకు.......... అంటూ దేవతనామస్మరణ చేస్తుంది ఎరుకలసాని. సకలతీర్ధాలు, పుణ్యక్షేత్రాల స్మరణ చేస్తుంది. బ్రహ్మ మొదలైన దేవతల మీద, ఆసేతుహిమాచలం ఉన్న పుణ్య క్షేత్రాల మీద, నదీనదాల మీద, తన బిడ్డ మీద ప్రమాణం చేసి అంతా సత్యమే పలుకుతాను అంటుంది.

'నీ కూతురు పద్మావతీదేవి ఉద్యానవనంలో ఒక యువకుడిని చూసి మోహించినాదమ్మ. ఈమెకు కామజ్వరం వచ్చినాది. అతనితో లగ్గం పెడితే (పెళ్ళి చేస్తే) బ్రతుకుతాది, లెకుంటే సచ్చిపోతాదమ్మ' అంటూ రాణికి చెబుతుంది.

ధరణీదేవి చాలా బాధపడుతుంది. "అతనికిచ్చి పెళ్ళి చేయమంటావు. సరే అనుకుంటే వెంటనే చేయకపోతే చనిపోతుండంటావు. అతనెర్వరి, ఎక్కడ ఉంటాడో, అతని వివరాలు ఏమి తెలియకుండా పెళ్ళీ చేయడం ఎలా? ఇప్పుడే చేయాలంటే నేనేం చేయగలను?" అని ప్రశ్నిస్తుంది ధరణిదేవి. నీ కూతురి ఆరోగ్యం కుదుటపడి, నీ బాధ తగ్గాలంటే, అతనిచ్చి వివాహం చేస్తానని ఇప్పుడె సంకల్పం చేయ్యి. అలా చేసినవెంటనే నయమవుతుందుఇ" అంటుంది ఎరుకలసాని.

ఈ ఎరుకలసాని సోది చెబుతున్న సమయంలో ఆమె పిల్లవాడు ఏడుపు మొదలుపెడతాడు. "ఈడు (వీడు) ఎప్పుడు ఇంతేనమ్మ, ఎప్పుడు ఆకలే ఈడికి, నా పిల్లోడు తినటానికి వండినదైన, వండనిదైనా, ఏదైనా సరే, మీ దగ్గర ఉన్న ఆహారం ఇప్పించండమ్మ" అంటుద్ని ఎరుకలసాని. వెంటనే బంగారుపళ్ళెంలో పాలతో ఉడికించిన పాయసం తెప్పిస్తుంది ధరణీదేవి. ఎరుకలసాని ఎంత తినమని చెప్పినా, పాయసం ముట్టుకోడు పిల్లవాడు. తిననని మారాం చేస్తాడు. ఇక కోపగించుకున్న ఎరుకలసాని పిల్లవాడితో "ఎవరు మాత్రం ఏం చేస్తారు. కందమూలాలలు, ఆకులు అలమలు తినే నీకు ఈ పాయసాన్నం తినే అదృష్టం ఉండాలి కదా" అంటూ తానే పాయసం తినేస్తుంది.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. బ్రహ్మదేవుడు కూడా పరమాత్మకు నైవెధ్యం సమర్పించకుండా భోజనం చేయడని. నివేదనకు అర్దం భగవంతునకు సమర్పించడం. ఈ భగవతర్పణ వలన అహకారం నశిస్తుంది. మనం పదేపదే 'నాకు ఎవరో అన్నం పెట్టడం లేదు, నా భోజనం నేనే తింటున్నా, ఇది నేను సంపాదించుకున్నా, ఇదంతా నాది, నాది నేను తింటున్నప్పుడు, ఇంకొకడికి సమాధానం చేప్పెదేమిటి? " ఇలా అనేక మాటలు అనుకుంటాం. నిజానికి భగవంతుని అనుగ్రహం ఉంది కనుక తినగలుగుతున్నాం. ఆహారం ప్రకృతి నుంచి వస్తుంది. ప్రకృతియే దైవస్వరూపం. ప్రకృతి ద్వారా అన్నాన్ని మనకు ఇస్తున్నవాడు పరమాత్మ.

కాదండీ, మేము డబ్బుతో కొనుక్కుంటున్నాం అంటారా ........... డబ్బు ఉన్న తినలేని స్థితిలో ఎందరో ఉన్నారు. కొందరికి కోట్లు ఉంటాయి కానీ, లోపలకి ఆహారం తీసుకుంటే అరగక కక్కేస్తారు, కాబట్టి పైపుల ద్వారా అన్నాన్ని ద్రవాహారంగా మార్చి శరీరంలోనికి పంపిస్తారు. ఎన్ని కొట్లు ఉండి ఏం లాభం? కడుపు నిండుగా తినడానికి అవకాశం లేనప్పుడు. ఆ అవకాశం మనకు పరమాత్ముడు ఇచ్చాడు. అందుకు కృతజ్ఞతగా 'ఓ పరమాత్మ! ఈ ఆహారం నీదే. ఈ ఆహారానివి కూడా నీవే. ఇది నాకు దక్కడానికి కారణం నీవు, ఇది నేను తిన్నాకా, లోపల జీర్ణం చేసేది నీవు, జీర్ణమైన ఆహారం నుంచి ఈ దేహానికి లభించే శక్తి కూడా నీవే. అన్నీ నీవే, అంతటా నీవే, కనుక సర్వం నీకే సమర్పిస్తున్నా, నీ దయతో ఈ ముద్ద తింటున్నా, ఇది నీ బిక్ష స్వామి' అనే భావమే నివేదన. ఇక్కడ ఇక అహంకారానికి చోటు ఉండడు.  

నైవేద్యం ఆహారంలోని దోషాలను తీసివేస్తుంది. నివేదన చేసిన పదార్ధం అమృతతత్త్వాన్ని సంతరించుకుంటుంది. పూతన విషం నిండిన పాలతో కూడిన తన స్తన్యములను చిన్న కృష్ణుడికి ఇస్తుంది. ఆయన అది నివేదనగా భావించాడు. కృష్ణుడు ఒక్క గుక్కలో ఆమె దేహంలో ఉన్న విషంతో పాటు ఆమె శక్తిని, రాక్షసత్వాన్ని త్రాగేస్తాడు. ఆమెకు మొక్షాన్ని ప్రసాదించాడు.

ఇక రెండవది. తల్లిదండ్రులకు భోజనం పెట్టకుండా మనం తినడం తప్పు. చిన్నప్పటి నుంచి మనల్ని మన తల్లిదండ్రులు ఎంతో కష్టాలు ఓర్చి, పెంచి, పోషించారు. మన పూర్వజన్మ కర్మ ఫలాన్ని అనుభవించడానికి, పరమాత్మను చేరడానికి ఈ శరీరాన్ని ఇచ్చారు అమ్మనాన్నలు. వారి ఋణం ఎప్పటికి తీర్చుకోలేము. వారు బ్రతికి ఉన్నంతకాలం వారిని జాగ్రత్తగా చూసుకోవడం మన ధర్మం. వారి తినలేకపోతే, మనమే తినిపించాలి. అందుకే బ్రహ్మదేవుడు కూడా తన తండ్రి తినకుండా తాను తినడం ఇష్టం లేదు కనుక, ముందు తల్లిదండ్రుల కడుపు నింపండి అన్న సందేశం లోకానికి ఇవ్వాలి కనుక తాను, ఆకలి అని ఏడ్చి, పాయసం తాను తినకుండా విష్ణుమూర్తితో తినిపించాడు.

ధరణీదేవికున్న అనుమానాల నివృత్తి కోసం కొన్ని ఎరుకలసానిని "ఎవరూ పిల్లను అడగకుండా కన్యాదానం ఏల చేస్తాం, వరుడు ఎవరో తెలియకుండా, వరుని తరుపువారు అడగకుండా ఉంటే మీమేం చేయాలి?" అంటూ అడుగుతుంది. మేరేమి కంగారు పడకండి. నేను వెళ్ళినకాసేపటికి ఒక వృద్ధురాలు పెళ్ళి సంబంధం మాట్లాడడానికి వస్తుంది. పద్మావతీదేవి ఉద్యానవనంలో ఎవరిని చూసి మోహించిందో, ఎవరి కోసం తపిస్తోందో, నీవు ఎవరికిచ్చి వివాహం చేస్తానని సంకల్పం చేశావో, అతని తరుపునే వస్తుంది. ఆమె తెచ్చిన సంబంధానికి ఒప్పుకోండి అని చెప్పి ఎరుకలసాని వెళ్ళిపోతుంది. రాణి వెళ్ళి తన కూతురు పర్మావతితీ మాట్లాడి, ఆమెకు ఆ పురుషుని మీద ప్రేమ ఉందని, పద్మావతీదేవి జ్వరానికి కారణం అతనే అన్న సంగతి తెలుసుకుంటుంది.

కొంత సమయం తరువాత అక్కడికి రాణిగారి పరిచారికల ద్వారా వకుళమాత రావడం, ధరణీదేవిని కలవడం, ఆమెతో మాట్లాడడం జరుగుతుంది. వకుళమాత నుంచి సమాచారం అంతా తెలుసుకున్న ధరణీదేవి విచారామగా ఉండడం గమనించిన ఆకాశరాజుకు ఏమి చేయాలో తోచదు. తన గురువు అయిన బృహస్పతికి విషయం చెప్తే, ఆయన తగిన మార్గం సూచిస్తారని తలచి, బృహస్త్పతిని తీసుకురావడం కోసం తన కొడుకైన వసుదను స్వర్గలోకానికి పంపిస్తారు.

క్షణంలో గురువుతో ప్రత్యక్షమవుతాడు వసుద. గురువంటేనే సర్వజ్ఞుడు, ఆయనకు తెలియంది ఏముంటుంది? తన దివ్యదృష్టితో విషయం తెలుసుకున్న బృహస్పతి, భవంతునకు వివాహం చేసే అవకాశం మళ్ళీమళ్ళీ రాదని మనసులో తలచి, తప్పకుండా ఒప్పుకుని కన్యాదానం చెయమంటాడు. అయినా, మళ్ళి బృహస్పతి కల్పించుకుని 'నేను అంత జ్ఞానిని కాదు. భగవంతుని గురించి నాకంటే బాగా తెలిసిన శ్రీ శుకాచార్యులవారిని సంప్రదిస్తే బగుంటుంది, వారు పద్మసరోవరం దగ్గరే ఉంటారు' అని చెప్తారు. వెంటనే శ్రీ శుకులవారిని పిలుచుకురమ్మని, ఆకాశరాజు తన తమ్ముడైన తొండమానునికి చెప్తాడు.      

భగవంతుడి కల్యాణవార్త వినగానే శుకుడు ఆనందంతో పరవశించిపోతాడు. కమండలం విసిరేసి, కృష్ణాజినం లాగేసి, కట్టుకున్న నారవస్త్రాలు తిసేసి ఉన్మత్తునిలా నాట్యం చేస్తారు. వెంటనే బయలుదేరి ఆకాశరాజుతో సూదోర్హంగా మాట్లాడుతారు. సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడే శ్రీనివాసుడని, లోకైకనాధుడైన, ఆఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడని చెప్పి, వివాహం ఒప్పుకోమని ఆకాశరాజుకు చెప్తూనే, లోకానికి సందేశం ఇవ్వడం కోసం, వివాహం విషయంలో ఆడపిల్ల తండ్రి తీసుకోవలసిన జాగ్రత్తలను పూసిగుచ్చి వివరించారని పురాణం చెప్తున్నది.

వకుళాదేవి ద్వారా శ్రీనివాసుడి కులగోత్రాలు, నక్షత్రం, జాతకం తల్లిదండ్రులు, బంధుమిత్రుల వివరాలు అడిగి తెలుసుకుంటాడు. స్వామిది శ్రవణా నక్షత్రమనీ, దేవకీవసుదేవులు తల్లిదండ్రులనీ, మిగితా విషయాలను కూడా వకుళమాత చెప్తుంది. మధ్యలో ఆవిడ శుకబ్రహ్మతో 'స్వామీ! మీకు తెలియదా కృష్ణుడి గురించి? నన్ను అడిగి తెలుసుకోవాలా? అంటుంది. వ్యాసుడు శ్రీ మద్భాగవతం రాస్తే, శుకుడు దాన్ని ప్రచారం చేశాడు. భాగవత ప్రచారం చేసిన శుకుడికి కృష్ణుడి గురించి తెలియకపోవడమేమిటి? అందుకే వకుళమాత ఈ ప్రశ్న అడిగింది.

అమ్మా! ఆయన గురించి నీకు తెలుసు, నాకూ తెలుసు, కానీ లోకం కోసం చెప్పించాలి కదమ్మా! అందుకే అంటారు. ఇంతలో దేవకీదేవికి ఒప్క అనుమానం వస్తుంది. ఎంతైనా తల్లి కదా, బిడ్డల జీఇతం కోసం పడే ఆరాటం అటువంటిది.

అబ్బాయికి 24 ఏళ్ళు వస్తున్నాయి అన్నారు, మంచి గుణవంతుడు, అయినా ఇంకా వివాహం ఎందుకు కాలేదు? ఏదైనా లోపం ఉందేమొ? అనుకుని, ఇదే విష్యం వకుళమాతను అడుగుతుంది. అప్పుడు వకుళమాత 'అదేం లేదమ్మ! మా వాడికి ఇంతకముందే వివాహం జరిగింది. కానీ, సంతానం కలుగలేదు.అందుకే మళ్ళీ పెళ్ళి చేస్తున్నాం అంటుంది.

ఇద్దరి జాతకాలు సరిపోయాయని నిర్ధారించి ఆకాశరాజును సంబంధానికి ఒప్పిస్తారు. వివాహానికి అంగీకరించినట్లు శ్రీనివాసుడికి తెలియజేసేలా ఒక లేఖను రాయిస్తారు బృహస్పతి, శుకబ్రహ్మ.

ఎంతో మర్యాదతో, అత్యంత గౌరవంతో, తానూ లేఖ రాస్తున్నది సాక్షాత్తు దేవదేవుడైన శ్రీనివాసునకు అన్న విషయం తెలిసిన ఆకాశరాజు అందులో భక్తి కూడా జోడిస్తాడు. ఎవరి ద్వారానో పంపితే బాగుండదని, శుంక మహర్షి చేత లేఖ పమించాలనుకుంటాడు. శుకుడు వెంటనే ఆనందంతో ఒప్పుకుంటాడు. భగవంతుని దర్శనం లభిస్తుంటే అంతకంటే ఆనందం ఏముటుంది.

శ్రీనివాసుడు ఇంట్లో చాలా ఆదుర్దాగా ఎదురు చూస్తుంటాడు. సంబంధం మాట్లాడడానికి వెళ్ళిన వకుళమాత ఇంకా రాలేదేమిటి? ఆకాశరాజు వివాహానికి ఒప్పుకున్నాడా లేదా? ఇంత ఆలస్యం ఎందుకైంది? అని అలోచిస్తూ, దిగులుగా కుర్చుని ఉంటాడు. ఏమి తలియని వాడిలా, శుకుడు వెళ్ళగానే, దూరం నుంచే, కాయా? పండా? అని ప్రశ్నిస్తాడు. ఆయన జగన్నాటక సుత్రధారి, జగత్తు అనే ఒక మహానాటకాన్ని నడుపుతున్నాడు, ఇది కూడా అలాంటిదే. శుకుడు పండేనంటాడు.

మంచి కబురు చెప్పారు అంటూ శుకుడిని ఆలింగనం చేసుకుంటాడు. రామావాతారంలో సీతమ్మ జాడ చెప్పిన ఆంజనేయస్వామినే ఆలింగనం చేసుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు శుకుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఆయన్ను ఆలింగనం చేసుకునే భాగ్యం అందరికి దక్కదు. ఆకాశరాజు పంపిన లేఖను ఆనందంతో స్వీకరించి, గౌరవంగా తలపై పెట్టుకుని, చాలా ఆనందపడుతూ, సంతోషం పట్టలేక గంతులేస్తాడు. ఎంతైనా ప్రేమ వివాహం సఫలం అవుతోంది కదా, మరి ఆ మాత్రం ఆనందం ఉండదా చెప్పండి!?

ఆకాశరాజు రాసిన పత్రానికి సమాధానంగా శ్రీనివాసుడు ప్రత్యుత్తరం రాస్తాడు. ఎంతో వినయంగా ఉంటుంది ఆ లేఖ. వైశాఖ శుద్ధ దశమి వివాహానికి ముహూర్తమని, పెళ్ళికి తరలి వస్తున్నానని చెప్పి రాసి, శుకుడికిచ్చి పంపిస్తాడు.

శుకుడు వెళ్ళగానే వకుళమాత వస్తుంది.

వకుళమాత చాలా సంతోషంతో వచ్చి, సంబంధం కుదిరిందనీ, ఆకాశరాజు పద్మావతీ దెవిని ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకున్నాడని ఉత్సాహంగా చెప్తుంది. ఈ విషయం ముందే తెలిసినా, శ్రీనివాసుడు ఆమెను కించపరచలేదు. అమ్మ కళ్ళలో ఆనందం చూడాలి అనుకున్నాడు. బిడ్డల యొక్క ప్రధాన కర్తవ్యం తల్లిదండౄలను సంతోషంగా ఉంచడమే. అందుకే శ్రీనివాసుడు ఏమి తెలియనివాడిలా, ఆమె చెప్పవనీ ఆసక్తితో విన్నాడు. ఆమెయే కార్యాన్ని సాఫల్యం చేసిందనీ కృతజ్ఞతలు చెప్పాడు. ఆమె ఎంత ఉత్సాహంతో చెప్తుందో, అంతకంటే మికిలి ఉత్సాహంతో విషయాలు వింటూ ఆమెను ఆనందపరుస్తాడు. ఆమె చెప్పిందంతా వింటాడు.

కాసేపటికి 'అమ్మ! నాకీ పెళ్ళి వద్దు. నేను ఈ పెళ్ళి చేసుకోను. ఈ వివాహం జరగడం సమంజసం కాదు' అంటాడు. వకుళమాతకు మతిపోతుంది. కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపొతుంది. తరువాత 'అదేంటి నాయనా! పోయిన జనంలో నీవు ఎన్ని వివాహాలు చేసుకున్నా, ఒక్కటి చూసే భాగ్యం కలుగలేదు. నీ వివాహం చూపిస్తానని వరం ఇచ్చావు. ఈ జన్మ కోసం, నీ వివాహం చూడడం కోసం ఎంతో తపస్సు చేశాను. ఇంత ప్రయత్నం చేసి, పద్మావతీదేవి పరివారాన్ని ఒప్పించి, నీ పెళ్ళికి సిద్ధమవుతున్న సమయంలో కాదనటం సరికాదు. అయినా నీవు పెళ్ళి వద్దనడానికి కారణం ఏమిటి? పిల్ల నీకు నచ్చింది, నివు పిల్లకు నచ్చావు, ఇప్పుడీ ఆలోచనలేమిటయ్యా?' అంటుంది వకుళమాత.

అమ్మా! ఆకాశరాజు మహారాజు. బోలెడు పరివారం ఉంది. ఎంతో ఆస్తి ఉంది. అనేకమంది బంధువులు, స్నేహితులు ఉన్నారు, అధికారం ఉంది. మరి నా సంగతి? నాకు ఎవరున్నారు? నేనూ, నువ్వు తప్ప పెళ్ళికి వెళ్ళటానికి ఇంకెవరు ఉన్నారు? వియ్యానికైనా, కయ్యానికైనా సమఉజ్జీలై ఉండాలి. పరస్పరం వ్యతిరేకుల మధ్య వివాహం మంచిది కాదు. చూసినవారు ఏమంకుంటారు చెపు. పెళ్ళికొడుకు వాళ్ళు దరిద్రులు అనుకుంటారు. ఎంత అవమానం అంటాడు.

ఇది వకుళమాత జ్ఞానానికి, భక్తికి పరీక్ష. తాను ఎవరికి సేవ చేస్తోందో, ఎందుకు చేస్తోందో బాగా తెలుసు. అందుకే 'నాయనా! మళ్ళీ నన్ను మాయలో పడేద్దాం అనుకుంటున్నావా? నాకు నీ గురించి తెలియదనుకుంటున్నావా? నువ్వు 14 లోకాలకు ప్రభువువి, అంతటా వ్యాపించి ఉన్న పరమోత్కృష్ట తత్వానివి, చక్రవర్తులకే చక్రవర్తివి,దేవదేవలలో ఉత్తముడివి, ఆకిలాండకోటి బ్రహ్మాండా నాయకుడివి, ఆదిమద్యానరహితుడివి. ఆకాశరాజు పేరుకు మాత్రమే ఆకాశరాజు. ఎవరికి ఏది కావాలన్న నువ్వు అనుగ్రహించలసిందే. ఎవరికి ఏది ఉన్నా, అది నీ ప్రసాదమే. నువ్వు తల్చిన్న మరుక్షణం నీ ముందు దేవతలు చేతులు కట్టుకుని నిల్చుంటారు. నీకు సేవ చేయడానికి పూనుకుంటారు. నువ్వే ఐశ్వర్య కారకుడివి, లక్ష్మీపతివి, ఐహిక సుఖాలతో పాటు పరలోకపు సుఖాలను కూడా ప్రసాదించగలిగినవాడవి. పద్మావతీదేవిని, ఆకాశరాజు దంపతులను, నా వంటివారిని, నీ భక్తులను ...... ఇలా అనేకులను తరింపజేయడానికే కదా నీ ఈ లీలలు. కనుక ఇప్పటికైనా నీ ఆటలు మాని నన్ను అనుగ్రహించవయ్యా!' అంటుంది వకుళమాత.

ఇద్దరూ నిజమే చెప్పారు. ఆయనకు తల్లిదండ్రులంటూ ఎవరూ లేరు. 'అజాయమానో బహుదావిజాయతే' - పుట్టక అంటూ లేనీవాడు, ఎవరికి పుట్టని వాడు అనేక రూపాల్లో తనని తాను సృజించుకుంటాడు, రూపొందించుకుంటాడు, ఒక ఆకృతిని ధరిస్తాడు. ఆయన అనాది, ఎప్పటినుంచో ఉన్నవడు, ఎప్పటికి ఉండేవాడు, ఆత్మస్వరూపుడు. ఆయనకు ఎవరు లేరని చెప్పినా, ఆయన అందరివాడు.

వకుళమాత మాట వింటూనే ఒక చిరునవ్వు నవ్వి, తన మనసులో గరుత్మంతుడిని, ఆదిశేషుడిని తలుచుకుంటాడు. వెంటనే ఇద్దరూ ప్రత్యక్షమవుతారు. దేవతలందరికీ నా వివాహవిషయం చెప్పు, అందరిని వెంటనే రమ్మను అని గరుడునితో చెప్తారు. కొడుకు బ్రహ్మకు కూడా ఒక లేక పంపుతాడు. బ్రహ్మకు చెప్తే వెంటనే దేవతలందరిని పిల్చి ఒక సభ పెట్టి, దేవతలందరిని తమ పరివారంతో కూడి రమ్మని అజ్ఞాపిస్తాడని చెప్తాడు.

ఇక్కడే ఒక చమత్కారం జరుగుతుంది.

To be continued.........

Sunday, 27 October 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - వకుళమాత, పద్మావతీదేవి

ఓం నమో వేంకటేశాయ

వకుళ ఎవరో కాదు యశోద. ద్వారయుగంలో ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించి, కృష్ణపరమాత్మను పెంచింది యశోద. అంత చేసిన కృష్ణుడి వివాహాం చూసే భాగ్యం లేకపోయిందని బాధపడింది. కృష్ణయ్య , నువ్వు 8 వివాహాలు చేసుకున్నా, ఒక్కటి చూడలేకపోయాన్రా, నీ వివాహం చూడాలనుంది రా! అంటుంది. అప్పుడు కృష్ణుడు అమ్మా! నా వివాహం చూడడం ఇప్పుడు కుదరదు, రాబోయే 28 వ కలియుగంలో నీ చేతుల మీదుగానే వివాహం చేసుకుంటాను, నువ్వే జరిపిద్దుగానివి అంటూ ఓదారుస్తాడు.

ఆ యశోదయే ఈ వకుళమాత. ఈ యుగంలో శ్రీనివాసుడికి మాతృస్థానంలో ఆయన వివాహం జరిపిస్తుంది. వరాహస్వామి ద్వారా శ్రీనివాసుడికి చెంతకు చేరింది. శ్రీనివాసుడి తల గాయానికి మందు రాసింది. గోరుముద్దలు తినిపించింది. సపర్యలు చేసింది. తన ముందు నిల్చున్నది మాములు వ్యక్తి కాదు, తన చిన్ని కృష్ణుడేనని గుర్తుపట్టింది.

ఇది ఇలా ఉండగా, ఒకనాడు వేటకు వెళ్ళాలన్న కోరిక కలిగింది. తన మనోసంకల్పంతో వాయుదేవునకు సందేశం పంపాడు శ్రీనివాసుడు. అశ్వరూపంలో (గుర్రం) వాయుదేవుడు వచ్చి సిద్ధంగా నిలుచున్నారు.

ఎక్కడున్నా లక్ష్మీదేవి మనస్సంతా స్వామి చెంతనే ఉంటుంది. అందుకే అమ్మవారు వాయువైన అశ్వానికి పగ్గాలుగా నిలిచింది. గోపిచదనంతో ఊర్ధ్వపుండ్రం ధరించి, కెంపురంగు తిలకధారణ చేసి, చక్కగా తయారయ్యి అశ్వం మీద వేటకు బయలుదేరాడు.

భగవంతుడు వేటాడడం ఏమిటి? ..... అంటే పూర్వజన్మ కర్మలను అనుసరించి ప్రతిజీవికి మృత్యువు ముందే నిర్ణయించబడి ఉంటుంది. కొందరికి మోక్షం లభించాలి, ఎంతో సాధన చేసినా, చేసిన పాపం అనుభవించక తప్పదు. అందులో భాగంగానే జంతు, పక్షి, ఇతర క్రిమికీటకాదులు మొదలైనవాటి జన్మ వస్తుంది. మరి ఆ పాపం తీరాకా జీవుడిని ఆ దేహం నుంచి విడిపించాలి కదా. అందులో భాగంగానే భగవంతుడు వేట ప్రారంభించాడు. సరదా కోసం కాదు, జీవుడిని తనలో ఐక్యం చెసుకోవడం కోసం, జనమరణ చక్రం నుంచి తప్పించడం కోసం.      

ఇంతలో శ్రీనివాసుడికి ఒక మదమెక్కిన ఏనుగు కనిపిస్తుంది. ఆ ఏనుగును శ్రీనివాసుడు వెంబడించగా, అది చాలా దూరం పరిగెత్తి, ఇక అలిసిపోయి శ్రీనివాసుడికి తొండంతో నమస్కరించి శరణాగతి వేడగా, స్వామి దాన్ని విడిచిపెట్టెస్తాడు. నమస్కరించిన వెళ్ళిపోతున్న ఏనుగు దిశగా చూసిన శ్రీనివాసుడికి ఒక మహాసౌందర్యవతియైన కన్య తన చెలికత్తెలతో కలిసి విహారం చేయడం కనిపించింది.

భగవంతుని దృష్టికి ప్రత్యేకంగా కనిపించిన ఆ కన్య ఎవరు? ఆమె వృత్తాంతమేమిటి? అని కధ వింటున్న శౌనకాది మహామునులు సూతమహర్షిని ప్రశ్నిస్తారు. అప్పుడు సూతులవారు ఈ విధంగా చెప్తున్నారు.

సువీర అనే రాజు కొడుకు సుధర్మ. సుధర్మ పుత్రుడు ఆకాశరాజు. ధార్మికుడు, సుపరిపాలకుడైన ఆకాశరాజుకు అన్నీ ఉన్నా సంతానం లేరు. ఈ లోటు ఆయన్ను బాధించసాగింది. ఇంత రాజ్యం ఉండి ఏం లాభం? వంశాన్ని ఉద్ధరించే కొడుకు లేడు? నా తరువాత పితృతార్యాలు ఏవరు చేస్తారు? ఎన్నో దానాలు చేసిన నాకు కన్యాదానం చేసే భాగ్యం కలగదా? నాకీ దుస్థితి ఏంటి? అని దుఃఖించసాగాడు.

గురువులనుం, పెద్దలను, జ్ఞానులను సంప్రదించి సంతానం కోసం ఒక మహాయాగం చేయాలని నిశ్చయించుకుంటాడు. యజ్ఞస్థలం తిర్పతికి దగ్గరలో ఉన్న తిరుచానూరు (అలిమేలుమగాపురం / మంగాపురం) ప్రదేశం. యజ్ఞం చేసే ముందు భూమిని శుద్ధి చేయడానికి భూమిని దున్నాలి. అలా భూమిని దున్నుతున్న సమయంలో ఆకాశరాజు నాగలికి ఒక స్వర్ణపద్మం తగులుతుంది. ఆ స్వర్ణపద్మంలో ఒక మహా తేజోమూర్తి, లక్ష్మీకళ ఉట్టిపడుతున్న ఒక పసిపాప ఉంటుంది. ఇది చూసిన రాజు ఆశ్చర్యంతో ఏమి పాలుపోక నిల్చుని ఉంటాడు.

ఇంతలో అశరీరవాణి "మీ కోసమే ఈ బాలిక జన్మించింది. నీ కూతురుగా స్వీకరించి పెద్దదాన్ని చెయ్యి. మహాలక్ష్మీ అంశకలిగిన ఈ అమ్మాయిన విష్ణువు పెళ్ళి చేసుకుంటాడు" అని వినిపిస్తుంది. ఈ పసిపాపే మన కూతురు, ఈమెను ప్రేమతో పెంచు అని తన భార్యకు అప్పగిస్తాడు. యజ్ఞం పూర్తి చేస్తాడు. తర్వాత వసుద అనే కొడుకు పుడతాడు. పద్మంలో పుట్టింది కనుక పద్మావతి అని నామకరణం చేస్తారు ఆ పాపయికి. ఈ అమ్మాయే ఇప్పుడు శ్రీనివాసుడికి కనిపించిందని చెప్తారు సూతులవారు.

శ్రీనివాసుడు వేటకు భయలుదేరకముందే నారదుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో పద్మావతీదేవి చెలికత్తెలతో కలిసి విహరిస్తున్న ఉద్యానవనానికి వెళతాడు. శ్రీనివాసుడు యందు మొహం కలిగించడానికి చేసే ప్రయత్నం ఇది. నారదుడిని చూసి పద్మావతీ దేవి భయపడగా, ఏం ఫర్వాలేదునని, తాను ఆనె శుభం కోరేవాడినని, ఆమెకు భవిష్యత్తు చెప్తానని పద్మావతీదేవి చేయి చూపించమంటాడు.

హస్త రేఖలు పరీక్షించి శ్రీ మన్నారాయణుడే ఆమెకు భర్తగా వస్తాడని జోస్యం చెప్పి, వచ్చే భర్త ఏలా ఉంటాడు, అతడి అవయవలక్షణాలన్నీ వర్ణించి, ఆమెలో కాబోయే భర్త పట్ల ఆలోచనలు రేకెత్తిస్తాడు.

ఏనుగు వెళ్ళిపోయిన తరువాత పద్మావతీదేవిని చూసిన శ్రీనివాసుడు, ఆమెను పరిచయం చేసుకోవడం కోసమని ఆమె దగ్గరకు వెళతాడు. తాను శ్రీకృష్ణుడననీ, తన తల్లిదండ్రులు దేవకీవసుదేవులనీ, తాను ఇప్పుడు వేంకటాచలంలో నివాసముంటున్నానని, తన వివరాలు చెప్తాడు. పద్మావతీదేవి కూడా తానది అత్రిగోత్రం అని, తన ప్రవర చెప్తుంది. ఇద్దరి మధ్య ప్రేమ చిగిరిస్తుంది. తన శ్రీనివాసుడితో వివాహం ఇష్టమేనని చెప్తుంది. కానీ అంతఃపురం స్త్రీలతో ఉద్యానవనంలో శ్రీనివాసుడు మాట్లాడిన విషయం ఆకాశరాజుకు తెలిస్తే, దండిస్తాడని, అందువల్ల త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని వారిస్తుంది. కానీ శ్రీనివాసుడు వినడే! అక్కడే నిలిచున్నాడు.

ఎవరైనా చూస్తారని భయం పట్టుకుంది పద్మావతీదేవికి. అసలే మహాసౌందర్యవంతుడు, తాను ఇష్టపడినవాడు, తనను ఇష్టపడేవాడు, దండనకు గురైతే చూడలేదు, ఇతడేమొ కదలట్లేదు , ఇక చేసేది లేక తన చెల్లికత్తెలతో రాళ్ళు విసిరేలా ప్రేరేపిస్తుంది.  

రాళ్ళదాడిలో శ్రీనివాసుడు గుఱ్ఱం ప్రాణం విడిస్తుంది (వాయుదేవుడు ఆ ఆశ్వం యొక్క దేహాన్ని విడిచిపెడతాడు). స్వామికి దెబ్బ తగలదుకానీ, పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ హడవుడిలో ముడివేసిన స్వామి జుట్టు ఊడి, వస్త్రాలు చిందరమందరగా తయారవుతాయి. ఎలాగో అలాగ తప్పించికుని ఇంటికి చేరతాడు శ్రీనివాసుడు.

ఇంటికి చేరాక దిగులుతో అన్నం మానేసి, మంచం మీద పడుకుని ఏదో పోయినట్లు ఏడుస్తాడు (ఏడుపు నటిస్తున్నాడని అర్దం చేసుకోవాలి). ఇంతలో వకుళమాత చేతిలో భోజనపళ్ళెంతో శ్రీనివాసుడు వద్దకు వచ్చి "ఏం నాయనా! భోజనం చేయలేదేమి? ఆరోగ్యం బాగోలేదా? లేక భూతప్రేతపిశాచాలు బాధిస్తున్నాయా? అసలు నీ దుఃఖానికి కారణం ఏమిటి? చెప్పు " అంటూ ప్రశ్నిస్తుంది. కానీ ఈయన ఏమి చెప్పడు. మళ్ళీమళ్ళీ ప్రశ్నించడంతో కాసేపటికి శ్రీనివాశుడు వకుళమాతలో " పిశాచభూతాలు నన్నేం చేస్తాయమ్మ, నేనే మహద్భూతాన్ని (సర్వోత్తముడిని). నా పేరు చెబితినే ఇతరులకు పట్టిన పిశాచాలు తొలగిపోతాయి. నాకేం బాధలేదులే " అంటాడు.

కానీ వకుళమాత ఊరుకోదు. బిడ్డలు ఏడుస్తుంటే ఏ తల్లి మాత్రం ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి. అందుకే మరల మరల ప్రశ్నిస్తుంది. చాలాసేపటికి శ్రీనివాసుడు తాను పద్మావతీదేవిని చూసిన విషయం చెప్పి, ఆమె లేని జీవితం అసలు జీవితమే కాదని, ఆమెనే పెళ్ళి చేసుకుంటానని చెప్తాడు.

ఒకసారి నువ్వు నా బిడ్డవైనప్పుడు, మోక్షం అడగవల్సిందిపోయి నీ వివాహం చూడాలని ఉంది అని వరం అడిగాను. అప్పుడు ఏదో మాయలో పడ్డాను కానీ, ఇప్పుడు పడను. నువ్వెంత మాయలో పడవేయాలనుకున్న, నేను ఆ ఆవకాశం నీకు ఇవ్వను. నీకూ పద్మావతీదేవికి వివాహం చేసి, నా వరం తీర్చుకుంటాను అంటుంది వకుళమాత.

Saturday, 19 October 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - శ్రీనివాసుడు వేంకటాచక ఆగమనం

ఓం నమో వేంకటేశాయ

భృగుమహర్షి వైకుంఠంలో ఉన్నంతవరకు లక్ష్మీదేవుకి మహర్షికి సపర్యలు చేసింది, విష్ణుమూర్తికి సహకరించింది. పాదపూజకు గోరువెచ్చటి నీరు తెచ్చింది, పాదపూజ చేస్తున్న సమయంలో విష్ణువుకు సహకరించింది, మహర్షి పాదోదకం తలపై చల్లుకుంది.

ఎంతగొడవలుంటే మాత్రం అందరి ముందు బయట పెట్టుకుంటామా? మన పరువుకే ఎసరు తెచ్చుకుంటామా? అందువల్ల అంతసేపు మౌనం వహించింది. కానీ మహర్షి వెళ్ళిపోగానే విష్ణువుపై కోపంతో విరుచుకుపడింది (కోపం నటించింది).విష్ణు వక్షస్థలం తన నివాస స్థానమనీ, అటువంటి చోట కాలితో తన్ని, ఒక మానవుడు తనకు అవమానం చేస్తే, విష్ణువు అతడిని శిక్షించకపోగా, సత్కరించాడని, అతనికి చేసే పాదపూజలో తానూ భాగం పంచుకోవలసి వచ్చిందని, ఇంత అవమానం జరిగాకా తాను వైకుంఠంలో ఉండే ప్రసక్తే లేదని, అందువల్ల తానూ కరివీరపురం (కొల్హాపూర్) వెళ్ళిపోతున్నాని చెప్పి లక్ష్మీదేవి వెళ్ళిపోయింది.

అసలు అమ్మవారికి కోపం రావడమేమిటి? విష్ణువును విడిచివెళ్ళడమేమిటి? అంటే, ఇదంతా ఒక లీల. లక్ష్మీదేవికి మనమంతా బిడ్డలం. కలియుగంలో శ్రినివాసుడిగా శ్రీ మహావిష్ణువు వేంకటాచలం మీదకు రావాలి. తన బిడ్డలను కలిపురుషుడు ప్రభావం నుంచి రక్షించాలి, లోకకల్యాణం జరగాలి. వైకుంఠం మొత్తం తిరుమలకు తరలిరావాలి.. అందుకోసం లక్ష్మీదేవి ఈ నాటకమాడింది.

కృష్ణావతారంలో స్వామి యశోదకు వరమిచ్చాడు - శ్రీ కృష్ణుడిని చిన్నప్పటినుంచి అల్లారుముద్దుగా పెంచింది యశోద. కృష్ణుడు 8 వివాహాలు చేసుకున్నా, ఒక్క వివాహం కూడా చూడలేకపోయింది. ఈ బాధ యశోదమ్మను బాగా వేదించింది.  పరమాత్ముడే తన బిడ్డగా పెరిగినా, సంసారమాయలో పడి, మోక్షం అడగాల్సిందిపోయి, కృష్ణుడి వివాహం చూసే భాగ్యం కలిగించమని వరం కోరింది. ఈ ద్వాపరయుగంలో, కుదరదని రాబోయే 28 వ కలియుగంలో తన కోరిక నేరవేరుతుందని యశోదకు కృష్ణుడు వరమిస్తాడు. మరి ఆ కోరికను నేరవేర్చాలంటే, విష్ణువే కృష్ణుడిగా, వేంకటేశ్వరునిగా భూలోకానికి రావాలి. అందుకోసం జరిగే మహానాటకంలో భాగంగా లక్ష్మీదేవి విష్ణువుపై అలిగింది.      
లక్ష్మీదేవి కరివీరపురం వెళ్ళి, అక్కడ తపస్సు చేయసాగింది. లక్ష్మీదేవి లేని వైకుంఠంలో శ్రీమహావిష్ణువు ఉండలేక దుఃఖిస్తూ భూలోకానికి బయదేరాడు. శేషుడు, మేరుపర్వతాలకు ఇచ్చిన వరాల దృష్ట్యా విష్ణువు వేంకటాచలం మీదకు వచ్చాడు. రాముడు, కృష్ణుడు, వామనుడు లాగా ఇది విష్ణువు యొక్క వేరొక అవాతారం కాదు, సాక్షాత్తు విషువే కృష్ణుడి రూపంలో, వేంకటేశ్వరునిగా రావడం విశేషం. లక్ష్మీదేవి విడిచి వెళ్ళిపోయిందన్న బాధతో ఒక వల్మీకం (పుట్ట)లో చేరి ఈయన తపస్సు చేయసాగాడు.

చిన్నచిన్న నాయకులే ఒక ప్రదేశానికి వస్తుంటే, మందీమార్బలం తరలివస్తుంది. అదే పెద్ద నాయకుడైతే, బోలెడు రక్షణ, ఎంతో మంది పోలిసులు, మిలటరీవాళ్ళు, అభిమానులు......... పెద్ద సంఖ్యలో వస్తారు. మరి వేంకటాచలం మీదకు వచ్చిందేమైనా సామాన్య మానవుడా? కాదు......... అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, సర్వదేవతలకు అధిదేవుడు. మరి ఈయన వేంకటాచలానికి వస్తుంటే, ఈయన వెంట దేవతలు రాకుండా ఉంటారా?

మొత్తం వైకుంఠం తిరుమలకు తరలి వచ్చింది. ఆదిశేషుడే తిరుమల కొండ, శంఖుచక్రాలు మొదలైనవి వేంకటాచలం మీద తీర్ధాలుగా మారాయి. త్రేతాయుగంలో హనుమంతుడు వేంకటాచలం మీదే జన్మించారు. దేవతలందరు వృషాలుగా మారిపోయారు, ఋషులు, మునులు మృగాలుగా మారారు, పితృదేవతలు పక్షులుగా, యక్షకిన్నెరులు రాళ్ళుగా వేంకటాచలం మీద స్థిరపడ్దారు, వారు కూడా వారివారి సాధనలో మునిగిపోయారు. సమస్త బ్రహ్మాండమంతా వేంకటాచలం మీదకు వేంచేసింది.

అందుకే తిరుమల పరమపవిత్రం. తిరుమలలో ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయడం, చెత్త, ప్లాస్టిక్‌కవర్లు పారేయడం, సిగిరెట్లు కాల్చడం, మద్యపానం చేయడం, మాంసాహారం తినడం, ఇంకా నేను చెప్పడం ఎందుకు. తిరుమల పవిత్రతకు బంగం కలిగించే పనులు చేయడం పెద్దతప్పు.

అన్నీ బాగానే ఉన్నాయి కానీ స్వామికి ఆకలి తీర్చేవారేరి? పాలసముద్రంలో శయనించే శ్రీనివాసుడు ఒక మానవుడిగా వేంకటాచలం మీద తపస్సు చేస్తున్నా, ఆయనకు గుక్కెడు పాలు ఇచ్చేవారేరి? శ్రీనివాసుడు ఆకలితో అలమటిస్తున్నాడు (కాదు, లోకానికి ఒక సందేశం ఇవ్వడం కోసం ఆకలి నటిస్తున్నాడు. అదేంటో తరువాత తెలుస్తుంది).

ఎంత కోపగించుకున్నా, ప్రేమలు ఎక్కడికిపోతాయి? లక్ష్మీదేవి కరివీరపురంలో ఉంది కానీ, ఆవిడ మనసంతా శ్రీనివాసుడి మీదే ఉన్నది. భార్యాభర్తలంటే అంతేమరి.

లక్ష్మీదేవి శ్రీనివాసుడి ఆకలి బాధ తీర్చడం కోసం తన కొడుకైన బ్రహ్మను, సోదరుడైన శివుడిని పిలిచి, బ్రహ్మ ఆవుగా రూపం స్వీకరిస్తారని, శివుడుని దూడగా స్వీకరించమని, తాను గొల్లదాని వేషం దరిస్తానని చెప్తుంది. శ్రీనివాసుడు తపస్సు చేస్తున్న ప్రాంత రాజు యొక్క ఆవుల మంద వేంకటాచలం మీద గడ్డి మేతకు వెళ్తుందని అమ్మవారికి తెలుసు. శ్రీనివాసుడు క్షీరాభిమాని. ఆయనకు పాలు అంటే మహాప్రితి. ఈనాటికి తిరుమలలో ఉదయం ఆవుపాలు నైవేధ్యం పెడతారు, భోగశ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తారు, శుక్రవారం మూలవిరాట్టుకు కూడా క్షీరాభిషేకం తప్పక చేస్తారు). పుట్టలో ఉన్న తన స్వామికి కైంకర్యం ఏర్పాటు చేయాలనుకొంది.

చెప్పిన విధంగానే వేషం ధరించి ఆ ప్రాంతపు రాజ మందిరానికి, ఆవును, దూడను వెంట పెట్టుకుని వెళ్ళింది. అది చోళదేశం, ఆ రాజు పేరు చక్రవర్తి. తన దగ్గర ఉన్నది మేలుజాతి గోవని, అది మధురమైన పాలు ఇస్తుందని చెప్తుంది. మేలుజాతి ఆవు అంటోంది కనుక, ఆ ఆవుపాలు తన కొడుకు కోసం వాడితే బాగుంటుందని భావించిన మహారాణి, గోవును, దాని దూడను కొనాలని నిశ్చయించుకుని, దాన్ని కొంటుంది.

ఆ ఆవు ప్రతిరోజు మిగితా మందతో కలిసి వేంకటాచలానికి వెళ్ళేది. కానీ, మేతమేయకుండా శ్రీనివాసుడు తపస్సు చేస్తున్న పుట్ట వద్దకు వెళ్ళగానే భక్తి పారవశ్యంతో ఎవరూ పిండకుండానే తన పొదుగునుంచి పాలు ధారులుగా కార్చేది. రోజూ ఇదే పరిస్థితి. ఆవు (బ్రహ్మదేవుడు) వేంకటాచలానికి రావడం, శ్రీనివాసుడి ఆకలి తీర్చడం.

ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ తిరిగి రాజమహలు చేరాక, పాలు ఇచ్చేది కాదు. రాణిగారికి పరిస్థితి అర్దమవలేదు. ఎంతో ఖరీదు పోసి కొన్న మేలుజాతు ఆవు ఉద్దరిణెకు సరిపడా పాలు కూడా ఇవ్వడంలేదు. కారణం తెలియదు. గోపాలకుడు పితుకుతున్నాడనుకుని అతడిని పిలిచి అడుగగా, తనకేమి తెలియదని, తాను పాలుపితకడం లేదని ప్రమాణం, చేసి మరీ చెప్తున్నాడు. ఏం చేయాలి?..... అని ఆలోచించి గోపాలకుడిని దండించింది, కొరడాలతో కొట్టించింది, హెచ్చరించింది, పరిస్థితి మారకపోతే కఠినశిక్ష తప్పదని హెచ్చరించింది.

హడలిపోయిన గోపాలకుడు ఆ ఆవు వెనుకాలే వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న వింత కళ్ళారా చూశాడు. ఆవు పొదుగునుండి పాలు ధార్లుగా పుట్టలోకి కారిపోతున్నాయి. తనను అంతగా కొట్టించి, మాటలు పడడానికి కారనమైన ఆవు మీద అతనికి పట్టరాని కోపం వచ్చింది. వేంటనే ఆవేశంతో తన చేతిలో ఉన్న గొడ్డలితో ఆవును కొట్టబోయాడు.

భక్తవత్సలుడు, కరుణాసముద్రుడు, ఆశ్రితరక్షకుడు, జీవితకాలం దూషించి, జీవితం ఆఖరున పరమాత్మ అని ప్రేమతో పిలవగానే 'నేనున్నా రా' అంటూ పలికే పరంధాముడు, తన బిడ్డపై దెబ్బ పడుతుంటే చూస్తూ ఉరుకుంటాడా? కృష్ణావతరంలో బాల్యం మొత్త గోవులతో గడిపి గోవు విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన గోకులనందనుడు గో హత్య జరుగుతుంటే మౌనం వహిస్తాడా? 

అందుకే పుట్టలో ఉన్న పరమాత్మ ఆవును పక్కకు నెట్టుకుంటూ ఒక్కసారిగా పైకి లేచాడు. గొడ్డలి దబ్బను స్వామి స్వీకరించాడు. ఆ దెబ్బకు స్వమి తల చిట్లి, ఏడు తాటి చెట్ల ప్రమాణం ఎత్తు ఎగిరిందని భవిష్యోత్తర పురాణం అంటుంది. అంతే, ఆ సంఘటనతో ఆ గోపాలకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. నిజానికి ఆయనది మనలా ప్రాకృతిక దేహం కాదు, అది సప్తధాతువులతో నిర్మితమై ఉండదు. కాని, ఒక లీల చూపడానికి, గో మహత్యం లోకానికి చెప్పడానికి, గోవును కొట్టాలన్నా ఆలోచనే తనకు గాయం చేస్తుందన్న విషయాన్ని లోకానికి తెలియజెప్పాలనుకున్నాడు.

ఆ గోపాలకుడు మరణించగానే, ఆ ఆవు కొండదిగి రాజమందిరానికి వెళ్ళి, రాజుసభలో రోదిస్తుంది. ఏదో జరిగిందని అర్దం చేసుకున్న రాజు, ఆ ఆవు వెంబడి సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ ప్రవహిస్తున్న రక్తాన్ని, గాయపడిన దివ్యపురుషుడిని చూస్తాడు. ఆ రుజును చూస్తూనే శ్రీనివాసుడు ఆవేశంతో ఊగిపోతాడు.

చక్రవర్తితో స్వామి చాలా నిష్ఠురంగా మాట్లాడుతారు. 'ఓయి రాజా! నీ రాజ్యంలో ఇంత అరాచకమా? జరిగిన తప్పుకు శిక్ష అనుభవించు. పిశాచిగా మారిపో' అంటూ శపించారు.

నేనెం తప్పు చేశాను? గోపాలకుడు చేసిన తప్పకు నన్ను శిక్షించడం ఎందుకు? అయినా ఇంత పెద్ద శిక్ష వేస్తావా? చేయనై తప్పుకు శిక్ష అనుభవించాలా? అంటూ చక్రవర్తి స్వామివారితో పలుకుతాడు.

ఇంట్లో భార్య, పిల్లలు, పనివారు / సేవకులు చేసిన తప్పకు బాధ్యత యజమానిది. శిష్యుడి తప్పు చేస్తే బాధ్యత గురువుది. రాజ్యంలో తప్పులు జరిగితే బాధ్యత రాజుది. కనుక యజమానిగా, రాజుగా, నీ గోపాలకుడు చేసిన తప్పకు శిక్ష నీవే అనుభవించాలంటాడు శ్రీనివాసుడు.

ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. కేవలం ఆవును దాడి చేయాలన్న ప్రయత్నం జరిగితేనే స్వామి ఆవేశం కట్టలు తెంచుకుంది. మరి గోవధ జరిగితేనో? ఈ ప్రపంచంలో పుట్టింది మొదలు మరణం వరకు, ఆఖరికి మరణీంచిన తరువాత కూడా సంపూర్తిగా లోకోపకారానికి ఉపయోగపడేది భారతీయ గోవు ఒక్కటే. గావో వీశ్వస్యమాతరం అంటుంది వేదం. ఆవు సమస్త విశ్వానికి మాతృస్థానంలో ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గోవధ జరగరాదని వేదం గట్టిగా చెప్పింది. గోవు సర్వదేవాతస్వరూపం.

ప్రతిరోజు ఉదయం, మన దేశంలో లేగదూడలను, ఆవులను వేలల్లో వధించి విదేశాలకు తరలిస్తున్నారు. ఆవు మీద దబ్బపడినందుకు అంత ఎత్తున లేచిన స్వామి మన దేశంలో జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాడా? ఈ పాపం ఎవరిది? మన నాయకులది............ కాదు, కాదు, వారిని ఎన్నుకున్న ప్రజలది. మనం గోవధ మీద నోరెత్తకపోతే, మనకూ, మన పిల్లలకు కూడా ఇదే శాపం వర్తిస్తుందని మర్చిపోకూడదు.

పరమాత్ముడి మాటలతో రాజు దుఃఖిస్తాడు. రాజుకు ఊరట కలిగిస్తూ, త్వరలో తనకు పద్మావతీ దేవితో వివాహం జరుగుతుందని, అప్పుడు పద్మావతీదేబి తండ్రి ఆకాశరాజు ఒక కిరీటం బహుకరిస్తాడనీ, ఆ కిరీటాన్ని తాను ధరించిన ప్రతి శుక్రవారం ధరిస్తాననీ, అప్పుడు ఒక 6 ఘడియల కాలం ఆనందబాష్పాలు వస్తాయానీ చెప్పిన శ్రీనివాసుడు, అప్పుడు నీకు పిశాచపీడ ఉండదు, ఆ సమయంలో నీవు సుఖం అనుభవిస్తావు అంటూ రాజుతో పలుకుతాడు.

వల్మీకంలో ఉంటున్న స్వామి, ఒకానొక రోజు పుట్టనుంచి బయటకు వచ్చి, అక్కడ విహారం చేస్తుండగా, వరహాస్వామి తన పరివారంతో కలిసి దూరం నుంచి అటువైపు వస్తుండడం గమనించి, భయపడి గబగబా మళ్ళీ వల్మీకంలోకి వెళ్ళి దాక్కున్నాడు.

హిరణ్యాక్షుని వధించి, భూదేవిని కాపాడిన తరువాత ఆదివరహాస్వామి ఈ వేంకటాచల క్షేత్రంలోనే నివాసం ఏర్పరుచుకున్నారు. శమీకధాన్యం పంటల్ని పరివారం చేత పండిస్తూ ఈ క్షేత్రంలో నివాసముంటున్నారు. తమ శమీక ధాన్యాన్ని దొంగిలించడానికి వచ్చిన దైత్యులను సంహరించి వస్తున్నారు.

శ్రీనివాసుడు వల్మీకంలోకి వెళ్ళడం చూసిన వరాహమూర్తి, పుట్ట దగ్గరకు వెళ్ళి బయటకు రమ్మని శ్రీనివాసుడిని పిలుస్తారు. ఇది ఒక మహాద్భుత ఘట్టం. ఒకే విష్ణువు యొక్క వేర్వేరు రూపాలు ఒకే దగ్గర కలుసుకోవడం, ఒకరిని ఒకరు పరిచయం చేసుకోవడం, తమ వివరాలు చెప్పుకోవడం మాట్లాడుకోవడం మహావిశేషమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని దేవలోకం నుంచి తిలకిస్తున్న దేవతలు భక్తిభావంతో పుష్పవర్షం కురిపించారు.

అసలు భగవంతుడు ఒక్కడే. కానీ అనేకరూపాల్లో దర్శనమిస్తాడు. మాయ ప్రభావం చేత శివుడు, విష్ణువు, దుర్గ, లక్ష్మీ, గణపతి, సరస్వతీ........... ఇలా ఎంతో మంది దేవతలు ఉన్నారనుకుంటాము. ఎవరిని పూజించినా, ఆఖరున అన్ని దైవరూపాలు ఒకే సచ్చిదానందరూపంలొ ఐక్యమవుతాయి. ఇక్కడ విష్ణువు ఒక్క వివిధ అవతారాలు కలుసుకోవడం కూడా మాయలో పడవేయడానికే. అర్దమైనవారు దైవలీలగా అనందిస్తే, అర్దం కానీ వారు, దైవాలు వేరనుకోని కొత్తవాదన తిసుకువచ్చి, ఉపాసన నుంచి పక్కకు జరుగుతారు.

ఈ ఆదివరాహస్వామిని దర్శించి ఆయన స్తోత్రం పఠిస్తే, ఇల్లు కట్టుకోవాలన్న కల నేరవేరుతుంది. ధార్మిక కార్యక్రమాల కోసం ఉపయోగించడానికి భూమి దొరుకుతుంది.  

నాకు మీ వరహాచలం మీద నివాసం ఉండడానికి కొంత స్థలం కావాలని శ్రీనివాసుడు వరహాస్వామిని అడుగుతారు. కలికాలంలో జరగబోయే పరిస్థితులు చూపించడానికన్నట్లు ఉంటుంది. అడగకుండానే, ఎన్నో రోజులుగా అక్కడ పుట్టలో అక్రమంగా ఉంటున్నారు. ఇవాళ వరహాస్వామికి కనపడ్డాడు కాబట్టి స్థలం కావాలని ఆడుగుతున్నాడు, ఇవ్వమని అనుమతి కోరుతున్నాడు.

ఈరోజు ప్రభుత్వం స్థలాల గతి కూడా ఇంతే కదా. ముందు అక్రమంగా, గుట్టూ చప్పుడు కాకుండా ఆక్రమణ చేయడం, తరువాత దాన్ని సక్రమం చేయమని వివిధరకాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం , ప్రభుత్వం కూడా 'అక్రమం - సక్రమం' చేసే పధతులు ప్రవేశపెట్టి అక్రమ ఆక్రమణలను, నిర్మాణాలను సక్రమం చేయడం కనిపిస్తూనే ఉంది. పాతబడ్డ కొద్ది కొత్తగా అనిపించేది పూరాణం అంటుంది శాస్త్రం.

'ఊరికే స్థలం ఇవ్వడం కుదరదయ్యా! డబ్బు చెల్లించాలి అంటారు" వరాహస్వామి. "ఇవ్వటానికి నా దగ్గర ఏముంది? కానీ భవిష్యత్తులో కోట్లాదిమంది భక్తజనం నా దర్శనానికి వస్తారు. వారు కొండకు వచ్చినప్పుడు, ప్రధమ దర్శనం నీది. తరువాత దర్శనం నాది. ముందు అభిషేకం నీకు, ఆ తర్వాతే నాకు, నైవేద్యం కూడా ముందు నీకే, తర్వాతే నాకు" అన్నాడు శ్రీనివాసుడు.

అందుకే తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు ముందు వరాహస్వామిని దర్శించుకున్నాకే వేంకటేశ్వరుడి దర్శనానికి వెళ్ళాలి. లేకుంటే మనకు స్వామిని దర్శించిన ఫలితం దక్కదు.

సరేనన్న వరహాస్వామి శ్రీనివాసుడికి కొంత స్థలం ఇస్తాడు.  

ఈ భూమి / స్థలం నాది, ఈ ఆస్తి నాది, నాకు 10 ఇళ్ళు ఉన్నాయి అంటూ తరచూ విర్రవీగీపోతుంటాం. కానీ నిజానికి ఈ భూమి వరహాస్వామిది. రాక్షసుల బారి నుంచి భుమాతను తప్పించారు వరహాస్వామి. భూమియే కాదు, మనకు ఉన్నవన్ని దైవప్రసాదాలే. ఈ మనుష్యజన్మ, మనం తినే అన్నం ముద్ద, మన చదువు, సంస్కారం, ఈ భారతదేశంలో పుట్టడం, ఇవన్నీ దైవానుగ్రహం లేకుండా రావు.

అది మర్చిపోయి, ఇది నాది, అది నాది అనుకుంటూ భ్రమలో బ్రతికేస్తున్నాం, నాది అనుకోవడమే బంధానికి హేతువు. బంధం మమకారానికి, అహంకారానికి కారణమై పునర్జన్మకు దారితీస్తుంది. ఇది నాది కాదు, నాకు భగవత్ ప్రసాదంగా వచ్చిందనుకోవడం వల్ల బంధం తెగిపోతుంది. శ్రినివాసుడు కూడా తన చేష్టల ద్వారా తన భక్తులకు అదే సందేశం ఇచ్చాడు. ముందు అభిషేకం వరహాస్వామికి అంటే తనకు అన్ని ఇచ్చినవాడికి, తరువాత తనకు. ముందు నైవేద్యం వరాహమూర్తికి, తరువాత స్వామికి. అంటే మనకు ఈ లోకంలో లభ్యమయ్యేవన్నీ కూడా ముందు పరమాత్మకు (ఇష్టదైవానికి) సమర్పించి, తరువాత స్వీకరించమన్నాడు. అన్నం తినే ముందు, ఇది నాకు భగవత్ ప్రసాదంగా వచ్చిందన్న భావనతో తినమన్నాడు, ఇది నాది, నేను సంపాదించానన్న అహం వీడి, ఇది భగవంతుని దయ వల్ల నాకు సిద్ధించిందని భావించమన్నాడు. సర్వకర్మలను భగవంతునకు అర్పించమని తన ఈ దివ్య చేష్ట ద్వారా లోకానికి చెప్పాడు.

స్థలం ఇచ్చాక ఇద్దరూ ఒప్పందం చేసుకున్నారు. మనం ఇల్లు అద్దెకిచ్చినప్పుడు ఏ విధంగానైతే విచారణ (ఎంక్వైరి) చేస్తామో, అలాగే వరహాస్వామికి కూడా నీతో ఎంత మంది ఉంటున్నారని అడుగుతారు. నాకెవరు లేరు అంటాడు స్వామి. అయితే నీకు వంట చేయడానికి, ఇతర సేవలు చేయడానికి వకుళ అనే దాసిని పంపుతాను అని, వకుళను పంపుతారు వరహాస్వామి.

కధ వింటున్న శౌనకాదులు, సూతు మహామునితో "అసలీ వకుళ ఎవరు? ఆమె జన్మ వృతాంతమేమి?" అని అడుగుతారు.

To be continued..............

Tuesday, 15 October 2013

శ్రీ వేంకటేశ్వర చరిత్రామృతం - విశ్వశాంతి యాగం - భృగు మహర్షి శాపం

ఓం నమో వేంకటేశాయ 

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరుడు. కలౌ వేంకటనాయకః అన్నారు, ఒక్కో యుగంలో ఒక్కో అవతారంలో పూజలందుకున్న స్వామి, కలియుగంలో శ్రి నివాసుడిగా ఆరాధించబడుతున్నాడు. శ్రీ నివాసుడి దివ్యలీలా విశేషాల గురించి, వేంకటాచల మహాత్యం గురించి 12 పురాణాల్లో ప్రస్తావించబడింది.

'వైకుంఠానికి సమానంగా ఈ వేంకటాచలంలో పరమాత్ముడు ఎందుకు ఉన్నాడు?' అని సనకాది మహామునులు సూతమహర్షిని ఒకసారి అడుగుతారు.

అప్పుడు సూతులవారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. ఒకప్పుడు మహర్షులంతా కలిసి ఒక మహాయజ్ఞం చేయాలనుకున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన నారద మహర్షి, మహర్షులను ఉద్ద్యేశించి కొన్ని ప్రశ్నలు వేస్తారు. "ఎవరి గురించి మీరు ఈ కర్మను చేస్తున్నారు? ఈ యజ్ఞ కర్మ యొక్క ఫలాన్ని ఎవరికి సమర్పిస్తారు? ఈ యజ్ఞానికి భోక్త ఎవరు? సర్వకర్మలను ఎవరికి సమర్పించాలి? ఇవన్నీ స్వీకరించే సర్వోత్తముడు ఎవరు?"

యజ్ఞభోక్త అంటే యజ్ఞంలో వేసిన హవిస్సును స్వీకరించేవాడని అర్ధం. మనం ఎవరిని ఉద్ద్యేశించి యజ్ఞం చేస్తామో, అది ఆ దేవతకు చేరవేస్తాడు అగ్నిహోత్రుడు, ఆ హవిస్సుతో తృప్తి పొందిన దేవత మన కోరికలను తీరుస్తుంది. అందరూ, అన్ని యజ్ఞాలు కోరికల కోసం చేయరు. విశ్వశాంతి కోసం కొన్ని చేస్తారు, ఎటువంటి ఫలితం ఆశించకుండా ఇంకొన్ని చేస్తారు. మరి ఇవన్నీ ఎవరు స్వీకరిస్తారన్నది నారదమునీంద్రుల ప్రశ్న.

యజ్ఞం అంటే నిష్కామ కర్మ, స్వార్ధరహిత కర్మ. ఇక్కడ యజ్ఞం అంటే అగ్నిహోత్రం పెట్టి చేసేది మాత్రమేనని అనుకోకూడదు. మనం ఎవరికో రక్తదానం చేస్తాం, ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తాం, గోమాతలు కబేళాలకు తరలిపోకుండా అడ్డుకుంటాం. ఎన్నో దానాలు చేస్తాం, సేవకార్యక్రమాలు నిర్వహిస్తాం, పేదలకు అహారం పంచిపెడతాం. ఇవన్నీ కూడా యజ్ఞాలే. యజ్ఞం అంటేనే నిస్వార్ధంగా చేసేది. మరి మనం నిత్యం చేసే ఈ కర్మలు ఎవరిని చేరుతాయి? వీటిని ఎవరు స్వీకరిస్తారు? ఇది నారద మహర్షి అడిగిన ప్రశ్నల సారం.

నారదుడి ప్రశ్నతో మహర్షుల్లో ఎవరు సర్వోత్తముడు? ఎవరికి సర్వకర్మఫల సమర్పణ చేయాలి? యజ్ఞభోక్త ఎవరు? అన్న చర్చ మొదలైంది. అందరూ తీవ్రంగా చర్చించి, ఆ మహర్షుల్లో ప్రముఖుడైన భృగు మహర్షికి ఈ సమస్యను పరిష్కరించే బాధ్యత అప్పగించారు. పరిష్కారం చూపవలసిందిగా ప్రార్ధించారు.

వీటికి సమాధానం తెలుసుకోవడం కోసం భృగుమహర్షి బ్రహ్మదేవుడు, సరస్వతీ దేవి ఉండే సత్యలోకానికి వెళ్ళారు. ఆ సమయానికి బ్రహ్మాసరస్వతులు ఏకాంతంలో ఉంటారు. భృగుమహర్షి వారికి నమస్కారం చేస్తారు, కానీ బ్రహ్మదేవుడు ఏమి గమనించనట్లుగా ఉంటారు.

బ్రహ్మదేవుడు సృష్టికర్త, మహాజ్ఞాని. ఆయనకు తెలియందేముంటుంది?  కలియుగంలో కలిపురుషుడి ప్రభావం నుంచి జనులను ఉద్ధరించడానికి విష్ణువు వేంకటాచలం మీద అవతరించవలసి ఉంది. ఆ అవతారం స్వీకరించే దశలో సాగుతున్న జగన్నాటకం ఇది. ఈ ఋషి ద్వారానే విష్ణువు భులోకానికి వెళ్తాడన్నది బ్రహ్మదేవుడికి తెలుసు. కనుక ఏమి ఎరగనట్లు మౌనం వహించాడు.

మనకన్నా యోగ్యులైనవారి వద్దకు, పెద్దవారి వద్దకు వెళ్ళినప్పుడు నమస్కరించడం (సాష్టాంగా నమస్కారం, ప్రణామం మొదలైనవి చేయడం) మన కర్తవ్యం. నమస్కారం స్వీకరించినవారు దాన్ని భగవంతునకు అర్పించి, ఆశీర్వదించడం, నమస్కారం స్వీకరించిన పెద్దల కర్తవ్యం. ఇది ధర్మం. ఈ మాత్రం కూడా బ్రహ్మదేవునికి తెలియదని భావించాడు భృగుమహర్షి.

'ఈ లోకంలో నీకు ఆలయం లేకుండు గాకా' అంటూ బ్రహ్మను శపించాడు భృగుమహర్షి. అందుకే బ్రహ్మదేవుడికి ఎక్కడా ఆలయం కట్టి పూజించరు.

బ్రహ్మదేవుడి ఆలయం పుష్కర్‌లో ఒకటి ఉంది. అక్కడ బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. దానికి గుర్తుగా ఒక చిన్నసరస్సు కూడా ఉంది. అటు తర్వాత మన రాష్ట్రంలో పవిత్ర గోదావరి నదీతీరంలో, బ్రహ్మదేవుడు సరస్వతీ దేవితో కలిసి యజ్ఞం చేసిన ప్రదేశంలో, ముక్కామల క్షేత్రంలో ఈ మధ్యకాలంలో ఆలయం నిర్మించారు ముక్కామల పీఠాదిపతి శ్రీ శ్రీ శ్రీ శ్రీధర స్వామి.

బ్రహ్మను శపించిన భృగువు కోపంతో కైలాసానికి చేరుకుంటాడు. ఆ సమయంలో శివుడు కైలాసంలో పార్వతీదేవితో ఏకాంతంలో ఉంటాడు. శివుడి ఆజ్ఞా లేనిదే చీమైనా కుట్టదని శాస్త్రం. అటువంటి శివుడు భృగువు వచ్చాడాన్న విషయాన్ని గమనించనట్లు నటిస్తాడు. దాంతో కోపం వచ్చి, 'మహర్షుల ఆగమనాన్ని కూడా గుర్తించక కామాంధుడవై ఉన్న నీవు సర్వోత్తమ్ముడు కానేరవు. లోకంలో నీకు మూర్తి పూజ లేకుండు గాకా' అంటూ శపించాడు భృగు మహర్షి. అందుకే మనం శివుడిని విగ్రహరూపంలో పూజించమని పెద్దల మాట. కానీ, భృగు మహర్షి శపించకముందు నుంచి లోకంలో లింగారాధనే ఉన్నది. శివుడి విగ్రహాన్ని పూజించేవారికంటే శివ లింగాన్ని పూజించేవారు శక్తిమంతులని, వారిని ఎవరు ఓడించలేరని మహాభారతంలో కృష్ణపరమాత్మ చెప్తారు. పరమాత్మ మాటకు కొనసాగింపుగా మహర్షి శాపం ఇచ్చాడు (ఇప్పించాడు పరమాత్ముడు). ఇదో దైవలీల.

మనకు దగ్గరలో శివుడిని విగ్రహరూపంలో కొలిచే ఒక క్షేత్రం చిత్తురు జిల్లా, సురుటపల్లిలో ఉంది. ఇక్కడ శివుడు పార్వతీదేవి ఒడిలో నిద్రిస్తునట్లుగా ఒక పెద్ద శిలాముర్తి ఉంటుంది.

ఆవేశంతో ఉన్న భృగుమహర్షి వైకుంఠం చేరుకుంటాడు. వైకుంఠంలోనూ అదే పరిస్థితి. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ఏకాంతంలో ఉంటారు. భృగుమహర్షి ఆగమనాన్ని పట్టించుకోనట్ట్లు ఉంటారు. తెలియక కాది, లోక కల్యాణం కోసమని.......................... ముందు రెండులోకాల్లో పరిస్థితే ఇక్కడా అనుభమయ్యేసరికి భృగుమహర్షి ఆవేశం కట్టలుతెంచుకుంటుంది. అంతే, కోపంతో విష్ణుమూర్తి వక్షస్థలంపై (లక్ష్మీదేవి నివాసముండే ప్రస్దేశంలో) కాలితో తంతాడు........

అప్పుడే గమనించినట్లు విష్ణుమూర్తి భృగుమహర్షి వైపు చూసి ఆయనకు ఉపచారాలు చేస్తాడు...... అతి కాఠిన్యమైన నా దేహ్న్ని తగిలి మీ పాదానికి నొప్పి కలిగి ఉంటుందంటూ ఆ కాలి వత్తి ఉపశమనం కలిగిస్తాడు. శ్రీమహాలక్ష్మీని ఆదేశించి మహర్షికి పాదపూజ చేస్తాడు. మహర్షి పాదోదకం తన పై చల్లుకుని, లక్ష్మీదేవీపై చల్లి, తన మందిరమంతా, వైకుంఠమంతా చల్లిస్తాడని పురాణవచనం.

భృగుమహర్షికి అరికాలిలో మూడవకన్ను ఉంటుంది. ఆ కన్ను కారణంగానే అతనిలో అవేశం ఎక్కువ ఉంటుంది. ఎంతటి గొప్ప సాధకుడైనా, క్రోధం ఉంటే, అతని సాధన వ్యర్ధమవుతుంది. భృగుమహర్షి గొప్పవాడు, తపోశక్తితో మూడులోకాలకు కాలినడకన వెళ్ళగలిగాడు. కానీ, అతనిలో కోపం కారణంగా బ్రహ్మను, శివుడిని శపించి, తను ఎన్నో ఏళ్ళ తరబడి తపస్సు చేసి పొందిన తపశ్శక్తిని మొత్తం వృధా చేసుకున్నాడు.

తన భక్తులు ఎప్పటికి నాశనం పొందరని పరమాత్మ గీతలో చెప్తారు. తన భక్తుడు ఎంతటి దుర్మార్గుడైనా, అతన్ని నిందించరాదని, భగవంతుని నమ్మాడు కనుక ఎప్పటికైన బాగుపడతాడని చెప్తాడు. తన భక్తులను ఉద్ధరించడం తన బాధ్యతగా స్వీకరిస్తాడు పరంధాముడు. మనం ఏ రూపంలో పీజిస్తే, ఆ రూపంలోనే మనలని ఉద్ధరిస్తాడు. అలాగే భృగుమహర్షిని కూడా ఉద్ధరించాలి, క్రోధం నుంచి విముక్తి కలిగించాలని భావించాడు శ్రీ మహావిష్ణువు.

భృగుమహర్షికి పాదపూజ చేస్తూ, అతని అరికాలిలో ఉన్న నేత్రాన్ని చిదిపేస్తాడు. క్రోధం నశించగానే, భృగు మహర్షికి తాను చేసిన తప్పు అర్ధమవుతుంది. విష్ణువును క్షమించమని వేడుకుంటాడు. తాను చేసినపనికి పశ్చత్తాప పడతాడు. విష్ణువు సర్వోత్తముడని, భూలోకానికి తిరిగి వచ్చి మహర్షులకు చెప్తాడు.

To be continued....