Saturday, 8 February 2014

Great scientists and Indian Rishis

How is it that all of a sudden, through 1000's of years of human history, all the great scientists of the western world were born together??? Was it a lottery into the materialistic development of countries like UK, USA, Germany, etc.???


Only an Indian, who is well aware of his culture can raise such a question, as westerners give less scope for going against them.

The truth is that when Newton's forefathers were monkeys, Bhaskaracharya, an Indian scholar, wrote an entire book on gravity. Einstein was wise enough to accept that the source of inspiration for all his research was Indian culture. 

Our science, though lot more advanced, was never patented, as the generations who lived then, did lot of research beyond the materialistic world as well. 

But when thieves arrived our country, they had no option but to steal and register our research in their names. All they needed was a stamp which gave them a license to steal our research.

Via Hindu news

హిందూ ధర్మం - 13

1- ధృతిః : ఎంతటి ఆపద వచ్చినా, మానసిక స్థైర్యాన్ని, దైర్యాన్ని కోల్పోకపోవడం, ధృడ నిశ్చయం కలిగి ఉండడం ధృతిః. ప్రారంభించిన పనిని, ఎన్ని ఆపదలు, విఘ్నాలు వచ్చినా, తట్టుకుని, ఎదురించి, పోరాడి, పూర్తి చేయడం ధృతిః. నిత్యం సంతోషంగా ఉండడం, చావు తన్నుకు వస్తున్నా, ఆత్మవిశ్వాసం సడలకుండా, మృత్యువుకు సైతం ఎదురు నిలబడి పోరాటం చేయడం ధృతిః..

చిన్నప్పుడు భర్తృహరి సుభాషితాల్లో ఒక పద్యం చదివాం. గుర్తుందా?

ఆరంభించరు నీచమానవులు విఘ్నాయససంత్రస్తులై
యారభించి పరిత్యజింతురు విఘ్నాయాత్తులై మధ్యముల్
ధీరుల్ విఘ్ననిహన్యమాను లగుచున్ ధృత్యున్నతోత్సాహులై
ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

ఏదైన ఒక పని మొదలుపెడితే, ఆపదలు, అడంకులు, కష్టాలు వస్తాయని భయపడి, అసలు చేయాల్సిన పనిని చేయకుండా తప్పించుకుంటారు కొందరు. వాళ్ళను నీచులు/అధములు అన్నాడు శతకకర్త. ఇక రెండవ రకంవారు, పని మొదలుపెట్టినా, ఆటంకాలు వచ్చాయని మధ్యలోనే వదిలిపెట్టేస్తారు, ఇక మావల్ల కాదు అని చేతులు ఎత్తేస్తారు, వీరు మధ్యములు. మూడవ రకంవారు, కష్టాలే రానీ, కన్నీళ్ళే రానీ, వచ్చిన ప్రతి ఆటంకాన్ని తొలగించుకుంటూ, ప్రతి ఆపదను ఎదురుకుంటూ, ఎప్పుడో ఏదో వస్తుందని భయపడకుండా, దిగులు చెందకుండా, 'ధృతి'తో, ఉత్సాహం కలిగినవారై, పనిని పూర్తి చేస్తారు, వీళ్ళు ధీరులు అనగా బుద్ధిమంతులు. ప్రతి మనిషికి ఉండవలసిన లక్షణం కూడా అదే అంటున్నది మనుస్మృతి. అందరూ కర్తవ్య నిర్వహణలో ధీరులు కావాలి. ధృతితో ఆఖరివరకు పోరాడి విజయం సాధించాలి. అదే ధర్మానికున్న మొదటి లక్షణం.

To be continued...................

Thursday, 6 February 2014

హిందూ ధర్మం - 12

ధర్మానికి అనేకమంది ఋషులు నిర్వచనాలు చెప్పారు. అందులో ప్రధానంగా మనువు మహర్షి, తన మనుస్మృతిలో ధర్మానికి 10 లక్షణాలు ఉంటాయని చెప్పారు.

धृतिः क्षमा दमोऽस्तेयं शौचमिन्द्रियनिग्रहः ।
धीर्विद्या सत्यमक्रोधो दशकं धर्मलक्षणम् ॥
                                                             
- मनुस्मृति

ధృతిః క్షమ దమోస్తేయః శౌచం ఇంద్రియనిగ్రహః |
ధీవిద్యా సత్యమక్రోధః దశకం ధర్మలక్షణం ||

మనుస్మృతిః

ధృతి, క్షమా, దమము, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, ధీః (బుద్ధి), విద్యా, సత్యం, అక్రోధము (కోపం లేకపోవడం) అనే ఈ 10 ధర్మం యొక్క లక్షణాలు. ఏ మనిషైయిన ధర్మాన్ని ఆచరిస్తున్నాడా లేదా అని అనుమానం వస్తే, అతనిలో ఈ 10 లక్షణాలు ఉన్నాయో లేదొ గమనించుకోవాలని మనుమహర్షి చెప్పారు. ధర్మాన్ని ఆచరించాలనుకునేవారు ఈ 10 లక్షణాలు నిత్యం అవలంబించాలని చెప్పారు.

To be continued...................

Wednesday, 5 February 2014

ఫిబ్రవరి 6, రధసప్తమి

రధసప్తమి


హిందు ధర్మంలో ఆదివారం చాలా పవిత్రమైంద రోజు. ఎప్పుడైనా సరే అదివారం సూర్యోదయ సమయానికి నిద్రించకూడదు. సూర్యోదయ సమయానికే నిద్రలేచి స్నానం చేసి, ఉదయించే సూర్యునకు నమస్కరించాలి.

రధసప్తమి రోజు ఎవరు సూరోదయానికంటే ముందే నిద్రలేచి ఉదయించే సూర్యునకు నమస్కరిస్తారో వారికి గత 7 జన్మల పాప ఫలితంగా వచ్చే రోగాలు తొలగిపోతాయి. ఎవరు సూర్యోదయానికి నిద్రిస్తుంటారో వారికి సకల రోగాలు వస్తాయట.

అలాగే రాగి చెంబులో నీరు తీసుకుని అందులో ఎర్రని పూలు, ఎర్ర గంధం, ఎర్రని అక్షతలు, లేత జిల్లేదు ఆకులు, గరిక ఇవన్నీ కొద్దిగా ఆ నీటిలో వేసి సూర్య భగవానుడికి చూపించి వదలాలి. దీనిని అర్ఘ్యం అంటారు. నీరు వదులుతూ ఈ శ్లోకం చెప్పుకోవాలి.

సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర

ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుంది.  

ఓం సూర్యాయ నమః |

హిందూ ధర్మం - 11

ఈ సృష్టిలో దేనికి జన్మ ఉంటుందో, దానికి మరణం ఉంటుంది, దేనికి మొదలు/ఆది ఉంటుందో, దానికి అంతం కూడా ఉంటుంది. కానీ ఈ ధర్మానికి ఆది, ఆంతమూ అన్నవి లేనేలేవు. సృష్టి అంతమైనప్పుడు అంతర్లీనమైన ఈ ధర్మం, సృష్టి ఆవిర్భావంతోనే తిరిగి అమలులోకి వస్తుంది. భూమి గురుత్వాకర్షణశక్తి మానవసమాజం గుర్తించని సమయం నుంచి ఉంది, మనిషి మర్చిపోయినా కూడా అలాగే ఉంటుంది. అట్లాగే ధర్మం కూడా. ఒకవేళ ఏదైనా ఉపద్రవం సంభవించి, ఈ ధర్మాన్ని ఆచరించే వారందరూ మరణించినా, ఈ ధర్మం నశించడం అన్నమాట ఉండదు. అది ప్రకృతిలో అట్లాగే ఉంటుంది. వేరొక సమయంలో తిరిగి ప్రారంభవుతుంది. సృష్టి లేకపోయినా, ధర్మం బీజరూపంలో ఎప్పుడూ ఉంటుంది.

సనాతనము అంటే చావు, పుట్టకలు లేనిది, నిన్న ఉండినది, ఈరోజు ఉన్నది, రేపు ఉండేది, ఎప్పటికి, ఎన్నటికి ఉండేది అని. ఈ ధర్మం ఆది, అంతములు లేనిది, ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటికి ఉండేది, కనుక దీనికి సనాతన ధర్మం అని పేరు.

ఈ ధర్మాన్ని ఆచరించేవారు సనాతనులు (శరీరానికే పుట్టుకచావులు కానీ, ఆత్మకు కాదు, ఆత్మ సనాతమైనది, మనం శరీరం కాదు, శరీరంలో ఉన్న ఆత్మస్వరూపులం, ఆత్మకు చావు లేదు), ఈ ధర్మాన్ని చెప్పిన భగవంతుడు సనాతనుడు (ఆది, అంతములు లేనివాడు, ఎప్పటికి ఉండేవాడు), ఈ ధర్మం సనాతనంగా వస్తున్నది, ఇది పాటించడం వలన సృష్టి అధిక కాలం సుఖసంతోషాలతో, శాంతిసౌభాగ్యాలతో కొనసాగుతుంది, ఇది ఆచరించి మానవుడు తన సనాతన తత్వాన్ని తెలుకుంటాడు, కనుక దీన్ని సనాతన ధర్మం అన్నారు. ఈ ధర్మానికి మూలం వేదం కనుక వైదిక ధర్మం అన్నారు.

To be continued...................

Sunday, 2 February 2014

హిందూ ధర్మం - 10

మతం ఎప్పుడు మానవులకే, అందునా దాన్ని అంగీకరించేవారికి పరిమితం అయ్యింది. మనం చెప్పుకుంటున్న ధర్మం మనుష్యులకే కాదు, అన్నిటికి అన్వయం అవుతుంది. జంతువులకు ఒక ధర్మం ఉంది. దాన్నే మన పశుధర్మం అంటాం. వాటికి ఉదయం లేచిన దగ్గరి నుంచి, ఆహారం కోసం వెతకడం, ఏదైనా జంతువు కనిపిస్తే దాన్ని చంపి తనడం, తన కడుపు నింపుకోవడం, తనకు హాని చేసే ఇతర జంతువులను చంపడం, తమ శారీరిక కోరికలను తీర్చుకోవడంలో బంధుత్వాలు వంటివి లేకపోవడం పశుధర్మం. అవి ప్రకృతి ధర్మానికి అనుగుణంగా, ప్రకృతి చక్రంలో భాగంగా జరుగుతున్నాయి. వీటిని కూడా భగవంతుండే నిర్ణయించాడు.

ఉదాహరణకు పక్షులనే గమనించండి. కొన్ని పక్షులు సూర్యోదయం వరకు గూడులోంచి కదలవు. సూర్యుడు రాగానే, ఆహారం కోసం బయటకు వస్తాయి, సూర్యాస్తమయానికి తిరిగి ఎట్టి పరిస్థుతుల్లోనూ గూళ్ళకు చేరుకుంటాయి. అట్లాగే కొన్ని పక్షులు రాత్రి బయటకు వస్తాయి. ఈ విధంగా, అవి కొన్ని నియమాలకు, కట్టుబాట్లకు లోబడి పనిచేస్తాయి. ఆ కట్టుబాట్లే వాటి ధర్మం. వాటిని ప్రక్రృతి నియంత్రిస్తుంది. పుట్టుకతోనే వాటికి వాటి ధర్మం తెలుసు. ఎందుకంటే ఒక్క మానవ జన్మ తప్ప, ఇతర జన్మలలో ఆత్మకు కర్మ చేయడంలో స్వేఛ్చలేదు. వాటికి కూడా మనసు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, కానీ వాటి బుద్ధి పూర్వ జన్మవాసనల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనిషికి మాత్రం తను చేసే కర్మల మీద పూర్తి స్వేచ్చనిచ్చాడు, స్వతంత్రంగా ఆలోచించే బుద్ధినిచ్చాడు ఈశ్వరుడు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు భగవంతుడిని చేరితే, దుర్వినియోగం చేసుకున్నాడు మళ్ళీమళ్ళీ జంతువులుగా, పక్షులుగా పుట్టి బాధలు అనుభవిస్తాడు. అందుకే ప్రతి మనిషి ధర్మాన్ని తెలుసుకుని, ఆచరించి, తరించాలి.

అసలు మన ధర్మం ఏంటి? మనం ఏం ఏం ఆచరించాలి? ఏల బ్రతకాలి? ధర్మం లక్షణాలు ఏంటి? అదేమని భోధిస్తుంది వంటి విషయాలు తెలుసుకుందాం.

To be continued...................

Saturday, 1 February 2014

హిందూ ధర్మం - 9

ఈ విశ్వమంతా కొన్ని నియమాలను అనుసరించి నడుస్తున్నదే. ఈ విశ్వం ఇలా ఎందుకు ఉండకూడదు అంటే ఎవరు సమాధానం చెప్పగలరు ? ఈ విశ్వానికి ఒక ధర్మం ఉన్నది, దాన్ని అనుసరించే ఇదంతా సాగుతోంది. మనం మాట్లాడుకునేది కూడా ఆ ధర్మం గురించే. ఏ విధంగానైతే ఈ లోకంలో అన్నిటికి భగవంతుడు ఒక ధర్మాన్ని ఏర్పరిచాడో, అదే విధంగా మనిషి బ్రతకవలసిన విధానం గురించి కూడా చెప్పాడు.

మానవుడు ఏ విధంగా బ్రతకడం చేత, తను చేసిన పాపాన్ని నశింపజేసుకుని పరమాత్మను చేరగలడో, దేన్ని పాటించడం చేత విశ్వ ధర్మాలకు అనుగుణంగా జీవించి, కాలచక్రానికి విఘాతం ఏర్పరచకుండా జీవనం సాగించగలడో, ఏలా బ్రతకడం చేత మానవుడు దైవత్వాన్ని పొందగలడో, ఏది జనులందరూ ఆచరించడం చేత లోకంలో శాంతి వర్ధిల్లుతుందో, అదే ధర్మం. మనిషి ఇలా బ్రతకాలని చెప్తుంది ధర్మం. ధర్మం చెప్పినట్టు చేయడం వలన పుణ్యం కలిగితే, ధర్మానికి విరుద్ధంగా చేయడం వలన పాపం కలుగుతుంది. ధర్మం విముక్తికి మార్గం అయితే, ధర్మాన్ని ఆచరించకపోవడం బంధానికి హేతువవుతుంది.

ఇప్పుడు మనం ఏదైతే ధర్మం గురించి చెప్పుకుంటున్నామో, ఆ ధర్మానికి ఒక పేరు లేదు. గత 5,000 ఏళ్ళ క్రితం వరకు, మహాభారత యుద్ధం ముగిసిన తరువాత కొంతకాలం వరకు, ప్రపంచమంతా, అన్ని దేశాల జనం ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ వచ్చారు కనుక దీనికి ప్రత్యేక పేరు పెట్టవలసిన అవసరం రాలేదు. ధర్మం అన్నమాటకు సమానమైన ఆంగ్లపదం కానీ, మరే ఇతర పదం కానీ ప్రపంచభాషల్లో లేదు. పాళీ లిపిలో ధర్మాన్నే ధమ్మము అన్నారు. కానీ అది పూర్తిగా స్వీకరించదగ్గది కాదు.

To be continued.......