Saturday 1 February 2014

హిందూ ధర్మం - 9

ఈ విశ్వమంతా కొన్ని నియమాలను అనుసరించి నడుస్తున్నదే. ఈ విశ్వం ఇలా ఎందుకు ఉండకూడదు అంటే ఎవరు సమాధానం చెప్పగలరు ? ఈ విశ్వానికి ఒక ధర్మం ఉన్నది, దాన్ని అనుసరించే ఇదంతా సాగుతోంది. మనం మాట్లాడుకునేది కూడా ఆ ధర్మం గురించే. ఏ విధంగానైతే ఈ లోకంలో అన్నిటికి భగవంతుడు ఒక ధర్మాన్ని ఏర్పరిచాడో, అదే విధంగా మనిషి బ్రతకవలసిన విధానం గురించి కూడా చెప్పాడు.

మానవుడు ఏ విధంగా బ్రతకడం చేత, తను చేసిన పాపాన్ని నశింపజేసుకుని పరమాత్మను చేరగలడో, దేన్ని పాటించడం చేత విశ్వ ధర్మాలకు అనుగుణంగా జీవించి, కాలచక్రానికి విఘాతం ఏర్పరచకుండా జీవనం సాగించగలడో, ఏలా బ్రతకడం చేత మానవుడు దైవత్వాన్ని పొందగలడో, ఏది జనులందరూ ఆచరించడం చేత లోకంలో శాంతి వర్ధిల్లుతుందో, అదే ధర్మం. మనిషి ఇలా బ్రతకాలని చెప్తుంది ధర్మం. ధర్మం చెప్పినట్టు చేయడం వలన పుణ్యం కలిగితే, ధర్మానికి విరుద్ధంగా చేయడం వలన పాపం కలుగుతుంది. ధర్మం విముక్తికి మార్గం అయితే, ధర్మాన్ని ఆచరించకపోవడం బంధానికి హేతువవుతుంది.

ఇప్పుడు మనం ఏదైతే ధర్మం గురించి చెప్పుకుంటున్నామో, ఆ ధర్మానికి ఒక పేరు లేదు. గత 5,000 ఏళ్ళ క్రితం వరకు, మహాభారత యుద్ధం ముగిసిన తరువాత కొంతకాలం వరకు, ప్రపంచమంతా, అన్ని దేశాల జనం ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తూ వచ్చారు కనుక దీనికి ప్రత్యేక పేరు పెట్టవలసిన అవసరం రాలేదు. ధర్మం అన్నమాటకు సమానమైన ఆంగ్లపదం కానీ, మరే ఇతర పదం కానీ ప్రపంచభాషల్లో లేదు. పాళీ లిపిలో ధర్మాన్నే ధమ్మము అన్నారు. కానీ అది పూర్తిగా స్వీకరించదగ్గది కాదు.

To be continued.......

No comments:

Post a Comment