Labels
- Dharma
- Inspiring
- Ramana Maharshi
- Science and Hindusim
- Yoga
- ఉత్తరాఖండ్ వరదలు
- ఏకాదశి
- కార్తీక మాసం
- గణపతి
- గురు పూర్ణిమ
- గురుతత్వము
- చరిత్ర
- దేవి నవరాత్రులు
- దైవం
- ధర్మం
- నవదుర్గ
- పండుగలు
- పర్యావరణం / Ecology
- బతుకమ్మ పాటలు
- భూతాపం(Global Warming)
- మన దేవాలయాలు
- వినాయక చవితి
- వినాయకచవితి కధలు
- సంకష్టహర చవితి
- సంప్రదాయం - శాస్త్రీయం
- సూక్తులు
- స్తోత్రాలు
- హిందూ విజ్ఞానం
Tuesday, 18 August 2015
పూజించవలసింది నాగులనా? దేవతాసర్పాలనా? పాములనా?
19 ఆగష్టు 2015, బుధవారం, శ్రవణ శుద్ధపంచమి, నాగపంచమి
నాగపంచమి, నాగుల చవితి వస్తోందంటే చాలు, హిందూ సంప్రదాయాలు మూఢనమ్మకాలు, పాములు పాలు త్రాగుతాయ? వీళ్ళు పాములను హింసిస్తున్నారు, ఆదిమానవుడి కాలపు అలవాట్లను పాటిస్తున్నారు అంటూ మీడియా ఎంతసేపు దాడి చేసి, ధర్మాన్ని కించపరచాలని చూస్తోందే కానీ, నిజానికి ఈ ఆచారం ఎందుకు వచ్చింది, ఆచరణలో ఏమైనా మార్పులు వచ్చాయా? సంప్రదాయాన్ని తప్పుగా అర్దం చేసుకున్నారా? ఒకవేళ పొరబడి ఉంటే, దాన్ని ఎలా సరిజేసుకోవాలని చెప్పే ప్రయత్నం చేయదు.
ఆంగ్లేయులు భారత్ మీదకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ప్రభావం బాగా పెరిగింది. అది ఎంతగా పెరిగిందంటే ఎంతో విశాలమైన భాష అయిన సంస్కృతాన్ని, దాని నుండి వచ్చిన భారతీయ భాషలలోని పదాలకు ఇంగ్లీష్‌లో అర్దం వెతుక్కునే స్థితికి చేరుపోయాము. అది ఇంకా దిగజారి ఏకంగా ఇంగ్లీష్ పదాలనే ఉపయోగిస్తూ, దాని అర్దాలనే సంస్కృతపదాలకు అంటగడుతున్నాము. విషయంలోకి వస్తే ఇంగ్లీష్ వాళ్ళకు Snake అనే పదం ఒక్కటే ఉంది. కానీ మన ధర్మంలో నాగులు, సర్పాలని రెండు ఉన్నాయి. నాగులు వేరు, సర్పాలు వేరు. భగవద్గీత 10 వ అధ్యాయంలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పిన మాటలివి.
ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|
ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః|| 10-28 ||
నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మన్మదుడిని, సర్పాలలో వాసుకిని.
• సర్పాలలో తాను వాసుకి అని చెబుతున్నాడు. వాసుకి శివుని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా వుంటుంది. ఈ వాసుకినే త్రాడు గా చేసుకుని సాగర మధనం చేసారు దేవదానవులు. వాసుకి కద్రువ తనయుడు.
అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్|
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్|| 10-29 ||
నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడిని, పీత్రులలో ఆర్యముడిని, సంయమవంతులలో నిగ్రహాన్ని.
• ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తాను నాగులలో అనంతుడనని చెబుతున్నాడు. అనంతుడు అనగా ఆదిశేషుడు. అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు, రెండవ వాడు వాసుకి. కద్రువ వినతకు చేసిన అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపమాచరించి ఆయనను తనమీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు అనంతుడు. బ్రహ్మ అతడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాలలో స్వామివారిని అనుసరిస్తాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారం లో బలరాముడిగా, వేంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా.
ఇప్పుడు మనకు ఒక సందేహం రాక మానదు. పైన సర్పాలలో వాసుకి తానన్నాడు, ఇక్కడ నాగులలో అనంతుడనంటున్నాడు. అసలు సర్పాలు , నాగులు ఒకటి కాదా ? ఏమిటి తేడా? కొంతమంది పండితులు సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు. కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెంటికీ చాలా వ్యత్యాసం వుంది. నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నైనా ధరించగలవు. సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి, భూమి మీద తిరుగాడుతాయి. నాగులకు ఒక విశిష్ట లోకం వుంది. నాగులకు వాయువు ఆహరం, అనగా అవి గాలిని స్వీకరించి బ్రతుకుతాయి. సర్పాలకు కప్పలు మొదలైన జీవరాశులు ఆహారం.
నాగుల్లో మళ్ళీ 9 జాతులు ఉంటాయి. అట్లాగే సర్పాల్లో కూడా దేవతాసర్పాలని ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూలవాసన వస్తుంది. కానీ ఇవి మానవసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరించవు, మానవజాడలకు దూరంగా ఉంటాయి. మనిషికి గానీ, పాములు పట్టేవాళ్ళకు గాని చిక్కవు. అలా చిక్కుతాయి అనుకోవడం సినిమాల ప్రభావం మాత్రమే.
పాములు పాలు త్రాగవన్నమాట నిజం. అవి సరిసృపాలు కనుక వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నం. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటారు, ఆరోగ్యాన్ని, సంతనాన్ని అనుగ్రహిస్తారు. దేవతాసర్పాలకు కూడా శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికి ఉన్నాయి. అవి కూడా పాలు త్రాగుతాయి.
ఈ నాగపంచమి మొదలైన నాగదేవతారాధన తిధులు ప్రారంభమైన సమయంలో నాగులు కూడా మానవజాతితో కలిసి సంచరించేవారు. అప్పటి మానవులకు శౌచం ఉండేది. ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఉండేది. ఆ రోజులు వేరు. కనుక అప్పట్లో నాగజాతికి పాలు, పండ్లు సమర్పించి, పసుపుకుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు. క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడం, ధర్మంపై శ్రద్ధ తగ్గి, ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకముందు వలే మర్త్యలోకంలో సశరీరంతో సంచరించడం మానేశారు. విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి, పూజించినవారికి సత్ఫలితాలను ఇస్తున్నారు. అలాగే దేవతాసర్పాలు కూడా జనసంచారం ఉన్న ప్రాంతాల్లో తిరగడం మానేశాయి. ఒక 75 ఏళ్ళ క్రితం వరకు దేవతసర్పాలను చూసి, పూజించి, వరాలను పొందిన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబసభ్యులకు ఇప్పటికి ఆ విషయాలు స్మరణలో ఉంటాయి. కానీ ఇప్పుడు సదాచారం, శౌచం, ధర్మం వంటి మంచి విషయాలను జనం వదిలేశారు, ఒకవేళ ఎక్కడైనా అలాంటివి ఉన్నా, సక్రమంగా పాటించడం తక్కువ. దాంతో దేవతాసర్పాలు జనావాసాలకు దూరంగా వెళ్ళిపోయాయి. ఆలయాల్లో వాటికి జరిగిన అపరాధం కారణంగా కొన్ని శరీరం విడిచిపెట్టాయి.
ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతాసర్పాలని చెప్పలేము. చాలామటుకు ఏదో మాములు పాములే జనావాసాల మధ్య పుట్టల్లో ఉంటున్నాయి. నాగపంచమి, నాగులచవితికి నాగదేవతలకు పూజలు చేయాలి. కానీ పైన చెప్పుకున్న విషయాలు అర్దంకాక ప్రజలందరూ మాములు పాములకు పాలు పోస్తున్నారు, పసుపు కుంకుమలు వేస్తున్నారు. మామూలు పాములు పాలు త్రాగవు, వాటికి పసుపుకుంకుమలు పడవు. అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగప్రతిష్ట, నాగబంధం, నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటి ప్రజల్లో ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. నాగపంచమి, నాగులు చవితి మూఢనమ్మకలు కాదు, నాగదేవతలను పూజించి, సంతానం పొందిన దంపతులు కోకొల్లలు. ఇతర పిల్లలతో పోల్చినప్పుడు నాగదేవాతానుగ్రహంతో కలిగిన సంతానంలో నాగదేవతల యొక్క వరప్రభావం, అంశను తల్లిదండ్రులు పసిగట్టగలుగుతారు. కానీ అలా సంతానం కోసం పూజించవలసింది నాగులనే కానీ మామూలు పాములను కాదు.
ఈశ్వర సృష్టిలో ప్రతి జీవికి ప్రాధాన్యత ఉంది. సాధారణ సర్పాలు జీవవైవిధ్యంలో, ఆహారచక్రంలో తమవంతు పాత్ర పోషిస్తాయి. వాటి మనుగడతోనే మానవమనుగడ సాధ్యమవుతుంది. మామూలు పాముల జోలికి వెళ్ళకుండా ఉండడం, వాటి మానాన వాటిని వదిలేయడం, వాటిని ఎవరైనా హింసిస్తుంటే రక్షించడం వల్ల కూడా దేవతాసర్పాలు, నాగజాతి అనుగ్రహం పొందవచ్చు.
సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢనమ్మకమేమీ లేదు. కాలక్రమంలో మారిన అలవాట్ల కారణంగా, వచ్చిన మార్పులను ప్రజలు అర్దం చేసుకోలేకపోయారు. కనీసం ఇప్పటికైనా హిందూసమాజం సంప్రదాయంలోని అసలు విషయాన్ని గమనించాలి. విషయాన్ని సగం సగం చెప్పి, మూఢనమ్మకమంటూ కొట్టిపారేయకుండా, అసలు విషయాన్ని పూర్తిగా ప్రజలకు చెప్పేందుకు మీడియా కూడా ముందురావాలి.
ఇటువంటి మరికొన్ని విషయాలను 2014 నాగపంచమి సంధర్భంగా ప్రచురించడం జరిగింది. లింక్‌లో http://goo.gl/B7ljRm గమనించగలరు.
నాగుల చవితి సందర్భంగా నాగదేవతలకు నివేదించవలసిన నైవేధ్యం గురించి, ఇతర వివరాల గురించి ఈ క్రింద లింక్‌లో చెప్పటం జరిగింది. నాగులచవితి అయినా, నాగపంచమి అయినా, నివేదన, నియమాలు ఒకటే. వాటిలో మార్పు ఉండదు.
http://ecoganesha.blogspot.in/2014/10/blog-post_26.html

Monday, 17 August 2015
Sunday, 16 August 2015
హిందూ ధర్మం - 171 (శిక్షా - 5)
సహజక్రమాన్ని అనుసరించని 8 రకాల కలయికలను కూడా అందించారు మహర్షులు. వీటిని వికృతి అన్నారు.
జటామాలా శిఖా రేఖా ధ్వజో దణ్డొ రథోఘనః |
ఇత్యాష్టా వికృతయః ప్రోక్తాః క్రమపూర్వా మహర్షిభిః||
జటా, మాలా, శిఖా, రేఖా, ధ్వజా, దండ, రథ, ఘనా అనేవి అష్ట వికృతులు. వీటిన్నటిలో జటా, ఘనాలు మాత్రమే దక్షిణ భారతదేశంలో కృష్ణయజుర్వేద శాఖలో ప్రముఖంగా ఉన్నాయి. ఉత్తరభారతదేశం, ముఖ్యంగా బెనారస్‌లో శుక్ల యజుర్వేద శాఖలకు చెందిన అష్టవికృతులు ఉన్నాయని చెప్తారు. కానీ చరిత్ర గమనిస్తే, దుష్ట జీహాదీల దండయాత్రల్లో వైదికసంప్రదాయం ఎన్నో కష్టాలు పడింది. తరతరాలుగా వస్తున్న వైదిక గురుకులాలను ధ్వంసం చేసి, అందులో విద్యార్ధులను, గురువులను క్రూరంగా చంపారు అప్పటి ఇస్లాం విద్వంసకారులు. ఈ దాడులతో ఉత్తరభారతదేశంలో వేదానికి చెందిన అనేక విద్యలు చాలావరకు సమూలంగా నాశనం చేశారు. దక్షిణభారతదేశంలోని అతి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వైదిక పరంపర కొనసాగుతూ వచ్చింది. అది కూడా పైన చెప్పిన పద్ధతుల్లో ఒకటి, లేదా రెండు పద్ధతులు మాత్రమే మిగిలాయి. ఆంగ్లేయులైతే మరీ దారుణం. క్రైస్తవవ్యాప్తి కోసం స్వరంతో వేదం పలికే పండితుల స్వరపేటికల్లోకి మండుతున్న ఇనుపచువ్వలు గుచ్చి, ధర్మంపై తమ వ్యతిరేకతను చాటుకున్నారు. జీహాదీల దాడులను సైతం తట్టుకుని నిలబడ్డ అనేక వైదిక గురుకులాలను సమూలంగా తుడిచివేశారు. దాని కోసం చట్టాలు కూడా చేసి, తమ అక్రమాలను, దారుణాలను చట్టబద్ధంగా చేసే యత్నం చేశారు.
జటా పాఠం
ఒకే వరుస క్రమంలో 6 పదాలుంటే జటా పాఠంలో a-b-b-a-a-b; b-c-c-b-b-c; c-d-d-c-c-d; d-e-e-d-d-e; e-e-f-f-e; ................. ఇలా చదువుతారు. ఆ పాఠాన్ని గమనిస్తే, ముందుకు-వెనక్కు-ముందుకు పదాల క్రమం ఉంటుంది. స్త్రీలు తమ జడను అల్లుకున్న విధంగా ఉంటుంది కనుక ఈ పాఠాన్ని జటాపాఠం అన్నారు.
ఇది జటాపాఠం :
ఓషధయః సం సం ఓషధయః ఓషధయః సం |
సం వదంతే వదంతే సం సం వదంతే |
వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన |
సోమేన సహ సహ సోమేన సోమేన సహ |
సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా |
రాజ్ఞేతి రాజ్ఞా ||
మాలా పాఠాలు రెండు రకాలు 1) క్రమ మాల, 2)పుష్పమాల. ఇవి క్రమపాఠాన్ని పోలి రెండు పదాలను కలుపుతూ ఉంటాయి. శిఖా పద్ధతి జటా పద్ధతికి దగ్గరగా ఉన్నా, శిఖలో రెండు పదాలకు బదులు మూడు పదాలను కలిపి, ముందుకి-వెనక్కి చదువుతారు. రేఖా, ధ్వజ, దండ, రథ పాఠాలా పారాయణ చాలా సంక్లిష్టంగా ఉంటుంది. రథాలో కూడా ద్విపాద, త్రిపాద, చతుష్పాద అని 3 రకాల పద్ధతులు ఉన్నాయి. వీటిలో ద్విపాద, చతుష్పాద పద్ధతులు ఈ రోజు విరివిగా ఉపయోగిస్తున్నారు.
అన్నిటిలోకి ప్రముఖమైనది, అత్యంత కష్టమైంది, మంచి ప్రాముఖ్యం సంతరించుకున్న పద్ధతి ఘనాపాఠం.ఈ విద్యలో ప్రావీణ్యం పొందినవారిని ఘనాపాఠీ అంటారు. ఇక్కడ పదక్రమం గంట ఆకారాన్ని సంతరించుకుంటుంది.
ఉదాహరణకు, a-b-c-d-e-f అనేవి పదసమూహం అనుకుంటే ఘనాపాఠంలో a-b-b-a-a-b-c-c-b-a-a-b-c; b-c-c-b-b-c-d-d-c-b-b-d అని చదువుతారు.
ఓషధయః సం సం ఓషధయః ఓషధయః సం వదంతే
వదంతే సం ఓషధయః ఓషధయః సం వదంతే |
సం వదంతే వదంతే సం సం వదంతే సోమేన
సోమేన వదంతే సం సం వదంతే సోమేన |
వదంతే సోమేన సోమేన వదంతే వదంతే సోమేన సహ
సహ సోమేన వదంతే వదంతే సోమేన సహ|
సోమేన సహ సహ సోమేన సోమేన సహ రాజ్ఞా
సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా |
రాజ్ఞేతి రాజ్ఞా ||
పైన గమనిస్తే, సంహితలో 6 పదాలుంటే, ఘనాపాఠంలో అవి 60 పదాలుగా మారాయి. అనగా పదిరెట్లు పెరిగాయి. దీని బట్టే అర్దం చేసుకోవచ్చు, పెద్దపెద్ద మత్రాలను ఉచ్చరించడం ఎంత కష్టమో!! దీని ఆధారంగా ఘనాపాఠికి వేదం యందు ఎంత ప్రేమ ఉందో, దాన్ని కాపాడాలన్న పట్టుదల ఎంతగా ఉందో, ఆయన ఏదో మౌఖికంగా కాకుండా హృదయంతో నేర్చుకుని, ఘనక్రమం తప్పకుండా చదువుతున్నారో అర్దం చేసుకోవచ్చు.
ఘనాపాఠం గురించి అవగాహన కోసం శృంగేరి పీఠంలో రుద్రాభిషేక సమయంలో ఘనాపాఠీలు చదివిన రుద్రఘనాపాఠం ఈ లింక్‌లో వినవచ్చు. ఘనాపాఠం వినడం కూడా ఎంతో శాంతిని ఇస్తుంది.
https://www.youtube.com/watch?v=XiB3-uIkuPw
To be continued ................
Saturday, 15 August 2015
స్వాతంత్ర దినోత్సవం - సద్గురు శివానందమూర్తి సందేశం
ఈ సంస్కృతి మనకు ఏం చెప్తోంది, అది చెప్పినట్టు మనము జీవిస్తున్నామా? ఈ సంస్కృతి మనలని ఎలాగ జీవించమని అభిలషిస్తున్నదో, మనమట్లా జీవిస్తున్నామా అని ఆత్మవిమర్శ చేసుకోవలసిన సమయం భారతదేశ చరిత్రలో పూర్వం కంటే ఎక్కువగా నేడు ఉంది. మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి, పరిసరాలు పరిశీలించుకోవాలి, మన తప్పు ఎమైనా ఉందా అని తెలుసుకోవాలి. అంటే ఏ విధంగా ఆర్షధర్మంలో పుట్టి.......... చాలా పాతది కాబట్టి సనాతనధర్మం, రాముడు ఆయన వంశంలో 62వ తరం వాడు, ఆయన వంశకర్త కూడా ఈశ్వరుడిని ఆరాధించాడు, ధర్మాన్ని పాటించాడు. అందువల్ల అది చాలా సనాతనం. ఈ ధర్మాన్ని ఈ విధంగా జీవించమని నిరూపించి చూపింది మహర్షులు కాబట్టి ఆర్షధర్మం. భారతదేశంలో ఉంది కాబట్టి భారతీయ ధర్మం............ ఎన్ని పేర్లు చెప్పినా వస్తువు ఒక్కటే. దాంట్లో అది మనల్ని ఏమని అంటోంది, మనమట్లా జీవిస్తున్నామా అని తలుచుకుంటే అసలు ఏదో ఒక విషయంలో మనం మరిచాం, మరిచిపోయామ అనే సందేహం కలుగుతుంది. భారతదేశాన్ని ఒక మారు మనం చిన్నచూపు చూసినట్లైతే 1,000 సంవత్సరాల నుంచి ఆపదలకు గురైంది. వేయి సంవత్సరాల్లో వచ్చిన ఆపదంతా కూడా అనేకమంది దండయాత్రలు చేశారు, ధ్వంసం చేశారు. మామూలు దండయాత్రలు కావు, ఈ సంస్కృతి మీద ద్వేషంతో చేసిన దండయాత్రలవి, అది గుర్తుపెట్టుకోవాలి. ఏ రాజైన వేరే దేశం మీద దండయాత్ర చేస్తే, ఆక్రమిస్తాడు, ధనం కొల్లగొడతాడేమో కానీ ధర్మం మీద ద్వేషంతో రాడు. కానీ అలా జరిగిందిక్కడ. దాని తర్వాత అనేక విషయాలతో ప్రభావితమైనాం. మెల్లమెల్లగా అనేక నాగరికతలు, సిద్ధాంతాలు లోపల, బయట ఉత్పన్నమైనాయి. బాహ్యం నుంచి కూడా అనేక సిద్ధాంతాలు మన మీద దాడి చేశాయి. లోపల కూడా విపరీతార్ధాలు కలిపించుకుంటూ, నేను కొత్త మార్గాన్ని కనిపెట్టాను, నేను కర్తని, కొత్త మార్గాన్ని చూపిస్తున్నాను అని చెప్పి సనాతనధర్మ మార్గానికి కూడా కొత్త లయలు సృష్టించి చెప్పారు కొందరు భౌద్ధం, జైనం మొదలైనవి ఎన్నెన్నో వచ్చాయి. కానీ సనాతనధర్మం దానిలో ఒక చేర్పు గానీ, మార్పు గానీ అవసరమైన స్థితిలో అది లేదు. దానికి ఏ చేర్పు అక్కర్లేదు, దానికి ఏ మార్పు అక్కర్లేదు. ఆ సత్యం తెలుసుకుంటే అది ఎలా ఉంటుంది అనే మీమాంసకు ఒక కుతూహలం ఏర్పడుతుంది. దాన్ని తెలుసుకున్నామంటే ఈ భారతదేశానికి గతంలో జరిగిన/గడిచిన చెడ్డకాలం మళ్ళీ రాదు, అత్యుత్తమమైనటువంటి, ఉన్నతమైనటువంటి దశ వస్తుంది. గడిచిన శతాబ్దాల్లో ఈ దేశం అనుభవించిన ఘోరమైన విపత్తులున్నాయే ........... అవి గుర్తు చేసుకుంటే ఏమిటంటే మళ్ళీ ధర్మం అనే మాట జ్ఞాపకం వస్తుంది. ఏదో ధర్మలోపం జరిగితేనే మనకి, అంతటా వ్యాపించిన ఈశ్వర సంకల్పం చేత ప్రకృతైనా వైపరీత్య ధోరణి తీసుకుంటుంది, మరో శత్రువైనా వచ్చి మనలని శిక్షిస్తాడు. ఏదో జరుగుతుంది, మనం కష్టాలు పడక తప్పదు. ఏం జరిగిందన్న ప్రశ్నకు సమాధానం సులభం కాదు, 500 సంవత్సరాలు భయంకరమైన దాడులకు గురై, అవమానాలకు గురై, స్త్రీలు అక్షేమంతో కష్టపడి, దోపిడీలకు గురై......... ఏం అపరాధం చేసింది భారతదేశం? అది పెద్ద ప్రశ్న. పుస్తకాలు, చరిత్ర చదివితే సరిపోదు, ఇది ధర్మాన్ని గురించిన మీమాంస. ధర్మాన్ని నమ్ముకున్న దేశానికి ఎందుకు ఆపదలు వచ్చాయి? ఎక్కడో లోపం జరిగింది, పెద్ద తప్పులు చేశాం .............................
ఏదో పరాయిపాలన నుంచి స్వాతంత్రం వచ్చిదనుకున్నాం. అధికారమార్పిడి జరిగింది కానీ ధర్మం జ్ఞాపకం చేసే విధంగా వచ్చిందా అనేది ప్రశ్న. స్వాతంత్రం అంటే ఏమిటి? సద్బుద్ధితో సన్మార్గంలో జీవించడానికి దోహదక్రియగా ఉన్న దానిపేరు ధర్మం. నేను సన్మార్గంలో ఉంటాననుకున్న వాడికి అవమానం జరగకూడదు, క్షేమం జరగాలి. అది సంస్కృతిలో, దేశంలో, నాగరికతలో ఉండాలి. అది స్వాతంత్రం. అట్లా రావలంటే ఎంతో సార్వజనీనమైన అంతఃకరణశుద్ధితో కూడుకున్న స్వాతంత్ర్యం రావాలి, అది నిజమైన భారతదేశం. అది ప్రతి వ్యక్తికి ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు భారతదేశం స్వాతంత్రం పొందుతుంది. ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఏకఖండంగా ఉన్న భారతభూమి మూడు ముక్కలైంది. అయినా పండుగ చేసుకుంటున్నాం మనం!? 22 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు, ఆశ్రయం కోల్పోయారు, మహాదుఃఖాన్ని అనుభవించారు. వాటిని గురించి స్మరించకుండా, జెండావందనం చేసి పండగ చేసుకుంటున్నామంటే ........ ఈ పండగ నిజమే, వారిని విస్మరించడం కూడా నిజమే. రెండు జరుగుతున్నాయి మనకి. అది ఏ మాత్రం క్షంతవ్యం కాదు. మనం జ్ఞాపకం చేసుకోవాలి.
సద్గురు శివానందమూర్తి

Subscribe to:
Posts (Atom)