Showing posts with label వేదం. Show all posts
Showing posts with label వేదం. Show all posts

Sunday, 29 May 2016

హిందూ ధర్మం - 211 (కల్పం - 1)

కల్పం - ఇది వేదంగాల్లో ఒకటి. దీన్ని వేదానికి చేతులుగా వర్ణించారు. చేతులు క్రియకు సంబంధించినవి. అలాగే కల్పం అనే వేదాంగం వేదంలో చెప్పబడ్డ కర్మల గురించి, వాటిని నిర్వహించే పద్ధతుల గురించి వివరంగా చెప్తున్నా, ఈ కల్పంలోనే గణితశాస్త్రం దాగి ఉంది. అంకగణితం (Arithmetic), రేఖాగణితం (Geometry), బీజగణితం (Algebra), త్రికోణమితి (Trigonometry) మొదలైన అనేక శాస్త్రాలు ఇందులో నిక్షిప్తమై ఉన్నాయి.


శ్రీ రాయల విశ్వనాధ గారు కల్పం గురించి చెప్తూ, 'కకారం ప్రధమ స్పర్శగల అక్షరమవటం వలన అది క్రియాసంధి. రకారం జీవుడు. లకారం ఆ జీవుడు దేహభావంలో ఉన్న స్థితి (అంటే తాను ఆత్మ కాదు, దేహం అనుకునే భ్రాంతి). పకారం మూడుదేహాలకు సంబంధించినది (స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు). మకారం మనసకు సంబంధించినది. కల్పమంటే మనసుతో, మూడు దేహాలను, దేవభావమునకు ఉన్ముఖం చేయడం. ప్రాణము, అపానము, వ్యానము, కన్ను, చెవి, మనస్సు, వాక్కు, ఆత్మ, యజ్ఞము - ఇప్పుడు చేయబడుతున్న యజ్ఞం వలన దైవీ భావాల దిశగా ఉన్ముఖులువుగాక! అంటే మనం కూడా దేవతల వంటి మంచి ఆలోచనలు కలిగినవారం కావాలని అర్దం. యజ్ఞం అందుకోసమే. మనలో ఉన్న దైవభావలను, శక్తులను పెంపొందిచుకోవటం కోసమే.

వేదశబ్దాలకు లోకంలో కనిపించే సామాన్యమైన అర్దాలు చెప్పకూడదని నిరుక్తకారులు చెప్పి, వేదశబ్దాలను అనేక కోణాల నుంచి దర్శించి, కొత్త అర్దాలు వ్రాసారు. ఒకే శబ్దానికి అనేక అర్దాలు వ్రాసారు. వేదం కేవలం పైకి, కళ్ళకు కనిపించే లోకాల గురించే కాక, కనబడని, అంతర్లీనంగా ఉండే అనేక లోకాల గురించి చెప్తుందని తెలియని విదేశీయులు (వక్రీకరణకారులు, వీరి మతంలో అన్ని లోకాల గురించి వివరణ లేదు. అంత స్థాయికి అవి ఎదగలేదు. వాటిని అవి దర్శించలేదు, లేవు కూడా. అందువలన వారికి మన వాళ్ళు చెప్పినవి అర్దం చేసుకునే స్థాయి లేదు) వేదశబ్దాలకు సంస్కృత శబ్దాలతో తమకు తోచిన అర్దాలు చెప్పి, వేదం మానవులే వ్రాసారని, అది సామన్య గ్రంధమని ప్రకటించారు.

యాస్కుడు వేదంలో ఉన్న 'భారతి' అనే శబ్దానికి 'సూర్యుడు' అనే అర్దం సాధించారు. లౌకిక దృష్టితో చూస్తే, సంస్కృత భాషా సంప్రదాయంలో భారతికి, సూర్యునికి సంబంధంలేదు. సాయణాచార్యులు ఋగ్వేద భాష్యారంభంలో అగ్ని అనే శబ్దానికి 5 అర్దాలను చెప్పారు. కాబట్టి వేదంలో శబ్దాలకు ఇది మాత్రమే అర్దమని చెప్పలేము. 'ఇది మాత్రమే' అందులో చెప్పబడిందని కూడా చెప్పరాదు. (వేదంలో చెప్పబడినవి ఒక్కో వ్యక్తికి, అతని తపశ్శక్తిని బట్టి ఒక్కో స్థాయిలో అర్దమవుతాయి. ఒక కాలంలో, ఒక వ్యక్తి ఇచ్చిన అర్దం మాత్రమే సరైనది అని చెప్పకూడదు. కాలప్రవాహంలో అంతకంటే ఉన్నతమైన భావాలను అందులో దర్శించే అవకాశం ఉంది. అంతమాత్రాన పాతభావాలు పనికిరావని, వాటిని కాల్చివేయడం, నాశనం చేయడం ధర్మంలో లేదు - రాజీవ్ మల్‌హోత్ర)

వేదానికి అర్దం చెప్పడానికి ప్రయత్నించే శాస్త్రాలన్నీ ఒక ఎత్తు. కల్పశాస్త్రం ఒక ఎత్తు. మిగితా శాస్త్రాలు అర్దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే, కల్పం అర్దాన్ని చేతల్లో చూపించటానికి ప్రయత్నించింది, క్రియాపరంగా. మంత్రంలోని భావానికి అనుగుణమైన కర్మను కల్పించి, ఆ మంత్రాన్ని క్రియా సమయంలో (కర్మ చేస్తూ) పఠింపజేసేది కల్పము. వేదంలో చెప్పబడిన కర్మ చేస్తున్నాము, చేయడం చూస్తున్నాము, మంత్రాన్ని పఠిస్తున్నాము. అప్పుడు ఆ మంత్రం యొక్క భావం సులభంగా తెలుస్తుంది'.

To be continued .............

Monday, 23 May 2016

హిందూ ధర్మం - 210 (యజ్ఞంలో బలి ఖండన - 4)


వైదిక పదాలకు ప్రామాణికమైన నిఘంటువు (Dictionary) రాసింది యాస్కాచార్యులు (యాస్కుడు). ఆయన కాలంలో ఒక్క యజ్ఞంలో కూడా జంతుబలి లేదు. యాస్కుడు జంతువధ గురించి వివరించే 33 ధాతువులను ఆ నిఘంటువులో ప్రస్తావించగా, అందులో ఒక్క ధాతువు కూడా యజ్ఞంలో జంతుబలి గురించి ప్రస్తావించలేదు. వేదానువాదానికి వేదాంగమైన నిరుక్తమే ప్రమాణం కానీ విదేశీయులు తమకు తోచినట్టు రాసిన భాష్యాలు కాదు.

మహాభారతానికి పూర్వం ఉపరిచరమనువు ఉండేవాడు. ఆయన చేసిన అశ్వమేధ యాగాన్ని అహింస్ర అని వర్ణించారు. అనగా హింసలేనిది అని. ఆ యాగం గురించి మహాభారతం శాంతిపర్వం 333 అధ్యాయంలో, ఆ యాగంలో ఏ జంతువులను చంపలేదు అని ఉంది.

అన్ని యజ్ఞాలు బలి లేకుండానే జరగాలని మనుమహర్షి ఆదేశించారు. జనులు జంతువులను బలిచ్చేది కేవలం తమ జిహ్వ చాపల్యం కోసమేనని చెప్పారు - మహాభారతం శాంతిపర్వం 266 అధ్యాయం.

మహాభారతానికి పూర్వం ఉపరిచరమనువు ఉండేవాడు. ఆయన చేసిన అశ్వమేధ యాగాన్ని అహింస్ర అని వర్ణించారు. అనగా హింసలేనిది అని. ఆ యాగం గురించి మహాభారతం శాంతిపర్వం 333 అధ్యాయంలో, ఆ యాగంలో ఏ జంతువులను చంపలేదు అని ఉంది.

అన్ని యజ్ఞాలు బలి లేకుండానే జరగాలని మనుమహర్షి ఆదేశించారు. జనులు జంతువులను బలిచ్చేది కేవలం తమ జిహ్వ చాపల్యం కోసమేనని చెప్పారు - మహాభారతం శాంతిపర్వం 266 అధ్యాయం.

యజ్ఞంలో 'అజ'ను ఆహుతిగా వేయాలని చెప్పబడింది. అజ అంటే మగమేక అని అర్దం చెప్పారు. కానీ యజ్ఞంలో విషయంలో ఆ అర్దం తప్పు. యజ్ఞంలో అజ అంటే మొలకెత్తడానికి పనికిరాని పాత విత్తనాలు అని అర్దం. అందువల యజ్ఞంలో మగ మేకను బలివ్వకూడదు, పాతవిత్తనాలను ఆహుతివ్వాలి - మహాభారతం శాంతిపర్వం 337 వ అధ్యాయం.

పాపకార్యాలు చేసేవారు మాంసం తినాలన్న తమ సొంత కోరికలను తీర్చుకోవడం కోసం జంతువులను భూతయజ్ఞం (భూతయజ్ఞం అంటే జంతువులకు ఆహారం అందించడం. సనాతనధర్మాన్ని ఆచరించే ప్రతి హిందువు ఆచరించాల్సిన పంచ మహాయజ్ఞాల్లో ఒకటి.), పితృ యజ్ఞం నెపంతో బలి ఇస్తారు - శ్రీ మద్భాగవతం 11 వ స్కందం, 5 వ అధ్యాయం.
ఇక్కడ మాంసాహారులను దూషించలేదు. మాంసం తినడం ధర్మంలో కొన్ని వర్ణాలకు తప్పుకాదు. కానీ ఆధ్యాత్మిక జీవనం గడపాలి, ఆత్మ సాక్షాత్కారం కలగాలి అని తపించే సాధకులు, వారు ఏ వర్ణంలో పుట్టినా, ఆధ్యాత్మిక జీవన ఆరంభంలోనే మాంసాహారాన్ని విడిచిపెట్టాలని గ్రంధాలన్ని స్పష్టంగా చెప్తున్నాయి. కేవలం మాంసాహారాన్ని విడిచిపెట్టడం కాక, మితసాత్త్వికాహార నియమం విధించాయి. శాఖాహారంలో కూడా సాత్త్వికాహారాన్నే స్వీకరించాలని, అప్పుడు మాత్రమే మనస్సు శుద్ధి అవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఆహారశుద్ధ్వే సత్త్వశుద్ధిః అని ఉపనిషత్తు చెప్పింది. అయితే ఇక్కడ పాపకార్యాలు చేసేవారని అన్నది తమ రుచి కోసం మాంసం తినాలని నిశ్చయించుకుని, దానికి యజ్ఞాన్ని, దైవాన్ని నెపంగా పెట్టి, దేవుడికి బలి ఇచ్చాం కనుక తింటున్నాం చెప్పేవారిని. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే ధర్మం దేశకాలాలను అనుసరించి మారుతుంది. బ్రాహ్మణుడు ఎప్పుడూ మాంసాహారం తినకూడదు. అదే సైనికుడి (క్షత్రియుడి) విషయంలోకి వస్తే, అతడు పని చేసే ప్రదేశంలో అన్ని రకాల ఆహారం దొరకకపోవచ్చు. దొరికినవి బలమైనవి కాకపోవచ్చు. అప్పుడు అతడికి ఇలాంటి ఆహార నియమాలు ఉండవు. తన శరీరాన్ని తాను బలంగా, పుష్టిగా ఉంచుకున్నప్పుడే క్షత్రియుడు తన ధర్మాన్ని నిర్వర్తించగలుగుతాడు. కనుక స్వధర్మ రక్షణ కోసం అతడు భుజించవచ్చు.

యజ్ఞాల్లో జంతుబలి ఇచ్చేవారు మూర్ఖులు. వాళ్ళకి వేదహృదయం అర్దం కాలేదు - పంచతంత్రంలో 3 వ తంత్రం, 2 వ కధ)

ఇలా సంస్కృత వాజ్ఞమయంలో అనేక చోట్ల వేదంలో హింసలేదని చెప్పబడడమే కాదు, ఎక్కడైనా ధర్మాన్ని అడ్డంగా పెట్టుకుని హింస చేస్తే, అది అధర్మమని ఖండించబడింది.

సేకరణ - వెజిటెరినిజం అండ్ ది వేదాస్ - అరుణభ్ తల్వార్

To be continued ..............

Sunday, 8 May 2016

హిందూ ధర్మం - 208 (యజ్ఞంలో బలి ఖండన - 2)

వక్రీకరణ - నరమేధంలో మనిషిని బలి ఇస్తారు.
వాస్తవం - మానవదేహానికి వేదం చెప్పిన విధంగా అంత్యేష్టి సంస్కారం (దహనసంస్కారం మొదలైనవి) చేయడమే నరమేధం - సత్యార్ధప్రకాశంలో స్వామి దయానంద సరస్వతీ.

వివరణ - భారతీయ సమాజం ఆటవికమని, తమ మతమే శ్రేష్టమని నిరూపించడానికి ఏ విధంగా అవకాశాం లేదని గ్రహించిన వక్రీకరణకారులు, యజ్ఞయాగాది క్రతువుల్లో మనుష్యులను బలిస్తారని వక్రీకరించారు. అదేకాక సంస్కృతిని నాశనం చేయడంలో పత్రికలు ముందుంటాయి. ఎవరైనా జనాలను మోసం చేస్తే, అవినీతి అధికారి జనాలకు శఠగోపం పెట్టాడని ప్రచురిస్తారు. భాషను తామేదో కాపాడుతున్నామని చెప్పుకునే ఈ పత్రికల వాళ్ళకు భాషలో పదాల అర్దం కూడా కనీసం తెలియదు. శఠగోపం మీద స్వామి పాదాలుంటాయి. ఆలయంలో శఠగోపం పెట్టించుకోవడం స్వామి పాదాలను నెత్తిన పెట్టించుకుని, ఆశీర్వాదం పొందడం. స్వామి పాదాలు పట్టుకున్నవాడు ఉద్ధరించబడతాడే కానీ నశించడు. మరి ఈ పద ప్రయోగాన్ని పత్రికలు నీచంగా ఎందుకు చేస్తాయో వారికే తెలియాలి. ఇలాంటిదే నరమేధం కూడా. ఎక్కడైన ఉగ్రవాద దాడి జరిగి, అనేకులు మరణిస్తే, భారి నరమేధం అంటూ ఆ పదానికి లేని అర్ధాన్ని ఆపాదించి, సమాజాన్ని పక్కద్రోవ పట్టిస్తున్నారు.

శతపధబ్రాహ్మణం 13 వ అధ్యాయంలో నరమేధం గురించి చెప్పబడింది. 7 1/2 అడుగుల పొడవు, 5 1/2 అడుగుల వెడల్పు, 4 1/2 అడుగుల లోతుతో గొయ్యి త్రవ్వాలి. పైన ఉన్న వెడల్పులో సగం మాత్రమే క్రింద ఉండాలి. అందులో కనీసం 49 పౌండ్ల గంధపుచెక్క, పలాశ (మోదుగ) చెట్టు చెక్క వేయాలి. శవానికి సమాన బరువుతో ఆవునెయ్యి తీసుకుని, కస్తూరి కలిపి, అందులో కొద్దిగా కుంకుమ పువ్వు, కర్పూరం మొదలైనవి వేయాలి. దాని మీద శవాన్ని ఉంచాలి. శవం మొత్తం ఆవునెయ్యిని చల్లి, నిప్పు అంటించాలి. ఈ విధంగా చేయడం వలన శవం కాల్చిన వాసన రాదు.

ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే దహన సంస్కారానికి యాగానికి సమానమైన స్థానం కల్పించారు. అసలు శవ దహనం అనకుండా దహన సంస్కారమని, అంత్యేష్టి అని అనడంలోనే ఎంతో అర్దం దాగుంది. సంస్కారం అనగా సంస్కరించునది. దేహన్ని, సూక్ష్మ శరీరాన్ని సంస్కరించి, ఆత్మ ఉద్ధతికి సహాయపడే కర్మలకు సంస్కారం అని పేరు. దానికి మరే ఇతర భాషలోను సమానమైన అర్దంలేదు. తాను దేహం కాదు, ఆత్మ అని స్థిరమైన భావన ఉన్నవారు, దేనీ మీద వ్యామోహం లేనివారికి మినహాయించి మరణం సంభవించగానే అందరి ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోదు. అది అక్కడే, ఆ దేహం మీద మమకారంతో రోదిస్తూ ఉంటుంది. ఆ రోదన ఎవరికి (సామాన్య మనవులకు) కనపడదు, వినపడదు. జీవుల కర్మ తీరడానికి కొత్త దేహం ధరించాలి. కానీ దేహమే తానన్న మమకారం వలన అది కొత్త ప్రదేశానికి దేహాన్ని విడిచి వెళ్ళెందుకు ఇష్టపడదు. ఆ శరీరాన్ని అలాగే వదిలేస్తే, అది కుళ్ళిపోతుంది. తన దేహం కుళ్ళిపోవడం దీనికి ఇంకా బాధను కలిగిస్తుంది. అలా కాక ఆత్మను ఉద్ధరించడం కోసం వచ్చిందే ఈ దహన సంస్కారం. అప్పుడు చదివే మంత్రాలు, ఆత్మకు ఈ దేహం తనది కాదని, ఇక తాను అక్కడి నుంచి విడిచి వెళ్ళాలని, తనకంటూ వేరే దేహం, జన్మ నిర్దేశించబడ్డాయని తెలియజేస్తాయి. శరీరాన్ని పూడ్చిపెట్టక, దాన్ని కాల్చివేయడం, మిగిలిన అస్థికలు, ఎముకలను నదిలో కలపడం వలన దేహం పూర్తిగా పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇక అక్కడ ఆత్మ తనది అంటూ కూర్చుని ఏడ్వడానికి ఏమీ మిగలదు. అలా జీవులను శవ దహనం ద్వారా ఉద్ధరించి, వెరొక జన్మకు పంపుతుంది కనుక దీనికి దహన సంస్కారం అని పేరు వచ్చింది. ఇందులో దహనం చేసేవారికి స్వార్ధం ఉండదు. వారు తమ ధర్మాన్ని నిర్వర్తించడం తప్పించి, ఏమీ ఆశించటం కూడా ఉందదు.

అంతేగాక, ఒక శరీరాన్ని అలాగే వదిలేస్తే అది కుళ్ళి రోగాలు వ్యాపిస్తాయి. కొన్ని భయంకరమైన రోగాలు, అంటువ్యాధులతో మరణించినవారిని పూడ్చిపెట్టడం కంటే కాల్చివేయడం మంచిదని కూడా ఇప్పుడు ఋజువు అవుతోంది. ధర్మం కూడా అదే చెప్పింది. అనాధ శవాలను కూడా ఎవరూ లేరని వదిలేయక, ఆ జీవుడిని ఉద్ధరించడం కోసం వాటికి కూడా కర్మకాండ నిర్వహించమంటోంది. అది చేసింనందుకు ఎంతో పుణ్యం వస్తుందని కూడా ఈశ్వరుడు నిర్దేశించాడు. ఈ చర్య నిస్వార్ధతతో కూడినదై, రోగాలు వ్యాపించకుండా ఇటు సమాజాన్ని, జీవుడి ప్రయాణాన్ని సులభతరం చేసి ఆత్మను ఉద్ధరిస్తున్న కారణాన దీన్ని యాగం అన్నారు. అంతేకాని నరమేధం అంటే వ్యక్తిని చంపి యాగంలో వేయడం కాదు.

To be continued ................

Monday, 25 April 2016

హిందూ ధర్మం - 206 (అశ్వమేధయాగంలో అశ్వబలి లేదు - 2)

వక్రీకరణ - అశ్వమేధయాగంలో గుర్రాన్ని చంపి యజమాని (యాగం చేసేవారు) భార్య చచ్చిన గుర్రంతో ఒక రాత్రి నిద్రిస్తుంది. ఆ తర్వాత, ఆ మృత గుర్రం నుంచి తీసిన వప అనే ఒక ప్రత్యేక రసాయనాన్ని యజ్ఞంలో అర్పిస్తారు.
వాస్తవం - అశ్వమేధయాగంలో యజమాని భార్య జ్వలిస్తున్న అగ్ని వద్ద ఒక రాత్రి శయనిస్తుంది. మరునాడు ఆ అగ్నిలో ప్రత్యేక ఆయుర్వేద మూలికల నుంచి సేకరించిన ఔషధగుణములు కలిగి రసాన్ని (వప) యజ్ఞంలో అర్పిస్తారని స్వామి దయానంద సరస్వతీ సత్యార్ధ ప్రకాశంలో వివరించారు. అశ్వన్ని బలి ఇస్తారన్న వాదనను తీవ్రంగా ఖండించారు.


వివరణ - అశ్వమేధయాగ విషయంలో ఆంగ్లేయులు, కమ్యూనిష్టులు చేసిన వక్రీకరణ క్షమించదగ్గది ఎంతమాత్రము కాదు. శతపధ బ్రాహ్మణంలోనే దీనికి సమాధనం ఉంది.
అగ్నిర్వా అశ్వం అని శతపధబ్రాహ్మణం 13.16.3 స్పష్టం చేసింది. ప్రకాశవంతంగా వెలుగుతున్న అగ్నియే అశ్వం. యాగవివరణ మంత్రాల్లో అగ్ని, అశ్వం అనే రెండు అర్దాలు వచ్చే పదాన్ని ఉపయోగించారు. అయితే ధర్మద్వేషులు చేసిందేమిటంటే అగ్ని అనే అర్దానికి బదులు గుర్రం అనే అర్దాన్ని స్వీకరించారు. వైదిక శబ్దాలకు ఎప్పుడు ఏ అర్దం ఉపయోగించాలో నిర్ధారించేది నిరుక్తం. అలా అర్దాన్ని స్వీకరిస్తేనే అది సప్రమాణికం. అదీగాక ఇక్కడ శతపధబ్రాహ్మణమే చెప్తున్నది అక్కడ అగ్నియే అశ్వమని. కానీ వారు దీన్ని విస్మరించారు. ఈ విషయంలో సాయనాచార్యుడు, మహీధరుడు మొదలైన భారతీయ భాష్యకారులు కూడా పొరబడ్డారని దయానందులు అన్నారు.  అశ్వమేధం ముగిసే ముందు రాణి ఆ రాత్రంతా జ్వలిస్తున్న అగ్ని వద్ద ఏ భయం లేకుండా, తన భర్త తన పక్కన ఉంటే ఎంత ధైర్యంగా నిద్రిస్తుందో, అంత ధైర్యంగా నిద్రిస్తుంది. ఆ అగ్ని చల్లారకుండా, ఆ రాత్రంత్రా ఋత్విక్కులు వేదమంత్రాలతో ఆ యజ్ఞాగ్నిలో ఆహుతులిస్తూ, అగ్ని ప్రజ్వరిల్లేలా చేస్తూనే ఉంటారు.

దేశం అశ్వం వంటిది అయినప్పుడు, ఆ చిన్న, చితకా రాజపరివారం, మంత్రులు, చిన్న చిన్న జంతువుల వంటి వారు. ఆ యాగానికి అనేక పెద్ద, చిన్న సామంత రాజులు, మంత్రులు హాజరవుతారు. రాజు నుంచి మంత్రులు, సామంతరాజులు మొదలైనవారికి ఆ సమయంలోనే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం, దేశభద్రత, సరిహద్దులు పటిష్టకు సంబంధించిన అంశాల పట్ల చర్చ జరుగుతుంది. యాగసమాప్తిలో ప్రత్యేక మూలికల నుంచి తీసిన పసరును యాగంలో సమర్పిస్తారు. అది అందరి దేహాలను శుద్ధి చేస్తుంది.

అయితే దీనికి నికృష్టులైన కమ్యూనిస్టులు, అంగ్లేయులు చేసిన అతి నీచమైన వక్రీకరణ చూసినవారు ఎవరైనా వారు కమ్యూనిష్టులు కారని, కమీనేలు, నికృష్టులని ఒప్పుకుని తీరుతారు. వారి మీద ఆవేశంతో రగిలిపోతారు. పైన చెప్పిన వక్రీకరణ కాక, వీరు దీనికి వీరుకున్న జాడ్యాలన్నీ అంటించి, వారి మనసులో అణుచుకున్న కోరికలను ఆ యాగంలో జరిగే ప్రక్రియలుగా వర్ణించారు. సాయనాచార్యుడు మొదలైన భాష్యకారులు చెప్పిందే చెప్తున్నామంటూ, మకు అర్దమైనట్లుగా సాయనుడికి వేదహృదయం అర్దం కాలేదు, అందుకని మేము చెప్పిందే స్వీకరించండి అని చెప్పేశారు. ఆ వక్రీకరణకారులు ఏమంటారంటే ఆ యగంలో చిన్న చిన్న పశువులను, పక్షులను బలి ఇస్తారు. అటు తర్వాత రాణి ఆ అశ్వానికి కత్తితో 3 గాట్లు పెడుతుంది. తర్వాత అశ్వాన్ని చంపుతారు. ఆ చచ్చిన అశ్వంతో యజమాని భార్య ఒక రాత్రి శయనిస్తుంది. తన భర్తతో శయనించిన విధంగా. ఆమె దానితో సంభోగిస్తుంది. దీనివలన ఆమెకు గర్భశుద్ధి అవుతుంది. ఇదంతా వేదపండితుల సమక్షంలోనే జరుగుతుంది. వారు అది చూస్తూ, దాన్ని ప్రోత్సహిస్తూ, చపట్లు కొడుతూ, ఆ రాత్రంతా అక్కడే ఉంటారు. మరునాడు ఉదయం ఆ అశ్వాన్ని చంపి, దాని శరీరభాగం నుంచి వపను తీసి, యజ్ఞంలో వేస్తారు. చూడండి,  విషయాన్ని ఎంత దారుణంగా పక్కదోవ పట్టించారో!.

ఇంతకంటే నికృష్టమైన, నీచాతినీచమైన వక్రీకరణ ఉంటుందా? దీన్ని మనం అంగీకరించాలా? కానీ విదేశీయుల కుట్ర ఎటువంటిదంటే ఇప్పుడు ఈ దేశంలో అనేకమంది పండితులు కూడా వక్రీకరించిన విషయమే కొన్ని సవరణలతో సత్యమని భావిస్తున్నారు. పాపం! వారికి కూడా నిజం తెలియదు. ఈ విషయంలో ఆర్యసమాజం వారు నిరుక్తం ఆధారంగా పరిశోధన చేసి, సనాతనధర్మానికి చేసిన సేవ మరువజాలనిది.

To be continued ....................

Sunday, 24 April 2016

హిందూ ధర్మం - 205 (అశ్వమేధయాగంలో అశ్వబలి లేదు - 1)

వక్రీకరణ - అశ్వమేధ యాగంలో అశ్వాన్ని బలి ఇస్తారు.

వాస్తవం -  అశ్వమేధయాగంలో గుఱ్ఱాన్ని ఉపయోగించే మాట నిజం కానీ బలి మాత్రం ఇవ్వరు. అసలు అశ్వమేధ యొక్క ఉద్దేశ్యం జంతుబలి కాదు, దేశ సంరక్షణ, సరిహద్దుల పటిష్టత అని ఆర్యసమాజ స్థాపకులు మహర్షి స్వామి దయానందులు వేదోక్తంగా నిరూపించారు.

రాష్ట్రంవా అశ్వమేధః (దేశమే అశ్వమేధం. (దేశసంరక్షణ కొరకు చేసేది)) అని శతపధ బ్రాహ్మణం 13.16.3 చెప్తున్నది.
ఇప్పుడు మనం అనుకుంటున్న సమాఖ్య వ్యవస్థ (Federalism) వేదంలో ఉంది. భారతదేశం ఒక దేశంగా ఏర్పడింది 1947 తర్వాత 1950లో అమల్లోకి వచ్చిన రాజ్యాంగం ద్వారా కాదు. ఈ దేశానికి ఎన్నో యుగాలు చరిత్ర ఉంది. అనేక మన్వతరాల నుంచి, కల్పాల నుంచి భారతదేశం ఏకఖడంగా ఉంది. ఎందరో రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు. అనేకులు చక్రవర్తులై, సామ్రాట్టులై ప్రపంచాన్ని భారతదేశం పాదల చెంతకు తీసుకువచ్చారు. ఇప్పుడున్న వ్యవస్థలో దేశానికి ఒక ప్రధాని, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నట్టుగానే పూర్వం కూడా అఖండ భారతానికి ఒక చక్రవర్తి, ఆయన క్రింద అనేక సామంత రాజులు చిన్న చిన్న రాజ్యాలను పాలిస్తూ ఉండేవారు. ఇప్పటిలాగే అప్పుడు కూడా రాజ్యంగం ఉన్నది. అప్పట్లో అది ధర్మంగా ఆధారంగా, శృతిని, స్మృతులను అనుసరించి ఉండేది. నిజానికి ధర్మమే దైవం ఏర్పరిచిన రాజ్యాంగం. అప్పుడు దాన్నే అనుసరించేవారు. దానికి ఎవరూ అతీతులు కారు, మార్పు చేసే అవకాశం(యుగధర్మం తప్పించి తరచు మార్పు చేసే అవకాశం) కూడా ఉండేది కాదు. ఎప్పుడైనా సామంత రాజులు గర్విష్టులై, చక్రవర్తికి కప్పం కట్టకుండా, తన రాజ్యాన్ని ఈ దేశం నుంచి వేరు చేయాలనే చర్యలకు పాల్పడినప్పుడు చక్రవర్తి అశ్వమేధ యాగం చేసేవారు. అందులో యాగ అశ్వానికి ఇది అశ్వమేధ యాగ పశువు అని కనిపించే విధంగా ఒక పతాకం (జెండా) కట్టి, దాని వెనుక సైన్యాన్ని కాపలాగా పంపించేవారు. ఆ గుర్రం దేశం మొత్తం సంచారం చేస్తుంది, దాన్ని ఎవరు అడ్డుకోరు. అడ్డుకుని, బంధించినవారు ప్రభువుతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. దాన్ని అడ్డుకోవడమంటే దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను ప్రశ్నించడమే. ఓడితే కప్పంతో బాటూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలా ఆ గుర్రం దేశం మొత్తం సంచారం చేసి, తిరిగి యాగస్థలికి రావడంతో యాగం ముగుస్తుంది. అందులో అశ్వాన్ని బలి ఇవ్వడమేమీ ఉండదు. ఇందులో అశ్వమే ప్రధానం కానుక, ఆ గుర్రాన్ని యాగపశువు అన్నారు కానీ, దాన్ని బలి ఇస్తారని కాదు. కొన్ని యగాల్లో యజమానే యాగపశువు అని శాస్త్రం చెప్తోంది. అంటే యజమానిని బలి ఇస్తున్నారా? లేదు కదా. దేశంలో ఏర్పడ్డ చీలికను తొలగించి, సామంత రాజులందరూ ధర్మం ఆధారంగా ఏర్పడిన విశాల రాజ్యానికి కట్టుబడి ఉంటామని చెప్పడమే అశ్వమేధం యొక్క ప్రధాన ప్రయోజనం. ఇది దేశంలో అసంతృప్తులను నశింపజేసి, సరిహద్దులను పటిష్టం చేస్తుంది. అంతర్గత ఐక్యతను కాపాడుతుంది.

ఈ అశ్వమేధ యాగం ఈ అఖండభారతంలో ఎన్నో సార్లు జరిగింది. ద్వాపరయుగంలో ధర్మరాజు ప్రభువుగా కృష్ణుని సంకల్పంతో అఖండభారతం 18 రాష్ట్రాలతో, ఒకే రాజ్యాంగంతో, సమాఖ్య వ్యవస్థగా అవతరించింది. అప్పటి నుంచి అధర్మాన్ని అనుసరించారని ఈ పవిత్ర భూమి నుంచి వెలివేయబడ్డవారు తిరిగి ఈ దేశం మీద దండెత్తినప్పుడు, తమ మతాన్ని ఈ భూమిలో వ్యాపింపజేసి, అంతర్గతంగా విబేధాలను సృష్టించి, దేశాన్ని బలహీనం చేయాలని చూసిన ప్రతిసారి ఈ దేశపు రాజులు అశ్వమేధం నిర్వహించారు. కలియుగంలో కూడా క్రీ.శ. 7 వ శతాబ్దం వరకు, భారతదేశం కేంద్రీకృతవ్యవస్థ పతనమయ్యేవరకు ఈ దేశంలో అశ్వమేధాలు నిర్వహించారట. భౌద్ధం ప్రబలి, కొన్ని రాజ్యాలను అఖండభారతవని నుంచి వేరు చేయాలనుకున్నప్పుడు, హిందూ ప్రభువులు, దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్వహించి, దేశ సరిహద్దులను పటిష్టం చేశారు.

ఒకనాడు ఇప్పటి పర్షియా, ఇరాన్, మెసపుటామియా, ఇరాఖ్ వరకు భరతవర్షం భారతదేశపు రాజుల ఆధీనంలో, ఈ భారతభూమిలో భాగంగా ఉండేది. అటుపక్క మధ్య ఆసియా లోని కశ్యప సముద్రం (కాస్పియన్ సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఒకప్పుడు హిందువులైన పారశీకులు అధర్మాన్ని పాటించడం వలన దేశ బహిష్కారానికి లోనుకాగా, సరిహద్దుల్లో తిష్టవేసి, ఈ సంస్కృతి మీద ద్వేషంతో మన దేశంలో తమ మతాన్ని ప్రచారం చేసి, కొన్ని ప్రాంతాలను దేశం నుంచి వేరు చేశారు. అటు తర్వాత బౌద్ధులు. అంతర్గతంగా, ఈ దేశంలో ఉంటూనే, ఈ ధర్మం మీద ద్వేష భావనతో, కొన్ని రాజ్యాలను అఖండభారతం నుంచి వేరు చేశారు. (ఆ కారణంగానే అఖండభారతం అనేక ముక్కలైంది. అటు తర్వాతా ఆయా ప్రాంతాల మీద ఇతర మతాలు దండెత్తడం వలన, బౌద్ధం లాంటివి కూడా అక్కడ నశించాయి.) వీరు ధర్మానికి వ్యతిరేకులు కనుక, అశ్వమేధం లాంటి యాగాలు చేస్తే, తమకు రాజకీయ ప్రాభవం దక్కదని, యజ్ఞయాగాది క్రతువులను నిరసించారు. ఆ ప్రభావంతో ఈ దేశంలో అనేక రాజులు సరిహద్దులను పటిష్టం చేసే ఇటువంటి యాగాలను విస్మరించి, అహింస పేరుతో మౌనం వహించి, అఖండభారత విచ్ఛిన్నానికి కారుకులయ్యారు. అయినప్పటికి ధర్మజ్వాల నశించలేదు. క్రీ.పూ. 7 వ శతాబ్దంలో వచ్చిన ఆదిశంకరుల ప్రభావం ఈ దేశంపై 1500 సంవత్సరాలు ఉన్నది. ఆయన ధర్మానికి కొత్త ఊపిరిలూదారు. అందుచేత విక్రమాదిత్యుడు, శాలివాహానుడు మొదలైన రాజులు భరతవర్షం కోల్పోయిన భాగాలను తిరిగి ఈ దేశంలో విలీనం చేశారు.

To be continued ............

Saturday, 16 April 2016

హిందూ ధర్మం - 204 (యజ్ఞంలో బలి ఖండన - 1)

వక్రీకరణ - అశ్వమేధం, గోమేధం మొదలైన యజ్ఞాల్లో జంతుబలి ఉంటుంది. గోమేధంలో ఆవును బలి ఇస్తారు.
వాస్తవం - అశ్వమేధం, గోమేధం అన్న పేర్లలో పదాలకు మీకు తెలిసిన ఒకటి, రెండు అర్దాలను పట్టుకుని చేస్తున్నా నిరాధార ఆరోపణలివి. ముందు గోమేధం గురించి చూద్దాం. గోవును వధించి చేసే యజ్ఞం కనుక దానికి గోమేధమని పేరని కుహనా చరిత్రకారులు, కిటుల బుద్ధి కలిగిన అంగ్లేయులు, కమ్యూనిష్టులు అర్దం చెప్పారు.

శతపధ బ్రాహ్మణం 13.3.6.2 ప్రకారం మేధ అంటే ఆజ్యం (ఆవునెయ్యి). ఏ యజ్ఞంలోనైతే విశేషంగా ఆవునెయ్యిని వాడుతారో, అందులో మేధ అనే పదం చేర్చారు. పతంజలి మహర్షి గారి ఉనది కోశం 2-67 ప్రకారం గో అనే పదం ఇంద్రియాలను, వాతవరణాన్ని, కిరణాలను (సూర్యుడు, ఇత్యాదుల), భూమిని సూచిస్తుంది. అలాగే భూమిపై జరిగే క్రతువులను సూత్రప్రాయంగా స్వీకరిస్తుంది. పైన చెప్పుకున్న వాటిని కాలుష్య రహితంగా, పవిత్రంగా ఉంచడమే గోమేధ యజ్ఞం.

అదేకాక
అన్నం హి గావః
ఆజ్యం మేధః అని కూడా శతపధ బ్రాహ్మణం చెప్తున్నది.

సస్యవృద్ధి కొరకు చేసే యజ్ఞమే గోమేధమని అర్దం. చలికాలంలో అలుముకునే పొగమంచు కారణంగా భూమిపై సూర్యకిరణ ప్రభావం తగ్గుతుంది. దాంతో జీవులలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. ఆ సమయంలో భూమిపై ఉన్న జీవరాశికి పుష్టినివ్వడం కోసం గోమేధ యజ్ఞం చేస్తారు. ఇక్కడ గోవు అంటే భూమి, వాతావరణం. అలాగే సూర్యకిరణాలకు అడ్డుపడే పొగమంచును చేధించడం. అయితే వక్రీకరణ కారులు ఏం చేశారంటే గోమేధంలో పదం ఒకటి పట్టుకున్నారు. అలాగే చలికాలంలో సూర్యకిరణాల ప్రభావం తగ్గిపోతుందనే అర్దం వచ్చే మంత్రాలను యజ్ఞంలో గోవును బలిస్తారు అన్నట్టుగా వక్రీకరించారు. కానీ ఆ తర్వాత వచ్చే మంత్రంలో వసంత ఋతువులో గోవు (భూమి, సూర్యకిరణాలు) తిరిగి పుష్టి పొందుతుందని చెప్పబడింది. కానీ వీరు ఆ మంత్రాన్ని విస్మరించారు. ఒకవేళ అక్కడ చెప్పబడింది ఆవు అయితే బలివ్వబడిన ఆవు తిరిగి ఎలా పుష్టిపొందుతుంది? ఇది నికృష్ఠులైన వక్రీకరణకారులకు తట్టలేదు. అందుకే అలా గోమేధం అంటే గోవును బలిచ్చే యాగం అని వక్రీకరించి, ప్రచారం చేశారు. గోమేధం పాడిపంటల వృద్ధి కోసం, అడవులు, పచ్చదనం వృద్ధి కోసం, వాతావరణాన్ని కాలుష్యరహితం చేయడం కోసం చేస్తారు. ఈ విషయాన్ని ఆర్యసమాజ స్థాపకులు స్వామి దయానందులు సత్యార్ధప్రకాశంలో వివరించారు.

యజ్ఞం కేవలం బాహ్యమే కాదు, ఆంతరంగికం కూడా. బయట చేసే యజ్ఞం పాప ప్రక్షాళనకైతే, ఆంతరములో చేసే యజ్ఞం జ్ఞానవృద్ధికి, మోక్షానికి. రెండూ ముక్యమే. ప్రతి యజ్ఞంలో ఈ రెండు అంశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలా గో అంటే ఇంద్రియాలు. ఇంద్రియ నిగ్రహం ఎల్లవేళలా కలిగి ఉండడమే గోమేధ యజ్ఞం.

To be continued ...............

Sunday, 10 April 2016

హిందూ ధర్మం - 203 (వేదంలో గోవధ ఖండన - 3)



వక్రీకరణ - ఇంద్రుడు ఆవు, దూడ, ఎద్దు, గుర్రం, దున్నపోతుల మాంసం తింటాడు - 6-17-1
వాస్తవం - ఆ మంత్రం ఏం చెప్తోందంటే యజ్ఞంలో అగ్నికి కలప పుష్టినిచ్చిన విధంగా గొప్ప పండితులు ఈ ప్రపంచాన్ని జ్ఞానంతో కాంతిమయం చేస్తారు. ఈ మంత్రాన్ని అనువాదం చేసిన అవతార్ గిల్ల్ సమూహానికి ఇందులో ఇంద్రుడు, ఆవు, ఎద్దు, గుర్రం ఎలా కనిపించాయో!? వారు చెప్పిన మంత్రంలో 'గవ్యం' అనే పదం ఉంది. పంచగవ్యం ఆవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడలకు సంకేతం. కానీ వారు దానికి మాంసం అనే అర్దం కల్పించారు. రాజు గోఘృతం వంటి సాత్విక భోజనం ద్వారా పుష్టిగా తయారై దేశాన్ని శతృవులు, రాక్షసుల బారి నుంచి రక్షించాలని ఆ మంత్రం చెప్తోంది.

వక్రీకరణ - అగ్ని 100 దున్నపోతులను వండాడు. ఓ ఇంద్రా! ఇది మరుత్తులను శక్తివంతం చేస్తుంది. అతడు, పూషన్, విష్ణువు, అందులోకి మూడ పెద్దపాత్రలతో వృత్తాసుర్రున్ని చంపే రసాయనం పోశాడు - ఋగ్వేదం 6-17-11
వాస్తవం - ఓ ఇంద్రా! లోక పరిపాలకుడా! మానవాళి మరియు ప్రకృతి యందున్న సమస్త బలనమైన, సృజనాత్మకమైన శక్తులన్నీ ఏకమై నీ తేజమును, సేవను స్తుతించాలి. సర్వవ్యాపకుడు, విశ్వాన్ని పోషించువాడు, సర్వకాలాల్లో శక్తిమంతుడు, మూడూ లోకాల యందు ఉంటూ పరమానందానిచ్చు విష్ణువు దుష్టులను నశింపజేయు ఇంద్రునకు ఆనందాన్ని, శక్తిని ఇచ్చుగాకా. (ఇది ఆర్యసమాజ స్థాపకులు మహర్షి స్వామి దాయనందుల వారి అనువాద సరళిలో డా. తులసి రాం శర్మ గారి అనువాదం)

వక్రీకరణ - మనుస్మృతి జంతువధను సమర్ధిస్తుంది. 'జంతువులను తినడం పాపం కాదు, ఎందుకంటే భగవంతుడు తినేవారిని, తిను పదార్ధాలను, రెండింటిని సృష్టించాడు - 5-30
వాస్తవం - హిందూ ధార్మిక గ్రంధాల్లో అత్యత ఎక్కువగా ప్రక్షిప్తాలకు గురైంది మనుస్మృతేనని అనేకమంది తేల్చారు. క్రీ.శ. 7 వ శతాబ్దం తర్వాత మొదలైన ఈ ప్రక్షిప్తాలు ఎంతవరకు వెళ్ళాయంటే ఇప్పుడు లభించే మనుస్మృతిలో 50% ప్రక్షిప్తాలే ఉన్నాయి. ఆర్యసమాజం వారు మనుస్మృతిలో ఉన్న ప్రక్షిప్తాలను తొలగించి యదార్ధమైన మనుస్మృతిని విశుద్ధ మనుస్మృతి పేరిట ప్రచురించారు.

అసలు మనుస్మృతిలో జంతువధ గురించి ఏం చెప్పారో చూద్దాం.

अनुमन्‍ता विशसिता निहन्‍ता क्रयविक्रयी ।
संस्‍कर्ता चोपहर्ता च खादकश्‍चेति घातका: ।। – మనుస్మృతి 5 వ అధ్యాయం 51 వ శ్లోకం.

మాంసభక్షణ ప్రోత్సహించేవాళ్ళు, జంతువులను వధించువాడు, మాంసం అమ్మువాడు, వండువాడు, దాన్ని వడ్డించువాడు, తినువాడు, అందరూ ఘాతకులే. వారందరికి పాపం సమానంగా వస్తుంది.

ఏ జీవిని చంపకపోవటం చేతనే వ్యక్తి మోక్షానికి అర్హుడవుతాడు - మనుస్మృతి 6.60

నిస్సహాయ, అహింసాప్రవృత్తి కల జంతువులను తన సంతోషం కోసం వధించువాడు ఇహలోకంలోను, పరలోకంలోనూ ఎన్నటికి సంతోషాన్ని పొందడు - మనుస్మృతి 5-54.

ఎవరికైతే జంతువులను బాధించాలని, వధించాలని కోరిక ఉండదో, అతడు సవ్రజీవులకు హితుడై (సరభూతహితుడై), పరమానందాన్ని పొందుతాడు - మనుస్మృతి 5-46

ఏ జీవికి హానీ చేయనివాడు, ఏ ప్రయత్నం లేకుండానే అతడు అనుకున్నది ఏది అనుకుంటే అది పొందుతాడు, మనసు దేని మీద లగ్నం చేస్తే అది సిద్ధిస్తుంది, అతడు తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది - మ.స్మృ.5-47

జీవులను హింసించకుండా మాంసం రాదు. జీవహింస ఆత్మానందానికి అడ్డంకి. కనుక మాంసభక్షణ విడిచిపెట్టండి - మ.స్మృ.5-48

దేవతలను, పితృదేవతలను పూజించకపోయినా ఫర్వాలేదు కానీ, అన్యజీవుల మాంసాన్ని భుజించి తన శరీర సౌష్టవాన్ని పెంచుకోవాలనుకునే వ్యక్తికి మించిన మహాపాపాత్ముడు వేరొకడు ఉండడు - మ.స్మృ.5-52

మనుస్మృతి ఇంత విపులంగా జీవహింస తప్పని చెప్తే, అందులో గోమాంసం భక్షణ ఉందని, వేదంలో ఎద్దులను తినమని చెప్పిందని వక్రీకరించి 'మొద్దులను' ఏమనాలి?

To be continued ................

Sources:
https://ancientindians.in/purusharthas/dharma/vegetarianism-as-per-manusmruti-a-dharma-sastra/
http://www.iskcondesiretree.com/forum/topics/about-being-vegetarian-and-not
http://www.vedicgranth.org/misconceptions-on-vedas/misconception-3---violence-against-animals-meet-eating-etc

Sunday, 3 April 2016

హిందూ ధర్మం - 202 (వేదంలో గోవధ ఖండన - 2)

మాంసం అంటే మనకు తెలిసిందే. కానీ మాంసం అంటే గుజ్జు అనే అర్దం కూడా వస్తుంది. సమయాన్ని, ప్రకరణాన్ని అనుసరించి అర్దం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వక్రీకరణకారులు మాంసం అనే సామాన్యమైన, వాడుకలో ఉన్న అర్దం తీసుకుని యాజ్ఞవల్క్య మహర్షి మాంసం తింటా అన్నారని ప్రచారం చేశారు.

ఇంకొన్ని ఆరోపణలను పరిశీలిద్దాం.

వక్రీకరణ - అతిధి వచ్చినప్పుడు, వివాహ సమయంలో, శ్రాద్ధ సమయంలో గోవును వధించాలి - ఆపస్థంభ గృహసూత్రం 1/3/10
వక్రీకరణ - శ్రాద్ధ సమయంలో భోజనంలో పెట్టిన మాంసాన్ని తినను అన్న బ్రాహ్మణుడు నరకానికి వెళతాడు - వశిష్ట ధర్మసూత్రం 11/34

వాస్తవం - అక్కడ గోవు గురించి చెప్పనేలేదు. శ్రద్ధయా కురుతే ఇతి శ్రాద్ధం అని సూత్రం. శ్రాద్ధకార్మకు శ్రద్ధ ముఖ్యం. దైవకార్యాలకు మడి లేకపోయినా సర్దుకోవచ్చు కానీ శ్రాద్ధ కర్మలకు మాత్రం మడి తప్పనిసరి అని పెద్దల నిర్ణయం. మడికి అర్దం బాహ్యంలో ఉన్న వస్తువులను ముట్టుకోకపోవడం అని కాదు. మనసును, ఇంద్రియాలను అన్యమైన విషయాల మీద వెళ్ళనివ్వక, తదేక దృష్టి కలిగి ఉండడం. మడి వస్త్రం ధరించినా, మనసు అన్య విషయాల మీదకు వెళితే, ఇక ఆ మడికి అర్దంలేదు. పై సూత్రాల్లో కూడా అదే చెప్పబడింది. అతిధి వచ్చినప్పుడు, వివాహ సమయంలో, శ్రాద్ధ సమయంలో ఇంద్రియాలను నియత్రించాలి, అదుపులో పెట్టుకోవాలి. అక్కడ గోవుకు ఇంద్రియాలనే అర్దం స్వీకరించాలి. దాన్ని వక్రీకరించి గోమాంసం తినాలని ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు నికృష్టులు.

అతిధి విషయంలో కూడా అంతే. అతిధి సాక్షాత్తు భగవత్స్వరూపం. అతిధికి భోజనం సిద్ధం చేయడం దగ్గరి నుంచి చాలా శుచిగా ఉండాలి. ఆహారం వండే సమయంలో వంట చేసేవారి మనసులోని భావాలు ఆహారంలోకి ప్రవేశిస్తాయని, అవి తిన్న వారిని ప్రభావితం చేస్తాయని ధర్మశాస్త్రం (ఆయుర్వేద, మంత్ర శాస్త్రాలు ఇత్యాదులు) చెప్తోంది. ఆహారం సిద్ధం చేసే సమయంలో మనసు అనవసరమైన, అధార్మికమైన విషయాల మీద వెళితే అది తిన్నవారి దేహంలోకి వెళ్ళి అదే భావాలను కలిగిస్తుంది. అందుకే సాధకులకు అనేక నియమాలున్నాయి. అతిధికి భోజనం పెట్టకపోతే వచ్చే పాపం కంటే అతడి ఉపాసనకు, నిష్ఠకు, దీక్షకు భంగం కలిగిస్తే వచ్చే పాపం ఇంకా ఎక్కువ. అందువల్ల అతిధి విషయంలో ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి అని ధర్మశాస్త్ర సూత్రాలు తెలియజేస్తున్నాయి.

వక్రీకరణ - కూతురి వివాహ సమయంలో ఆవులను, ఎడ్లను వధించాలి - ఋగ్వేదం 10.85.13
వాస్తవం - అసలు ఈ మంత్రం వివాహానికి సంబంధించినదే కాదు. గో హన్యతే అన్న ఒక్క పదాన్ని తీసుకుని ఇంత పెద్ద కష అల్లారు. శిశిర ఋతువు (చలికాలం) యందు సూర్యకిరణాలు బలహీనపడి మరల వసంత ఋతువులో శక్తిని పొందుతాయి అని ఆ మంత్రం చెప్తున్నది. ఇక్కడ గో అనే శబ్దానికి సూర్యకిరణాలనే అర్దం స్వీకరించాల్సి ఉండగా, నికృష్టులు ఆవును అనే అర్దాన్ని స్వీకరించారు. హన్యతే అనగా ఇక్కడ బలహీనపడుట అనే అర్దం స్వీకరించాలి. అదీగాక, వీళ్ళు పూర్తి మంత్రాన్ని అనువదించకుండా కేవలం గోహన్యతే అనే ఒక్క పదాన్నే అనువదించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళ వాదనే నిజం అనుకున్నా, ఆ తర్వాతి మంత్రంలో గోవు తిరిగి తన పూర్వ రూపాన్ని సంతరించుకుంటుందని చెప్తుంది? అక్కడ గోవుకు అర్దం ఆవు అయితే వధించబడిన ఆవు తిరిగి ఎలా బ్రతికి వస్తుంది? వీటికి వక్రీకరణకారుల వద్ద సమాధానం ఉండదు.

ఇంకో విషయం ఏమిటంటే అసలు వివాహాది శుభకార్యాల్లో మాంసం పెట్టడం నిషిద్ధం. వివాహమంత్రాల్లో వేదికకు దేవతలను, ఋషులను, అనేక శక్తులను ఆహ్వానిస్తారు. అటువంటి సమయంలో శుచి ప్రధానం. అప్పుడు కేవలం శాఖాహారమే వండాలి తప్పించి, మాంసాహారం వండకూడదు. అది కొత్తగా వివాహం చేసుకున్న జంట వైవాహిక జీవితానికి కూడా మంచిది కాదు.

To be continued ..................

ఆర్యసమాజం వారి సౌజన్యంతో

Monday, 28 March 2016

హిందూ ధర్మం - 201 (వేదంలో గోవధ ఖండన - 1)

ఇప్పటి వరకు ధార్మిక గ్రంధాల్లో గోవధ లేదన్న సంగతి చూశాం. ఇప్పుడు ధర్మవ్యతిరేకులు చేస్తున్న ఆరోపణలను ఎంత అసత్యమో, కుట్రపూరితమో చూద్దాం. నిజానికి ఈ వాదన ఈనాడు కొత్తగా వచ్చింది కాదు, వేదంలో గోవధ ఉందని ఆంగ్లేయులు వేదాలకు భాష్యాలు రాసే సమయం నుంచి ప్రారంభమైంది. అటు తర్వాత వక్రీకరణ కారులైన డి.ఎన్.జా, మహాదేవ్ చక్రవర్తి, వెండీ డాగ్నిర్ మొదలైన అనేకమంది వేదంలో గోవధ ఉందని ఆరోపించారు. మతమార్పిడి మూర్ఖులు, జాకిర్ నాయిక్ లాంటి అబద్ధాలకోరులు ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తారు. విచిత్రం ఏమిటంటే వీళ్ళకు మద్దతుగా మీడియా కూడా వేదంలో గోవధ ఉందని, వేదకాలం నాటి హిందువులు గోమాంసం తిన్నారని తెగ ప్రచారం చేసింది. ఇటువంటి సమయంలో ఈ వాదనలను తిప్పికొట్టడం ప్రతి ధార్మికుడి తక్షణ కర్తవ్యం.

వినా గోరసం కో రసో భోజనం
వినా గోరసం కో రసో భూపతినాం
వినా గోరసం కో రసో కామీనీనాం
వినా గోరసం కో రసో పండితానాం

ఇందులో గో అనే పదం ఉంది కనుక ఇది ఆవు గురించే అనుకుంటారు. అదే కమ్యూనిష్టులు, వక్రీకరణకారులైతే గోరసం అంటే గోమాంసం అని చెప్పి, గోమాంసం లేని భోజనం రుచికరం కాదంటున్నారు అంటూ తమ పిచ్చి వాదన మొదలుపెడతారు. ఆంగ్ల భాషకు బాగా అలవాటు పడి, అదే గొప్ప అనేకునేవారికి ఇది ఒక కనువిప్పు. ఆంగ్లం సంస్కృతం వలే సాంకేతిక భాష (Technical language) కాదు. దానికి సంస్కృతానికున్నంత విసృతమైన పరిధి లేదు. అసలు విషయం ఇలా ఉంది.

ఇందులో ముఖ్యమైన పదం గో (గోవు). గోవుకు వేదంలో 24 నానార్దాలున్నాయి. అందులో ఆవు, భూమి, ఇంద్రియాలు, వాక్కు కొన్ని. రసానికి కూడా అనేక అర్దాలున్నాయి.

మొదటి పంక్తిలో ఉన్న గోరసం ఆవు నుంచి వచ్చే పాల పదార్ధాల గురించి చెప్తోంది. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలైనవాటిని ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకుంటాము. మధురపాదార్ధాల్లో నెయ్యి తప్పక వాడతాము. నూనె, డాల్డా కంటే నెయ్యితో చేసినవే మరింత రుచికరంగానూ, పుష్టికరంగానూ ఉంటాయి. భోజనం ఆఖరులో పెరుగు లేదా మజ్జిగ అన్నం తినకుండా లేవకూడదనే ఆచారం కూడా ఉంది. మజ్జిగలో ఉన్న పోషకాలు, జీర్ణశక్తి అలాంటివి. పాలు గురించే చెప్పనవసరమే లేదు. కాల్షియం పొందాటానికి పాలు ముఖ్యమైన ఆహారం. అందువల్ల మొదటి పంక్తికి 'గోవు పాలు- పాల నుంచి వచ్చే పదార్ధాలు లేని భోజనంలో రుచి ఎక్కడ ఉంటుంది?' అని అర్దం.

రెండవ పంక్తిలో గోరసం రాజ్యం గురించి మాట్లాడుతున్నది. గో=భూమి, రసం=రాజ్యం. రాజ్యమే లేకపోతే రాజు అవసరమేంటి అని రెండవ పంక్తికి అర్దం. రాజ్యం ఉన్నప్పుడే పరిపాలన కొరకు, రాజు, మంత్రులు, సభ మొదలైనవన్నీ ఉంటాయి. అసలు ఆ రాజ్యమే లేకపోతే ఇవ్వనీ ఎవరికి కావాలి?

మూడవ పంక్తిలో గో=ఇంద్రియాలు. గోరసం= ఇంద్రియాలు చక్కగా పని చేయడం, లోపాలు లేకపోవటం. ఇంద్రియాలు పని చేయకపోతే (కళ్ళు ఉండీ చూడలేకపోతే, చెవులుండీ వినలేకపోతే, నోరు ఉండీ మాట్లాడలేకపోతే), అనగా వాటి యందు శక్తి లేకపోతే, వ్యక్తి అందమైన స్త్రీని/పురుషుడిని చూసి ఏం లాభం? ఇంద్రియాలే మనసుకు సంకేతాలను పంపిస్తాయి. అసలా ఇంద్రియాలే పని చేయకపోతే ఇక వ్యక్తి ముందు ఎంత అందాన్ని పెట్టినా, అతడు దేన్నీ ఆస్వాదించలేడు. అందమైన జలపాతం వద్దకు తీసుకువెళ్ళినా, శ్రావ్యమైన సంగీతం వినిపించినా, అతడికి ఏ తేడా అనిపించదు.

నాల్గవ పంక్తి లో గో=వాక్కు. గోరసం= మధురమైన పలుకులు. ఎంతటి పండితుడైనా మధురమైన మాటలు మాట్లాడలేకపోతే, కార్యసిద్ధి ఎలా కలుగుతుంది? మాటల చేత ఇతరులను మెప్పించి పనులు జరిపించుకోవచ్చు, నొప్పించి చేదగొట్టుకోవచ్చు. కనుక మధురమైన మాటలు పలకడం రాని పండితుడి ఉపయోగమేమిటి? అని నాల్గవ పంక్తి అర్దం.

ఇప్పుడు ఈ సుభాషితం వలన అర్దం చేసుకోవలసిందేమిటంటే సంస్కృతం అంత త్వరగా అభిప్రాయాలు ఏర్పరుచుకోనుటకు ఉపయుక్తంగా ఉండే చిన్న భాష కాదు. అది ఎంతో విస్తృతమైనది. దాన్ని అర్దం చేసుకోవాలంటే ఎంతో మేధాశక్తి ఉండాలి.

ఇప్పుడు మనం అధార్మికులు చేసే ఒక ఆరోపణనను చూద్దాం.

శతపధ బ్రాహ్మణం 3-1-2-21 లో యాజ్ఞవల్క్య మహర్షి 'నేను గోవు, ఎద్దు మాంసం తింటాను, ఎందుకంటే అది చాలా రుచికరంగా, మృదువుగా ఉంటుంది' అన్నారని వక్రీకరణ కారుల ఆరోపణ. యాజ్ఞవల్క్య మహర్షి గోమాంసం గురించి అక్కడ చెప్పలేదు. ఆ శ్లోకంలో గౌ అన్న శబ్దానికి ఇంద్రియాలు అనే అర్దం వస్తుంది. నేను ఇంద్రియాలను తిని, అనగా ఇంద్రియాలను జయించి, జితేంద్రియుడనవుతాను అని అన్నారు. అట్లాగే ధేను అనగా ఆవు అనే కాకుండా ఆవుపాలు అనే అర్దం తీసుకోవాలి. కాకపోతే వక్రీకరణ కారులు ఆవుపాలకు బదులు ఆవు అని, ఎద్దు దున్నగా వచ్చిన ధాన్యాలకు బదులుగా ఎద్దు మాంసం అని తప్పుడు అర్దాలను ఆరోపించి, యాజ్ఞవల్క్య మహర్షి గోమాంసం, ఎద్దు మాంసం తిన్నారని విషప్రచారం చేశారు. నిజానికి ఆయన 'నేను ఆవుపాలను, ఎద్దు దున్నిన పొలం నుంచి వచ్చిన ధాన్యాలను ఆహారంగా స్వీకరిస్తాను, ఎందుకంటే అవి రుచిగా, మృదువుగా ఉంటాయి' అని అన్నారు. వీటికి ప్రామాణికం పాణిని సూత్రాలు, అమరకోశం. పూర్తి వ్యాఖ్యానం తీసుకున్నప్పుడు ఆయన మాంస భక్షణకు వ్యతిరేకంగా మాట్లాడటం కూడా కనిపిస్తుంది.

To be continued .................

Sunday, 20 March 2016

హిందూ ధర్మం - 200 (జంతుసంరక్షణ - విమర్శల ఖండన, ధార్మికులకు సూచనలు)

మిత్రస్యమా చక్షుషా సర్వాని భూతాని సమీక్షంతం|
మిత్రస్యమా చక్షుషా సర్వాని భూతాని సమీక్షే
మిత్రస్య చక్షుషా సమీక్షామహే|| - యజుర్వేదం 26-18

అన్ని జీవులు నన్ను తమ మిత్రుడి వలే చూచుగాక. నేను కూడా వాటిని నా మిత్రులవలే చూచుదునుగాక. ఓ భగవంతుడా! అందరం (సకల జీవరాసి) పరస్పరం స్నేహ భావంతో మెలిగేలా పరిస్థితులను ఏర్పరుచు.

ఈ విధంగా చెప్పిన వేదం, తదనుగుణంగా సకల జీవరాశుల పట్ల స్నేహ భావంతో మెలిగిన ఋషులు జంతువులను బలివ్వమని వేదంలో చెప్తారా? ఋష్యాశ్రమాల్లో వైరి భావం కలిగిన జీవులు కూడా స్నేహభావంతో మెలిగాయి. ప్రకృతిని తనకంటే నీచమనదిగా కాక, తనతో సమానమైనదిగా దర్శించమనే వైదిక సంస్కృతి చెప్పింది. 'ఆత్మవత్ సత్వభూతేషు' అని పునఃపునః చెప్పింది. అటువంటి ధర్మం ఆకలి కోసం, రుచి కోసం జంతువులను చంపమని చెప్తుందా?

గత భాగంలో వేదంలో జంతుసంరక్షణ గురించి చెప్పుకున్నాం. హిందువుల్లో కొందరు అర్దం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ధర్మం అంటే కేవలం గోసంరక్షణ మాత్రమే కాదు. గోవుతో పాటు సకల జీవరాశి క్షేమంగా ఉండాలి. గోవుకు ప్రాముఖ్యం ఇచ్చినా, మిగితా జీవరాశి కూడా భగవద్ సృష్టిలో భాగమే. వాటి పట్ల కూడా ప్రేమ, కరుణా, వాత్సల్యం కలిగి ఉండాలి. అష్టాంగ యోగంలో మొదటి మెట్టైన యమంలోనే అహింసను ప్రస్తావించారు. యమాలు అహింసతోనే మొదలైతాయి. మాకు మిగితా వాటి గురించి అవసరంలేదు, కేవలం గోవు గురించి మాట్లాడతాం అనడం వేదం ప్రకారం తప్పు.

'ఏ వ్యక్తైనా ప్రేమ, కరుణా మొదలైన గుణాలను ముందు తాను అలవరచుకోకుండా, భగవంతుడు తన పట్ల కరుణ కలిగి ఉండాలని భావన చేసి పూజ, జపం, యోగం మొదలైనవి ఏవి చేసినా, అవి నిష్ఫలమే అవుతాయన్న మాట సత్యం. వ్యక్తికి ఇతరుల పట్ల ప్రేమ, కరుణ, జాలి ఇత్యాది గుణాలు లేకపోతే, తన పట్ల భగవంతుని దయ ఉండాలని ఆశించే అధికారం అతనికి ఎక్కడుంది? ఇతరులకు చేసే సేవ, ఆధ్యాత్మిక ఉద్ధతి కోసం పూజాది సంస్కారాలు, రెండూ ఎలా చేయాలంటే, అవి నిన్ను, అవతలి వ్యక్తిని ......... ఇద్దరిని పవిత్రుల్ని చేయాలి' అని నడిచే దేవుడుగా పేరుగాంచిన అపరశంకరులు, కంచి మహాస్వామి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి చెప్పిన మాట. కాబట్టి కేవలం గోవు గురించి మాత్రమే మాట్లాడే హిందువులు ఈ విషయాన్ని ఆలోచించాలి. వేదం ప్రమాణంగా తీసుకుని సకల జీవుల శ్రేయస్సుకై పాటుపడాలి. ప్రతి సాధువు, గురువు, సన్యాసి సకల జీవరాశుల క్షేమం కోసమే పాటుపడ్డారు.

సమాజంలో ఒక వర్గం ఉంది. వారిని ఏమనాలో నాకు తెలియదు. కమ్యూనిష్టులు, మతమార్పిడి మూర్ఖులు, కుహనామేధావులు, ఇలా అనేకులు ఈ వర్గంలోకి వస్తారు. వీళ్ళు మూర్ఖులంటే మూర్ఖులు. వారికి ధర్మాన్ని వ్యతిరేకించడమే పని. వీరంతా అప్పుడప్పుడు పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడుతారు. కానీ గోవధకు వచ్చేసరికి వేదంలో గోవధ ఉన్నది అంటారు, గోవధ నిషేధం తప్పంటారు. అలా కాదు, వేదంలో గోవధ లేదు అంటే, గోసంరక్షణ ఉందంటే ........... చూశారా! వేదానికి పక్షపాతం. వేదం కేవలం గో సంరక్షణ గురించి మాత్రమే మాట్లాడింది, మిగితా జీవులను చిన్నచూపు చూసిందంటారు. జాతరల సమయంలో జంతుబలి మూఢనమ్మకం, చూశారా! మతాల కారణంగా జంతువులు ఎంత బాధపడుతున్నాయో అంటారు. అది కూడా కేవలం హిందూ ధర్మం కారణంగానే. అధర్మాల జోలికి వెళ్ళరు.  వీరేదో పెద్ద జంతు ప్రేమికుల మాదిరి భావించుకుంటారు. కానీ వారి జీవితాల్లో మాంసం లేకపోతే ముద్ద దిగదు. అదేంటో మరి? వీరి భావజాలం ఏంటో వీరికే తెలియదు. తాము దేని మీద పోరాటం చేస్తున్నామో కూడా స్పష్టంగా తెలియని (Clarity లేని) అయ్యోమయ్యం (Confused) గుంపు ఇది. వారందరికి ఇది కనువిప్పు కావాలి. ఇప్పుడు చర్చించుకున్న విషయం రెండు విమర్శలను తిప్పికొడుతుంది. ఒకటి వేదం గోవు పట్ల పక్షపాతం ప్రకటించిందని చెప్పడం, రెండవది వేదంలో గోవధ ఉంది అనడం. జంతువధనే వేదం వ్యతిరేకించినప్పుడు ఇక గోవధ ఎక్కడ ఉంటుంది. ఎలా ఉంటుంది?

ఇప్పుడు ధర్మద్వేషుల నుంచి ఇంకొక విమర్శ వస్తుంది. అన్ని జీవులను కాపాడమని వేదం చెప్పినప్పుడు కేవలం గో వధ నిర్మూలనకే చట్టం ఎందుకు? అన్ని రకాల హింసను ఆపివేయుటకు ధార్మికులు పోరాటం చేయచ్చు కదా అని .........
వేదం సకల జీవరాశి యొక్క క్షేమం కోరింది. భారతదేశంలో జంతు సంరక్షణకు వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉంది. దాని ప్రకారం జంతువులను చంపిన వారికి కారాగార శిక్ష విధిస్తారు. అయితే నెమలి, పులి కూడా దీని చట్రం క్రిందికే రాగా, వాటిని జాతీయ జంతువులుగా ప్రకటించడం మూలంగా వాటికి కొంత ప్రత్యేకత ఉంది. అలానే గోవుకు కూడా. సకలజీవరాశుల క్షేమం కోరిన వేదమే గోవును అత్యంత ప్రధానమైనదిగా చెప్పింది. కనుక ముందు గోవును కాపాడమని హిందువుల ఆకాంక్ష. ధార్మికుల వలె మీకు కూడా అన్ని జీవుల పట్ల మమకారం ఉందంటున్నారు కనుక ముందు గోవధ నిషేధంతో ప్రారంభించి, అన్ని రకాల జీవహింసను నిషేధిద్దాం, కలిసి రండి అని మా ధార్మికుల పిలుపు. ఒక్క అడుగు ముందుకు పడితే, ఆ తర్వాత పెద్ద మార్పే సంభవిస్తుంది. అసలు అడుగే వేయొద్దంటే ఎలా? కనుక ఇలాంటి విమర్శలు చేస్తే మీ వాదన నిలవకపోవటమే కాదు, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవలసిన అవసరం వస్తుందని గ్రహించండి.

To be continued ..............

Sunday, 13 March 2016

హిందూ ధర్మం - 199 (వేదంలో జంతుసంరక్షణ)

కేవలం గోరక్షణే కాదు, జంతుసంరక్షణ గురించి కూడా వేదం గట్టిగా చెప్పింది.

ఓ దంతాలు (పళ్ళు) (teeth) ! మీరు అన్నం తింటారు, యవలు (బార్లీ) తింటారు, పప్పులు, నువ్వులు తింటారు. ఈ ధాన్యాలన్నీ ప్రత్యేకించి మీ కోసమే ఏర్పడినాయి. అన్యాయంగా జంతువులను హింసించకండి, వాటిని తినవద్దు - అధర్వణవేదం 6.140.2

వండిన మాంసం, పచ్చిమాంసం, గర్భస్థ పిండాలను, గుడ్లను, స్త్రీపురుషులను చంపి వండిన అన్ని రకాల ఆహారాలను ధ్వంసం చేసేదము - అధర్వణవేదం 8.6.23

అఘ్న్యా యజమానాస్య పశూంపాహీ - యజుర్వేదం 1.1
ఓ మానవులారా! జంతువులన్నీ అఘ్న్యాలు - వధించకూడనివి.

ద్విపాదవ చతుష్పాత్పాహి - యజుర్వేదం 14.8
రెండు కాళ్ళున్న జీవులు, నాలుగు కాళ్ళున్న జీవులను రక్షించండి.

పిశాచ - పిశిత అనగా మాంసం + అశ - తినువాడు = మాంసం తినువాడు.
ఇలా వేదంలో అనేక మార్లు జీవహింసను వ్యతిరేకించింది. మాంసం తినేవారిని రాక్షసులతో సమానంగా పోల్చింది.

ఊర్జం నోదేహి ద్విపదే చతుష్పదే - యజుర్వేదం 11.83
రెండు కాళ్ళున్నవి, నాలుగు కాళ్ళున అన్ని జీవులు శక్తిని, పుష్టిని పొందుగాకా.

ఈ మంత్రాన్ని హిందువులు ఆహారం స్వీకరించే ముందు చదువుతారు. సకల జీవరాశుల క్షేమం కోరిన ధర్మమే వాటిని చంపి తినమని ఎలా చెప్తుంది?

యస్తు సర్వాని భూతాన్యాత్మనేవానుపశ్యతి
సర్వేభూతేషు చాత్మానం తతోనా విచికిత్సతి - యజుర్వేదం 40.6

ఎవరైతే ఆత్మ యందే అన్నీ జీవులను, అన్ని జీవులయందు తన ఆత్మను చూసుకుంటాడో, అతడు ఏ జీవి పట్ల ద్వేషం కలిగి ఉండడు. ఎందుకంటే అతడు అన్ని జీవులయందున్న ఏకత్వాన్ని తెలుసుకుంటాడు.

తనను ఎవరైనా బాధపేడితే, ఎంత వేదన అనుభవిస్తాడో, అంతే వేదన ఇతర జీవరాశి అనుభవిస్తుందని, శరీరాలు వేరు కావాచ్చు కానీ, బాధ వేరు కాదని, మనిషి తన బాధను చెప్పుకునే అవకాశం ఉంది కానీ, మూగజీవాలకు లేదు, మనమే అర్దం చేసుకోవాలని పై మంత్రం చెప్తున్నది. దానిలో ఎంత లోతైన అర్దం దాగి ఉంది.

యస్మిన్ సర్వాని భూతాన్యత్మైవబహుదా విజానతః
తత్రకో మోహః కః శోకః ఎకత్వమనుపశ్యతః - యజుర్వేదం 40.7

ఉపాధులు (శరీరములు) వేరైనా అన్నీ జీవులందున్న ఆత్మను చూసిన చూసినవాడు, ఏ జీవిని చూసి మోహానికి కానీ, శోకానికి గానీ గురికాడు. అతడు వాటిని వీక్షించగానే ఏకత్వం గుర్తుకువస్తుంది, అంతటా వ్యాపించిన ఏకత్వమే, ఆత్మయే కనిపిస్తుంది.

To be continued.................

http://agniveer.com/no-beef-in-vedas/ సౌజన్యంతో

Sunday, 6 March 2016

హిందూ ధర్మం - 198 (వేదంలో గోసంరక్షణ - 3)

ఘృతం దుహానామదితిం జానాయాఘ్నే మా హింసీహీః - యజుర్వేదం 13.49

పుష్టినిచ్చి ఎదుగుదలకు తోడ్పడుతున్న ఆవులు, ఎద్దులు (గోజాతిని) ఎల్లవేళలా రక్షణ పొందాలి.

ఆరే గోహా నృహా వధో అస్తు - ఋగ్వేదం 7.56.17
గోవును చంపటం మనిషిని చంపటంతో సమానమైనది. ఎవరైతే గోహత్యకు ఒడిగడతారో వారికి కఠిన శిక్ష వేయండి.

వైదిక నిఘంటువు గోవును అఘ్న్యా, ఆహీ, అదితి అంటుంది.
ఆహీ అనగా వధించకూడనిది.

అఘ్న్యా అయిన ఆవులను ఎట్టి పరిస్థితుల్లో చంపరాదు. శుద్ధమైన నీరు, పచ్చని గడ్డి పెట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచండి. తద్వారా సద్గుణాలు, జ్ఞానము, సంప్దలు పొందండి. - ఋగ్వేదం 1.164.40, అధర్వణ వేదం 7.73.11, అధర్వణ వేదం 9.10.20.

అఘ్న్యా అయిన ఆవువులు, ఎద్దులు మీకు ఆఇస్వర్యాలను తీసుకువస్తాయి. - యజుర్వేదం 12.73

అంతకాయ గోఘాతం - యజుర్వేదం 30.18
గోవులను వధించేవారిని అంతం చేయండి.

మన ఆవులను, గుర్రాలను, ప్రజలను నశింపజేసేవారిని సీసపు గుళ్ళతో చంపండి.

ధేనుసాధనం రాయేనాం - అధర్వణ వేదం 11.1.34
గోవు అన్న సంప్దలకు సాధనం/కారణం

ఋగ్వేదం 6 మండలం 28 వ ఒక సూక్తం గోవు యొక్క ఖ్యాతిని చాటి చెప్తుంది.

గోవులను అన్ని రకాల దుర్భిక్షాల నుంచి దూరంగా ఆరోగ్యంగా ఉంచండి.
గోవులను రక్షించేవారిని భగవంతుడు ఆశీర్వదిస్తాడు.
శత్రువులు కూడా గోవులపై ఆయుధాలు వాడకూడదు.
గోవును ఎవరూ వధించకూడదు.
ఆవు ఐశ్వర్యము, బలము ఇస్తుంది.
ఆవును ఆనందంగా, ఆరోగ్యంగా ఉంచితే, స్త్రీపురుషులు కూడా రోగరహితంగా, ఐశ్వర్యవంతులై ఉంటారు.
ఆవులు పచ్చగడ్డి తిని, నీరు త్రాగుగాక. ఆవి వధింపబడకుండు గాక, మరియు మనకు ఐశ్వర్యాన్నిచ్చు గాక.

To be continued ........

Sunday, 28 February 2016

హిందూ ధర్మం - 197 (వేదంలో గోసంరక్షణ - 2)

ఋగ్వేద సామవేదాలు ఆవుని అఘ్న్యా, అదితి అన్నాయి. అనగా వధింపకూడనిద, పూజించదగినది అని అర్థం. ఋగ్వేదంలో 9 సార్లకు పైగా (1.64.27, 5-83-8, 7-68-9, 1-164-40, 8-69-2, 9-1-9, 9-93-3, 10-6-11, 10-87-16) ఆవును అఘ్న్యా అంటూ వధించకూడదని తేల్చి చెప్పింది. గోవు వధించ రానిది, అగౌరవపరచ రానిదని, ఆవుపాలు మనసును శుద్ధి చేసి, పాపముల నుంచి దూరంగా ఉంచుతాయని చెప్పింది.

అఘ్న్యేయం సా వర్ధతాం మహతే సౌభగాయ - ఋగ్వేదం 1.164.27

గోవు - వధింపకూడనిది. అది మాకు ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను తీసుకువస్తుంది.

సుప్రపానం భవత్వఘ్న్యాయః - ఋగ్వేదం 5.83.8

అఘ్న్యా అయిన గోవుకు చక్కని నీటి సదుపాయం ఉండాలి.

అనగో హత్యావై భీమక్రియతే
మా నో గామశ్వం పురుషూం వధీః - అధర్వణ వేదం 10.1.29

అమాయకులను చంపటం మహాపాపం. మన ఆవు లను, గుర్రాలను, మనుష్యులను చంపకండి.

మా గామనాగా మదితిం వధిష్ట - ఋగ్వేదం 8.101.15

ఆవును చంపకండి. ఆవు అమాయకురాలు. అదితి - ముక్కలు చేయకూడనిది అంటూ గోవధకు దేశబహిష్కారం శిక్ష వేయమని చెప్పింది.

యః పౌరుషేయేణ క్రవిషా సమఙ్క్తే యో అశ్వ్యేన పశునా యాతుధానః
యో అఘ్న్యాయా భరతి క్షీరమగ్నే తేషాం శీర్షాణి హరసాపి వృశ్చ - ఋగ్వేదం 10.87.16

ఎవరైతే మనిషి, గుర్రం లేదా ఇతర జంతువుల మాంసం తింటారో, ఎవరైతే పాలతో జనులను పోషించే అఘ్న్యాలను - గోవులను (గోజాతిని) నశింప జేస్తారో వారిని కఠినంగా శిక్షించాలి (capital punishment).

అథర్వణవేదం 8-3-16 మంత్రమైతే గోహత్య మహాపాపం చేసినవారికి శిరశ్చేదనం (తల నరకమని) చేయమని చెప్పింది.

పై మంత్రాన్ని అనుసరించి గోవులను చంపేవారికి కఠినమైన శిక్ష విధించాలని వేదమే చెప్పింది. #వేదం అనగా భగవంతుని ఊపిరి, వేదం - భగవంతుడు, ఇద్దరూ వేరు కాదు. ఒక్క గోవులనే కాదు, ఏ జంతువును చంపినా శిక్ష విధించమంటోంది. మనదేశంలో కొన్ని రాష్ట్రాలు గోవును వధించినవారికి కఠిన శిక్ష ఉండాలని చట్టాలు చేస్తే, అది నేరమని, ఘోరమని కొందరు ధర్మద్వేషులు, అధర్మీయులు తెగ గొడవ చేస్తారు. ఈ దేశంలో ఆయా మతస్థులకు వారి వారి మతగ్రంధాలను అనుసరించి, వాటికి అనుగుణంగా చట్టాలున్నాయి. ఉదాహరణకు ముస్లిమకు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకోవడం భారతదేశంలో నేరం కాదు. ఎందుకంటే బహువివాహాలను ఖురాన్ అంగీకరించింది. ఖురాన్‌కు అనుగుణంగానే వారికి షిరియా చట్టం ఏర్పడింది. అలాగే విడాకుల విషయంలో కూడా వారికి వేరే పద్ధతి ఉంది. భారతదేశంలో ఇస్లామేతర ఆడపిల్లల కనీస వివాహ వయస్సు 18 సంవత్సరాలు కాగా, వారికి కనీస వయసు 15 సంవత్సరాలు.

వారి మతగ్రంధాన్ని అనుసరించి చట్టం ఏర్పడినప్పుడు హిందువులు, తమ ధార్మిక గ్రంధాలకు అనుగుణమైన చట్టం కావాలని అడగడంలో తప్పేంటి? ధర్మం ప్రకారం గోవధ సహిచరాని నేరం. ఈనాడు కొన్ని రాష్ట్రాలు గోవధకు కఠిన శిక్షలు వేయడమంటే ధార్మిక గ్రంధాలకు అనుగుణంగా చట్టం ఏర్పడిందని అర్దం కదా. మరి ఈ ఒక్క విషయాన్నే వ్యతిరేకించడం ఎందుకు? ఇది ఆ కుహన మేధావులది ద్వంద్వనీతి కాదా అని హిందువులు ప్రశ్నించాల్సి ఉంటుంది.

To be continued ....................

Source: http://agniveer.com/no-beef-in-vedas/

Saturday, 27 February 2016

హిందూ ధర్మం - 196 (వేదంలో గోసంరక్షణ - 1)

గోవుకు, ఎద్దుకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకున్నాం కదా. అసలు నిజంగా వేదంలో గోవధ ఉందా లేదా అనేది ఇప్పుడు పరిశీలిద్దాం.

వెజిటెరీయనిజం (Vegetarianism)  అనేది ఈ రోజు ప్రపంచంలో బాగా ప్రజాదరణ పొందింది. భూతాపాన్ని నివారించటం కోసం, కాలుష్యాన్ని అరికట్టడం కోసం, సంపదల దుర్వినియోగాన్ని, అతివినియోగాన్ని తగ్గించటం, ఆరోగ్యం కోసం అందరూ వెజిటెరీయనిజం వైపు మళ్ళాలని ఐరాస (ఐక్య రాజ సమితి) సహా అనేక అంతర్జాతీయ సంస్థలు, అనేక దేశాల ప్రభుత్వాలు, పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమంగా ప్రచారం చేస్తున్నాయి. జంతువులకు కూడా మనుష్యుల వలే హక్కులుంటాయాని, వాటిని చంపడం నేరమని అనేకమంది జంతుప్రేమికులు వాదిస్తున్నారు. సరిగ్గా ఇదే విషయాన్ని వేదం కూడా చెప్పింది. వేదం శాఖాహారాన్నే తీసుకోమని చెప్పింది. ఒక జీవికి ప్రాణం పోయలేని మానవుడికి, ప్రాణం తీసే హక్కు లేదని వేదం చెప్పింది. అనాదికాలం నుంచి ఈ విషయాన్ని అనేక గురువులు నిరంతరం ఉద్ఘాటిస్తూనే ఉన్నారు. దానికి ఉదాహరణ శ్రీ త్రైలింగ స్వామి వారు.

ఒకసారి ఉత్తరభారతదేశంలోని అడవులలో ఒక పులిని వేటాడటం కోసం కొందరు రాజభటులు వెంబడిస్తున్నారు. ఆ పులి తప్పించుకుని వెళ్ళి, అక్కడికి దగ్గర్లోనే మౌనంగా తపస్సు చేసుకుంటున్న గణపతి స్వామి వద్దకు వెళ్ళి, ఆయన ఒళ్ళో పిల్లిపిల్లలా భయంతో బిక్కుబిక్కుమంటూ చేరింది. అది చూసి ఆశ్చర్యంతో రాజభటులు నిశ్చేష్టులవ్వగా, అక్కడున్న గణపతి స్వామి ఆ భటులతో, 'ఒక జీవికి ప్రాణం పోయలేని మనకు ప్రాణం తీసే హక్కులేదు. ఏ జీవిని చంపరాదు. జీవులను చంపటం పాపం' అని వారికి ఉపదేశం చేస్తారు. అది విన్న ఆ రాజభటులు స్వామికి సాష్టాంగ ప్రణమిల్లి వెళ్ళిపోతారు. ఆ గణపతి స్వామి ఎవరో కాదు, 250 ఎళ్ళకు పైగా జీవించిన యోగి, సిద్ధపురుషులు, శ్రీ త్రైలింగ స్వామి వారు.

భౌద్ధం రాకముందు నుంచే 'అహింస' అనేది ధర్మంలో ముఖ్యమైన లక్షణంగా, వ్రతంగా చెప్పబడి ఉంది. వేరొక విధంగా చెప్పాలంటే వేదంలో ఉన్న అహింసావాదాన్నే భౌద్ధజైనాలు స్వీకరించాయి. కానీ వాటి వాదానికి, ధార్మిక వాదనకు కొంత వ్యత్యాసం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల, కొన్ని కుతంత్రాలను పారించడానికి మార్కిస్టు మేధావులు, అధర్మ ప్రచారకులు వేదంలో గోవధ ఉందని ప్రచారం చేస్తున్నారు.

ముందు ఒక విషయం గ్రహించాలి. వేదంలో గో అన్న మాట అనేక సందర్భాల్లో అనేక అర్దాలను కలిగి ఉంది. ఆవు, జలం, సూర్యకిరణాలు, విద్యావంతులు, వైదిక సూక్తాలు, భూమాత ........ వీటన్నిటికి గో అన్న శబ్దాన్నే వాడారు.

To be continued ................

Sunday, 10 January 2016

హిందూ ధర్మం - 191 (గోవు ప్రాముఖ్యత - 3)

ఈ కాలంలో మనం రెడియేషన్‌లో బ్రతుకుతున్నాం. అది మన మీద అనేక దుష్ప్రభావలను చూపిస్తోంది. గోమయం (ఆవుపేడ) రేడియేషన్‌ను పూర్తిగా నిరోధిస్తుంది. ఆవుపేడతో అలికిన ప్రాంతం రేడియోధార్మికశక్తిని నిరోధిస్తుందని రష్యన్ల పరిశోధనలో తేలింది. ఇంటిపై భాగంలో ఆవుపేడ అలికితే ,ఆ ఇంటి లోపలికి రేడియోధార్మికత ప్రవేశించదు. అంతటి శక్తి ఆవుపేడకు ఉంది. అందుకే ఇప్పటికి భారత్ మరియు రష్యా అణుశక్తి కేంద్రాల్లో రెడియేషన్ ప్రభావాన్ని నిరోధించడానికి/ ఎదురుకోవడానికి ఆవుపేడను ఉపయోగిస్తారని ఒక జంతుప్రేమికుల సంస్థ వెళ్ళడించింది. ఆవు పేడను నీటిలో కలిపి చల్లడం వలన ఇంటిలోనికి ఈగలు, దోమలు రావు. అదే ఇతరత్రా జంతువుల మలాన్ని చల్లితే అక్కడ క్రిములు చేరి రోగాలు వ్యాపిస్తాయి.

ఆవుపేడ యాంటి-సెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. పవిత్ర ప్రదేశాల్లో, వంటగదిలో, ఇల్లంతా ఆవుపేడను అలికేది ఈ కారణం చేతనే. అందువల్ల ఇంట్లో వాళ్ళకి రోగాలు రావు. ఈ నాటికి కొన్ని తెగలవారు బాలింతలకు జ్వరం వచ్చినప్పుడు చికిత్సకు ఆవుపేడనే వాడతారు. ఆయుర్వేదంలో పంచగవ్యోప్రాశన అనే చికిత్సా విధానం కూడా ఉంది. ఇందులో ఆవు నుంచి వచ్చే పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడలను ఉపయోగించి వైద్యం చేస్తారు. కొంతకాలంగా మరుగున పడిన ఈ పద్ధతి ఈ మధ్య కాలంలో మళ్ళీ వ్యాప్తి చెందుతోంది. అద్భుతమైన ఫలితాలు కనబరచడం, దీనివలన రోగాలు తగ్గడం, ఎటువంటి సైడ్-ఏఫెట్స్ లేకపోవడం వల్లనే ఇది జరుగుతోంది.

కొన్ని పెద్ద పెద్ద యజ్ఞయాగది క్రతువుల్లో, వ్రతాలు, నోముల సమయంలో, సూర్యభగవానుడి ఆరాధన పద్ధతుల్లో పంచగవ్యాలతో చేసిన తీర్ధాన్ని స్వీకరిస్తారు.

ఇల్లు శుభ్రం చేయడానికి వాడే ఫినాయిల్, ఇతర వస్తువులు మొదలైనవి శ్వాసకోశ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి, పాదాల పగుళ్ళకు కూడా ఇవి కూడా ఒక కారణం. కానీ దానికి భిన్నంగా ఆవుపేడ వాసన శ్వాశకోశ సంబంధిత వ్యాధులను నిరోధిస్తుంది. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కనుకే ఆవుపేడతో కళ్ళాపి చల్లుతారు, ఇల్లు అలుకుతారు హిందువులు.

భారతీయ గోవు యొక్క పేడకు ఇన్ని లక్షణములున్నాయి కాబట్టే లక్ష్మీదేవిని నువ్వు ఎక్కడుంటావు అని విష్ణుమూర్తి అడిగితే గోమయంలో ఉంటాను స్వామి అన్నది. అందుకే ధర్మశాస్త్రం 'అష్టైశ్వర్యమయి లక్ష్మీ వసతే గోమయేసదా' అని అంటుంది. అనగా లక్ష్మీదేవి అష్టైశ్వరములతో గోమయమందు ఉంటుందని అర్దం.

To be continued ...............

Sunday, 3 January 2016

హిందూ ధర్మం - 190 (గోవు ప్రాముఖ్యత - 2)

వేదాలు ఆవునెయ్యి, ఆవుపాలను అమృతం అన్నాయి. పసిపిల్లలకు తల్లిపాలు పట్టే పరిస్థితి లేనప్పుడు ఆవుపాలనే పడతారు. ఎందుకంటే ఆవుపాలలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండడమే కాక అవి తల్లి పాలతో సమానమైనవిగా పిల్లలపై పని చేస్తాయి. అందుకే ఆవును అమ్మగా భావిస్తారు. దేశీ ఆవుపాలను ఎ2 పాలుగా పరిగణిస్తారు. గోమాత అంటారు. ఇవి క్యాన్సర్ కలిగించే కణాలను నశింపజేస్తాయి, శరీరంలో కొవ్వు పేరుకోనివ్వవు, మంచి బలవర్ధకమైన, పోషక విలువలు కలిగిన ఆహారం. దేశీ గోవు వీపుపై నూపురం ఉంటుంది. ఇందులో సూర్యకేతు నాడి అనే ప్రత్యేకమైన నాడి ఒకటి ఉంటుంది. ఇది సూర్యుని సంబంధం కలిగి ఉండి, సూర్యుడి నుంచి వచ్చే శక్తిని నేరుగా  గ్రహిస్తుంది. ఆ కారణంగా ఆవుపాలు కొద్దిగా లేత బంగారు వర్ణం కూడా కలిగి ఉంటాయి. ఇది విటమిన్ డి దేహానికి అందిస్తుంది. ఈ సూర్యకేతు నాడి కేవలం భారతీయ గోసంతతికి మాత్రమే ఉంటుంది. ఆవుపాలు మేధో వృద్ధిని కలిగిస్తాయి. నిత్యం ఆవుపాలనే త్రాగడం, 3 జన్మల కాలం పట్టే జ్ఞానాన్ని కేవలం 30 ఏళ్ళలో పొందినట్టుగా హిమాలయల్ల వద్ద నివసిస్తున్న ఒక విదేశీయుడు వెళ్ళడించాడు. అది ఆవుపాలకున్న శక్తి.

పసిపిల్లలకు జ్వరాలు వచ్చినప్పుడు గోపుఛ్ఛాన్ని(ఆవు తోకను) వాళ్ళ చుట్టూ తిప్పుతారు. అలా చేయడం వలన పిల్లలపై పడిన చెడు దృష్టి తొలగిపోతుంది. ఆవును స్పృశించినప్పుడు అది మనలో ఉన్న నకారాత్మక శక్తి (Negative Energy) ని తీసుకుని, సకారత్మక శక్తి (Positive Energy) ని ప్రసాదిస్తుంది. అందుకే ప్రతి నిత్యం గోవును స్పృశించి, నమస్కరించి బయటకు వెళ్ళమంటారు. మనుష్యులలో ఉన్న నకారాత్మక శక్తిని ఏ ప్రతిఫలం ఆశించకుండా, రూపాయి ఖర్చు లేకుండా తీసుకునే ప్రాణి భారతీయ గోవు మాత్రమే. ఉదయం నిద్రలేచిన తర్వాత గోవును దర్శనం చేసుకున్నవారి రోజు ఎంతో ప్రశాంతంగా గడుస్తుందని అనేకుల నిత్య జీవితానుభవం.

ఈ ప్రపంచంలో ఏ జీవి మలం, మూత్రాదులైనా హానికారక క్రిములు కలిగి ఉంటాయి. కానీ ఒక్క గోమయం (ఆవుపేడ), గోపంచకం (మూత్రం) మాత్రమే మిత్రజీవాలను, ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వాటికి ఎనలేని పవిత్రత ఉంది. అందుచేతనే ఇంటిని గోపంచకంతో సంప్రోక్షణ చేస్తారు. దాని వలన పవిత్రత కలగడమే కాక, క్రిమి సంహారం కూడా జరుగుతుంది. ఆవుపేడను ఇళ్ళకు అలకడం అందరికీ విదితమే. ఇప్పటీ ఈ ఆచారం పల్లెల్లో ఉంది.

1 గ్రాము దేశీ ఆవు పేడలో 300 కోట్ల మిత్ర క్రిములున్నాయని శ్రీ సుభాష్ పాలేకర్ గారు రుజువు చేసారు. జెర్శీ ఆవుకు , దేశీ ఆవుకు ఎన్నో తేడాలున్నాయని కూడా ఈయన రుజువు చేసారు. దేశీ ఆవు పేడలో, మూత్రంలో ఉన్నన్ని మిత్రక్రిములు జెర్సీ ఆవుతో సహా మరే ఇతర జంతువు మల మూత్రాలలో కూడా లేవని అయన రుజువు చేసారు. పైగా వాటి మల మూత్రాలలో మానవునికి కీడు చేసే భారీ లోహాల మిగులు , హాని కారక క్రిముల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. జెర్సీఆవు 1 గ్రాము పేడలో 70 లక్షల హానికారక సూక్ష్మక్రిములు ఉన్నాయి. మిత్రక్రిములంటే భూమికి, మనిషికి, ప్రకృతికి మేలు చేకూర్చేవి. మనిషి శరీరంలో కూడా కొన్ని మిత్రక్రిములుంటాయి. పేగులు ఉంటూ, జీర్ణవ్యవస్థలో ప్రధానపాత్ర పోషిస్తాయి. యాంటి-బయాటిక్స్ అధికంగా సేవించడం వలన ఇవి నశించి, ఉదర, పేగు సంబంధిత రోగాలు వస్తాయి. అట్లాగే దేశీ ఆవుపేడలో ఉండే మిత్రజీవాలు కూడా అందరికి మేలు చేస్తాయి. జీవరాశి నుంచి వెలువడిన మలం అత్యంత రోగకారమైందిగా ఉంటుంది. కానీ దేశీ ఆవు పేడ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అది ఆరోగ్యానికి హేతువు.  

To be continued ...............

Sunday, 20 December 2015

హిందూ ధర్మం - 188 (నిరుక్తము - 6)

వైదిక వాజ్ఞ్మయంలో ఇంద్రుడిని ఏడు ప్రవాహాలకు మూలమైన ఆత్మగా చెప్పారు. ఋగ్వేదం 4.28.1 స్పష్టంగా చెప్తున్నదేమిటంటే ఇంద్రుడు, అనగా ఆత్మ, ఈ 7 ప్రవాహాల చలనంలో పెడుతుంది, మూసుకుపోయిన ఇంద్రియాలను తెరిపిస్తుంది. వేదంలో నదుల పేర్లు చారిత్రిక, భౌగోళిక, లేక నశించిపోయే వస్తువులను సూచించవు. వాటికి ఆధ్యాత్మిక అర్దాలున్నాయి. సరస్వతీ అనగా వాక్కు. వాసన గ్రహించటానికి కారణమవుతూ నాసికల ద్వారా బయటకు ప్రవహించే ప్రవాహం గంగ. చెవి ద్వారా ప్రవహించే శక్తి యమున. స్పర్శ ప్రవాహం శతదృ. శిరస్సువైపుగా ప్రవహించేది విపస. అరవిందులవారు కూడా వేదంలో సప్తనదుల ప్రస్తావన భౌగోళిక, తాత్కాలిక పదార్ధాలను సూచిస్తుందని అంగీకరించలేదు.

ఇమంమే గంగేయమునే అంటూ ఋగ్వేదం 10 వ మండలం, 75 సూక్తం, 5 వ మంత్రంలో 10 నదుల ప్రస్తావన ఉంది. నిజానికి అవి నదుల పేర్లు కాదు. ఆధ్యాత్మిక శాస్త్రంలో అవి శరీరంలోని నాడుల పేర్లు. నాదం (శబ్దం) చేస్తాయి కనుక వాటిని నదులు అన్నారు. చెవులు మూసుకున్నప్పటికి వాటి ప్రవాహ శబ్దాన్ని వినవచ్చు. (ఇది వ్యక్తిగతంగా ఎవరికి వారే ఇప్పుడే ధృవపరుచుకోవచ్చు. నిశబ్దంగా కూర్చుకుని, చెవులు మూసుకున్నా, లోపల వేగంగా ఏదో ప్రవహిస్తున్న శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అదే నాడీ ప్రవాహం).

పైన చెప్పుకున్న మంత్రానికి విదేశీయులు భౌగోళికమైన అర్దం చెప్పగా, దాని అసలు అర్దం ఇలా ఉంది. ఓ గంగా, ఇడా నాడి, ఓ యమునా, పింగళ నాడీ, శతధృ, పరూషిని, సరస్వతీ - సుషుమ్నా నాడీ, నా స్తోత్రాన్ని వినండి. ఓ మరుద్వృధా - సుషుమ్నా, వితస్తతో కూడిన ఆర్జికియా - సుషుమ్నా, నా స్తోత్రాన్ని వినండి. (ఇడా, పింగళా, సుషుమ్నా మొదలైన నాడుల ప్రస్తావన యోగశాస్త్రంలో ఉంటుంది. యోగం పరిచయం ఉన్నవారికి ఇది తేలికగా అర్దమవుతుంది.)

యోగశాస్త్రంలో ఇవే నామాలను తన మీద ధ్యానం చేత జనుల కష్టాలను దూరం చేసి, మోక్షాన్ని ప్రసాదించగల భగవంతునికి కూడా అన్వయం చేశారు.

ఈ నామాలనే ధమనులకు కూడా వాడారు. పండిత పాళి రత్న గారు చెప్పేదేమిటంటే గంగ, దేహంలో రక్త ప్రసరణ సక్రమంగా సాగడానికి కీలకమైన నాడి. అన్ని శరీర భాగాల కదలికలను నియంత్రించేది యమున. ఈ నాడి బలహీనపడితే, పక్షవాతం వస్తుంది. జ్ఞానాన్ని కలిగించే నాడిని సరస్వతీ అన్నారు. అదే సుషుమ్నా కూడా. శతధృ అనేది సుషుమ్నా నాడిలో ముఖ్యమైన భాగం. అది వేగంగా జ్ఞానం కలిగిస్తుంది. దేహమంతా ఉష్ణతను కలిగిస్తూ, అన్ని అవయవాలకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూసే నాడి పరూషిని. వాహికలు లేని గ్రంధులను అసిక్ని అన్నారు. దేహానికి పుష్టినిచ్చే ప్రాణాన్ని మరుద్వృధా అన్నారు. మాంసం అంతటా వ్యాపించి ఉన్న నాడిని వితస్తా అన్నారు. ఎటువంటి నియంత్రణలు, అదుపులేకుండా పని చేసే నాడి ఆర్జికియా, లేదా విపుషా. ఎప్పుడు తడిగా ఉండే నాడి సుషుమ్నా. (యోగంలో త్రివేణీ సంగమం అనగా ఇడా, పింగళా, సుషుమ్నా నాడుల సంగమం. ఇది భృకుటి (రెండు కనుబొమ్మల మధ్యనున్న) వద్ద ఆజ్ఞాచక్రంలో జరుగుతుంది. ధ్యానంలో అక్కడ దృష్టి నిలిపితే, క్రమంగా సాధకుడు ఉన్నతమైన అనుభూతులకు లోనై, జ్ఞానం పొంది, పరబ్రహ్మంలో లీనమవుతాడు. ఆ త్రివేణీ సంగమమే బొట్టుపెట్టుకునే స్థానం.)

(*కొంత వరకు ఇతర విషయాలను ప్రస్తావించడం మినాహా మిగిలినదంతా యజుర్వేదానికి దేవీచంద్ గారు రాసిన భాష్యం నుంచి తెలుగు అనువాదం చేయడమైనది. వారికి పాదాభివందనాలు.)

To be continued ......................  

Sunday, 13 December 2015

హిందూ ధర్మం - 187 (నిరుక్తము - 5)

14. వేదంలో భృగు అనేది నిర్దిష్ట నామవాచకం కాదు, మహర్షి నామధేయం కాదు. భృ అనగా స్వీయ నిర్వహణ. తమ సంపాదన / శక్తి మీద బ్రతకడం. గు అనేది తీవ్రమైన శ్రమను సూచిస్తోంది. తమ స్వశక్తి మీద జీవించటానికి తీవ్రమైన కృషి చేసేవారు భృగువులు.

*వేదం అన్నప్పుడు ఈ సందర్భంలో మంత్రసంహితగానే అర్దం చేసుకోవాలి. బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులో ఋషుల పేర్లు ఉంటాయి. కాని సంహిత వరకు మాత్రం అది కాలానికి, చరిత్రకు అతీతం, సనాతనం కనుక అందులో వ్యక్తులు, నదులు, చారిత్రిక ప్రదేశాల పేర్లు ఉండవు. అలాగే ఋషుల పేర్లకు వేరే అర్దాలున్నాయని, అందువల్ల అసలు ఋషులే లేరని చెప్పకూడదు. ఈ రెండు వేర్వేరు అంశాలు. ఉదాహరణకు 'వేద' అని ఒక వ్యక్తి పేరు ఉన్నంతమాత్రాన, వేదం అతని జీవితం గురించి చెప్తుందని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ............ అలా కాదు వేదం అనేది ఒక గ్రంధం అని, దాని గురించి ఎవరైనా వివరిస్తే, అసలు 'వేద' అనేది గ్రంధం పేరు కాబట్టి ఆ పేరుతో వ్యక్తి అనేవాడు లేడని చెప్పడం అంతే మూర్ఖంగా ఉంటుంది. వేదం (మంత్రసంహిత) లో ఉన్న అనేక పేర్లను వ్యక్తులు పెట్టుకున్నారు. యుక్తిని ఉపయోగించి అర్దం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకానీ రెండిటిని కలిపేసి విపరీతాలకు తావు ఇవ్వకూడదు.

15. వేదంలో భరతుడనగా మృదు స్వభావం కలవాడు, అభివృద్ధి, పురోగతి కోరుకునేవాడిని అర్దం. అంతేకానీ శ్రీ రామచంద్రుని తమ్ముడిగా అర్దం స్వీకరించకూడదు.

16. తన వాళ్ళు / ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో నిష్ణాతుడిని వేదంలో వశిష్ఠుడిగా చెప్పారు. వసు బ్రహ్మచారుల మధ్య ఉంటూ, ఉన్నతమైన స్థానాన్ని పొందిన గురువును కూడ ఇది సూచిస్తుంది.

17. వేదంలో సరస్వతీ అనేది నది యొక్క నామం కాదు. బ్రాహ్మణాల్లో సరస్వతీ అనే పదానికి 13 అర్దాలున్నాయి. నిఘంటులో 57 పర్యాయపదాలున్నాయి. దయానంద సరస్వతీ గారు సరస్వతీ అనేది భగవంతునికున్న నామాల్లో ఒకటని సత్యార్ధ ప్రకాశ్ లో చెప్పారు. ఆయనే వివాహ సందర్భంలో సరస్వతీ అనే పదం కనిపించినప్పుడు భార్యగా అర్దం చెప్పాల్సి ఉంటుందని వివరించారు. ఋగ్వేదం 7 వ మండలం 9 వ సూత్రం 5 వ మంత్రంలో సరస్వతీ అంటే వివరణాత్మకమైన ప్రసంగం అని చెప్పారు.

సాయనుడి ప్రకారం ఋగ్వేదంలో 15 చోట్ల సప్తనదుల ప్రస్తావన ఉంది. ఆయన వాటిని గంగా, యమునా నదులుగా అనువదించారు. కానీ దయానందులు, నిరుక్తం ఇత్యాదుల ప్రకారంగా ఆత్మ కేంద్ర స్థానం, అదే ముఖ్యశక్తి కేంద్రం. దాని నుంచి 7 నదులు ప్రవహిస్తాయి (అవి శక్తి ప్రవహాలు). 1. అహంకారం, 2. మనసు, 3. శబ్ద, 4. స్పర్శ, 5. రస (రుచి), 6. రూప, 7. గంధం (వాసన). చివిరి ఐదింటిని పంచతన్మాత్రలు అంటారు. అహంకారం అనే ప్రవాహం అహం అనే క్షేత్రం/ మార్గంద్వారా పయనిస్తుంది. (అహం నశిస్తే అన్నీ నశిస్తాయి, ఆత్మజ్ఞానం కలుగుతుంది అని రమణమహర్షి ఉపదేశం. అహం కారణంగానే కర్తృత్వం ఏర్పడుతుంది. అహం అనగా 'నేను' అనే భావన. అహం నుంచే క్రమంగా 'నేను ఇంత వాడిన్నన్న అహంకారం బయలుదేరుతుంది.) ధ్యానం అనే మార్గం ద్వార మనసు ప్రవహిస్తుంది. (ఒక వస్తువు మీద దృష్టి నిలపడమే ధ్యానం. ఆత్మ శక్తే మనసు ద్వారా భావనల రూపంలో వ్యక్తమవుతోంది.) పదాలు (శబ్దాలు) ఎటు నుంచి వినిపిస్తాయో, ఆ దిశగా చెవుల ద్వారా శబ్ద ప్రవాహం ఉంటుంది. స్పర్శ ప్రవాహాం చర్మం ద్వారా స్పర్శ క్షేత్రానికి ప్రవహిస్తుంది. రస ప్రవాహం నాలుకను క్షేత్రంగా చేసుకుని రుచి కలిగించే దిశ యందు ప్రవహిస్తుంది. అదే విధంగా రూప ప్రవహాం కంటిని ఆధారంగా చేసుకుని దృశ్యం (చూడబడుతున్న వస్తువు) దిశగా ప్రవహిస్తుంది. గంధ ప్రవాహం ముక్కును ఆధారంగా చేసుకుని శ్వాస ద్వారా ప్రవహిస్తుంది. ఆత్మ నుంచి వచ్చే ఈ 7 ప్రవాహాలు నిత్యం బయటకు ప్రవహించి, కర్మలు చేయగా, సుషుప్తి అవస్థలో (గాఢనిద్రలో) లోపలికి ప్రవహించి ఆత్మ యందు ఐక్యమవుతాయి. ఈ సప్త ప్రవాహాలే సప్త ఋషులు, సప్త కిరణాలు, ఆత్మ యొక్క సప్త హస్తాలు. (ఈ ఏడింటికి ఆత్మయే కీలకం. ఆత్మ లేకపోతే వీటికి అస్థిత్వం లేదు.)  

To be continued ................. 

Sunday, 29 November 2015

హిందూ ధర్మం - 185 (నిరుక్తము - 4)



మాక్స్ ముల్లర్ మొదలైన పండితులు వేద భాష్యానికి చేసిన అవకతవకలు ఎటువంటి వంటే మాక్స్ ముల్లర్ ఒక్క వేద ఋక్కుకు ఇచ్చిన దురర్ధాన్ని ఖండిస్తూ అరవిందులువారు ఒక పుస్తకమే రాసారట. ఐరోపా 'పండితులకు' వేదంలో చరిత్ర కనిపించింది. కానీ స్వామి దయానందులు (ఆర్యసమాజం) వేదంలో చరిత్ర ఉందని అంగీకరించలేదు. గ్రిఫ్ఫిత్, మాక్స్‌ముల్లర్, మోనియర్ విల్లియంస్, మెక్‌డొన్నెల్, బ్లూంఫీల్డ్ ఇత్యాది పాశ్చ్యాతుల భాష్యాలను ఖండించారు. దీని గురించి ఋగ్వేద భాష్య భూమికలో విస్తృతంగా ప్రస్తావించారు. వారి ప్రభావంతో, ఆర్యసమాజానికి చెందిన దేవీచంద్ గారు కూడా యజుర్వేద భాష్యంలో ఇటువంటి అనేక విషయాలను శాస్త్ర ప్రామాణికంగా ఖండిచారు.

వారి మాటల్లోనే 'సాధారణ సంస్కృతంలో 'ల'కార త్రయం భూతకాలాన్ని (గడిచిన కాలాన్ని) సూచిస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుని అనేకులు వేదంలో చరిత్ర ఉందని నిర్ధారించారు. కానీ ఇది తప్పు. కష్కుడు చెప్పిందేమిటంటే వేదంలో 'ల'కార త్రయం కనిపిస్తే, అది త్రికాలాలకు (భూత, వర్తమాన, భవిష్యత్) సంబందించినదై ఉంటుంది. అది ప్రత్యయం అవుతుంది. అందువల్ల వాటిని కేవలం భూతకాలానికే పరిమితం చేయడం తప్పు. అదే విధంగా వైదిక పదాలు ధాతువులే కానీ, వ్యక్తులు, సంప్రదాయల పేర్లు కావు. ఎప్పుడైతే పండితులు ముఖ్య వేదాంగాలైన నిరుక్తం, వ్యాకరణాలను విడిచిపెట్టారో అప్పుడే వేదంలో చరిత్ర ఉన్నట్టుగా భావించడం మొదలుపెట్టారు.

పతంజలి మహర్షి మాహాభాష్యంలో కష్కుడి వివరణ గురించి వ్యాఖ్యానం చేస్తూ, వేదంలో లకార త్రయాన్ని భూతకాలానికి పరిమితం చేసి అర్దం చెప్పడం, వ్యాకరణ శాస్త్రానికి వ్యతిరేకం. పాణిని వ్యాకరణాన్ని ప్రామాణికంగా తీసుకున్నంతవరకు వైదిక పదజాలానికి చరిత్రను అంతగట్టడం వేదవ్యాక్యాలను నిందించడమే అవుతుంది అన్నారు.

వైదిక పద ధాతువుల ప్రాముఖ్యతను అర్దం చేసుకోవడంలో విఫలమై, వాటిని చారిత్రిక వ్యక్తుల పేరులుగా అనువదించారు. వాటి అసలు ప్రాముఖ్యతను నేను చెప్తాను.

1. సీతా - వేదంలో సీతా అనే పదం శ్రీ రామచంద్రుని భార్యను సూచించదు. పొలంలో నాగలితో దున్నడాన్ని సూచిస్తుంది.
2. బాబర - అనేది రాజు లేక వ్యక్తి పేరు కాదు. ఉరుములు వంటి గట్టి శబ్దాలు చేస్తూ ప్రవహించే గాలిని సూచిస్తుంది.
3. సూదాస్ - అనేది రాజు పేరు కాదు. 'సూదః కళ్యాణదానః| నిరుక్తం 2-25' చక్కటి దానాలు చేస్తూ ఉండేవాడని అర్దం.
4. పైజ్వాన్ అనేది రాజు నామాన్ని సూచించదు. నిరుక్తం 2-24 ఆధారంగా ఏ వ్యక్తైతే సదా అనాలోచితంగా ఉంటూ తొందరపడి వేగంగా పనులు చేసేవాడు పైజ్వాన్.
5.దేవాస్ - రాజు నామం కాదు. వేద విద్యనభ్యసించిన పండితుడు, ఎవరి ఆధ్వర్యంలోనైతే యాగం జరుగుతుందో అతడు.
6. అగు - అనగా చారిత్రాత్మిక వ్యక్తి కాదు. వేద జ్ఞానం, వైదిక పదజాలం తెలియని వ్యక్తి అని అర్దం.

To be continued ..........................

Monday, 19 October 2015

హిందూ ధర్మం - 180 (నిరుక్తము - 3)

మహాభారత యుద్ధానికి పూర్వం వరకు వేదానికి నిరుక్తము, శాస్త్రీయ, గూఢార్ధ పద్ధతుల ద్వారానే భాష్యం స్వీకరించడం జరిగింది. యుద్ద్గం ముగుసి కలియుగం ప్రారంభమైన తర్వాత ఈ పద్ధతిలో కొన్ని స్వల్ప మార్పులు జరిగాయి. కానీ భారతదేశంపై మహమ్మదీయ దండయాత్రలు మొదలైన తర్వాత మొత్తం పరిస్థితి తారుమారైంది. అవి జరగడానికి ముందే ఈ దేశంలో జైనం, భౌద్ధం వంటి మతాలు ఉద్భవించాయి. బౌద్ధమత విస్తరణ కోసం బౌద్ధాన్ని స్వీకరించ్న రాజులు వైదిక మతంపై దాడులు జరిపి, ధార్మిక గ్రంధాలను కాల్చివేశారు, వాటికి వక్రభాష్యాలిచ్చారు, భౌద్ధ పరమైన, నాస్తికమైన అర్దాలను అన్వయం చేశారు. గురుకుల వ్యవస్థను, ఆశ్రమ వ్యవస్థను నిర్వీర్యం చేసే యత్నం చేశారు. అటువంటి సందర్భంలో క్రీ.పూ.7 వ శత్బాదంలో వచ్చినవారే ఆదిశంకరులు. దేశంలో ఎక్కడ చూసినా, వక్రభాష్యాలే, నాస్తిక వాదమే. అటువంటి సమయంలో గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం చేసిన శంకరులు, తన మేధాశక్తితో వేదానికి ఇచ్చిన అవైదిక, వక్రభాష్యాలను ఖండించి, శాస్ర్తీయమైన అర్దాన్నిచే ప్రయత్నం చేశారు. వారి తర్వాత 1500 ఏళ్ళ పాటు వారి ప్రభావం కొనసాగింది.

కానీ మహమ్మదీయ దండయాత్రలు కొత్త పోకడలను తీసుకువచ్చాయి. వైదిక ధర్మం తార్కిక ఆలోచనకు, తాత్త్వికతకు, బుద్ధి వికసనానికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. కానీ అబ్రహామిక్ మతాలు అలా కాదు. (అబ్రహం అనే మూలపురుషుడి నుంచి ఉద్భవించినవిగా భావించే క్రైస్తవం, ఇస్లాం, యూదు మొదలైన మతాలు). అవి ప్రశ్నించే తత్త్వానికి, వ్యక్తి తార్కిక ఆలోచనకు అడ్డుకట్ట వేస్తాయి. ఆ దండయాత్రల్లో అనేక వైదిక గ్రంధాలు తగలబెట్టబడ్డాయి. భారతదేశానికి అక్కడి నుంచి చీకటి యుగం ప్రారంభమైంది. వాటి ప్రభావం భారతీయ సంస్కృతిపై చాలా పడింది. ఈ సందర్భంలోనే వేదాలకు నిరుక్తం ఆధారంగా అర్దం చెప్పక, పురాణాల ఆధారంగా చెప్పే పద్ధతి ప్రచారంలోకి వచ్చింది. ఇంకోకప్రక్కన దండయాత్రులు చేసిన ముష్కరులు, కొందరిని బెదిరించి, ధార్మిక గ్రంధాల్లో నూతన విషయాలను ప్రవేశపెట్టారు.

వేదాలతో పోల్చి చూసినప్పుడు పురాణాలు అత్యంత నవీన సాహిత్యం. వేదం ఈశ్వరునిలానే సనాతనం. ఈశ్వర సృష్టిలో ఉండే కోటానుకోట్ల బ్రహ్మాండాలకు సంబంధించినది. సముద్రపు అలలపై ఏర్పడే నురుగులో అప్పటికప్పుడు ఉద్భవించి, నశించిపోయే నీటి బుడగల వలే అనేక బ్రహ్మాండాలు నిత్యం ఉద్భవిస్తూ ఉంటాయి, లయిస్తుంటాయి. ఆయా బ్రహ్మాండాల్లో నడుస్తున్న యుగాలతో సంబంధం లేకుండా, అన్నిటికి వేదమే పరమ ప్రమాణం. అందుకే వేదం కాలాతీతం. కానీ ఈ పురాణమనే సాహిత్యం ఈ సృష్టిలో ఇప్పుడున్న కలియుగంలో మానవులకు ధర్మం, వేదం యొక్క సందేశం అందించడం కోసం వ్యాసుని ద్వారా ద్వాపరయుగాంతంలో ఇవ్వబడింది. ఈ పురాణల్లో అనేక కల్పాలు, మన్వంతరాలు, ఇతర సృష్టిల్లో జరిగిన సంఘటనలు కనిపిస్తాయి. అవి వేదంలో చెప్పబడ్డ ధర్మాన్ని వివరించేవే కానీ, వాటిలో ఉన్న పాత్రలను వేదంలో ఉన్న పదాలకు అన్వయం చేయడం వంటివి చేయకూడదు. కానీ ఈ దండయాత్రల ప్రభావంతో వేదాలకు కొంత పురాణాల ఆధారంగా భాష్యం చెప్పడం ప్రారంభమైంది. అదేగాక మాములు సంస్కృతార్దాలను వైదిక వాజ్ఞ్మయానికి అన్వయం చేయడం కూడా ఈ తర్వతే ప్రారంభమైంది. ఫలితంగా నిరుక్తం మూలనపడింది. 14 వ శత్బాదానికి చెందిన సుప్రసిద్ధ భాష్యకారుడైన సాయనాచార్యుడు వేదానికి నిరుక్తం, పౌరాణిక పద్ధతులలో భాష్యం అందించారు.

అటు తర్వాత ఆంగ్లేయుల దండయాత్రలు జరిగాయి. వైదిక ధర్మాన్ని నాశనం చేయడమే, తమ మతాన్ని స్థాపన చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆంగ్లేయులు వేదాల్లో లేని అనేక విషయాలు, ఉన్నాయని భ్రమలు కల్పించి, సంస్కృతిని కూకటివేళ్ళతో పెకిలించాలని విశ్వప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా వచ్చినవే ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం, వేదాల్లో గోవధ, జంతుబలి వంటి కల్పిత సిద్ధాంతాలు.

To be continued .................