Labels
- Dharma
- Inspiring
- Ramana Maharshi
- Science and Hindusim
- Yoga
- ఉత్తరాఖండ్ వరదలు
- ఏకాదశి
- కార్తీక మాసం
- గణపతి
- గురు పూర్ణిమ
- గురుతత్వము
- చరిత్ర
- దేవి నవరాత్రులు
- దైవం
- ధర్మం
- నవదుర్గ
- పండుగలు
- పర్యావరణం / Ecology
- బతుకమ్మ పాటలు
- భూతాపం(Global Warming)
- మన దేవాలయాలు
- వినాయక చవితి
- వినాయకచవితి కధలు
- సంకష్టహర చవితి
- సంప్రదాయం - శాస్త్రీయం
- సూక్తులు
- స్తోత్రాలు
- హిందూ విజ్ఞానం
Monday, 31 August 2015
Sunday, 30 August 2015
హిందూ ధర్మం - 173 (చంధస్సు)
చంధస్సు శాస్త్రం - ఇది వేదానికి కాళ్ళు వంటిది. వేదం చంధస్సు ద్వారానే నడుస్తుంది. వేదమంత్రాలను రక్షించడానికి, వాటిలో కొత్త పదాలను, అక్షరాలను చేర్చకుండా ఉండాటానికి, వేదం యొక్క యదార్ధస్వరూపాన్ని కాపాడటానికి, స్వరబద్ధంగా వేదాన్ని చదవటంలో దోషాలు దొర్లకుండా ఉండటానికి ఈ శాస్త్రం వచ్చింది. వేదమంత్రాల గతి తప్పకుండా ఉండటానికి, వాటిని సులువుగా జ్ఞాపకం ఉంచుకునేందుకు ఛంధస్సు ఉపయోగపడుతుంది. చంధస్సు అన్నప్పుడు ఇది వేదమంత్రాలను చదివే పద్ధతిని తెలిపేదిగా అర్దం చేసుకోవాలి. ఈ శాస్త్రం చాలా పెద్దది, సముద్రమంత విశాలమైనది. ఇందులోకి దిగడమే తప్ప, తేలడం ఎప్పటికో జరుగుతుంది, అది కూడ అతికొద్దిమంది పండితులకు మాత్రమే.
ఒక మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయో, ఆ మంత్రాన్ని ఎంత సమయం చదవాలో, దానికున్న నియమాలేమిటో ఇది వివరిస్తుంది. వేదం మొత్తం చంధోబద్దంగానే ఉంటుంది. అందుకే అసలు వేదానికే చందస్సు అనే పేరు కూడా ఉంది. వైదికమైన ఛంధస్సుల గురించి వివరణ మొట్టమొదటగా సాంఖ్యాయన శ్రౌత సూత్రాల్లో కనిపిస్తుంది. కానీ దీనిమీద పూర్తి వివరణ ఇచ్చింది మాత్రం పింగళ మహర్షి. ఛంధః సూత్ర అనే తన గ్రంధం 8 వ అధ్యాయంలో మహర్షి పింగళుడు వీటిని ప్రస్తావించారు.
వేదపారాయణం వినడం వలన ప్రశాంతత లభించడం, దివ్యానుభూతులు కలగడం సంగీతం రోగాలను నయం చేయడం మొదలైన అనేక విషయాలను ప్రస్తావించినప్పుడు, ఛంధస్సు గురించి చెప్తారు. మొత్తం 7 రకాల ఛంధస్సులు వేదంలో ఉన్నాయి. అవి గాయత్రి, ఉష్ఠిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి ఛంధస్సులు. వాటికి వరుసగా షడ్జ, వృషభ, గాంధార, మధ్యమ, పంచమ, దైవత, నిషాద అనే స్వరాలున్నాయి. వీటి నుంచే స, రి, గ, మ, ప, ద, ని అనే సప్తస్వర సంగీతం ఊపిరి పోసుకుంది.
వేదం అనగానే గుర్తుకు వచ్చేది యజ్ఞం. యజ్ఞంలో ఛంధస్సుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వేదమంత్రాలన్నీ ఛందోబద్ధాలు. ఏ ఫలితాన్ని ఉద్ద్యేశించి యజ్ఞం చేస్తున్నారు, ఏ కాలంలో, వాతవరణ పరిస్థితుల్లో చేస్తున్నరనే విషయాన్ని అనూరించి ఛంధస్సులను వాడతారు. ఛంధస్సు, వేదసంగీత ధ్వని స్వరాలకుండే ప్రభావశక్తిని ఋషులు పరిశీలించి అనేక పరిధులుగా విభజించారు. ఒక్కో పరిధిలో ఒక్కో ఛంధస్సు పని చేస్తుంది.
To be continued ................

Saturday, 29 August 2015
వరలక్ష్మీవ్రత కధ ద్వారా మన గ్రహించవలసింది ఏమిటి?

ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అఖిల జగత్తులకు తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉంటారు కనుక, ఈ నాలుగు నెలలు మన అమ్మ లక్ష్మీదేవి లోకపరిపాలన చేస్తుంది. పిల్లలు నాన్నను ఏదైనా ఒక వస్తువు అడగాలంటే భయపడతారు. కానీ అమ్మ దగ్గరకు వచ్చేసరికి భయం ఉండదు. స్వేచ్చగా అడుగుతారు. నాన్న వస్తువు కొన్నివ్వడంలో కాస్త ఆలస్యం చేసినా, అమ్మ అడగగానే కొనిస్తుంది. అదే విధంగా ఒక అధికారి ఇంట్లో లేనప్పుడు, ఆయన భార్య, తన భర్తకు చెడ్డపేరు రాకుండా ఉండేలా జాగ్రత్తగా ఆలోచిస్తూ, పనులన్నీ చక్కబెడుతుంది. తిరిగి భర్త రాగానే, తానూ చేసినవన్నీ చెప్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా తను పరిపాలకురాలిగా అన్నీ పనులు చక్కబెడుతుంది. పిల్లలు అడిగినవన్నీ వెంటవెంటనే ఇచ్చేస్తుంది, వరాలు కురిపిస్తుంది. అందుకే ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మీ అని పేరు.
వరలక్ష్మీ వ్రతం కేవలం స్త్రీలకు సంబంధించిన వ్రతం మాత్రమే కాదు. స్త్రీ ఉంటేనే కుటుంబ వ్యవస్థ అంటారు. స్త్రీ లేకుంటే అసలది కుటుంబమే కాదు. కుటుంబ వ్యవస్థకు స్త్రీ మూలస్థంభం. అటువంటి స్త్రీ ఒక పూజకు ఉపక్రమించింది, వ్రతం చేపట్టిందంటే మొత్తం కుటుంబం అందులో పాల్గొనాలి. వరలక్ష్మీపూజ భార్యాభర్తలు కలిసి కూర్చుని చేయాలి. ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దలు పూజలో పాల్గోనాలి. కధలో స్త్రీ పేరు చారుమతి. చారుమతి అంటే మంచి మనసు కలది అర్ధం. ముందు దైవానుగ్రహానికి కావలసింది మంచి మనసు.
చారుమతి నిత్యం భర్తను దైవంగా భావించి సేవలు చేసేది. ఏ రోజు భర్తను కించపరిచేది కాదు. రోజు ఉదయమే నిద్రలేచి స్నానం పూర్తిచేసుకునేది. అత్తమామలను ప్రేమతో ఆదరించి, సపర్యలు చేసేది. ఇంటి పనుల విషయంలో ఓర్పుతో, నేర్పుతో మెలుగుతూ, ఎవరితోనూ గొడవ పడకుండా, అందరితోనూ సఖ్యతగా మెలిగేది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే చారుమతిని అనుగ్రహించాలాని శ్రీ మహాలక్ష్మీ భావించి, కలలో కనిపించింది. కధలో ఆమె పాత్రను గమనిస్తే, మనకు కనిపించేది స్వధర్మాచరణ. ఆమె యొక్క స్వధర్మాన్ని ఆమె ఆచరించింది. మంచి ప్రవర్తన ఉన్నా, భక్తి, సదాచారం, ధర్మనిష్ఠ లేకపోతే, అది సువాసన లేని పువ్వుతో సమానమని కంచి పరమాచార్యుల మాట. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ధర్మాచరణ అనగానే కేవలం ఈశ్వరుని పూజించడమే అనుకోకూడాదు. ధర్మం ఎప్పుడూ పూజలకు పరిమితం కాలేదు. మీరు ఉద్యోగ్యం చేస్తుంటే, కార్యాలయానికి వేళకు వెళ్ళడం, అక్కడ పనిని నిజాయతీగా శ్రద్ధతో, లోపరహితంగా చేయడం కూడా ధర్మపరిధిలోకి వస్తుంది. మీరేమీ ఓవర్ టైం పని చేయక్కర్లేదు. నిర్ణీత పనివేళలో సరిగ్గా పని చేస్తే చాలు. అది కూడా ధర్మచారణయే అవుతుంది. ఎందుకంటే మీరు కార్యాలయంలో ఉన్నప్పుడు, అక్కడ చేయవలసిన పనే మీ స్వధర్మం. అదే బ్రహ్మచారి అయితే, విద్య మీద దృష్టి ఉంచడం, ఋషుల సందేశలను తెలుసుకోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, కోపతాపాలకు దూరంగా ఉండడం వారి స్వధర్మం. ఇవేమి చేయకుండా, కేవలం లక్ష్మీపూజ మాత్రమే చేస్తాము, అత్తమామలను, తల్లిదండ్రులను చూసుకోము, స్వధర్మాన్ని పాటించము అనుకునేవాళ్ళ పట్ల లక్ష్మీదేవి దయ చూపదని ఈ కధ ద్వారా గ్రహించాలి. అమ్మవారు చారుమతికి కనిపించింది కేవలం స్వధర్మాచరణ వల్లనే.
అమ్మవారి కలలో కనిపించి చెప్పిన వ్రతవిధానం తాను మాత్రమే ఆచరించి సంపద పొందాలని చారుమతి భావించలేదు. ఇరుగుపొరుగు వారందరికి తన స్వప్న వృత్తాంతం చెప్పింది. అందరితో కలిసి వరలక్ష్మీ వ్రతం ఆచరించింది. కేవలం తన స్వార్ధం మాత్రమే చూసుకోలేదు. అందరూ బాగుండాలని తలచింది. అందుకే పూజ ఫలించింది. ఈ వ్రతం నోచుకునే ఆచారం లేనివారిని వ్రతం ఆచరించేవారు తమ తమ ఇళ్ళకు ఆహ్వానించి, వారొతో కలిసి వ్రతం ఆచరిస్తే, లక్ష్మీదేవి ఇంకా సంతృప్తి చెందుతుంది. కనుక మీ బంధుమిత్రులు, ఇరిగుపొరుగు వారిలో ఎవరికైనా ఈ వ్రతాచరణ లేకపోతే, వారు ఏ కులం వారైనా సరే, వారిని మీ ఇంటికి పిలిచి, వారితో కూడా పూజ చేయించండి. అమ్మవారు చాలా సంతోషిస్తుంది. అదే వ్రతకధలో చారుమతి కూడా చేసింది.
అమ్మవారు కలలో కనిపిస్తే, దాన్ని కొట్టిపారేయలేదు చారుమతి. స్వప్నంలో చెప్పినట్టుగా ఆచరించింది. దీనిబట్టి అర్దం చేసుకోవలసిందేమిటంటే ఆమెకు శాస్త్రము యందు, దైవము యందు శ్రద్ధాభక్తులు ఉన్నాయి. ఎవరికి శాస్త్రము యందు, దైవము యందు శ్రద్ధావిశ్వాసములు ఉంటాయో, వరు మాత్రమే ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారనేది ఈ వృత్తాంతంలోని గూఢార్ధం.
లక్ష్మీకటాక్షం కలగాలంటే ముందు స్వార్ధం త్యజించాలన్నది వరలక్ష్మీ కధ సారాంశం. పంచుకుంటే పెరుగుతుంది, దాచుకుంటే తగ్గుతుంది సంపద, సంతోషం. అందుకే ప్రసాదం ఒక్కరే తినకూడదు. పదిమందితో పంచుకోవాలి. అప్పుడే అనుగ్రహం అధికంగా సిద్ధిస్తుంది. మన సంస్కృతి దాచుకోవడం కాదు పంచుకోవడం నేర్పింది.
అందరి కోసం కోరింది కనుకనే అమ్మవారు కరుణించింది. ఎవరు అందరూ బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటారో, వారికి కోరకుండానే వరాలిస్తాడు పరమాత్ముడని గ్రహించాలి. నిత్యం 'లోకాసమస్తాః సుఖినోభవంతుః' (సమస్త లోకాలు బాగుండలి) అని ప్రార్ధించాలి.
ఓం నమో లక్ష్మీనారాయణాయ
Originally published: 07-August-2014
1st Edit; 29-August-2015

Friday, 28 August 2015
వరలక్ష్మీదేవి వ్రత కథ
27-08-2015, శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీవ్రతం సందర్భంగా వరలక్ష్మీ వ్రత కధ తెలుసుకుందాం.
వరలక్ష్మీదేవి వ్రత కథ:
సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. ‘ఓ మునీశ్వరులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి’.
ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, ‘దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి’ అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. ‘ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను’.
పార్వతీదేవి ‘ నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి’ అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను.
పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి, తెల్లవారు ఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా , ఇంత అణకువగా నున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.
ఒకరోజు ఆ మాహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ‘ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను’ అలా ప్రత్యక్షమైన అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ , నమస్కారములు చేసి ;
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూర్తయేశరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసింది.
‘ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు. విద్వాంసులవుతారు. సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది’. అనగా వరలక్ష్మీ దేవి సంతోషము చెందింది.
ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీ దేవి కనబడ లేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తనీ, అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ‘ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి’ అన్నారు. చారుమతి తన యిరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు , చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.
వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు. ప్రాతః కాలమే లేచి తలారా స్నానం చేసి, పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి యింట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేసారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి , మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసారు.
చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసారు.
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితేనారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా
అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేసారు.
తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీ దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు.దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లు మని శబ్ధం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసి పోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే అ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల యిళ్ళన్నీస్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి.
చారుమతి యింటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి యిళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు, చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి , దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవికి నైవేద్యం గా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోవారి యిండ్లకు బయలు దేరారు.
వారు త్రోవలో చారిమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకూండా, తమ అందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురుసిపోయారు.
అప్పటి నుంచీ చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ‘ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును’ అన్నాడు పరమశివుడు.
సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో ‘మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో! ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు యింకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది’ అన్నారు.
వరలక్ష్మీదేవి వ్రత కథ:
సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. ‘ఓ మునీశ్వరులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి’.
ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, ‘దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి’ అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. ‘ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను’.
పార్వతీదేవి ‘ నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి’ అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను.
పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి, తెల్లవారు ఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా , ఇంత అణకువగా నున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.
ఒకరోజు ఆ మాహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. ‘ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను’ అలా ప్రత్యక్షమైన అమ్మ వారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ , నమస్కారములు చేసి ;
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూర్తయేశరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధములు స్తోత్రం చేసింది.
‘ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు. విద్వాంసులవుతారు. సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది’. అనగా వరలక్ష్మీ దేవి సంతోషము చెందింది.
ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీ దేవి కనబడ లేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తనీ, అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ‘ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి’ అన్నారు. చారుమతి తన యిరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు , చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.
వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు. ప్రాతః కాలమే లేచి తలారా స్నానం చేసి, పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి యింట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేసారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి , మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసారు.
చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసారు.
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితేనారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా
అను ఈ శ్లోకంతో ధ్యానావాహనాది షోడశోపచార పూజ చేసారు.
తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీ దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు.దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లు మని శబ్ధం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసి పోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే అ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల యిళ్ళన్నీస్వర్ణమయాలయ్యాయి.
చారుమతి యింటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి యిళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు, చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి , దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవికి నైవేద్యం గా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోవారి యిండ్లకు బయలు దేరారు.
వారు త్రోవలో చారిమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకూండా, తమ అందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురుసిపోయారు.
అప్పటి నుంచీ చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ‘ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును’ అన్నాడు పరమశివుడు.
సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో ‘మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో! ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు యింకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది’ అన్నారు.
Thursday, 27 August 2015
Subscribe to:
Posts (Atom)