Friday 3 April 2020

సమైఖ్యభావన కోసం ఆదివారం రాత్రి దీపం వెలిగించండి...



మోదీ గారి ప్రసంగంలో ఆదివారం రాత్రి 9 గంటలకు, ఇంట్లో ఉన్న విద్యుత్ దీపాలు ఆర్పి, తొమ్మిది నిమిషాల పాటు దీపం, కొవొత్తి, లేదా టార్చ్ లైట్ వెలిగించమని చెప్పారు. దానికి ఏవో ఏవో వ్యాఖ్యానాలు ఫేస్‌బుక్ మరియు వాట్సాప్లో వస్తున్నాయి.

మోదీ గారీ ప్రసంగంలో వారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా పేదలు, కూలీలు ఎంతో గానో నష్టపోయారు. ఈ కర్ఫ్యు ముగిసిన తర్వాత వారి గురించి తప్పక ఏదో ఒకటి చెద్దామన్నారు. అలాగే లాక్ డౌన్ లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఉన్న కారణంగా చాలామందికి ఒంటరిగా ఉన్నామనే భావన కలుగుతుంది. దేశమంతా ఈ మహమ్మారిపై కలిసికట్టుగా పోరాటం చేస్తోంది. ఈ పోరాటంలో ఏ ఒక్క భారతీయుడు ఒంటరి కాదు, ఇది సమిష్టి పోరాటం. అందరూ ఆ భావనతో ఉంటేనే లాక్ డౌన్ విజయవంతమవుతుంది. అందుకే దీపం వెలిగించమన్నారు. విద్యుత్ దీపాలన్నీ ఆర్పివేసినప్పుడు అంధకారం అలుముకుంటుంది. అప్పుడు మనం వెలిగించే చిన్న దీపం ఎంతో వెలుతురుని ఇస్తుంది. అలానే మన చుట్టూ ఉన్నవారంతా దీపాలు వెలిగించడం చేత పరిసరాలన్నీ కాంతివంతమవుతాయి, అంధకారం తొలగిపోతుంది. అలానే అందరూ కలిసి సమిష్టిగా పని చేసినప్పుడే కరోనా మహమ్మారి కనుమరుగవుతుంది. ఇప్పుడు నేను ఒంటరి కాదు, ఈ కరోనా చీకటిని తొలగించడానికి యావత్ దేశమంతా లాక్ డౌన్ పాటిస్తోందని మనకు అర్ధమవ్వడానికి ఈ కార్యక్రమం.

మొన్న చప్పట్లు కొట్టిమని చెప్పినప్పుడు చాలామంది ఎవరు కొడతారులే అనుకున్నారు. కానీ బయటకు వచ్చి చూస్తే, దాదాపు అందరూ పాల్గొన్నారు. అలా అందరితో కలిసి చప్పట్లు కొట్టినప్పుడు మనలో చాలామంది భావోద్వేగానికి లోనయ్యారు. నేను భారతీయుడిని, నా దేశం భారతదేశం అనుకునే ప్రతి ఒక్కరీ కళ్ళూ చెమర్చాయి. మనమంతా ఒక్కటే, దేశానికి కష్టం వచ్చినప్పుడు, అన్నిటికీ అతీతంగా ఏకమవుతామన్న భావన మనలో కలిగింది కదా. ఇప్పుడు కూడా అలాంటి సమైఖ్య భావన కలిగించడమే దీని లక్ష్యం.

నేను ఒంటరిగా పోరాటం చేయడం లేదు, మా దేశమంతా సమైఖ్యంగా ఈ కరోనా మహమ్మారిని అంతమొందించడానికి పోరాటం చేస్తోదన భావన అందరికీ కలిగించడం, కులమతప్రాంతాలకు అతీతంగా అందరినీ ఈ విషయంలో సంఘటితం చేయడమే దీని ఉద్దేశం.

మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీగారి మాటల్లో ఉన్న భావన అదే. కావాలంటే మళ్ళీ ఆ ప్రసంగం వినండి. అర్ధం చేసుకుంటే మంచిది. ఇలాంటి సమయంలో జనంలో పాజిటివ్ భావనలు కలిగించాలి గానీ, మొబైల్ డేటా ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రతిదాన్నీ విమర్శించకూడదు, జనంలో అసహనం పెంచకూడదు.

కనుక మర్చిపోకుండా ఆదివారం రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటి దీపం వెలిగించి, సమైఖ్య భావనను, పాజిటివ్ భావనను కలిగిద్దాము.   

జై హింద్
వందేమాతరం 

No comments:

Post a Comment