Wednesday 29 April 2020

మీరు తెలుగు వారైతే మీరు వినాల్సిన ప్రవచనకారులు :



ఈ లాక్‌డౌన్ సమయంలో చాలా ఖాళీ సమయం చాలా వుంది. ఈ సమయంలో మన ధర్మాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం మీరు చేయవచ్చు. ఎందరో మహానుభావులు మన సనాతనధర్మం గురించి ప్రవచనాలు ఇచ్చారు. ఎవరినీ తక్కువ చేయడం కాదు, కానీ అందులో ముఖ్యమైనవారి పేర్లు.

మీరు తెలుగు వారైతే మీరు వినాల్సిన ప్రవచనకారులు :

భక్తి, రామాయణము, ఆర్షధర్మము, వాఞ్జ్మయము, ఉపాసన, గురుభక్తి, పురాణాలు, స్మృతులు వంటి అంశాలకు -

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు

టి.కె.వి.రాఘవన్ గారు

బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు

పూజ్యశ్రీ ఆచార్య ప్రేం సిద్ధార్థ్ గారు

బ్రహ్మశ్రీ దేవిశెట్టి చలపతి రావు గారు

ఇందులో ఉపాసనా రహస్యాలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు; పురాణల కొరకు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, టి.కె.ఎస్.రాఘవన్ గారు; కుటుంబ విలువలు, రామాయణం, భక్తి అంశాల మీద బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు; భాగవత ప్రవచనం కోసం బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు; అద్వైత, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి సిద్ధాంతపరంగా మన ధర్మంలోని ప్రతి సూక్ష్మమైన అంశాన్ని నిశీతంగా తెలుసుకొనుటకు పూజ్యశ్రీ ఆచార్య ప్రేం సిద్ధార్థ్ గారు; కర్మసిద్ధాంతం, వివేకచూడామణి, భగవద్గీత మొదలైన అనేక విషయాల కొరకు బ్రహ్మశ్రీ దేవిశెట్టి చలపతి రావు గారు; తెలుగు సాహిత్యం, అందులోని గొప్పతనం కోసం బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గార్ల ప్రవచనాలు వినవచ్చు.

మీకు ఆంగ్లం అర్దమవుతుంది అనుకుంటే హిందూధర్మం మీద ప్రస్తుతం జరుగుతున్న దాడులు, వాటి స్వరూపం ఏమిటి? వాటిని ఎలా ఎదురుకోవాలి ? అసలు మనకు అన్యమతాలకు మధ్య వ్యత్యాసం ఏమిటి? మన ధర్మాన్ని, దేశాన్ని రక్షించుకోవడం ఎలా అనే అంశాలను శ్రీ రాజీవ్ మల్హోత్రా గారు చాలా అద్భుతంగా చెప్తారు. వారి ప్రవచనాలు, పుస్తకాలు అధ్యయనం చేస్తే అసలు మన ధర్మం ఏంటో బాగా అర్ధమవుతుంది. వారి ప్రసంగాలు కొన్ని హిందీలో కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే డా. సుబ్రమణియం స్వామి గారు హిందూత్వము, మన పూర్వచరిత్ర మొదలుకొని అనేక అంశాల మీద అనేక ప్రవచనాలు ఇచ్చారు. అవి ఆంగ్లభాషలో అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి.

భారతదేశ పూర్వచరిత్ర, వైభవం, ఆయుర్వేదం, ఆరోగ్యకర జీవనం, గోమాత గురించి హిందీ భాషలో శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఎన్నో ప్రసంగాలిచ్చారు.


ఇవి గాక, కంచి పరమాచార్య స్వామి వారి బోధలు పుస్తకరూపంలో దొరుకుతున్నాయి. అవేగాక శృంగేరీ పీఠం వారి సాహిత్యం కూడా అంబాటులో ఉంది. భక్తి గురించి తెలుసుకోవాలంటే శ్రీ రామకృష్ణమిషన్ వారు ముద్రించిన శ్రీ రామకృష్ణ కథామృతం చదవచ్చు. కర్మ, జ్ఞాన, రాజ, భక్తియోగాల కొరకు, చక్కని ప్రేరణ కొరకు స్వామి వివేకానంద గారి సాహిత్యం ఆన్లైన్‌లోనూ, పుస్తకరూపంలోను అందుబాటులో ఉన్నాయి.


ఖాళీ సమయాన్ని జ్ఞానం పెంచుకోవడంలో సద్వినియోగం చేసుకోండి. ఎందరో మహానుభావులు మన సనాతనధర్మం గురించి ప్రవచనాలు ఇచ్చారు. ఎవరినీ తక్కువ చేయడం కాదు, కానీ అందులో ముఖ్యమైనవారి పేర్లు. (గతభాగంలో చెప్పిన వారి పేర్లు ఇక్కడ మళ్ళీ ప్రస్తావించడంలేదు). 

ఎన్నో శాస్త్రాలను ఔపోసన పట్టి, ధర్మ సూక్ష్మాలను నిశితంగా చెప్పగల మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు
భగవద్గీతా, భజగోవిందం, లలితా సహస్రనామం, హిందూ ధర్మం మీద అనేక ప్రవచానలు ఇచ్చారు పరిపూర్ణానంద స్వామి వారు
విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం  భగవద్గీత మొదలైనవి తెలుసుకోవాలనుకుంటే త్రిదండి చిన్న జీయరు స్వామి వారి ప్రవచనాలు వినవచ్చు.
సంస్కృత మరియు తెలుగు భాషాసాహిత్యం, పురాణాలు, స్మృతులు, కావ్యాల మీద అద్భుతంగా అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పగల అవధానులు మేడసాని మోహన్ గారు, మాడుగుల నాగఫణిశర్మ గారు. వీళ్ళ ప్రవచనాలు వింటే తెలుగు భాష వైభవం, అందం తెలుస్తాయి.
వీరుగాక మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి, శ్రీభాష్యం అప్పలాచార్య, శ్రీ సిద్దేస్వరానంద భారతి స్వామి, మైలవరపు శ్రీనివాస రావు గార్ల ప్రవచనాలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి.

భారతజాతి చరిత్రకు సంబంధించి ఎంతో పరిశోధించి మనకు గొప్ప పుస్తకాలను అందించిన మహానుభావులు 
1. శ్రీ కోటా వేంకటాచలం గారు - వీరు పుస్తకాల ముద్రణకు వారి పిల్లల వద్ద డబ్బు లేక, ఆసక్తి కలిగినవారు ఉంటే ప్రతులు ఇస్తాము, జిరాక్సు తీసుకోండని వారి వారసులు చెబుతున్నారు. అది వారి దుస్థితి.
2. ఎం.వి.ఆర్.శాస్త్రి గారు - ఆంధ్రభూమి సంపాదకులు - ఇది చరిత్ర, ఏది చరిత్ర వంటి గొప్ప గ్రంథాలను రాసి అసలు భారతచరిత్ర ఎంటో సమాజానికి తెలిపే ప్రయత్నం చేశారు.
3. హెబ్బారు నాగేశ్వర రావు గారు - వీరి వ్యాసాలు ఋహిపీఠం మొదలైన వాటిల్లో వస్తుంటాయి. తరతరాల భరతజాతి అంటూ కలి ఆరంభం నుంచి మన దేశచరిత్రను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.

1. ఆరోగ్యం గురించి తెలుసుకోవాలంటే డా.ఖాదర్ వలి గారి ప్రసంగాలు చూడండి. అవి తెలుగులోనే ఉన్నాయి.
2. ప్రకృతి వ్యవసాయం, మన పూర్వీకులు ఆచరించిన వ్యవసాయ పద్ధతులు మొదలైన విషయాలకు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి వీడియోలూ వీక్షించండి. వీరి వీడియోలు కొన్ని తెలుగు అనువాదంలో లభిస్తున్నాయి. సేవ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ విజయ్ రాం గారు ప్రకృతి వ్యవసాయ పద్ధతి గురించి అనేక వీడియోలు యూట్యూబ్ లో ఉంచారు. రైతులకు, గ్రామీణ యువతకు ఇవి సహాయకారి.
3. ఆంగ్లభాష అర్ధమవుతుంది అనుకుంటే వ్యవసాయం పేరుతో మనదేశం మీద విదేశి సంస్థలు చేస్తున్న కుట్రలు, పెత్తనాన్ని ఎండగట్టిన ఏకైక స్త్రీ శ్రీమతి వందనాశివ గారి వీడియోలు చూడండి. 
4. ఆరోగ్యసూత్రాలకు ప్రకృతివనం ప్రసాద్ రావు గారి వీడియోలు చూడవచ్చు. 
5. మహర్షి వాగ్భటాచార్యులు మొదలుకొని అనేకమంది మహర్షులు మనకు ప్రసాదించి ఆరోగ్య ఆయుర్వేద సూత్రాలను మనకు అందించారు శ్రీ రాజివ్ దీక్షిత్ గారు. విజ్ఞానం విషయంలో వీరు చిరస్మరణీయులు.
పైన చెప్పిన వీడియోల్లో మీకు వ్యవసాయము, ప్రయావరణ పరిరక్షణ, ఆరోగ్యం మొదలైన ఎన్నో అంశాలు వివరంగా తెలుస్తాయి. 

No comments:

Post a Comment