Sunday 9 September 2012


part-21
~ వచ్చిన వారికి భోజనం పెడతాము,భగవంతునకు నైవెద్యం పెడతాం కదా.

  నైవేద్యంగా సమర్పించకుండా ఏ పదార్థమైన తింటే పాపాన్ని తిన్నటే అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీతలో చెప్పారు.పరమాత్మకు సాత్వికమైనవే సమర్పించాలి.కల్లు,మందు మొదలైనవి భగవంతుడికి సమర్పించలెం కదా.కనుక స్వామికి నెవేదన చేయలేని వాటిని సేవించకూడదని అర్దం.భగంతునికి ఒక నైవెద్యం ఇష్టం,మరొకటి ఇష్టం లేదు అని కాదు.మనకు ఏవి ఆరొగ్యాన్ని ఇస్తాయొ వాటినే పరమాత్మ నైవెద్యంగా అడిగాడు.మన ఆరోగ్యం కోసమని నియమాలు పెట్టాడు.అదే "నైవెద్యం సమర్పయామి".    

~ భోజనం చేశాక తాంబులం ఇస్తారు.తాంబులానికి పాన్ కు చాలా తేడా ఉంది.తాంబూలం వేసుకోవడం చేత లాలాజలం(సలైవ)అధికంగా ఉత్పత్తై జీర్ణశక్తిని పెంచుతుంది.నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది.పంటి సమస్యలు రాకుండా ఉంచగలుగుతుంది(కాని పాన్ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు.క్యాన్సర్ వస్తుంది పాన్ తినే వాళ్ళకు).ఆరోగ్యకారాణాల రీత్యా వచ్చినవారికి తాంబులం ఇచ్చేవారు.అదే "తాంబూలం సమర్పయామి".

~ తరువాతి ఉపచారం ప్రదక్షిణం.వచ్చిన వారి చుట్టూ తిరాగలా అని మీరు అడగచ్చు.వచ్చిన వారి చుట్టూ తిరగమని కాదు,వారి ఆలొచనల చుట్టూ తిరగమని.ముందు చెప్పుకున్నాం కదా.వచ్చినవాడు చాలా గొప్పవాడని.మరి అంత స్థాయికి ఎలా ఎదిగాడొ,ఎలాంటి పరిస్థితులు ఎదురుకున్నాడొ అడుగుతాం.మనం కూడా వాడిని అనుసరించాలని భావిస్తాం.వాడి అభిప్రాయాలను తెలుసుకుంటాం.అలాగే దేవాలయంలో దేవుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం అంటే భగవత్తత్వాన్ని అర్దం చెసుకొని,ఆయన్ను అనుసరించడం.(అలాగే దాని వెనుక సైన్స్ కూడా ఉంది.సైన్సు తరువాత చెప్పుకుందాం).మరి ఇంట్లో పూజలో అయితే మన చుట్టూ మనమే తిరుగుతాం.మనం ఆత్మస్వరూపం.మనం ఆత్మ అని గ్రహించి ఈ శరీరాన్ని ఆత్మ చుట్టూ తిప్పగలిగితే పాపాలను తొలిగించుకొని మొక్షాం పొందుతాం.అదే "ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి".

~ కనీసం ఈ 16 ఉపచారలైన చేయాలని శాస్త్రం చెప్తొంది.నిజానికి ఉపచారాలు 64.వాటి వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలూ ఉన్నాయి.దేవుడిని మానసికంగా సేవించి,పరమాత్మ దగ్గరవ్వడమే వీటి పరమార్దం.అలాగే ఇంటికి అతిధులు వచ్చినప్పుడు వారిని ఏ విధంగా గౌరవించాలో చిన్నప్పటి నుండి పిల్లలకు నేర్పించడానికి,మన సంస్కృతిని,సంప్రదాయన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికి మన మహర్షులు వీటిని పూజలో భాగంగా చేశారు.ఇవి కేవలం మర్యాదకు మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కాపాడుకొవడానికి కూడా దోహదపడతాయి.            

to be continued...........

No comments:

Post a Comment