Wednesday 12 September 2012


part-24

~ వినాయకచవితికి మనం చదువుతున్న కధలు పూరాణోక్తమా?కల్పితమా?

~ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు వినాయకచవితి గురించి ప్రవచనం చేశారు.అనేకానేక విషయాలు చెప్పడం జరిగింది.

~ వరసిద్ధివినాయకవ్రతకల్పాన్ని(వినాయకచవితి వ్రతాన్ని)నారద మహర్షి వారు చెప్పడం జరిగింది.వ్రతం అంటే ప్రతి సంవత్సరం చేసేది అని అర్దం.కల్పం అంటే ఏలా చెప్పారో అలాగే చేయాలి.కాబట్టి ఈ వినాయకవ్రతాన్ని కూడా ఋషి "చెప్పినట్టుగానే" చేయాలి.ఈ వ్రతాన్ని "నక్త వ్రతం" అంటారు.అంటే సాయంకాలం చేయాల్సిన వ్రతం.పగలంతా ఉపవాసం ఉండి అసురసంధ్యవేళ(సాయంకాలం) పూజ చేయాలి.వ్రతంలో రెండు భాగాలు ఉంటాయి.ఒకటి పూజ,రెండు కధ.పూజ ఎంత ప్రధానమో కధకూడా అంతే ప్రధానం.పూజ చేయలేకపొయిన(బంధువుల మరణాలు మొదలైనవి)వారు కధ అక్షతలు తల మీద వేసుకున్నా ఫలితం వస్తుంది.ఈ వరసిద్ధి వినాయక వ్రతం అందరికి ఉంటుంది,అందరూ చేసుకోవాలి.

~ కానీ ఈరోజు మనం చదివే వినాయకచవితి వ్రతకధల్లో చాలా తప్పులు ఉన్నాయని చాగంటి కొటేశ్వర రావుగారు, వారి ప్రవచనంలో చెప్పడం జరిగింది.వినాయకచవితిరోజున వినాయకుడు కడుపునిండా తిని కైలాసానికి వెళ్ళాడని,శివపార్వతుల పాదాలకు నమస్కరించడానికి ప్రయత్నించడం,పొట్ట అడ్డురావడం,చంద్రుని దృష్టి తగిలి వినాయకుడు మూర్చిల్లడం వంటివి ఏ పురాణంలో లేవని చెప్పారు.అవి కేవలం అభూతకల్పనలు.

~ అసలు కధ  ఇదే.దీన్నే వినాయకచవితి వ్రతంలో చదవాలి.వినాయకచవితి రోజున వినాయకుడు భక్తులు "భక్తికి మెచ్చి" వారు పెట్టిన నైవేద్యాలను ఆరగించి చంద్రలోకం ద్వారా వెళ్తున్నాడు.చంద్రుడు చాలా అందంగా కనిపిస్తాడు.అది బాహ్యసౌందర్యం.(ఆయనకు 27 మంది భార్యలు(నక్షత్రాలు).వారందరు అక్కచెళ్ళెలు.దక్షప్రజాపతి కూమార్తెలు.కానీ ఆయన అందరితో సమానంగా మెలగక కేవలం  రొహిణితో ఉండడానికి ఇష్టపడేవాడు.అది తెలిసిన దక్షుడు కోపంతో చంద్రుడ్ని కళావిహీనం అయిపొ అని శపించాడు)అందువల్ల ఆంతరంగికంగా సౌందర్యవంతుడు కాడు.వినాయకుడు బయటకు పెద్ద బొజ్జతో మరగుజ్జవానిలా,చిన్నపిల్లవాడిలా,ఏనుగు ముఖంతో ఉన్నా ఆయన మానసికంగా మహా సౌందర్యవంతుడు.

~ కవులందరూ చంద్రుడు గొప్పవాడని,చల్లనివాడని,అందమైన ముఖమున్నవారిని చంద్రునిముఖంతో పొల్చడం వంటివి చేయడం చేత చంద్రునకు "అహంకారం" పెరిగింది.తానే అందగాడినని,వినాయకుడిరూపం విచిత్రంగా ఉందని,ఆయన్ను చూసి పకపకా నవ్వాడు.వినాయకుడి కడుపు నైవేద్యంవల్ల నిండలేదు.ఆయనే అందరికి తిండి పెడుతున్నాడు.ఆయన కడుపు ఎవరు నింపగలుగుతారు?భక్తుల భక్తికి గణపతి కడుపు నిండిపొయింది.వారు చూపిన భక్తికి మెచ్చి,ఆ ఆనందాన్ని జీర్ణించుకోలేక ఇబ్బందిపడుతున్నాడు.అటువంటి వినాయకుడికి కోపం వచ్చింది.ఆ కోపం ఆయన్ను చూసి నవ్వినందుకు రాలేదు.ఇంతకముందు శాపంకారణంగా చంద్రుడు కళావిహీనుడై,శివున్ని శరణు వేడడం వల్ల,శివుడు ఆయన్ను తలమీద పెట్టుకున్నాడు.అయినా చంద్రునిలో మార్పు రాలేదు.అది వినాయకునికి బాధ కలిగించింది.అందువల్ల చంద్రునకు శాపం ఇచ్చాడా గణపతి.

~ ఈ విషయం ప్రపంచానికంతా తెల్సిపొయింది.ప్రజలు రాత్రి అవ్వగానే బయతకు వెళ్ళాల్సివస్తే ఉత్తరీయాలు,చీరకొంగులు అడ్డుపెట్టుకొని వెళ్ళడం,చంద్రున్ని తిట్టడం మొదలు పెట్టారు.అందరూ చీదరించికోవడంచేత ఆయనకున్న అహంకారం అణిగి సిగ్గువేసింది.సిగ్గుతో బయటకు రాలేక సముద్రంలొకి వెళ్ళి దాక్కున్నాడు........

to be continued.........            

No comments:

Post a Comment