Thursday 6 September 2012




part-18
~ షోడశోపచార పూజ అంటే ఏమిటి?

~ షొడశోపచారాపూజ అంటే 16 ఉపచారాలతో పరమాత్మను పూజించడం.ఉప అంటే దగ్గరగా,ఆచారం అంటే చెయ్యడం.పరమాత్మును మనకు మానసికంగా దగ్గరచేసెదే ఈ పూజ.ఈ 16ఉపచారాలను మన రోజువారి జీవితానికి అన్వయం చేసుకుందాం.

~ మన ఇంటికి మన చిన్ననాటి ఫ్రెండ్,మనం ఆహ్వనించకుండానే తనకు తానే స్వయంగా వస్తున్నాడని అనుకుందాం(వినాయకుడు మనం పిలువకుండానే ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున వస్తున్నాడు కదా).ఆ ఫ్రెండ్ చాలా గొప్పవాడు,పెద్ద పదవిలో ఉన్నాడు.మరి అంత గొప్ప వాడు వస్తుంటే ఒక్కడే వస్తాడా?ఆయనకు ముందు ఎంతో మంది మన ఇంటికి వస్తారు కదా(అతను పెద్ద నాయకుడైతే పోలీసులు,కార్యకర్తలు,ఆయన వల్ల పదివిలో ఉన్నవారందరూ కూడా ఆయన్ను చూడ్డానికి వస్తారు కదా(మనం కలశంలొకి త్రిమూర్తులను,మాతృగణాలను ఆవహన చేస్తాం).అదే "కలశస్తాపన".  

~ ఇంతమంది వచ్చాక మనం వాడి కోసమని ఎదురుచూస్తూ ఉంటాం కదా.వాడు అలా ఉంటాడు,ఇలా ఉంటాడు అని ఆలొచిస్తూంటాం.మొత్తం మనసంతా అతని అలొచనలే ఉంటాయి కదా.అదే "ధ్యానం".

~ వాడు రాగానే రా!లోపలికి రా! అంటూ ఆనందంగా వాడిని ఇంట్లోకి తీసుకువస్తాం.అదే "ఆవాహన".

~ మన ఇంట్లో మంచి కుర్చీలేకపొయినా ప్రక్క ఇంటినుండి అడుక్కొనైనాసరే వాడికి మంచి కుర్చీ వేయాలి అనుకుంటామా?వాడు అలా మంచి కుర్చీలొనే కుర్చుంటా అని అనకపొయినా మనం  ఊరకుంటామా?అదే వరసిద్దివినాయకునికి "నవరత్నఖచిత సీంహాసనం" లేదా "ఆసనం".

~ మన హిందువులు వచ్చిన అతిధులకు కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకునేవారు.వచ్చిన వారిలో దైవాన్ని చూసేవారు.బయటనుండి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కుంటే మెదడుకు విశ్రాంతి.కాళ్ళలొ ఉండే నాడులు మెదడుకు నిరంతరం సంకేతాలను పంపిస్తుంటాయి.అందుకే పాదాలను చల్లటి నీటితో కడుక్కుంటే మెదడు హాయిగా ఉంటుంది.అలాగే బయటకు వెళ్ళిరావడంవల్ల కాళ్ళకు అంటుకొనిఉన్న క్రిములు ఇంట్లొకి రావు.అందుకే కాళ్ళు కడగటం.అదే "పాదయొః పాద్యం సమర్పయామి".

~ ప్రయాణసమయంలో మనం బయట వస్తువులను(బస్సు హ్యండిల్ లాంటివి) ముట్టుకొవలసి వస్తుంది.అవి శుభ్రంగా ఉండవు కదా.వచ్చి రాగనే వాడికి "షేక్ హ్యాండ్" ఇస్తే ఆ క్రిములు మన చేతికి అంటుకొని మనకు రోగాలు వచ్చె అవకాశం ఉంది కనుక మనం నమస్కరిస్తాం(నమస్కారానికి అర్దం నువ్వు నేను ఒక్కటే అని).ఇంకా నమస్కారానికి అనేకానేక అర్దాలు ఉన్నా అవి ఇప్పుడు అప్రస్తుతం.మన పూర్వీకులు వచ్చిన వాడి చేతులను శుభ్రపర్చుకోడానికి నీరు ఇచ్చెవారు.అదే "హస్తయొః అర్ఘ్యం సమర్పయామి".    
 
~ ఇలా శుభ్రపరిచాకే వారికి త్రాగడానికి"నీరు" ఇచ్చేవారు.అదే ఈ కాలంలో వచ్చిరాగానే మురికి చేతులతొ ఉన్నవాడికి కూల్ డ్రింక్లు ఇస్తే,అసలే బయట నుండి వచ్చాడు కదా,కాసేపటికి దాహం వేస్తుంది,అవి అసలే ఆరొగ్యానికి మంచి కావు.మురికి చేతులు.లేని రోగాలు వచ్చి చస్తాడు.అందుకే మన పూర్వీకులు ముందు నోరు శుభ్రపరుచుకోడానికి(బయటనుండి రావడం వల్ల నొట్లో క్రిములు చేరి ఉంటాయి కదా)నీరు ఇచ్చి,తరువాత త్రాగడానికి మంచి నీరు ఇచ్చేవారు.అదే  "ఆచమనం".    


to be continued.......                        

No comments:

Post a Comment