Sunday 2 September 2012

భారతీయ వస్త్రధారణ

part-14

వినాయక చవితి పూజ అనే కాకుండా ప్రతి పూజలోను భారతీయ వస్త్రధారణ తప్పనిసరి.

 వేదం అంటే భగవంతుని ఉచ్శ్వాస నిశ్వాసలు. వేదాన్ని మించిన గొప్ప గ్రంధం కానీ, వేదంలొ చెప్పబడ్డ టెక్నాలజీ కానీ ఈ ప్రపంచంలో లేదు. అలాంటి వేదం పూజ సమయంలో ఏ వస్త్రాలు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి అన్నవి కూడా బలంగా చెప్పింది. దీని వెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉంది. అయితే ముందు వేదం ఏమి చెప్పిందో తెలుసుకుందాం.

కట్టుకునే వస్త్రాలు చేనేత కార్మికులే నేసినవై ఉండాలి. ఎందుకో తెలుసా?వారి చేతి స్పర్శ చేత ఆ వస్త్రాలకు పవిత్రత వస్తుందని, ఆ బట్టలోని దారాల మధ్య ఉండే చిన్న చిన్న రంధ్రాల్లో ఇంద్రాది దేవతలు ఆవహింపబడతారని చెప్తోంది వేదం. అవి నూలు (కాటన్)వై ఉండాలి. వాటికి అంచు (Border) తప్పనిసరిగా ఉండాలి. వస్త్రాలు తెల్లని రంగులో ఉండాలి.

పూజా సమయంలో ధరించే దుస్తులు ఉతికినవై ఉండాలి. లేదా క్రొత్తవై ఉండాలి. గోచి పొసి మాత్రమే కట్టుకోవాలి. గోచి అంటే చిన్న బట్టను కట్టుకోవడం అని అర్దం కాదు పంచె యొక్క అంచు రెండు కాళ్ళ మధ్యలోకి వచ్చెలా, క్రింద పాదాలవరకు వచ్చేలా కట్టుకోవడం. పూజ సమయాల్లో ఆడవారికి కూడా ఇది వర్తిస్తుంది.

పెళ్ళైన మగవారు ఎడమ భూజం మీద ఉత్తరీయం వేసుకొవాలి. ఎంత గొప్ప క్రతువు చేస్తునా ఉత్తరీయం లేకపొతే ఫలితం రాదు. ఉత్తరీయం ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకు వేసుకోవాలి అంటే ఎడమ వైపు గుండె ఉంటుంది. భార్య భర్త ఎడమ చెయ్యి పట్టుకుంటుంది పెళ్ళి సమయంలో. భార్యే భర్త గుండెకు (ప్రాణానికి) రక్షణ అని, అందువల్ల ఆమెను ఎప్పుడు మరవద్దని శాస్త్రం చెప్తొంది.

ఆ కాలంలో మారెజ్ బ్యూరోలు లేవు. అందరూ కలిసి ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ, పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కాని మగవారికి ఈ ఉత్తరీయం ఉందో లేదో చూసి లేకపొతే కనుక పెళ్ళి సంబంధాలు మాట్లాడేవారట. ఇప్పుడా పరిస్థితి లేకపొయినా ఉత్తరీయం ధరించడం మాత్రం తప్పనిసరి.

చేనేత మగ్గం మీద నేయని వస్త్రమైనా, ఉతకనిదైనా, తెల్లనది కాకపొయినా, నూలుది కానిది, అంచు లేని వస్త్రాన్ని కట్టుకున్నా, అప్పుడు చేసే పూజ నగ్నపూజగా భావింపబడుతుందని, మహాపాపం వస్తుందని వేదం చెప్తోంది.  

ఇంకో విషయం తెలుసా? దేవాలయంలో దేవునికి మనం చేనేత నూలు వస్త్రాలే సమర్పించాలి.భగవంతునికి కూడా ఈ వస్త్రాలే ధరింపచేయాలి. పట్టు వస్త్రాలతో దేవలయాలకు వెళ్ళకూడదు. దేవునికి సమర్పించరాదు. పూజల్లొ కట్టుకోరాదు. అది నిషిద్దం. ఎందుకంటే పట్టు, పట్టుపురుగును చంపి తీస్తారు. లేదా పట్టు తీసే క్రమంలో అవి చనిపోతాయి. అది హింసే కదా. అందుకే శాస్త్రం నిషేధించింది. ఎంత డబ్బు ఉన్నా సరే పట్టు వస్త్రాలు దేవునికి సమర్పించకూడదు.

వినాయక చవితి,వరలక్ష్మీ వ్రతం,సత్యనారయణస్వామి వ్రతం మొదలైన పూజల్లొ, పీట మీద పరిచే టవల్ లేదా బట్ట కూడా చేనేతది, నూలుది, తెల్లనిది, అంచు ఉన్నది, క్రొత్తది మాత్రమే అవ్వాలి. ముడుపులు కట్టేసమయలో కూడా ఇవే వాడాలి.

 మనలో చాలా మందికి ఈ విషయాలు తెలియవు. కనీసం ఇప్పటి నుంచైనా ఆచరిద్దాం.    


To be continued.........

No comments:

Post a Comment