Saturday 3 November 2012

ధన త్రయోదశి

ఆశ్వయుజ బహుళ త్రయోదశి(అంటే నరక చతుర్దశికి ముందు వచ్చే తిధి).దీన్నే "ధన త్రయోదశి" అంటారు.ఈనాటి రాత్రి అపమృత్యువు(unnatural death) నివారణకై నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి,పూజించి,ఇంటి ముందు ఉంచాలి.దీనికి "యమ దీపం" అని పేరు.యముని అనుగ్రహం పొందడం కోసం ఈ దీపాన్ని వెలిగించాలని చెప్తారు.  

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా చెప్పబడింది. సత్యభామ నరకాసురిడిని సంహరించిన కారణంగా ఈరోజున పండగ జరుపుకుంటారు. ఈ చతుర్దశి యమునకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి గంటన్నర ముందే నువ్వుల నూనెతో తల అంటుకొని స్నానం చేయాలి.స్నానానికి ఉపయోగించే నీటిలో ఉత్తరేణి,తగిరస,తుమ్మి చెట్లకొమ్మలను కలియబెట్టాలి.స్నానం మధ్యలో ఉత్తరేణి ఆకులను తలపై త్రిప్పుకొని పారేయాలి. ఈరోజు చేసే స్నానం నరక భయాన్ని పొగొడుతుందని, మంగళకరమని చెప్పబడింది. ఈ రోజున సూర్యోదయానికి ముందు నువ్వులనూనెలో లక్ష్మి దేవి, నీటిలో గంగా దేవి ఉంటారని,అందువల్ల ఆ సమయంలో చేసే స్నానం వల్ల వరి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది.

స్నానం చేశాక దక్షిణంవైపునకు తిరిగి నువ్వులతో యముని ప్రీతికొరకు తర్పణం ఇవ్వాలి, ఈరోజు భోజనంలో మినుములతో చేసిన పదార్ధాలను, మినప ఆకులతో వండిన కూరను తినాలి.

ఈరోజు ప్రదోషంలో అంటే సాయంకాలం ఇంటిముందు, ఆలయాల్లోనూ దీపాలను వెలిగించాలి. నాలుగు వత్తులతో దీపాన్ని వెలిగించి దీపదానం చేయాలి.

     

No comments:

Post a Comment