Tuesday 20 November 2012

దీపం


ఓం శ్రీ పరమాత్మనే నమః

సనాతన హిందూ సంప్రదాయంలో దీపానికి ప్రత్యేక స్థానం ఉంది."తేజస్" లేదా "అగ్ని"తత్వమే దీపం.అగ్ని పురాణం దీపారాధనకు ఆవునెయ్యి లేదా నువ్వుల నూనే మాత్రమే వాడాలి అంటొంది.ఆవు నెయ్యి దీపం నువ్వుల నూనెతో వెలిగించిన దీపం కంటే తక్కువ సమయం వెలిగినా,ఆవు నెయ్యి దీపానికే మొదటి ప్రాధాన్యత(first preference) ఇచ్చింది శాస్త్రం.

ఆవునెయ్యికి సాత్విక తరంగాలను ఆకర్షించే శక్తి అధికంగా ఉంటుంది.ఆవునెయ్యిలో సౌర(సూర్య)శక్తి అధికంగా ఉంటుంది.యజ్ఞకుండంలో ఆహుతిగా వేసిన ఆవునెయ్యి కొద్ది క్షణాల్లోనే భూమి ఉపరితలం నుండి 8 కిలోమీటర్లు పైకి చేరి వాతావరణ కాలుష్యాన్ని తొలగిస్తుంది.ఆవునెయ్యి క్రిమి సంహారిణి.అందువల్ల ఆజ్యము,నిరుక్తము అని సంస్కృత భాషలో పేర్లు.అగ్నిహోత్రంలో ఆహుతిగా వేయబడిన ఆవునేయి కాలిన వాసన ఎంతవరకు వ్యాపిస్తుందో అంత దూరంవరకు రోగకారకక్రిములు సమూలంగా నాశనమవుతాయని రష్యా శాస్త్రవేత్తలు పరిశోధనలో తెలింది.అంతేకాదు అగ్నిహోత్రంలో వేయబడిన 10 గ్రాముల ఆవునెయ్యి 1 టన్ను ప్రాణవాయువును(oxygen) ఉత్పత్తి చేస్తుంది.ఇటువంటి అనేక విశిష్టతలు ఉన్నాయి కనుకే ఆవునేయి దీపాన్ని వెలించమన్నారు.    

ఆవునెయ్యితో వెలిగించిన దీపం వాతావరణంలో ఉండే సాత్విక తరంగాలను నూనె దీపం కంటే మరింత ఎక్కువగా ఆకర్షిస్తుంది.

నూనె దీపం 1 మీటరు దూరంవరకు ఉన్న సాత్విక తరంగాలను ఆకర్షిస్తే,ఆవునెయ్యితో దీపం స్వర్గలోకం వరకు వ్యాపించి ఉన్న సాత్విక తరంగాలను ఆకర్షిస్తుంది.అంతేకాదు దేవతలు కూడా ఆకర్షింపబడతారు.

నూనె దీపం మానసిక శక్తిని ప్రేరేపిస్తే,ఆవునెయ్యి దీపం ఆత్మ శక్తిని తట్టి లేపుతుంది.

ఎప్పుడు కూడా దీపం ఆరిపోయింది అనకూడదు.ఎందుకంటే దీపం అత్మ స్వరూపం,జ్ఞాన స్వరూపం.ఆత్మకు మరణం ఉండదు,జ్ఞానానికి అంతం ఉండదు.అందువల్ల దీపం కొండెక్కిందని,పరమైందని,శాంతించిందని చాలా రాకాలుగా అంటుంటారు.

ఒక్కసారి దీపారాధన చేశాక ఇక ఆ దీపంతో ఇతర దీపాలను కాని,హారతిని కాని వెలించకూడదు.దీపం వెలుగుతున్నంత సమయం అది positive energy/vibrations ని ఆకర్షిస్తూనే ఉంటుంది.ఆ postive energy/vibrations ని కూడా అధికంగా "V" ఆకారంలోనే ఆకర్షిస్తుంది.ఆ దీపం నుండి వేరే దీపాలను,అగరుబత్తిలను,హారతి కర్పురాన్ని వెలిగించే సమయంలో అది ఆకర్షించే సాత్విక తరంగాలకు,positive energies కి విఘాతం ఏర్పడి,మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న దైవ శక్తులు,సాత్వికతకు, మీద చెడు ప్రభావాలను చూపిస్తుంది.అందుకని,మనం దీపారధన చేసే ముందు ఒక వత్తిని ఆవునెయ్యి లేదా నువ్వులనూనె లో  తడిపి విడిగా పెట్టుకుని,దాన్ని వెలిగించి,దానితో దీపాలను,అగర్బత్తిలను,హరతి కర్పురాలను వెలిగించాలి.కొవ్వత్తులతో వెలిగించకండి.

ప్రతి రోజు ఉదయం,సాయంత్రం దీపారాధన చేయండి.కార్తీకమాసంలో దేవాలయాల్లో దీపాలను వెలిగించండి.పర్యావరణాన్ని కాపాడండి.

ఓం శాంతిః శాంతిః శాంతిః

                   
                 


No comments:

Post a Comment