Sunday 2 December 2012

మన దేవాలయాలు

మన దేవాలయాలు

దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాలను రక్షించడం అంటే మనల్ని మనం రక్షించుకోవడమే)      

సనాతన హిందూ సంస్కృతిలో దేవాలయాలకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది.మన హిందూ సంస్కృతిని,ధర్మాన్ని,ఆచారాలను రక్షించడంలో అవి చాలా కీలకమైనవి.3,000 వేల సంవత్సరాల విదేశి దండయాత్రలు,విదేశిమతస్థుల కుట్రల తరువాత కూడా మన సంస్కృతి ఇంకా బ్రతికి ఉంది అంటే అందుకు కారణం మన ఆలయాలే.ఒకనాటి దేవాలయాలు వైధ్యాలయాలుగా,విద్యాలయాలగా,పేద ధనిక అనే తేడా లేకుండా అందరి మధ్య ఐక్యతను పెంపొందించే ప్రదేశాలగాను,నాయాస్థానాలుగా విలసిల్లాయి.దేవాలయాలే మన సంస్కృతికి,ఐక్యతకు ఆయువుపట్టు.

మీకు తెలుసా?పరాయిమతాల హింసకూ,ఇతరమతాల దోపిడికి,ఆక్రమిత ధర్మాల అక్రమాలకు హిందూధర్మం చిన్నాభిన్నమై చిద్రమైపొయిందొకప్పుడు.ఎందరో హిందువులు పరాయిమతాల పాలైపొయారు.మన హిందూ ఆడబిడ్డల మీద ఆఘాయిత్యాలు చేశారు.మతం మార్చుకోమని బలవంతపెట్టారు.మార్చుకోని వాళ్ళని చంపేశారు.ప్రాణభయంతో కొంతమంది మారిపోయినా,కొందరు మాత్రం ప్రాణలను సైతం పణంగా పెట్టి,వారి మీద పోరాటం చేశారు.వారితో యుద్ధం చేసి ఓడిపొయిన హిందూ రాజవంశస్థులను నానా భాధలు పెట్టారు.వారు సమాజానికి దూరంగా ఊరి బయట బ్రతకాలని ఆంక్షలు విధించారు విదేశి ఆక్రమణదారులు.అలా వచ్చినవారే లంబాడ జాతి వారు.వారు నిజానికి శౌర్యము,పరాక్రమము కలిగిన క్షత్రియవీరులు.మాలా,మాదిగ కులాలు కూడా ఇలా ఏర్పడ్డవే.ఈ విధంగా హిందూసమాజం ముక్కలయ్యింది.    

మన విద్యాలయాలను,ప్రాచీన గ్రంధాలను,పురాణాలను,దేవాలయాలను ధ్వంసం చేశారు.మన దేశంలో క్రీస్తుపూర్వం 700 వ సంవత్సరానికే తక్షశిల విశ్వవిద్యాలయం ఉంది.అందులో 60 పైగా సబ్జెక్టులను భోదించేవారు.ఆ సమయానికి ప్రపంచం నలు మూలల నుండి 10500 మంది అక్కడకు వచ్చి విద్యాభాసం చేశారు అంటే మీరే ఆలోచించండి అది ఎంత గొప్ప విషయమో.అటువంటిదే నలందా విశ్వవిద్యాలయం.అందులో ఉన్న విద్యాసంపదను,జ్ఞాన్ని,గ్రంధాలను నాశనం చేయదలచిన మహమదీయ పాలకులు దానికి నిప్పు పెట్టారు.ఆ మంటల్లొ చిక్కుకొని కొన్ని వేలమంది ప్రాణాలు కోల్పోయారు.నిప్పుపెట్టబడ్డ ఆ విశ్వవిద్యాలయం 3 నెలల పాటు ఆగకుండా కాలినా అది పూర్తిగా నాశనమవ్వలేదు.ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలు పొగ చేత కప్పబడ్డాయి.ఆ తరువాత వచ్చిన బ్రిటిష్ పాలకులు కూడా అనేక గ్రంధాలను నాశనం చేశారు.ఈ విధ్వంసకాండ 2వేల సంవత్సరాలా పాటు సాగింది.  

ఇటువంటి కారణాల చేత తన స్వరూపాన్ని,అంధకారంలో మగ్గుతు,ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చిన యావత్ హిందూ జాతిని ఒక్క చోట చేర్చడానికి,హిందువులు మధ్య ఐక్యత పెంచడానికి,స్నేహసంబంధాలను నెలకొల్పటానికి,మనమంతా హిందువులము,మనమంతా ఒక్కటే అని చెప్పడానికి,మన ఘనవారసత్వం భావితరాలకు అందించడానికి ఒక వేదిక అవసరమైనది.వీటిని అన్నిటిని నేరవేర్చి మన సంస్కృతిని,ధర్మాన్ని అందరికి తెలియజెప్పి మొత్తం భారతీయులను తన ఒడిలోనికి చేర్చుకున్నాయి మన దేవాలయాలు.విభిన్న ఆచారాలు,అనేక భాషలు,సంప్రదాయలు,1280 ధార్మిక గ్రంధాలు,10,000 వ్యాఖ్యానాలు,1,00,000 ఉప-వ్యాఖ్యానాలు,33 కోట్ల దేవతలు,వందలమంది ఆచార్యులు,వేలమంది ఋషులు,16000 వేలకు పైగా కులాలు ఉన్న హిందూ సమాజాన్ని ఒక్క ప్రదేశంలోనికి చేర్చినవి మన దేవాలాయాలు.దేవాలయాలు కళామతల్లికి పుట్టినిల్లు.

మన దేవాలయాలు కేవలం పూజలకే పరిమితం కాలేదు.వాటిలో చాలా సైన్సు కూడా ఉంది,కాని ఇవాళ దేవాలయాలు మన నిర్లక్ష్యం కారణంగా మూతపడుతున్నాయి,కూలిపొతున్నాయి.

ఈశా వాస్యమిదం సర్వం-ఈ విశ్వమంతా ఈశ్వరునితో మాత్రమే వ్యాపించి ఉంది అని ఈశావాస్య ఉపనిషత్ అంటొంది.ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి-సర్వజీవుల హృదయంలో పరమాత్మ ఉన్నాడు అని భగవద్గీత వచనం.చిదానంద రూపః శివొహం శివొహం-మనమే(ఆత్మ) ఆ సత్,చిత్,ఆనందమయమైన శివరూపం అని జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు అన్నారు.
విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడని అర్ధం.మరి విశ్వమంతా ఆ విశ్వేశ్వరుడే వ్యాపించి ఉన్నప్పుడు,ఆయనకు ఆలయం ఎందుకు?ప్రత్యేకంగా పూజలు,అభిషేకాలు చేయడమెందుకు?అనే ప్రశ్నలు మనలని వేదిస్తూ ఉంటాయి.

గంగానది అనంతమైన జలరాశితో గంగోత్రి నుండి బంగాళాఖాతంలో కలిసే వరకు ప్రవహించినా,మనం దాహం తీర్చుకోవడానికి అవసరమైన నీటిని మాత్రమే త్రాగుతున్నాం.అలాగే అఖిల జగమంతా అనంతమైన శక్తిరూపంలో ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నా,ఆలయంలో ఆ అనంతశక్తిని ఒక మూర్తిలో కేంద్రీకరించి మన ఆధ్యాత్మిక దాహార్తిని తీర్చుకోవడానికి ఆలయం ఒక వేదిక.

మన చుట్టూ ఉన్న గాలిలో ఆక్సిజెన్(ప్రాణవాయువు)వ్యాపించి ఉన్న,ఆసుపత్రిలో ఉన్న రోగికి ప్రత్యేకంగా ప్రాణవాయువును అందించి బ్రతికిస్తారు.అతను తిరిగి మాములుగా మారిన తరువాత అతని శరీరం అందరిలాగే ప్రకృతినుండి ఆక్సిజెన్ తీసుకుంటుంది.అలాగే అంతటా వ్యాపించి ఉన్న దైవాత్వాన్ని అర్ధం చేసుకోలేని సాధారణ మానవులకు కొద్ది ప్రదేశంలోనే దైవత్వాన్ని చూపించగల పరమపవిత్ర ప్రదేశం దేవాలయం.దేవాలయ సందర్శన ద్వారా మొత్తం విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ తత్వాన్ని అర్ధం చేసుకోగలిగిన శక్తి లభిస్తుంది.

ఆలయమంటే లయమవడం,లీనమవడం,తాదాత్మ్యం చెందడమని అర్ధం.మనం పూజలు,భజనలు,జపధ్యానాలు చేసినప్పుడు ఎక్కడ మన మనసు పూర్తిగా దైవభావనలో,దైవంలో లీనమవుతుందో,లయమవుతుందో ఆ ప్రదేశమే దేవాలయం.ఏ ప్రదేశానికి వెళ్ళడం వలన మనలో ఉన్న దైవం గురించి మనకు అవగాహన వస్తుందో అదే దేవాలయం.

ఆలయం అఖిల జగత్తునకు సంకేతమైతే,అందులో ప్రతిష్టితమైన దైవం అనంతశక్తికి ప్రతీక.ఆ శక్తిని ఆరాధించడం ద్వారా మన ఆత్మశక్తి జాగృతమవుతుంది.కామక్రోధ లోభ మొహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలను పారద్రోలే వైద్యాలయం మన దేవాలయం.దేవాలయం,మన అంతరాత్మ ప్రతిబింబాన్ని మనకు చూపే ఒక అద్దం.అందువల్లే శ్రీ రామానుజులు ఆలయం మన ఆధ్యాత్మిక పురోగతికి ఆలంబనమని సూచించారు.

సాధారణంగా మనకు దేవాలయం అనగానే గుర్తుకువచ్చేది విమానం/గోపురం.అవి పిరమిడ్ ఆకారంలోనే ఎందుకుంటాయి? అని మనలో చాలా మందికి సందేహం కలుగుతుంది.మాములుగా ఉండచ్చు కదా కూడా అనిపిస్తుంది.అసలు ఆలయ విమానం నిర్మాణం అలా ఎందుకుంటుంది?

ఆలయవిమానం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది.కాకపోతే ఆ విమానం మీద రకరకాల శిల్పాలను,దేవతావిగ్రహాలను చెక్కబడి ఉంటాయి కనుక మనం అంతగా అది గమనించం.పిరమిడ్ అంటే "మధ్యలో అగ్ని" అని అర్ధం.ఏ ఆకారాన్ని ఆధారంగా/కేంద్రస్థానంగా చేసుకుని శక్తి ప్రసారమవుతుందో అదే పిరమిడ్.ఈజిప్షియన్(egyptian) భాషలో పిరమిడ్ అంటే దివ్యప్రకాశం అని అర్ధం.ఈ పిరమిడ్ కి ఉన్న శక్తి శాస్త్రవేత్తలకు కూడా అర్ధం అవ్వక,దానిని ఆశ్చర్యజనకము,సర్వాతీతము,వివరించడానికి సాధ్యం కానిది" అని వర్ణించారు.

1931లో బ్రిటిష్ శాస్త్రవేత్తల బృందం పిరమిడ్లపై పరిశోధన జరిపింది.రెండూ వేర్వేరు పాత్రలలో అప్పుడే పితికిన పాలు సమానపరిమాణంలో నింపి ఒకదాన్ని గదిలో,ఇంకొకద్నిని పిరమిడ్ కిందా ఉంచారు.

6 రోజుల తరువాత ఈ రెండుపాత్రలను పరిశీలించినప్పుడు,పిరమిడ్ పాత్రలో ఉన్న పాలువిరిగిపోయి "పాలవిరుగు"గాను,నీరుగాను రెండుపొరలుగా విడిపోయాయి.గదిలో ఉంచిన పాలు ఇంత స్పష్టమైన పొరలుగా విడిపోలేదు.అంతేకాదు గదిలో ఉంచిన పాలమీద ఫంగస్ ఏర్పడింది.మరొకరోజు పాలను అలాగే ఉంచారు.పిరమిడ్ బయటున్న పాలపై మరింత ఫంగస్ ఏర్పడింది.పిరమిడ్ లో ఉంచిన పాలపై ఎలాంటి ఫంగస్ లేదు.ఆ పాలను 6వారాలపాటు అలానే ఉంచారు.తెల్లవారితే విరిగిపోయే పాలు,పిరమిడ్ లో అన్నిరోజులు ఉంచినా ఏమాత్రం చెడిపోలేదు.తరువాత అది తోడుకొని రుచికరమైన పెరుగుగా మారడం చూసి పరిశోధకులు ఆశ్చర్యపోయారు.

ఈ విషయం గమనించిన ఇటలి,ఫ్రాన్స్ కు చెందిన పరిశోధకులు ద్రవపదార్ధాలపై(liquids) పిరమిడ్ కున్న శక్తిని విసృతంగా వివరించి,వాటికి అమోఘమైన శక్తి ఉండడం నిజమేనని తెలిపారు.కాఫీ,పళ్ళరసాలు వంటివి దీర్ఘకాలం పిరమిడ్ల క్రింద నిలువ ఉంచడం వలన వాటి రుచి గణనీయంగా పెరుగుతుందని షికార్డి శాస్త్రవేత్త తేల్చిచేప్పారు.

ఇంత గొప్పశక్తి కలిగినవి పిరమిడ్లు,మన ఆలయవిమానాలు..భారతీయులు పిరమిడ్లను చూసి ఆలయవిమానాలను ఆ ఆకారంలో కట్టారనుకుంటే మీరు పొరబడినట్టే.పిరమిడ్ల నిర్మాణానికి ప్రేరేపణ చేసినవి సనాతన భారతీయ సంప్రదాయంలో ముఖ్యస్థానం సంపాదించుకున్న "నిత్యాగ్నిహోత్రం".మరొకటి "శ్రీ చక్రం".ఇప్పటికే అగ్నిహోత్రం మీద పరిశోధనలు జరిగి దాని గొప్పతానాన్ని "ఆధునిక సైన్సు" కూడా అంగీకరించింది."శ్రీ చక్రం" మీద ఎప్పటినుంచో అనేకానేక పరిశోధనలు జరుగుతూనేవున్నాయి."శ్రీ చక్రం" నిర్మాణం చాలా కష్టతరమైనదని,దాని నిర్మాణాన్ని ఆధారంగా చేసుకునే పిరమిడ్ల నిర్మాణం జరిగిందని విదేశిశాస్త్రవేత్తలే దృవికరించారు.మన ముందు ఒక పాత్రలో నీటిని నింపి,"ఓం"కారం ఉచ్చరించడం చేత ఆ నీటిలో ఉన్న పరమాణువులు శ్రీచక్రం ఆకారం సంతరించుకుంటాయని,ఆ నీటికి అమోఘమైన శక్తి లభిస్తుందని tonoscope సహాయంతో జపాన్ కు సంబంధించిన మసరు ఏమొటొ అనే ప్రొఫెస్సర్ నిరూపించారు.


పిరమిడ్ల క్రింద ఉంచిన నీటిలో ప్రాణవాయువు అధికంగా నిలువుంటుందని టెన్నిహాల్ అనే శాస్త్రవేత్త నిరూపించారు. కాల్పులు, కత్తిగాట్లు, పుండ్లు మొదలగువాటిని పిరమిడ్ నీటితో శుభ్రపరచడం వలన అవి త్వరగా మానిపోతాయని,నిత్యం ఉదయం ఒక గ్లాసు పిరమిడ్ నీరు త్రాగితే జీర్ణకోశరోగాలు నయమవుతాయని,ఈ నీటితీ ముఖం కడుక్కుంటే ముఖవర్చస్సు గణనీయంగా పెరుగుతుందని,ఈ నీటితో తలస్నానం చేస్తే చుండ్రు పూర్తిగా పోతుందని వేర్వేరు పరిశోధనలలో నిరూపించబడింది.అంతేకాదు,అలసిపోయిన కళ్ళను ఈ నీటితో కడిగితే కంటి అలసట త్వరగా,సులభంగా పొతుంది.పిరమిడ్ నీటితో తయారైన వంటకాలు చాలా రుచిగా ఉన్నట్లు,ఆక్వేరియంలో పిరమిడ్ నీరు పోస్తే చేపలు హుషారుగా ఎక్కువకాలం జీవించాయని,ఇదే నీటిని మొక్కలకు పోస్తే మరణించే మొక్కలు కూడా తిరిగి పచ్చగా మారుతాయని,సాధారణ నీటికన్నా ఈ నీరు పోయడం వలన మొక్కలు త్వరగా పెరుగుతాయని,ప్రోస్టేట్ గ్రంధివాపుతో బాధపడేవారు 3 నెలలు ఈ నీరు విడువకుండా త్రాగితే సర్జరి అవసరంలేకుండానే తగ్గిపోయినట్ట్లు,పిరమిడ్ నీటిని పుక్కిలించడం వలన దంత సంబంధమైన సమస్యలు పూర్తిగా తొలగిపోయయని,ఈ నీటితో నిత్యం స్నానం చేసేవారికి చర్మరోగాల నివారణ జరిగి చర్మం కాంతివంతమైనట్ట్లుగా వివిధ దేశాల శాస్త్రవేత్తల పరిశోధనలలో తేలింది.పదును తగ్గిన బ్లేడ్లను పిరమిడ్ల క్రింద ఉంచితే అవి తిరిగి పదునుగా మారడం చూసి శాస్త్రవేత్తలే విస్తుపోయారు.ఇది గమనించిన అమెరికా వారి గోదాములను,గిడ్డింగ్లను పిరమిడ్ ఆకారం ఉండేలా నిర్మాణం చేశుకున్నారు.అందువల్ల వారి ధాన్యాలు త్వరగా పాడుకావు.

అంతటిగొప్ప శక్తి పిరమిడ్లకు ఉందికనుకనే మన దేవాలయ విమానాలు పిరమిడ్లను,గుమ్మటాలను పోలిన ఆకారాలలో నిర్మాణం చేస్తాం.ఆగమశాస్త్రం కూడా ఇటువంటి ఆకరంలోనే నిర్మించమని చేబుతోంది.అందువల్లే మనం ఆలయంలో తీసుకునే తీర్ధానికి అంత శక్తి.పిరమిడ్ల క్రింద ఒక గంట పాటు ధ్యానం చేస్తే ఒక మనిషికి 24 గంటలపాటు పనిచేయలగల శక్తి లభిస్తుంది.అనువల్లే ఆలయానికి వెళ్ళినప్పుడు కాసేపైన ప్రశాంతంగా ధ్యానంలో కూర్చుని రమ్మంటారు.ఇంతగొప్ప శక్తి మన ఆలయగోపురాలకు,విమానాలకు ఉంది.

కాకపోతే మనకు ఈజిప్ట్ వారికి తేడా ఏమిటంటే వారు పిరమిడ్ల క్రింద శవాలను దాచిపెడితే,మనం మాత్రం విశ్వశాంతి కోసం,విశ్వాంతరాత్ముడు,సర్వవ్యాపి,నిర్వికారుడు,సత్చిందానందుడు అయిన పరమాత్మను ప్రతిష్టించి పూజించి తరిస్తున్నాం.

గుడి అనగానే మనకు గుర్తుకువచ్చేది ముందుగా గోపురమే.గోపురం విశిష్టత ఏమిటి?
ఆగమ శాస్త్రానుసారం ఆలయ నిర్మాణం దేవుడు పడుకున్నట్లు శయనరీతిలో నిర్మిస్తారు.గర్భగుడి భగవంతుని శిరసు,ఆలయ మంటపం భగవంతుని కడుపు,ఆలయ గోపురం దేవుడి పాదాలు.దైవ దర్శనం అంటే గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి,స్వామిని చూసి గంటకొట్టి నమస్కరిస్తాం.కాని ముసలివాళ్ళూ,రోగులు,నిత్య జీవితంలోని అనేక కార్యక్రమాల వల్ల గుడికి వెళ్ళలేనివారు(వెళ్ళే అవకాశం లేనివారు),తామున్న ప్రాంతం నుంచే దూరంగా,ఎత్తుగా కనిపిస్తున్న గోపురానికి నమస్కరిస్తే ఆలయంలో ఉన్న స్వామిపాదాలకు నమస్కరినట్టేనని శాస్త్రం తెలియజేస్తోంది.

పూర్వాకాలంలో ఈరోజు ఉన్నట్టుగా హోటల్ సౌకర్యాలు లేవు.ఇతర దేశాలు,రాజ్యాలు,ప్రదేశాల నుండి వచ్చిన బాటసారులకు దేవాలయం ఎక్కడ ఉందో తెలుసుకోవటానికి గోపురాలు ఎత్తుగా కట్టారు.అంతేకాదు,ఆ కాలంలో దేవాలయాల్లో నిత్యం అన్నదానం జరిగేది.వైద్య సదుపాయాలు కూడా దేవాలయంలో ఉండేవి.అందువల్ల క్రొత్తగా వచ్చిన వారు ఆకలితో ఆహారం కోసం వెత్తుక్కునే పరిస్థితి నేరుగా దేవలయాలకే వెళ్ళి,అక్కడ ప్రసాదం స్వీకరించేవారు,సేద తీరేవారు.వారికి మార్గ నిర్దేశకాలు గోపురాలే కదా.

దేవుడు సర్వోన్నతుడు(అందరికంటే ఉన్నతమైన వాడు/గొప్పవాడు).ఈ విషయాన్ని మరిచిపోయిన మనిషి తానే గొప్పవాడినని,అంతా తనవల్లే జరుగుతోందని,తాన కంటే గొప్పవారేవరూ లేరని అహంకారంతో విర్రవీగుతాడు.అది భ్రమ మాత్రమే,అందరికంటే భగవంతుడే సర్వోన్నతుడు అన్న భావం అందరిలో కలగడానికి,మనసుకి భోధపడటానికి దేవాలయ గోపురాన్ని ఎత్తుగా నిర్మిస్తారు.

గోపురం అంటే పిరమిడ్ ఆకారం(గత భాగాల్లో పిరమిడ్ ఆకారాల గొప్పతనం,వాటి అతీతమైన శక్తిని గురించి చెప్పుకున్నాం).పిరమిడ్ ఆకారాలు మాత్రమే కొన్ని వందల,వేల సంవత్సరాలు స్థిరంగా ఉంటాయి కనుక వాటిని పిరమిడ్ ఆకారంలో నిర్మిస్తారు.అంతేకాదు గోపురం ఈ బ్రహ్మాండంలో ఉన్న అనంతమైన విశ్వశక్తిని ఆకర్షిస్తుంది.కొన్ని వందల,వేల సంవత్సరాల వరకు గోపురాలు శక్తిని గ్రహించి,నిలువ ఉంచుకునే శక్తి కేంద్రాలు.అంతేకాదు మొత్తం దేవాలయానికి అది దివ్యశక్తులను నిత్య అందిస్తూ ఉంటుంది.కనీసంలో కనీసం 500 సంవత్సారాల పాటు ఒక గోపురం అనేక దివ్యశక్తులను దేవాలయానికి అందిస్తుంది.అంటే గోపురం కూడా ఒక అమోఘ శక్తి కేంద్రం.అందుకే దేవాలయానికి వెళ్ళవలసిన రీతిలో వెళ్తే కనుక,ఆలయగోపురం క్రింది నుంచి వెళ్తున్న సమయంలో మనలో తెలియని ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది.

ఒక గోపురం ఎత్తు ఆ ఆలయమూలవిరాట్టు(ఆలయ ప్రధాన దైవ విగ్రహం) ఎత్తుని బట్టి నిర్ణయిస్తారు.గాలి గోపురాలు ఉన్న ఆలయాలకు విశేషమైన కీర్తి ప్రతిష్టలు ఉంటాయని ధార్మిక గ్రంధాలు తెలియజేస్తున్నాయి.

ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు పడిన సమయంలో అక్కడున్న నిర్మాణాలకు,ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకూండా,పడుగు పాటును గ్రహించి,ఆ విద్యుత్ శక్తిని భూమిలోనికి పంపించేస్తాయి గోపురాలు.అంతేకాదు అవి గ్రహించిన దివ్యశక్తులను ఆలయంలో ఉన్న మూలమూర్తికి నిత్యం అందిస్తుంటాయి గోపురాలు.

చారిత్రికంగా చెప్పుకోవలసి వస్తే అలనాటి శిల్పకళ చాతుర్యానికి,వైభవానికి ప్రతీకలు మన ఆలయ గోపురాలు.కాని ఈ రోజు అనేక గోపురాలు కూలిపోతున్నాయి,శిధిలమవుతున్నాయి,పాడుతున్నాయి,పిచ్చిమొక్కలు మొలిచి వాటికి అందాన్ని కోల్పోతున్నాయి.ఏన్నో వందల సంవత్సరాల మన చారిత్రిక వారసత్వ సంపద గోపురాలు.మనం ఈ రోజు ఏదినా ఒక నిర్మాణం చేస్తే అది ఎన్ని సంవత్సరాలు ఉంటుంది?ఏన్నో సంవత్సరాల క్రితం,సిమెంట్ లేనికాలంలో రాయిమీద రాయిని పెట్టి,కొన్ని వందల సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా పదిలంగా ఉండేలా నిర్మాణం చేశారు మన పూర్వీకులు.మనమేలాగో అంత గొప్ప నిర్మాణాలు చేయలేము.కనీసం ఉన్నవాటినైన కాపాడుకుందాం.

ఎక్కడైన గోపురం కూలిందంటే అక్కడ కూలింది గోపురం మాత్రమే కాదు.మన వారసత్వ సంపద,మన పూర్వీకుల శ్రమ.ఇకనైన మన గోపురాలను,దేవాలయాలను కాపాడుకుందాం. 

ఆలయ ప్రవేశంలో గోపురం దాటగానే,మనకు కనిపించేది ధ్వజస్థంభం.ధ్వజస్థంభం ప్రాముఖ్యత ఏమిటి?

ధ్వజస్థభం భూలోకానికి,స్వర్గలోకానికి మధ్య వారధి.అంతరిక్షంలో ఉన్న దైవ శక్తులను దేవాలయంలోనికి ఆహ్వానిస్తుంది.అనతమైన విశ్వంలో ఉండే దివ్యశక్తులను,కాస్మిక్ కిరణాలను దేవాలయంలోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతుంది.ధ్వజస్తంభానికి పైన ఉండే గంటలు కూడా పాజిటివ్ ఎనర్జిని ఆకర్షిస్తాయి.

ధ్వజస్థభం ఆలయ నిర్మాణాన్ని పిడుగుపాటు నుండీ రక్షిస్తుంది.అది ఆలయంకంటే ఎత్తులో ఉండడం వలన అది విద్యుత్ శక్తిని గ్రహించి,భూమిలోకి పంపించివేసి,ఆలయాన్ని కాపాడుతుంది.

ధ్వజస్థభం ప్రతిష్ట ముందు దానిక్రింద పంచలోహాలు(బంగారం,వెండి,ఇత్తడి,రాగి,కంచు)ను వేస్తారు.అవి భూమిలోపల ఉన్న విద్యుత్ అయస్కాంత శక్తి(electro-magnetic energy)ని గ్రహిస్తాయి.అందుకే ధ్వజస్థభం వద్ద విద్యుత్ అయస్కాంత్ క్షేత్రం(electro-magnetic energy) ఏర్పడుతుంది.అంతేకాదు ద్వజస్థభానికి వేసే పంచలోహ్ల తొడుగు కూడా విద్యుత్ అయస్కాంత్ శక్తిని గ్రహించి ఈ క్రింద ఏర్పడిన విద్యుత్ ఆయస్కాంత్ క్షేత్రానికి మరింత శక్తిని చేకూరుస్తుంది.దాని దగ్గరకు వెళ్ళి నమస్కరించడం వలన మన శరీరానికి కావలసిన శక్తి అందుతుంది.ధ్వజస్థంభం వద్ద ఉండే బలిపీఠం ఈ విద్యుత్ అయస్కాంత శక్తిని అత్యధికంగా నిలువ ఉంచుకునే ప్రదేశం.

ధ్వజం అంటే జెండా.బ్రహ్మోత్సావాల సమయంలో ధ్వజారోహణం పేరున ధ్వజస్థంబానికి జెండాను ఎగిరేస్తారు.దీనికి ఎగురేసిన జెండా దేవలోకంలో ఉన్న సమస్త దేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తుంది.

ధ్వజస్తంభం అడుగుభాగంలో శివుడు,మధ్యభాగంలో బ్రహ్మ,పై భాగంలో శ్రీ మహావిష్ణువు కోలువై ఉంటారు.విశ్వాసం శ్వాస కంటే గొప్పది.వేదం పరమాత్ముడి శ్వాస.నాలుగు వేదాలకు ప్రతీక ఆ నిలువెత్తు ద్వజస్థంభం.

మనం దేవాలయంలోనికి ప్రవేశించే ముందే ఆలయం బయట మనలో ఉన్న చెడు భావనలను,ఒత్తిళ్ళను విడిచిపెట్టి ప్రవేశిస్తాం.ధ్వజస్థంభం దగ్గరకు రాగానే,మనలో మిగిలి ఉన్న చెడు భావనలను,అహకారాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి.

ధ్వజము అంటే మరొక అర్ధం పతాకం అని.మనిషికి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు,అతనికి అత్యున్నతమైన ఆలోచనలు కలుగుతాయి.అవి అతనిని పతాక స్థాయికి తీసుకువెళతాయని,అతను జీవితంలో అత్యున్నతస్థాయిలో నిలబడతాడని గుర్తుచేస్తుంది ధ్వజస్థంభం.

ఇంత ప్రాముఖ్యం ఉన్న ద్వజస్థంభానికి ఏదో ఒక చెట్టు మాను తీసువచ్చి పెట్టరు.ఆగమశాస్త్రం ప్రకారం ధ్వజస్థంభానికి వాడే మానుకు కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి.ఆ మానుకు ఎలాంటి తొర్రలు ఉండకూడదు.కొమ్మలు ఉండకూడదు.ఎలాంటి పగుళ్ళుఉండకూడదు.ఏ మాత్రం వంకరగా ఉండకూడదు.సుమారు 50 అడుగులకంటే ఎత్తు ఉండాలి.ఇలాంటి మానునే ధ్వజస్థంభానికి ఉపయోగించాలి అని ఆగమశాస్త్రం చెబుతోంది.

మనకు దేవాలయంలో ఉండే విగ్రహాలును చాలా మంది బొమంలంటారు. సంస్కృతంలో విగ్రహానికి అర్ధం విశేషంగా శక్తిని గ్రహించేది అని.ఆలయంలో ఉన్న విగ్రహం క్రింద యంత్రం పెడతారు. మంత్రం ప్రకృతిలో కలిగించే తరంగాల ఆకారం యొక్క సాకార రూపమే యంత్రం. అటువంటి రాగి యంత్రాన్ని విగ్రహం క్రింది భాగంలో పెట్టి దాని మీద విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. క్రింద పంచలోహాలు వేస్తారు. పంచలోహాలు,రాగి యంత్రం భూమిలో ఉన్న విద్యుతయస్కాంత శక్తిని ఆకర్షిస్తుంది. పైన పిరమిడ్ ఆకారంలో ఉన్న గోపురం/ విమానం కూడా శక్తిని గ్రహిస్తుంది. ఈ రెండు శక్తులను కూడా విగ్రహం గ్రహిస్తుంది.

ఒక ముఖ్యమైన విషయం. చాలామంది అవి శిలలు మాత్రమే అనుకుంటారు. కాని మన దేవాలయాల్లో ఉన్నవి శిలలు కాదు. హిందువులు రాళ్ళకు పూజలు చేయటంలేదు. ఆ విగ్రహాన్ని వేదమంత్రాలు చదువుతూ వడ్లు, ధాన్యం, పాలు, పెరుగు, గోధుమలు............... ఇలా మన ప్రాణానికి ఆధారమైన ప్రాణశక్తి కలిగిన వస్తువుల మధ్యలో పెడతారు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి విగ్రహ ప్రతిష్ట చేసే సమయంలో తంత్రశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ఆ విగ్రహానికి ప్రాణం పోస్తారు. అదే ప్రాణప్రతిష్ట. అప్పటినుంచి అది విగ్రహం కాదు. దానిలోనికి మహామహిమాన్వితమైన దైవశక్తి వస్తుంది. ఆ సమయం నుంచి ఆ విగ్రహం మన మాటలు వింటుంది, తన కళ్ళోతొ జరిగేవన్ని చూస్తుంది. మనం చెప్పుకునే కష్టాల్లన్నీ కూడా ఆ విగ్రహంలో ఉన్న దైవానికి వినిపిస్తాయి. అక్కడ శక్తి ఉందికనుకే దేవాలయంలో దేవునికి నిత్యం ధూపదీపనైవెధ్యాలు పెడతారు. ఏ ఊరిలో అయితే దేవాలయం మూతపడుతుందో, ఎక్కడైతే గుడిలో దేవునకు నిత్యం నైవెధ్యం ఉండడో ఆ ఊరి కరువుకాటకాలతో, రోగాలతో, మరణాలతో అల్లాడుతుంది.

చాలామంది విగ్రహారాధన తప్పంటారు. అంతటా భగవంతుడున్నాదు, ఆయనకు రూపం లేదు.......... ఇల రకరకాలుగా అంటారు. అది నిజమే భగవంతుడు అంతటా ఉన్నాడు. ఆయనకు రూపం లేదు, ఎందుకంటే అన్ని రూపాలు ఆయనవే. అన్ని తానై ఉన్నాడు. రాయిలోనూ ఉన్నాడు, పక్షిలోనూ ఉన్నాడు, చెట్టు, పుట్ట, మనిషి, నది, అలా సర్వవ్యాపిగా ఉన్నాడు. కాని ఇది అందరు అర్ధం చేసుకోవడం కష్టం. అందరికి భగవంతుడిని అంతట చూసేంత జ్ఞానం ఉండదు. మరి కష్టాలు వస్తే ఎల చెప్పుకుంటారు? తమ భాధను ఎలా పంచుకుంటారు? తమకు భయం వేసినప్పుడు ఏ రూపాన్ని స్మరిస్తారు? ఆధ్యాత్మిక జ్ఞానం అంతగా లేనివారు తమకు వచ్చిన భాధను పంచుకోవడం కోసం పరమాత్మ ఒక విగ్రహంగా దర్శనమిస్తున్నాడు. వారికి భాధ కలగగానే తమకంటూ ఒకడున్నాడన్న భావంతో వెళ్ళి తమ భాధను పరమాత్మతో పంచుకుంటున్నారు. రామకృష్ణ పరమహంస కూడా విగ్రహారాధన తప్పకాదు, మొదట సగుణారాధాన చేస్తుంటే కాలక్రమంలో భగవత్తత్వం అర్దం అవుతుందంటారు. విగ్రహాల్లో మాత్రమే దేవుడు లేడు, అంతటా ఉన్నవాడు విగ్రహాల్లో కూడా ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. 

దేవాలయాలు పవిత్రమైన స్థలాలు. మన దేవాలయానికి వెళ్ళగానే, ఆలయ ప్రవేశానికి ముందు ప్రదక్షిణం చేస్తాం. అసలు ప్రదక్షిణం అంటే ఏమిటి?

 ప్రదక్షిణం పదంలో ప్రతి అక్షరానికున్న గొప్పతనం తెలుసుకుందాం.'ప్ర ' అనే అక్షరం సకలపాపవినాశనానికి సూచకం. ' ద ' అనే అక్షరానికి అర్ధం కోరికలన్నీ తీరడం. 'క్షి ' అంటే రాబోవు జన్మలఫలం. 'ణ ' అంటే అజ్ఞానం నుండి విముక్తిని ప్రసాదిస్తుంది.

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ............ అంటూ ప్రదక్షిణం చేస్తాం, అంటే అనేక జన్మల నుండి నేను చేసిన పాపాలన్ని ఈ ప్రదక్షిణలు చేయడం వలన నశించిపోవాలి. పాపపు పనులు చేసి ఉండచ్చు, అనేక జన్మల పాపం వల్లే ఈ కష్టతరమైన జీవితం గడుపుతున్నాను, నాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు పరమాత్మ. నా మీద కారుణ్యంతో నన్ను రక్షించు అని అర్దం.

యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
................................
..............................
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష జనార్దన

 అంటూ ప్రదక్షిణం చేస్తాం, అంటే అనేక జన్మల నుండి నేను చేసిన పాపాలన్ని ఈ ప్రదక్షిణలు చేయడం వలన నశించిపోవాలి. పాపపు పనులు చేసి ఉండచ్చు, అనేక జన్మల పాపం వల్లే ఈ కష్టతరమైన జీవితం గడుపుతున్నాను, భవిష్యత్తులో కూడా పాపం చేసే అవకాశం ఉంది. నాకు నీవు తప్ప వేరే దిక్కే లేదు పరమాత్మ. ఓ జనార్దన! నా మీద కారుణ్యంతో నన్ను రక్షించు అని అర్దం.

ప్రదక్షిణం చేయడం అంటే " ఓ భగవంతుడా! నేను అని వైపుల నుండి నిన్నే అనుసరిస్తున్నాను. నా జీవితం అంతా నీవు చెప్పిన మార్గంలోనే నడిపిస్తాను, నీవు చెప్పినట్టే జీవిస్తాను " అని పరమాత్మకు చెప్పడం.

 ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ చుట్టూ మనం తిరిగే అవకాశమే లేదు. అటువంటి పరమాత్మ మనలో ఆత్మస్వరూపంగా ఉన్నాడు, మనలో ఉన్న పరమాత్మను గురించి తెలుసుకోవాలంటే, బాహ్యవిషయాలను పక్కనబెట్టి, మన గురించి మనం విచారించాలని గుర్తుచేసేది, మనల్ని మన ఆత్మతత్వం చుట్టు తిప్పెది ఈ ప్రదక్షిణం.

ప్రదక్షిణం గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.

దేవాలయంలో విగ్రహప్రతిష్ట చేసే సమయంలో విగ్రహం క్రింద పంచలోహాలు వేస్తారు. అలాగే ద్వజస్థభం క్రింద కూడా పంచలోహాలు వేస్తారు. ఇవి భూమిలో ఉన్న విద్యుతయస్కాంత్ శక్తిని ఆకర్షిస్తాయి. సైన్సు ఏమి చెబుతోందంటే? Nulei/ Nucleus చుట్టూ Electrons వృతాకారంలో తిరుగుతుంటాయి. అక్కడ ఒక విద్యుతయస్కాంత్ క్షేత్రం ఏర్పడుతుంది. వీటికి దగ్గరలో కూడా ఇదే విధమైన ప్రక్రియ( Nucleus/ Nulei చుట్టు Electrons తిరగడం) జరుగుతుంటే, ఇవి పరస్పరం ఆకర్షణకు గురవుతాయి. వాటి మధ్య మరింత బలమైన బంధం ఏర్పడి, అక్కడ ఉన్న Electrons అన్నీ కూడా వృత్తాకారంలో అంటే కుడి నుంచి ఎడమకు తిరగడం వలన అక్కడ ఒక విద్యుతయస్కాంత్ క్షేత్రం ఏర్పడుతుంది.

దేవాలయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆలయంలో ఉన్న మూలవిరాట్టు(ప్రధాన విగ్రహం), ఆయన వాహనం, ద్వజస్థభం మధ్య ఒక శక్తివంతమైన శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. మనం కూడా కుడి నుండి ఎడమకు దైవం చుట్టూ తిరిగితే,మన శరీరంలోనికి ఆ విద్యుతయస్కాంత్ శక్తి ప్రవేశిస్తుంది. అందుకే ప్రదక్షిణంలో మనం కుడి నుండి ఎడమకు తిరుగుతాం. అంటే మన కుడి చేయి వైపు దైవం ఉండేలా చూసుకోవాలి. ఇది ప్రదక్షిణంలో ఉన్న అంతరార్ధం. 

అసలు ప్రదక్షిణ ఏలా చేస్తే మన శరీరానికి శక్తి అందుతుంది? ప్రక్షిణం ఎలా చేయాలని శాస్త్రం చెప్తోంది?

ముందు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కుని, ద్వజస్థంభం దగ్గర నమస్కరించి మొదలుపెట్టాలి. ఎలా పడితే అలా వేగంగా తిరగడం కాదు, పచ్చికుండలో నిండుగా నూనె నింపుకుని, ఒక 9 నెలల గర్భిణీ స్త్రీ ఆ పచ్చి కుండను ఎత్తుకుని, ఆ నూనె క్రింద పడకుండా ఎంత జాగ్రత్తగా, మెల్లగా నడుస్తుందో, అంతే మెల్లగా, నెమ్మదిగా ప్రదక్షిణం చేయాలని శాస్త్రం చెప్తోంది. అలా చేస్తేనే దేవాలయంలో ఏర్పడే విద్యుతయస్కాంత్ క్షేత్రం యొక్క శక్తి మనకు అందుతుంది. రోజూ వేగంగా 100 ప్రదక్షిణలు చేయడం కంటే శాస్త్రానుసారం 3 ప్రదక్షిణలు చేయండి చాలు.

ప్రదక్షిణలు చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. వినాయకుడు తన తల్లిదండ్రులైన శివపార్వతుల చూట్టు ప్రదక్షిణ చేసి గణాధిపత్యాన్ని పొంది, గణాధిపతి అయ్యాడు. గౌతమ మహర్షి గోవు చూట్టు ప్రదక్షిణ చేసి బ్రహ్మమానస పుత్రిక, మహా సౌందర్యవతి అయిన అహల్యను భార్యగా పొందాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా విశేషాలుంటాయి.

అయితే ప్రదక్షిణ వలన కలిగే ఫలితాలను సంపూర్ణంగా పొందాలంటే శ్రద్ధతో చేయాలి. ఫోన్ మాట్లాడుతూనో, పాటలు వింటునో,లేక ఏదో పందెంలో పరిగెత్తినట్టు పరుగులు తీస్తేనో, ప్రక్క వాళ్ళతో మాట్లడుతూనో, ప్రదక్షినలు చేస్తే ఒరిగేదేమి లేదు.

ప్రదక్షిన సమయంలో, మనం ఏ దైవం చూట్టు ప్రదక్షిణం చేస్తామో, ఆ దైవానికి సంబంధించిన శ్లోకాలనో, కీర్తనలనో, మంత్రాలనో పఠిస్తూ ప్రదక్షిణ చేయాలి. ఉదాహరణకు, శ్రీ వేంకటేశ్వర స్వామి చూట్టూ ప్రదక్షిణం చేస్తుంటే, "ఓం నమో వేంకటేశాయ " అనే నామన్ని ఉచ్చరించాలి. ఒకవేళ మనకు కీర్తనలు, పాటలు, మంత్రాలు ఏవి తెలియవనుకోండి, అప్పుడు "ఓం " కారాన్ని ఉచ్ఛరిస్తూ ప్రదక్షిణం చేయండి.

ఓంకారం చాలా శక్తివంతమైంది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని దృవీకరించాయి. ఒక జెర్మన్ శాస్త్రవేత్త ఓంకారం మీద పరిశోధన చేసి, ఓం కారాన్ని కనుక గదిలో కూర్చుని, ఒక విధమైన స్వరంతో కనుక ఉచ్ఛరిస్తే, అక్కడ పుట్టే తరంగాలు, శక్తికి ఆ గది గోడలు బద్దలయిపోతాయని చెప్పారు.

ॐ ప్రదక్షిణం నిర్మలమైన మనసుతో చేయాలి. అలా చేయడం వలన మనకు మంచిమంచి ఆలోచనలు వస్తాయి. జీవితంలో మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటాం. 

No comments:

Post a Comment