Tuesday 18 December 2012

21 డిసెంబరు 2012 యుగాంతమా?

21 డిసెంబరు 2012 యుగాంతమా?

ప్రస్తుతం ఎక్కడ చూసినా,ఏ నోట విన్నా ఒకటే మాట.ప్రతి టి.వి.చానేల్ లోనూ ఒకటే చర్చ.అదే 2012 డిసెంబరు 21 న ప్రళయం సంభవిస్తుందా?మయా క్యాలెండరు ఇదే చెబుతోందా?

"మయా" నాగరికతలో ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞులు రెండు రకాల క్యాలెండరలు తయారుచేసి ఉపయోగించారు.రోజుల వివరాలే కాకుండా సృష్టిలో కలిగే ప్రతి మార్పును గమనించే విధంగా వీటిని రూపొందించారు."మయా"ప్రజలు కాలపరిమితిని "సూర్యులు"గా పిలిచేవారు.

మయా నాగరికత తయారుచేసిన ప్రముఖమైన క్యాలెండరు "జోల్కిన్".మతపరమైన ఉత్సవములౌ,పండుగలు ఎప్పుడు వస్తాయి?ఏఏ సమయాల్లో వస్తాయి?వంటివి అనేకం చేప్పే ఈ క్యాలెండారు "గణిత శాస్త్రం"ఆధారంగా నిర్మించరాని ఆయ్ పురావస్తు శాఖ అధికారుల పరిశోధనలో తేలింది.

ఇక రెండవది "హాబ్"అనే క్యాలెండరు.18 నెలల దీనిలో ఉంటాయి.వాటికి వ్యవసాయకార్యకలాపాల పేర్లు పెట్టారు.ఇది డిసెంబరు 21వ తేదీన ప్రారంభవుతుంది.

ప్రపంచం మాట్లాడేది 360 రోజులతో ఉన్న LONG COUNT CALENDAR  క్యాలెండరు గురించి.ఇది మూడవది.ప్రస్తుతం దీని ప్రకారమే 2012 లో ప్రపంచ ప్రళయం వస్తుందని భావిస్తున్నారు.ఈ క్యాలెండరు క్రీస్తుపూర్వం 3114లో మొదలయ్యింది.ఇది ఈ డిసెంబరు 21 తేదీతో ముగుస్తున్నది.394.3 సంవత్సరాల కాలపరిమితిని మయా ప్రజలు ఒక "బక్షన్" అన్నారు.ఈ విధానం క్రీస్తుపూర్వం 3114లో ఆగష్టు 11 వ తేదీన ప్రారంభమైంది.అప్పటినుంచి ప్రతి 394.3 ఏళ్ళకు ఒకసారి చొప్పున ఇది ముగిస్తూవుంది,తిరిగి ప్రారంభమవుతూవుంది.క్రీస్తు శకం 1618 సెప్టెంబరు 18న మొదలైన ఈ 13వ బక్షన్ 2012 డిసెంబరు 21 తో ముగుస్తుండడంతో ఇప్పుడు ప్రళయం సంభవిస్తుందని ప్రచారం జరుగుతోంది.అదంతా అబద్దం.ప్రళయం వస్తుందన్న సంగతి అసలు "మయా"వారికే తేలిదట.వారే ఈ మధ్య ఈ విషయాన్ని ప్రసార మాధ్యమాల్లో చెప్పారు.ఈ 13వ బక్షన్ ముగియగానే 14 బక్షన్ మొదలై 2407 మార్చి 26 తో ముగుస్తుంది.అలా 4772 అక్టోబరు 13 వరకు మనకు సమాచారం అందుబాటులో ఉంది.

(పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ గారి వ్యాసం నుంచి గ్రహించడమైనది).

అందువల్ల 21 డిసెంబరు 21న ప్రళయం వస్తుందన్నది కేవలం కల్పిత ప్రచారమే.డిసెంబరు 20 లాగే 21 వస్తుంది,22 కూడా వస్తుంది,2013 కూడా వస్తుంది.భారత్ ప్రపంచంలో పెద్దశక్తిగా ఎదిగి తీరుతుంది.అలా ఎదగాలని ఆశిద్దాం.

సమస్త సన్మంగళాని భవంతు
సర్వే భధ్రాణి పశ్యంతు
ఓం శాంతిః శాంతిః శాంతిః      

No comments:

Post a Comment