Monday 29 February 2016

రుక్మిణి ఆరుండలె గారికి వందనాలు



భరతముని భరతనాట్యాన్ని అందిస్తే, ఆవిడ మరణిస్తున్న భరతనాట్యానికి ఊపిరిలూదారు. భరతనాట్యాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనురాలు ఆవిడే. ఆవిడ లేకపోతే బహుసా భరతనాట్యం ఉండేదని కూడా హిందువులకు తెలిసి ఉండేది కాదు. ఈరోజు ఆవిడ పుట్టిన రోజు సదర్భంగా గూగుల్ లో ఆవిడకు చెందిన డూడుల్‌ని పెట్టి, ఆవిడకు గౌరవం ప్రకటించింది. ఆవిడ గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఇది చదవాల్సిందే.

వేల ఏళ్ళుగా సనాతనధర్మం దాడులు జరుగుతూనే ఉన్నాయి, జరిగిన ప్రతిసారీ ఎవరో ఒకరు ధర్మరక్షణకు ముందు నిలబడుతూనే ఉన్నారు, ధర్మాన్ని రక్షిస్తూనే ఉన్నారు. వేయి సంవత్సరాలకు పైగా భారతదేశంపై అధికారం చెలాయించిన విదేశీయులను వెళ్ళగొట్టడానికి స్వాతంత్ర పోరాటం ఒక్కటే సరిపోదు, ఈ దేశానికి ఆయువుపట్టు అయిన ధర్మాన్ని జాగృతం చేయడం, ప్రచారం చేయడం, సాంస్కృతిక పునరుజ్జీవనానికి తోడ్పడడం, ధార్మికులలో నూతనోత్సాహం కలిగించడం అతవ్యశకమని ఎందరో మహానుభావులు భావించి ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. స్వామి వివేకానందులు, అరబిందో యోగి, స్వామి దయానందులు మొదలైన అనేకమంది హిందూ గురువులు చేసిందదే. వారి చలువ వల్లనే ఎందరో ప్రభావితమై దేశ స్వాతంత్ర సంగ్రామంలో ప్రాణాలను అర్పించి స్వాతంత్రం తెచ్చారు. ఇదే కోవకు చెందుతారు శ్రీ రుక్మిణి దేవీ ఆరుండలె. 29 ఫిభ్రవరి 1904 లో తమిళనాట మదురైలో జన్మించారు రుక్మిణి ఆరుండలె.

17 వ శతాబ్దం నుంచి భారతీయ సంప్రదాయ నృత్యం మీద క్రైస్తవ మిషనరీలు విషం చిమ్ముతూనే ఉన్నాయి. సంప్రదాయ నృత్యాన్ని నీచమైన కళగా చూపించడం లక్ష్యంగా ప్రచారం సాగించాయి. దేవదాశీ వ్యవస్థపై పోరాటం చేస్తున్నామంటూ దీన్ని లక్ష్యంగా చేసుకునేవారు. దేవాలయానికే తమ జీవితాలను అంకితం చేసి, భగవంతుని ముందు నృతం చేస్తూ జీవితం గడపడమే ఈ వ్యవస్థ యొక్క లక్ష్యం. 10, 11 శతాబ్దాల్లో ఎంతో శాస్త్రీయంగా నడిచిన ఈ వ్యవస్థ దేశంపై ముస్లింలు దండెత్తడంతో నాశనమైంది. మొఘల్ పాలకులు ఈ దేవదాశీలను హింసించి తమ కామాన్ని తీర్చుకునేవారు, వారి జీవితాన్ని ఛిద్రం చేసేవారు. ఫలితంగా కొన్ని శతాబ్దాలకు ఈ వ్యవస్థను వ్యభిచార వ్యవస్థగా మార్చేశారు. ఆంగ్లేయుల రాకతో ఇది మరీ తీవ్రమైంది.

ఇంగీష్ విద్య బాగా తల్లకెక్కించుకున్న భారతీయులు పూర్వపక్షం చేయక, ఆంగ్లేయుల మాటలే వేదవాక్కుగా భావించి ఈ వ్యవస్థ సనాతనధర్మంలోనే ఉందని, ఇది వెనుకబాటు తనానికి కారణమని చెప్పుకోసాగారు. దేవదాశీ వ్యవస్థ రద్దు చేయాలనే  మిషతో సంప్రదాయ భరతనాట్యాన్ని పూర్తిగా అంతం చేయాలని మిషనరీలు భావించాయి. ఆ సందర్భంలో దేవదాశీలు ఆంగ్లేయ ప్రభుత్వానికి భరతనాట్యం యొక్క ఆధ్యాత్మిక పునాదులను, ఔన్నత్యాన్ని వివరిస్తూ అనేక లేఖలు రాశారు. వారి వ్యవస్థను రద్దు చేయడం కంటే చరిత్రలో ఒకనాడు (మొగల్ పాలకులకు పూర్వం) ఉన్న విధంగా దాన్ని ఉద్ధరించమని ప్రార్ధిస్తూ, తమకు విద్యను (ఇంగీష్ విద్య కాదు, సానతన భారతీయ విద్య) అందించమని, భగవద్గీతను, రామాయణాన్ని తమకు బోధించమని, ఆగమాలు, ప్రార్ధనా విధానాలు వివరించమని వేడుకున్నారు. అది దేవదాశీ అమ్మాయిలకు స్పూర్తినిస్తుందని, తద్వారా వారు మైత్రేయి, గార్గి, మణిమేఖల వంటి స్త్రీ ఋషుల వలే తయారవుతారని, వేదాన్ని గానం చేస్తారని చెప్పుకున్నారు. 'మేము మరలా ధార్మ ప్రవచకులం అవుతాం .......... చిన్న వర్గాల పట్ల మీరు ప్రేమ కురిపిస్తారు. మేము మా ధర్మాన్ని పాటించి  మోక్షం పొందేందుకు మీరు మమ్మల్ని అనుమతించండి. మాలోని భక్తిని, జ్ఞానాన్ని వ్యక్తపరిచే అవకాశం ఇవ్వండి, పెరుగుతున్న భౌతికత, ఎన్నో కష్టాలు, ఒడిదుడుకుల మధ్య నలిగిపోతున్న భారతీయ సనాతన ధర్మాన్ని రక్షించి, దాని సందేశాన్ని ప్రపంచానికి తెలియజెప్పే అవకాశాన్ని ఇవ్వండి' అని రాశారు. అయినప్పటికి మిషనరీలు తమ దుష్ప్రచారాన్ని అపలేదు. భరతనాట్యాన్ని అసంబద్ధం, అమానవీయం, ఆటవికంగా ప్రచారం చేశాయి.

క్రైస్తవ విష కోరల నుంచి నాట్యాన్ని రక్షించేందుకు అనేకమంది హిందువులు పాటుపడ్డారు. అటువంటి సమయంలో వచ్చినవారే రుక్మిణి ఆరుండలె. ఈవిడ వచ్చే సమయానికి భరతనాట్యం అంటే వేశ్యలు చేసే నృత్యంగా సమాజంలో ప్రచారం వచ్చింది. అయినప్పటికి తాను భరతనాట్యం నేరుకుని వ్యతిరేక పరిస్థితుల మధ్య బహిరంగ ప్రదర్శన ఇచ్చారు. భరతనాట్యానికున్న ఆధ్యాత్మిక వైభవాన్ని పునరుద్ధరించారు. దాన్ని నాట్య-రూపకంగా మార్చారు. భరతనాట్యం పేరు చెప్తే అసహయించుకునే స్థితిని నుంచి సాధరణ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా ఈ తప్పక నేర్చుకోవలసినదిగా ప్రచారం చేశారు. భరతనాట్యాన్ని రక్షించడం కోసం 1936 లో కాళాక్షేత్రం అనే ఒక నృత్య పాఠశాలను ఏర్పాటు చేశారు. అది చూడటానికి ఆధునిక క్షేత్రంగా కనిపించినా, అందులో గురుకుల విధానాన్ని ప్రవేశపెట్టారు. అక్కడ నేర్చుకునే పిల్లలు శాఖాహారం మాత్రమే తీసుకోవడం, నృత్యం ప్రారంభించే ముందు సంప్రదాయబద్ధంగా గణపతికి వందనం అర్పించడం వంటి నిబంధనలు ఏర్పాటు చేశారు. తాను దివ్యజ్ఞాన సమాజం వారిచే ప్రభావితమైన ఆ కళాక్షేత్రంలో హిందూ సంస్కృతి మూలాలుండి, ధర్మం పట్ల శ్రద్ధా విశ్వాశాలున్న వారినే అందులో విద్యార్ధులుగా స్వీకరించారు. ఈవిడ చేసిన కృషి వల్లనే తమిళనాట ఆధునిక కాలంలో గురుకుల వ్యవస్థ అత్యంత క్రింద స్థాయి వరకు చేరింది. భరతనాట్యం ఒక ఆధ్యాత్మిక కళగా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. కళాక్షేత్రం ఒక విశ్వవిద్యాలయం స్థాయికి చేరింది. ఆవిడ కృషికి గానూ ఆవిడకు 1956 లో పద్మభూషణ్ అవార్డు ఇచ్చి భారతప్రభుత్వం సత్కరించింది.

భరతనాట్యానికి కొత్త ఊపిరిలూదిన శ్రీ రుక్మిణి ఆరుండలె గారికి వందనాలు. కానీ ఆవిడ కళాక్షేత్రంలోకి ప్రవేశించిన ఓ దుష్టశక్తి కళాక్షేత్రాన్ని, భరతనాట్యాన్ని నాశనం చేస్తోంది. సంప్రదాయ నృత్యాన్ని క్రైస్తవంలో విలీనం చేసే యత్నం చేస్తూ కొంతవరకు విజయ సాధించింది. అది మళ్ళీ చెప్పుకుందాం.

http://christianizingbharatanatyam.blogspot.in/

6 comments:

  1. Even though she is a great institution builder, why she married christian george arundale

    ReplyDelete
    Replies
    1. What's wrong in that. She is a theosophist and married another theosophist as per her likes.

      Delete
  2. చాలా బాగుంది, ఎవరా దుష్టశక్తి?
    ఇప్పటిలా కాదు,వివరంగా రాయండి!

    ReplyDelete
    Replies
    1. శివార్పణమండీ, అర్దం చేసుకున్నారు. కొద్దిగా సమయం తీసుకొనైనా సరే ఆ దుష్టశక్తి గురించి వివరంగా రాస్తాను.

      Delete
  3. కళాక్షేత్రం Director గాను, సెన్సార్ బోర్డ్ Chairperson గానూ చేసి ఆ క్రమంలో కాస్త వివాదాస్పదమయిన వ్యక్తి సుప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి లీలా శాంసన్ గారు. ఈ టపా ఆఖరి పేరాలో అంటున్నది ఆవిడ గురించా?

    ReplyDelete
    Replies
    1. అవునండీ, ఆవిడ గురించే

      Delete