Sunday 7 February 2016

హిందూ ధర్మం - 194 (గోవు ప్రాముఖ్యత - 6)

శరీరానికి కలిగే అనారోగ్యాలను తొలగించడంలో బంగారానికి కూడా ప్రాముఖ్యత ఉంది. ఎంతో జాగ్రత్తలతో స్వర్ణాన్ని భస్మం చేసి, పసిపిల్లల మొదలుకొని పెద్దలవరకు అందరికి వచ్చే వ్యాధులకు ఔషధంగా ఇచ్చే విధానం ఆయుర్వేద శాస్త్రంలో ఉంది. ఒక్క స్వర్ణభస్మమే కాక, ఇంకా అనేక రకాల భస్మాలను సైతం తయారు చేసే విధానాన్ని ఋషులు అందించారు. దీనికి ధాతుశోధన (Metallurgy) శాస్త్రం యొక్క సంపూర్ణ విజ్ఞానమే కాదు మానవశరీరంపై ఖనిజాల ప్రభావం గురించి విజ్ఞానం కూడా అవసరం. ఈ విధానం భారతదేశంలో ఎప్పట్నుంచో ఉందంటే పూర్వకాలంలోనే మనకు ఎంత జ్ఞానం అభివృద్ధి చెందిందో అర్దం చేసుకోవచ్చు. అయితే ఈ భస్మాల మోతాదు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఇది అన్ని సమయాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ కాలంలో అయితే బంగారం ధర పెరగడంతో ఈ రకమైన వైద్యం చేయించుకోవడం చాలా ఖరీదుతో కూడిన అంశం. కానీ గోమూత్రానికున్న విశేషమిటంటే అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత కొంత భాగం శరీరానికి అవసరమైన బంగారంగా మారి, దేహంలో కలిసిపోతుంది. తద్వారా వ్యాధినివారణ జరుగుతుంది, రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఈ విషయం చెప్పగానే కొందరు కుహనా మేధావులు, అలా అయితే బంగారం కొనడమెందుకు, రోజు గోమూత్రం త్రాగుతుంటే శరీరమే బంగారం అవుతుందిగా! అలా అవ్వడం లేదేమీ అని వ్యంగ్యంగా విమర్శించవచ్చు. వాళ్ళు అర్దం చేసుకోవలసిన విషయం ఒక్కటే. శరీరంలోకి వెళ్ళిన తర్వాత, అక్కడ జరిగే రసాయనిక పరిచర్యల (Chemical reactions) వలన ఏ మేరకు ఏ ధాతువు శరీరానికి అవసరమో, అది ఆ మేరకు ఏర్పడుతుంది. అది కూడా దేహం జీర్ణం (Soluble) చేసుకునే విధంగానే ఏర్పడుతుంది. సంస్కృతి మీద ద్వేషాన్ని ఇలా చూపించి మీ అజ్ఞానాన్ని ప్రదర్శించకండి అని వారికి సమాధానం చెప్పవలసి ఉంటుంది.

మన చుట్టు ఉంటే వాతావరణంలో ఎన్నో విద్యుత్- అయస్కాంత తరంగాలుంటాయి. అవి నిత్యం శరీరంతో సమ్యోగం చెంది, దేహం ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. అతి సూక్ష్మమైన ఈ తరంగాలు రాగి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. గోమూత్రం త్రాగడం వలన శరీరానికి తగు మోతాదులో రాగి ఖనిజం కూడా లభిస్తుంది. అందువలన ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందు రోజు సూర్యస్తమయానికి పూర్వమే రాగి పాత్రలో నిలువ చేసిన నీటిని త్రాగమని ఆయుర్వేద శాస్త్రం చెప్పింది. మహర్షి వాగ్భటుడు ఇత్యాది అనేక మంది సనాతనయోగులు చెప్పిన విషయం ఇది. దాని వెనుక ఉన్న రహస్యం కూడా ఇదే. రాగి పాత్రలో నిలువ చేసిన నీరు మంచి విద్యుత్-అయస్కాంత తరంగాలను తనలో గ్రహించి ఉంటుంది.

'సర్వే రోగాఃహి మందాగ్ని' అనేది సూత్రం. సర్వరోగాలకు కారణం మందాగ్ని అని, మందాగ్ని అనగా ఆకలి సరిగ్గ వేయకపోవడం, తిన్నది అరగకపోవడం. గోమూత్రాన్ని ఔషధంగా స్వీకరిస్తే మందాగ్ని సమస్య తొలగిపోతుంది.

అంతరాత్మ ప్రభోధానికి వ్యతిరేకంగా, అధర్మంగా, అన్యాయంగా పని చేయడం వలన హృదయం (ఇక్కడ చెప్పేది భౌతికమైన హృదయం - గుండె గురించి కాదు), మనసు సంకుచితం అవుతాయి. ఇదే రోగాలను కలిగిస్తుంది. కానీ గోమూత్రం సద్భావనలను కలిగిస్తుంది. అందువల్ల మనసు మంచి పనులు చేయడంలో సహాయపడుతుంది.

గోమూత్రంలో నత్రజని (Nitrogen) ఉంటుంది. అది రక్తంలోని విషాలను, లోపాలను హరిస్తుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. అందులో ఉండే సల్ఫర్ పెద్దప్రేగుల్లో కదలికలకు ఉపయుక్తంగా ఉంటుంది. రక్తశుద్ధిని చేస్తుంది. రాగి అనవసరమైన కొవ్వులను ఏర్పడకుండా చూస్తుంది. జన్యుపరంగా సక్రమైంచే కీళ్ళవాతాన్ని నివారించడంలో ఔషధంగా పని చేసే పొటాషియం కూడా గోమూత్రంలో ఉంటుంది. గోమూత్రం కండరాల బలహీనతను, బద్దకాన్ని తొలగిస్తుంది.

To be continued ..................

Source: https://cowurinebenefit.wordpress.com/2012/10/06/cow-urine-benefits/

No comments:

Post a Comment