Monday 23 January 2017

సుభాష్ చంద్రబోస్ కు ప్రేరణ ఇచ్చిన ముగ్గురు మహాపురుషులు



సుభాష్ చంద్రబోస్, యువత స్పూర్తిగా తీసుకునే వ్యక్తి. అలాంటి సుభాష్ చంద్రబోస్ కు ఆదర్శం ముగ్గురు మహాపురుషులు. ఒకరు శ్రీ రామకృష్ణ పరమహంస, ఒకరు స్వామి వివేకానంద, ఇంకొకరు శ్రీ అరోబిందో. బోస్ స్వాతంత్ర్యోద్యమంలో అంత తీవ్రమైన పోరాటం చేయడానికి కారణం వీరేనని, 1937 లో యాన్ ఇండియన్ పిలిగ్రిం అనే తన రచనల్లో రాసుకున్నారు. తనకంటే 20 ఏళ్ళు పెద్దవాడైన అరోబిందో, తన బాల్య జీవితం మీద చెరగని ముద్ర వేశారు.

నేను అండర్ గ్రాడ్యుయేట్ చదివే రోజుల్లో, అరోబిందో ఘోష్ బెంగాల్లో ప్రాచర్యం పొందిన వ్యక్తి. ఆయన తన జీవితాన్ని రాజకీయాల కోసం త్యాగం చేశారు. ఆయన లేఖలు కరపత్రాలుగా మారి వేగంగా వ్యాపించేవి, ముఖ్యంగా రాజకీయాలు- ఆధ్యత్మికత, రెండింటిలో ఆసక్తి ఉన్నవారికి. నా బృందంలో ఎవరో ఒకరు లేఖలు చదవగా, నేను కుతూహలంతో వినేవాడిని....... ప్రభావవంతంగా జాతి సేవ చేయడానికి ఆధ్యాత్మిక శిక్షణ, సాక్షాత్కారం ఎంతో అవసరమని ఆయన వల్లనే గట్టి నమ్మాము. అప్పట్లో అరవిందుల గురించి ఎన్నో గొప్ప విషయాలు కధలు, కధలుగా ప్రచారమయ్యేవి. రాజకీయాలకు, ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధాన్ని ఆయన ప్రతిపాదించడం ఎందరో ధార్మికులను దేశం వైపు తిప్పింది ............... నేను లోతైన ఆయన సిద్ధాంతాల పట్ల ప్రభావితమయ్యాను. ఆదిశంకరుల మాయ సిద్ధాంతం నా మాంసంలో గుచ్చుకున్న ముల్లుగా అనిపించేది. దాని అనుగుణంగా నా జీవితాన్ని మలుచుకోలేను, అలా అని వదిలించుకుని, కొత్త సిద్ధాంతాన్ని పట్టుకోలేను. ఏకం, అనేకం మధ్య, భగవంతుడు, సృష్టి మధ్య సయోధ్య గురించి రామకృష్ణులు, స్వామి వివేకానందుడు భోదించినవి నన్ను ప్రభావితం చేసినా దాన్ని నుంచి బయటపడే ప్రయ్తనంలో సఫలుడను కూడా కాలేకపోయాను. దీని నుంచి విముక్తి పొందటంలో అరవిందులు నాకు సాయం చేశారు. భగవద్గీత భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగమని చెప్పింది. అవిగాక హఠయోగం, రాజయోగం మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వీటి మీద వివేకానందుడు ప్రసంగించినా, అరోబిందో చక్కని సమన్వయం చూపారు. దానికి యోగ సమన్వయం అని పేరు పెట్టారు ...........' అంటూ సుభాష్ చంద్రబోస్ ఎన్నో విషయాలు రాసుకున్నారు.

ఆంగ్లేయులపై పోరాటం సలపడానికి, దేశాన్ని, సంస్కృతిని పునరుజ్జీవనం చేయడానికి భౌతిక, మానసిక శక్తులే కాదు ఆధ్యాత్మిక/ ఆత్మ శక్తి కూడా అవసరమని భావించిన బోస్, తన జీవితంలో ఆధ్యాత్మిక సాధన కూడా చేశారు.

Source- https://auromere.wordpress.com/2012/05/12/subhas-chandra-bose-on-sri-aurobindo/

No comments:

Post a Comment