Sunday, 15 January 2017

హిందూ ధర్మం - 234 (జ్యోతిష్యం - 16)వారి మీద మన ప్రభావం అధికంగా ఉండేది. మనకు వారానికి 7 రోజులు, వారు అదే తీసుకున్నారు. మనకు సంవత్సరానికి 12 నెలలు. కలియుగంలో అది చైత్రం నుంచి మొదలవుతుంది, ఫాల్గుణంతో ముగుస్తుంది. వారు కూడా 12 నెలల లెక్క తీసుకున్నారు. అందులో ఆ నెలలకు కాలక్రమంలో ఆగస్టస్ మొదలైన రాజులు పేర్లు పెట్టినప్పటికీ, సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు ఉన్న నెలల పేర్లకు అర్దం మాత్రం మారలేదు. ప్రస్తుత గ్రిగేరియన్ క్యాలెండర్‌కు పూర్వం, జూలియన్ క్యాలెండర్ ఉండేది, దానికి పూర్వం రోమన్ క్యాలెండర్ ఉండేది. వారు వీటికి ఏ ప్రాతిపదికన పేర్లు పెట్టారంటే సెప్టెంబరు అంటే 7 నెల (సప్త =సెప్టే) అని అర్దం. అక్టోబరు అంటే 8 వ నెల (అష్ట = అక్టో), నవంబరు 9 వ నెల (నవ = నవ), డిసెంబరు 10 వ నెల (దశ = డిసెం). ఇంతకీ ఇవి ఎవరికి? హిందువులకు. హిందువులకు చైత్రంతో సంవత్సరం ప్రారభమవుతుంది. అంటే మార్చి - ఏప్రిల్ మధ్య. అక్కడి నుంచి క్రమంగా లెక్కించుకుంటూ వస్తే, మనకు 7, 8, 9, 10 నెలలని మనము ఏది అంటూన్నామో, వారూ దాన్నే స్వీకరించారు. ఇంతకంటే ఋజువేమీ కావాలి? వారు మన దగ్గరి నుంచి జ్యోతిష్యం, కాలగణనం తీసుకున్నారని చెప్పడానికి.

మనము మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటాము. ఇప్పుడు సంక్రాంతి జనవరి నెల 14, 15 తేదీల్లో వస్తోంది. వివేకానంద స్వామి జన్మించింది మకర సంక్రాంతి రోజున, జనవరి 12, 1863 లో. అంటే అప్పట్లో సంక్రాంతి జనవరి 12. భూమి అయనగతి (Axial precession) కారణంగా sidereal zodiac అసలు స్థితిలో ప్రతి 72 ఏళ్ళకు 1 డిగ్రీ మార్పు వస్తుంది. అందువలన మకర సంక్రాంతి ప్రతి కొనేళ్ళకు (నిర్ణీత సమయానికి) ఒక రోజు ముందుకు జరుగుతుంది. దీనికి ఈనాడు శాస్త్రవేత్తలు చెప్పే శీతాకాల అయనాంతం (వింటర్ సొలిస్టిక్) కు సంబంధం ఉంది. ఇలా వెనక్కు లెక్కించుకుంటూ పోతే, చరిత్రలో ఒకానొక సమయంలో మకర సంక్రాంతి, వింటర్ సొలిస్టిక్ ఒకటే రోజున జరిగిన సందర్భం ఉంది.

The actual position of winter solstice in the sidereal zodiac changes gradually due to the Axial precession of the Earth, shifting westwards by approximately 1 degree in every 72 years. Hence, if Makara Sankranti at some point of time did mark the actual date of winter solstice, it would have been so around 300 CE, the heyday of Indian mathematics and astronomy

ఇది ముఖ్యంగా గ్రీకు సామ్రాజ్యం వర్దిల్లిన కాలంలో, అంతకు ముందు మహాభారత కాలంలో కూడా ఉండి ఉండవచ్చు. ఇలా లెక్కించుకుంటూ పోతే, పరాశర మహర్షి సమాజంలో మానవ దేహంతో సాధారణంగా తిరిగిన రోజుల్లో డిసెంబరు 25 న మకర సంక్రాంతి జరుపుకుందీ ప్రపంచం. మహాభారత యుద్ధం కేవలం సైనికులనే కాదు, మహర్షులను, వేద పండితులను, బ్రాహ్మణులను సైతం బలి తీసుకుందని, ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ధర్మ ప్రచారకులు లేక ధర్మ ప్రచారం సన్నగిల్లిందని అన్నారు మహర్షి దయానంద సరస్వతీ. తిరిగి భారతీయులు క్రీస్తు పూర్వం నాటికే గ్రీకులుతో వ్యాపర సంబంధాలు కలిగి ఉండి, అక్కడ కాలనీలు ఏర్పరుచుకోవడంతో మళ్ళీ అక్కడికి ధర్మ పవనాలు వీచాయి. అలా గ్రీకులు కూడా మన దేవతలనే తీసుకుని పూజించారు. భారతీయులు మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడిని పూజిస్తారు. దానినే గ్రీకులు స్వీకరించారు. అప్పుడు మకర సంక్రాంతి జరిగింది డిసెంబరు 25 న. వారు కూడా దాన్ని సెలవు దినంగా, పవిత్ర దినంగా భావించి సుర్యారాధన చేశారు. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం కుప్పకూలి రోమన్ సామ్రాజ్యం నిర్మితమైంది. వారు కూడా ఈ ఆచారాన్ని విడువలేదు. పైగా డిసెంబరు 17 నుంచి 25 వరకు సెలవు రోజు పాటించి, వారం పాటు పండుగ చేసుకున్నారు. ఆ తర్వాత క్రైస్తవం పుట్టింది. అది రోమన్, గ్రీకు నాగరికతలను, తనలో కొంత కలుపుకుని, కలుపుకోవడానికి విరుద్ధంగా ఉన్నవాటిని అవతల పారేసింది. గ్రీకు, రోమన్ నాగరికతలను పురావస్తు శాలలకు పరిమితం చేసింది. దీని గురించి రాజీవ్ మల్హోత్రా గారు అద్భుతంగా చెప్తారు. Digestion అనే concept ను సృష్టించి, దీన్ని విశదీకరించారు. అలాంటి సందర్భంలో రోమన్లు సూర్యుని కోసం నిర్వహించే పండుగలో Sun కు బదులుగా Son (As per Christian belief, Jesus is the son of God)ను తీసుకువచ్చింది. నిజానికి జీసెస్ పుట్టింది మార్చి, ఏప్రియల్ కాలంలో. ఆయన డిసెంబరు 25 న పుట్టినట్లు చరిత్రలో కానీ, బైబిల్ లో కానీ ఏ విధమైన ఆధారం లేదు. నిజానికి క్రిస్టమస్ పేగన్ల పండుగ. విగ్రహారాధన, చెట్లను, నదులను, జంతువులను పూజించడం బైబిల్ అంగీకరించదు. క్రిస్టమస్ ట్రీ అనేది కూడా స్థానికి జాతులు (హిందువులు!?) పూజించే వృక్షం. అక్కడి వారిని మతమార్పిడి చేసి, ఆ మతాన్ని నాశనం చేయడం కోసం, క్రైస్తవం, అక్కడి స్థానిక తెగల వారి ఆచారాలను కాపీ కొట్టింది. మా దగ్గర కూడా చెట్లను పూజిస్తారు, సరిగ్గా డిసెంబరు 25 నే మేము పండుగ చేసుకుంటాము అంటూ ............ ఇప్పుడు భారతదేశంలో వేంకటేశ్వర సుప్రభాతాన్ని పోలిన ఏసు సుప్రభాతం, ఆలయాన్ని పోలిన చర్చి నిర్మాణం, అందులో ధ్వజస్థంభం, సన్యాసులను పోలిన వస్త్రధారణ, క్రైస్తవులు కూడా ఏసు మాల ధారణ, వేదాలు, ఉపనిషత్తులు ఏసు ......... ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నట్లే అక్కడ చేశారు. వాళ్ళు మనలని కాపీ కొట్టడం కాదు, అనుకరించి, మీ దగ్గర ఉన్నవే మా దగ్గరా ఉన్నాయి, కనుక మారినా మీరేమీ నష్టపోరు అంటూ మార్చే ప్రయత్నం (మన ఆత్మ సిద్ధాతాన్ని అనుకరించలేరు, మూలాలను కాపీ చేస్తే క్రైస్తవమే అంతరిస్తుంది). ఇప్పుడు మనం అంటాం కదా, నదులన్నీ సముద్రంలోనే కలవాలి, మతాలన్నీ హిందూత్వంలోనే కలవాలి అని. బహుసా వాళ్ళు కూడా అప్పుడు అలా అనుకున్నారో లేదో కానీ ఇదే వ్యూహాన్ని క్రైస్తవులు అమలు పరిచి ఎన్నో మతాలను నాశనం చేశారు. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి.

విషయంలోకి వస్తే, అలా గ్రీకు, రోమన్లు జరుపుకునే మకర సంక్రాంతి నేటి క్రిస్టమస్ అయ్యింది.

To be continued ...............

1 comment: