Sunday, 30 July 2017

తులసీ దాస్ జయంతిశ్రావణమాసం శుక్లపక్ష సప్తమి నాడు తులసీ దాస్ జయంతి జరుపుతారు. రామభక్తుల్లో అగ్రగణ్యుల్లో ఒకరు శ్రీ తులసీ దాస్ గారు. శ్రీ రామాయాణ కావ్యాన్ని తనదైన శైలిలో శ్రీ రామచరిత మానస్ గా రచించారు తులసీ దాస్ గారు. మనమంతా చదివే హనుమాన్ చాలీసాను రచించింది కూడా వీరే. వీరు కలియుగవాల్మీకి అని భవిష్యోత్తరపురాణం చెబుతోంది. వారి జీవితం నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు.

వీరికి చిన్న వయసులోనే వివాహం జరిగింది. వివాహానంతరం 15 ఏళ్ళకు రత్నావళి బదరిలోని తన సోదరుల ఇంటికి రక్షాబంధనం కోసం వెళ్ళవలసి వచ్చింది. తులసీదాసు కూడా తొమ్మిది రోజుల పాటు తన వృత్తిపరమైన పర్యటనకు వెళ్ళాడు. అయితే అతడు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, తన భార్య కనిపించక తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యారు. వరదల్లో ఉన్న గంగానదిని ఈది అతికష్టం మీద అతడు అర్ధరాత్రికి తన మామగారి ఇల్లు చేరుకున్నాడు. అటువంటి అసాధారణ సమయంలో భర్తను కలుసుకున్నందుకు దిగ్భ్రాంతి చెందిన రత్నావళి తన భర్తను వరద నీటిని ఏ విధంగా దాటగలిగారని అడిగింది. తనపై అతనికి గల తీవ్ర ప్రేమ గురించి తెలుసుకున్న రత్నావళీ ఇలా చెప్పింది. "నా ప్రాణనాధా! మిమ్మల్ని చూడటం నాకు సంతోషం కలిగిస్తుంది. నాపై మీకు గల తీవ్రమైన ప్రేమ మీరు గంగానదిని దాటేటట్లు చేసింది. ఆలాగే కచ్చితంగా భగవంతుని దివ్య ప్రేమ ఉంటే, ఎవరికైనా ఈ భౌతిక ప్రపంచమును అధిగమించేందుకు అది సహాయ పడుతుంది." అంది. ఈ మాటలు విన్న తులసీదాసు మేథ ఒక ఆకస్మికమైన మలుపు తిరిగింది. వైవాహిక సంబంధమైన ప్రేమ దివ్యప్రేమగా రూపాంతరం చెందింది. అతడు తక్షణమే బదరీనీ, సోరోన్‌ను కూడా విడిచి పెట్టాడు. తులసీదాసు ఒక సన్యాసిగా మారిపోయి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాతా చాలాప్రాంతాలు తిరిగి చివరకు కాశీ చేరుకున్నారు.

కాశీలో వారు నిత్యం రామకథ చెప్పేవారు. ఆ రామకథను వినడానికి హనుమ్నతులవారు వచ్చేవారు. ఆ విషయాన్ని అక్కడికి దగ్గర్లోనే ఉన్న పెద్ద చెట్టుపై నివసించే ఒక బ్రహ్మరాక్షసుడి ద్వారా తెలుసుకున్నారు. నిజానికి తను అనుష్ఠానం చేసుకున్న తర్వాత నీటిని ఆ చెట్టులో పోయడం వలన బ్రహ్మరాక్షసునికి  శాపవిమోచనం జరిగింది. దానికి కృతజ్ఞతగా ఆయన హనుమంతులవారి గురించి చెప్పి, ఆయన పాదాలను పట్టుకోమని చెప్తాడు..... చివరకు ఎంతో శ్రమతో హనుమంతులవారిని ప్రసన్నం చేసుకుని, సాక్షాత్తు వారి నుంచే శ్రీ రామ తారక మంత్రాన్ని ఉపదేశం పొంది చిత్రకూటంలో సాధన చేస్తారు. ఒకానొక రోజు రామలక్ష్మణులు తనకు దర్శనమివ్వడానికి వస్తున్నారని హనుమంతుడి ద్వారా తెలుసుకున్న తులసీదాసు దానికి తగిన ఏర్పాట్లు చేస్తారు. అయితే రామలక్ష్మణులు వారి రూపాల్లో కాక, ఒకసారి ఆకలితో ఉన్న కుక్కలుగా, ఒకసారి పిల్లలుగా, ఇలా మొత్తం 3 వేర్వేరు రూపాల్లో వస్తారు. అయితే తులసీదాసు వారిని గుర్తించరు. ఆ తర్వాత హనుమంతులవారి సహాయంతో ఈ విషయం తెలుసుకుంటారు. అంటే ఎంత భక్తుడైనా, భగవనతుని అన్ని రూపాల్లో చూడటం అలవర్చుకోవాలి. కేఅవలం ఒక రూపమే ఆయనదని నిర్ధారించకూడదు. నిత్యం మనవద్దకు దైవం ఎన్నో రూపాల్లో వస్తుంది, సహాయం చేతుంది, కొన్నిసార్లు అర్ధిస్తుంది, సర్వజీవుల్లోను, ప్రకృతిలోను ఆయన్ను దర్శించడం నేర్చుకోవాలి. అదే మనకు ఇక్కడ కనిపిస్తుంది..... చివరకు వారికి రామచంద్రులవారి దర్శనం కలుగుతుంది. తులసీదాసు గారు తమ జీవితంలో భరద్వాజ మహర్షి, యాజ్ఞవల్క్య మహర్షి దర్శనం కూడా పొందారు.

తులసీదాసు గారు కేవలం భక్తికి మాత్రమే పరిమితం కాలేదు. వారు దేశభక్తుడైన మహారాణా ప్రతాప్ గారికి గురువు. మహారాణా ప్రతాప్ కు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూనే, దేశరక్షణ, ధర్మరక్షణ దిశగా వారిని ప్రేరేపించి, లోకానికి గొప్ప వీరుడిని అందించారు. దేశంలో రామరాజ్యం ఏర్పడాలని తహతహలాడారు.

అలంటి మహాత్ముడిని మనం నిత్యం స్మరించాలి. వారి జీవితం నుంచి ప్రేరణ పొందాలి. 

No comments:

Post a Comment