Sunday 13 October 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 16 వ భాగము



నాలుగవ అధ్యాయము
వ్యాస మహర్షి మరియు సనాతన హిందూ ధర్మ గ్రంధావళికి ఆయన యొక్క తోడ్పాటు

నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే
పుల్లారవిందాయత పద్మ నేత్ర
యేన త్వయా భారత తైల పూర్ణః
ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః

విశాలమైన బుద్ధి కలవాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, ఎవరి చేత అయితే జ్ఞానమనే దీపము, మహాభారతమనే తైలముతో నింపబడి, గీతా అనే అగ్నితో వెలిగించబడిందో, అటువంటి వ్యాసమునకు నా నమస్కారములు.

పురాతన కాలంలో, మన పితరులు, ఆర్యావర్తము యొక్క ఋషులు, వ్యాస పూర్ణిమ తర్వాత వచ్చే నాలుగు నెలలు తపస్సు కొరకు అడవికి వెళ్లేవారు. ఈ వ్యాస పూర్ణిమ హిందూ పంచాంగంలో ముఖ్యమైన మరియు ప్రత్యేకమైన రోజు. గుర్తుంచుకోవలసిన ఈ రోజున సాక్షాత్తు భగవంతుని అవతారమైన వ్యాసుడు, బ్రహ్మసూత్రాలను రాయటం మొదలు పెట్టారు. మన పురాతన రుషులు ఈ తపస్సును గుహలు మరియు అడవులలో చేశారు. కానీ ఇప్పుడు కాలం మారింది మరియు అటువంటి సదుపాయాలు ఈనాడు లేవు. ఎవరైతే ఈ కాలంలో కూడా ముందుకు వచ్చి అలాంటి తపస్సులు చేయాలనుకుంటారో, వారికి తగిన సహాయం మరియు సదుపాయాలు కల్పించడానికి, తగిన చోటు ఇవ్వడానికి గృహస్థులు మరియు రాజులు ముందుకు రావట్లేదు. వారికి అసలు ఇటువంటి కోరిక కూడా లేదు. అందుకే అడవులు మరియు గుహలు తమ ప్రదేశాలను గురుద్వారాలు మరియు మఠాలకు మార్చుకున్నాయి. ప్రతి వ్యక్తి దేశకాలాలకు అనుగుణంగా తన అవసరానికి అనుగుణంగా ఉండాలి; మరియు ఈ దేశకాలాల యొక్క మార్పు మానసిక వైఖరిలో ఎటువంటి మార్పు తీసుకురాకుండా చూసుకోవాలి. మన శాస్త్రాల ప్రకారం వ్యాసపూర్ణిమ రోజున చాతుర్మాస్యము మొదలవుతుంది, మరియు అప్పటి నుంచి మనం ఆ రోజున వ్యాస మహర్షి మరియు బ్రహ్మవిద్యా గురువులను పూజించి, బ్రహ్మ సూత్రాలు మరియు జ్ఞానం ఇచ్చే ఇతర పురాతన గ్రంథాలు చదవాలి.

కృష్ణద్వైపాయన జన్మము జన్మ వృత్తాంతము

మన పురాణాలు ఎందరో వ్యాసాల గురించి మాట్లాడుతాయి. మరియు ద్వాపరయుగాంతంలో పుట్టిన కృష్ణద్వైపాయనుడు అయిన ఈ వ్యాసమున కంటే ముందు 28 మంది ఉన్నారని చెప్పబడింది. ఆయన మత్స్య కన్య - సత్యవతి దేవికి పరాశర మహర్షి ద్వారా జన్మించారు. అది కూడా కొన్ని ప్రత్యేకమైన, అద్భుతమైన పరిస్థితులలో నడుమ. పరాశరుడు ఒక గొప్ప జ్ఞాని మరియు జ్యోతిషంలో అత్యున్నతమైన పండితులు. ఆయన రాసిన పరాశర హోరా ఈనాటికి జ్యోతిషంలో ఒక ముఖ్యమైన గ్రంథము. ఆయన పరాశర స్మృతి అనే స్మృతిని అందించారు. అది ఎంతో ఉన్నతంగా గౌరవించబడటమే కాదు, ఈనాటికి కూడా నైతికి మరియు సామాజిక అంశాలకు చెందిన రచనలు చేసే రచయితలు కూడా దానిని ఎన్నో చోట్ల పేర్కొంటారు. ఒకానొక ప్రత్యేక ఘడియలో పుట్టిన పిల్లవాడు, ఆ యుగంలో గొప్పవాడవుతాడని, సాక్షాత్తు విష్ణు అంశ గలవాడని ఆయనకు తెలుస్తుంది. ఆ రోజున పరాశరుడు ఒక చిన్న పడవలో ప్రయాణిస్తూ ఆ పడవవానితో ఆ శుభముహూర్తం దగ్గర పడేటప్పుడు మాట్లాడుతారు. ఆ పడవవానికి వివాహ సమయమున వచ్చి, వివాహంమునకు ఎదురుచూస్తున్న ఒక కూతురు ఉంది. అతడు పరాశరుని యొక్క తపస్సును, గొప్పతనాన్ని మెచ్చుకుని, తన కూతురుని ఆయనకు ఇచ్చి వివాహం చేస్తారు. వీరిద్దరికి పుట్టినవాడే మన వ్యాసుడు; మరియు ఆయన యొక్క జన్మకు కారణంగా సాక్షాత్తూ పరమశివుని అనుగ్రహింమని, అతి తక్కువ కులానికి చెందిన వాడైనా, అత్యంత ఉన్నతమైన జ్ఞానిగా ప్రసిద్ధికెక్కుతాడని శివుడు ఆశీర్వదిస్తారు.

సనాతన ఆర్ష వాఙ్మయానికి వ్యాసుని యొక్క అద్భుతమైన సహాయము

చాలా చిన్న వయసులో వ్యాసమహర్షి తాను తపస్సు చేస్తానని, తన జన్మరహస్యం తల్లిదండ్రులకు చెప్పారు. ఆయన తల్లి మొదట ఆంగీకరించలేదు కానీ తర్వాత ఒక ముఖ్యమైన నిబంధన పెట్టి అనుమతించింది. అదేమిటంటే ఆమె ఎప్పుడు తలచుకుంటే అప్పుడు ఆయన కళ్ళముందు ప్రత్యక్షవ్వాలి. ఇదొక్కటే ఆ తల్లిదండ్రులు మరియు ఆ కుమారుని దూరదృష్టిని తెలియపరుస్తుంది. పురాణాల ప్రకారము వ్యాసుడు తన ఇరవై ఒకటవ గురువైన వాసుదేవుడనే ఋషి ద్వారా ఉపదేశం పొందారు. ఆయన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు మైర్యు ఇతర ఋషుల వద్ద శాస్త్రాభ్యాసం చేశారు. మానవుల యొక్క మేలు కొరకు వేదాలను విభాగం చేశారు, మరియు శృతులను సులభంగా వేగంగా అర్థం చేసుకొనుట కొరకు బ్రహ్మసూత్రాలు రాశారు. స్త్రీలు, శూద్రులు మరియు తక్కువ మేధస్సు కలవారు ఉన్నతమైన జ్ఞానాన్ని చాలా సులభ రీతిలో అర్థం చేసుకునేందుకు ఆయన మహాభారతం కూడా రాశారు. ఆయన పద్దెనిమిది పురాణాలను రచించి, వాటి ద్వారా ఉపాఖ్యానాలు లేదా ప్రవచనాల వ్యవస్థను బోధించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఆయన కర్మ, ఉపాసన మరియు జ్ఞానం అనే మూడు మార్గాలను నిర్మించారు. ఆయనే తన తల్లి యొక్క వంశక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు మరియు ధృతరాష్ట్రుడు పాండురాజు మరియు విధురుడు ఆయన ద్వారానే భూమి మీదకు వచ్చారు. భాగవతము ఆయన చేసిన చివరి రచన. అది రాయకపోతే ఆయన జీవిత లక్ష్యం నెరవెరదని, అది కూడా దేవర్షి అయిన నారదుడు ఆయన వద్దకు వచ్చి ప్రేరణ అందించడంతో అప్పుడు వ్యాసుడు రచించాడు.

వ్యాసుడిని హిందువులంతా చిరంజీవిగా భావిస్తారు. ఆయన ఈ నాటికి తన భక్తుల మేలు కొరకు జీవించి ఉంటూ, ప్రపంచమంతా తిరుగుతూ, సత్యవంతుడు మరియు విశ్వాసం గలవారికి కనిపిస్తారని నమ్ముతారు. జగద్గురు ఆది శంకరాచార్యుల వారికి మండనమిశ్రుని ఇంట్లో వ్యాసుని దర్శనం అయ్యింది. అలాగే ఆయన ఇంకా ఎంతో మందికి దర్శనం ఇచ్చారు. కనుక కుల్ప్తంగా చెప్పాలంటే, ఆయన జగత్తు యొక్క హితం కొరకు జీవిస్తున్నారు. ఆయన ఆశీర్వాదాలు మన అందరి మీద, సమస్త ప్రపంచం ఇలా ఉండాలని ప్రార్ధిద్దాము.

బ్రహ్మ సూత్రాలు మరియు వాటికి విభిన్నమైన వ్యాఖ్యానాలు

మన పూర్వీకులు ఆరు విధములైన ఆలోచనా విధానాలను అభివృద్ధి పరిచారని మన అందరికీ తెలుసు. వాటికి షడ్దర్శనాలు అని పేరు. అవి సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము, పూర్వమీమాంస మరియు ఉత్తరమీమాంస లేదా వేదాంతము. ప్రతి యొక్క వ్యవస్థ/దర్శనానికి విభిన్నమైన అభిప్రాయం/ ఆలొచనా సరళి ఉంది. క్రమక్రమంగా ఈ ఆలోచనలు భావాలు అనేకమైన, వాటిని నియంత్రించడానికి సూత్రాలు వచ్చాయి. వీటికి సంబంధించిన ప్రమాణమైన వాక్యాలు సంస్కృతంలో చిన్న సూత్రాల రూపంలో వచ్చాయి. అవి మన జ్ఞాపకములో ఎంతోకాలం ఉండుటకు మరియు ప్రతి అంశం మీద పెద్ద చర్చ చేయడానికి అవి తోడ్పడాలి అనేది దాని ఉద్దేశము. పద్మ పురాణంలో సూత్రాలు యొక్క వ్యాఖ్య లేదా వివరణము ఇవ్వబడింది. అది ఏమంటుందంటే సూత్రాలు చాలా సంక్షిప్తంగా మరియు స్పష్టంగా ఉంటాయి. కానీ వాటి యొక్క సంక్షిప్తత సూత్రాలను అర్థం చేసుకోలేని స్థాయికి చేరింది. మరీ ముఖ్యంగా బ్రహ్మసూత్రాల విషయంలో ఇది కనిపిస్తుంది. ఈరోజు మనం కనక చూస్తే ఒక సూత్రాన్ని 12 రకాలుగా వ్యాఖ్యానిస్తారు. సూత్రాలు వేదవ్యాసుడు లేదా బాదరాయణుడు రచించారు- ఆయనకు ఉన్న ఇంకొక పేరు కారణంగా ఆయన రాసిన ఈ సూత్రాఅను వేదాంత సూత్రాలు అని అంటారు. ఎందుకంటే అది కేవలం వేదాంతం గురించే మాట్లాడతాయి. అవి నాలుగు అధ్యాయాలు విభజించబడ్డాయి మరియు ప్రతి అధ్యాయము 4 భాగాలుగా విభజించబడింది. ఇక్కడ ఆసక్తికరంగా కనిపించే విషయం ఏమిటంటే ప్రతి సూత్రము ప్రారంభమయ్యి, అంతమయ్యే సమయంలో ఇలా కనిపిస్తుంది- 'బ్రహ్మము యొక్క తత్వం గురించి విచారణ చేసిన వాడు మరల వెనక్కి రాడు' అనగా 'ఈ మార్గంలో వెళ్ళినవాడు అమరత్వాన్ని చేరుకుంటాడు మరియు అతడు మరల ఈ ప్రపంచంలోకి తిరిగిరాడు'.

ఈ సూత్రాలను ఎవరు లిఖించారు అన్న విషయానికి వస్తే సంప్రదాయం దానిని వేదవ్యాసునకు కట్టబెడుతుంది. శంకరాచార్యులు ఆయన భాష్యంలో వ్యాసుల వారిని మహాభారతానికి మరియు భగవద్గీతకు రచయితగా మరియు బాదరాయణుని బ్రహ్మ సూత్రాలకు కర్తగా చెప్తారు. ఆయన అనుయాయులు - వాచస్పతి, ఆనందగిరి మరియు ఇతరులు - ఇద్దరిని ఒకే వ్యక్తిగా గుర్తిస్తారు. రామానుజులు మరియు ఇతరులు వాటిని వేదవ్యాసులవారే రచించారని చెబుతారు. బ్రహ్మసూత్రాలపై ఉన్న పురాతనమైన వ్యాఖ్యానం ఆదిశంకరాచార్యుల వారిది. వారి తర్వాత రామానుజులు, వల్లభాచార్యులు, నింబార్కుడు, మాధవుడు మరియు ఇతరులు వారి వారి సొంత మతాలను స్థాపించారు. వీటిలో పైన చెప్పిన వారిలో ప్రామాణికమైన ఐదుగురూ రెండు విషయాలను ముఖ్యంగా అంగీకరించారు. అది (1) బ్రహ్మము ఈ ప్రపంచానికి కారణము (2) మరియు బ్రహ్మజ్ఞానమే ముక్తికి మార్గము. కానీ వారు బ్రహ్మము యొక్క తత్వం/ప్రకృతి గురించి, పరమాత్మకు జీవాత్మకు మధ్య ఉన్న సంబంధం గురించి, మోక్ష స్థితిలో జీవుల యొక్క స్థితి గురించి ఒకరికి ఒకరు భిన్నాభిప్రాయాలను వ్య్కతం చేసారు. కొందరి వాదన ప్రకారం, మోక్షం పొందడానికి జ్ఞానం కంటే భక్తియే ఉన్నతమైనది శంకరులు వ్యాఖ్యానించారని చెబుతారు.

జీవితమంతా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుటానికే పుట్టిన వ్యాసుని జీవితం ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. ఆయన యొక్క రచనలు ఈ నాటికి మనకకూ, సమస్త ప్రపంచానికి ప్రేరణ అందిస్తున్నాయి. మనమంతా ఆయన యొక్క రచనల స్ఫూర్తితో జీవిద్దాము.

నాల్గవ అధ్యాయము సమాప్తము 


No comments:

Post a Comment