Thursday 31 October 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 21 వ భాగము

అరుణాచలేశ్వరుని పాదాలు 


స్త్రీలకు హెచ్చరిక

ఇటువంటి దొంగ గురువులు మరియు కుహనా ఆచార్యుల వలన స్త్రీలు సులభంగా మోసపోతారు. స్త్రీలు చాలా నిష్కపటమైన మనస్కులు మరియు దేనినైనా సులభంగా నమ్ముతారు. చక్కని సంగీతము మరియు స్వరమాధుర్యానికి వారు అతి సులభంగా ఆకర్షితులవుతారు. మధురమైన శబ్దాలకు ఆకర్షించబడి అతి త్వరగా బాధితులు అవుతారు. ఈ దొంగ గురువులు ఎల్లప్పుడూ మామూలు స్త్రీలను మోసం చేయాలని చూస్తారు. వారు వీరిని సులభంగా ప్రభావితం చేసి ఎటువంటి కష్టంలేకుండా వలలో పడేసి వాడుకుంటారు. వారిని పనిముట్లుగా చేసుకుంటారు. వారిని దోచుకుని వీరి కడుపునింపుకున్టారు మరియు ఖరీదైన పట్టు వస్త్రాలు మరియు గొప్ప చెప్పులు వేసుకుని తిరుగుతారు. స్త్రీలను శిష్యురాలిగా చేసుకోమని శాస్త్రాల్లో గృహస్థులలకు ఎక్కడా కనీసం అనుమతి కూడా ఇవ్వలేదు. మంచి జీవనం మరియు సంపాదన కోసం ఎవరైతే స్త్రీలను ఉపయోగించుకుంటారో, వారు అశుద్ధంలో జీవించే పురుగులు వంటి వారు. అలాంటి మూర్ఖులకు ప్రాయశ్చిత్తం లేదు. వారిని నిర్దయగా రౌరవము మరియు మహారౌరవంలో పడవేస్తారు.

దేవీ స్వరూపులారా! మీ కళ్ళు తెరవండి. మీరంతా ఇప్పుడు చదువుకున్నారు. మీ బుద్ధిని ఉపయోగించండి. కేవలం ఉపన్యాసాలను లేదా సంగోతాన్ని విని మోసపోకండి. గురువులుగా ప్రదర్శించుకునే వారి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఒక గృహస్థును ఎన్నడు నీ గురువుగా చేసుకోకండి. అతడి నుంచి దీక్ష పొందకండి. ఒకవేళ అలా చేస్తే చివరకు మీరు చెడు పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. మీరు ఎంచుకునే వ్యక్తి ఉత్తమమైన, మచ్చలేని వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అతడు పూర్తి నిస్వార్థంగా ఉంటూ కామము మరియు దురాశ నున్చి విముక్తుడై ఉండాలి. అన్ని రకముల భౌతిక ప్రలోభాలు/ కళంకాల నుంచి అతడు విముక్తుడై ఉండాలి. అతనికి వేదము మరియు గ్రంథముల జ్ఞానముండాలి. అతనికి ఆంతరంగికమైన ఆధ్యాత్మిక బలము మరియు మిమ్మల్ని ఉద్ధరించి, ఆధ్యాత్మికపథంలో నడుపుటకు ఆత్మ సాక్షాత్కారము కలిగిన వాడై ఉండాలి.

ఒక గురువు గురించి సరైన పరీక్ష చేయకుండా లేదా అతడిని అర్థం చేసుకోకుండా ఒక వ్యక్తిని గురువుగా ఎంచుకుంటామని భార్యలు అంటే భర్తలు అనుమతించకూడదు. నిజంగా ఒక వ్యక్తిని గురువుగా స్వీకరించాలి అని వారు భావిస్తే, ఆ వ్యక్తితో ఎంతో కాలం ఉన్న తర్వాత, అతడిని జాగ్రత్తగా పరిశీలించి, విచారించి అప్పుడు స్వీకరించాలి. భార్య భర్తకు వేరువేరు గురువులు ఉండకూడదు. గొడవలు జరుగుతాయి. వారిరువురికీ ఒకే గురువు ఉండాలి.

వివిధ మత శాఖలు మరియు విధానాల యొక్క ప్రమాదం

చైతన్య మహాప్రభువు, గురు నానక్ మరియు దయానంద స్వామి మొదలైన వారంతా సార్వత్రిక, సర్వజన సమ్మతమైన, ఘనమైన జీవులు. వారి యొక్క భోజనం బోధనలన్నీ ఉన్నతమైనవి మరియు విశ్వజనీనమైనవి. వారు ఏనాడు తమ సంత సొంత శాఖలను గాని మతాలను గాని ఏర్పరచాలని అనుకోలేదు. వారు కనుక ఇప్పుడు జీవించి ఉంటే వారిఅనుచరులు చేస్తున్నవాటి చూసి వారు ఎంతగానో ఏడ్చేవారు. అనుచరులే ఎంతో తీవ్రమైన తప్పులను మరియు దోషాలను చేస్తారు. వారు ఏనాడు విశాలమైన హృదయాన్ని వృద్ధి పరుచుకోలేదు. వారు సంకుచిత మనస్తత్వం గలవారు. పగలు, కలహాలు, వర్గ విభేదాలు మరియు అన్ని రకాల ఇబ్బందులను వారు సృష్టిస్తారు.

అలాగే ఆధ్యాత్మికగురువు కూడా తనదైన సొంత మార్గాన్ని ఏర్పరుచుకోకూడదు. అతడిని ఎంతో దీర్ఘమైన అంతర్ దృష్టి ఉండాలి. ఒక కొత్త శాఖను ఏర్పరచడం అంటే ప్రపంచ శాంతికి విఘాతం కలిగించడానికి ఒక కొత్త కారణాన్ని సృష్టించడం. అతడు దేశానికి చేసే మేలు కంటే హానియే ఎక్కువ. అతడు విశాలమైన సూత్రాలు మరియు బోధనలతో, కూడిన ఇతర మతాల సూత్రాలు మరియు బోధనలతో విభేధించని మరియు విశ్వజనీనంగా అంగీకరించబడి, అనుసరించదగిన వ్యవస్థను ఏర్పరచవచ్చు.

No comments:

Post a Comment