Tuesday 29 October 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 20 వ భాగము



ఏడవ అధ్యాయము
గురువు అవ్వాలని పిచ్చి - భయంకరమైన రోగము

జటిలో ముండీ లుంఛితకేశః కాషాయాంబరబహుకృతవేషః|
పశ్యన్నపి చన పశ్యతి మూఢో ఉదరనిమిత్తం బహుకృతవేషః||

తాత్పర్యము - ఒకరు పెద్ద జడలు పెంచుకుంటారు. ఇంకొకరు తలను పూర్తిగా గొరిగించుకుంటారు. ఇంకొకరు కాషాయం కడతారు. దర్శించామని చెప్పుకున్న్నా, దాన్ని దర్శించని మూఢులు. కడుపు నింపుకోవడం కోసం ఒక వ్యక్తి ఎలాంటి వేషం ధరిస్తే ఏమి లాభము?

- ఆదిశంకరాచార్యులు

భారత దేశము అద్వైత సిద్ధాంతాన్ని ఇచ్చిన పవిత్ర భూమి. సకల జీవులలో ప్రాణం మరియు మరియు చైతన్యం ఒకటేనని చాటి చెప్పిన శ్రీ శంకరాచార్యులు, దత్తాత్రేయయుడు, వామదేవుడు మరియు జడభరతుడు పుట్టిన ఈ భూమి ఈనాడు అనేక వర్గాలుగా విభజించబడింది. ఎంతటి దయనీయ స్థితి. ఈరోజు నీవు చూస్తున్నది ఎంత శోకనీయమైన స్థితి. ఒక సముద్రపు ఒడ్డున ఉండే ఇసుక రేణువుల లెక్కించవచ్చునేమో కానీ ఈనాడు భారతదేశంలో ఉన్న మాతాల యొక్క సంఖ్యను లెక్కించడం ఎంతో కష్టం. ప్రతిరోజు భారతదేశంలో పుట్టగొడుగుల ఏదో ఒక 'ఇజాలు' పుట్టుకు వచ్చి, ఇంతకుముందు నుంచి ఇక్కడ ఉన్న దాన్ని పెరికి వేయాలాని చూస్తున్నాయి. నిరాశావాదులు ఉన్నదానిని విడిచిపెడుతున్నారు మరియు అంతటా వైరుధ్యం రాజ్యమేలుతోంది. మతశాకల మధ్య యుద్ధం నడుతూనే ఉంది. కలహాలు మరియు చీలికలు, న్యాయస్థానాల్లో దావా/ వ్యాజ్యాలు, వాగ్వాదాలు, కుమ్ములాటలు మరియు కుట్రలు అంతటా కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా సాంతి, సామరస్యం అనేదే లేదు. ఒక గురువు యొక్క శిష్యులు మరొక గురువు యొక్క శిష్యులతో రోడ్ల మీద మరియు వ్యాపారకేంద్రాల్లో గొడవకు దిగుతున్నారు.

దొంగ యోగులు మరియు నటించే గురువులు

హార్మోనియం మీద కొద్దిగా పట్టు మరియు వాగ్ధాటి కల యువకుడు, ఒక స్టేజి ఎక్కి కొన్ని సంవత్సరాల్లో తనను తాను ఒక గురువుగా ప్రదర్శించుకుని, కొన్ని చెత్త కరపత్రాలు మరియు పాటలు రాసి, తనదైన సొంత శాఖను ఏర్పరుచుకుంటాడు. భారతదేశము నిండా ఇంకా ఇటువంటి విస్తారముగా మూర్ఖత్వం ఉంది మరియు ఏ వ్యక్తి అయినా తక్కువ సమయంలో అనుచరులను పొందగలరు.

ఒక యువకుడు ఆసనాలు, బంధాలు మరియు ప్రాణాయామం మీద కొద్దిపాటి శిక్షణ పొంది, ఒక భూగృహం లోని గదికి రహస్యంగా 40 రోజులకు సరిపడా కొన్ని ఆహార పదార్థాలను ముందే తీసుకెళ్లి, తలుపు మూసేసుకుని, కూర్చుటాడు. ఆకలి మరియు దాహార్తిని నశింపచేసే కొన్ని వ్రేళ్ళను కొన్ని రోజులపాటు తింటాడు. అతను ఆ గృహములో ఏమి చేస్తున్నాడో భగవంతునికే తెలుసు. అతడు ఆ గదిలో నిద్రిస్తాడు. ఇన్నాళ్లు సమాధిలో ఉన్నట్టుగా నటించి బయటకు వస్తారు. ఇది కొద్దిపాటి తితిక్షను ఆచరిస్తేనే ఒనగూరుతుంది. అతని వాసనలను మరియు సంస్కారాలు ఏ మాత్రం నశించలేదు. అతడు ఈనాటికీ అదే భౌతిక ప్రపంచపు మనిషి. అతడు డబ్బు సంపాదించుటకు మరియు శిష్యులను తయారు చేసుకొనుటకు, అనేక చోట్ల సంచరిస్తాడు. అతడు యోగి అయిన గురువుగా నటిస్తాడు. అజ్ఞానులైన భౌతికమానవులు సులభంగా మోసపోతారు. ఇక్కడ విచారకరమైన విషయం ఏమిటంటే ఇలా బాధ్యతారాహిత్యంగా మూర్ఖత్వపు పనులు చేసే ఇటువంటి యువకుల వలన, నిజమైన సమాధిలోకి వెళ్ళే నిజమైన యోగుల మిద జనులు విశ్వాసం కోల్పోతారు.

ఈ యువకులు యోగము మరియు ఆధ్యాత్మిక జీవనం యొక్క సారాన్ని ఏమాత్రము గ్రహించలేదు. సమాధి అనేది బహిరంగంగా రోడ్ల మీద ప్రదర్శించేది కాదు. సమాధి అనేది ఒక దివ్యమైన చర్య. సమాధి అనేది ఒక ఇంద్రజాలము లేదా మాయ కాదు. ఇటువంటి చేష్టలు అన్ని చోట్లా వ్యాపిస్తున్నాయి. ఎందరో యువకులు ఇటువంటి వాటిని ప్రదర్శిస్తున్నారు.

ఇటువంటి దొంగ యోగులు, నకిలీ గురువులు మరియు మోసకారులు సమాజానికి భారమైన వారు మరియు చీడ పురుగుల. వారు దేశానికి ప్రమాదకారులు మరియు అజ్ఞానులు, సులభంగా నమ్మేవారి సంపద పట్ల రాబందుల వంటి వారు. వారి నుంచి జాగ్రత్తగా ఉండండి.

కొందరు వారు ముసలివారు అయిన తర్వాత సేవ పొందుట కొరకు శిష్యులను ఏర్పరుచుకుంటారు. వారు తమ శిష్యులకు యొక్క ఉన్నతి గురించి పట్టించుకోరు.

No comments:

Post a Comment