Saturday, 9 August 2014

శ్రావణ పౌర్ణిమ - రాఖీ పండుగ, హయగ్రీవజయంతి

29-08-2015, శనివారం, శ్రావణ పౌర్ణిమ - రాఖీ పండుగ, జంధ్యాల పూర్ణిమ.

పూర్వం దేవతలకు, రాక్షసులకు జరిగిన ఒక యుద్దంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేకపోయారు. అప్పుడు తన భర్త అయిన దేవేంద్రుడు గెలవాలన్న గట్టి కోరికతో ఇంద్రుని భార్య అయిన శచీదేవి, ఇంద్రునికి రక్ష కట్టింది. ఆమె కట్టిన 'రక్ష' మహిమ చేత ఇంద్రుడు రాక్షసులపై విజయం సాధించాడు. అందువల్ల శ్రావణ పౌర్ణిమ 'రక్షా పూర్ణిమ'గా ప్రసిద్ధి గాంచిందని ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్టుగా భవిష్యోత్తర పురాణంలో కనిపిస్తుంది.

బలి చక్రవర్తి, లక్ష్మీ దేవి:
రాక్షసుల రాజు మహాబలి తన భక్తితో విష్ణువును మెప్పించి తన రాజ్య రక్షణా భారం విష్ణువుపై పెడతాడు. దానితో విష్ణువు బలి రాజ్యంలోనే ఉండిపోవలసి వస్తుంది. అపుడు విష్ణవు భార్య అయిన లక్ష్మీ దేవి ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలి వద్దకు వచ్చి శ్రావణ పూర్ణిమ రోజున బలి చేతికి రాఖీ కట్టి నేను నీ సోదరి సమానురాలను అంటుంది. సోదరిగా తన కోరిక మేరకు విష్ణువును వదలివేయమంటుంది. ఆమె కట్టిన రాఖీ చర్యకు మెచ్చిన బలి శ్రీ మహావిష్ణువును ఆమెతో పాటు శ్రీ మహా విష్ణువును కూడా వైకుంఠానికి పంపేస్తాడు.

చారిత్రికంగా చూస్తే భారతదేశం మీద ఇస్లాం పాలకులు ఆక్రమణలకు పాల్పడుతున్న సమయంలో వీర రాజపుత్రులు వారిని ఎదురించి పోరాడసాగారు. చిత్తోడ్ రాజ్యం మీద గుజరాత్ రాజు బహదూర్ షాహ్ దాడి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. అంతకముందే రాజు మరణించడం చేత రాణీ కర్ణావతి వైధవ్యాన్ని పొందింది. స్త్రీలు మాత్రమే మిగిలారు. అందువల్ల యుద్ధంలో పోరాడి గెలిచే శక్తి తనకు లేదని గ్రహించి హుమాయూన్ చక్రవర్తికి రాఖీ పంపింది. ఆ కాలంలో రాఖీ అంటే ఎంతో పవిత్ర భావన ఉండేది. సోదరిని తప్పకుండా రక్షించాలనే తపన అంతకన్నా ఎక్కువ ఉండేది. అందువల్ల రాఖీ అందుకున్న హుమాయూన్ తన సైన్యాన్ని వెంటనే పంపాడు. కానీ అప్పటికే రాణి కర్ణావతి సహా 16,000 స్త్రీలు, జీహాదీలు అత్యాచారం చేకుండా రక్షించుకోవడానికి, తమకు తామే నిప్పు అంటించుకుని జూహార్‌కు పాల్పడ్డారు.

యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః |
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||

పై శ్లోకాన్నిపఠిస్తూ భార్య-భర్తకు సోదరి-సోదరునకు యుద్ధానికి వెళ్లే వీరునకు విజయ ప్రాప్తి కోసం ఈ రక్షాబంధనను కడతారు. శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా, ఓ రక్షాబంధనమా ! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని పై శ్లోకం అర్దం. దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది. రాఖీ/రక్ష కట్టడం వలన కట్టినవారికి, కట్టించుకున్నవారికి రక్ష కలుగుతుంది. రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడు సోదరికి పసుపుకుంకుమలు, సారె ఇచ్చి ఆశీర్వదించాలి.

ఉపనయనం చేసుకున్న వారు శ్రావణ పూర్ణిమ రోజున, పాత యజ్ఞోపవీతాన్ని(జంద్యాన్ని) విసర్జించి, కొత్తది ధరిస్తారు. అందువల్ల ఇది జంధ్యాల పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. ఇదే రోజున కొత్తగా ఉపనయనం అయినవారికి ఉపాకర్మ నిర్వహిస్తారు. దీనితో పిల్లవానికి వేదం చదివే అర్హత వస్తుంది.

ఈ రోజే హయగ్రీవజయంతి. శ్రీ మహావిష్ణువు విద్యాప్రదాత అయిన శ్రీ హయగ్రీవస్వామిగా దర్శనమిచ్చేది ఈ రోజునే. హయగ్రీవ ధ్యానంతో సర్వ విద్యలు లభిస్తాయి. జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది. ఓం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని రోజూ జపించడం వలన విద్య యందు ఆసక్తి కలిగి, విద్యల్లో రాణిస్తారు.

అందరికి రాఖీ పండుగ మరియు జంధ్యాల పూర్ణిమ శుభాకాంక్షలు.

Originally Published: Rakhi Purnima 2013
1st Edit: 09-August-2014
2nd Edit: 28-August-2015

Friday, 8 August 2014

లక్ష్మీకటాక్షం కలగాలంటే.........

చాలామంది లక్ష్మీకటాక్షం కలగడానికి చాలా పూజలు చేస్తుంటారు. లక్ష్మీకటాక్షం కలగాలంటే ముందు బద్ధకం వదలాలి. బద్దకం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని దూరం చేస్తుంది. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు ఉదయమే, సూర్యోదయానికి ముందే కుటుంబసభ్యులందరూ నిద్రలేచి, స్నానాలు మిగించి దైవారాధన, దీపారాధన చేస్తారో, నిత్యమూ ప్రాతఃకాలంలో ఏ ఇంటి వాకిలి శుభ్రపరచి, అలికి ఉంటుందో, ఏ ఇంట్లో వ్యక్తులు ఉదయిస్తున్న శ్రీ సూర్యనారాయణ స్వామికి నమస్కరిస్తారో, ఆ ఇంటికి మాత్రమే వస్తుంది సిరులతల్లి లక్ష్మీదేవి.

ఎవరు ఇంట్లో నిత్యం విడువకుండా ఉదయం, సాయంత్రం సంధ్యాకాలంలో దీపారాధన చేస్తారో, ఆ ఇంట్లో మాత్రమే లక్ష్మీకటాక్షం ప్రసరిస్తుంది. దీపారాధనకు అంటే విద్యుత్‌దీపాలు వేయడం కాదు, ఆవునెయ్యి/నువ్వుల నూనెతో వెలిగించిన దీపమే లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది. అలా కాకా ఏ ఇల్లూ దీపం పెట్టకుండా ఉంటుందో, ఆ ఇల్లు శ్మశానంతో సమానమని, అటువంటి ఇళ్ళకు తాను వెళ్ళలని శ్రీ మహాలక్ష్మి స్వయంగా చెప్పింది.

అనవసరంగా మాట్లాడేవారు, ఇతరులకు సంబంధించిన విషయాల మీద విమర్శిస్తూ కాలక్షేపం చేసేవారు, మద్యపానం, ధూమపానాం, మత్తుపదార్ధాలు స్వీకరించేవారి వద్ద లక్ష్మీ క్షణం కూడా నిలువదు. దొంగలు, మోసగాళ్ళు, అబద్దాలాడేవారంటే లక్ష్మీదేవికి గిట్టదు. ఎవరికీ ఏదీ దానం చేయనివారికి లక్ష్మీదేవీ ఏదీ ఇవ్వదు.

కేవలం లక్ష్మీదేవిని మాత్రమే ఆరాధిస్తే సరిపోదు. శ్రీ మహావిష్ణువును కూడా ఆరాధించాలి. అమ్మవారి విష్ణుమూర్తిని అస్సలు విడిచిఉండలేదట. అందుకే అమ్మకు నిత్యాన్నపాయిని అని పేరు. లక్ష్మీదేవికి సంబంధించిన ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, తప్పకుండా విష్ణు మూర్తిని ఆరాధించాలిసిందే. అప్పుడే ఫలితం లభిస్తుంది.

ఓం నమో లక్ష్మీనారాయణాయ    

Tuesday, 5 August 2014

గణేశుడు

ఓం గం గణపతయే నమః

"యే ప్రకృత్యాదయో జడా జీవాశ్చ గణ్యంతే సాంఖ్యాంతే| తేషామీశః స్వామీ గణేశః||"

ఈ సమస్త ప్రకృతి మొత్తం రెండు రకాల పదార్ధాలతో నిండి ఉంది. ఒకటి కదిలేవి, రెండు కదలినివి. కదిలేవాటిన చరములని, కదలనివాటిని, మార్పు చెందనివాటిని అచరములను, జడములని అంటారు. అందుకే ఈ సృష్టి మొత్తం చరాచరాత్మకమైనది అంటాం. చెట్లు, మొక్కల్లో ప్రాణమున్నప్పటికి అవి తామున ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళలేవు, కొండలు, రాళ్ళు, రప్పలు కూడా అంతే. కాబట్టి అవి అచరములు. మనుష్యులు, జంతువులు, పక్షులు మొదలనవి చరములు. అటువంటి ఈ చరాచరాత్మకమైన జగత్తు ఎవరిచే లెక్కించబడుతోందో(గణించబడుతోందో), ఎవరిచే పాలిచబడుతోందో ఆ పరబ్రహ్మమే గణపతి. గణించబడడం అంటే............. ఏదైనా ఒక వస్తువు ఉన్నది అని చెప్పడం. మనలో కూడా 'నేను' అనే భావన ఉంటుంది. అలా ఎక్కడైన ఒక వస్తువు ఉంది, లేక ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక సమాజం ఉంది, ఒక దేశం, యావత్తు ప్రపంచం ఉంది అంటే నియమబద్ధంగా, క్రమబద్ధంగా సాగుతోందంటే ఈ మొత్తం జగత్తును నడిపిస్తున్న నాయకుడు/ అధికారి/ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. అతడే గణేశుడు అంటోంది పై శ్లోకం.

ఓం గం గణపతయే నమః      

Monday, 4 August 2014

గౌరీ గణేశుడు ప్రకృతి ప్రేమికుడు

ఓం గం గణపతయే నమః

వినాయకుడు ప్రకృతి ప్రేమికుడు. అందుకు సంబంధించిన కధ ఒకటుంది.

బాలవినాయకుడు మహాగడుగ్గాయి, బోలెడు అల్లరి చేస్తాడు. ఒకప్పుడు వినాయకుడు ఆడుకోవడానికి కైలాస పర్వతాల్లో ఉన్న అడవిలోకి వెళ్ళగా, పిల్లి కనిపించింది. కాసేపు ఆ పిల్లిని ఏడిపిద్దామనుకున్న గణపతి, దాని మీదకు బాణాలు సంధించాడు. అది బయపడి ఒక చెటు వెనుక దాక్కునగా, దాన్ని పట్టుకుని, చాలాసమయం ఆడుకున్నాడు, పిల్లి తోక పట్టుకుని గిరగిరా తిప్పాడు, మట్టిలో పొర్లించాడు. ఆట ముగిసాకా, ఇంటికి తిరిగివచ్చేసరికి పార్వతి దేవి శరీరమంతా మట్టి, దుమ్ము, ధూళి కనిపించింది. చేతులు, కాళ్ళ మీద ఎవరో గోర్లతో గీసినట్టుగా బాగా గీరుకుపోయింది. వినాయకుడికి అమ్మ అంటే మహా ఇష్టం. అందువల్ల ఏమైందమ్మా అని అడిగాడు. అంతా నువ్వే చేశావ్ కన్నా అన్నారు. నేనా!? నేనేం చేయలేదమ్మా! అన్నాడు గణపయ్య. అప్పుడు పార్వతీ దేవి గణపతిని ఎత్తుకుని, "బంగారు! అన్ని జీవుల యందు అంతర్లీనంగా నేనే  ఉన్నాను. ప్రకృతి మొత్తం వ్యాపించి ఉన్నాను. నా శరీరమే భూమి. అంతటా నేనే ఉన్నాను. నువ్వు ఎప్పుడు దేన్ని బాధించినా, నన్ను బాధించినట్టే రా. నువ్వు ఆడుకున్న పిల్లిలో కూడా నేనే ఉన్నాను. నువ్వు దానికి పెట్టిన ఇబ్బంది వల్ల నాకు ఇలా అయ్యింది" అన్నది. క్షమించమ్మా! ఇంకెప్పుడు ఇలా చేయను అన్నాడు గణపతి.అప్పుడు వినాయకుడికి అన్ని దిశలయందు పార్వతీ దేవి దర్శనమిచ్చింది. కాబట్టి తన పూజకు ప్రత్యేకంగా ఒక దిక్కు కూడా అవసరం లేదని సెలవిచ్చాడట గణపతి.

ఈ కధను నుంచి మన గమనించవలసినది 'ఎవరు ప్రకృతిని ప్రేమిస్తారో, పర్యావరణాన్ని రక్షిస్తారో, వారిని దీవిస్తాడు విఘ్ననాయకుడు'. వినాయకపూజ ప్రకృతికి (పార్వతీ దేవి) హాని కలిగిచని రీతలో, వినాయకుడికి నచ్చే రీతిలో, గణపతి మెచ్చే రీతిలో జరుపుకోవాలి. భూమి/మట్టి శివస్వరూపం. ప్రకృతి పార్వతీ స్వరూపం. మట్టితో చేసిన గణపతిని పూజించడమే శ్రేష్టం. అందుకే గణపతి సంకటహర చవితి పూజకు తదియతో కూడిన చవితే చాలా శ్రేష్టం అని చెప్తారు. తదియ అంటే పార్వతీ దేవి/ గౌరీమాత. చవితి అంటే గణపతి. గౌరీగణేశుడికి ప్రతీక సంకటహర చవితి. అలాగే మట్టి గణపతి కూడా గౌరీగణపతికి ప్రతీక.

వినాయకచవితికి మట్టిగణపతులనే పూజించండి. మనం ప్రకృతిని పేమిస్తే, గణపతి మనల్ని ప్రేమిస్తాడు. మనం ప్రకృతిని రక్షిస్తే, గణపతి మనల్ని రక్షిస్తాడు.         

The 36 Contemporary Dharmic Principles by Satguru Sivaya Subramuniaswami.

The 36 Contemporary Dharmic Principles by Satguru Sivaya Subramuniaswami.

1. Simplify life and serve others.
2. Live in spiritual company
3. Seek fresh air and sunshine
4. Drink pure water. 
5. Eat simple, real foods, not animal flesh.
6. Live in harmony with nature.
7. Consume what you genuinely need rather than desire.
8. Revere the many forms of life. 
9. Excercise 30 minutes every day.
10. Make peace, not noise.
11. Make a temple of your home.
12. Develop an art form or craft
13. Make your own clothing and furniture.
14. Express joy through song amd dance.
15. Grow your own food organically.
16. Plant twelve trees a year.
17. Purify your environment.
18. Leave beauty where you pass.
19. Realize God in this life.
20. Be one with your guru.
21. Be nonviolent in thought and action.
22. Love your fellow man.
23. Rely on the independent energy in the spine.
24. Observe the mind thinking.
25. Cultivate a contemplative nature by seeking the light.
26. Draw the lesson from each experience in life.
27. Detach awareness from its objects.
28. Identify with infinite intelligence, not body, mind or intellect.
29. Be aware in the Eternal Now, not in the past or future.
30. Do not take advantage of trust or abuse credit.
31. Keep promises and confidences.
32. Restrain and direct desire.
33. Seek understanding through meditation.
34. Work with a spiritual discipline.
35. Think and speak only that which is true, kind, helpful, or necessary.
36. Create a temple for the next generation by tithing.

Sunday, 3 August 2014

అసలు స్నేహితునికి శుభాకాంక్షలు చెప్పారా?

ఈ రోజు ప్రపంచమంతా స్నేహితులు దినోత్సవం జరుపుకుంటున్నాం. స్నేహితులందరికి బ్యాండులు కట్టి, సందేశాలు పంపి స్నేహభావాన్ని వ్యక్త పరుస్తున్నాం. అందరికి అన్నీ చెప్పి ఉంటాం కానీ, ఒక్కరిని మాత్రం మర్చిపోయాం.


మనకు ఒక స్నేహుతుడు/స్నేహితురాలు ఉన్నాడు/ ఉంది. జీవితంలో మనకు కలిగే పరిచయాలన్నీ ఈ జన్మకే పరిమితమైతే, అతడితో మనకు అనేక జన్మల నుంచి, ఆనాది నుంచి పరిచయం ఉంది. కొందరితో కొన్నే పంచుకుంటాం, కానీ ప్రాణస్నేహితునితో అన్నీ పంచుకుంటాం. మనలో సగంగా భావించినా, స్నేహితుడు వేరొక వ్యక్తి. కానీ మనలోనే ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడు మన నుంచి వేరైనవాడు కాదు, మనకు అత్యంత సన్నిహితుడు. అతడు లేనేది ప్రాణం కూడా ఉండదు. అంత దగ్గరివాడు. మనం చెప్పుకుంటే కానీ, మన గురించి ఇతరులకు తెలియదు, అది సుఖమైనా, దుఃఖమైనా. కానీ ఇప్పుడు నేను చెప్తున్న వాడికి మన గురించి అన్నీ తెలుసు. మనం ప్రత్యేకించి చెప్పుకోవలసిన పనేలేదు. మన గురించి అన్నీ తెలిసినా, నోరు జారి ఎక్కడ ఎవరికి మన రహస్యాలు చెప్పడు. మనమే ఎక్కడో నోరు జారి చెప్పుకుంటేమేమో? అంత నమ్మకస్థుడు. మనం పట్టించుకోలేదని బాధపడడు, కోప్పడడు, అలగడు. అర్దం చేసుకున్నవారితో ఆడతాడు, పాడతాడు, నాట్యం చేస్తాడు, ఒక్కోసారి జోకులు కూడా వేస్తాడు. మీరు కొట్టిన, తిట్టినా, వ్యంగ్యాస్త్రాలు సంధించినా నవ్వుకోని క్షమించే కారుణ్యమూర్తి వాడు. కుళ్ళు, కోపం, ద్వేషం, అసూయ మొదలైన దుర్గుణాలే లేనీ సుగుణవంతుడు. ఆయన ఎవరో కాదు, మన నుంచి వేరు కానీ పరమేశ్వరుడు, పరబ్రహ్మ, పరమాత్మ. ఇప్పటికి మన పూజ గదిలో కూర్చుని ఎప్పుడు స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు చెప్తామా? అని ఎదురు చూస్తున్నాడు. పూజ గదిలో ఏంటి, మదిలో, హృదయకూహరంలో ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే చెప్పండి మరి.

ఒకప్పుడు కుచేలుడు ఏమి లేక, అటుకులు ఇద్దామని తీసుకెళ్ళి, సిగ్గు పడుతూ, అటుకులు దాచుకుంటే, నా కోసం ఏమి తేలేదా? అంటూ అడిగిమరి అటుకులు తీసుకుని తనకంటే అధిక సంపద ఇచ్చాడు శ్రీ కృష్ణుడు. తాను భగవంతుడై ఉండి, కన్నీటితో ఒక మానవమాత్రుడి పాదాలను కడిగాడు. ఎందుకు? కేవలం తన పట్ల స్నేహ భావంతో మెలిగినందుకు, జీవితాంతం గుర్తుంచుకున్నందుకు. అటువంటి పరమాత్మకు శుభాకాంక్షలు చెప్పడానికి ఇంకా ఆలస్యం ఎందుకు? ఇంకా మీరు చెప్పలేదేమని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడే చెప్పండి. ఆనందంతో, ప్రేమతో, నిన్ను మర్చిపోలేదు, అందరూ నా మీద కోపగించుకున్నా, నాకు ఎప్పుడు తోడుగా ఉంటూ, నాతో పాటు అన్ని జన్మలు కలిసి ప్రయాణం చేసిన పరమాత్మ, నీకు స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు అని చెప్పండి. మీకు ఎవరు ఇష్టదైవమో, వారికి చెప్పండి. సఖ్యం, నవవిధ భక్తి మార్గాల్లో ఒకటి.

Friday, 1 August 2014

భారతీయసంస్కృతిలో పాములు

నాగపంచమి సందర్భంగా ఒక్కసారి మనకు, నాగులకు ఉన్న బంధం గురించి, మన భారతీయసంస్కృతిలో, సనాతన ధర్మంలో వాటికిచ్చిన స్థానం గురించి గుర్తుచేసుకుందాం.

యోగంలో పాము కుండలినిశక్తికి సంకేతం. ప్రతి మనిషిలోనూ కుండలిని అనే మహాశక్తి పాము రూపంలో వెన్నుపూసకు మూడు చుట్టలు చుట్టుకుని, తన పడిగను వెన్నుపూస క్రింది వైపుకు, తోకను పైవైపుకు వచ్చేలా నిద్రిస్తూ ఉంటుంది. యోగా, ధ్యానం మొదలైన సాధనల ద్వారా అది ఉత్తేజితమై మన శరీరంలో ఉన్న 6 చక్రాలను దాటుకుంటూ సహస్రారాన్ని చేరుతుంది. అలా కుండలినీశంక్తి సహస్రారకమలాన్ని చేరితే, మనిషి దివ్యానుభూతికి లోనవుతాడు. ఆ స్థితికి చేరడానికి ఎంతో సాధన కావాలి.

పాము చైతన్యానికి ప్రతీక. ప్రతి హిందూ దేవాలయంలోనూ నాగదేవత తప్పకుండా ఉంటుంది. విష్ణుమూర్తి ఆదిశేషుని మీద శయనిస్తాడు. శివుడు నాగభూషణుడు. పాములనే ధరిస్తా
డు. మన భూమిని ఆదిశేషుడు తన తల మీద మోస్తున్నాడు. వినాయకుడి యజ్ఞోపవీతం, ఉదరబంధనం సర్పమే. అమ్మవారి కురులు నాగులు. సుబ్రహ్మణ్యస్వామిని నాగులకు అధినాయకుడిగా కొలుస్తాము.

మన డి.ఏన్.ఏ. కూడా సర్పాకారంలో ఉంటుంది. మనిషి పుట్టుకకు కారణమైన వీర్యకణాలను సూక్ష్మదర్శని (మైక్రో్‌స్కోప్) ద్వారా పరిశీలిస్తే, అవి కూడా సర్పాకారంలోనే ఉంటాయి, వాటి కదలికలు కూడా పాములను పోలి ఉంటాయి. సంతానం కలగని వారు నాగదేవతను పూజించడం చేత సంతానం పొందిన ఉదంతాలు కోకొల్లలు.

వ్యవసాయదారులైన రైతులకు పాములు స్నేహితులు. పంటపొలాల్లో ఉన్న ఎలుకలను తినేసి పంటలను కాపాడుతాయి. పాములు, వాటి శరీర నిర్మాణం రీత్యా పూర్తిగా భూమిని తాకుతాయి. భూమిలో జరిగే ప్రతి చిన్న మార్పును పసిగట్టగలవు. ప్రపంచంలో ఏ మూలన భూకంపం వస్తున్న, కనీసం 30, 40 రోజుల ముందే పాములు పసిగట్టేస్తాయి. పాముల కదిలకలను గమనించి భూకంపాల నుంచి తప్పించుకోవచ్చని ఆధునిక పరిశోధకులు అంటున్నారు.

సనాతన ధర్మంలో నాగబంధం భార్యభర్తలకు ప్రతీక. భార్యభర్తల ఏ విధంగా కలిసి ఉండాలో, కలిసి అధ్యాత్మిక మార్గంలో ఉన్నతి సాధించాలో గుర్తుచేస్తుంది నాగబంధం. నాగారాధన చేయడం వలన చెవుడు రాదు, కంటి జబ్బులు దరిచేరవు.

పాములను చంపడం వలన నాగదోషం వస్తుందంటోంది ధర్మశాస్త్రం. పాములను చంపినా, లేక పాములను భయపెట్టి, పాము తన తలను నేలకేసి బాదుకుని చనిపోవడానికి కారణమైన వారు, పాముపుట్టలను ధ్వంసం చేసినవారి కుటుంబాలను నాగదోషం పట్టిపీడిస్తుంది. పాము, తన తల నేలకు కొట్టుకుని మరణించడానికి కారణమైన వారి వంశం నిర్వీర్యమవుతంది.

అందరు గుర్తుంచుకోవలసిన విషయం పాములను హింసించడం వల్లనే కాదు, తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోయినా, వృద్ధ తల్లిదండ్రులను వీధిపాలి చేసినా, బాధపెట్టినా నాగదోషం వస్తుంది. ధూమపానం(సిగిరెట్టు), మద్యపానం, మత్తుపధార్ధాలు తీసుకోవడం వంటి అలవాట్ల వల్ల కూడా నాగదోషం వస్తుంది. కాబట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.

పాములు కనిపిస్తే స్నేక్‌సెల్ వారికి అప్పగించండి. పాములను పూజించే సంస్కృతి మనది. చంపే సంస్కృతి కాదు. అందువల్ల పాములను చంపకండి. జీవవైవిధ్యంలో పాములు కీలక పాత్ర వహిస్తాతని గుర్తిచండి.

ఓం నమో మనసాయై