Labels
- Dharma
- Inspiring
- Ramana Maharshi
- Science and Hindusim
- Yoga
- ఉత్తరాఖండ్ వరదలు
- ఏకాదశి
- కార్తీక మాసం
- గణపతి
- గురు పూర్ణిమ
- గురుతత్వము
- చరిత్ర
- దేవి నవరాత్రులు
- దైవం
- ధర్మం
- నవదుర్గ
- పండుగలు
- పర్యావరణం / Ecology
- బతుకమ్మ పాటలు
- భూతాపం(Global Warming)
- మన దేవాలయాలు
- వినాయక చవితి
- వినాయకచవితి కధలు
- సంకష్టహర చవితి
- సంప్రదాయం - శాస్త్రీయం
- సూక్తులు
- స్తోత్రాలు
- హిందూ విజ్ఞానం
Showing posts with label తత్వం. Show all posts

Monday, 25 July 2016
Friday, 25 December 2015
తేనేటీగా నా గురువు - దత్తుడు
తేనెటీగ నా గురువు. తేనెటీగ తాను ప్రపంచమంతా తిరుగుతూ మకరందాన్ని సేకరిస్తుంది. తాను ఏ పువ్వు మీద వాలినా, ఆ పువ్వుకు ఎటువంటి హాని చేయకుండా, తన పని ఎంటో అదే తాను చేసుకుంటుంది. అలాగే ముక్తిని కోరే సాధకుడు కూడా అన్ని ఆధ్యాత్మిక గ్రంధాలను చదివినా, తన సాధనకు ఏది అవసరమో, ఎంత వరకు అవసరమో అంతవరకే గ్రహించాలని, అనవసరమైనవి, ఆధ్యాత్మిక సాధనను భంగం చేసే వాటిని విసర్జించాలని నేను తేనెటీగ ద్వారా గ్రహించాను.
తేనెటీగ ఆ పువ్వు, ఈ పువ్వు అని చూడదు. మకరందం ఎక్కడ దొరుకుతుందా అని మాత్రమే చూస్తుంది. అలాగే సాధకుడు కూడా మొహమాటానికి వెళ్ళకుండా, ఎక్కడ జ్ఞానం ఉన్నా, దాన్ని గ్రహించడానికి సదా సిద్ధంగా ఉండాలని తెలుసుకున్నాను.
శ్రీ గురు దత్తాత్రేయ

Thursday, 24 December 2015
గొంగళిపురుగు నా గురువు - దత్తుడు
నా గురువులలో గొంగళిపురుగు ఒకటి. కందీరిగ తన గొంగళి పురుగును తీసుకెళ్ళి తన గూట్లో పెట్టి, జుంకారం చేస్తూ దాని చుట్టు తిరుగుతుంది. అది చూసిన గొంగళిపురుగు, భయంతో మరే ఇతర ఆలోచన లేక తదేకంగా తన తల్లైన కందిరీగనే గమనిస్తుంది. మనసులో కందిరీగ తప్ప మరే ఇతర ఆలోచనా ఉండదు. దాన్నే తీక్షణంగా గమనిస్తుంది. ఆ కందిరీగ మీద తదేక ధ్యానం చేత, గొంగళిపురుగు క్రమంగా రెక్కలు వచ్చి, రూపాంతరం చెంది కందిరీగగా మారి, ఎగిరిపోతుంది. అదే విధంగా సాధకుడు కూడా తన మనసును తదేకంగా దేని యందు లగ్నం చేస్తాడో, అతడు ఆ స్వరూపాన్నే పొందుతాడని దాని ద్వారా నేను తెలుసుకున్నాను.
నిరంతరం మనసు దేనిని మననం చేస్తుందో, అది స్వరూపాన్నే సంతరించుకుంటుంది. కనుక ముక్తిని కోరే వ్యక్తి సదా ఆత్మ యందు ధ్యానం నిలిపితే, అతడు ఆత్మ స్థితి యందే స్థిరపడిపోతాడు.
శ్రీ గురు దత్తాత్రేయ స్వామి

Monday, 27 April 2015
భూమాత అరోగ్యమే మన ఆరోగ్యం - భవిష్యత్తు మన చేతుల్లోనే
యత్ పిండాండే తత్ బ్రహ్మాండే అని శాస్త్రం అంటుంది. అనగా ఏది పిండాండంలో ఉందో, అదే బ్రహ్మాండంలోనూ ఉంది అని అర్దం. పిండాండం అనగా ఈ శరీరం ................ ఒకే పదార్ధం నుంచి ఈ సృష్టి ఏర్పడింది. దానిలో భాగమే ఈ భూగోళం, భూమి నుంచి వచ్చిదే ఈ దేహం. శరీరం భూమిలో భాగం. అదీగాకా హిందు ధర్మం ప్రకారం భూమి జీవం లేని మట్టి ముద్ద కాదు. భూమిలో జీవం ఉంది, శక్తి ఉంది, సర్వజీవులకు పుష్టినిచ్చే శక్తి ఉంది. శక్తి ఉంటే ఆమెను దర్శించవచ్చు, మాట్లాడవచ్చు, కబుర్లు చెపచ్చు, రోగాలను నయం చేసుకోవచ్చు. మనకులాగా భూమికి ప్రాణం ఉంది. అందుకే ఆవిడను భూమాత అన్నారు. మనకున్న శరీరంలానే, ఆవిడకు ఒక శరీరం ఉంది. అదే భూమి. మనకు శరీరంలో రోగనిరోధకశక్తి ఉన్నట్లే, భూమాతకు ఉంది. రకరకాల మార్పుల ద్వార ఆవిడ తనలో కలిగిన దోషాలను తొలగించుకుంటుంది.
మనిషికి పంచకోశాలు ఉన్నట్లే భూమాతకు పంచకోశాలున్నాయి. ప్రాణమయకోశంలో దోషాలు ఏర్పడప్పుడు వ్యక్తికి స్థూలసరీరంలో రోగాలు సంభవిస్తాయి. అట్లాగే భూమాతకు ప్రాణమయకోశంలో దోషం ఏర్పడితే అవిడకు రోగలు వస్తాయి. భూమాతకు ప్రాణమయకోశం వాతావరణమే. భూవాతవారణం చెడిపోయిన కారణంగా ఆవిడ స్థూలశరీరంలో అనారోగ్యం సంభవిస్తోంది. దాని ఫలితమే తరచూ సంభవించే ప్రకృతి ఉపద్రవాలు.
మానవుడి మనోమయకోశంలో దోషాల కారణంగా మానసిక సమస్యలు ఏర్పడతాయి. భూమాతకు అంతే. ఇది మరచిన మానవుడు ఈ రోజు రకరకాల చర్యలతో భూవాతావరణాన్ని పాడు చేస్తున్నాడు. అనగా భూమాత ప్రాణమయకోశాన్ని కలుషితం చేస్తున్నాడు. హింస, క్రూర ఆలోచనల ద్వారా మనోమయ కోశాన్ని పాడు చేస్తున్నాడు. వాటి కారణం చేతనే మానవుడు ప్రకృతి విలయాలకు అతలాకుతలమవుతున్నాడు .......................
భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం భూమాత గర్భంలో ఉన్నాం. భూమికి ఏం జరిగినా, అది నేరుగా మన మీదే ప్రభావం చూపిస్తుంది. కనుక మనం సుఖంగా ఉండాలన్న, మన భూతల్లి సుఖంగా ఉండాలన్న భూమాతపట్ల మానవ దృక్పధంలో మార్పు రావాలి. భూమిలో ఉన్న అమ్మను గుర్తించాలి, ఆవిడకు హాని చేసే చర్యలను మానుకోవాలి. ప్రకృతిని పరిరక్షించాలి. సర్వమానవాళి అమ్మ ఆరోగ్యాన్ని రక్షించుకునే విధంగా నడుచుకోవాలి. అమ్మ ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం.

Thursday, 27 November 2014
శ్రీ సుబ్రహ్మణ్యస్వామి తత్త్వం
అవ్యక్తం, వ్యక్తం, మహత్, అహంకారం - ఈ నాలుగు పంచభూతాత్మకమైన సృష్టికి ఆధారమైనవి. ఇందులో అవ్యక్తం - పరమశివుడు, వ్యక్తం - పార్వతీ దేవి, మహత్ తత్త్వం గణపతి, అహకారం కుమారస్వామి. నిజానికి ఒక పరతత్వం యొక్క నాలుగు భూమికలివి.
'అహంకారం' అంటే లోకంలో అనుకునే గర్వం అను భావం కాదు, 'నేను' అనే స్పృహని అహంకారం అంటారు. ఈ సృష్టి వ్యష్టిగానే కాక, సమిష్టిగా కూడా ఉంటుంది. ఈశ్వరుని పరమగానూ ఈ భావం ఉంటుంది. ఇక్కడి నుంచే సృష్టి విస్తృతి ప్రారంభమవుతుంది.
చైతన్యం ఒక్క లక్షణం-అహంకారం. ఈ సృష్టిలో కృతిమంగా, యాంత్రికంగా, వైజ్ఞానిక సాంకేతికంగా ....... మానవుని మెదడు వంటి జ్ఞాపకశక్తి గల యంత్రన్ని తయార్ చేయవచ్చు. కానీ దానికి 'నేనీ పని చేస్తున్నాను' అనే అహంభావం - స్పందన ఇవ్వలేం. అది కేవలం స్వాభావికమైన సృష్టి లక్షణం. అనుభూతులకీ, ఆలోచనలకీ, స్పందనలకీ, కేంద్రం ఈ 'అహం' తత్త్వమే.
ఈ అహంతత్త్వానికి ప్రతీక - సుబ్రహ్మణ్యుడు. రహస్యంగా అందరిలో ప్రకాశించే పరమాత్మ చైతన్యమిది కనుక 'గుహః' అని స్వామిని అన్నారు. జ్ఞానలక్షణం గల తత్త్వం కనుక గురుగుహ అన్నారు.
అమోఘమైన శివతేజాన్ని ధరించిన తత్త్వం కనుక 'శక్తిధరుడు' అని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని అన్నారు.
- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ

Tuesday, 11 November 2014
అక్బర్ - బీర్బల్ - 4 ప్రశ్నలు
ఒకప్పుడు అక్బర్ బాదుషా తన మంత్రి ఐన బీర్బల్ను 4 ప్రశ్నలు అడిగెను.......
1.....దేవుడు యెచట నివసించును?
2...అతని పని యేమి?
3....అతడేమి భుజించును?
4...కేవల సంకల్ప మాత్రంచే సమస్తము చేయగలిగి ఉండగా అతడు మానవ రూపము యేల ధరించవలె?..
అప్పుడు బీర్బల్ ఈ క్రింది విధంగా సమాధానాలు ఇచ్చెను..
1....దేవుడు సర్వవ్యాపకుడు,,అతడు పవిత్రులైన తన భక్తుల హృదయంలో కానబడును..నీవు కూడా అతనిని నీ హృదయము నందు గాంచ వచ్చును...
2..అతడు ఉన్నత స్థితియందున్న వారిని పతనమొనర్చి ,,పతితులను ఉన్నత స్థితికి గొంపోవును...
3...అతడు జీవుల యొక్క అహంకారమును భుజించును..
అటు పిమ్మట 4వ ప్రశ్నకు అలోచించి తగిన సమాధానము నొసంగుటకై బీర్బల్ కొంత గడువును కోరెను..
తదంతరము బీర్బల్ అక్బరు యొక్క బిడ్డను రక్షించుచున్న దాది వద్దకువచ్చి ఆమెతో ఇట్లనెను..`ఈ దినము నాకు నీవు ఒక విషయమై సహకరించవలెను..నేను అక్బరుకు ఒక నిశ్చితమైన వేదాంత ప్రశ్నకు సమాధానము చెప్పవలసి ఉన్నది..అక్బరు ఈ చెరువు వద్దకు తన శిశువుతో ఆడుటకై వచ్చినపుడూ ఆ శిసువును యెచటనైన దాచి ఉంచి, శిశువు యొక్క ఈ బొమ్మను నీ వద్ద ఉంచుకొనుము.. ఆ శిశువు పడిపోవుచున్నట్లు చేసి, ఆ బొమ్మను చెరువులో పారవేయుము.. అప్పుడు జరగనున్న తమాషాను గమనించుము.. దీనినంతటిని నైపుణ్యముతో చేయుము.. నీవు నైపుణ్యత కలదానివని నాకు తెలియును..: అని చెప్పీతడామెకు పదిరూపాయిలు పారితోషికముగా ఇచ్చెను.. ఆమె మిక్కిలి సంతుష్టియై అతను చెప్పినట్లు చేయుటకు అంగీకరించెను..
అక్బరు తన సాయంకాలపు షికారు నుండి తిరిగి వచ్చి చెరువు పక్కనున్న బల్లపై కూర్చుండెను.. అప్పుడు బిడ్డను తీసుకొని రమ్మని దాదిని అడిగెను.. అప్పుడా దాది చెరువు ప్రక్కకు వెళ్ళి బొమ్మబిడ్డను తెస్తూ అది పడిపోవుచున్నట్లుగా నటిస్తూఆ బొమ్మ శిశువును చెరువులో పడవేచెను..
అక్బరు ఆ బిడ్డను రక్షించుటకై చెరువులో దూకుటకు పరుగెత్తెను.. అప్పుడు బీర్బల్ అడ్డము వచ్చి `నీ బిడ్డ ఇచ్చటనే ఉన్నాడు.. దొందర పడకుడు..: అని పలికెను..
బీర్బల్ యొక్క అమర్యాదతో కూడిన ప్రవర్తనకు అక్బరు మిక్కిలి కోపోద్రిక్తుడై అతనిని మంత్రి పదవి నుండి తొలగించి శిక్షించుటకై ఆజ్ఞాపించెను..
నేనిప్పుడు మీ 4వ ప్రశ్నకు అనుభవ పూర్వకమైన సమాధానమొసంగితినని: పలికెను.. మీరు నాపై యెందుకు కోపగించుకొన్నారు.? మీ బిడ్డను రక్షించుటకై అనేకమంది సేవకులుండగా మీ బిడ్డయందున్న వాత్స్చల్యము బట్టి మీరే నీటియందు దూకుటకు సిద్ధపడ్డారు.. అదే విధంగా భగవంతుడు కేవలము తన సంకల్పమాత్రము చేతనే సమస్త కార్యములను చేయు సామర్ధ్యము కలిగి ఉండియూ అతడికి తనభక్తులయందు ప్రేమచే వారికి దర్శనం ఇచ్చుటకై అతడు ఈ భువిపై అవతరించును..ఈ విషయము మీకు అర్ధమైనదా?
ఈ విషయమంతయూ విని అక్బరు మిక్కిలి సంతసించి బీర్బల్కి విలువైన బహుమతులను,వజ్రఖచిత ఉంగరమును ,శాలువాను అర్పించెను..
ఇట్లు భగవంతుడు మానవజాతిని ఉద్ధరించుటకై అవతరించు చుండును....
సేకరణ: Jnana Valli

Wednesday, 1 October 2014
సరస్వతీ తత్వం
సరస్వతీ అనే పదంలోనే అమ్మవారి తత్వం దాగివుంది. సరః అంటే సారము, స్వ అంటే తన యొక్క అని అర్దం. తన యొక్క సారాన్ని/తత్వాన్ని సంపూర్ణంగా తెలిపేది సరస్వతి.
మనం ఆత్మ స్వరూపులం అయినా, మనల్ని మనం ఈ శరీరంగా భావించుకుంటాం. మనసుకు కలిగిన బాధలను మనవిగా భావించి బాధపడతాం. పూర్వజన్మ కర్మఫలాలను అనుభవించేది దేహము, దేహంలో ఉన్న మనస్సే కానీ, మనం కాదు. కానీ శరీరానికి కలిగిన కష్టనష్టాలకు, దుఃఖాలకు కృంగిపోతాం. అహంకారమమకారాలకు బానిసలమై, పరిమితి కలిగిన ఈ దేహాన్నే మనంగా ఊహించుకుంటూ జీవిస్తున్నాం.
కానీ నిజానికి మన తత్వం ఏమిటి? మనమేమిటి? అని ఆలోచిస్తే ఎప్పుడు మనలో 'నేను' అనే తలంపు ఒకటి మెదులుతుంటుంది. ఈ దేహం పుట్టినప్పటి నుంచి మరణించేవరకు ఆ తలంపు మనల్ని వీడదు. ఆ 'నేను' అనే తలంపు ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకునేందుకు ధ్యానంలో విచారాణ ప్రారంభిస్తే, అది ఆఖరున ఆత్మలో లయమవుతుందంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆత్మ మన సహజ స్థితి, నిత్యానంద స్థితి, ఆత్మయే మనం. ఈ శరీరంలో ఆత్మ ఉండడం కాదు, ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది, ఆ ఆత్మయే మనం. ఆత్మకు పరిమితి లేదు, ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, ఈ లోకంలో ఆత్మ తప్ప మరొకటిలేదు.
ఈ ఆత్మ తత్వమే సనాతన భారతీయ సంస్కృతిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిపింది. ప్రపంచంలో ఇతర మతాలు అశాశ్వతమైన ఈ శరీరం గురించి చెప్తే, మన ధర్మం సనాతనమైన ఆత్మ తత్వం గురించి ప్రపంచానికి చెప్పింది. మానవజన్మకు సార్ధకత/ నిర్యాణం/ మోక్షం లభించాలంటే ఆత్మ తత్వం అర్దమవ్వాలి. అటువంటి ఆత్మ తత్వం(మన తత్వం) గురించి మనకు సంపూర్ణంగా తెలియజేస్తుంది కనుక అమ్మను సరస్వతీ దేవిగా ఆరాధిస్తాం.
ఓం సరస్వత్యై నమః
మనం ఆత్మ స్వరూపులం అయినా, మనల్ని మనం ఈ శరీరంగా భావించుకుంటాం. మనసుకు కలిగిన బాధలను మనవిగా భావించి బాధపడతాం. పూర్వజన్మ కర్మఫలాలను అనుభవించేది దేహము, దేహంలో ఉన్న మనస్సే కానీ, మనం కాదు. కానీ శరీరానికి కలిగిన కష్టనష్టాలకు, దుఃఖాలకు కృంగిపోతాం. అహంకారమమకారాలకు బానిసలమై, పరిమితి కలిగిన ఈ దేహాన్నే మనంగా ఊహించుకుంటూ జీవిస్తున్నాం.
కానీ నిజానికి మన తత్వం ఏమిటి? మనమేమిటి? అని ఆలోచిస్తే ఎప్పుడు మనలో 'నేను' అనే తలంపు ఒకటి మెదులుతుంటుంది. ఈ దేహం పుట్టినప్పటి నుంచి మరణించేవరకు ఆ తలంపు మనల్ని వీడదు. ఆ 'నేను' అనే తలంపు ఎక్కడి నుంచి వస్తోందో తెలుసుకునేందుకు ధ్యానంలో విచారాణ ప్రారంభిస్తే, అది ఆఖరున ఆత్మలో లయమవుతుందంటారు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆత్మ మన సహజ స్థితి, నిత్యానంద స్థితి, ఆత్మయే మనం. ఈ శరీరంలో ఆత్మ ఉండడం కాదు, ఆత్మ ఈ శరీరాన్ని ధరించింది, ఆ ఆత్మయే మనం. ఆత్మకు పరిమితి లేదు, ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, ఈ లోకంలో ఆత్మ తప్ప మరొకటిలేదు.ఈ ఆత్మ తత్వమే సనాతన భారతీయ సంస్కృతిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలిపింది. ప్రపంచంలో ఇతర మతాలు అశాశ్వతమైన ఈ శరీరం గురించి చెప్తే, మన ధర్మం సనాతనమైన ఆత్మ తత్వం గురించి ప్రపంచానికి చెప్పింది. మానవజన్మకు సార్ధకత/ నిర్యాణం/ మోక్షం లభించాలంటే ఆత్మ తత్వం అర్దమవ్వాలి. అటువంటి ఆత్మ తత్వం(మన తత్వం) గురించి మనకు సంపూర్ణంగా తెలియజేస్తుంది కనుక అమ్మను సరస్వతీ దేవిగా ఆరాధిస్తాం.
ఓం సరస్వత్యై నమః
Tuesday, 30 September 2014
గాయత్రి మంత్రం
ఓం భూర్బువస్సువః – తత్సవితుర్వ రేణ్యం
భర్గోదేవస్య ధీమహి – ధీయో యోనః ప్రచోదయాత్!
గాయంతం త్రాయతే ఇతి గాయత్రి. గాయంతం అంటే గానం చేయడం,పాడడం. గాయత్రి మంత్రాన్ని నిత్యం గానం చేసే వారిని రక్షించేది గాయత్రి అని అర్దం.
గాయత్రి చంధసాం మాత - అన్ని మంత్రాలకు తల్లి గాయత్రి అని అర్దం.

తద్యత్ ప్రాణం త్రాయతే తస్మాద్ గాయత్రి.ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్దం.
గాయత్రి వేదమాత. గాయత్రి మంత్రానికున్న శక్తి వర్ణించలేనిది. 24 అక్షరాల ఈ మహా మంత్రానికి 32 మంది అధిదేవతలున్నారు. ఈ మంత్రాన్ని రక్షించేవారు. శివు
డు, విష్ణువు, బ్రహ్మ, నరసింహుడు, ఇంద్రుడు, సూర్యుడు..... ఇలా. ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఇంతమంది మన నిత్య జీవితంలో ఏదురయ్యే కష్టాలను తొలగించగల 32 దేవతలను స్మరించిన ఫలితం వస్తుంది.
అందుకే "గాయత్రి పరమో మంత్రః"అన్నారు. అంటే గాయత్రికి మించిన మంత్రం లేదు అని, గాయత్రీ మంత్రమే పరమమంత్రమని అర్దం. జ్ఞాపక శక్తిని పెంచి తీరుతుంది గాయత్రి మంత్రం.
ప్రపంచంలో గాయత్రి మంత్రం మీద జరుగినవి, జరుగుతున్న పరిశోధనలు మరే మంత్రం మీద కాని, ఇతర మతాల్లోని ఏ అంశం మీద గాని జరగలేదంటే అతిశయొక్తి కాదు. ఇప్పటివరకు గాయత్రి మంత్రం మీద జరిపిన ఏ అధునిక పరిశోధన విఫలమవకపోవడం ఆశ్చర్యం.
అనాదికాలం నుంచి భారతీయ ధర్మంలో గాయత్రిమంత్రాన్ని వర్ణబేధం లేకుండా స్త్రీపురుషులందరూ ఉపాసించారు.
'ఓ సచ్చిదానందా! అనంతస్వరూప! ఓ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ! ఓ నిరాకారా! సర్వశక్తివంతుడగు న్యాయకారీ! ఓ కరుణామృత వారధీ! నీ దివ్యము, వరేణ్యమూ అగు విజ్ఞానరూపమునుమేము నిత్యము ఉపాసింతుము. మాకు ధారణశక్తి గల బుద్ధినిత్తువు గాక! మేము ఆ బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది సద్‌వ్రతాలను ఆచరితుము గాక! విద్యా జ్ఞానము మొదలైన పరమసుఖములను పొందెదము గాక!' అంటూ గాయత్రి మంత్రానికి ఒక అర్దం ఉంది.

Monday, 29 September 2014
అన్నపూర్ణదేవి
అన్నం పరబ్రహ్మస్వరూపం. ఇది తరచూ పెద్దలు చెప్పే మాట. శాస్త్రమూ చెప్పిన మాట. అన్నం నుండే సమస్త జీవరాసి పుడుతోంది. ఆహారం తీసుకోవడం చేత, అది సప్తధాతువులుగా మారి, శరీరపోషణకు కారణమవుతోంది. సప్తధాతువుల్లఅన్నం అనగానే మన తెలుగిళ్ళలో బియ్యం ఉడకబెట్టగా తయారయ్యే పదార్ధం అని కాకుండా, సంస్కృత భాషలో అన్నం అంటే ఆహారం అన్న అర్దం ఉంది. ఈ లోకంలో ఆయా వాతావరణపరిస్థితులు, ప్రాంతాలను బట్టి వారి ఆహారపు అలవాట్లు ఉంటాయి. సంస్కృతభాషలో ఏ రకమైన పదార్ధానైనా అన్నం అనే అన్నారు. అందువల్ల ఏ విధమైన ఆహారపదార్ధానైనా పారేయడం దోషం అంటుంది శాస్త్రం. అంతే కాదు అహారం తినే సమయంలో కింద పడ్డ ఒక్కొక్క అన్నం మెతుక్కి 10,000 సంవత్సరాల నరకం అనుభవించవలసివస్తుంది. ఎన్నో జన్మలు ఆహారంలేక బాధపడవలసిన అగత్యం పడుతుందని శాస్త్రం చెప్పిన మాట.
ఎప్పుడు కూడా అన్నం మీద కోపం చూపించకూడదదు. పరబ్రహ్మస్వరూపమైన ఆహారాన్ని వృధా చేయకుండా తినడమే మనం అన్నపూర్ణదేవికి ఇచ్చే గౌరవం. ఆకలితో మానవులకు, ఇతర జీవరాశులకు ఆహారాన్ని అందించి క్షుద్(ఆకలి) బాధ తీర్చడమే మనం అన్నపూర్ణాదేవికి చేసే నిజమైన అర్చన.
ఆదిభిక్షువైన ఆ సదాశివునికి భోజనవేళ నిత్యం బంగారుపాత్రలో ఉన్న ఆహారన్ని, బంగారు గరిటెతో వడ్డించే ఆ అన్నపూర్ణదేవి ఈ లోకంలో అందరికి యొక్క ఆకలిని తీర్చుగాకా. అందరికి జ్ఞానాన్ని, వివేకవైరాగ్యాన్ని ప్రసాదించుగాకా.
Monday, 1 September 2014
వక్రతుండ నామార్ధం
ఓం గం గణపతయే నమః
గణపతికి వక్రతుండుడని పేరు. వక్రతుండ అనగానే వంకర తొండము కలవాడని చెప్పేస్తారు, కానీ నిజానికి అది వక్రతొండం కాదు, వక్రతుండం. వక్రానాం తుండయతి ఇతి వక్రతుండః అని అంటున్నది గణేశపురాణం. వక్రములను తుండనము చేయువాడు వక్రతుండుడు. వక్రములంటే దుష్టశక్తులు, దురలవాట్లు, చెడు సంస్కారాలు, పాపౌ ఆలోచనలు, నీచభావనలు మొదలైనవి చెప్పుకోవచ్చు. దుష్టులను శిక్షించేవాడు కనుక గణపతి వక్రతుండుడయ్యాడు. గణపతి శాంత స్వభావుడు అయినా, దుష్టులపట్ల చండశాసనుడు, కాలుడు. తన తొండంతో దుష్టులను, అరిష్టాలను, గండాలను, దోషాలను ద్వంసం చేస్తాడు. దుష్టులంటే వ్యక్తులే అని భావించనవసరంలేదు. మనలో కూడా అనేక చెడు సంస్కారాలు, నీచపు ఆలోచనలు ఉంటాయి. వాటిని నాశనం చేస్తాడు కనుక గణపతికి వక్రతుండ అని పేరు. అంతేకాదు, మనలో చెడు తొలగించినా, మనం మంచిగానే ప్రవర్తించినా, ఎదుటివారు మనకు కీడు చేయవచ్చు. కనుక అటువంటి వారి వక్రమైన ఆలోచనల పాలిట కాలుడై, నంశింపజేయువాడు కనుక గణపతికి వక్రతుండ అన్న నామం వచ్చింది.
పిల్లలు దురలవాట్లకు లోనైనప్పుడు, తల్లిదండ్రులు గణపతికి వక్రతుండ నామంతో జపించి, అర్చించి, వేడుకుంటే, తప్పుత్రోవ పట్టిన పిల్లలు తిరిగి మంచిమార్గంలోకి వస్తారు. ఈ వక్రతుండ అన్న నామం చాలా మహిమాన్వితమైంది. తంత్రశాస్త్రంలో సదాచారతంత్ర విధానంలో 'ఓం వక్రతుండాయ నమః' అనే వక్రతుండ గణపతి మంత్రానికి ఒక బీజాక్షరం చేర్చి, జపిస్తారు. ఈ వక్రతుండ గణపతి మంత్రాన్ని గణపతి గురించి తెలిసినవారి వద్దనుంచి గ్రహించి జపించాలి. ఆ జపం చేయడం వలన ఉపాసకుడి పై చేసిన ప్రయోగాలు విఫలమవుతాయి. మనం ధార్మికంగా ఉన్నా, లోకమంతా వ్యతిరేకంగా మారి, మనపై యుద్ధానికి వస్తున్న సమయంలో, ఈ వక్రతుండ గణపతిని జపిస్తే, చాలా త్వరగా వక్రమైన ఆలోచనలు నశించి, మిత్రభావం ఏర్పడుతుంది. ప్రపంచంలో అల్లకల్లోలాలు, ఉత్పాతాలు, యుద్ధాలు ముంచుకొస్తున్న సమయంలో వక్రతుండ గణపతి మంత్రాన్ని జపిస్తే, తక్షణమే ఫలించి, లోకంలో శాంతి ఏర్పడుతుందని చెప్పారు సద్గురు శివాయ సుబ్రహ్ముణియ స్వామి వారు. ఎప్పుడైనా ఆపదలు ముంచుకోస్తే, పరిస్థితులు చేజారితే, వెంటనే వక్రతుండ అనే నామంతో గణపతి స్మరించాలి. రక్షణ కలుగుతుంది. తొండం యొక్క పర్స్తావన వచ్చింది కనుక గణపతికి ఉండే వంకర తిరిగిన తుండం ఓంకారానికి సంకేతం అని గుర్తుపెట్టుకోండి.
ఓం వక్రతుండాయ నమః
వక్రములను తొలగించే ఆ గణపతి మనలోని చెడు భావనలను తొలగించుగాకా

Friday, 8 August 2014
లక్ష్మీకటాక్షం కలగాలంటే.........
చాలామంది లక్ష్మీకటాక్షం కలగడానికి చాలా పూజలు చేస్తుంటారు. లక్ష్మీకటాక్షం కలగాలంటే ముందు బద్ధకం వదలాలి. బద్దకం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని దూరం చేస్తుంది. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు ఉదయమే, సూర్యోదయానికి ముందే కుటుంబసభ్యులందరూ నిద్రలేచి, స్నానాలు మిగించి దైవారాధన, దీపారాధన చేస్తారో, నిత్యమూ ప్రాతఃకాలంలో ఏ ఇంటి వాకిలి శుభ్రపరచి, అలికి ఉంటుందో, ఏ ఇంట్లో వ్యక్తులు ఉదయిస్తున్న శ్రీ సూర్యనారాయణ స్వామికి నమస్కరిస్తారో, ఆ ఇంటికి మాత్రమే వస్తుంది సిరులతల్లి లక్ష్మీదేవి.ఎవరు ఇంట్లో నిత్యం విడువకుండా ఉదయం, సాయంత్రం సంధ్యాకాలంలో దీపారాధన చేస్తారో, ఆ ఇంట్లో మాత్రమే లక్ష్మీకటాక్షం ప్రసరిస్తుంది. దీపారాధనకు అంటే విద్యుత్‌దీపాలు వేయడం కాదు, ఆవునెయ్యి/నువ్వుల నూనెతో వెలిగించిన దీపమే లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతుంది. అలా కాకా ఏ ఇల్లూ దీపం పెట్టకుండా ఉంటుందో, ఆ ఇల్లు శ్మశానంతో సమానమని, అటువంటి ఇళ్ళకు తాను వెళ్ళలని శ్రీ మహాలక్ష్మి స్వయంగా చెప్పింది.
అనవసరంగా మాట్లాడేవారు, ఇతరులకు సంబంధించిన విషయాల మీద విమర్శిస్తూ కాలక్షేపం చేసేవారు, మద్యపానం, ధూమపానాం, మత్తుపదార్ధాలు స్వీకరించేవారి వద్ద లక్ష్మీ క్షణం కూడా నిలువదు. దొంగలు, మోసగాళ్ళు, అబద్దాలాడేవారంటే లక్ష్మీదేవికి గిట్టదు. ఎవరికీ ఏదీ దానం చేయనివారికి లక్ష్మీదేవీ ఏదీ ఇవ్వదు.
కేవలం లక్ష్మీదేవిని మాత్రమే ఆరాధిస్తే సరిపోదు. శ్రీ మహావిష్ణువును కూడా ఆరాధించాలి. అమ్మవారి విష్ణుమూర్తిని అస్సలు విడిచిఉండలేదట. అందుకే అమ్మకు నిత్యాన్నపాయిని అని పేరు. లక్ష్మీదేవికి సంబంధించిన ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, తప్పకుండా విష్ణు మూర్తిని ఆరాధించాలిసిందే. అప్పుడే ఫలితం లభిస్తుంది.
ఓం నమో లక్ష్మీనారాయణాయ
Saturday, 12 October 2013
దుర్గ అన్న నామమే పరమపవిత్రం.
దుర్గ అన్న నామమే పరమపవిత్రం.
దుర్గమాసురుడనే రక్షసుడిని సంహరించింది కనుక అమ్మను దుర్గా అని పిలుస్తాం.దుర్గ అంటే కష్టాలను తొలగించేదని, తెలుసుకునేందుకు కష్టమైనదని అర్దం.
దుర్గ అనే నామంలో 'ద'కారం దైత్యనాశనానికి, 'ర'కారం రోగనాశనానికి,
'గ' కారం జ్ఞానానికి సంకేతాలు. దైత్యులంటే రాక్షసులు. రాక్షసులు ఎక్కడో ఉంటారనుకుంటే పొరపాటే. దైత్యులు నిత్యం మనసులో ఉద్భవిస్తునే ఉంటారు.
అహకారం, మూర్ఖత్వం, బద్ధకం, ఇతరులను బాధపెట్టి సంతోషించడం, దోపిడి చేయడం, అబద్దాలు చెప్పడం, ఎప్పుడు నిద్రిస్తూనే ఉండడం, దైవశక్తిని విశ్వసించక ధర్మానికి విరుద్ధంగా వెళ్ళడం, వేదాన్ని, శాస్త్రాలను, ఇతిహాసాలను గౌరవించకపోవడం, ప్రకృతిని కలుషితం చేయడం, యజ్ఞయాగదులను, అగ్నిహోత్రాలను విమర్శించడం, స్త్రీలను గౌరవించపఓవడం, పరస్త్రీలను కామభావనతో చూడడం, జూదం, మధ్యపాన, ధూమపానం, వ్యబిచారం మొదలైనవి రాక్షస లక్షణాలు. హిరాణ్యాక్ష హిరణ్యకశ్యపుల దగ్గరి నుంచి మహిషాసురుడు, నరకాసుడు....... ఒక్కడేమిటి ప్రతి రాక్షసుడిలో ఈ లక్షణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అందరిలోనూ ఉంటాయి. ఈ లక్షణాలు వ్యక్తిని సర్వనశనం చేస్తాయి. ఇటువంటి రాక్షసలక్షణాలను తన ఉపసాకుల నుంచి తొలగిస్తుంది 'దుర్గా' నామంలో ఉండే 'ద'కారం.
పూర్వజన్మ కృతం పాపం వ్యాధిరూపేణ పీడితః అన్నారు. పూర్వజన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో రోగంగా పీడిస్తుంది. రోగం అంటే మానసిక, శారీరిక రోగాలు మాత్రమే కాదు, దురాశ, శోకం, కపటత్వం, కుళ్ళు, ఇతరుల వస్తువులను పొందాలనుకోవడం, అవినీతి మొదలైనవి మనిషిని నిలువెల్లా దహించే భయానకరోగాలు. ఇవి వ్యక్తినే కాదు, మొత్తం సమాజానికి చేటు చేస్తాయి. దుర్గా నామంలో ఉండే 'ర'కారం సకల విధములైన రోగాలను నాశనం చేస్తుంది.
ఇక 'గ'కారం జ్ఞానానికి సంకేతం. జ్ఞానం అనగానే మన లోకానికి సంబంధిచిన జ్ఞానమని ఎప్పుడు అనుకోకూడదు. సమస్తబ్రహ్మాండాలను తన సంకల్పమాత్రం చేత సృష్టించి, పోషించి, లయం చేయగలిగిన పరమేశ్వరిని మనకు, ఏది తెలుసుకుంటే ఇక అన్ని తెలుస్తాయో, దేన్నీ తెలుసుకోవడం వలన ఇక ఏదీ తెలుస్కునే పని ఉండడో, ఏది సనాతనమో, సత్యమో, నిత్యమో........... అటువంటి పరలోకపు జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి పునర్జన్మ అవసరంలేని నిర్వాణ స్థితిని ప్రసాదిస్తుంది. మనం ఈ శరీరంకాదు, శరీరాన్ని ధరించిన ఆత్మస్వరూపులమని అనుభూతిని కలిగిస్తుంది.
ఈ విధంగా దుర్గా అన్న నామమే పరమశక్తివంతమైనది. ఇక అమ్మ వైభవం గురించి ఏమని చెప్పుకునేది? అమ్మ వైభవం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ఓం దుర్గాయై నమః

Thursday, 10 October 2013
శ్రీ మహాలక్ష్మీ
శ్రీ మహాలక్ష్మీ సిరులతల్లి, విష్ణుపట్టపురాణి. ఈ లోకంలో అందరూ లక్ష్మీకటాక్షం కోసం చేయని పూజ ఉండదు.
లక్ష్మీదేవి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే డబ్బు, అధికారం, భవనాలు మొదలైన భౌతిక సంపద అని మాత్రమే అనుకోకూడదు. ఈ భౌతిక సంపద అశాశ్వతమైనది. ఈ భౌతిక సంపదలన్నీ జీవించి ఉన్నంత వరకే. మరణనించాకా ఆత్మతో పాపపుణ్యాలు, వాసనలు తప్ప ఈ బౌతిక సంపదలు రావు. లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్టసమయంలో దైర్యాన్నిచ్చేది, కష్టాల నుంచి తప్ప్కించుకోవడం కాదు, కష్టాలను ఎదుర్కునే బలాన్ని ఇస్తుంది, పూర్వజన్మ వాసనలను రూపుమాపి, పాపపుణ్యాలను క్షయం చేసుకుని, జ్యోతిస్వరూపమైన పరమాత్మలో ఆత్మను ఐక్యం చేసే జ్ఞాన సంపదను లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.
లక్ష్మీదేవి తత్వం అంతటా వ్యాపించి ఉంటుంది. లక్ష్మీకటాక్షం మనపై ఎప్పుడు ఉంటుంది, కానీ అది గుర్తించే పరిస్థితుల్లో మనం ఉండము, అంతే. ఈ మానవ జన్మ కలగడం ఆమె అనుగ్రహమే. ఈ జన్మను మంచికార్యాలకు, భగవద్భక్తికి, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఉపయోగించుకోవడం, ఈ శరీరాన్నిచ్చిన లక్ష్మీదేవికి మనం చేసే అర్చన. ఆరోగ్యంగా జీవించడం కూడా లక్ష్మీకటాక్షమే. ఆత్మ తత్వం తెలుసుకోవాలంటే ఈ మానవదేహం చాలా అవసరం. అటువంటి ఈ దేహ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఆరోగ్యలక్ష్మీకి చేసే ఆరాధనవుతుంది.
యా దేవీ సర్వ భూతేషు లక్ష్మీ రూపేణా సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
సర్వజీవులయందూ జీవసక్తిగా, ప్రాణశక్తిగా లక్ష్మీదేవి కొలువై ఉంది. సర్వజీవుల పట్ల దయ కలిగి ఉండడం, ఇతర జీవల ఆకలి తీర్చడం, వాటి జీవనానికి సహాయపడడం భూతలక్ష్మీకి (భూతములంటే జీవజాలం అని అర్దం) చేసే పూజ. అందరికి కొద్దొగొప్పొ డబ్బు ఉంటుంది. ఆ ధనాన్ని ధర్మకార్యాలకు వెచ్చించడం మనం ధనలక్ష్మికిచ్చే గౌరవం అవుతుంది. సంతానం లక్ష్మీదెవి అనుగ్రహం వల్లనే కలుగుతుంది, పిల్లల రూపంలో లక్ష్మీదేవి ఇంటిలో తిరుగుతుంటుంది. అటువంటి పిల్లల్లో దేశభక్తిని, దైవభక్తిని పెంపొందించడం, మంచి విద్యావంతుల్ని చేయడం ద్వారా సంతానలక్ష్మీని పూజించినవారమవుతాం.
లక్ష్మీదేవికి నిత్యానపాయిని, విష్ణువును విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. విష్ణువంటే వ్యాపకత్వం కలిగినవడు. ఈ సృష్టిలో వ్యాపకత్వం కలిగినది ఆత్మ ఒక్కటే. ఆత్మ తప్ప ఈ జగత్తులో మరకొటి లేదు. మనకు కనిపించేవన్నీ ఆత్మ యొక్క ప్రతిబింబాలు. ఇవి ఏదో ఒకరోజు లయం అయిపోతాయి. కానీ ఆత్మ సనాతనమైనది, ఆత్మ ఆనందస్వరూపం. విష్ణువు ఆత్మ అయితే, ఆత్మానందం లక్ష్మీదేవి. ఆత్మానూభూతిని పొందడం వలన, ఆత్మ స్థితిలో ఉండడం వలన కలిగే చిదానందమే లక్ష్మీకాటాక్షం.
ఓం నమో లక్ష్మీనారాయణాయ
లక్ష్మీదేవి సంపదలను ప్రసాదిస్తుంది. సంపద అంటే డబ్బు, అధికారం, భవనాలు మొదలైన భౌతిక సంపద అని మాత్రమే అనుకోకూడదు. ఈ భౌతిక సంపద అశాశ్వతమైనది. ఈ భౌతిక సంపదలన్నీ జీవించి ఉన్నంత వరకే. మరణనించాకా ఆత్మతో పాపపుణ్యాలు, వాసనలు తప్ప ఈ బౌతిక సంపదలు రావు. లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్టసమయంలో దైర్యాన్నిచ్చేది, కష్టాల నుంచి తప్ప్కించుకోవడం కాదు, కష్టాలను ఎదుర్కునే బలాన్ని ఇస్తుంది, పూర్వజన్మ వాసనలను రూపుమాపి, పాపపుణ్యాలను క్షయం చేసుకుని, జ్యోతిస్వరూపమైన పరమాత్మలో ఆత్మను ఐక్యం చేసే జ్ఞాన సంపదను లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.లక్ష్మీదేవి తత్వం అంతటా వ్యాపించి ఉంటుంది. లక్ష్మీకటాక్షం మనపై ఎప్పుడు ఉంటుంది, కానీ అది గుర్తించే పరిస్థితుల్లో మనం ఉండము, అంతే. ఈ మానవ జన్మ కలగడం ఆమె అనుగ్రహమే. ఈ జన్మను మంచికార్యాలకు, భగవద్భక్తికి, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఉపయోగించుకోవడం, ఈ శరీరాన్నిచ్చిన లక్ష్మీదేవికి మనం చేసే అర్చన. ఆరోగ్యంగా జీవించడం కూడా లక్ష్మీకటాక్షమే. ఆత్మ తత్వం తెలుసుకోవాలంటే ఈ మానవదేహం చాలా అవసరం. అటువంటి ఈ దేహ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఆరోగ్యలక్ష్మీకి చేసే ఆరాధనవుతుంది.
యా దేవీ సర్వ భూతేషు లక్ష్మీ రూపేణా సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః
సర్వజీవులయందూ జీవసక్తిగా, ప్రాణశక్తిగా లక్ష్మీదేవి కొలువై ఉంది. సర్వజీవుల పట్ల దయ కలిగి ఉండడం, ఇతర జీవల ఆకలి తీర్చడం, వాటి జీవనానికి సహాయపడడం భూతలక్ష్మీకి (భూతములంటే జీవజాలం అని అర్దం) చేసే పూజ. అందరికి కొద్దొగొప్పొ డబ్బు ఉంటుంది. ఆ ధనాన్ని ధర్మకార్యాలకు వెచ్చించడం మనం ధనలక్ష్మికిచ్చే గౌరవం అవుతుంది. సంతానం లక్ష్మీదెవి అనుగ్రహం వల్లనే కలుగుతుంది, పిల్లల రూపంలో లక్ష్మీదేవి ఇంటిలో తిరుగుతుంటుంది. అటువంటి పిల్లల్లో దేశభక్తిని, దైవభక్తిని పెంపొందించడం, మంచి విద్యావంతుల్ని చేయడం ద్వారా సంతానలక్ష్మీని పూజించినవారమవుతాం.
లక్ష్మీదేవికి నిత్యానపాయిని, విష్ణువును విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. విష్ణువంటే వ్యాపకత్వం కలిగినవడు. ఈ సృష్టిలో వ్యాపకత్వం కలిగినది ఆత్మ ఒక్కటే. ఆత్మ తప్ప ఈ జగత్తులో మరకొటి లేదు. మనకు కనిపించేవన్నీ ఆత్మ యొక్క ప్రతిబింబాలు. ఇవి ఏదో ఒకరోజు లయం అయిపోతాయి. కానీ ఆత్మ సనాతనమైనది, ఆత్మ ఆనందస్వరూపం. విష్ణువు ఆత్మ అయితే, ఆత్మానందం లక్ష్మీదేవి. ఆత్మానూభూతిని పొందడం వలన, ఆత్మ స్థితిలో ఉండడం వలన కలిగే చిదానందమే లక్ష్మీకాటాక్షం.
ఓం నమో లక్ష్మీనారాయణాయ
Wednesday, 9 October 2013
శ్రీ లలితాత్రిపుర సుందరి దేవి
ఓం శ్రీ మాత్రే నమః
మహామహిమాన్వితమైనది శ్రీ లలితాత్రిపుర సుందరి దేవి.
భాస్కరరాయులవారు (1690-1785) బ్రహ్మాండపురాణంలో ఉన్న శ్రీ లలితా సహస్రనామాలకు భాష్యం రాసారు. వారు ఈ సహస్రనామాలకు భాష్యాన్ని (కామెంటరి) రాస్తున్న స
మయంలో ఒక సంఘటన జరిగింది. కాశీలో, అక్కడి పండితులు అహంకారంతో భాస్కర రాయులవారిని విమర్శిస్తూ నీవు లలితా సహస్రనామాలకు భాష్యం రాసేంత పండితుడివా? నువ్వు లలితా సహస్రనామాలకు భాష్యం రాసేంతటి గొప్పవాడివైతే లలితా సహస్రనామంలో 'మహచతుష్షష్టికోటి యోగినీగణ సేవితా' అనే ఒక నామం ఉంటుంది. అంటే లలితా దేవిని 64 కోట్ల మంది మహయోగినులు నిత్యం పూజిస్తూ ఉంటారని అర్దం. ఆ 64 కోట్లమంది యోగినీ గణాల పేర్లు చెప్పు అంటూ సవాల్ చేశారు.
ఆయన మరుసటి రోజు చెప్తా అని ఇంటికి చేరారు. అమ్మవారిని ప్రార్ధించారు. వారి పేర్లు నాకేమి తెలుసు, నీవే రాయిస్తున్నావు, దీనికి కూడా నువ్వే సమాధానం చెప్పాలి అని వేడుకున్నారు. అమ్మవారు నీ వెంట నేను ఉన్నాను. నేను చూసుకుంటా అన్నది. మరునాడు గంగా నదిగట్టున కూర్చున్న ఆ పండితుల దగ్గరికి వెళ్ళారు భాస్కర రాయులు. చెప్పగలవా అంటూ భాస్కరరాయులవారిని ఎగతాళి చేశారు పండితులు.
అంతే అమ్మవారి మహిమ వల్ల ఆ గంగా నది ఒడ్డున ఆకాశంలో 64 కోట్లమంది యోగీని దేవతలు ఒక్కసారిగా ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు. వరుసగా అందరి పేర్లు చెప్పడమే కాదు, వారిని ప్రత్యక్షంగా చూపించారు భాస్కరరాయులవారు. ఇదంతా అమ్మవారి అనుగ్రహంతోనే సాధ్యపడింది.
భక్తులపాలిట కల్పవృక్షం లలితాపరమేశ్వరీ దేవి.

Wednesday, 4 September 2013
శరీరంలో పంచమహాభూతాలు
ఓం గం గణపతయే నమః
పరబ్రహ్మ రూపమైన ఓంకార శబ్దంతో క్రమంగా ఆకాశం మహాభూతం రూపుదిద్దుకుంది. ఆకాశం అంటే మనకు కనిపించే మబ్బులు, మేఘాలని కాదు, ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం, శూన్యం అని అర్దం చేసుకోవాలి. ఈ కాలంవారికి చెప్పలంటే స్పేస్ అన్నమాట. అది ఒక మీడియంలా పనిచేసి శబ్దాన్ని వక్త నోటి నుంచి శ్రోత చెవికి చేరవేస్తుంది కనుక ఆకాశం శబ్దగుణానికి సంకేతమైంది.

'ఆకాశాత్ వాయుః' ఈ ఆకాశం నుంచి శబ్దస్పర్శ గుణాలున్న వాయువు పుట్టింది. ఖాళీ ప్రదేశం ఉన్నదని అంటాం కానీ, స్పృసించలేం, అదే గాలి కంటికి కనిపించకపోయినా, మనల్ని గాలి తాకుతుంది. మనం గాలి యొక్క స్పర్శ(ఫీల్) కలుగుతుంది.
వాయువు నుంచి శబ్దస్పర్శ గుణాలతో పాటు రూప గుణం ఉన్న మహాతేజోతత్వమైన అగ్ని వచ్చింది. ఋగ్వేదంలోని మొదటి పదమే అగ్ని. అగ్ని అనంతమైనది అంటుంది వేదం. అగ్ని అంటే కేవలం నిప్పు అనే కాదు, అగ్ని అంటే ఒక శక్తి కూడా. ఈ విశ్వమంతా ఉన్న శక్తియే అగ్ని.
ఈ అగ్ని నుంచి శబ్దస్పర్శరూప గుణములతో పాటు రస గుణం ఉన్న జలం పుట్టింది. రసగుణం అంటే పారే స్వభావం, నీరు ఎత్తునుంచి పల్లానికి పారుతుంది కదా. అలా అన్నమాట.
'ఆపః పృధ్వీ' నీటి నుంచి భూమి ఏర్పడింది. ఈ భూమికి శబ్ద, స్పర్శ, రస, రూప గుణములతో పాటు గంధ(వాసన) గుణము ఉంది. భూమి నుంచి ఏర్పడిన మొక్కలు, వృషాలు, పువ్వులు, వాసన కలిగి ఉంటాయి. అంతెందుకు భూమి కూడా మంచి వాసన కలిగి ఉంటుంది. ఈ విధంగా పంచమహాభూతాలు ఏర్పడ్డాయి. అన్నిటికంటే చివరగా ఏర్పడింది కనుక ఈ భూమిలో పంచమహాభూతాలు, పంచతన్మాత్రలు(శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు) ఉన్నాయి.
ఈ భూమి నుంచే ఓషధులు ఉధ్భించాయి. ఓషధులు అంతే ఉషః కాలము(సూర్యోదయ వేళ)నందు ఆహారం తయాతుచేసుకోనేవని అర్దం. అవే మొక్కలు, వృక్షాలు మొదలైనవి. ఈ ఓషధుల నుండే అన్నం వచ్చింది. అన్నం అంటే ఎప్పుడు మనం బియ్యాని ఉడికించుకుని తినే పదార్ధం అని భావించకూడదు. అన్నం అంటే ఆహారం. అది ఏదైనా కావచ్చు. ఒక్కో ప్రాంతాన్ని, ఒక్కో దేశాన్ని బట్టి వారి ఆహారం మారుతుంది. అయిన అది కూడా అన్నమే అంటుంది శాస్త్రం. అందువల్ల ఓషధుల నుంచి మంచి పుష్టికరమైన పండ్లు, కాయలు, కూరలు, విత్తనాలు, ఆకులు, దుంపలు, మకరందం మొదలైనవి వచ్చాయి.
ఈ అన్నం నుంచి క్రమంగా పురుషుడు(పురుషుడంటే స్త్రీలు, పురుషులు, ఇతర జంతువులు అని ఇక్కడ అర్దం) ఏర్పడ్డాడు. మానవశరీరం పంచభూతాత్మకమైనది. శరీరంలో ఈ పంచమహాభూతాలు ఉంటాయి.

Saturday, 13 July 2013
రమణ మహర్షి ఆధ్యాత్మిక కధలు
భగవాన్ రమణ మహర్షి భక్తులలో ఒక భక్తుడి కొడుకు అకస్మాత్తుగా మాత్తుగా మరణించడంతో ఆ బాధను తీర్చగల సమర్ధుడు రమణులే అని భావించి ఆయన వద్దకు వచ్చారు. రమణ మహర్షిని కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆ ప్రశ్నలలో అతని బాధ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రమణులు ఎప్పటిలాగా ఆత్మ గురించి విచారణ చేయమని, అసలు బాధపడుతున్నది ఎవరో తెలుసుకోమని సమాధానం చెప్పగా, ఆ సమాధానంతో ఆ భక్తుడు తృప్తి చెందలేదు.
అప్పుడు రమణ మహర్షి నేను ఇప్పుడు విచారసాగరం అనే కధ చెప్తా విను అంటూ చెప్పసాగారు.
రామ, కృష్ణ అనే ఇద్దరు యువకులు వారు విదేశాలకు వెళ్ళి అక్కడ బాగా చదువుకుని డబ్బులు సంపాదిస్త్నాని వారివారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి విదేశానికి వెళ్ళారు. కొంతకాలానికి వరిద్దరిలో ఒకడు మరణించగా, మరొకడు బాగా చదువుకుని, మంచి జీవనం గడుపుతున్నాడు. కొంతకాలం గడించింది. తన స్వదేశానికి అక్కద ఉండే వ్యాపారి వెళ్తున్నాడని తెలుసుకుని, తాను ఇక్కడ మచి జీవనం గడుపుతున్నాని తన తల్లిదండ్రులకు చెప్పమని, వచ్చిన మిత్రుడు మరణించాడని అతని తల్లిదండ్రులకు చెప్పమని ప్రార్ధిస్తాడు. బ్రతికున్న వాడి తల్లిదండ్రులకు తమ బిడ్డ మరణించాడని, చచ్చిపోయిన వ్యక్తి తల్లిదండ్రులకు తమ పిల్లాడు ఉన్నతమైన జీవనం గడుపుతున్నాడని పొరపాటుగా తప్పుడు సమాచారం చేరవేస్తాడు. దాంతో జీవించిఉన్నవాడి అమ్మనాన్నాలు తీవ్రంగా బాధ పడుతుంటారు. మరణించినవాడి తల్లిదండ్రులు తమ పిల్లాడు ఎప్పటికైనా తిరిగివాస్తాడని సంతోషంగా కాలం గడుపుతుంటారు. నిజానికి ఈ తల్లిదండ్రులు ఇద్దరూ తమ పిల్లలను చూడనే లేదు. కాని ఒకరు సంతోష పడుతున్నారు, ఒకరు అవేదన చెందుతున్నారు. మనం కూడా అంతే. మనం మన మనసు చెప్పినవన్నీ నమ్మేస్తాం. అందుకే ఏదీ లేదో అదే ఉన్నదని, యదార్ధానికి ఏది ఉన్నదో అదే లేదని భావిస్తాం. మనం మనసుమాట వినకుండా, హృదయంలోనికి ప్రవేశించి అక్కడున్న కొడుకును చూసుకుంటే, ఇక బయట ప్రత్యేకంగా పిల్లలను చూసుకుని ఆనందించవలసిన అవసరం లేదు అన్నారు రమణ మహర్షి.(ఈ కష్టాలు, బాధలు, సంతోషాలు, బంధాలు, బంధుత్వాలు మొదలైనవన్నీ మనసుకే కానీ, ఆత్మకు కావు, ఆత్మయే చిదానంద స్వరూపం. ఆత్మ గురించి తెలుసుకుని, ఆత్మ స్థితిలో ఉండగలిగితే మనల్ని ఏవి బాధించలేవు).
అప్పుడు రమణ మహర్షి నేను ఇప్పుడు విచారసాగరం అనే కధ చెప్తా విను అంటూ చెప్పసాగారు.
Sunday, 23 June 2013
~`~ సనాతన ధర్మంలో మనకు అనేకమంది దేవతలు కనిపిస్తారు. అసలు మనకు ఎంత మంది పరమాత్మలు ఉన్నారు?

ఉన్నది ఒక్కడే "ఏకో విశ్వస్య భువనశ్చ రాజాః"-ఋగ్‌వేదం 6.36.4 . నిరాకారుడు, నిర్గుణుడు, సత్ చిత్ ఆనంద స్వరూపుడు, అనంతుడు, సర్వాంతర్యామి, సర్వ శక్తిమంతుడు, సర్వ సమర్ధుడు, పరమాత్ముడు, పరబ్రహ్మమైన భగవంతుడు ఒక్కడే. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి వేర్వేరు కాలాల్లో ఋషులకు, సిద్ధులకు, యోగులకు, జ్ఞానులకు, ఉపాసకులకు, భక్తులు మొదలైన వివిధరకాల వ్యక్తులకు వారివారి ఉపాసన స్థాయిని అనుసరించి భగవంతుడు అనేక రూపాల్లో దర్శనమిచ్చాడు.
ఇంకా వివరంగా చెప్పాలంటే వారి మనసు ఏ విధమైన రూపం మీద నిలబడుతుందో, వారి మనసు ఏ విధమైన రూపాన్ని సులువుగా పట్టుకుంటుందో, వారు పరమాత్ముడిని ఏ విధంగా ఊహించుకున్నారో ఆ విధమైన రూపంలోనే కనిపించాడు.
మన సంస్కృతిలో అనేక సంవత్సరాలుగా అనేక మంది భగవంతుడిని చేరుకునే క్రమంలో ఆయన యొక్క విభిన్నమైన కోణాలను అనేక రూపాలుగా దర్శించారు. మనకు ఉన్నది ఒక్కడే భగవంతుడు. "ఏకో విశ్వస్య భువనశ్చ రాజాః"-ఋగ్‌వేదం 6.36.4 - ఈ సమస్త జగత్తుకు ఉన్న రాకు ఒక్కడే అని అర్దం. మనకు కనిపించే ఈ దేవతలంతా ఈ భగవంతుడి యొక్క ప్రతి రూపాలు, ప్రతి బింబాలు. అలా అని ఈ ప్రతి బొంబాలనే జీవితాంతం పూజిస్తూ ఉండమని సనాతన ధర్మం చెప్పలేదు. ఈ ప్రతిబింబాలైన సగుణ సాకార రూపాల మీద మనసు నిలిపి సాధనతో సర్వాతీతమైన నిరాకర రూపాన్ని దర్శించమని చెప్పింది. అందుకు మార్గాలను సూచించింది.
సైకాలజీ ప్రకారం మనకు ఏదైనా ఒక వస్తువు యొక్క రూపం గురించి కొంచం కూడా అవగాహన లేకపోతే మన మనసు దాని మీద నిలబడదు. అసలు దాని గురించి ఊహించుకోవడం కూడా అసాధయం. అందుకే ముందు మన మనసు ఒక చిన్న రూపం మీద నిలబడితే, అప్పుడు సాధాన ద్వారా పరుధుల్లేని పరమాత్ముడిని చేరుకోవచ్చు. అందరి ఇష్టాఇష్టాలు ఒకే రకంగా ఉండవు కనుక ఒక్కొక్కరి మనసు ఒక్కో రూపాన్ని హత్తుకుంటుంది. అందుకే మనకు వివిధ రూపాల్లో పరమాత్ముడు దర్శనమిస్తున్నాడు. అంటే మనం ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవడం కోసం దేవుడిని కూడా ఒక ఉపకరణంగా వాడుకుంటున్నాం. ఏ రూపాన్ని పూజించినా అన్ని వాడికే చేరుతాయి. మనం చేరేది వాడి దగ్గరకే.
Monday, 19 November 2012
శివుడు స్మశానవాసి అని ఎందుకంటారు?
శివుడు స్మశానవాసి అని ఎందుకంటారు?
శివం అంటే కల్యాణం,శుభం అని అర్ధం.శుభాన్ని కలిగించే వాడు శివుడు.
"అరిష్టం శినోతి తనూకరోతి" శివం అంటే అరిష్టాలను తగ్గించేది శివం అని అర్ధం.
తన జీవితమంతా డబ్బు సంపాదించడం కోసమని,భార్య/భర్త,పిల్లలు,పరువు,ప్రతిష్టలంటూ క్షణం కూడా తీరిక లేకుండా,తీరిక ఉన్నా ఇంక సంపాదించాలన్న కోరికతోనూ జీవితాన్ని గడిపిన మనిషి,చనిపోయి స్మశానంలో పూడ్చిపెట్టాక,మిగితావి ఏవి పట్టకుండా సుఖంగా నిద్రిస్తాడు.అప్పటివరకు నావి,నావి అనుకున్న మనిషి "నా"అనుకున్న వాటిని వదిలేస్తాడు.ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసింది శ్మశానం అంటే ఎటువంటి భయాలు,ఆశలు,కోరికలు,కోపాలు,ఆందోళనలు,బంధాలు లేని ప్రదేశం.అక్కడున్న శరీరాలు ఎండకు,చలికి,వర్షానికి దేనికి కూడా చలించవు.ఎవరు ప్రతి కర్మను(పనిని) కర్తవ్యంగా చేస్తారో,నిత్యం ప్రశాంతంగా ఉంటారో,సుఖః దుఃఖాలను సమానంగా చూస్తారో,ప్రతి విషయానికి ఆవేశ పడరో,అటువంటి వారి మనసు కూడా స్మశానం లాగా దేనికి చలించకుండా ఉంటుంది.అటువంటి వారి మనసులో శివుడుంటాడని అర్ధం.భగవద్గీతలో కృష్ణుడు కూడా తనకు అలాంటి వారంటేనే ఇష్టం అని చెప్పాడు.మనం ఆలోచిస్తే మనం ఆందోళన పడకపోతేనే అన్ని పనుల సక్రమంగా,అనుకున్న కాలానికన్నా ముందే,మరింత గొప్పగా పూర్తిచేయగలుగుతాం.అలా చేయగలిగినప్పుడు శుభాలు కాక ఇంకేమి వస్తాయి చెప్పండి?అందుకే శివుడు స్మశానవాసి అన్నారు.
అంతేకాదు ఎంతగొప్పవాడైనా,బీదవాడైన,ఎంత తప్పించుకుందామన్న ఆఖరున చేరేది స్మశానానికే.అలాగే ప్రతి జీవుడు(ఆత్మ) ఆఖరున ఏ పరమాత్మను చేరాలో,ఏ ప్రదేశాన్ని చేరడం శాశ్వతమో,ఎక్కడకు చేరిన తరువాత ఇక తిరిగి జన్మించడం ఉండదో,ఆ కైవల్యపదమే శివుడి నివాస స్థానం అని అర్ధం.
ఇక శివాలయానికి వెళ్ళి అక్కడ నిర్మలమైన మనసుతో,ఏమి ఆలోచించకుండా,కాసేపు కళ్ళు మూసుకుని ధ్యనంలో కూర్చుటే మానసిక ప్రశాంతత తప్పక లభిస్తుంది.మనసు బాగా ఆందోళనగా ఉన్న సమయంలో ఒక్కసారి శివాలయానికి వెళ్ళి కూర్చుని రండి.మీకే ఆ తేడా తెలుస్తుంది.అందువల్ల శివాలయం కూడా స్మశానం వంటిది అన్నారు.
అంతేకాని శివుడు స్మశానంలో ఉంటాడు కనుక ఆయన్ను ఆరాధించకూడదని,శివాలయానికి వెళ్ళరాదని ఎక్కడ చెప్పలేదు..అవి కాలక్రమంలో వచ్చిన అసంబద్ధప్రచారాలు.
కార్తీకమాసంలో వీలుకుదిరితే రోజు శివాలయానికి వెళ్ళండి.శివుని ముంగిట దీపాలను వెలిగించండి.
ఓం నమః శివాయ
శివం అంటే కల్యాణం,శుభం అని అర్ధం.శుభాన్ని కలిగించే వాడు శివుడు.
"అరిష్టం శినోతి తనూకరోతి" శివం అంటే అరిష్టాలను తగ్గించేది శివం అని అర్ధం.
తన జీవితమంతా డబ్బు సంపాదించడం కోసమని,భార్య/భర్త,పిల్లలు,పరువు,ప్రతిష్టలంటూ క్షణం కూడా తీరిక లేకుండా,తీరిక ఉన్నా ఇంక సంపాదించాలన్న కోరికతోనూ జీవితాన్ని గడిపిన మనిషి,చనిపోయి స్మశానంలో పూడ్చిపెట్టాక,మిగితావి ఏవి పట్టకుండా సుఖంగా నిద్రిస్తాడు.అప్పటివరకు నావి,నావి అనుకున్న మనిషి "నా"అనుకున్న వాటిని వదిలేస్తాడు.ఇక్కడ మనం అర్ధం చేసుకోవలసింది శ్మశానం అంటే ఎటువంటి భయాలు,ఆశలు,కోరికలు,కోపాలు,ఆందోళనలు,బంధాలు లేని ప్రదేశం.అక్కడున్న శరీరాలు ఎండకు,చలికి,వర్షానికి దేనికి కూడా చలించవు.ఎవరు ప్రతి కర్మను(పనిని) కర్తవ్యంగా చేస్తారో,నిత్యం ప్రశాంతంగా ఉంటారో,సుఖః దుఃఖాలను సమానంగా చూస్తారో,ప్రతి విషయానికి ఆవేశ పడరో,అటువంటి వారి మనసు కూడా స్మశానం లాగా దేనికి చలించకుండా ఉంటుంది.అటువంటి వారి మనసులో శివుడుంటాడని అర్ధం.భగవద్గీతలో కృష్ణుడు కూడా తనకు అలాంటి వారంటేనే ఇష్టం అని చెప్పాడు.మనం ఆలోచిస్తే మనం ఆందోళన పడకపోతేనే అన్ని పనుల సక్రమంగా,అనుకున్న కాలానికన్నా ముందే,మరింత గొప్పగా పూర్తిచేయగలుగుతాం.అలా చేయగలిగినప్పుడు శుభాలు కాక ఇంకేమి వస్తాయి చెప్పండి?అందుకే శివుడు స్మశానవాసి అన్నారు. అంతేకాదు ఎంతగొప్పవాడైనా,బీదవాడైన,ఎంత తప్పించుకుందామన్న ఆఖరున చేరేది స్మశానానికే.అలాగే ప్రతి జీవుడు(ఆత్మ) ఆఖరున ఏ పరమాత్మను చేరాలో,ఏ ప్రదేశాన్ని చేరడం శాశ్వతమో,ఎక్కడకు చేరిన తరువాత ఇక తిరిగి జన్మించడం ఉండదో,ఆ కైవల్యపదమే శివుడి నివాస స్థానం అని అర్ధం.
ఇక శివాలయానికి వెళ్ళి అక్కడ నిర్మలమైన మనసుతో,ఏమి ఆలోచించకుండా,కాసేపు కళ్ళు మూసుకుని ధ్యనంలో కూర్చుటే మానసిక ప్రశాంతత తప్పక లభిస్తుంది.మనసు బాగా ఆందోళనగా ఉన్న సమయంలో ఒక్కసారి శివాలయానికి వెళ్ళి కూర్చుని రండి.మీకే ఆ తేడా తెలుస్తుంది.అందువల్ల శివాలయం కూడా స్మశానం వంటిది అన్నారు.
అంతేకాని శివుడు స్మశానంలో ఉంటాడు కనుక ఆయన్ను ఆరాధించకూడదని,శివాలయానికి వెళ్ళరాదని ఎక్కడ చెప్పలేదు..అవి కాలక్రమంలో వచ్చిన అసంబద్ధప్రచారాలు.
కార్తీకమాసంలో వీలుకుదిరితే రోజు శివాలయానికి వెళ్ళండి.శివుని ముంగిట దీపాలను వెలిగించండి.
ఓం నమః శివాయ
Tuesday, 23 October 2012
మహిషాసుర మర్దిని
బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసిన మహిషాసురుడు తాను స్త్రీ చేతిలో మరణించలని వరం కోరుకుంటాడు.స్ర్తీలు అశక్తులు,తనని ఏమి చేస్తారులే అని భావించి అటువంటి వరం అడుగుతాడు.వరం పొందగానే మునులు,ఋషులు,స్త్రీలు,పిల్లలు,దేవతలు......ఇలా అందరిని బాధించడం మొదలు పెడతాడు.స్వర్గంలో ఉన్న ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమిస్తాడు.వాడి బాధలు తట్టుకొలేక దేవతలు శివ,విష్ను,బ్రహ్మలకు వారి బాధలను చెప్పగా,వాడిని సంహరించడానికి ఒక శక్తి స్వరూపిణి అయిన స్త్రీ ఉద్భవించాలని,అందుకోసం దేవతలందరూ తమ తమ శక్తిని ధారపోసి ఒక రూపాన్ని తయారు చెస్తారు.18 భూజలతో ఆవిర్భవించిన ఆ దివ్య శక్తికి తమ అయుధాలను ఇస్తారు.ఆ శక్తి అందరికి అమ్మ కనుక,తల్లి ప్రేమతో మహిషాసురిడిని తప్పు తెలుసుకొని,ప్రజలను భాదించవద్దని,స్వర్గాన్ని దేవతలకు అప్పగించమని చాలా రోజులు శాంతంగా చెప్తుంది.వాడు ఆ శక్తి అందానికి ముగ్ధుడయ్యి ఆమెను పొందాలని చూస్తాడు.తాను అందరికి తల్లినని,ఆ విధంగా భావించడం తప్పని ఎంత చెప్పిన వినడు.ఆ మహాశక్తి ఒప్పుకొలేదు,అందువల్ల ఆమెను బలవంతంగానైనా అనుభవించాలన్న భావనతో ఆమె మీద తన సైన్యాన్ని దండెత్తమని,ఆమెను సజీవంగా తీసుకురమ్మని చెప్తాడు.వచ్చినవారితో చాలా ప్రశాంతంగా అమ్మవారు మాట్లాడి,వారి మనసు మార్చే ప్రయత్నం చేసినా వారు మారక,యుద్ధం కోరి శక్తి చేతిలొ మరణిస్తారు.ఇలా అందరూ మరణించాక అమ్మ మహిషాసురిడితో యుద్ధం చేస్తుంది.కాసేపు దున్నపోతుగాను,ఏనుగు గాను,సింహంగాను,మాములు మనిషి ఆకారంలో పోరాడి,అమ్మవారి సింహాన్ని గాయపరుస్తాడు కాని ఓడిపోతాడు.మళ్ళీ మహిషం అంటే దున్నపోతు రూపాన్ని ధరించి దాడి చెస్తాడు.అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న మహాశక్తికి విపరీతమైన కోపం వచ్చి,కన్నులు బైర్లు కమ్మే వెలుగుతో వాడి మీద దాడి చేసి వాడిని సంహరించి మహిషాసురమర్దినిగా పేరు తెచ్చుకుంది.
మనలో ఉన్న బద్దకం,అజ్ఞానమే మహిషాసురుడు.జంతువులు ఆలొచించలెవు కనుక వాటికి ఏది మంచొ ఏది చెడొ తెలీదు.అవి సుఖం కోసం ఏమైనా చెస్తాయి.ఆలోచించకుండా బలం(డబ్బు,శారీరక బలం మొదలైనవి)ఉంది కదా అని కేవలం ఆనందం కోసం బ్రతికే వారిని ఇక్కడ జంతువు(మహిషం)తో పొల్చారు.మనలో విద్య వల్ల కలిగే జ్ఞానమే ఆ మహాశక్తి.మనం మారుదాం అనుకున్న,మంచి అలవాట్లు చేసుకుందామన్న మనలో ఉన్న అజ్ఞానం మనల్ని మారనివ్వదు.అది రకరకాల రూపల్లో భయపెడుతుంటుంది.మనం మంచిగా మారితే మన ఉనికే ఉండదన్న భావన కలిగిస్తుంది.అదే మహిషాసురుడి వివిధ రూపాలు.మొదట "దున్నపోతు మీద రాళ్ళ వాన"అన్నట్లు అసలు ఎంత చెప్పిన మన మనసు మన మాట వినదు.మనం మరింత పట్టుదలతో మారుదామని భావించి,ప్రయత్నం చేస్తుంటే అది ఏనుగు వలె బలంగా అణిచివేయాలని,ఇంకా వినకపొతే సింహంలాగా భయపెట్టి మనల్ని మంచి వైపు మారకుండా చేయడానికి చుస్తుంది మనలో ఉన్న అజ్ఞానం.మనలో ఉన్న జ్ఞానం అనే శక్తితొ వాటిని సమూలంగా అంతం చేయడమే మహిషాసుర మర్దనం(ఇది ఒక్క రోజు కాదు నిరంతరం జరిగే ప్రక్రియ).అలా మన అజ్ఞానాన్ని అంతం చేసిన రోజున మనలో ఉన్న దైవత్వం మనకు తెలుస్తుంది.అదే మన పురాణం మనకు ఇచ్చే సందేశం.
కాకపొతే ఇవాళ మన దురదృష్టం అందరికి అమ్మ అయిన అమ్మవారికి కులం,ప్రాంతం అంటగట్టారు.ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం(aryan invansion thoery) తప్పని తెల్చాక కుడా,అమ్మవారు ఆర్య స్త్రీ అని పిచ్చి పిచ్చి వాదనలకు తెర తీసి జనాలను విడదీసే ప్రయత్నం చేస్తున్నారు.అంతేకాదు రాక్షసుడికి కూడా ప్రాంతాన్ని,కులాన్ని అంటగట్టారు.దేవి భాగవతంలో కాని,పూరాణాల్లొ కాని ఎక్కడ లేని వింతవాదనలు వినిపిస్తూ,హిందూ యువతను హిందుత్వానికి దూరం చేయాలని,మత మార్పిడ్లు చేయాలని,2050 సంవత్సరానికి భారత దేశాన్ని ముక్కలు చేయాలని పధకం వేశారు.ఆ పధకాన్ని అమలు చెయడానికి భారతీయులనే పావులుగా వాడుకోవడం బాధించదగ్గ విషయం.
అందరిలో ఉన్న బుద్ధి మేలుకొవాలి,నిజానిజాలను గ్రహించాలి అని ప్రార్ధించండి.దేశ సమగ్రతను కాపాడండి.
యా దేవి సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
సర్వ జీవులలో బుద్ధి రూపంలో ఉన్న ఓ అమ్మ నీకు నా నమస్కారము.
Monday, 22 October 2012
మహాదుర్గ
దుర్గ అంటే కష్టాలను తొలగించేది అని అర్దం.
త్వాం అగ్ని వర్ణాం తపసాజ్వలంతీం.....అంటూ దుర్గ సూక్తం దుర్గమ్మ స్వరూపాన్ని వివరిస్తుంది.అంటే తపశ్శక్తి చేత నిరంతరం అగ్ని వలే వెలుగుతుంటుంది దుర్గ అని అర్దం.

దుర్గముడు లేదా దుర్గమాసురుడనే అనే రాక్షుడిని చంపినందువల్ల దుర్గ అనే పేరు వచ్చిందని దేవి భాగవతం చెప్తోంది.
రావణాసురుడితో యుద్ధనికి ముందు శ్రీరాముడు కూడా దుర్గా దేవిని పూజించాడు.
ఈ అమ్మ గురించి మార్కండేయ మహర్షి స్తొత్రంలొ అంటారు
దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ
దుర్గామచ్ఛేదినీ దుర్గ సాధినీ దుర్గ నాశినీ
దుర్గ మఙ్ఞానదా దుర్గదైత్యలోకదవానలా
దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణీ
దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా
దుర్గమఙ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ
దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీ
దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ
దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ
దుర్గభీమా దుర్గభామా దుర్లభా దుర్గధారిణీ
నామావళీ మమాయాస్తూ దుర్గయా మమ మానసః
పఠేత్ సర్వ భయాన్ముక్తో భవిష్యతి న సంశయః
నువ్వు తెలుసుకొవడానికి కష్టమైన దానివి(దుర్గ) మాత్రమే కాదు ఘోరమైన బాధలను కూడా తీసివేయగలవు(దుర్గార్తి శమనీ),ఘోరమైన ఆపదలను నివారించగలవు(దుర్గాపద్వినివారిణీ),
కష్టాలను చేదించే శక్తిని ప్రసాదించేదానివి(దుర్గామచ్ఛేదినీ),అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యంగా పూర్తిచేయగల శక్తిని సులభంగా ప్రసాదించేదానివి(దుర్గ సాధినీ),కష్టాలను కూడా నాశనం చేస్తావు(దుర్గ నాశినీ).మహా మహా జ్ఞానులకు కూడా అర్దం చేసుకోవడం కష్టమైన జ్ఞానాన్ని కూడా ప్రసాదించగలవు(దుర్గ మఙ్ఞానదా)అంటూ దుర్గమ్మ గొప్పతనాన్ని పై శ్లోకంలో వివరించారు.
ఈ శ్లోకాన్ని నిత్యం పఠించేవారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు,భవిష్యత్తులో అన్ని రకాల భయాలనుండి విముక్తి పొందుతారు అంటూ చివిరి 2 పాదాల్లొ మహర్షి వివరించారు.

Subscribe to:
Posts (Atom)

.jpg)
.jpg)