ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా కాక అందరం కలిసి కుర్చుని భోజనం చేయడం మన సంప్రదాయంలో కనిపిస్తుంది. పొద్దునంతా కష్టపడి సాయంకాలానికి ఇంటికి చేరుకున్నాక, స్నానం చేసి, సంధ్యాదీపారాధన చేసి, అందరూ కలిసి కూర్చుని, వడ్డించుకుని భోజనం చేసేవారు.
పెళ్ళిల సమయంలో ఎవరికి ఇప్పుడూంటే బఫ్ఫేలు వచ్చాయి. ఎవరికోసం ఆగడమనేది లేదు, నచ్చినప్పుడు తింటారు.
అయితే కలిసి కూర్చుని భోజనం చేయడం వలన కలిగే ఉపయోగాలేమిటి ? శాస్త్రపరిశోధనలు ఏమని ఋజువు చేశాయి. గూగుల్ చేసి వెతుక్కోండి నమ్మకంలేని పక్షంలో.
1. కలిసి భోన్ చేయడం వలన కుటుంబ బాంధవ్యాలు బలపడతాయి. పిల్లలకైతే తమకు కుటుంబం యొక్క తోడు ఉందనే భద్రతా భావం కలుగుతుంది.
2. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు అది దోహద చేస్తుంది.
3. ఇలాంటి అలవాటు ఉన్న ఇంటి పిల్లలు చదువుల్లో రాణిస్తారు. ముఖ్యంగా గణితం బాగా చేయగలుగుతారు.
4. 5000 మంది యువుత మీద పరిశోధన చేసినప్పుడు ఇలాంటి అలవాటు ఉన్న ఇంటి పిల్లలు మానసికంగా బలంగా ఉంటారట, మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుందట.
5. కుటుంబ సభ్యుల్లో భావప్రసార నైపుణ్యాలు (communication skills) మెరుగుపడతాయి. అలాంటి కుటుంబాల్లో స్త్రీలకు ఒత్తిడి తక్కువగా ఉండి, సంతోషంగా ఉంటారట.
6. ఆహారం విషయంలో జిహ్వచాపల్యాన్ని అదుపు చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది.
7. పిల్లలో ఊబకాయం రాదు, కుంగుబాటు (డిప్రెషన్) ఉండదు.
8. వేళకు తినడం అలవాటవుతుంది.
9. ఆహారాన్ని వృధా చేయడం అనేది తగ్గుతుంది.
10. పిల్లల్లో ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది, తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకోవడం మొదలుపెడతారు.
11. ఇటువంటి పిల్లల్లో అధికశాతమంది హింసకు పాల్పడరట. పశ్చిమ దేశాల్లో ఈ అలవాటును ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే కలిసి భోజనం చేసే కుటుంబాల్లో పిల్లలు మిగితావారితో పోల్చితే మద్యం, మాదకద్రవ్యాలకు తక్కువగా బానిస అవుతున్నారట.
12. పిల్లలో బలమైన జ్ఞాపకాలను ఇది కలిగించడంతో పాటు సంస్కృతి, సంప్రదాయం, ఆచారవ్యవహారాలను వారు కూడా పాటించేలా చేస్తుందట.
13. తమ భావాలు, ఆలోచనలు పంచుకునేందుకు కుటుంబంలో ఎవరు లేరని భావించప్పుడు, ఒంటరితనం ఆవహించి, బయట తోడు కోసం వెతుక్కుంటారు. కొన్నిసార్లు దుర్మార్గుల చేతిలో పడి శారీరికంగా, మానసికంగా దోపిడికి గురై కష్టాలపాలవుతారు. కుటుంబనతా కలిసి భోజనం చేయడం వలన పిల్లలు పెడద్రోవ పట్టరని, ప్రేమ పేరుతో దుర్మార్గుల చేతిలో పడి మోసపోయే అవకాశం తక్కువట.
14. అమెరికాలో పదవ తరగతికి అనుబంధంగా పసిపిల్లల సంరక్షణ కేంద్రాలు ఉంటాయి. తెలిసీతెలియని ఆ వయస్సులోనే అనేకమంది స్త్రీలు గర్భవతులవ్వడం చేత వీటిని ఏర్పాటు చేశారు. వీళ్ళను వెట్ మధర్స్ అంటారు. కుటుంబంలో అందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం చేత దీన్ని నివారించవచ్చని అక్కడి మానసిక నిపుణులు వారికి సలహాలిస్తున్నారు.
చూశారా ! ఎన్ని ఉపయోగాలున్నాయో ! ఈ రోజు పశ్చిమ దేశాల్లో ఈ అలవాటుని ప్రోత్సహించేందుకు సంఘాలు కూడా ఏర్పడుతున్నాయి. మనకా అవసరంలేదు. చేయాల్సిందల్లా ఉన్న సంప్రదాయన్ని కొనసాగించడమే.
Source:
https://www.goodnet.org/articles/9-scientifically-proven-reasons-to-eat-dinner-as-family
https://www.raisealegend.com/benefits-from-eating-family-meals/
https://thefamilydinnerproject.org/about-us/benefits-of-family-dinners/
ఈ లాక్‌డౌన్ సమయంలో చాలా ఖాళీ సమయం చాలా వుంది. ఈ సమయంలో మన ధర్మాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం మీరు చేయవచ్చు. ఎందరో మహానుభావులు మన సనాతనధర్మం గురించి ప్రవచనాలు ఇచ్చారు. ఎవరినీ తక్కువ చేయడం కాదు, కానీ అందులో ముఖ్యమైనవారి పేర్లు.
మీరు తెలుగు వారైతే మీరు వినాల్సిన ప్రవచనకారులు :
భక్తి, రామాయణము, ఆర్షధర్మము, వాఞ్జ్మయము, ఉపాసన, గురుభక్తి, పురాణాలు, స్మృతులు వంటి అంశాలకు -
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు
టి.కె.వి.రాఘవన్ గారు
బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు
పూజ్యశ్రీ ఆచార్య ప్రేం సిద్ధార్థ్ గారు
బ్రహ్మశ్రీ దేవిశెట్టి చలపతి రావు గారు
ఇందులో ఉపాసనా రహస్యాలకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు; పురాణల కొరకు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, టి.కె.ఎస్.రాఘవన్ గారు; కుటుంబ విలువలు, రామాయణం, భక్తి అంశాల మీద బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు; భాగవత ప్రవచనం కోసం బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు; అద్వైత, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి సిద్ధాంతపరంగా మన ధర్మంలోని ప్రతి సూక్ష్మమైన అంశాన్ని నిశీతంగా తెలుసుకొనుటకు పూజ్యశ్రీ ఆచార్య ప్రేం సిద్ధార్థ్ గారు; కర్మసిద్ధాంతం, వివేకచూడామణి, భగవద్గీత మొదలైన అనేక విషయాల కొరకు బ్రహ్మశ్రీ దేవిశెట్టి చలపతి రావు గారు; తెలుగు సాహిత్యం, అందులోని గొప్పతనం కోసం బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గార్ల ప్రవచనాలు వినవచ్చు.
మీకు ఆంగ్లం అర్దమవుతుంది అనుకుంటే హిందూధర్మం మీద ప్రస్తుతం జరుగుతున్న దాడులు, వాటి స్వరూపం ఏమిటి? వాటిని ఎలా ఎదురుకోవాలి ? అసలు మనకు అన్యమతాలకు మధ్య వ్యత్యాసం ఏమిటి? మన ధర్మాన్ని, దేశాన్ని రక్షించుకోవడం ఎలా అనే అంశాలను శ్రీ రాజీవ్ మల్హోత్రా గారు చాలా అద్భుతంగా చెప్తారు. వారి ప్రవచనాలు, పుస్తకాలు అధ్యయనం చేస్తే అసలు మన ధర్మం ఏంటో బాగా అర్ధమవుతుంది. వారి ప్రసంగాలు కొన్ని హిందీలో కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే డా. సుబ్రమణియం స్వామి గారు హిందూత్వము, మన పూర్వచరిత్ర మొదలుకొని అనేక అంశాల మీద అనేక ప్రవచనాలు ఇచ్చారు. అవి ఆంగ్లభాషలో అంతర్జాలంలో అందుబాటులో ఉన్నాయి.
భారతదేశ పూర్వచరిత్ర, వైభవం, ఆయుర్వేదం, ఆరోగ్యకర జీవనం, గోమాత గురించి హిందీ భాషలో శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఎన్నో ప్రసంగాలిచ్చారు.
ఇవి గాక, కంచి పరమాచార్య స్వామి వారి బోధలు పుస్తకరూపంలో దొరుకుతున్నాయి. అవేగాక శృంగేరీ పీఠం వారి సాహిత్యం కూడా అంబాటులో ఉంది. భక్తి గురించి తెలుసుకోవాలంటే శ్రీ రామకృష్ణమిషన్ వారు ముద్రించిన శ్రీ రామకృష్ణ కథామృతం చదవచ్చు. కర్మ, జ్ఞాన, రాజ, భక్తియోగాల కొరకు, చక్కని ప్రేరణ కొరకు స్వామి వివేకానంద గారి సాహిత్యం ఆన్లైన్‌లోనూ, పుస్తకరూపంలోను అందుబాటులో ఉన్నాయి.
ఖాళీ సమయాన్ని జ్ఞానం పెంచుకోవడంలో సద్వినియోగం చేసుకోండి. ఎందరో మహానుభావులు మన సనాతనధర్మం గురించి ప్రవచనాలు ఇచ్చారు. ఎవరినీ తక్కువ చేయడం కాదు, కానీ అందులో ముఖ్యమైనవారి పేర్లు. (గతభాగంలో చెప్పిన వారి పేర్లు ఇక్కడ మళ్ళీ ప్రస్తావించడంలేదు).
ఎన్నో శాస్త్రాలను ఔపోసన పట్టి, ధర్మ సూక్ష్మాలను నిశితంగా చెప్పగల మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు
భగవద్గీతా, భజగోవిందం, లలితా సహస్రనామం, హిందూ ధర్మం మీద అనేక ప్రవచానలు ఇచ్చారు పరిపూర్ణానంద స్వామి వారు
విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం భగవద్గీత మొదలైనవి తెలుసుకోవాలనుకుంటే త్రిదండి చిన్న జీయరు స్వామి వారి ప్రవచనాలు వినవచ్చు.
సంస్కృత మరియు తెలుగు భాషాసాహిత్యం, పురాణాలు, స్మృతులు, కావ్యాల మీద అద్భుతంగా అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పగల అవధానులు మేడసాని మోహన్ గారు, మాడుగుల నాగఫణిశర్మ గారు. వీళ్ళ ప్రవచనాలు వింటే తెలుగు భాష వైభవం, అందం తెలుస్తాయి.
వీరుగాక మల్లా ప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి, శ్రీభాష్యం అప్పలాచార్య, శ్రీ సిద్దేస్వరానంద భారతి స్వామి, మైలవరపు శ్రీనివాస రావు గార్ల ప్రవచనాలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి.
భారతజాతి చరిత్రకు సంబంధించి ఎంతో పరిశోధించి మనకు గొప్ప పుస్తకాలను అందించిన మహానుభావులు
1. శ్రీ కోటా వేంకటాచలం గారు - వీరు పుస్తకాల ముద్రణకు వారి పిల్లల వద్ద డబ్బు లేక, ఆసక్తి కలిగినవారు ఉంటే ప్రతులు ఇస్తాము, జిరాక్సు తీసుకోండని వారి వారసులు చెబుతున్నారు. అది వారి దుస్థితి.
2. ఎం.వి.ఆర్.శాస్త్రి గారు - ఆంధ్రభూమి సంపాదకులు - ఇది చరిత్ర, ఏది చరిత్ర వంటి గొప్ప గ్రంథాలను రాసి అసలు భారతచరిత్ర ఎంటో సమాజానికి తెలిపే ప్రయత్నం చేశారు.
3. హెబ్బారు నాగేశ్వర రావు గారు - వీరి వ్యాసాలు ఋహిపీఠం మొదలైన వాటిల్లో వస్తుంటాయి. తరతరాల భరతజాతి అంటూ కలి ఆరంభం నుంచి మన దేశచరిత్రను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
1. ఆరోగ్యం గురించి తెలుసుకోవాలంటే డా.ఖాదర్ వలి గారి ప్రసంగాలు చూడండి. అవి తెలుగులోనే ఉన్నాయి.
2. ప్రకృతి వ్యవసాయం, మన పూర్వీకులు ఆచరించిన వ్యవసాయ పద్ధతులు మొదలైన విషయాలకు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి వీడియోలూ వీక్షించండి. వీరి వీడియోలు కొన్ని తెలుగు అనువాదంలో లభిస్తున్నాయి. సేవ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీ విజయ్ రాం గారు ప్రకృతి వ్యవసాయ పద్ధతి గురించి అనేక వీడియోలు యూట్యూబ్ లో ఉంచారు. రైతులకు, గ్రామీణ యువతకు ఇవి సహాయకారి.
3. ఆంగ్లభాష అర్ధమవుతుంది అనుకుంటే వ్యవసాయం పేరుతో మనదేశం మీద విదేశి సంస్థలు చేస్తున్న కుట్రలు, పెత్తనాన్ని ఎండగట్టిన ఏకైక స్త్రీ శ్రీమతి వందనాశివ గారి వీడియోలు చూడండి.
4. ఆరోగ్యసూత్రాలకు ప్రకృతివనం ప్రసాద్ రావు గారి వీడియోలు చూడవచ్చు.
5. మహర్షి వాగ్భటాచార్యులు మొదలుకొని అనేకమంది మహర్షులు మనకు ప్రసాదించి ఆరోగ్య ఆయుర్వేద సూత్రాలను మనకు అందించారు శ్రీ రాజివ్ దీక్షిత్ గారు. విజ్ఞానం విషయంలో వీరు చిరస్మరణీయులు.
పైన చెప్పిన వీడియోల్లో మీకు వ్యవసాయము, ప్రయావరణ పరిరక్షణ, ఆరోగ్యం మొదలైన ఎన్నో అంశాలు వివరంగా తెలుస్తాయి.
త్రిమతాచార్యుల మధ్య విభేదాలు ఉన్నాయా ?
అద్వైత స్థాపకులు, శివుని అవతారమైన ఆదిశంకరులు సా.శ.పూ.509 లో అవతరించారు. విశిష్టాద్వైత స్థాపకులు, ఆదిశేషుని అంశ అయిన శ్రీ రామానుజులు సా.శ.1071 లో అవతరించారు. హనుమంతుని అంశ, ద్వైత సిద్ధాంతాన్ని స్థాపించిన మధ్వాచార్యుల వారు సా.శ.1238 లో అవతరించారు.
శంకరులు సనాతనధర్మాన్ని కాపాడి, గందరగోళానికి గురైన హిందువులను తిరిగి ధర్మం దిశగా నడిపించి, సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు, భరతజాతి ఐక్యతను కాపాడారు. దేశమంతా కాలినడకన పర్యటించడమే గాక, తాను వెళ్ళిన ప్రతిచోటా శ్రీ చక్రాలను ప్రతిష్టాపన చేసి, కుంభాభిషేకాలు నిర్వహించారు. అవైదిక మతాల్లోకి వెళ్ళిన హిందువులను తిరిగి ధర్మంలోకి తీసుకువచ్చారు. శంకరులు అవతరించేనాటికి క్రైస్తవం, ఇస్లాం మొదలైన అబ్రహామిక్ మతాలు ఇంకా పుట్టలేదు. అంటరానితనం సమాజంలో లేదు. (మనీషాపంచకం వచ్చిన ఉదంతం ఇక్కడ ప్రస్తావించవద్దు. దాని గురించి వివరణ ఇస్తాను...)
భగవద్రామానుజులు వచ్చేసరికి దేశం మీద ఇస్లాం దండయాత్రలు ప్రారంభమయ్యాయి. మహమ్మద్ గజనీ సోమనాథ్ అలాయాన్ని లూటీ చేశాడు. ఉత్తరభారతదేశంలో ఎన్నో ఆలయాలు కూల్చివేయబడ్డాయి, వాటి సంపద కొల్లగొట్టబడింది. దక్షిణభారతదేశంలో సైతం మెల్కోటె వరకు ఉన్న ఆలయాల మీద దాడి చేసి, ఉత్సవమూర్తులు సహా ఆలయ సంపదను కొల్లగొట్టారు విదేశీ ముష్కరులు. తాము బంధించిన క్షత్రియులతో తమ ఇంటి స్త్రీల మలాన్ని ఎత్తించే పని చేయించారు మహమ్మదీయ రాజులు. ఆ పనిని నీచమని, వారిని సమాజానికి దూరంగా పెట్టారు. రామనుజుల అవతార సమయానికి అంటరానితనం వచ్చింది. వైష్ణవమతాన్ని ఉద్ధరించడంతో పాటు శ్రీ రామానుజులు బలవంతంగా ఇస్లాం స్వీకరించినవారిని, అంటరానివారిగా భావిస్తున్న వారిని సైతం శ్రీ వైష్ణవులుగా మార్చి తిరిగి స్వధర్మంలోకి తీసుకుని వచ్చారు. దండయాత్రల్లో ధ్వంసమైన వైష్ణవ ఆలయాలను పునరుద్ధరించి, పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజాదికాలు నిర్వర్తించేలా ఆజ్ఞాపించారు. మధ్వాచార్యులు సైతం ఇస్లాం దండయాత్రల సమయంలోనే అవతరించారు.
మనం గమనిస్తే శంకరాచార్యులకు భగవద్రామానుజులకు మధ్యలో 1500 సంవత్సరాల కాలం ఉంది. వారిద్దరు ఒకరికి ఒకరు వ్యతిరేకమని చెప్పడం ధర్మవ్యతిరేకుల రేపిన చిచ్చు మాత్రమే. ముగ్గురు ఆచార్యులు ఆచారవ్యవహారాలను బలపరిచారు, మతం మారిన హిందువులను తిరిగి స్వధర్మంలోకి తీసుకుని వచ్చారు. ముగ్గురూ మూడు సిద్ధాంతలను ప్రవచించారు. ఆ మూడు మూడు వేదాంత దర్శనాలు అనుకోవచ్చు. వాటి ఉద్దేశం ముక్తిని పొందడం. వాటి లక్ష్యం ఒక్కటే, కాకపోతే బోధలలో కొంత వ్యత్యాసం. దాన్ని పట్టుకుని ఆ ముగ్గురు ఒకరికి ఒకరు వ్యక్తిరేకమని చెప్పరాదు.
శ్రీ వైష్ణవులంతా విశిష్టాద్వైతాన్ని అనుసరిస్తారు. మధ్వసంప్రదాయం వారు ద్వైతాన్ని అనుసరిస్తారు. మిగితా హిందువులంతా అద్వైతాన్ని అనుసరిస్తారు. శంకరాచార్యులు స్థాపించిన షణ్మతాలలో వైష్ణవం కూడా ఉంది. మధ్వులు సైతం శివుడిని ఒప్పుకుంటారు. మన కలిసి ఉండటానికి వందకారణాలు ఉన్నాయి, కానీ విచిత్రంగా విడిపోవడానికి ఏదో ఒక కారణం వెతుక్కుంటున్నాము. వాళ్ళకే లేని గొడవలు మనకెందుకు ? మనం ఏ సంప్రదాయంలో ఉంటే ఆ సంప్రదాయం ప్రకారం ముక్తికి బాటలు వేయడం, అందరం కలిసి సనాతనధర్మాన్ని రక్షించుకోవడమే ఆ ఆచార్యులకు మనం ఇచ్చే నిజమైన గౌరవం. అంతేగానీ పరస్పరం వాదులాడుకోవటం కాదు.
దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే |
స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః ||
లోకంలో దుష్టాచారాన్ని నశింపజేయడానికి సాక్షాత్తు కైవల్య నాయకుడైన శివుడు శంకరాచార్యుని రూపంలో భూమండలం మీద అవతరించారు.
కోటా వేంకటాచలం మొదలైన చరిత్రకారుల మనకు అందించిన సమాచారం ప్రకారం బుద్ధుడు బిఫోర్ కామన్ ఎరా 18 వ శతాబ్దానికి చెందినవాడు.. ఆది శంకరులు బిఫోర్ కామన్ ఎరా 509 కు చెందినవారు. వారు బిఫోర్ కామన్ ఎరా 477 లో శివైక్యం చెందారు. కానీ పాశ్చాత్యులు వ్రాసిన చరిత్రలో దాదాపు కొన్ని వందల సంవత్సరాల చరిత్రను మింగివేసారు.
ఒకసారి అప్పుడున్న పరిస్థితుల చూద్దాము.
ఒకనాడు ఇప్పటి పర్షియా, ఇరాన్, మెసపుటామియా, ఇరాఖ్ వరకు భరతవర్షం భారతదేశపు రాజుల ఆధీనంలో, ఈ భారతభూమిలో భాగంగా ఉండేది. అటుపక్క మధ్య ఆసియా లోని కశ్యప సముద్రం (కాస్పియన్ సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఒకప్పుడు హిందువులైన పారశీకులు అధర్మాన్ని పాటించడం వలన దేశ బహిష్కారానికి లోనుకాగా, సరిహద్దుల్లో తిష్టవేసి, ఈ సంస్కృతి మీద ద్వేషంతో మన దేశంలో తమ మతాన్ని ప్రచారం చేసి, కొన్ని ప్రాంతాలను దేశం నుంచి వేరు చేశారు.
బౌద్ధం అహింసావాదం అని చెప్పుకున్నా, బౌద్ధులు తమ మతాన్ని హింసతోనే విస్తరింపజేశారు. బౌద్ధులు చంద్రగుప్తుని సమయం వరకు ఒక సమూహంగా ఏర్పడలేదు. పుష్యమిత్రుడు సింహాసనం ఎక్కే సమయానికి బౌద్ధులు ఒక మతంగా ఏర్పడడం మొదలుపెట్టారు. మత విస్తరణ కోసం తమకు 300 ఏళ్ళు బువ్వ పెట్టిన హిందువుల మీద అకారణంగానే ఎక్కడలేని ద్వేషం పెంచుకున్నారు. జాతి వ్యతిరేక సమూహంగా మారి, గ్రీకులు దండయాత్రకు వస్తే, వాళ్ళ పక్షాన చేరారు, ఆ రాజును బౌద్ధులు ప్రేమగా మిళిందుడని కూడా పిలుచుకున్నారు. విశ్వవిద్యాలయాల్లో పిల్లలకు దేశ వ్యతిరేక సాహిత్యాన్ని చెప్పి, వాళ్ళను సంఘవిద్రోహ శక్తులుగా మార్చారు. వీళ్ళ వలన దేశం అంతర్గతంగా బలహీనపడి, ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. అది పుష్యమిత్రుడికి నచ్చలేదు. జాతి సమగ్రత, సమైఖ్యత కోసం దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న దుష్టులను చంపమని ఆదేశించాడు. అప్పుడు ఆ చర్యలకు పాల్పడింది బౌద్ధలే కనుక వాళ్ళే మరణించారు. అది కూడా అందరిని కాదు. కేవలం విద్రోహచర్యలకు పాల్పడుతున్నవారు మాత్రమే చంపబడ్డారు. ఇది చరిత్ర. బౌద్ధులు ధర్మానికి వ్యతిరేకులు కనుక, అశ్వమేధం లాంటి యాగాలు చేస్తే, ప్రజలు సంఘటితమవుతారని, తమకు రాజకీయ ప్రాభవం దక్కదని, యజ్ఞయాగాది క్రతువులను, వేదాలను నిరసించారు. ఆ ప్రభావంతో ఈ దేశంలో అనేక రాజులు సరిహద్దులను పటిష్టం చేసే అశ్వమేధం వంటి యాగాలను విస్మరించి, అహింస పేరుతో మౌనం వహించి, అఖండభారత విచ్ఛిన్నానికి కారుకులయ్యారు.
ఇవిగాక శంకరులు అవతరించేనాటికి దేశంలో ఎన్నో మతాలు, వాదాలు విస్తరించి సమాజ ఐఖ్యతకు భంగం కలిగించాయి. ఇప్పుడు కూడా అలాంటి వాదాలు సమాజంలో చాలా ఉన్నాయి. కొందరు హిందువులుగా పైకి నటిస్తూ, జనాలను రెచ్చగొడుతూ, విభజనవాదాలను పెంచి పోషిస్తూ, మన ధర్మం మీద మెల్లిమెల్లిగా ద్వేషం పెంచుకునేలా చేస్తున్నారు. రోమిలా థాపర్, షెల్డన్ పాల్లోక్ వంటి అమ్ముడుపోయిన వ్యక్తులు అనేకమంది విద్యావేత్తలుగా ప్రచారం చేసుకుంటూ, సనాతనధర్మం మీద పుస్తకాలు రాస్తున్నమని చెప్పుకుంటూ, వాటి నిండా విషం నింపి అదే చరిత్ర మరియు ధర్మం అని నమ్మిస్తూ మతమార్పిడులకు సాయం చేస్తున్నారు. అవిగాక అన్యమతాలు ఎలాగో ఉండనే ఉన్నాయి.
వాటిని ఖండించి అవైదికులతో వాదించి వారిని తిరిగి సనాతనధర్మంలోకి తీసుకువచ్చారు ఆదిశంకరులు. ఈనాడు మనం పునారగమనం (ఘర్‌వాపసి) అంటున్నాం కదా, అది వారు ఆనాడే చేశారు. వేదధర్మంలో భాగంగా ఉన్న శైవ, వైష్ణవ, శాక్తేయ, గాణాపత్య, సౌర, కౌమార మతాలను సమన్వయం చేసి, పంచాయతన ఆరాధన పద్ధతిని అందించారు. పిచ్చి పిచ్చి వాదాలతో దారి తప్పిన హిందూ సమాజాన్ని తిరిగి దారిలోకి తెచ్చారు. అసలు ధర్మం ఏంటో చెప్పి, దాన్ని పునఃస్థాపితం చేశారు.
హిందువుల్లో ఐక్యతను తీసుకువచ్చారు. శంకరుల వాదనా పటిమకు బౌద్ధం పూర్తిగా బలహీనపడింది. వారి దేశవ్యత్రిరేక కార్యకలాపాలతో నశించిపోయింది. "బౌద్ధాన్ని ఈ దేశం ద్వేషించడానికి కారణం వారి మతసిద్ధాంతాలు కాదు, కానీ వారిలో ఉన్న జాతివ్యతిరేకత మరియు దేశద్రోహ లక్షణాలు" అంటారు వినాయక్ దామోదర్ సావర్కర్.
క్రీ.పూ. 7 వ శతాబ్దంలో వచ్చిన ఆదిశంకరుల ప్రభావం ఈ దేశంపై 1500 సంవత్సరాల వరకు చాలా తీవ్రంగా ఉన్నది. ఆయన ధర్మానికి కొత్త ఊపిరిలూదారు. ప్రభావంతో విక్రమాదిత్యుడు, శాలివాహానుడు మొదలైన రాజులు భరతవర్షం కోల్పోయిన భాగాలను తిరిగి ఈ దేశంలో విలీనం చేశారు.
ఒకవేళ శంకరాచార్యులే గనక రాకపోయి ఉంటే, అసలు మన ధర్మానికి ఒక దశ-దిశ ఉండేది కాదు. బౌద్ధుల అహింసావాదం, అవైదిక మతాల కారణంగా భరతజాతి క్రీ.శ.1 నాటికే ముక్కలై, ధర్మం కోసం, దేశం కోసం పోరాడలన్నా తపన ఉండేది కాదు. మనలో ఐఖ్య భావన ఉండేది కాదు. ఈనాడు మనమంతా సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవాళ్ళము కాదు, అసలు భారతదేశమే ఉండేది కాదు. అప్పటికే బౌద్ధులుగా మారి, ఆ తర్వాత ఇస్లాం మరియు క్రైస్తవుల చేతిలో పడి మన అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయేవాళ్ళము.
శైవులైనా, వైష్ణవులైనా, ఏ మతస్థులైనా, హిందువులుగా, భారతీయులుగా బ్రతుకుంతున్నామంటే, అందుకు కారణం ఆదిశంకరాచార్యులు. వారిని మనం తప్పక స్మరించాలి. వారికి కృతజ్ఞులమై ఉండాలి.
జయ జయ శంకర హర హర శంకర
మన పూర్వీకులు అందించిన ఆరోగ్య సూత్రాలలో మరొకటి 'ఎంగిలి దోషం' అంటకుండా జాగ్రత్త పడటం. ఇతరులు తినగా మిగిలినది, లేదా ఇతరులు తింటున్న సమయంలో వారి దగ్గరి నుంచి తీసుకుని తినడం ఎంగిలి. ఒకరి ఎంగిలి ఇంకొకరు తినడం మహాపాపం అన్నారు.
ఎంగిలి చాలా ప్రమాదకరం, ఒకరి ఎంగిలి మరొకరు తినడం, తాగటం వలన సూక్ష్మక్రిములు వ్యాపించి అనేక రకాలైన జబ్బులు వచ్చే అవకాశం ముమ్మరంగా ఉంటుంది. ఒకే కంచంలోని ఆహారం ఇద్దరు ముగ్గురు కలిసి తినడం, ఓకే సీసాలోని నీటిని నలుగురైదుగురు ఒకరి తరువాత ఒకరు తాగటం మొదలైనవన్నీ ఎంగిలి దోషాలే.
ఇంతెందుకు ! స్వయంగా సీసాలోని నీటిని సగం తాగి పక్కన పెట్టి ఐదు నిమిషాల తర్వాత మిగిలిన సగాన్ని తాగితే కూడా ఎంగిలి దోషం అంటుతుంది, అంటే స్వంత ఎంగిలి కూడా మనకు పనికి రాదు అని అర్థం..
పెద్దలు, పూజ్యులు, గురువుల ముందుకు వెళ్ళినప్పుడు నేరుగా మాట్లాడరు. నోటికి చెయ్యి అడ్డుపెట్టుకుని మాట్లాడతారు. అది కనీసం మర్యాద. పొరపాటున కూడా పెద్దలు, గురువుల మీద మాటల సమయంలో ఉమ్ము పడకూడదు.
పసిపిల్లలకు కూడా ఎంగిలి ఆహారం పెట్టకూడదు. ఉపనయనంలో హోమం సందర్భంలో కొన్ని మంత్రాలు వస్తాయి. అందులో ఇంతకముందు నేను ఎంగిలి తినడం వలన ఏదైనా పాపం వచ్చివుంటే అది శమించుగాక అని ప్రాయాశ్చిత్తం చేయిస్తారు. ఇక ముందు తినను అని అగ్నిదేవునకు వటువుతో చెప్పిస్తారు.
ఐదువేళ్ళతో నోటిలో నమలడానికి సరిపోయేటంత ఆహారం మాత్రమే స్వీకరించాలి. నోట్లోకి ఎక్కువ ఆహారం తీసుకుని, అది నమలలేక, తిరిగి కంచంలో పెట్టడం దోషమని శాస్త్రం చెప్తుంది.
పూర్వం మన ఇళ్ళలో ఎవరి కంచాలు, చెంబులు వారికే ఉండేవి. అతిథులు వచ్చినప్పుడు, వారికి వేరే పాత్రలలో ఇచ్చేవారు. ఒక 50 ఏళ్ళ క్రితం వరకు పేదవారి ఇళ్ళలో కూడా వెండి కంచాలు, చెంబులు ఉండేవి. వెండి అనేది చాలాశాతం క్రిములను తన ఉపరితలం మీద నిలువనీయదు. అది వాటిని నశింపజేస్తుంది. ఇంకొన్ని ఇళ్ళలో అయితే వెండి కంచంలో బంగారు పువ్వు వేసి ఉండేది. అప్పుడా కంచానికి ఎంగిలి దోషం ఉండదని చెప్పేవారు. ఇప్పుడు కూడా వెండి క్రిమిసంహారకమని శాస్త్రవేత్తలు ఋజువు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అర్ధమైందా మనము పూజల్లో వెండి వస్తువులకు ప్రాధాన్యం ఎందుకు ఇస్తామో ?!
వంట వండే సమయంలో సైతం మనవాళ్ళు మడి కట్టుకుని మౌనంగా ఉండటంలో ఇది కూడా ఒక కారణం. మాట్లాడితే పొరపాటున నీటి తుంపరలు వండే ఆహారంలో పడి అవి ఎంగిలి అవుతాయని భయం.
కొందరు ఈనాటికి నిత్యపూజకు మడి నీళ్ళు పడితే చాలామంది వరలక్ష్మీ వ్రతం, వినాయకచవితి మొదలైన పర్వదినాలప్పుడు, పితృకర్మలు చేసే రోజుల్లో మడి కట్టుకుని నీళ్ళు పడతారు. ఆ దైవకార్యం పూర్తయ్యేవరకు ఆ నీటిని వేరే పనులకు వాడరు, అశుభ్రంగా ముట్టుకోరు.
ఎంగిలి చేసిన అన్నాన్ని ఆవు, కుక్క, కాకి మొదలైన జీవాలకు కూడా పెట్టడం దోషమని చెప్తారు. ఆహారం (అది ఏదైనా సరే) పడేయకూడదు. అలాగని ఎంగిలి చేసి ఇతరులకు పెట్టకూడదు. ఎంతకావాలో అంతే వడ్డించుకుని తినాలి. ఆహారం వృధ చేస్తే వచ్చే జన్మలో ఆహారం దొరక్క బాధపడతారు.
* కరోనా సందర్భంలో నోటిద్వారా తుంపరలు వ్యాపించకుండా జాగ్రత్త వహించమని ఈ ఎంగిలిదోషాన్ని నిర్వచిస్తున్నారు.
** ఎంగిలి దోషం అంటని మూడుపదార్థాలు ఈ లోకంలో ఉన్నాయి.
అవి 1. చిలక కొరికిన పండు,
2. తేనెటీగ నోటిద్వారా తయారైన తేనె.
3 దూడ తాగిన తర్వాత పిండినటువంటి ఆవుపాలు. వీటిని చక్కగా దేవుని అభిషేకానికి వాడవచ్చు, మనమూ సేవించవచ్చు.
ఇందులో కొంత భాగం యాదగిరి రావ్ గారి నుంచి సేకరించడం జరిగింది.
మన సంస్కృతిలో జాతాశౌచం కూడ ఉంది. అంటే ఎవరి ఇంట్లోనైనా కొత్తగా జననం జరిగితే, అప్పుడు కూడా మైల పడతారు. దీన్ని ఏమేమీ కారణలతో చెప్పారో, కానీ ఇందులో మనకు ప్రధానంగా ఒకటి కనిపిస్తుంది. ఇది కూడా ఆ కుటుంబ సంభ్యులకు 11 రోజుల పాటు ఒక విధమైన సెల్ఫ్-ఐసోలేషన్ (self-isolation), హోం-క్వారెంటైన్ (Home-Quarantine).
పసిపిల్లల వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి, శుచి-శుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం ఒక సంవత్సరం వయస్సు వరకు ఉన్న చిన్నపిల్లలను చూడటానికి వెళ్ళాలంటే ముందుగా స్నానం చేసి, శుభ్రంగా ఉతికి ఆరేసిన బట్టలను మాత్రమే కట్టుకుని వెళ్ళాలని, శుభ్రత లేకుండా వెళ్ళకూడదని, వాళ్ళు దేవుళ్ళని మా అమ్మ మాకు చెప్పింది, అదే నేర్పింది. ఈకాలంలో అయితే ఇలాంటి నియమాలను ఎవరు పాటిస్తున్నారు. వైద్యశాల నుంచి మాతశిశువులు ఇంకా ఇంటికి కూడా వచ్చి ఉండరు. కానీ అక్కడికి అందరూ లైన్ కట్టేస్తారు. శుభ్రత ఉండదు, ఆఫీస్ నుంచి వస్తూ, షాపింగ్ కు వెళ్ళి వచ్చి, మాసిన, మురికి పట్టిన బట్టలతో వెళ్ళి ఆ పసిపిల్లలను చూస్తారు. వాళ్ళను ముట్టుకుంటారు. ఎవరికి ఏ రోగముందో తెలియదు, ఏమీ లేకపోయినా అలా అశుభ్రంగా ఆ పిల్లలను తాకితే, పసిపిల్లలకు అనారోగ్యం రాదా ? అసలే వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. వేరే పనులు చూసుకుంటూ పసిపిల్లల వద్దకు వెళ్ళడం అవసరమా ? వచ్చిన వాళ్ళలో ఎవరు ఎలాంటివారో తెలియదు, ఆ పిల్లలకు దిష్టి కూడా. కానీ మొహమాటానికి మనం ఎవరిని రావద్దు అని చెప్పలేము.
మన సంప్రదాయంలో మనకు అప్పుడు పురిటిమైల ఉంటుంది. కనుక అది అయ్యేవరకు ఇంటికి ఎవరూ రారు, మనమూ ఇతరుల ఇళ్ళకు వెళ్ళము. పూర్తిగా భౌతిక దూరం, సామాజిక దూరం (సోషల్-డిస్టెన్సింగ్/ Social-distancing) పాటిస్తాము అంటే ఒక విధమైన సెల్ఫ్-ఐసోలేషన్ (self-isolation), హోం-క్వారెంటైన్ (Home-Quarantine). ఇందులో ఎంత శుభ్రత ఉందో అర్ధమవుతోందా ?!
ఏదైనా పాటించడం, పాటించకపోవడం వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, గానీ కనీస శుభ్రత మాత్రం పాటించాలి.
గత భాగంలో మరణం సంభవించినప్పుడు అక్కడ జరిగే జీవక్రియల గురించి తెలుసుకున్నాము కదా. ఇప్పుడు ఇంకొంత. (ఇంతకముందు మనం చెప్పుకున్నవన్నీ చదివితేనే దీన్ని అర్ధం చేసుకోగలరు).
కుటుంబంలో మరణం సంభవించగానే ఆ కుటుంబసంభ్యులు మైల పడతారు. మరణ సమయంలో పట్టే మైలను మృతాశౌచం అంటారు. వాళ్ళు ఆ ఇంట్లో వస్తువులు ఏమీ ముట్టుకోరు. ఆ కుటుంబానికి బంధువులు కానివారిని పిలిచి, తమకు కావలసిన బట్టలు, ఇతర సామాన్లు తీసి పక్కన పెట్టమంటారు. వంటింట్లోకి వెళ్ళరు. శుద్ధి అయ్యేవరకు అందరికి దూరం పాటిస్తారు, ఎక్కడికీ వెళ్ళరు. ఈ రోజు మనం క్వారంటైన్ అంటున్నాం కదా, అలాంటిదే.
శవం చుట్టూ క్రిములు ఉంటాయి, మనం జాగ్రత్త పడకుండా అన్నిటిని ముట్టుకుంటే అన్ని అపరిశుభ్రమవుతాయి. ఆ తర్వాత అన్నిటిని శుద్ధి చేయడం కష్టం. వంటిల్లు అంటేనే పరిశుభ్రంగా ఉండాలి, ఎందుకంటే ఏదైనా రోగం వస్తే ముందు అక్కడి నుంచే వ్యాపిస్తుంది. వంటిట్లో పప్పులు, ధాన్యాలను ఎలా శుభ్రం చేస్తాం ? ఈరోజు శానిటైజ్ (Sanitize) అంటున్నాం కదా. అది పప్పుదినుసుల మీద చేయడం అసాధ్యం. అందుకే మనం ముందు మూసేసేది వంటిల్లు. మరి వంట ఎలా? అందుకే మైల లేని వ్యక్తులను అప్పుడు వంటకు నియమిస్తారు. వారు మడి కట్టుకుని వంట చేసి వడ్డిస్తారు. మడి ఎందుకు అనేది ఇంతకముందు చెప్పుకున్నాము.
అదేకాక మరణం అనేది ఒక కుటుంబంలో చాలా విషాదాన్ని మిగుల్చుతుంది, ఒంటరి తనాన్ని, బాధను, కుంగుబాటును ఆ కుటుంబానికి కలిగిస్తుంది. ఇవన్నీ నకారాత్మక భావనలు. ఆలోచనలు అనేవి అంటువ్యాధి వంటివి. అవి ఫ్లూ కంటే త్వరగా వ్యాపిస్తాయని అంటారు స్వామి శివానంద సరస్వతీ. ధ్యానసాధన చేసేవారికి ఈ విషయం అనుభవమే. మామూలు వ్యక్తులైన సరే, గమనించండి. ఒక ప్రదేశం చాలామంది ఏడుస్తూ ఉంటే, మనకు తెలియకుండానే మనకు ఏడుపు వస్తుంది. అదే పదిమంది సంతోషంగా ఉండే వ్యక్తుల మధ్యలో ఉంటే మనకూ ఆనందం కలుగుతుంది. ఎవరి ఆరా బలంగా ఉంటే వారి ఆరా మిగితావారిని ప్రభావితం చేస్తుంది. మరి ఇలా మరణం వలన దుఃఖిస్తున్న వ్యక్తులు జనం మధ్యకు వెళితే, మిగితావారు కూడా ఏదో ఒక కుంగుబాటుకు గురవుతారు, వారి మీద కూడా ప్రభావం పడుతుంది. అదీగాక మరణం సంభవించిన ఇంట్లో నిత్యకర్మ కోసం రోజూ స్మశానానికి వెళ్ళి వస్తూ ఉంటారు. కనుక శుభ్రత కోసం మిగితావారితో కలవకుండా ఉండాలి. వంట చేసే సమయంలో ఇలా బాధపడుతూ చేస్తే, ఆహారం కూడా అదే భావనలతో నిండి త్వరగా బయటకు రాలేరు. అందుకే శౌచం ఉన్నవారు మడితో వండి పెడతారు. మైల అంటే ఒకరకంగా ఈ రోజు చెప్తున్న self-isolation, home-quarantine. మీకు ఎప్పుడైనా నెగటివ్ ఆలోచనలు కలిగినప్పుడు, బయటకు వెళ్ళి వాటిని అంటించకండి. మనస్సు మరలా మామూలు స్థితికి వచ్చేవరకు తలుపులన్నీ వేసుకుని ఇంట్లోనే కూర్చోండి అంటారు స్వామి వివేకానంద.
11 రోజులు పూర్తియై, కర్మలన్నీ పూర్తి చేశాక, అప్పుడు ఇంటిని గోమూత్రం మరియు పసుపునీటితో శుద్ధి చేస్తారు. గోమూత్రం మరియు పసుపు సూక్ష్మక్రిమి సంహారకాలు. అప్పుడు వారికి శౌచం వస్తుంది.
స్త్రీ నెలసరి సమయంలో కూడా ఇవే అంశాలు కనిపిస్తాయి. అప్పుడు శరీరంలో జరిగే మార్పులతో పడే ఆమె మానసికవేదన ఎవరికి అర్ధమవుతుంది. అలాంటి సమయంలో ఆమె పనులు చేయడం ఆమెకు, ఆమె కుటుంబానికి ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. కనుక ఆమెకు ఆ నాలుగు రోజులు పూర్తిగా self-quarantine (స్వీయనిర్బంధం).
ఇందులో మనకు ప్రధానంగా కనిపించేది పరిశుభ్రత, రెండవది మానసిక ఆరోగ్యంపై మన పూర్వీకులు పెట్టిన శ్రద్ధ.
మైల - శుభ్రత
జననమరణాలు సహజము. అవి లేకుండా ప్రపంచం ఉండదు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ పంచభూతాల నుంచి వచ్చినదే. కనుక తిరిగి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఒక జీవి మరణించిన మరుక్షణం నుంచి దాని దేహం క్షీణించటం (కుళ్ళిపోవటం - ఆంగ్లంలో డీకంపోజ్ (decompose) అంటారు) మొదలవుతుంది. అక్కడ కోట్లల్లో క్రిములు పుట్టి దాన్ని క్షీణింపజేస్తాయి. మనిషి దీనికి అతీతంకాదు.
చనిపోయిన కొన్ని నిమిషాల తర్వాత ముందు క్షీణతకు గురయ్యేది మెదడు. మరణం సంభవించిన కొన్ని క్షణాల్లోనే, అందులోని కణాలు నశించి, నీరు విడుదలవుతుంది. తర్వాత శరీరంలో శక్తిని బాగా వాడుకునే అవయవాల క్షీణత మొదలవుతుంది. ఆ రాత్రికే ప్రేగులను క్రిములు తినేసి, మిగితా శరీరం మీద పడతాయి. అప్పుడవి విషవాయువులను విడుదల చేస్తాయి, ఆ కారణంగా శరీరం ఉబ్బి, వాసన రావడం మొదలవుతుది. చాలా కణజాలం (Tissues) కరిగిపోతుంది. కానీ పలుచని చర్మం కనురెప్పలు వంటివి ఎండిపోతే, శరీరంలో కొవ్వు అధికంగా ఉండే ప్రదేశాలు సబ్బులాంటి జిడ్డు గలిగిన పదార్ధంగా మారిపోతుంది. తర్వాత శరీరం పసుపు-ఆకుపచ్చ వర్ణాలకు మారిపోతుంది. రెండవ రోజు నుంచి నాల్గవ రోజు లోపు క్రిములు అంతటా వ్యాపిస్తాయి. అమోనియా, హైడ్రోజెన్ సల్ఫైడ్ లాంటి విషవాయువులను విడుదల చేయగా, శరీరం ఉబ్బుతూ, దుర్గందము వెలువడుతుంది. 8-10 రోజుల్లో శరీరం ఆకుపచ్చని వర్ణం నుంచి ఎర్రని వర్ణంలోకి మారుతుంది. కొన్ని వరాల తర్వాత గోళ్ళు మరియు పళ్ళు పడిపోతాయి. నెల తర్వాత శరీరం ద్రవంగా మారిపోతుంది. ఇది మానవ శవం యొక్క శరీరంలో జరిగే ప్రక్రియ. (మేకప్పులు, పౌడర్లు పూసి, జాగ్రత్తగా కాపాడుకున్న శరీరం చివరకు ఇలా అవుతుంది. అయినా మనకు ఎంత అహంకారం, ఎన్ని పట్టింపులు, ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తామో !? అవన్నీ అవసరమా?)
ఎవరైనా చనిపోతే, తప్పకుండా చూడటానికి వెళ్ళడం మన సంస్కృతి మనకు నేర్పింది, ఇంటి ముందు నుంచి శవం వెళుతున్నా, ఒకసారి బయటకు వెళ్ళి ఆ శవానికి నమస్కరించి, 'నారాయణ, నారాయణ' అని, లేదా ఇష్టదైవాన్ని స్మరించి, ఆ జీవునకు సద్గతి లభించాలని కోరుకోవాలి. అది సాటి మనిషిగా మన కర్తవ్యం అని మన ధర్మం బోధించింది. కానీ అదే సమయంలో కొన్ని నియమాలను విధించింది. శవాన్ని చూసి ఇంటికి రాగానే, ఇంట్లోకి రాకుండా, ఏ బట్టలతో అయితే శవాన్ని చూసి వచ్చామో, అదే బట్టలతో తలస్నానం చేయమని శాస్త్రం చెప్పింది. ఒకవేళ శవం వెళ్ళిన దారిలో నడిస్తే, మాములు స్నానం సరిపోతుందని చెప్పింది.
ఒకరి ఇంట్లో మరణం సంభవిస్తే అక్కడంతా సూక్ష్మక్రిములు ఉంటాయి. కనుక పరామర్శకు వచ్చినవారు ఇంటికి వెళ్ళి స్నానం చేస్తారు. కానీ ఆ శవం వెళ్ళేవరకు మరణం సంభవించిన ఇంట్లో పొయ్యి వెలిగించకూడదు. నిజానికి ఊర్లలో అయితే, ఈనాటికి కూడా ఎవరైనా మరణిస్తే, ఆ శవాన్ని స్మశానానికి తీసుకుని వెళ్ళేవరకు ఊరిలోని ఏ ఇంట్లోనూ పొయ్యి వెలగదు. ఆ జీవునకు ఇచ్చే గౌరవంగా దీన్ని భావిస్తారు. శవం వెళ్ళిన తర్వాత ఇళ్ళను శుభ్రం చేస్కుని, అప్పుడు భోజనం చేస్తారు. ఊళ్ళో వాళ్ళ సంగతి దేవుడెఱుగు. ఇప్పుడు ఏ ఇంట్లో మరణం సంభవించిందో, ఆ ఇంట్లో పొయ్యి ఏంటీ, ఏకంగా శవం పక్కన కూర్చుని టిఫిన్‌లు, బిర్యానీలు తింటున్నారు, శీతలపానీయాలు త్రాగుతున్నారు. అసలు ఆ వాతావరణం అలా తినడానికి తగినదా? అది నిజంగా శుభ్రతయేనా ? చదువుకున్నవారు hygiene (హైజిన్) అంటారు కదా, మరి మీ హైజిన్ ఏదయ్యా?
ముందు ఆ ప్రేతము (శవానికి) గౌరవం ఇవ్వాలి. శాస్త్రం ప్రకారం అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అంతిమశంస్కారం పూర్తి చేయాలి. శవాన్ని పాచిపెట్టకూడదు, అంటే శవంతో రాత్రి నిద్రచేయకూడదు. సూర్యాస్తమయంలోపు దహనసంస్కారం అయిపోవాలి, ఒకవేళ రాత్రి మరణం సంభవిస్తే మరుసటి రోజు సుర్యాస్తమయంలోపు. అలాగాక శవాన్ని అలాగే ఉంచితే, దాన్ని పాచిశవం అంటారు పెద్దలు. పైన చెప్పిన విషయాలను ఇక్కడ సమన్వయం చేసుకుంటే మన సంస్కృతి మనకు ఎంత శుభ్రత నేర్పిందో అర్ధమవుతుంది. అసలు మన హిందువులు శవానికి అగ్నిసంస్కారం ఎందుకు చేస్తారనే విషయం మీద ఇంతకముందే ఒకసారి వివరణ ఇచ్చినందున ఇక్కడ మళ్ళీ దాన్ని ప్రస్తావించడంలేదు. వివరాలకు ఆ పోస్ట్ చూడండి.
http://ecoganesha.blogspot.com/2016/05/208-2.html
ఈ రోజు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం - భూమాత ఎదురుకుంటున్న విపత్తులపై అందరికీ అవగాహన కల్పించడానికి 1970 నుంచి దీన్ని జరుపుతున్నారు. ఈ ఏడాది నేపథ్యం (థీం/ theme) - క్లైమెట్ యాక్షన్ - భూమిపై జరుగుతున్న వాతావరణ మార్పులపై మనం తీసుకోవాల్సిన చర్యలు, భూమికి అపాయం పొంచి ఉందని ఊరికే చెప్పుకుంటూ కూర్చోవడం కాక, దానికి తగినట్లు చర్యలు చెప్పటాలని చెప్పడమే దీని లక్ష్యం.
ఇప్పుడు మనం కరోనా అనే ఒక వైరస్ తోనే అతలాకుతలం అవుతున్నాము. కానీ ఇదే తరహాలో మనం భూమిని కాలుషితం చేస్తూ పోతే, ఇలాంటి విష వైరస్‌లు అనేకం పుట్టుకొస్తాయని శాస్త్రవేత్తలు చాలాకాలం క్రితం చెప్పారు. ఆ మధ్య పుట్టిన డెంగ్యూకు కారణం భూతాపమే (గ్లోబల్ వార్మింగ్). అదేగాక భూమిపై ఇంతకముందున్న విషక్రిములు సైతం జన్యువులను మార్పు (gene mutation) చేసుకుని మరింత శక్తివంతమై ప్రబలుతాయి, ఇప్పుడున్న సూక్ష్మజీవినాశకాలు (యాంటీ-బయోటిక్లు) పని చేయవని అనేక నివేదికలు చెబుతున్నాయి. రేపు కరోనా సంగతి కూడా అంతే. దానికి వ్యాక్సిన్ కనుక్కోవచ్చు కానీ ఆ వ్యాక్సిన్ ఎల్లకాలం పని చేస్తుందని కాదు, కొంతకాలానికి ఆ వ్యాక్సిన్‌ను సైతం తట్టుకునేలా ఇది మళ్ళీ జన్యువుల మార్పు చేసుకోవచ్చు. ఇప్పుడు భూమ్మీదనున్న అనేక వ్యాధికారక క్రిముల పరిస్థితి ఇదే.
కరోనా అనేది వాతావరణ మార్పులు మనకు చూపిన చిన్న టీజర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది.
వైరస్‌లకు ఉన్న ఒకానొక లక్షణం gene mutation. అవి వేగంగా తమ జన్యువులను మార్పు చేసుకోగలవు. మనం వాటికి ఔషధం కనుక్కుంటే, అవి ఔషధాన్ని తట్టుకుని, ఇంకా ఎలా బలపడగలవో చూసుకుంటాయి. మందులు సైతం వాటిని ఏమీ చేయలేనంతగా వాటి జన్యువులను అవి మార్చుకుంటూ ఉంటాయి. అది నిరంతర ప్రక్రియ. దాన్ని సైన్సు ఆపలేదు. ఎందుకంటే అది వాటి లక్షణం. ఇది ప్రతీ శాస్త్రవేత్తకు తెలుసు.
కరోనా (కోవిడ్-19) సూక్ష్మక్రిమినే పరిశీలించండి. చైనాలో ప్రబలిన దాని జన్యుపటం ఒక విధంగా ఉంటే, ఐరోపాలో వ్యాపించింది ఇంకో విధంగా ఉంది. భారతదేశంలో దాని జన్యుపటం మరోలా ఉంది. అందులో కూడా తబ్లిగీ జమాత్ కు వెళ్ళివచ్చినవారి సోకిన వైరస్ మిగితావారికి సోకినదానికంటే మరింత బలంగా ఉందని వార్తాపత్రికల్లో చూశాము.
కనుక మనం చేయగలిగినది ఏమైనా ఉంటే, ఇటువంటి వైరస్‌లు కొత్తవి పుట్టకుండా చూసుకోవాలి. అంటే వాతావరణ మార్పులకు కారణమవుతున్న మానవుల చర్యలను పునఃసమీక్షించుకోవాలి. అవసరమైతే మన అభివృద్ధి విధానాలను పూర్తిగా మార్చుకోవాలి. ఇందులో తాత్సారం చేయకూడదు. లేదంటే ఇప్పుడున్న పరిస్థితులు మరలా మరలా ఉత్పన్నమవుతాయి. మానవుడు ప్రకృతిపై ఆధిపత్యం చెలాయించడం జరగని పని, అతడు చేయగలిగింది ప్రకృతితో కలిసి జీవించండం, భూమాతను శరణువేడటం.
హిందువులుగా మనం కూడా ఈ విషయంలో తీవ్రంగా ఆలోచించాలి. మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః అని అధర్వవేదం చెబుతోంది. ఈ భూమి నాకు తల్లి, నేను ఆమె పుత్రుడను అని అర్ధం. మన ధర్మం మనకు ఈమె కేవలం భూమి కాదు, భూమాత అని, నేలతల్లి అని చెప్పింది. మరి తల్లికి కీడు చేసేలా మనం బ్రతికితే ఆ బ్రతుక్కి ఒక అర్ధం ఉందా? మనం చేసే పూజలు ఫలిస్తాయా? ఉపాసనలు సిద్ధిస్తాయా ?
నా అనుభవంతో నేను చెప్పేది ఒక్కటే. మనం ఏ మంత్రోపాసన చేయకున్నా, పెద్ద పెద్ద పూజలు చేయకున్నా, భూమాతకు, ప్రకృతికి హాని కలిగించకుండా జీవించగలిగితే, ముక్తికి అవసరమైన వేదాంతజ్ఞానాన్ని భూమాతయే మనకు అందిస్తుంది. చాలా సులభంగా తీసుకెళ్ళి శ్రీ మన్నారాయణుని ఒడిలో కూర్చోబెడుతుంది. చాలా గారాభంగా చూసుకుంటుంది.
భూతాపం, వాతావరణ మార్పులు, కాలుష్యం మొదలైనవాటి మీద ఇంతకముందు అనేక విషయాలను సవివరంగా గణాంకాలతో ఫేస్‌బుక్‌తో పాటు మన బ్లాగులో 2013 నుంచి రాశాను. ఈ అంశం మీద అనేక వ్యాసాలు ఉన్నాయి.అవి చూడగలరు.
ఒకప్పుడు రాక్షసులు పాపకర్మలు చేస్తే, ఆ పాపభారం భరించలేక దేవతలందరితో భూదేవి కలిసి విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి 'స్వామి! పాపభారం మోయలేకపోతున్నాను, దయచేసి అవతరించండి' అని చెప్పినట్లు పురాణాల్లో విన్నాము.
ఇప్పుడు ఆధునిక మానవుడు అంతకు తక్కువేమీ చేయడంలేదు. కొన్ని చూడండి.
ప్రకృతి విద్వంసం కారణంగా ఈ ప్రపంచంలో ప్రతి సంవస్తరం 25,000 నుంచి 50,000 జీవజాతులు అంతరించపోతున్నాయి, అనగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి.
భూమ్మీద ఉన్న అడవులలో దాదాపు 50% పూర్తిహా నశించిపోయింది. అందులో చాలా భాగం గత మూడు దశబ్దాల్లోనే నశించింది.
ఈ భూమి వయస్సు 460 కోట్ల సంవత్సరాలు. దాన్ని 46 ఏళ్ళు అనుకుంటే, అప్పుడు ఇక్కడ మానవుడు నివసిస్తున్నది కేవలం 4 గంటల నుంచే. మన పారిశ్రామిక విప్లవం మొదలై 1 నిమిషమైంది. ఆ సమయంలోనే మనం ప్రపంచంలోని 50% అడవులను నాశనం చేశాం. అది మన అభివృద్ధి ??
భూమి మీద జీవమనుగడకు సరిపడా వాతవారణాన్ని కాలుష్యం చేసి, భయంకారంగా భూమి మీద వాతావరణాన్ని పెంచేశాము.దాన్ని భూతాపం (గ్లోబల్ వార్మింగ్/ Global Warming) అంటున్నారు. ఆ ఫలితంగా రాబోవు 50 ఏళ్ళలో ప్రపంచంలో గొప్ప గొప్ప నదులు పూర్తిగా ఎండిపోయే పరిస్థితి ఉందని నివేదికలు చెబుతున్నాయి. అందులో మన గంగ కూడా ఉంది. అయినా మనకు చీమ కుట్టినట్లు కూడా లేదు.
ఈ పరిస్థితి ఇలాగే ఉంటే, కార్బన ఉద్గారాల విషయంలో ఆలోచించకపోతే, 2100 కి అసలు మానవుడి సహా ఈ భూమ్మీద ఏ జీవి బ్రతకదని శాస్త్రవేత్తలు తేల్చేశారు.
రాక్షసులు పుణ్యనదులను కలుషితం చేశారు, చెరువులను నాశనం చేశారు. ఇప్పుడు మనవాళ్ళూ చెరువులను కబ్జా చేసి కనిపించకుండా చేశారు. ఈ భూతాపం గంగ రాబోయే 50 ఏళ్ళలో ఎండిపోతుందని, వాతవరణ మార్పుల పై బలమైన విధానం లేదు.
ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మనిషి బయటకు రాకపోతే ప్రకృతి పులకిస్తోంది. జరిగిన లోపాలను సవరించుకుంటోంది. ప్రపంచనేతలు చాలా సదస్సులు పెట్టారు, చాలా మాట్లాడారు, కానీ ఒక్కటీ అమలు పరచలేదు. బహుసా అందుకే ప్రకృతియే రంగంలోకి దిగిందేమో. అందుకే రాక్షసునిలా ప్రవర్తిస్తున్న మానవుడిని ఒక్క క్రిమితో కట్టడి చేసి, తనను తాను శుద్ది చేసుకుంటోంది. మిగితా జీవాలకు స్వేచ్ఛనిచ్చింది. ఈ కరోనా పేరుతో లాక్‌డౌన్ మొదలైన తర్వాత 10 రోజుల్లోనే గంగా, యమునా మొదలైన నదుల్లో చక్కని మార్పు కనిపించింది, కాలుష్యం తగ్గింది. అసలు స్నానానికి కూడా పనికి రాని విధంగా మనం గంగను కలుషితం చేస్తే, కేవలం 14 రోజుల్లోనే గంగ నీరు హరిద్వార్, ఋషికేశ్ మొదలైన ప్రాంతాల్లో త్రాగడానికి పనికి వచ్చే స్థాయికి వచ్చాయి. మిగితా వాటి పరిథితి కూడా ఇలానే ఉంది.
ఎవరినో తిట్టి చేసేదేమీ లేదు. అందరూ మారాలి, ఈ ప్రకృతికి మానవుడు అధిపతి కాదు, ప్రకృతిలో ఒక భాగమని, అతడు స్వతంత్రుడు కాదని, అన్ని జీవుల మీద ఆధారపడ్డాడని తెలుసుకుని, వినయంగా మెలగాలి. ప్రకృతిని కలుషితం చేయడం రాక్షసత్వం, సహజ వనరులను విచ్చలవీడిగా వాడటం రాక్షస్త్వం, అది చేసేవారంతా రాక్షసులేనని గుర్తించాలి. రాక్షసునిగా కాక మానవునిగా బ్రతకడం నేర్చుకోవాలి.
భూగోళాన్ని కాపాడుకోవడం అనేది పర్యావరణ పరిరక్షకుల బాధ్యత కాదు, , మనకు ఉండాల్సిన కనీస ఇంగిత జ్ఞానం.
భౌతిక దూరం
ఇది మన సంస్కృతిలో మనకు కనిపిస్తుంది. మనది షేక్‌హ్యాండ్ సంస్కృతి కాది, నమస్కారం చేసే సంస్కృతి. నమస్కారం వెనుక ఉన్న 'ఒక కారణం' చెప్పుకుందాము...
ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి (కదిలేవి, కదలవిని; జీవం ఉన్నవి, లేనివి) జీవ-అయస్కాంత, జీవ-విద్యుత్ క్షేత్రం ఉంటుంది. దాన్ని 'ఆరా' అంటారు. ప్రతి వస్తువు విశ్వంలో, విశ్వాంతరాళంలో జరిగే మార్పులకు అనుకూలంగానో, ప్రతికూలంగానో ప్రతిస్పందిస్తుంది. తన నుంచి కొన్ని తరంగాలను, శక్తులను ప్రసరిస్తుంది. మనుష్యులకు కూడా ఇది వర్తిస్తుంది. గొప్ప ఉపాసకులు, సిద్ధపురుషులు, గురువులను చూసిన వెంటనే మన మనస్సు ప్రసన్నం అవుతుంది, కొందరు మన సమీపానికి వచ్చినా, లేదా మనమే వారి దగ్గరకు వెళ్ళినప్పుడు అప్రయత్నంగానే ప్రశాంతత ఆవరిస్తుంది. కొందరిని చూడగానే చికాకు, కోపం కలుగుతాయి. దానికి కారణం వారి మనస్సులో ఉన్న భావాలు, వారు ప్రసరించే శక్తి. జాలి, దయ, ప్రేమ, కరుణ మొదలైన సద్గుణాలు కలిగినవారు మంచి ఆరాను కలిగి ఉంటే, కుళ్ళు, ఈర్ష్యా, అసూయ, ద్వేషం మొదలైన దుర్గుణాలు కలిగినవారు చెడు ఆరా కలిగి ఉంటారు. మంచి వారి ఆరా గొప్ప కాంతితో ప్రజ్వలిస్తూ ఉంటే, చెడ్డవారి ఆరా చీకటి వంటి నల్లని కాంతితో ఉంటుంది. గొప్ప ఉపాసకులు ఎదుటివారి ఆరాను చూడగలరు. సాధారణ మనిషికి అయితే అతని ఆరా 4-5 అడుగుల దూరం వరకు ప్రసరిస్తూ ఉంటుంది. అంటే మనం ఒక మామూలు వ్యక్తికి మరీ దగ్గరగా వెళితే, మనం అతని క్షేత్రంలోకి ప్రవేశిస్తున్నాం అని అర్ధం. నిజానికి చెడు తరంగాల నుంచి మన ఆరా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. కానీ మనమే కావాలని వెరొక వ్యక్తికి మరీ దగ్గరగా వెళ్ళినప్పుడు, అతని ఆరా బలంగా ఉంటే, అది మన ఆరా క్షేత్రంలోకి చొచ్చుకుని వస్తుంది. ఫలితంగా మన ఆరాలో అసమతుల్యత ఏర్పడి, తర్వాతా చాలా సమయంవరకు మనం ఆ చెడు ఫలాలను అనుభివిస్తాము. అందుకే మనం సాధ్యమైనంత వరకు తెలియని వారికి భౌతిక దూరం పాటిస్తాము. కుటుంబ సభ్యులతో తప్ప ఇంకెవరితోనూ రాసుకుని, పూసుకుని తిరగము. ఇదేమీ అంటరాని తనం కాదు. ఈరోజు కరోనా వచ్చాకా ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తులతో కనీసం 6 అడుగుల దూరం పాటించాలని చెబుతున్నారు. కానీ మన సంప్రదాయంలో ఇదే ముందే ఉంది. మనం అందరికీ నమస్కారం చేయడానికి ఇది కూడా ఒక కారణం.
ఎవరు ఎలాంటి వారు, వారు మీకు మేలు చేస్తారో, కీడు చేస్తారో తెలియకుండా, వారి మనస్సులను చదివే శక్తి లేని మనం ఎవరు పడితే వారితో చేతులు ఎందుకు కలపాలి? అది అవసరమా? ఎంతైనా కరోనా మనకు చాలామంచి పాఠాలు నేర్పించింది.
కానీ గొప్ప గురువుల ఆరా చాలా దూరం వరకు తన క్షేత్రాన్ని కలిగి ఉంటుంది.అందుకే సత్పురుషుల దగ్గరకు వెళితే చాలు ఎంతో ఆనందం, ప్రశాంతత కలుగుతాయి. భగవాన్ రమణ మహర్షి, కంచి పరమాచార్య మొదలైన మహానుభావుల చిత్తరువులను చూడగానే మనస్సు చాలా ప్రసన్నమవుతుంది. దానికి కారన్ణం వాళ్ళ ఆరా అన్ని భౌతిక పరిమితులను అధిగమించింది. వారు భౌతిక దేహంతో లేకపోయినా, వారి శక్తి మొత్తం విశ్వాన్ని చైతన్యం చేస్తూనే ఉంటుంది. వారంతా మహానుభావులు, అందుకే గురువుల చిత్రాలు మన ఇంటి నిత్యం కనిపించే విధంగా పెట్టుకోవాలి. ఇంకా ఈ ఆరా గురించి అనేక విశేషాలు ఇంకోసారి చెప్పుకుందాము.
నివేదన ఎందుకు?
ఆహారానికి కొన్ని దోషాలు ఉంటాయి. అనగా కొన్ని సహజంగా వస్తాయి, ఉదాహరణకు ముల్లంగి, వెల్లుల్లి తమోగుణాన్ని కలిగిస్తాయి. అది వాటి గుణదోషం. అదిగాక విత్తనాలను పండించిన విధానం, వాటిని అంగడికి తీసుకొచ్చే క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే వాటికి కొన్ని దోషాలు ఏర్పడతాయని పెద్దలు చెబుతారు. అదేగాక అన్నం వండిన వ్యక్తి ప్రభావం కూడా ఆహరం మీద పడుతుంది. అతడు ఎలాంటి వాడో, ఆ ఆహారం ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో మనకు తెలియదు. అందునా అతని చేతికి రాకముందు అతను ఏ వర్తకుని వద్ద ధాన్యం కొన్నాడో, ఆ వర్తకుడు అన్యాయం చేసి ఉండచ్చు. అది కూడా ఆ ధాన్యం గ్రహిస్తుంది. ఇలాంటి అన్ని దోషాలు పోయి, ఆ ఆహరం దోషరహితం అవ్వడానికి మనం ఆహారాన్ని నివేదన చేస్తాము.
ఇప్పుడు బయట నుంచి ఆహారం 'ఆర్డర్' చేసేవాళ్ళు ఉన్నారు. స్విగ్గీ, జొమాటో అంటూ అనేక కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ ఆహారం ఎలా సిద్ధం చేసారో తెలీదు. పైగా చాలా సందర్భాల్లో ఆహారం అమ్మే సంస్థలకు అది ఒక వ్యాపారం మాత్రమే. కనుక అలాంటివి తినడం అనేది మీ ఇష్టం. తప్పనిసరి అయితే తప్ప తినకపోవడమే మంచిది.
మళ్ళీ మళ్ళీ ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. మనం హిందువులము. విగ్రహారాధన మనకు మాత్రమే ఉంది. ఎడారి మతాలు దాన్ని అంగీకరించవు, వాళ్ళకు అలాంటి వ్యవస్థ లేదు. మన ఇంట ఉన్నది ఒక విగ్రహం కాదు, అది సాక్షాత్తు భగవంతుని స్థూలరూపము. ఇంట్లో మన పిల్లల ఎదుగుదలకు ఎలా ఆహారం పెడతామో, దైవానికి అదే భావనతో పెట్టాలి. మనం పెట్టిన ఆహారాన్ని భగవంతుడు కళ్ళ ద్వారా చూసి, దాన్ని గ్రహించి సంతృప్తి చెందుతాడు. కనుక మనం తినేది భగవంతుని ఉచ్ఛిష్టము, అనగా ఆయన తినగా మిగిలినది. దేవతల ఆహారం అమృతం గనక మనం నివేదించిన ఆహారం అమృతమై మనకు మేలు చేస్తుంది. కనుక మనం ఏమి తిన్నా, నివేదన చేసే తినాలి. టీ, కాఫీలూ అయినా సరే, భగవంతునికి ఒకసారి చూపించి, అది కూడా ప్రసాదంగానే భావించాలి. అప్పుడు అది మనశ్శుద్ధిని ఇస్తుంది.
చాలామంది ఆ పదార్ధంలో ఆ పోషక విలువ ఉంది, ఇందులో ఈ విటమిన్ ఉందంటూ చెప్పి అవి తినమంటారు. శ్రీరామనవమికి పానకం ఎందుకంటే రోగనిరోధశక్తి పెరగడానికంటారు. అవును నిజమే. కానీ కేవలం పానకంలో మిరియాలు, బెల్లం, యాలకులు, శొంఠి కలపడం వలన అది రోగనిరోధక శక్తిని ఇవ్వదు. శ్రీ రామచంద్ర మూర్తికి నివేదన చేస్తాం చూడండి, అది దానికి మరింత శక్తినిస్తుంది. నివేదన చేయనంతవరకు అది ఒక ఎనర్జీ డ్రింక్, ఒక ఔషధం. కానీ నివేదన చేశాక అది అమృతతత్త్వాన్ని ఇచ్చే దివ్య ఔషధం. వస్తువులుకున్న గుణం కంటే హిందువులు దైవానికి చేసే నివేదన మరింత శక్తినిస్తుంది. అది మన విశ్వాసం, సత్యము.
ఇక తినే సమయంలో భగవంతుని నామస్మరణ చేయమన్నారు. అలా నామస్మరణ చేస్తూ మౌనంగా తిన్న ఆహారం శరీరాన్ని మంత్రపూతం చేస్తుంది, మనస్సుకు మంచి ఆలోచనలు కలిగిస్తుంది, ఆహారంలో ఏదైనా దోషాలుంటే అవి మనస్సుకు చేరకుండా చూస్తుంది. గుర్తుంచుకోండి, టి.వి., వాట్సాప్ చూస్తూ, ఫోన్ మాట్లాడుతూ తిన్న ఆహారం వంటబట్టదు. అలా చూస్తూ మీరు ఎంత తిన్న సంతృప్తి ఉండదు. ఊబకాయం, అజిర్తి మొదలైనవి రావడానికి కారణం అదే. ఒక సమయంలో ఒకే పని చేయాలి. కనీసం భోజనము, పూజ, యోగా మొదలైనవి చేసే సమయంలో. అంతెందుకు, ఇంట్లో గృహిణులు చాలాపని చేస్తారు. అయినప్పటికీ కొందరికి ఊబకాయం వస్తుంది, మరలా దాని కోసం వ్యాయామం చేస్తారు. ఎందుకంటే మీకు తెలియకుండా (unconscious) ఆ పని చేసినా, దాని ప్రభావం అత్యల్పం. ఆ పని చేసినా జాగరూకత (conscious) గా చేయాలి. అది భోజనమైనా సరే. అప్పుడే వంటబడుతుంది, సంతృప్తి కలుగుతుంది.
మడి అంటే అసలు అర్ధమేంటి?
ఎవరైనా మౌనంగా, ఉలుకుపలుకు లేకుండా ఒంటరిగా కూర్చుని ఉంటే "ఏరా! మడి కట్టుకుని కూర్చున్నావా" అంటారు. మొక్కలు నాటిన తర్వాత వాటి చుట్టు మడి కడతారు, సరిగ్గ నీరు అంది ఎదగడానికి. మడికి అర్ధం తనకు తాను కొన్ని పరిమితులు ఏర్పరుచుకుని, వాటికి బద్ధుడై ఉండటం. మడి చాలావరకు మానసికమే, అందులో బాహ్య అంశాం చాలా తక్కువ.
మనం పూజ మరియు వంట చేసే సమయంలో మడి కట్టుకుంటాము. దైవం తప్ప అన్య విషయాల వైపు మనస్సు పోనివ్వక, పూజా సమయం మొత్తాన్ని దైవం మీద లగ్నం చేయడం మడి ఉద్దేశం. వంట విషయంలో కూడా అంతే. అయితే ఇక్కడొక విషయం గుర్తుంచుకోవాలి. మనం తిన్న ఆహారం మన మనస్సుగా మారుతుంది. మనం ఆహారం సిద్ధం చేసే సమయంలో మరియు తినే సమయంలో ఏ ఆలోచనలు చేస్తామో, ఏ దృశ్యాలు చూస్తామో అవి ఆహారంలోకి ప్రవేశించి, మనస్సుగా మారుతాయి. కనుకా ఆహారం వండే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం సిద్ధం చేసే సమయంలో, వంట చేసేవారు చికాకు, బాధ, కుంగుబాటు, కోపం మొదలైన వాటికి లోనైనా, లేకా అలాంటి మానసిక స్థితిలో వంట చేసినా, అది ఆహారంలోకి ప్రవేశించి, అది భుజించినవారికి ఆశాంతి కలిగుతుంది. అప్పుడు హింసాత్మక ఘటనలు చూస్తే, అవి కూడా తిన్నవారి మనస్సులోకి చేరి, వారు హింసావాదులౌతారు. ఆ ఆహారం విషమవుతుంది. అదే అప్పుడు సద్భావనలు చేస్తే, ఆ ఆహరం అమృతం, అది తిన్నవారికి సద్భావనలు కలుగుతాయి, మనశ్శాంతి ఉంటుంది. ఈ అంశం మీద ఇంతకముందు దత్తసందేశం అనే శీర్షికలో చాలా వివరించాను. అది చూడండి.
మడిలోని ప్రధాన అంశం కూడా ఇదే. దేన్నీ ముట్టుకోకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, భగవంతుని ధ్యానిస్తూ వంట చేయడం. మనం ఆస్తీకులం, నాస్తికులం కాదు, పైగా హిందువులము. ఇంట్లో విగ్రహము లేదా పటము (ఫోటో) ఉంటుంది. కానీ అక్కడ ఉన్నది బొమ్మ కాదు అమ్మ అన్న భావన. దైవాన్ని మీ అమ్మ, నాన్న, కొడుకు, కూతురు, మిత్రుడు.... ఇలా ఏ విధంగానైనా భావన చేసే స్వేచ్ఛ కేవలం హిందూ ధర్మం మాత్రమే ఇచ్చింది. మనం వండే ఆహారం మన ఇంటి ఉన్న అమ్మాయి అయిన అమ్మవారి కోసం అనే భావంతో చేశారనుకోండి... అప్పుడు ఆ సమయంలో ఎంత దివ్య ప్రేమ కలుగుతుంది, ఆ అనుభూతి చెప్పలేనిది. ఆ భావన ఆహారం మీద కూడా పడుతుంది. అదేగాక వంట చేసే సమయంలో చాలామంది గృహిణిలు స్తోత్ర పారాయణ, నామస్మరణ, జపం చేస్తారు. ఇవన్నీ కూడా ఆ ఆహారం మీద మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. అంతిమంగా మనం ఆ ఆహారాన్ని ప్రేమగా తీసుకెళ్ళి దైవానికి నివేదన చేస్తున్నాము. ఇలా వండిన ఆహారంలో మొత్తం దైవత్వం, దివ్యత్వం నిండి ఉంటుంది. అది తిన్నవారి మనస్సులోకి ఎంత దివ్యత్వం ప్రవేశిస్తుంది ? అలాంటి వాళ్ళు ఏనాడూ తప్పుద్రోవ పట్టరు, ఆపదలు కలగవు, అపమృత్యువు దగ్గరకు రాదు. జీవితాంతం ఆనందంగా ఉంటారు. అందుకే మనం మడి కట్టుకుని వంట చేస్తాము.
ఆహారం సిద్ధిం చేసే సమయంలో పరిశుభ్రత పాటిస్తున్నామా?
ఈరోజు మనకు లోపించింది ఆ పరిశుభ్రతే. వంట ఈరోజు చేస్తే, దానికి ముందురోజు రాత్రే లేదంటే రెండు మూడు రోజుల క్రితమే కూరగాయలు అన్ని తిరిగేసి డబ్బాలో పెట్టి ఫ్రిజ్లో పెట్టుకుంటారు. అలా చేస్తే వాటిలో అసలు పోషకాలు ఉంటాయా లేదా అనేది దేవుడికే తెలుసు. ఇక స్నానం చేయడం లాంటిది ఏమీ ఉండదు, పొద్దున లేవగానే పాచి నోటితోనే ఈ పదార్ధాలన్నీ కుక్కర్లో పెట్టి, అప్పుడు కాలకృత్యాలు తీర్చుకుంటూ, పళ్ళు తోముకుంటూ, మధ్య మధ్యలో వంట చూస్తారు. ఏ బట్టలు పడితే ఆ బట్టలు కట్టుకుంటారు. వాటితోనే మల మూత్ర విసర్జనకు వెళ్లి వస్తూ, చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోక, అవే బట్టలతో వంటింట్లోకి వెళ్ళిపోయి, కూరగాయలు తరగాల్సినవి ఉంటే తరిగి, ఏవైనా వంటకు వాడే గిన్నెలు తుడవాల్సినవి ఉంటే ఆ బట్టలతోనే తుడిచేస్తారు. మధ్యలో ఫోన్లో మాట్లాడతారు; దగ్గినా, తుమ్మినా రుమాలు లేదా మరే ఇతర వస్త్రమైనా అడ్డు పెట్టుకోవాలన్న శ్రద్ధ ఉండదు. అమీబియాసిస్ అనే ఒక రోగం ఉంది. దానికి అల్లోపతి వైద్యంలో మందు లేదు. మలం యొక్క అవశేషాల ద్వారా అది వస్తుంది. ఇలా అపరిశుభ్రంగా ఉండి వంటజేస్తే, చేతులపై లేదా గోర్ల మధ్య కానీ ఆ క్రిములు ఉండిపోతే, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే వాళ్ళకి ఈ అమీబియాసిస్ అనే వ్యాధి సోకుతుంది. మధ్యలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడినప్పుడు నోట్లోలో ఉన్న తుంపరలు వండుతున్న ఆహారం మీద పడతాయి. వాటిలో కూడా రకరకాల క్రిములు ఉంటాయి. ఇది మనం ఇప్పుడు పాటిస్తున్నదే. ఇది ఎంతవరకు మంచిది అనేది ఆలోచించండి.
మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఒకప్పుడు మన సంప్రదాయంలో మడి అనే ఆచారం ఉండేది. అది ఇప్పటికీ ఉందనుకోండి, కానీ మనం పాటించడంలేదు, ఒకప్పుడు అన్నం వండాలన్నా, పూజ చేయాలన్నా, మడి కట్టుకుని చేసేవారు. ముఖ్యంగా పితృ కార్యాలు చేసినప్పుడు మడి ఖచ్చితంగా పాటించేవారు. ముందుగా లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని, శుభ్రంగా స్నానం చేసి, ఉతికి ఆరేసిన శుభ్రమైన బట్టలనే కట్టుకునేవారు. ఆ తర్వాత వేరే ఏ ఇతర వస్తువులు ముట్టుకోకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా, నేరుగా వంటింట్లోకి వెళ్ళి, వంటకు సంబంధించిన పని మొదలుపెట్టేవారు. మడిలో ఉన్నంతసేపు ముట్టుకోవడం కానీ కబుర్లు చెప్పడం కానీ చేసేవారు కాదు. పూర్తిగా దైవ ధ్యానంతో పని చేసేవారు. అందరికీ భౌతిక దూరం పాటించేవారు. మడి పాటించే చాలా కుటుంబాల వారు ముక్కుకు నోటికి కూడా ఒక గుడ్డ కట్టుకునేవారు. ఎందుకంటే ఆహారం వండుతున్న సమయంలో మాట్లాడినా, దగ్గినా, తుమ్మినా, ఆ తుంపరలు ఆహారం మీద పడకూడదు. అలా పడితే అది ఎంగిలి అవుతుంది. అప్పుడు నైవేద్యానికి పనికిరాదు అని. పైగా దేవునికి నివేదన అంటే ఎంతో పవిత్రత ఉండాలి కదా. ఒకవేళ మధ్యలో మలమూత్రాదులకు వెళితే, మళ్ళీ స్నానం చేసి, శుభ్రమైన వేరే వస్త్రాలు ధరించి వచ్చేవారు. కేవలం బ్రాహ్మణ కుటుంబాల్లో ఇలా ఉంటుంది అనుకుంటే తప్పు ఎందుకంటే నా మిత్రులు చాలామంది ఎస్సీల్లో కూడా ఈ నాటికీ ఈ ఆచారం ఉంది. దేవుడికి నివేదన చేయాలి అనుకునే రోజు అన్ని వస్తువులు శుభ్రంగా కడిగి చేస్తారు. ప్రత్యేకమైన పాత్రలను దేవునికై వాడతారు. ఎంత పరిశుభ్రత ఉందో చూడండి. ఇలా వండిన ఆహారం ఎంత మంచిది ఆరోగ్యానికి ?!. కానీ ఈ రోజు మనం చదువుకున్నాం గనక మనకు మడి మూఢాచారం.
ఒకప్పుడు మన సంస్కృతిలో బయటికి వెళ్లి రాగానే కాళ్ళు, చేతులు కడుక్కుని, నోరు పుక్కిలించి, అప్పుడు లోపలికి వచ్చేవారు. మరీ దూరం వెళితే, కొన్ని సందర్భాల్లో స్నానం చేసి మళ్లీ వేరే బట్టలు కట్టుకొని లోనికి వచ్చేవారు. ఎప్పుడు కరోనా వైరస్ వచ్చిన తర్వాత మనకు ఆ ఆ వైరస్ ఎక్కడ అంటుకుంటుందో అనే భయంతో చెప్పులతో ఇంట్లోకి రాకుండా చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వస్తున్నారు. మరీ రోడ్డు మీద వెళితే స్నానం చేసి, ఆ బట్టలు అప్పుడే ఉతికి ఆరేసి, వేరే బట్టలు కట్టుకొని వస్తున్నారు. ఒకప్పుడు ఇది మనం పాటించిన సంప్రదాయం. అయితే కేవలం ఇలాంటి వైరస్‌ల నుంచి తప్పించుకోవడానికే ఈ సంప్రదాయం రాలేదు.
మన జీవితంలో ఎక్కువ సమయం గడిపే ప్రదేశం మన ఇల్లు. కార్యాలయంలో పని చేసి వచ్చినా లేదా బయటి ఎంత తిరిగినా ఇంటికే రావాలి. కాబట్టి మన ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. అంటే ఇంట్లో పాజిటివ్ శక్తి అధికంగా ఉండాలి. మనము బయటికి వెళ్ళామనుకోండి, అక్కడ చాలా మంది వ్యక్తులు మనకు కనబడతారు. అందరికి రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఆలోచన అనేది ఒక శక్తి, అది మంచి ఆలోచన కావచ్చు, చెడు ఆలోచన కావచ్చు. మంచి ఆలోచన పాజిటివ్ శక్తి అనగా సకారాత్మక శక్తిని మనకు ఇస్తే, చెడు ఆలోచన నెగిటివ్ అనగా నకారాత్మక శక్తిని ఇస్తుంది. మనము బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి రకరకాల ఆలోచనలు మనతోపాటే వస్తాయి. మనల్ని చూసి చాలామంది చెడుగా (అసూయ, ద్వేషం మొదలైనవి) కూడా ఆలోచించవచ్చు. అవి కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి. మనం దిష్టి అంటాం కదా అదే ఇది. మరి వీటన్నింటినీ ఇంట్లోకి మోసుకుని వెళ్లడం చాలా తప్పు. ఎందుకంటే ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. అందుకే మన పూర్వీకులు బయటికి వెళ్లి రాగానే కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, ఆ తర్వాతే లోపలికి వెళ్ళాలి అని నియమం పెట్టారు. ఎందుకంటే ఇలా చేయడం వలన మాత్రమే నకారాత్మక శక్తి వెళ్లి పోతుంది. కనుక మనము ప్రశాంతంగా ఉండవచ్చు.
రెండవది ఏమిటంటే మనమంతా హిందువులం విగ్రహారాధన చేస్తాం, కొందరు అగ్నిహోత్రం కూడా చేస్తారు. మన ఇంట్లో ఉండే విగ్రహం కేవలం బొమ్మ కాదు అది దేవుడు, అది అమ్మ. అంటే మన ఇల్లు కూడా పవిత్రమైనదే. ఈ భావన అందరిలోనూ ఉంటుంది. అందుకే మన ధర్మంలో దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్పినా, అధికంగా శుభ్రతకు భగవంతుడికి ముడిపెడతాము. లక్ష్మీ పూజ తీసుకోండి, లక్ష్మీదేవి పూజ చేస్తున్నామంటే ముందు మనం చాలా శుభ్రతను పాటిస్తాము. దానికి కారణం ఎక్కడ శుచి శుభ్రత ఉంటే అక్కడ లక్ష్మీ ఉంటుంది. పెద్ద పెద్ద పూజలు చేయకపోయినా కనీసం రోజు దీపం పెట్టినా, మన ఇంట్లో కూడా భగవంతుడు ఉంటాడు. అందుచేతనే ఎక్కడికి వెళ్లి వచ్చినా తప్పకుండా చెప్పులు బయటే వదిలి, కాళ్లు చేతులు, కడుక్కునే ఇంట్లోకి అడుగు పెట్టే సంప్రదాయం వచ్చింది. ఎవరైనా ఇంటికి వస్తే తప్పకుండా వాళ్ళకి కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవడానికి నీళ్లు ఇస్తాము. ఈరోజు మన ఇళ్ళల్లో ప్రశాంతత లేకపోవడానికి, అనారోగ్యం రావడానికి ఇది కూడా ఒక కారణం.
కనుక కేవలం వైరస్‌లే కాదు, చికాకుల నుంచి మన ఇంటిని రక్షించుకోవాలన్నా, ఇది మనం తిరిగి పాటించడం ప్రారంభించాలి.
సీతమ్మ గురంచి విన్నప్పుడు, తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఒక ఘటన గుర్తుకు వస్తుంది.
--------------------------
*భగవంతుడు భక్త సులభుడు*...
శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఓ అద్భుత సంఘటన .
వారు పూజ చేసే టప్పుడు ఆవాహయామి అనగానే ఆ దేవత వచ్చి ఎదురుగా బుద్ధిగా కూర్చునేదిట . అది వారి అనుభవం.
ఒకసారి ఒకామె వచ్చి తనకు సీతా మంత్రం అనుగ్రహించమని కోరిందట .
ఆశ్చర్యంతో , ఆనందంతో వారు చాలా కాలం సీతా మంత్రోపాసన చేసి , తరువాత ఆవిడని రమ్మని
మంత్రోపదేశం చెసారట .
ఆవిడ వెళ్ళిపోతూ ఈ మంత్రం చేస్తే చాలా కస్టాలు వస్తాయని వింటున్నాను . నిజమేనా అని అడిగిందట .
వారు అలాటప్పుడు ఆ మంత్రం కావాలని ఎందుకు అడిగావు ? సందేహాలుండకూడదు. అంటే, ఆమె అదేమీ లేదంటూ వెళ్ళిపోయిందట .
కొంత కాలానికి ఆవిడ తిరిగి వచ్చి తనకి ఆ మంత్రం వద్దనీ , ఇక చేయలేననీ, చాలా కష్టాల బారిన పడుతున్నాననీ వాపోయిందిట .
ఆమె ప్రారబ్దానికి బాధపడుతూ , ఆమె ప్రారభ్దానికి జాలి పడి , సందేహాస్పదమైన మనసుతో, పరిపూర్ణ విశ్వాసం లేకుండా చేస్తే ఇలాగే ఉంటుందేమో అనుకుంటూ
దయతో శ్రీ శాస్త్రి గారు దానికి కావలసిన జపాలు ముందు ఆయన చేసుకుని ఆవు కుడి చెవిలో మంత్రం చెప్పి వదిలెయ్యి .
ఇకనించీ మళ్ళీ దాని గురించి ఆలోచించవద్దు అని చెప్పేరట .
ఆవిడ అలాగే చేసి వెళ్ళిపోయిందట .
ఆ రాత్రి కలలో సీతమ్మ వారు గురువుగారికి కనిపించి , అర్హత లేని వారికి నా మంత్రం ఎందుకు ఇచ్చావు ?
ఇకనించీ నువ్వు పిలిస్తే రాను అన్నారుట .
గభాలున లేచి వారు కన్నీరు మున్నీరు గా విలాపించారుట .
కాలం గడుస్తోంది . కొన్నాళ్ళకి వారింట్లో శ్రీరామనవమిని రామపట్టాభిషేకం ప్రతిసారిలాగే నిర్వహిస్తున్నారు . తండోపతండాలుగా శిష్యులు వచ్చి ఉన్నారుట .
గురువుగారు శ్రీరామచంద్రుని ఆవాహన చేసి , తరువాత సీతమ్మను ఆవాహన చేయబోయి ఆగిపోయారట .
తల్లి రానని చెప్పిందిగా . ఏ మొహంతో పిలవగలను ? అని పాత జ్ఞాపకాలతో అశ్రుధారలు ప్రవహిస్తూంటే అలాగే చాలా సేపు ఏడుస్తూ ఉండిపోయారట .
చివరకి అతి కష్టం మీద సీతాం ఆవాహయామి అని అనగలిగేరట .
వెంటనే వచ్చి తల్లి అక్కడ కూర్చున్నదట .
ఆయన సంతోషానికి హద్దులు లేవు .
గద్గద స్వరం తో 'రానన్నావు కదా తల్లీ . ఈ దాసుని మీద అంత దయా?' అని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారట .
ఏం చెయ్యనురా ! శ్రీ రాములవారిని పిలిచావు ముందు . వారొచ్చి మాట్లాడకుండా కూర్చున్నారు నీ యెదుట .
నేను రాకేం చెయ్యను ? అన్నదట .
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు చెప్పినది
-----------------------
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది... అందరికీ మంత్రోపదేశం పొందాలని కుతూహలం. కానీ అది పొందిన తర్వాత జపం చేసే ఓపిక గానీ, ఆ నియమాలు పాటించాలన్న తపన గానీ చాలామందికి ఉండదు. అప్పుడు ఆ మంత్రదేవతకు ఆగ్రహం వస్తుంది. మీకు ఉపదేశం ఇచ్చిన పాపానికి ఆ గురువు కష్టాలపాలవుతారు. కనుక ఉపదేశం పొందాలనుకునే ముందు అన్నిటికి సిద్ధపడే తీసుకోవాలి.
కరోనా వచ్చాక మనం పాటిస్తున్న మన ఆచారాలు - సంప్రదాయాలు, ఇవన్నీ ఒకప్పుడు మానం పాటించినవే, కొందరు ఇప్పటికీ పాటిస్తున్నారు.
1) బయటకు వెళ్ళిరాగానే కాళ్ళు, చేతులు కడుక్కుని ఇంట్లోకి రావడం
2) కొన్ని సందర్భాల్లో బయటకు వెళ్ళినవారు నేరుగా ఇంట్లోకి రాకుండా స్నానం చేసి, ఆ బట్టలు అక్కడే ఉతికి, ఆరేసుకుని, పొడి బట్టలు కట్టుకుని ఇంట్లోకి రావడం
3) రోజుకు రెండుసార్లు స్నానం చేయడం
4) శుభ్రంగా ఉతికిన బట్టలను కట్టుకోవడం
5) ఎదుటి వాళ్ళని పలకరించడానికి షేక్ హ్యాండ్ బదులు నమస్కారం చేయడం
6) ఇంట్లో శుభ్రంగా వండిన ఆహారాన్నే భుజించడం
7) కుటుంబంతో కలిసి భోజనం చేయడం
8) ప్రతి రోజూ ఇంటిని ఊడ్చి, తుడవడం
9) ఒకరి ఎంగిలి ఒకరు తినకపోవడం, ఎక్కడా ఎంగిలి కలపకపోవడం
10) ఒకరి వస్తువులు వెరొకరు వాడకపోవడం
11) లోకమంతా బాగుండాలని దేవుడిని ప్రార్ధించడం
12) ఈ వైరస్ భయంతో తోలు వస్తువుల వాడకపోవటం.
ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి....
మన పురాణాల్లో మనకు 'వైరి భక్తి' అనే అంశం కనిపిస్తుంది. అంటే దేవుడిని ద్వేషించడం కూడా ఒక రకమైన భక్తియే అంటాయి మన శాస్త్రాలు. ఉదాహరణకు రాక్షసులు చూడండి - ఎల్లవేళలా భగవంతుడిని ద్వేషిస్తూనే ఉన్నారు. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషంతో తన మనస్సుని నింపుకుని చివరకు విష్ణుదర్శనం పొందాడు. అక్కడ ముఖ్యమైన విషయం దేని గురించి ధ్యానిస్తున్నాడని. వాళ్ళ ద్వేషం ఎంతవరకు వెళ్ళిందంటే తింటున్నా, నిద్రపోతున్నా, ఏ పని చేస్తున్నా, భగవంతుని మీద ద్వేషంతో ఆయనే గుర్తుకు వచ్చేవాడు. చివరకు ఆయన చేతిలో హతమైనా, ఆ నిరంతర ధ్యానమే వారికి ఆయన దర్శన భాగ్యాన్నిచ్చింది.
ఇప్పుడు మన సంగతి చూద్దాము. ఈ ప్రపంచంలో అత్యంత పాజిటివ్ ఆలోచన/ శక్తి ఏది అంటే భగవంతుడు. కానీ ఈ రోగం వచ్చిన తర్వాత నుంచి గమనించండి. ఏమవుతుందో అనే భయము, టి.వి.ల్లో పదే పదే కరోనా, కరోనా అంటూ వార్తలు చూపించడంతో మన మనస్సంతా ఆ కరోనా మీదనే పడింది. అదేమీ పాజిటివ్ విషయం కాదు, పైగా ఒక విషక్రిమి. దాని గురించి నిత్యం ఆలోచించడం అవసరమా? అది చాలా నెగటివ్ శక్తిని మనలో కలిగిస్తుంది. రోగం రాకుండదంటే మనలో రోగనిరోధక శక్తి ఉండాలి, శారీరికంగా దృఢంగా ఉండాలి. కానీ పదేపదే ఆ మహమ్మారి గురించి, లేదా ఏదైనా ఇలాంటి నెగటివ్ భావనలు చేస్తూ ఉంటే, భయపడుతూ ఉంటే మానసికంగా మనం బలహీనపడతాము. మనస్సు బలంగా ఉంటే శరీరం బలహీనంగా ఉన్న, ఎలాంటి విపత్తు వచ్చిన ఎదురుకోగలము. కానీ శరీరంలో బలముండి, మనస్సు బలహీనమైతే, అప్పుడు ఆ ప్రభావం శరీరం మీద ఖచ్ఛితంగా పడుతుంది. శరీరం బలహీనమై రోగాన్ని ఆహ్వానిస్తుంది. అది చాలా ప్రమాదకరము. అంటే వద్దు వద్దు అంటూ ఆ వైరస్ ను శరీరంలోకి రమ్మని పిలుస్తారా?
మన దేశంలో కరోనా ప్రభావం పెద్దగా ఉండదు. దానికి ముఖ్యమైన కారణాలు కొన్ని చెబుతాను... ఒకటి మన ఆహారపద్ధతులు. మన పూర్వీకుల నుంచి మనకు కొన్ని ఆహారపద్ధతులు వస్తున్నాయి. ఇప్పటికీ మనలో చాలామంది వాటినే అనుసరిస్తున్నారు. అందుకే మనకు రోగనిరోధక శక్తి ఎక్కువ. రెండవది, మన దేశంలో అనాదిగా కులదేవతలు (ఇలవేల్పు లేదా ఇంటిదేవుడు అని కూడ అంటారు) మరియు గ్రామదేవతల ఆరాధన జరుగుతూనే ఉంది. పైగా ఇది ఋషిభూమి. కనుక మన దేశాన్ని, మనల్ని వాళ్ళే రక్షిస్తారు. అందులో ఏ సందేహం లేదు.
కనుక మీ మనస్సును ఆ కరోనా మహమ్మారి మీద పెట్టకుండా, దైవం మీద నిలపండి. టి.వి.లు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలకు తక్కువ సమయం కేటాయించండి. భయం కలిగించేవి చూడవద్దు. సద్భావనలు చేయండి. లోకాసమస్తా సుఖినోభవంతు అని పదే పదే మనస్ఫూర్తిగా మననం చేయండి. మన కోసం కాక అందరికోసం ప్రార్ధన చేయడం హిందూధర్మం మనకు నేర్పింది. ఇప్పుడు అదే చేద్దాము. మన సంస్కృతియే మనకూ, దేశానికి, ప్రపంచానికి శ్రీ రామ రక్ష. నన్ను నమ్మండి... మనకు ఏమీ కాదు.
ఓం నమో నారాయణాయ
ఇంతకి రాక్షసులంటే ఎవరు?
ఒకప్పుడు రాక్షసులంటే ప్రత్యేకంగా కొమ్ములు, కోరలతో భయంకరంగా ఉండేవారని మనకు తెలుసు. వాళ్ళను చూస్తేనే జనం హడలి చచ్చేవాళ్ళు. ఇప్పుడు యుగాలు మారాయి, కనుక వారు కూడా రూపాంతరం చెందారు. అసలు రాక్షసుల లక్షణాలు ఎలా ఉంటాయో, ఈ కాలంలో ఆ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో పరిశీలిద్దాము. ఇవన్నీ మన శ్రీ మద్భాగవతం మొదలైన పురాణాల్లో చెప్పబడిన విషయాలు.
1) సాధారణ జనులు త్రాగే నీటి వనరులైన నదులను, చెఱువులను, కాలువలను విషతుల్యం చేసి, అవి వినియోగానికి పనిరాకుండా చేసేవారు. విషతుల్యమైన వనరులను ఉపయోగించిన అమాయకులు మరణించేవారు. ఆ విధంగా హింసించి ఆనందించేవారు.
2) ఆహార పంటలను ధ్వంసం చేసేవారు. ఆహారన్ని విషతుల్యం చేసేవారు. భూమి వ్యవవసాయానికి పనిరాకుండా చేసేవారు.
3) గాలిలోకి విషవాయువులను పంపించి, జనుల మృతికి కారణమయ్యేవారు.
4) ప్రకృతిని కలుషితం చేసేవారు. అడవులను నరికి, ఉద్యానవనాలను నాశనం చేసి నిప్పు పెట్టేవారు. హిరణ్యకశిపుడు ఈ విధంగానే చేశాడని శ్రీ మద్భాగవతం చెబుతోంది.
5) జీవహింస చేసేవారు. లక్షల సంఖ్యలో గోవులు మరియు సకల జీవరాశి యొక్క మృతికి కారణమయ్యేవారు.
6) అవసరమైన దానికంటే అధిక సంఖ్యలో వనరులను వినియోగించి, భూమిని పీల్చి, పిప్పి చేసి, గుల్ల చేసేవారు. హిరణ్యాక్షుడు చేసిందాంట్లో ఇది కూడా ఉంది.
7) జనులను మానసికంగా, శారీరింగా హింసించేవారు, భయభ్రాంతులకు గురి చేసేవారు. రావణుడికి ఆ పేరు రావడానికి కారణం ఇదే. అనసవరంగా జనాల్లో భయం కలిగించేవాడు.
8) యజ్ఞయాగాదులను విమర్శించేవాళ్ళు, వాటి మధ్యలోనే ఆపివేయడానికి విఘ్నాలు కలిగించేవారు, వాటిని భగ్నం చేసేవారు. సంస్కృతీ సంప్రదాయాలను నాశనం చేసేవారు. మంచి పనులు చెద్దామనుకున్నవారికి ఆటంకాలు కలిగించేవారు.
9) తమ ఆలోచనతో అంగీకరించనివారిని హింసించి చంపేవారు. అందరూ తమవలె ఆలోచించాలని, తమనే దైవంగా పూజించాలని బలవంతపెట్టేవారు.
10) కొందరు రాక్షసులు దేవుడిని నమ్మేవారు, కొందరు దేవుడిని నమ్మేవారు కాదు, కొందరేమో తామే దేవుడని ప్రచారం చేసుకునేవారు.
ఇప్పుడు పైన చెప్పిన లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయో చూడండి. బాంబులు వేసి జనాల మృతికి కారణమయ్యేవాడు ఉగ్రవాది అయితే, భూసారం క్షీణించడానికి, నదులు కలుషితమై జనులు అనారోగ్యం పాలవడానికి కారకులయ్యేవారు ఉగ్రవాదులు కారా? తేడా ఒకటే, ఒకరు హింసతో అధికారం చెలాయించాలని చూస్తుంటే, వెరొకరు వ్యాపారం పేరుతో అధికారం చెలాయిస్తూ విధ్వంసం చేస్తున్నారు, మిగితావారు నిర్లక్ష్యంతో చేస్తున్నారు. ప్రపంచ జనాభాకు రెండింతల ఆహారం భూమి ద్వారా లభిస్తుంటే, ఆ మొత్తాన్ని జంతువులకు పెట్టి, ఆ జంతువులను తింటున్నారు మనుష్యులు, వెరొకరి ఆకలి చావుకు కారణమవుతున్నారు. భూమిని పిండి మొత్తం వనరులు ఒక తరంలోనే ఖాళీ చేసేస్తున్నారు.
ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చూడండి. మానవుల కార్యకలాపాలన్నీ స్థంభించాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా ప్రకృతి ఊపిరి పీల్చుకుంటోంది. ప్రకృతి తిరిగి తన పూర్వస్థితికి వస్తోంది. జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, కాలుష్యం తగ్గింది. మనుషులంతా ఈ విపత్తు తొలగించమని దేవుడిని వేడుకుంటుంటే, ప్రకృతి ఇదే బాగుందని ఆనందిస్తోంది. ఇప్పుడు దేవుడు ఎవరి ప్రార్ధన వినాలి ? (ఈ విపత్తు తొలగిపోతుంది, అయినప్పటికీ ఒకసారి ఆలోచన చేయండి) దీనిబట్టి ఇన్నాళ్ళు ప్రకృతిని హింసించిన రాక్షసులు ఎవరో చెప్పకనే చెబుతోంది ప్రకృతి. ఆత్మవిమర్శ (Self-introspection) చేసుకుని ప్రకృతి హిత జీవనానికి బాటలు వేయడానికి ఇదే సరైన సమయం. బహుసా! మనకు భగవంతుడు చెబుతున్నది కూడా అదేనేమో ! మనం వింటున్నామా ?! మనం మారతామా ? ప్రభుత్వాలు ప్రకృతి హితమైన అభివృద్ధి దిశగా బాటలు వేస్తాయా ? ఇప్పుడున్న విధానాలు మారుతాయా ? సామాన్యులు సైతం ఈ దిశగా తమ జీవితాలను రూపుదిద్దుకుంటారా?
మనం దైవీ లక్షణాలను ప్రదర్శించనవసరంలేదు. రాక్షసగుణాలు వదిలి, ,మనుష్యులుగా బ్రతకడం నేర్చుకుంటే చాలు. అందుకే వేదం 'మనుర్భవ' - ముందు మనుష్యులుగా మారండి అని సందేశం ఇచ్చింది. కనీసం ఇప్పుడైనా వింటామా ?
Physical cleanliness
You are children and you should not suffer from itches etc. Itches will cause a lot of trouble. You cannot site, eat, play, study etc. Such skin diseases are caused by accumulation of dirt on the body. Therefore the body should be kept clean. You have to take regular bath using soap or any other good powder. It is good if bath is taken twice in a day, in the morning and evening. If you get used to cold water bath even when young, you will never be affected by cold, cough etc. A cold bath will be invigorating. It helps the mind to be peaceful and happy. We will feel active when doing work.
You have to be clean in all respects. Next to cleanliness of body is cleanliness of dress. If the dress you wear is dirty, taking bath will not help. Dirt in the clothes you wear will also cause diseases. If clothes are given for wash, they will be washed white and bright, but better than that is for you to wash your clothes yourself. Washing your clothes will be an exercise for you. If you wash your own clothes and make them white and bright, you will have a feeling of satisfaction and pride. You parents will also be happy. Expenditure on account of getting the clothes washed will be avoided.
Nitya Parayana Slokam
Jale Rakshatu varahaha
sthale rakshatu vamanaha
Atavyaam naarasimhasya
sarvataha paatu keshavaha
“A man is seated on top of a tree in the midst of a burning forest. He sees all living beings perish. But he doesn’t realize that the same fate is soon to overtake him also. That man is fool.”
― Lord Mahāvīra
Nitya parayana Slokam
Vanamali gadi sharangi shankhi chakri cha nandaki
Shriman narayano vishnur-vasudevo-abhirakshatu
ఇప్పుడు మన రోజువారీ అవసరాల్లో కొన్ని అలవాట్ల కారణంగా ఎంత నీరు వినియోగిస్తున్నామో చూడండి.
బీరు ఉత్పత్తికి (అనగా దానికి వాడే ముడిసరకు పండించడం, తరలించడ, దగ్గరి నుంచి త్రాగేవారిని చేరేవరకు), సగటున 1 లీటర్ బీరు తయారు కావలంటే 155 లీటర్ల మంచి నీరు అవసరం.
వైన్ - 750 మిల్లీలీటర్ల వైన్ తయారికీ 720 లీటర్ల మంచినీరు, 1 లీటరు వైన్ తయారికి 960 లీటర్ల మంచి నీరు అవసరం. 125 మిల్లీలీటర్ల వైన్‌లో 120 లీటర్ల మంచి నీరు ఉంటుంది.
ప్రపంచంలో చాలామంది త్రాగే పానీయం కాఫీ. ఒక్కొక్క వ్యక్తి ప్రతి రోజూ అనేక కప్పుల కాఫీ త్రాగుతుంటాడు. చాలామందికి కాఫీ అనేది ఒక వ్యసనం కూడా. ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీ తయారికి కనీసం 133 లీటర్ల నీరు అవసరం. 454 గ్రాముల వేయించిన కాఫీ గింజలకు 9547 లీటర్ల నీరు అవసరం. అంటే 1 కాఫీ చుక్క తయారవ్వాలంటే కనీసం 1,100+ నీటి బిందువుల వినియోగమవుతాయి. (1)
వేసవి వస్తే శీతల పానీయాలు త్రాగుతారు చాలామంది. అవి ఏదో ఆరోగ్యానికి చాలామంచివి అనుకుంటారు. అవిగాక శుభకార్యలు, సభల్లో వచ్చిన వాళ్ళందరికీ విరివిగా వీటిని పంచుతుంటారు. మీకు తెలుసా ?! 1/2 లీటరు (అర లీటరు) కొకొ-కోలా తయారికి సరాసరి 15 లీటర్ల నీరు వినియోగిస్తారు. కేవలం కొకొ-కోలానే కాదు, మీరు త్రాగే ప్రతీ సాఫ్ట్ డ్రింక్ పరిస్థితి అంతే. ఒక పక్క జనం నీరు లేక అల్లాడుతున్నారు, వీళ్ళేమో భూగర్భ జలాలను తోడేస్తారు. దేశంలో ఇలాంటి శీతల పానీయాల తయారి ప్లాంట్లు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ప్లాంటు సగటున రోజుకు 15 లక్షల లీటర్ల భూగర్భ జలాలను తోడేస్తుంది. ఎక్కడ ఈ ప్లాంట్లు ఉంటాయో, ఆ చుట్టు ప్రక్కల ఊర్లలో భూగర్భజలాలు అడుగంటుతాయి. ఫలితంగా పంట పండించడానికి నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు.దీని మీద వందనాశివ గారు పోరాటం చేశారు.
అంటే మీరు రుచి కోసమో, దాహర్తిని తీర్చుకోవడం కోసమో ఒక లీటరు సాఫ్ట్ డ్రింక్ త్రాగితే, 30 లీటర్ల నీటిని వృధా చేస్తున్నారన్నమాట. రైతుల గురించి నిజంగా ఆలోచించేవాళ్ళైతే ముందు శీతలపానీయాలను, మద్యాన్ని త్రాగకండి. (2) అప్పుడు నీటి లభ్యత అధికమవుతుంది.
Source:
1) https://recyclenation.com/2010/10/blog-action-day-recycled-water-footprint-beverages/
2) https://mondediplo.com/2005/03/14india
మోదీ గారి ప్రసంగంలో ఆదివారం రాత్రి 9 గంటలకు, ఇంట్లో ఉన్న విద్యుత్ దీపాలు ఆర్పి, తొమ్మిది నిమిషాల పాటు దీపం, కొవొత్తి, లేదా టార్చ్ లైట్ వెలిగించమని చెప్పారు. దానికి ఏవో ఏవో వ్యాఖ్యానాలు ఫేస్‌బుక్ మరియు వాట్సాప్లో వస్తున్నాయి.
మోదీ గారీ ప్రసంగంలో వారు ఒక విషయం స్పష్టంగా చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా పేదలు, కూలీలు ఎంతో గానో నష్టపోయారు. ఈ కర్ఫ్యు ముగిసిన తర్వాత వారి గురించి తప్పక ఏదో ఒకటి చెద్దామన్నారు. అలాగే లాక్ డౌన్ లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఉన్న కారణంగా చాలామందికి ఒంటరిగా ఉన్నామనే భావన కలుగుతుంది. దేశమంతా ఈ మహమ్మారిపై కలిసికట్టుగా పోరాటం చేస్తోంది. ఈ పోరాటంలో ఏ ఒక్క భారతీయుడు ఒంటరి కాదు, ఇది సమిష్టి పోరాటం. అందరూ ఆ భావనతో ఉంటేనే లాక్ డౌన్ విజయవంతమవుతుంది. అందుకే దీపం వెలిగించమన్నారు. విద్యుత్ దీపాలన్నీ ఆర్పివేసినప్పుడు అంధకారం అలుముకుంటుంది. అప్పుడు మనం వెలిగించే చిన్న దీపం ఎంతో వెలుతురుని ఇస్తుంది. అలానే మన చుట్టూ ఉన్నవారంతా దీపాలు వెలిగించడం చేత పరిసరాలన్నీ కాంతివంతమవుతాయి, అంధకారం తొలగిపోతుంది. అలానే అందరూ కలిసి సమిష్టిగా పని చేసినప్పుడే కరోనా మహమ్మారి కనుమరుగవుతుంది. ఇప్పుడు నేను ఒంటరి కాదు, ఈ కరోనా చీకటిని తొలగించడానికి యావత్ దేశమంతా లాక్ డౌన్ పాటిస్తోందని మనకు అర్ధమవ్వడానికి ఈ కార్యక్రమం.
మొన్న చప్పట్లు కొట్టిమని చెప్పినప్పుడు చాలామంది ఎవరు కొడతారులే అనుకున్నారు. కానీ బయటకు వచ్చి చూస్తే, దాదాపు అందరూ పాల్గొన్నారు. అలా అందరితో కలిసి చప్పట్లు కొట్టినప్పుడు మనలో చాలామంది భావోద్వేగానికి లోనయ్యారు. నేను భారతీయుడిని, నా దేశం భారతదేశం అనుకునే ప్రతి ఒక్కరీ కళ్ళూ చెమర్చాయి. మనమంతా ఒక్కటే, దేశానికి కష్టం వచ్చినప్పుడు, అన్నిటికీ అతీతంగా ఏకమవుతామన్న భావన మనలో కలిగింది కదా. ఇప్పుడు కూడా అలాంటి సమైఖ్య భావన కలిగించడమే దీని లక్ష్యం.
నేను ఒంటరిగా పోరాటం చేయడం లేదు, మా దేశమంతా సమైఖ్యంగా ఈ కరోనా మహమ్మారిని అంతమొందించడానికి పోరాటం చేస్తోదన భావన అందరికీ కలిగించడం, కులమతప్రాంతాలకు అతీతంగా అందరినీ ఈ విషయంలో సంఘటితం చేయడమే దీని ఉద్దేశం.
మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీగారి మాటల్లో ఉన్న భావన అదే. కావాలంటే మళ్ళీ ఆ ప్రసంగం వినండి. అర్ధం చేసుకుంటే మంచిది. ఇలాంటి సమయంలో జనంలో పాజిటివ్ భావనలు కలిగించాలి గానీ, మొబైల్ డేటా ఉందని ఇష్టం వచ్చినట్లు ప్రతిదాన్నీ విమర్శించకూడదు, జనంలో అసహనం పెంచకూడదు.
కనుక మర్చిపోకుండా ఆదివారం రాత్రి 9 గంటలకు తొమ్మిది నిమిషాల పాటి దీపం వెలిగించి, సమైఖ్య భావనను, పాజిటివ్ భావనను కలిగిద్దాము.
జై హింద్
వందేమాతరం
Why do you want to open the outside door when there is an inside door?
- Jnana guru Siva Yogaswami